Indian mens hockey team
-
చేజేతులా ఓడిన భారత్
న్యూఢిల్లీ: అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు మూల్యం చెల్లించుకుంది. ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ జట్టుపై విజయం సాధించడంలో టీమిండియా విఫలమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 0–2 గోల్స్ తేడాతో జర్మనీ జట్టు చేతిలో ఓడిపోయింది. జర్మనీ తరఫున మెర్ట్జెన్స్ (4వ నిమిషంలో), విండ్‌ఫెడర్ (30వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. సిరీస్‌లో చివరిదైన రెండో మ్యాచ్ నేడు జరుగుతుంది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఏకంగా ఏడు పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ కూడా వచ్చాయి. కానీ వీటిని భారత జట్టు గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. మరోవైపు జర్మనీ జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్లు రాగా, ఒక దానిని గోల్‌గా మలిచింది. -
భారత్ బదులు తీర్చుకునేనా!
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్లో జర్మనీ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం భారత పురుషుల హాకీ జట్టుకు లభించింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో నేడు, రేపు జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పదేళ్ల తర్వాత స్థానిక మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుండటం విశేషం. చివరిసారి 2014లో వరల్డ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు ధ్యాన్‌చంద్ స్టేడియం వేదికగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్లో భారత జట్టు 2–3తో జర్మనీ చేతిలో ఓడిపోయి ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జర్మనీ జట్టు రెండో స్థానంలో, భారత జట్టు ఐదో స్థానంలో ఉన్నాయి. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత్ సూపర్ ఫామ్‌లో ఉంది. కెపె్టన్, డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ రాణిస్తే భారత జట్టు పైచేయి సాధించే అవకాశముంది. భారత్, జర్మనీ జట్లు ముఖాముఖిగా ఇప్పటి వరకు 107 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 54 మ్యాచ్‌ల్లో జర్మనీ జట్టు గెలుపొందగా... 26 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు విజయం దక్కింది. మరో 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
భారత జట్టు ప్రకటన.. చైనాతో తొలి మ్యాచ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు మరో టోర్నీకి సిద్ధమైంది. సెప్టెంబరు 8 నుంచి 17 వరకు చైనాలో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. వివేక్ సాగర్ ప్రసాద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.కృషన్ బహదూర్ పాఠక్‌కు అవకాశంఇక దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో... చాలా కాలం నుంచి భారత జట్టుకు స్టాండ్‌బై గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్న కృషన్ బహదూర్ పాఠక్ ఇప్పుడు ప్రధాన గోల్‌కీపర్‌గా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మరో గోల్‌కీపర్ సూరజ్ కర్కేరా రిజర్వ్‌గా ఉంటాడు. 2018 నుంచి సీనియర్ జట్టులో గోల్‌కీపర్‌గా ఉన్న కృషన్ ఇప్పటి వరకు 125 మ్యాచ్‌లు ఆడాడు.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్‌కాగా 2016లో జూనియర్ ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత జట్టుకు గోల్‌కీపర్‌గా ఉన్న కృషన్... రెండుసార్లు ఆసియా క్రీడల్లో, రెండుసార్లు ప్రపంచకప్‌లో, రెండుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. ఇక డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ పోటీపడనుండగా... దక్షిణ కొరియా, మలేసియా, పాకిస్తాన్, జపాన్, చైనా జట్లు కూడా టైటిల్ కోసం తలపడతాయి.ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్న హార్దిక్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, షంషేర్ సింగ్, గుర్జంత్ సింగ్‌లకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నుంచి విశ్రాంతి ఇచ్చారు. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబరు 8న చైనాతో ఆడుతుంది. ఆ తర్వాత 9న జపాన్‌తో... 11న మలేసియాతో... 12న దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఒకరోజు విశ్రాంతి తర్వాత సెపె్టంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్స్ 16న, ఫైనల్ 17న నిర్వహిస్తారు.భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వివేక్ సాగర్ ప్రసాద్ (కెప్టెన్), జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, రాజ్‌కుమార్ పాల్, నీలకంఠ శర్మ, మన్‌ప్రీత్ సింగ్, మొహమ్మద్ రాహీల్ మౌసీన్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, అరిజిత్ సింగ్, ఉత్తమ్‌సింగ్, గుర్జోత్ సింగ్. -
ఇక సౌకర్యాలు లేవని చెబితే కుదరదు
ఒలింపిక్స్ చరిత్రలో ఘనమైన రికార్డు ఉన్న భారత హాకీ జట్టు ‘పారిస్’ క్రీడల్లోనూ దాన్ని కొనసాగించింది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో తలపడి కాంస్యం పతకం సాధించడం ఆనందంగా ఉంది. సహచరుల నుంచి ఇంతకు మించిన వీడ్కోలు బహుమతి అడగలేను. రెండు దశాబ్దాలకు పైగా జట్టుతో ఉన్నా. ఇప్పుడిక యువతరానికి పాఠాలు చెబుతా. వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడం ద్వారా యువ ఆటగాళ్లలో స్థయిర్యం నింపే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగిందనుకుంటున్నా. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో యువ షూటర్ మనూ భాకర్‌తో కలిసి త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించనున్నా. మనూ నాకంటే 14 ఏళ్లు చిన్నది. అయినా ఆమె విశ్వక్రీడల్లో అద్భుతాలు చేసింది. ప్రతి అథ్లెట్ ఏకైక లక్ష్యం దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే. అది మనూలో సమృద్ధిగా ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్‌తో నా విశ్వక్రీడల ప్రయాణం ప్రారంభమైంది. ఈ పుష్కర కాలంలో క్రీడలకు ప్రోత్సాహం ఎలా మారిందో నేను ప్రత్యక్షంగా చూశాను. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సరైన సౌకర్యాలు లేవని సాకులు చెప్పే అవకాశమే లేదు. హాకీలో సాధించిన పతకం కోట్లాది మంది భారతీయుల సమష్టితత్వానికి నిదర్శనమని ప్రధాని అన్నప్పుడు... గర్వంతో నరాలు ఉప్పొంగాయి. పారిస్ క్రీడల్లో బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మా జట్టు కలిసికట్టుగా ఆడిన తీరు అద్భుతం. దాదాపు 75 శాతం సమయం కేవలం 10 మందితోనే ఆడాం. ఆ పట్టుదలే ఇక్కడి వరకు చేర్చింది. మన జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఇప్పుడే వాళ్ల ప్రయాణాన్ని ప్రారంభించగా... మిగిలిన 11 మంది టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నారు.ప్రపంచంలోనే మేటి జట్లతో పోటీపడేందుకు బెంగళూరులోనూ ‘సాయ్’ శిక్షణ కేంద్రం మాకు అన్ని విధాలుగా సçహాయపడింది. గత పదిహేనేళ్లుగా ఈ కేంద్రమే నా ఇల్లు. కుటుంబ సభ్యులతో కన్నా అక్కడే ఎక్కువ గడిపా. అంతర్జాతీయ స్థాయి జిమ్, పారిస్‌లో మాదిరి సరికొత్త టర్ఫ్ ఇలా... ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఈ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర కూడా మరవలేనిది. కోచ్ క్రెయిగ్ ఫల్టన్ జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ఆటగాళ్లందరికి ఒక్క తాటిపై నడిపించారు. ‘ఖేలో ఇండియా’ వ్యవస్థ భవిష్యత్తును మరింత మెరుగు పరుస్తుందని ఆశిస్తున్నా. -పీఆర్ శ్రీజేశ్ -
Paris Olympics: బాధ్యత పెంచిన విజయం
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత పురుషుల హాకీ జట్టుకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనున్న గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్‌తో పాటు కొందరు ప్లేయర్లు పారిస్‌లోనే ఉండిపోగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్ సహా పలువురు క్రీడాకారులు శనివారం స్వదేశానికి చేరుకున్నారు. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హాకీ అభిమానులతో కిక్కిరిసిపోయింది.‘యావత్ దేశం మా విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ భావన అద్భుతంగా ఉంది. ఒలింపిక్స్ సమయంలో మాకు అభిమానుల నుంచి విశేష మద్దతు లభించింది. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. అభిమానులు చూపుతున్న ప్రేమాభిమానాలు మా బాధ్యతను మరింత పెంచాయి’అని భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మిడ్‌ఫీల్డర్ అమిత్ రోహిదాస్ ‘రెడ్ కార్డ్’కు గురై మైదానాన్ని వీడాల్సి రాగా.. మిగిలిన 10 మందితోనే పోరాడిన భారత జట్టు అద్వితీయ ప్రదర్శనతో సెమీస్ చేరింది. దీనిపై వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ స్పందిస్తూ.. ‘ఇది జట్టులోని సభ్యులందరి పరస్పర నమ్మకానికి సంబంధించిన విషయంలో ఒక ప్లేయర్ లేకున్నా మ్యాచ్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. గోల్ పోస్ట్ ముందు పీఆర్ శ్రీజేశ్ అయితే లెక్కకు మిక్కిలిసార్లు మమ్మల్ని కాపాడాడు’అని వివరించాడు. ప్రేరణ పెంచిన విజయం: మాండవీయా పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా భారత జట్టుకు కేంద్ర మంత్రి రూ. 2 కోట్ల 40 లక్షల చెక్‌ను అందజేశారు. ‘దేశానికి అపారమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. మీ విజయం లక్షలాది మంది యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుంది. మీ ఘనతలు చూసి యావత్ దేశం గర్విస్తోంది. ఈ విజయం మీ పట్టుదల, సమష్టి కృషి, తిరుగులేని స్ఫూర్తికి నిదర్శనం’ అని మాండవీయా అన్నారు. మంచుకొండల్లో శిక్షణ ఫలితాన్నిచ్చింది పారిస్ ఒలింపిక్స్ బరిలో దిగడానికి ముందు స్విట్జర్లాండ్‌లోని మంచు కొండల్లో మూడు రోజుల ప్రత్యేక క్యాంప్‌లో పాల్గొనడం తమకెంతో ఉపయోగపడిందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. మంచుకొండల్లో వాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ జట్టు సభ్యుల్లో అనుబంధాన్ని పెంచేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నాడు. ఇక 2011లో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన సమయంలో టీమిండియా సçహాయక బృందంలో కీలక సభ్యుడైన మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ రాక కూడా తమకు కలిసొచ్చిందని హర్మన్ అన్నాడు. ‘ఒకరికి ఒకరు అండగా నిలవడం.. ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందడం. ఇలాంటి చిన్న చిన్న అంశాలే పెద్ద ఫలితాలు తెచ్చాయి.పారిస్ క్రీడల్లో మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి వరకు మేమంతా ఒక జట్టుగా ముందుకు సాగాం. ఇందులో ప్యాడీ ఆప్టన్ పాత్ర కీలకం. అతడి వల్లే స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌కు వెళ్లాం. దాని వల్ల ఆటగాళ్లలో పట్టుదల, పరస్పర విశ్వాసం మరింత పెరిగింది’ అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. -
'దస్' కా దమ్..
ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు మరో అద్భుతాన్ని చూపించింది. టోక్యోలో మూడేళ్ల క్రితం నాటి జోరును పునరావృతం చేస్తూ సెమీఫైనల్‌కు చేరింది. అప్పటిలాగే ఈసారి కూడా ప్రత్యర్థి బ్రిటన్. నాడు నిర్ణీత సమయంలోనే భారత్ విజయం సాధించగా, ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ షూటౌట్‌కు చేరింది. తుది ఫలితం మాత్రమే సేమ్ టు సేమ్. భారత ఆటగాళ్లంతా చురుకైన ఆటతో సత్తా చాటగా, ఎప్పటిలాగే గోల్ కీపర్ శ్రీజేశ్ అసాధారణ గోల్ కీపింగ్ జట్టును గెలిపించింది. మూడు క్వార్టర్ల పాటు ఒక ఆటగాడిని కోల్పోయి పది మందితోనే టీమిండియా కొనసాగినా... పదునైన డిఫెన్స్‌తో మన జట్టు ప్రత్యర్థిని నిలువరించగలిగింది. మరో మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరితే గత ఒలింపిక్స్‌కంటే మెరుగైన ఫలితంతో భారత్ సగర్వంగా నిలుస్తుంది. పారిస్: ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం సాధించే దిశగా భారత పురుషుల హాకీ జట్టు ఆశలు రేపుతోంది. స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన మన జట్టు పారిస్ఒలింపిక్స్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్’లో బ్రిటన్ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా... ‘షూటౌట్’లో భారత్ 4–2తో పైచేయి సాధించింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన పోరులో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో, బ్రిటన్ తరఫున లీ మార్టన్ 27వ నిమిషంలో గోల్స్ సాధించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, రాజ్‌కుమార్ గోల్స్ చేయగా... బ్రిటన్ ఆటగాళ్లలో జేమ్స్ ఆల్బరీ, జాక్ వలాస్ మాత్రమే గోల్స్ కొట్టారు. కానర్ విలియమ్సన్, ఫిలిప్ రాపర్ విఫలమయ్యారు. రాపర్ గోల్‌ను శ్రీజేశ్ అద్భుతంగా నిలువరించిన తర్వాత భారత్ 3–2తో ఆధిక్యంలో నిలవగా... నాలుగో షాట్‌ను రాజ్‌కుమార్ గోల్‌గా మలచడంతో భారత బృందం సంబరం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో చివరిదైన ఐదో షాట్‌ను బ్రిటన్ తీసుకోలేదు. జర్మనీ, అర్జెంటీనా జట్ల మధ్య జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో భారత జట్టు మంగళవారం జరిగే సెమీఫైనల్లో తలపడుతుంది. ఒకవేళ సెమీఫైనల్లో భారత్ ఓడిపోతే గురువారం కాంస్య పతకం కోసం పోటీపడుతుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో భారత్‌కు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఆరంభంలో బ్రిటన్ చాలా దూకుడుగా ఆడుతూ వరుసగా దాడులు చేసింది. తొలి ఐదు నిమిషాల్లోనే ఆ జట్టుకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా, భారత్ వాటిని నిలువరించింది. 11వ నిమిషంలో కూడా బ్రిటన్ జట్టు పెనాల్టీ కార్నర్ ద్వారా చేసిన ప్రయత్నం వృథా అయింది. భారత్ కూడా తొలి క్వార్టర్లో రెండు పెనాల్టీలు సంపాదించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండో క్వార్టర్ కూడా ఇదే తరహాలో సాగింది. అయితే 22వ నిమిషంలో లభించిన పెనాల్టీని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచడంతో ఆధిక్యం దక్కింది. కానీ మరో ఐదు నిమిషాలకే వేగంగా దూసుకొచ్చిన లీ మార్టన్ చేసిన గోల్ ప్రయత్నాన్ని కీపర్ శ్రీజేశ్ ఆపడంలో విఫలం కావడంతో స్కోరు సమమైంది. మూడో క్వార్టర్లో కూడా బ్రిటన్‌కు మూడు పెనాల్టీలు రాగా శ్రీజేశ్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత చివరి వరకు ఇరు జట్లు మరో గోల్ కోసం ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి. బెల్జియంకు షాక్ మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న బెల్జియం జట్టు పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆదివారం జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 3–2తో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత బెల్జియం జట్టును బోల్తా కొట్టించింది. తద్వారా 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత స్పెయిన్ జట్టు మళ్లీ సెమీఫైనల్‌కు చేరుకుంది. మూడో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2–0తో ఆస్ట్రేలియా జట్టును ఓడించి సెమీఫైనల్లో స్పెయిన్‌తో పోరుకు సిద్ధమైంది. రోహిదాస్‌కు రెడ్ కార్డ్ మ్యాచ్‌లో జరిగిన ఒక అనూహ్య ఘటన భారత్‌ను మ్యాచ్ ఆసాంతం ఇబ్బంది పెట్టింది. 17వ నిమిషంలో భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ స్టిక్ బ్రిటన్ ఫార్వర్డ్ విలియమ్ కల్నాన్ తలకు తగిలింది. వీడియో రీప్లే చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపించకపోయినా... మ్యాచ్ రిఫరీ తీవ్ర చర్య తీసుకున్నాడు. రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం భారత్ 10 మందితోనే ఆడింది. మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ డిఫెండర్‌గా బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై భారత జట్టు అప్పీల్ చేసింది. దీనిపై వాదనల అనంతరం రోహిదాస్ తప్పు చేసినట్లు తేలితే అతనిపై ఒక మ్యాచ్ నిషేధం (సెమీఫైనల్) పడే అవకాశం ఉంది. చివరి వరకు స్కోరును సమంగా ఉంచడం తప్ప మాకు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. అందుకే పూర్తిగా డిఫెన్స్‌పైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. పది మందితో ఆడటం మ్యాచ్‌లో కఠిన సమయం. కానీ ఏమీ చేయలేం. ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన కనబర్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఇదే తరహా మానసిక దృఢత్వంతో సెమీస్ ఆడతాం. శ్రీజేశ్ దిగ్గజం. తొలి మ్యాచ్ నుంచి అతను మమ్మల్ని ఆదుకుంటూనే ఉన్నాడు. –హర్మన్‌ప్రీత్ సింగ్, భారత కెప్టెన్ గోల్ కీపర్‌గా నా బాధ్యత నెరవేర్చాను. ఈ రోజు భారత్‌కు కలిసొచ్చింది. షూటౌట్లో షాట్ తీసుకున్న భారత ఆటగాళ్లెవరూ నిరాశపర్చలేదు. వారు స్కోరు చేయడం వల్ల నాలో నమ్మకం మరింత పెరిగింది. మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు ఇది నా ఆఖరి మ్యాచ్ కావచ్చు లేదా బాగా ఆడితే మరో రెండు మ్యాచ్‌లు ఆడవచ్చని అనుకున్నాను. సెమీస్ ప్రత్యర్థి ఎవరైనా ఇలాగే ఆడతాం. –పీఆర్ శ్రీజేశ్, భారత గోల్‌కీపర్7 ఒలింపిక్స్ హాకీలో బ్రిటన్ జట్టుపై భారత్ గెలుపొందడం ఇది ఏడోసారి. రెండు జట్లు విశ్వ క్రీడల్లో ఇప్పటి వరకు పది సార్లు తలపడ్డాయి. మూడు మ్యాచ్‌ల్లో బ్రిటన్ నెగ్గింది. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత జట్టుపై బ్రిటన్ గెలిచింది.52 వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్ చేరడం 52 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత జట్టు 1936 బెర్లిన్ ఒలింపిక్స్ నుంచి 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ వరకు కనీసం సెమీఫైనల్ దశ దాటింది. 1976 మెక్సికో ఒలింపిక్స్‌లో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరడంతోపాటు స్వర్ణ పతకాన్ని సాధించింది. -
‘డ్రా’తో గట్టెక్కిన భారత్
పారిస్: ఓటమి అంచుల్లో నుంచి భారత పురుషుల హాకీ జట్టు గట్టెక్కి ‘డ్రా’తో ఊపిరి పీల్చుకుంది. సోమవారం జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో మాజీ ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 22వ నిమిషంలో లుకాస్ మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 36వ నిమిషంలో తమ ఆధిక్యాన్ని 2–0కు పెంచుకునే అవకాశం అర్జెంటీనాకు వచ్చిం ది. కానీ పెనాల్టీ స్ట్రోక్‌ను మైసో కసెల్లా వృథా చేశాడు. స్కోరును సమం చేసేందుకు భారత్ శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. నిలకడగా పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. కానీ వాటిని లక్ష్యానికి చేర్చడంలో విఫలమైంది. అయితే మరో నిమిషంలో ముగుస్తుందనగా భారత్‌కు 59వ నిమిషంలో తొమ్మిదో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ పెనాల్టీ కార్నర్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి స్కోరును సమం చేయడంతోపాటు భారత జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నేడు జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్ ఆడుతుంది. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్హాకీ పురుషుల పూల్ ‘బి’ మ్యాచ్: భారత్ X ఐర్లాండ్ (సాయంత్రం గం. 4:45 నుంచి). ఆర్చరీ మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: అంకిత భకత్ X వియోలెటా (పోలాండ్) (సాయంత్రం గం. 5:15 నుంచి), భజన్ కౌర్ X సిఫా (ఇండోనేసియా) (సాయంత్రం గం. 5:30 నుంచి). పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: బొమ్మదేవర ధీరజ్ X ఆడమ్ లీ (చెక్ రిపబ్లిక్) (రాత్రి గం. 10:45 నుంచి). బాక్సింగ్ పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్: అమిత్ పంఘాల్ X పాట్రిక్ చిన్యెంబా (జింబాబ్వే) (రాత్రి గం. 7:15 నుంచి). మహిళల 57 కేజీల మ్యాచ్: జైస్మిన్ లంబోరియా X నెస్థీ పెటెసియా (ఫిలిప్పీన్స్) (రాత్రి గం. 9:25 నుంచి). మహిళల 54 కేజీల ప్రిక్వార్టర్స్: ప్రీతి పవార్ X యెని మెర్సెలా (కొలంబియా) (అర్ధరాత్రి గం. 1.20 నుంచి). బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ మ్యాచ్: సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి X అలి్ఫయన్ ఫజర్–మహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) (సాయంత్రం గం. 5:30 నుంచి). మహిళల డబుల్స్ గ్రూప్ మ్యాచ్: అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో X సెట్యానా మాపసా–ఏంజెలా యూ (ఆ్రస్టేలియా) (సాయంత్రం గం. 6:20 నుంచి). షూటింగ్ ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్: పృథీ్వరాజ్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). ట్రాప్ మహిళల క్వాలిఫికేషన్: శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరు: భారత్ (మనూ భాకర్–సరబ్జోత్ సింగ్) ్ఠ దక్షిణ కొరియా (జిన్ ఓయె–లీ వన్హో) (మధ్యాహ్నం గం. 1:00 నుంచి). -
హాకీలో భారత్ శుభారంభం
పారిస్: ఒలింపిక్స్‌లో తమ కాంస్య పతకాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో ‘పారిస్’కు వచ్చిన భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (24వ ని.లో), వివేక్ సాగర్ ప్రసాద్ (34వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (59వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు స్యామ్ లేన్ (8వ ని.లో), సిమోన్ చైల్డ్ (53వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. సాత్విక్ జోడీ బోణీ బ్యాడ్మింటన్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ అలవోక విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’ తొలి రౌండ్లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–17, 21–14తో లుకాస్ కొర్వీ–రోనన్ లాబర్ (ఫ్రాన్స్) ద్వయంపై విజయం సాధించింది. మొదటిసారి ఒలింపిక్స్ ఆడుతున్న యువ షట్లర్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎల్’ తొలి రౌండ్లో 21–8, 22–20తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై గెలిచాడు. హర్మీత్ విజయం టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్ ముందంజ వేశాడు. ప్రాథమిక రౌండ్ మ్యాచ్‌లో హర్మీత్ 11–7, 11–9, 11–5, 11–5తో జైద్ అబో యమన్ (జొర్డాన్)పై విజయం సాధించాడు. తదుపరి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఫెలిక్స్ లెబ్రాన్ (ఫ్రాన్స్)తో హర్మీమత్ తలపడతాడు. రెపిచేజ్‌కు బాలరాజ్ భారత రోవర్ బాలరాజ్ పన్వర్ రెపిచేజ్ దశకు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్ స్కల్స్ హీట్–1లో బాలరాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన రోవర్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. రెపిచేజ్ రౌండ్లో రాణిస్తేనే బాలరాజ్ ముందంజ వేస్తాడు. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్బ్యాడ్మింటన్మహిళల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: పీవీ సింధు ్ఠ ఫాతిమత్ నభా (మాల్దీవులు) మధ్యాహ్నం గం. 12:50 నుంచి. పురుషుల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: హెచ్ఎస్ ప్రణయ్ ్ఠ ఫాబియన్ రోథ్ (జర్మనీ) రాత్రి గం. 9:00 నుంచిషూటింగ్మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: ఇలవేనిల్ వలారివన్ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి). పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: సందీప్ సింగ్, అర్జున్ బబూతా (మధ్యాహ్నం గం. 2:45 నుంచి). మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్: మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి). రోయింగ్పురుషుల సింగిల్ స్కల్స్ (రెపిచేజ్ 2): బలరాజ్ పన్వర్ (మధ్యాహ్నం గం. 1:18 నుంచి).టేబుల్ టెన్నిస్మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): ఆకుల శ్రీజ ్ఠ క్రిస్టియానా క్లెబెర్గ్ (స్వీడన్) (మధ్యాహ్నం గం. 12:15 నుంచి). మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): మనికా బత్రా X అన్నా హర్సే (ఇంగ్లండ్) (మధ్యాహ్నం 12:15 నుంచి). పురుషుల సింగిల్స్ (రెండో రౌండ్): శరత్ కమల్ X డేనీ కోజుల్ (స్లొవేనియా) (మధ్యాహ్నం గం. 3:00 నుంచి).స్విమ్మింగ్పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ (హీట్–2): శ్రీహరి నటరాజ్ (మధ్యాహ్నం గం. 3:16 నుంచి). మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ (హీట్–1): ధీనిధి (మధ్యాహ్నం గం. 3.30 నుంచి). ఆర్చరీ మహిళల రికర్వ్ టీమ్ క్వార్టర్ ఫైనల్: భారత్ (దీపిక కుమారి, అంకిత భకత్, భజన్ కౌర్ )X ఫ్రాన్స్/నెదర్లాండ్స్ (సాయంత్రం గం. 5:45 నుంచి). మహిళల టీమ్ సెమీఫైనల్: (రాత్రి గం. 7:17 నుంచి). మహిళల టీమ్ ఫైనల్: (రాత్రి గం. 8:18 నుంచి). -
హర్మన్‌ప్రీత్ సారథ్యంలో....
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో పర్యటించే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లో 28 మంది ఆటగాళ్లతో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ జాబితా నుంచి రబిచంద్ర సింగ్‌ను తప్పించి మిగతా 27 మందితో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా, హార్దిక్ సింగ్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతారు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టు పెర్త్ వేదికగా ఏప్రిల్ 1, 6, 7, 10, 12, 13వ తేదీల్లో ఆస్ట్రేలియా జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేశ్, కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్‌కీపర్లు); హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్, సంజయ్, సుమిత్, అమీర్ అలీ (డిఫెండర్లు); మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, రాజ్‌కుమార్ పాల్ (మిడ్ ఫీల్డర్లు); ఆకాశ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, గుర్జంత్ సింగ్, అరిజీత్ సింగ్ హుండల్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, మొహమ్మద్ రాహీల్ మౌసీన్, బాబీ సింగ్ ధామి (ఫార్వర్డ్స్). -
హాకీలో పసిడి వెలుగులు
ఏ లక్ష్యంతోనైతే చైనా గడ్డపై భారత పురుషుల హాకీ జట్టు అడుగుపెట్టిందో దానిని దిగ్విజయంగా అందుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత పొందాలన్న లక్ష్యాన్ని టీమిండియా సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ జపాన్ జట్టుతో జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. పోటీల 13వ రోజు భారత్ ఖాతాలో మొత్తం తొమ్మిది పతకాలు చేరాయి. ఆర్చరీలో రజతం, కాంస్యం... రెజ్లింగ్‌లో మూడు కాంస్యాలు... బ్రిడ్జ్, సెపక్తక్రా, బ్యాడ్మింటన్‌లో ఒక్కో కాంస్య పతకం లభించాయి. ప్రస్తుతం భారత్ 95 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. నేడు క్రికెట్, ఆర్చరీ, కబడ్డీ, మహిళల హాకీ, చెస్, రోలర్ స్కేటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పతకాల బరిలో ఉన్నారు. క్రికెట్, ఆర్చరీ, కబడ్డీ, బ్యాడ్మింటన్ ద్వారా భారత్‌కు కచ్చి తంగా ఏడు పతకాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తొలిసారి నేడు అధికారికంగా 100 పతకాల మైలురాయిని దాటనుంది. హాంగ్జౌ: పక్కా ప్రణాళికతో, పూరిస్థాయిలో సన్నద్ధమై ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు తమ లక్ష్యాన్ని సాధించింది. లీగ్ దశ నుంచి ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన టీమిండియా తుది పోరులోనూ ఈ దూకుడు కొనసాగించింది. దాంతో ఆసియా క్రీడల్లో తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జపాన్ జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా ఆసియా క్రీడల విజేత హోదాలో టీమిండియా వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత పొందింది. జపాన్‌తో జరిగిన తుది పోరులో భారత్ తరఫున కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (32వ, 59వ ని.లో) రెండు గోల్స్ చేయగా... అమిత్ రోహిదాస్ (36వ ని.లో), మన్‌ప్రీత్ సింగ్ (25వ ని.లో), అభిషేక్ (48వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు సెరెన్ తనాకా (51వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఓవరాల్‌గా ఆసియా క్రీడల్లో భారత్ నాలుగోసారి స్వర్ణ పతకం సాధించింది. 1966 బ్యాంకాక్, 1998 బ్యాంకాక్, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లోనూ భారత్ బంగారు పతకాలు సొంతం చేసుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో చైనా జట్టుపై గెలిచింది. హర్మన్‌ప్రీత్ 13 గోల్స్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జపాన్ జట్టును ఏమాత్రం తక్కువ చేయకుండా ఆడిన భారత్ అవకాశం వచ్చి నపుడల్లా ప్రత్యర్థి గోల్‌పోస్ట్ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కొన్నిసార్లు గోల్ చేసే అవకాశాలను చేజార్చుకుంది. తొలి 25 నిమిషాల వరకు భారత్‌ను నిలువరించిన జపాన్ ఆ తర్వాత తడబడింది. అభిషేక్ ‘డి’ ఏరియా వద్ద నుంచి కొట్టిన రివర్స్ షాట్‌ను జపాన్ గోల్‌కీపర్ నిలువరించాడు. తిరిగి వచ్చిన బంతిని అక్కడే ఉన్న మన్‌ప్రీత్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు పెంచగా... జపాన్ డీలా పడింది. ‘క్రికెట్’ ఫైనల్లో భారత్ తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న భారత క్రికెట్ జట్టు స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. టి20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ క్రీడల్లో టీమిండియా ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో అఫ్గానిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల లక్ష్యాన్ని 9.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అందుకుంది. భారత్ తరఫున హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ (26 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సాయికిశోర్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు. -
‘పసిడి’కి విజయం దూరంలో...
పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించేందుకు... ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచేందుకు భారత పురుషుల హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 5–3 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై కష్టపడి గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున హార్దిక్ సింగ్ (5వ ని.లో), మన్దీప్ సింగ్ (11వ ని.లో), లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (15వ ని.లో), అమిత్ రోహిదాస్ (24వ ని.లో), అభిషెక్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా తరఫున మన్జె జుంగ్ (17వ, 20వ, 42వ ని.లో) ‘హ్యాట్రిక్’తో మూడు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో జపాన్ 3–2తో చైనాను ఓడించింది. భారత్ 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించగా... 2018 జకార్తా ఏషియాడ్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. -
ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నీని భారత మహిళల జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. ఇంగ్లండ్ జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున హోలీ హంట్ ఏడో నిమిషంలో గోల్ చేయగా... భారత జట్టుకు లాల్రెమ్సియామి 41వ నిమిషంలో గోల్ సాధించి స్కోరును సమం చేసింది. చివరి క్వార్టర్లో రెండు జట్లకు రెండు చొప్పున పెనాల్టీ కార్నర్లు లభించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇదే టోర్నీలో పోటీపడుతున్న భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు చేతిలో 1–2తో ఓడిపోగా... నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. -
చివరి నిమిషంలో భారత్ ఓటమి
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భాగంగా ఒలింపిక్ చాంపియన్ బెల్జియంతో లండన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నెల్సన్ ఒనానా గోల్‌గా మలిచి బెల్జియం జట్టును గెలిపించాడు. అంతకుముందు థిబె స్టాక్‌బ్రోక్స్ (18వ ని.లో) గోల్‌తో బెల్జియం 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 25వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఇక మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకున్న దశలో భారత జట్టు గోల్ సమరి్పంచుకొని మూల్యం చెల్లించుకుంది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో బ్రిటన్‌తో భారత్ తలపడుతుంది. -
భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఫుల్టన్
న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త చీఫ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రెయిగ్ ఫుల్టన్‌ను నియమిస్తున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రకటించారు. 48 ఏళ్ల ఫుల్టన్ దక్షిణాఫ్రికా తరఫున 195 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. క్రీడాకారుడిగా రిటైరయ్యాక కోచింగ్‌వైపు మళ్లిన ఫుల్టన్ 2014 నుంచి 2018 వరకు ఐర్లాండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఫుల్టన్ శిక్షణలో ఐర్లాండ్ వందేళ్ల తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2015లో ఆయన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో ఉత్తమ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఫుల్టన్ బెల్జియం జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా పని చేశాడు. శిక్షణ బృందంలో ఫుల్టన్ సభ్యుడిగా ఉన్నపుడు బెల్జియం 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2018 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించింది. గత జనవరిలో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. టీమిండియా నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో చీఫ్ కోచ్ గ్రాహమ్ రీడ్ తన పదవికి రాజీనామా చేశాడు. -
ఆకాశ్‌దీప్ హ్యాట్రిక్ వృథా.. ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి
IND VS AUS Hockey Test Series: ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత పురుషుల జట్టు ఓటమితో ప్రారంభించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–5 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. భారత స్టార్ ప్లేయర్ ఆకాశ్‌దీప్ సింగ్ (10వ, 27వ, 59వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించినా ఫలితం లేకపోయింది. మరో గోల్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (31వ ని.లో) అందించాడు. ఆ్రస్టేలియా తరఫున లాచ్లాన్ షార్ప్ (5వ ని.లో), నాథన్ ఇఫారౌమ్స్ (21వ ని.లో), టామ్ క్రెయిగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... బ్లేక్ గోవర్స్ (57వ, 60వ ని.లో) రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
ఆఖరి రోజు 5 స్వర్ణాలు, ఓ కాంస్యంపై భారత్ గురి.. సింధు సహా పురుషుల హాకీపై గంపెడాశలు
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడలు చివరిదశకు చేరుకున్నాయి. ఇవాల్టితో (ఆగస్ట్ 8) ఈ మహా సంగ్రామం ముగియనుంది. క్రీడల ఆఖరి రోజు భారత్ మరో ఆరు పతకాలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు (10వ రోజు) భారత్ ఖాతాలో 55 పతకాలు (18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతుంది. 11వ రోజు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ, పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్, పురుషుల హాకీ టీమ్ స్వర్ణం కోసం పోరడనుండగా.. పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో సాథియాన్ జ్ఞానశేఖరన్ కాంస్యం కోసం ఇంగ్లండ్‌కు చెందిన పాల్ డ్రింక్‌హాల్‌తో తలపడనున్నాడు. 11వ రోజు భారత షెడ్యూల్ ఇదే.. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.20) పీవీ సింధు వర్సెస్ మిచెల్ లీ (కెనడా) పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 2.10 ) లక్ష్య సేన్ వర్సెస్ జే యోంగ్ ఎన్జీ (మలేషియా) పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3 గంటలకు) సాత్విక్ సాయి రాజ్-చిరాగ్ శెట్టి వర్సెస్ బెన్ లేన్-సీన్ వెండీ (ఇంగ్లండ్) పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35) సాథియాన్ జ్ఞానశేఖరన్ వర్సెస్ పాల్ డ్రింక్‌హాల్ (ఇంగ్లండ్) పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 4.25) ఆచంట శరత్ కమల్ వర్సెస్ లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) పురుషుల హాకీ గోల్డ్ మెడల్ మ్యాచ్ సాయంత్రం (5 గంటల నుంచి ప్రారంభం) ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇదిలా ఉంటే, ప్రస్తుత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఇవాళ ఆరు పతకాలు (5 స్వర్ణాలు , కాంస్యం) సాధించినా (55+6=61) 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్ రికార్డును (66 పతకాలు (26 గోల్డ్, 20 సిల్వర్, 20 బ్రాంజ్)) బద్దలు కొట్టే అవకాశం లేదు. వీటిలో రెండు స్వర్ణాలు గెలిచినా పతకాల పట్టికలో న్యూజిలాండ్‌ను (48 పతకాలు (19 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలు)) వెనక్కునెట్టి నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (170), ఇంగ్లండ్ (165), కెనడా (87) తొలి మూడు స్థానాల్లో ఉంటాయి. 2010 న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 101 మెడల్స్ సాధించింది. ఇప్పటికీ భారత్‌కు అదే అత్యుత్తమ ప్రదర్శన. చదవండి: బాక్సింగ్‌లో మరో పతకం.. సాగర్ అహ్లావత్‌కు రజతం -
థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గెలుపు.. ఫైనల్‌కు భారత పురుషుల హాకీ జట్టు
భారత పురుషుల హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్ 2022లో తమ జోరును ప్రదర్శిస్తోంది. శనివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 3-2 తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించిన భారత్ స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి క్వార్టర్లో ఇరుజట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్ ఆరంభంలోనే అభిషేక్ గోల్ కొట్టడంతో భారత్ ఖాతాలో తొలి గోల్ నమోదైంది. ఆ తర్వాత మణిదీప్ సింగ్ మరో గోల్ మెరవడంతో భారత్ 2-0తో ఆధిక్యంలో వెళ్లింది. ఇక మూడో క్వార్టర్లో సౌతాఫ్రికా తరపున రెయాన్ జూలిస్ గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. నాలుగో క్వార్టర్ మొదలైన రెండో నిమిషంలోనే డ్రాగ్ ఫ్లికర్ జుగ్రాజ్ గోల్ కొట్టడంతో భారత్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక సౌతాఫ్రికా తరపున రెండో గోల్ నమోదు చేసింది. అయితే చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికి భారత్ ప్రత్యర్థిని గోల్స్ చేయకుండా అడ్డుకొని ఫైనల్లోకి ప్రవేశించింది. చదవండి: CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్ -
సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు.. బాక్సింగ్‌లో అరడజను పతకాలు ఖరారు
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ 18 పతకాలు (5 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు) సాధించగా.. బాక్సింగ్‌లో మరో అరడజను పతకాలు ఖాతాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్ అహ్లవత్, మహిళల 60 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియ, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగల్ ఇవాళ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేశారు. మరోవైపు పురుషుల హాకీలో భారత జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో గెలుపొందింది. స్క్వాష్‌లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. మెన్స్ డబుల్స్‌లో సెంథిల్ కుమార్-అభయ్ సింగ్ జోడీ, మహిళల డబుల్స్‌లో అనాహత్ సింగ్, సునన్య కురువిల్లా జోడీ తొలి రౌండ్లలో విజయాలు సాధించి ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. ఇవే కాకుండా హ్యామర్ త్రో ఈవెంట్లో మంజు బాల ఫైనల్‌కు అర్హత సాధించగా.. స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ 200 మీటర్ల విభాగంలో సెమీస్‌కి అర్హత సాధించింది. బ్యాడ్మింటన్‌లో స్టార్ షట్లర్లు సింధు, శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్‌కు చేరారు. చదవండి: స్వర్ణం లక్ష్యంగా దూసుకుపోతున్న సింధు, శ్రీకాంత్ -
కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు.. ఘనాపై భారీ విజయం సాధించిన టీమిండియా
కామన్వెల్త్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు రికార్డు విజయం నమోదు చేసింది. పూల్-బిలో జరిగిన మ్యాచ్‌లో ఘనాపై ఏకంగా 11-0 తేడాతో భారీ విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన అత్యంత భారీ విజయం ఇదే. 1998 గేమ్స్‌లో ట్రినిడాడ్‌పై భారత్ 10–1తో నెగ్గింది. GOAL! Harmenpreet hits a hatrick, having just scored another goal for India, Harmanpreet Singh is sustaining his title of "Best Drag Flicker."IND 11:0 GHA #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @IndiaSports@sports_odisha @Media_S— Hockey India (@TheHockeyIndia) July 31, 2022 ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో ప్రత్యర్ధిపై విరుచుకుపడ్డాడు. మరో ఆటగాడు జుగ్రాజ్ సింగ్ కూడా రెండు గోల్స్‌తో ఆకట్టుకున్నాడు. భారత్ తర్వాతి మ్యాచ్‌లో పూల్-బి టాపర్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. -
జపాన్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. సూపర్ 4 లీగ్ మ్యాచ్‌లో విజయం
ఆసియా కప్ హాకీలో తొలి సూపర్ 4 లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై 2-1 తేడాతో భారత హాకీ పురుషుల జట్టు విజయం సాధించింది. పూల్ దశలో జపాన్‌పై ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ తరపున మంజీత్, పవన్ రాజ్‌భర్ చెరో గోల్ సాధించారు. ఇక మ్యాచ్ 18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా జపాన్‌కు ఏకైక గోల్ వచ్చింది. జపాన్ మొదట దూకుడుగా ఆడింది. మ్యాచ్ ప్రారంభ నిమిషంలోనే జపాన్ పెనాల్టీ కార్నర్ సాధించింది. అయితే పెనాల్టీ కార్నర్లో జపాన్ ఎటువంటి గోల్ సాధించలేకపోయింది. అనంతరం భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించింది. ఇక భారత్ తన తదుపరి సూపర్ 4 దశ మ్యాచ్‌లో ఆదివారం మలేషియాతో తలపడనుంది. చదవండి: Carlos Alzaraz: ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల కుర్రాడు .. జొకోవిచ్ తర్వాత -
16 గోల్స్‌తో టీమిండియా హాకీ జట్టు కొత్త చరిత్ర.. సూపర్ 4కు అర్హత
ఆసియా కప్ హాకీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత హాకీ పురుషుల జట్టు జూలు విదిల్చింది. పూల్-ఏలో భాగంగా ఇండోనేషియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఏకంగా 16-0 తో రెచ్చిపోయిన భారత పురుషుల జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. టీమిండియా తరపున డిస్పన్ టిర్కీ 4 గోల్స్ కొట్టగా.. సుదేవ్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. సెల్వం, పవన్, వెటరన్ ఆటగాడు ఎస్వీ సునీల్‌లు కీలక సమయాల్లో గోల్స్‌తో మెరిసి భారత్‌కు విజయం అందించారు. ఇక పురుషుల ఆసియా హాకీ కప్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. కాగా ఇండోనేషియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఓపెనింగ్ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 2-5తో ఓడి సూపర్-4 అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇండోనేషియాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో 15 గోల్స్ కొడితే గాని భారత్‌కు సూపర్-4కు అర్హత సాధించే అవకాశం ఉండేది. అదే సమయంలో జపాన్ చేతిలో పాకిస్తాన్ కూడా ఓటమి పాలవ్వాలి. ఇక్కడే మనకు అదృష్టం కలిసొచ్చింది. జపాన్ చేతిలో పాకిస్తాన్ ఓటమి చెందడం.. ఇండోనేషియాతో మ్యాచ్‌లో అనుకున్నదానికంటే ఒక గోల్ ఎక్కువే కొట్టిన టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకొని సూపర్-4లో అడుగుపెట్టింది. కాగా జపాన్ చేతిలో ఓటమితో 2023 హాకీ వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ అర్హత సాధించలేకపోయింది. అదే సమయంలో జపాన్, కొరియా మలేషియాలు 2023 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. మరోవైపు 2023 హాకీ వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుండడంతో ఆతిథ్య హోదాలో భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే అర్హత సాధించింది. చదవండి: Barbora Krejcikova: 'మోస్ట్ అన్‌లక్కీ'.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఔట్ Magnificent game for #MenInBlue as they mark a big win against Indonesia at the Hero Asia Cup 2022 to qualify for the Super 4s of the Hero Asia Cup 2022!😍#IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsINA @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/TJOEixswSk — Hockey India (@TheHockeyIndia) May 26, 2022 -
అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్న భారత హాకీ జట్టు
లుసానే: ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ర్యాంకింగ్స్‌లో భారత్ అత్యుత్తమంగా మూడో ర్యాంక్‌తో ఈ ఏడాదిని ముగించనుంది. గురువారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 2,296.038 పాయింట్లతో భారత్ మూడో ర్యాంక్‌ను కాపాడుకుంది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత పురుషుల జట్టు ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాక భారత్ మూడో ర్యాంక్‌తో ఏడాదిని ముగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మహిళల ర్యాంకింగ్స్‌లో భారత హాకీ జట్టు తొమ్మిదో ర్యాంక్‌తో ఈ ఏడాదిని ముగించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. -
‘స్టిక్’ సీన్ మారింది...
సాక్షి క్రీడా విభాగం: ఎన్నో ఏళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేని బాధ, ఆటతీరుపై జోక్‌లు... అధికారుల చేతకానితనం, జట్టులో అంతర్గత రాజకీయాలు... ప్రతిభకు పాతర, ఆటగాళ్లంటే చులకనభావం... ఇంటా, బయటా భారత హాకీపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల క్రితం చీఫ్ కోచ్‌గా వచ్చిన ఆస్ట్రేలియన్ గ్రాహం రీడ్ ‘భారత జట్టు ఉండాల్సింది ఈ స్థానంలో కాదు. దీన్ని నేను ఎక్కడికో తీసుకెళతాను’ అని తొలి మాటగా అన్నాడు. కొత్తగా రాగానే అందరూ చెప్పే మాటలే ఇవి అని ఎవరూ నమ్మలేదు. పైగా అంతర్గత రాజకీయాలతోపాటు కొత్తగా వచ్చే మార్పులను అంత సులభంగా అంగీకరించలేని తత్వం ఉన్న ఆటగాళ్ల జట్టుతో అతను సాధిస్తాడా అని అంతా తేలిగ్గా తీసుకున్నారు. కానీ రీడ్ ఎక్కడా తగ్గలేదు. కంప్యూటర్ సైన్స్ చదివి ఐటీ రంగంలో సుదీర్ఘ కాలం పని చేయడంతో పాటు ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల్లో పెద్ద హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న రీడ్ హాకీలోనూ తనదైన కొత్త శైలితో ఆటగాళ్లను దారిలో పెట్టాడు. రీడ్ వచ్చే నాటికి జట్టులో అందరూ వ్యక్తిగతంగా పెద్ద ప్లేయర్లే. కానీ తుది ఫలితం వరకు వచ్చేసరికి మాత్రం అంతా అంతంతమాత్రమే. ముందుగా టీమ్‌ను ఒక్క చోటికి చేర్చడంలో అతను సఫలమయ్యాడు. పేరుకు శ్రీజేశ్, మన్‌ప్రీత్, మన్దీప్, బీరేంద్ర లక్డాలాంటి సీనియర్లు ఉన్నా వారెప్పుడూ జట్టుకంటే ఎక్కువ కాదనే భావనను రీడ్ కల్పించాడు. కోచింగ్ క్యాంప్‌లో రీడ్ భార్య స్వచ్ఛందంగా ఆటగాళ్లకు ‘పర్సనాలిటీ డెవలప్మెంట్’ క్లాస్‌లు తీసుకొని వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేసిందంటే రీడ్ ఎంతగా తన మిషన్‌లో మునిగాడో అర్థమవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఎంపికైన వారిలో 12 మందికి ఇదే తొలి ఒలింపిక్స్. ఇలాంటి టీమ్‌ను ఎంచుకోవడంలో కూడా కోచ్ సాహసం కనిపిస్తుంది. ఆటగాళ్లు, అధికారులతో ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా నిక్కచ్చిగా నిజం మాట్లాడే రీడ్ తత్వం అందరికీ మేలు చేసింది. ఫిట్నెస్ సూపర్... సుదీర్ఘ కాలంగా భారత హాకీ వైఫల్యాల్లో ఫిట్‌నెస్‌లేమి కూడా కీలకపాత్ర పోషించింది. ఆటపరంగా ఎంతో బాగున్నా, ఆస్ట్రోటర్ఫ్‌పై కొద్దిసేపు ఆడగానే అలసటకు గురై మనోళ్లు ఇబ్బంది పడుతూ కొనసాగడం గతంలో చాలాసార్లు జరిగింది. దీనిని ఎలాగైనా మార్చాలని రీడ్ సంకల్పించాడు. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లతో పాటు సైంటిఫిక్ అడ్వైజర్ రాబిన్ అర్కెల్ సహకారం తీసుకొని ఆటగాళ్లను ఫిట్‌గా తయారు చేశాడు. యూరోపియన్ జట్లతో పోటీ పడినప్పుడు గతంలో ఎదురైన సమస్యలేవీ లేకుండా మనోళ్లు వారితో సమానంగా మైదానంలో చురుగ్గా కనిపించడం ఆటగాళ్లలో వచ్చిన కీలకమార్పు. తీవ్రమైన వేడి ఉన్న ఒసి స్టేడియంలో 13 రోజుల వ్యవధిలో 8 మ్యాచ్‌లు ఆడగలగడం వారి ఫిట్నెస్ను చూపించింది. రీడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మనోళ్లు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడం బాగా మెరుగైంది. టోక్యోలో భారత్ 8 మ్యాచ్‌లలో 25 గోల్స్ చేసింది. ఇక సబ్స్టిట్యూట్లను సమర్థంగా వాడుకోవడం రీడ్ వ్యూహాల్లో బాగా పని చేసింది. సెమీస్‌లో సిమ్రన్‌జిత్‌కు విశ్రాంతినివ్వగా, కాంస్య పోరులో అతను కొత్త ఉత్సాహంతో వచ్చి రెండు గోల్స్ చేశాడు. అమిత్ రోహిదాస్ ‘ఫస్ట్ రషర్’ రూపంలో శ్రీజేశ్కంటే ముందే పెనాల్టీలను ఆపడానికి ముందుకు దూసుకురావడం మనం గతంలో చూడని మార్పు. భారత ఆటగాళ్లు తమను, తమ కోచ్‌ను, తమ సహచరులను, తమ శిక్షణను నమ్మారు కాబట్టే ఈ ఫలితం వచ్చింది. నాలుగు దశాబ్దాలుగా బరిలోకి దిగిన ప్రతీ భారత జట్టు మట్టిపై ఆడిన తమ ముందు తరంవారి విజయాల భారం మోస్తూ కుప్పకూలిపోయేది. ఈ జట్టు మాత్రం అలా కాలేదు. హాకీ మున్ముందు మరింత వెలిగేందుకు తమ వైపునుంచి తొలి అడుగు వేసింది. -
హ్యాకీ డేస్.. బంగారంలా మెరిసిన భారత కాంస్యం
అప్పట్లో భారత హాకీ జట్టు చాలా అద్భుతంగా ఆడేదట! ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలుచుకుందట! ఒక తరం మొత్తం వింటూ వచ్చిన కథ ఇది. రికార్డు పుస్తకాల్లో, క్విజ్ పోటీల్లో, కొన్నేళ్ల తర్వాత గూగుల్ సెర్చ్‌లో... ఇలా అలనాటి ఘనత గురించి వినడమే తప్ప ఒక్కసారి కూడా మన ఇండియా ఒలింపిక్ పతకం గెలవడం ఈతరం చూడలేదు. ఆఖరిసారిగా 1980లో స్వర్ణం నెగ్గిందని సమాధానం గుర్తించడమే కానీ మన దేశం పతకం సాధించిన రోజు కలిగే ఆనందం ఎలా ఉంటుందో అనుభవిస్తే గానీ అర్థం కాదు. ఇప్పుడు కొత్త తరం క్రీడాభిమానులు కూడా మేం భారత్ ఒలింపిక్ పతకం గెలవడాన్ని చూశామని ఘనంగా చెప్పుకోవచ్చు... జర్మనీని ఓడించి పోడియంపై మన స్టార్లు సగర్వంగా నిలబడిన సమయాన జాతీయ పతాకం ఎగురుతున్న దృశ్యం మా కళ్లల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని సంతోషాన్ని ప్రకటించవచ్చు! ఆ సమయంలో భావోద్వేగానికి గురికాని భారతీయుడు ఎవరు! మైదానంలో ఆడి గెలిచిన మనోళ్లు సంబరాలు చేసుకున్నారు... హాకీతో సంబంధం లేని ఆటగాళ్లు కూడా ఆనందాన్ని పంచుకుంటున్నారు... మాజీ హాకీ ఆటగాళ్లయితే తామే గెలిచినంతగా గంతులు వేస్తున్నారు... ఒలింపిక్స్‌లో ఆడి పతక విజయంలో భాగం కాలేనివారు ఇప్పుడు గెలిచిన బృందంలో తమను తాను చూసుకుంటున్నారు. ఓడినా, గెలిచినా సుదీర్ఘ కాలంగా భారత హాకీనే ప్రేమిస్తూ వచ్చిన వారి స్పందన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు... ఈ గెలుపును ఆస్వాదించాలంటే హాకీ అభిమానులే కానవసరం లేదు. భారతీయుడైతే చాలు! టోక్యోలో ఇతర పతకాలు కూడా మన ఖాతాలో చేరుతున్నాయి. కానీ హాకీ విజయాన్ని అందరూ కోరుకున్నారు, ప్రార్థించారు. ఎందుకంటే ఇది ఫలితానికి సంబంధించి మాత్రమే కాదు, ఆ ఆటతో ఎంతో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. మరో ఈవెంట్లో ఓడినా, గెలిచినా హాకీ జట్టు మాత్రం పతకం సాధించాలని కోరుకోనివారు లేరంటే అతిశయోక్తి కాదు. 1984, 1988, ...., 2012, 2016... కాలక్రమంలో తొమ్మిది సార్లు ఒలింపిక్స్ వచ్చి వెళ్లాయి... పతకం మాత్రం రాలేదు. ఒకసారి అయితే ఒలింపిక్స్‌లో అడుగు పెట్టే అవకాశం కూడా దక్కలేదు. బంగారు హాకీ ఘనతలు ముగిసిన తర్వాత మొదలైన పతనం వేగంగా సాగిపోయింది. ఈ సారైనా గెలవకపోతారా, ఒక్కసారైనా అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తూ రావడం... ఆ ఆశలు కుప్పకూలడం రొటీన్‌గా మారిపోయాయి. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించే ఆటలు అంటూ అంచనాలు పెంచే జాబితాలోంచి హాకీ పేరు ఎప్పుడో తీసేశారు. కానీ గెలిస్తే బాగుండేదన్న చిరు కోరిక మాత్రం అభిమానుల మనసులో ఏమూలనో ఉండేది. అందుకే ఈ మూడో స్థానమూ మురిపిస్తోంది. పసిడి రాకపోతేనేమి, పునరుజ్జీవం పొందుతున్న ఆటకు ఈ విజయం బంగారంకంటే గొప్ప. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో హాకీకి దక్కిన ఈ కాంస్య పతకం విలువ అమూల్యం. టోక్యో: కోట్లాది అభిమానులకు ఆనందం పంచుతూ భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మూడో స్థానం కోసం గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5–4 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. ఒకదశలో 1–3తో వెనుకబడినా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మన టీమ్ చివరకు విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున సిమ్రన్‌జిత్ సింగ్ (17వ, 34వ నిమిషాల్లో), హార్దిక్ సింగ్ (27వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (29వ నిమిషంలో), రూపిందర్‌పాల్ సింగ్ (31వ నిమిషంలో) గోల్స్ సాధించారు. జర్మనీ తరఫున టిమర్ ఒరుజ్ (2వ నిమిషంలో), నిక్లాస్ వెలెన్ (24వ నిమిషంలో), బెనెడిక్ట్ ఫర్క్ (25వ నిమిషంలో), ల్యూకాస్ విండ్‌ఫెడర్ (48వ నిమిషంలో) జర్మనీ జట్టుకు గోల్స్ చేశారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించిన ఇన్నేళ్లకు మళ్లీ భారత్ ఖాతాలో మరో హాకీ పతకం చేరింది. వెనుకంజ వేసి... కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ఎన్నో ఆశలతో మ్యాచ్ బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. గత రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ రెండో నిమిషంలోనే గోల్‌తో ముం దంజ వేసింది. భారత నెమ్మదైన డిఫెన్స్‌ను ఛేదించిన ఒరుజ్ రివర్స్ హిట్‌తో తొలి గోల్ నమోదు చేశాడు. మరో మూడు నిమిషాలకే భారత్‌కు పెనాల్టీ లభించినా అది వృథా అయింది. వరుసగా గోల్ పోస్ట్‌పై దాడులు చేస్తూ జర్మనీ తొలి క్వార్టర్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్స్‌లో భారత జట్టు కుదురుకుంది. మిడ్ ఫీల్డ్ నుంచి నీలకంఠ శర్మ ఇచ్చిన పాస్‌ను సర్కిల్లో అందుకున్న సిమ్రన్ జర్మనీ కీపర్‌ను తప్పించి రివర్స్ హిట్ కొట్టడంతో స్కోరు సమమైంది. ఈ జోరులో భారత్ అటాక్‌కు ప్రయత్నించినా, జర్మనీ వెంటనే కోలుకుంది. నీలకంఠ, సురేంద్ర కుమార్‌లు చేసిన పొరపాట్లతో బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న జర్మనీ వరుస నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టింది. దాంతో ఆ జట్టు ఆధిక్యం 3–1కి పెరిగింది. మళ్లీ దూసుకెళ్లి... గతంలోనైతే ఇలాంటి స్థితి నుంచి భారత్ ఇక ముందుకు వెళ్లడం కష్టంగా మారిపోయేదేమో. కానీ ఎలాంటి ఆందోళన లేకుండా, ఆశలు కోల్పోకుండా భారత్ పట్టుదలగా ఆడటం సత్ఫలితాన్ని ఇచ్చింది. రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. హర్మన్‌ప్రీత్ కొట్టిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ కీపర్ స్టాడ్లర్ సమర్థంగా అడ్డుకున్నా, రీబౌండ్లో హార్దిక్ దానిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఆ వెంటనే మరో పెనాల్టీ రాగా, ఈసారి హర్మన్‌ప్రీత్ విఫలం కాలేదు. స్కోరు 3–3కు చేరడంతో భారత్ జట్టులో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో క్వార్టర్ మొదటి నిమిషంలోనే భారత్‌కు కలిసొచ్చింది. భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌ను జర్మనీ ఆటగాళ్లు సర్కిల్ లోపల మొరటుగా అడ్డుకోవడంతో ‘పెనాల్టీ స్ట్రోక్’ లభించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రూపిందర్ దీనిని గోల్ చేయడంతో ఆధిక్యం 4–3కు పెరిగింది. మరో మూడు నిమిషాలకే గుర్జంత్ ఇచ్చిన పాస్‌ను అందుకొని దూసుకుపోయిన సిమ్రన్‌జిత్ మరో గోల్ చేయడంతో భారత్ 5–3తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ దశలో మరింత దూకుడుగా ఆడిన భారత్‌కు వరుస పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. అయితే అవి గోల్‌గా మారలేదు. చివరి క్వార్టర్లో జర్మనీ మళ్లీ బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరో పెనాల్టీ అవకాశం దక్కించుకున్న జర్మనీ దానిని ఉపయోగించుకోవడంతో భారత్ ఆధిక్యం 5–4కు తగ్గింది. మ్యాచ్ ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు జర్మనీ తీవ్రంగా ప్రయత్నించింది. తమ గోల్ కీపర్‌ను ఆ స్థానం నుంచి తప్పించి ఫీల్డ్‌లోకి తీసుకొచ్చి దాడులకు దిగింది. అయితే వీటిని మన గోల్ కీపర్ శ్రీజేశ్ సమర్థంగా అడ్డుకోగలిగాడు. తమకు దక్కిన 13 పెనాల్టీ కార్నర్లలో జర్మనీ ఒకదానిని మాత్రమే గోల్‌గా మలచగా... భారత్ 6 పెనాల్టీలలో రెండింటిని గోల్స్‌గా మార్చుకోగలిగింది. 6.8 సెకన్ల ముందు... అద్భుతంగా ఆడటం... ఇక మనం గెలిచేశాం అనుకుంటుండగా చివరి క్షణాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించి మ్యాచ్‌లు చేజార్చుకున్న దృశ్యం భారత హాకీ చరిత్రలో లెక్కలేనన్ని సార్లు జరిగింది. మన ఉదాసీతనకు తోడు అనూహ్యంగా వచ్చే అటాక్‌ను అంచనా వేసే లోపే ప్రమాదం జరిగిపోతూ ఉంటుంది. మ్యాచ్ ముగియడానికి మరో 6.8 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉన్న దశలో కూడా జర్మనీకి పెనాల్టీ లభించింది. దీనిని జర్మనీ గోల్ చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అయితే డిఫెన్స్‌లో ముందుగా దూసుకొచ్చి న అమిత్ రోహిదాస్, కీపర్ శ్రీజేశ్ కలిసి ఆపగలిగారు. అంతే... భారత ఆటగాళ్లు పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించగా, జర్మనీ ప్లేయర్లు కుప్పకూలిపోయారు. టిక్..టిక్.. టైమర్ ఆగిపోయింది! మ్యాచ్ మరో 29 సెకన్లలో ముగుస్తుందనగా మైదానంలో ఉన్న అఫీషియల్ టైమర్ పని చేయడం ఆగిపోయింది. కానీ ఆట మాత్రం సాగిపోయింది. చివరకు 11 సెకన్ల తర్వాత అది మళ్లీ పని చేసింది. సాంకేతిక సమస్యలతో టైమర్ పని చేయలేదు. జర్మనీకి 6 సెకన్ల ముందు పెనాల్టీ లభించిందంటే ఒక రకంగా అది అదనపు సమయంలో భారత్‌కు జరిగిన నష్టమే! మ్యాచ్ ముగిశాక కూడా నిర్వాహకులు దీనిపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. భారత జట్టు విజయం సాధించింది కాబట్టి సమస్య రాలేదు కానీ అదే చివరి పెనాల్టీ గోల్‌గా మారి ఉంటే..! -
41 ఏళ్ల ఎదురు చూపులు.. ఆ సీఎం వల్లే ఈ ఒలింపిక్ పతకం
సాక్షి, వెబ్‌డెస్క్: ‘హాకీ’.. చెప్పుకోవడానికే మన జాతీయ క్రీడ. కానీ ఈ కాలం వారికి దాని గురించి పెద్దగా తెలియదనేది నమ్మకతప్పాల్సిన వాస్తవం. మన దగ్గర ఆటలంటే చాలు టక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్. గతమెంతో ఘనమన్నట్లు ఒకప్పుడు ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన చరిత్ర ఉన్నప్పటికి మన జాతీయ క్రీడకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదనేది వాస్తవం. కారణాలు ఏవైనా కావచ్చు.. కానీ గత 40 ఏళ్లుగా హాకీ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. ఎంతలా అంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం అర్హత సాధించలేక చతికిలపడింది. దాంతో మన దేశంలో హాకీ కథ ముగిసిందనే చాలా మంది భావించారు. అలాంటి పరిస్థితులను తట్టుకుని.. నిలబడి ఇప్పుడు మళ్లీ అదే ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచే స్థాయికి చేరింది. ఇక ఈ విజయంలో ఫీల్డ్‌లో పోరాడిన ఆటగాళ్ల కృషి ఎంత ఉందో.. అంతకంటే పెద్ద పాత్రే పోషించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు భారత హాకీ టీం సాధించిన పతకం ఆయన చలవే. ఆ వివరాలు తెలియాలంటే ఇది చదవండి.. భారత్ హాకీలో చివరిసారిగా 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో పతకం రావడానికి దాదాపు 41 ఏళ్ల సమయం పట్టింది. ఇందుకు కారణాలు అనేకం.. 1980 తర్వాత దేశంలో క్రీడలకు కమర్షియల్ రంగులు అద్దుకుంటున్న టైం అది. అప్పుడే ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్‌కు సరైన గుర్తింపు దక్కకపోగా.. రిఫరెన్స్‌లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్‌లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్షిప్-ఎండోర్స్మెంట్ వివాదాలు వెంటాడాయి. వీటికితోడు క్రికెట్‌కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఆదుకున్న నవీన్ పట్నాయక్.. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లు అన్నాళ్లు ఇండియన్ హాకీ టీమ్‌కు స్పాన్స్రగా కొనసాగుతున్న సహారా 2018లో టీమ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. హాకీని స్పాన్సర్ని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం హాకీ ఇండియాను ఆదుకుంది. ఐదేళ్లకుగాను హాకీని స్పాన్సర్ చేయడానికి పట్నాయక్ ప్రభుత్వం రూ.100 కోట్లతో హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. పట్నాయక్ నాడు చూపిన చొరవే.. నేడు టోక్యో ఒలిపిక్స్లో పతకానికి కారణమయ్యింది. హాకీపై మక్కువతో.. నవీన్ పట్నాయక్ భారత హాకీ టీమ్‌ను స్పాన్సర్ చేయడానికి కారణం.. గతంలో ఆయన కూడా హాకీ ప్లేయరే కావడం. ఆయన డూన్ స్కూల్లో చదువుతున్న సమయంలో హాకీ గోల్‌కీపర్‌గా ఉన్నారు. అందుకే ఆ ఆటపై ఉన్న ఇష్టంతోనే టీమ్‌కు స్పాన్సర్‌గా ఉండటానికి ఆయన ముందుకు వచ్చారు. పురుషుల జట్టుతోపాటు మహిళలూ జట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్సర్‌గా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకుంది ఒడిశా ప్రభుత్వం. ఇది జరిగిన మూడేళ్లకు ఇప్పుడు ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్ మెడల్ గెలిచింది. మహిళల టీమ్ కూడా మెడల్‌కు అడుగు దూరంలో ఉంది. ఒడిశాలో 2014 నుంచి హాకీ హవా.. 2014లో ఒడిశా ప్రభుత్వం చాంపియన్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్యమిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్సర్షిప్కు బీజం పడింది. ఆ టోర్నీపై నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ తర్వాత 2017లో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా ఉన్న కళింగ లాన్సర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వరల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వహించింది. ఆ తర్వాత 2019లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మెన్స్ సిరీస్ ఫైనల్స్, ఒలింపిక్ హాకీ క్వాలిఫయర్స్.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జరిగాయి. ఇలా ఇండియన్ హాకీ టీం వేసే ప్రతి అడుగులోనూ నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ, కృషి ఉన్నాయి. ఒడిశా గతంలో కొందరు గొప్ప హాకీ ఆటగాళ్లను తయారు చేసింది. పురుషులు, మహిళల జట్లలో ఒడిశాకు చెందిన పలువురు క్రీడాకారులున్నారు. వీరిలో వైస్ కెప్టెన్లు - బీరేంద్ర లక్రా, దీప్ గ్రేస్ ఎక్కా వంటి వారు ఒడిశాకు చెందినవారే. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 2023 వరకు హాకీ ఇండియాకు స్పాన్సర్‌గా ఉంది. అదే ఏడాది భారతదేశం ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ ఒలింపిక్స్‌లో ఇండియన్ హాకీ టీమ్ ఆడిన పలు మ్యాచ్‌లను నవీన్ పట్నాయక్ చూశారు. ఇప్పుడు కాంస్య పతకం గెలిచిన తర్వాత కూడా టోక్యోలో ఉన్న టీమ్‌తో వీడియో కాల్లో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విజయం ప్రతి భారతీయుడికీ గర్వకారణమన్నారు నవీన్ పట్నాయక్.