
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌లో భాగంగా ఒలింపిక్ చాంపియన్ బెల్జియంతో లండన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నెల్సన్ ఒనానా గోల్‌గా మలిచి బెల్జియం జట్టును గెలిపించాడు.
అంతకుముందు థిబె స్టాక్‌బ్రోక్స్ (18వ ని.లో) గోల్‌తో బెల్జియం 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 25వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఇక మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకున్న దశలో భారత జట్టు గోల్ సమరి్పంచుకొని మూల్యం చెల్లించుకుంది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో బ్రిటన్‌తో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment