
ఆంట్‌వర్ప్: బెల్జియం పర్యటనను భారత పురుషుల హాకీ జట్టు క్లీన్ స్వీప్‌తో ముగించింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 5–1తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బెల్జియంపై ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు సిమ్రన్ జీత్ సింగ్ (7వ నిమిషంలో), లలిత్ (35వ ని.లో), వివేక్ సాగర్ (36వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (42వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (43వ ని.లో) తలా ఓ గోల్ సాధించారు. ప్రత్యర్థి తరఫున హెన్రిక్స్ (39వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. ఈ పర్యటనలో భారత్ తన తొలి మ్యాచ్‌లో 2–0తో బెల్జియంపై, అనంతరం రెండు, మూడు మ్యాచ్‌ల్లో 6–1తో, 5–1తో స్పెయిన్‌పై, నాలుగో మ్యాచ్‌లో 2–1తో బెల్జియంపై విజయాలను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment