ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు మరో టోర్నీకి సిద్ధమైంది. సెప్టెంబరు 8 నుంచి 17 వరకు చైనాలో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. వివేక్ సాగర్ ప్రసాద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
కృషన్ బహదూర్ పాఠక్‌కు అవకాశం
ఇక దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో... చాలా కాలం నుంచి భారత జట్టుకు స్టాండ్‌బై గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్న కృషన్ బహదూర్ పాఠక్ ఇప్పుడు ప్రధాన గోల్‌కీపర్‌గా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మరో గోల్‌కీపర్ సూరజ్ కర్కేరా రిజర్వ్‌గా ఉంటాడు. 2018 నుంచి సీనియర్ జట్టులో గోల్‌కీపర్‌గా ఉన్న కృషన్ ఇప్పటి వరకు 125 మ్యాచ్‌లు ఆడాడు.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్
కాగా 2016లో జూనియర్ ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత జట్టుకు గోల్‌కీపర్‌గా ఉన్న కృషన్... రెండుసార్లు ఆసియా క్రీడల్లో, రెండుసార్లు ప్రపంచకప్‌లో, రెండుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. ఇక డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ పోటీపడనుండగా... దక్షిణ కొరియా, మలేసియా, పాకిస్తాన్, జపాన్, చైనా జట్లు కూడా టైటిల్ కోసం తలపడతాయి.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్న హార్దిక్ సింగ్, మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, షంషేర్ సింగ్, గుర్జంత్ సింగ్‌లకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నుంచి విశ్రాంతి ఇచ్చారు. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబరు 8న చైనాతో ఆడుతుంది.
ఆ తర్వాత 9న జపాన్‌తో... 11న మలేసియాతో... 12న దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఒకరోజు విశ్రాంతి తర్వాత సెపె్టంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్స్ 16న, ఫైనల్ 17న నిర్వహిస్తారు.
భారత పురుషుల హాకీ జట్టు:
కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వివేక్ సాగర్ ప్రసాద్ (కెప్టెన్), జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్‌రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, రాజ్‌కుమార్ పాల్, నీలకంఠ శర్మ, మన్‌ప్రీత్ సింగ్, మొహమ్మద్ రాహీల్ మౌసీన్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, అరిజిత్ సింగ్, ఉత్తమ్‌సింగ్, గుర్జోత్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment