vivek sagar
-
భారత జట్టు ప్రకటన.. చైనాతో తొలి మ్యాచ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు మరో టోర్నీకి సిద్ధమైంది. సెప్టెంబరు 8 నుంచి 17 వరకు చైనాలో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. వివేక్ సాగర్ ప్రసాద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.కృషన్ బహదూర్ పాఠక్‌కు అవకాశంఇక దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో... చాలా కాలం నుంచి భారత జట్టుకు స్టాండ్‌బై గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్న కృషన్ బహదూర్ పాఠక్ ఇప్పుడు ప్రధాన గోల్‌కీపర్‌గా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మరో గోల్‌కీపర్ సూరజ్ కర్కేరా రిజర్వ్‌గా ఉంటాడు. 2018 నుంచి సీనియర్ జట్టులో గోల్‌కీపర్‌గా ఉన్న కృషన్ ఇప్పటి వరకు 125 మ్యాచ్‌లు ఆడాడు.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్‌కాగా 2016లో జూనియర్ ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత జట్టుకు గోల్‌కీపర్‌గా ఉన్న కృషన్... రెండుసార్లు ఆసియా క్రీడల్లో, రెండుసార్లు ప్రపంచకప్‌లో, రెండుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. ఇక డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ పోటీపడనుండగా... దక్షిణ కొరియా, మలేసియా, పాకిస్తాన్, జపాన్, చైనా జట్లు కూడా టైటిల్ కోసం తలపడతాయి.ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్న హార్దిక్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, షంషేర్ సింగ్, గుర్జంత్ సింగ్‌లకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నుంచి విశ్రాంతి ఇచ్చారు. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబరు 8న చైనాతో ఆడుతుంది. ఆ తర్వాత 9న జపాన్‌తో... 11న మలేసియాతో... 12న దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఒకరోజు విశ్రాంతి తర్వాత సెపె్టంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్స్ 16న, ఫైనల్ 17న నిర్వహిస్తారు.భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వివేక్ సాగర్ ప్రసాద్ (కెప్టెన్), జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, రాజ్‌కుమార్ పాల్, నీలకంఠ శర్మ, మన్‌ప్రీత్ సింగ్, మొహమ్మద్ రాహీల్ మౌసీన్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, అరిజిత్ సింగ్, ఉత్తమ్‌సింగ్, గుర్జోత్ సింగ్. -
వివేక్‌కు కోటి.. అతడికి రూ. 4 కోట్లు: ప్రభుత్వాల భారీ నజరానాలు
భారత హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల రివార్డుతో సత్కరించనుంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారంటూ వివేక్‌తో పాటు భారత హాకీ జట్టు ఆటగాళ్లందరినీ ప్రశంసించారు.వరుస ఒలింపిక్స్లోకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. స్పెయిన్‌తో గురువారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 2-1తో విజయం సాధించింది.టోక్యో ఫలితాన్ని పునరావృతం చేస్తూ మరోసారి మెడల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన హాకీ జట్టుగా నిలిచింది. విశ్వ క్రీడల్లో హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఇది 13వ పతకం.వివేక్‌కు ఇప్పటికే డీఎస్పీ ఉద్యోగంఈ నేపథ్యంలో హాకీ ఇండియా కాంస్యం గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు నజరానా ప్రకటించింది. ప్లేయర్లలో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత వివేక్ సాగర్ ప్రసాద్‌కు ఫోన్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.. ‘‘అద్బుతమైన ప్రదర్శన. దేశం మొత్తం మిమ్మల్ని చూసి సంతోషిస్తోంది. జట్టుకు అభినందనలు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీ అకౌంట్‌కు కోటి రూపాయలు రివార్డుగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీసుగా మీరు పనిచేస్తున్నారు. మీకు ఈ కోటి రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.అమిత్‌కు రూ. 4 కోట్లుకాగా టోక్యోలో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడైన వివేక్‌కు నాటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో పాటు కోటి రూపాయలు ఇచ్చింది. మరోవైపు.. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ తమ హాకీ స్టార్ అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానా ప్రకటించారు. జట్టులోని ఇతర సభ్యులకు రూ. 15 లక్షల చొప్పున అందిస్తామని తెలిపారు. -
అంటే సుందరానికి టీజర్ లాంచ్ ఈవెంట్
-
‘రైజింగ్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా వివేక్ సాగర్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టులో ఇటీవల విశేషంగా రాణిస్తోన్న యువ హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గుర్తించింది. 2019 ఏడాదికిగానూ ఎఫ్ఐహెచ్ ‘ రైజింగ్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా మిడ్ ఫీల్డర్ వివేక్ సాగర్‌ను ఎంపిక చేసింది. ఈ అవార్డు కోసం పోటీపడిన వారిలో 19 ఏళ్ల వివేక్ సాగర్ విజేతగా నిలవగా... మైకో కాసెలా (అర్జెంటీనా), బ్లేక్ గోవర్స్ (ఆస్ట్రేలియా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా వివేక్ సాగర్‌ను హాకీ ఇండియా అధ్యక్షుడు మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ అభినందించారు. 2018లో 17 ఏళ్ల వయస్సులో వివేక్ సాగర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2019లో భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ సిరీస్ ఫైనల్స్ గెలిచిన భారత జట్టులో అతను సభ్యుడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలోనూ వివేక్ సాగర్ కీలక పాత్ర పోషించాడు. -
అ! తర్వాత నాని మరో సిన్మా... ‘హిట్’ గ్యారెంటీ!!
హైదరాబాద్: విభిన్న కథాచిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఎలాంటి వారసత్వ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. మంచి కథలను ఎంచుకుంటు.. ఓ చిన్న హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా మారి విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. నాని ఇంతకుముందు వైవిధ్యభరితమైన ‘అ!’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డులు అందుకుంది. తాజాగా నాని మరో సినిమాను నిర్మిస్తున్నాడు. తన వాల్‌పోస్టర్ సినిమా సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విశ్వేక్సేన్ (ఈ నగరానికి ఏమైంది ఫేమ్), రుహాని శర్మ (చి.ల.సౌ. ఫేమ్) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శైలేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు ప్రశాంతి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో పూజకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో-హీరోయిన్ల తొలి సీన్‌కు నాని క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ను నాని ట్విటర్లో విడుదల చేశారు. -
సంగీత్ సాగర్