Hero Nani Announces a Movie 'HIT' With Vishwaksen, Shooting Starts | అ! తర్వాత నాని మరో సిన్మా... ‘హిట్‌’ గ్యారెంటీ!! - Sakshi
Sakshi News home page

అ! తర్వాత నాని మరో సిన్మా... ‘హిట్‌’ గ్యారెంటీ!!

Published Thu, Oct 24 2019 10:51 AM | Last Updated on Thu, Oct 24 2019 11:16 AM

Presented by Nani, Hit Movie Shooting Starts - Sakshi

హైదరాబాద్‌: విభిన్న కథాచిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఎలాంటి వారసత్వ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా.. మంచి కథలను ఎంచుకుంటు.. ఓ చిన్న హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఇప్పుడు స్టార్‌ హీరో స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా మారి విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. నాని ఇంతకుముందు వైవిధ్యభరితమైన ‘అ!’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.

ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డులు అందుకుంది. తాజాగా నాని మరో సినిమాను నిర్మిస్తున్నాడు. తన వాల్‌పోస్టర్‌ సినిమా  సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విశ్వేక్‌సేన్‌ (ఈ నగరానికి ఏమైంది ఫేమ్‌), రుహాని శర్మ (చి.ల.సౌ. ఫేమ్‌) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శైలేష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించనున్న ఈ సినిమాకు ప్రశాంతి నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ తాజాగా హైదరాబాద్‌లో పూజకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో-హీరోయిన్ల తొలి సీన్‌కు నాని క్లాప్‌ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ను నాని ట్విటర్‌లో విడుదల చేశారు.



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement