‘ఫలక్‌నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్’. ఈ చిత్రం ద్వారా శైలేష్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిట్ అంటే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం అని అర్థం అని ఇప్పటికే విడుదలై డైలాగ్ ప్రోమోలో హీరో విశ్వక్ సేన్ చిన్న క్లారిటీ ఇచ్చేశాడు. డైలాగ్ టీజర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల అయింది.
127 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో ప్రీతి అనే అమ్మాయి కనిపించకపోవడం, ఆమె తల్లి దండ్రులు కంప్లెయింట్ ఇవ్వడం, స్పెషల్ ఆఫీసర్‌గా విక్రమ్ (విశ్వక్ సేన్) ఈ కేసు విచారించడం.. ఈ క్రమంలో యాక్షన్, సస్పెన్స్, లవ్ సీన్స్ ఇలా అన్ని అంశాలను ఈ ట్రైలర్‌లో జోడించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఓ సెక్షన్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో హిట్ ట్రైలర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా విశ్వక్ సేన్ తన నటనతో రఫ్పాడించాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది. మురళీ శర్మ, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నాడు.
చదవండి:
‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’
అన్నయ్యను గుర్తుచేసుకున్న కళ్యాణ్‌రామ్
‘ఆ పబ్‌లో ఏం జరిగిందో తెలియాలి’
Published Wed, Feb 19 2020 2:08 PM | Last Updated on Wed, Feb 19 2020 2:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment