
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు మరో విజయం లభించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మన్‌దీప్ సింగ్ (22వ నిమిషంలో), జర్మన్‌ప్రీత్ సింగ్ (45వ నిమిషంలో), సుఖ్‌జీత్ సింగ్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
ఐర్లాండ్ జట్టుకు జెరెమీ డంకన్ (8వ నిమిషంలో) ఒక గోల్ అందించాడు. మరోవైపు జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0–4 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది.