ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ బరిలో భారత జట్టు
న్యూఢిల్లీ: ఐర్లాండ్‌తో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్‌కు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టి20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు స్మృతినే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించింది.
విండీస్‌తో వన్డే పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పేస్ బౌలర్ రేణుకా సింగ్‌కు కూడా విరామం ఇచ్చారు. విండీస్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసిన ప్రతీక, తనూజ తమ స్థానాలను నిలబెట్టుకోగా... రాఘ్వీ బిస్త్‌కు తొలిసారి వన్డే టీమ్ పిలుపు దక్కింది. భారత వన్డే టీమ్‌లోకి ఎంపికైనా మ్యాచ్ ఆడని సయాలీ సత్‌ఘరేకు మరో అవకాశం దక్కింది. మరోవైపు ఇప్పటికే స్థానం కోల్పోయిన షఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌లపై మాత్రం సెలక్టర్లు ఇంకా విశ్వాసం ఉంచలేదు. రాజ్‌కోట్‌లో ఈ నెల 10, 12, 15 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇప్పటి వరకు భారత్, ఐర్లాండ్ మధ్య 12 వన్డేలు జరగ్గా...అన్నీ భారత్ గెలిచింది.
జట్టు వివరాలు: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్‌కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రి, రిచా ఘోష్, తేజల్ హసబ్‌నిస్, రాఘ్వీ బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజ కన్వర్, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, సయాలీ సత్‌ఘరే.
Comments
Please login to add a commentAdd a comment