అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’ జట్టులో ఇద్దరు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన, స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఈ టీమ్‌లో స్థానం సంపాదించారు.
అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా
కాగా స్మృతి మంధాన 2024లో 13 వన్డేలు ఆడి 747 పరుగులు చేసింది. తద్వారా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుసగా రెండు శతకాలు బాదిన ఆమె న్యూజిలాండ్‌పై కూడా ఒక సెంచరీ చేసింది.
24 వికెట్లు పడగొట్టి
ఇక 2024లో 13 వన్డేలాడిన దీప్తి శర్మ 186 పరుగులు చేయడంతో పాటు... 24 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ జట్టుకు దక్షిణాఫ్రికా స్టార్ లౌరా వాల్వర్ట్ సారథిగా ఎంపికైంది.
మరోవైపు.. ఇంగ్లండ్ నుంచి అమీ జోన్స్, సోఫీ ఎకెల్‌స్టోన్, కేట్ క్రాస్ రూపంలో ముగ్గురు ప్లేయర్లు, ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్‌నర్, అనాబెల్ సథర్‌లాండ్ చోటు దక్కించుకున్నారు. సఫారీ ప్లేయర్ మరీనే కాప్‌తో పాటు శ్రీలంక నుంచి చమరి ఆటపట్టు, వెస్టిండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ కూడా ఈ టీమ్‌కు ఎంపికయ్యారు.
ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024
స్మృతి మంధాన, లారా వాల్వర్ట్(కెప్టెన్), చమరి ఆటపట్టు, హేలీ మాథ్యూస్, మరీనే కాప్, ఆష్లే గార్డ్‌నర్, అనాబెల్ సథర్‌లాండ్, అమీ జోన్స్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లిస్టోన్, కేట్ క్రాస్.
మరిన్ని క్రీడా వార్తలు
ఫైనల్లో సూర్మా క్లబ్
రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్ తొలి టోర్నమెంట్‌లో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సూర్మా క్లబ్ జట్టు 4–2 గోల్స్ తేడాతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టును ఓడించింది. సూర్మా క్లబ్ తరఫున ఎంగెల్‌బెర్ట్ (1, 17వ, 47వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేయగా... హినా బానో (9వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది.
బెంగాల్ టైగర్స్ తరఫున కెప్టెన్ వందన కటారియా (48వ నిమిషంలో), శిల్పి దబాస్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నాలుగు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక సూర్మా క్లబ్ 13 పాయింట్లతో... ఒడిశా వారియర్స్ జట్టు 11 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈనెల 26న జరిగే ఫైనల్లో సూర్మా క్లబ్, ఒడిశా వారియర్స్ టైటిల్ కోసం తలపడతాయి.
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు నాలుగో ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు నాలుగో ఓటమి ఎదురైంది. బెంగళూరులో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి జట్టు 0–1 గోల్ తేడాతో స్పోర్టింగ్ క్లబ్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిపోయింది.
ఆట 34వ నిమిషంలో ఆసిఫ్ గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన స్పోర్టింగ్ జట్టు ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు 9 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 3 మ్యాచ్‌ల్లో గెలిచి, 2 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, 4 మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీనిధి జట్టు 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 28న హైదరాబాద్‌లో జరిగే తదుపరి మ్యాచ్ లో నాంధారి జట్టుతో శ్రీనిధి జట్టు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment