ICC ODI Team
-
ఐసీసీ టెస్ట్ జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ఇద్దరు!
2023 అత్యుత్తమ టెస్ట్ జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంపిక కాగా.. టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు లభించింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా, శ్రీలంక ప్లేయర్ దిముత్ కరుణరత్నే ఎంపిక కాగా.. వన్ డౌన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, ఐదో ప్లేస్‌లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్, వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ, ఆల్‌రౌండర్ల కోటాలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్, స్పెషలిస్ట్ పేసర్లుగా ఇంగ్లండ్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఎంపికయ్యారు. ఈ జట్టులో రిటైర్డ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు లభించడం అనూహ్యం. జట్ల వారీగా చూస్తే.. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు ఎంపిక కాగా.. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యాడు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆసక్తికరం. ఇదిలా ఉంటే, ఐసీసీ గతేడాది అత్యుత్తమ టెస్ట్ జట్టుతో పాటు వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. ఒక్క ఆటగాడికి కూడా మూడు ఫార్మాట్ల జట్లలో చోటు లభించలేదు. 2023 ఐసీసీ టెస్ట్ జట్టు: ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రవిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్ 2023 ఐసీసీ వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రవిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), మార్కో జన్సెన్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ 2023 ఐసీసీ టీ20 జట్టు: ఫిలిప్ సాల్ట్, యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, మార్క్ చాప్మన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సికందర్ రజా, అల్పేష్ రంజనీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, రిచర్డ్ నగరవ -
ఐసీసీ వన్డే జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
2023 సంవత్సరపు అత్యుత్తమ వన్డే జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారధిగా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆసీస్ ఆటగాళ్లు ట్రవిస్ హెడ్, ఆడమ్ జంపా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో ఏకంగా ఎనిమిది మంది (భారత్ (6)+ ఆస్ట్రేలియా (2)) వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనలిస్ట్‌లకు చోటు దక్కడం విశేషం. మిగిలిన మూడు బెర్త్‌లను సౌతాఫ్రికా ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసన్, మార్కో జన్సెన్, న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ దక్కించుకున్నాడు. ఐసీసీ వన్డే జట్టుకు ఓపెనర్లుగా రోహిత్, శుభ్‌మన్ గిల్ ఎంపిక కాగా.. వన్‌డౌన్ బ్యాటర్‌గా ట్రవిస్ హెడ్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో ప్లేస్‌లో డారిల్ మిచెల్, వికెట్‌కీపర్ బ్యాటర్‌గా హెన్రిచ్ క్లాసెన్, ఆల్‌రౌండర్ కోటాలో మార్కో జన్సెన్, స్పిన్నర్లుగా జంపా, కుల్దీప్, పేసర్లుగా షమీ, సిరాజ్ ఎంపికయ్యారు. ఐసీసీ తమ అత్యుత్తమ వన్డే జట్టులో వన్డే వరల్డ్‌కప్ 2023 సెమీఫైనలిస్ట్‌లకు మాత్రమే చోటు కల్పించడం మరో విశేషం. ఇదిలా ఉంటే, ఐసీసీ నిన్ననే 2023 అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కూడా టీమిండియా ఆటగాడే సారధిగా ఎంపికయ్యాడు. విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు సభ్యులుగా చోటు లభించింది. ఫిలిప్ సాల్ట్, నికోలస్ పూరన్, మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేష్ రంజనీ, మార్క్ అడైర్, రిచర్డ్ నగరవ సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. -
వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్!
ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఆడమ్ మిల్నే మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లెఫ్ట్మ్ ఆర్మ్ స్పిన్నర్ బెన్ లిస్టర్తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. నాలుగు వన్డేల సిరీస్‌లో రెండో వన్డే సెప్టెంబర్ 10న సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అయితే వన్డే ప్రపంచకప్‌కు ముందు మిల్నే గాయ పడడం జట్టు మేనెజ్మెంట్ను కలవరపెడుతోంది. ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఇక ఇదే విషయంపై కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "ఆడమ్ మిల్నే మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌కు సమయం దగ్గరపడుతుండంతో అతడిని ఈ సిరీస్‌లో ఆడించి రిస్క్ చేయకూడదని భావించాము. అందుకే అతడికి విశ్రాంతిని ఇచ్చాము. వరల్డ్‌కప్‌కు ఆటగాళ్లు గాయపడకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఇక బెన్ లిస్టర్ కూడా ప్రస్తుతం జట్టుతో పాటు ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. దీంతో వెంటనే అతడు మిల్నే స్ధానాన్ని భర్తీ చేశాడు. బెన్ యూఏఈ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌లో వార్మప్ మ్యాచ్‌లలో మమ్మల్ని ఆకట్టుకున్నాడు అని చెప్పుకొచ్చాడు. చదవండి: Asia Cup 2023: కొలంబోలో చివరగా టీమిండియా ఎప్పుడు ఆడిందంటే? అప్పుడు సంజూ! -
2022 ఐసీసీ అవార్డు విన్నర్ల మొత్తం జాబితా ఇదే..
2022 సంవత్సరానికి గానూ ఐసీసీ పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల జాబితాను దశల వారీగా విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022: బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) వుమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: నతాలీ సీవర్ (ఇంగ్లండ్) టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: సూర్యకుమార్ యాదవ్ (భారత్) వుమెన్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: తహీల మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) వుమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: నతాలీ సీవర్ (ఇంగ్లండ్) టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: మార్కో జన్సెన్ (సౌతాఫ్రికా) ఎమర్జింగ్ వుమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: రేణుకా సింగ్ (భారత్) అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: గెర్హార్డ్ ఎరాస్మస్ (నమీబియా) వుమెన్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: ఈషా ఓజా (యూఏఈ) వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, షాయ్ హోప్, శ్రేయస్ అయ్యర్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, మెహిది హసన్ మీరజ్, అల్జరీ జోసఫ్, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా వుమెన్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అలైసా హీలీ (వికెట్‌కీపర్), స్మృతి మంధన, లారా వోల్వార్డ్ట్, నతాలీ సీవర్, బెత్ మూనీ, అమేలియా కెర్ర్, సోఫీ ఎక్లెస్టోన్, అయబోంగా ఖాకా, రేణుకా సింగ్, షబ్నిమ్ ఇస్మాయిల్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికందర్ రజా, హార్ధిక్ పాండ్యా, సామ్ కర్రన్, వనిందు హసరంగ, హరీస్ రౌఫ్, జోష్ లిటిల్ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: సోఫీ డివైన్ (కెప్టెన్), స్మృతి మంధన, బెత్ మూనీ, యాశ్ గార్డ్నర్, తహిల మెక్‌గ్రాత్, నిదా దార్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, ఇనోకా రణవీర, రేణుకా సింగ్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్: బెన్ స్టోక్స్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఉస్మాన్ ఖ్వాజా, క్రెయిగ్ బ్రాత్‌వైట్, మార్నస్ లబూషేన్, బాబర్ ఆజమ్, జానీ బెయిర్‌స్టో, పాట్ కమిన్స్, కగిసో రబాడ, నాథన్ లయోన్, జేమ్స్ ఆండర్సన్ అంపైర్ ఆఫ్ ద ఇయర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) -
ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టు.. కెప్టెన్‌గా బాబర్.. టీమిండియా నుంచి ఇద్దరే
ICC ODI Team of The Year: అంతర్జాతీయ క్రికెట్ మండలి 2022 సంవత్సరానికి గానూ పురుషుల ఉత్తమ వన్డే జట్టును మంగళవారం ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఇద్దరు క్రికెటర్లకు మాత్రమే చోటు దక్కింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే టీమ్‌లో స్థానం దక్కించుకున్నారు. ఇక ఈ జట్టుకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సారథిగా ఎంపికయ్యాడు. అయితే, గతేడాది వన్డేల్లో పెద్దగా రాణించని టీమిండియా స్టార్ బ్యాటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి ఈ జట్టులో చోటు దక్కలేదు. కాగా క్యాలెండర్ ఇయర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. సారథిగా బాబర్ గతేడాది.. బాబర్ ఆజం 11 వన్డేల్లో.. ఎనిమిదింట ఫిఫ్టీకి పైగా స్కోర్లు నమోదు చేశాడు. ఇందులో మూడింటిని సెంచరీలుగా మలిచాడు. మొత్తంగా 679 పరుగులు సాధించాడు ఈ 28 ఏళ్ల బ్యాటర్. అదరగొట్టిన అయ్యర్ 50 ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 2022లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్.. ఆడిన 17 మ్యాచ్‌లలో 724 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. సూపర్ సిరాజ్ పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఆకట్టుకుంటున్న టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. 2022లో ఉత్తమంగా రాణించాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేని లోటు తీర్చే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. ఆడిన 15 మ్యాచ్‌లలో మొత్తంగా 4.62 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అతడు నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు 3/29. 11 మంది వీళ్లే ఓపెనర్లుగా బాబర్ ఆజం, ట్రవిస్ హెడ్.. వన్‌డౌన్‌లో షాయీ హోప్, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో టామ్ లాథమ్.. ఆ తర్వాతి స్థానాల్లో ఆల్‌రౌండర్ల జాబితాలో సికిందర్ రజా(ఆఫ్ బ్రేక్ స్పిన్), మెహిదీ హసన్ మిరాజ్(రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్).. పేసర్ల విభాగంలో అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్.. స్పిన్ విభాగంలో ఆడం జాంపాలను ఐసీసీ ఎంపిక చేసింది. ఐసీసీ 2022 మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 1.బాబర్ ఆజం(కెప్టెన్)- పాకిస్తాన్ 2. ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా 3. షాయీ హోప్- వెస్టిండీస్ 4. శ్రేయస్ అయ్యర్- ఇండియా 5. టామ్ లాథమ్(వికెట్ కీపర్)- న్యూజిలాండ్ 6. సికిందర్ రజా- జింబాబ్వే 7. మెహిదీ హసన్ మిరాజ్- బంగ్లాదేశ్ 8. అల్జారీ జోసెఫ్- వెస్టిండీస్ 9. మహ్మద్ సిరాజ్- ఇండియా 10. ట్రెంట్ బౌల్ట్- న్యూజిలాండ్ 11. ఆడం జంపా- ఆస్ట్రేలియా చదవండి: ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు.. భారత్ నుంచి ముగ్గురికి అవకాశం Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు కీలక ఆదేశాలు -
విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం
సీఏ వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపిక మెల్బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆటగాళ్లతో సీఏ ఎంపిక చేసిన వన్డే జట్టుకు కోహ్లిని కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. అలాగే ఈ జట్టులో భారత్ నుంచి యువ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఉండడం విశేషం. ఇటీవలే కోహ్లి ఐసీసీ వన్డే జట్టుకు కూడా నాయకుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. ‘కోహ్లి 2016లో కేవలం 10 వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే ఈ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తను ఉత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఈ పది ఇన్నింగ్స్‌లో ఎనిమిది సార్లు 45 అంతకుంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఇందులో వరుసగా రెండు సెంచరీలున్నాయి’ అని సీఏ తెలిపింది. ఇక బుమ్రా ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టగా ఎనిమిది వన్డేల్లో 17 వికెట్లు తీశాడు. ఈ జట్టులో ఆసీస్ నుంచి ఐదుగురు ఆటగాళ్లున్నారు. జట్టు: కోహ్లి (కెప్టెన్), బుమ్రా (భారత్), స్మిత్, వార్నర్, మిషెల్ మార్‡్ష, హేస్టింగ్స్, స్టార్క్ (ఆస్ట్రేలియా), డి కాక్ (కీపర్), తాహిర్ (దక్షిణాఫ్రికా), బట్లర్ (ఇంగ్లండ్), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్).