విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం
సీఏ వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపిక
మెల్‌బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆటగాళ్లతో సీఏ ఎంపిక చేసిన వన్డే జట్టుకు కోహ్లిని కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. అలాగే ఈ జట్టులో భారత్ నుంచి యువ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఉండడం విశేషం. ఇటీవలే కోహ్లి ఐసీసీ వన్డే జట్టుకు కూడా నాయకుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. ‘కోహ్లి 2016లో కేవలం 10 వన్డేలు మాత్రమే ఆడాడు.
అయితే ఈ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తను ఉత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఈ పది ఇన్నింగ్స్‌లో ఎనిమిది సార్లు 45 అంతకుంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఇందులో వరుసగా రెండు సెంచరీలున్నాయి’ అని సీఏ తెలిపింది. ఇక బుమ్రా ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టగా ఎనిమిది వన్డేల్లో 17 వికెట్లు తీశాడు. ఈ జట్టులో ఆసీస్ నుంచి ఐదుగురు ఆటగాళ్లున్నారు.
జట్టు: కోహ్లి (కెప్టెన్), బుమ్రా (భారత్), స్మిత్, వార్నర్, మిషెల్ మార్‡్ష, హేస్టింగ్స్, స్టార్క్ (ఆస్ట్రేలియా), డి కాక్ (కీపర్), తాహిర్ (దక్షిణాఫ్రికా), బట్లర్ (ఇంగ్లండ్), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్).