
2021 ఏడాదికు గాను టెస్ట్ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా శ్రీలంక టెస్ట్ సారథి దిమిత్ కరుణరత్నేను ఎంపికచేసింది. ఈ జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కరుణరత్నేకు అవకాశం దక్కింది. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో మార్నస్ లాబుషేన్, జోరూట్ కు చోటు ఇచ్చారు. ఇక ఐదో స్ధానంలో పాకిస్తాన్ ఆటగాడు ఫవాద్ ఆలంకి చోటు దక్కింది.
ఈ జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. అదే విధంగా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్‌లుగా అశ్విన్, అక్షర్ పటేల్‌కు చోటు ఇచ్చింది. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో కైల్ జేమీసన్, హాసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిదిను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ఈ జట్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు.
క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నే (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జో రూట్, ఫవాద్ ఆలం, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవి అశ్విన్, కైల్ జామీసన్, అక్షర్ పటేల్, హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది
చదవండి: ఒకే జట్టులో సచిన్, ధోని,యువరాజ్.. కోహ్లి, రోహిత్‌కు నోఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment