Cricket Australia
-
WI vs Aus: పదేళ్ల తర్వాత తొలిసారిగా.. షెడ్యూల్ విడుదల
ఎట్టకేలకు విండీస్ వేదికగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్(West Indies Vs Australia) మధ్య ఫ్రాంక్ వొరెల్ ట్రోఫీ(Frank Worrell Trophy) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరుజట్లు కరేబియన్ గడ్డ మీద ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో పోటీపడనున్నాయి. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గురువారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు త్వరలోనే తమ దేశంలో పర్యటించనుందని తెలిపింది.డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో తొలి సిరీస్మరోవైపు.. ఈ విషయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి బెన్ ఓలివర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ క్రికెట్ బోర్డులకు ఘనమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత ఇరుజట్లు టెస్టు సిరీస్ ఆడటం శుభసూచకమని.. ఈ సిరీస్‌ను మూడు మ్యాచ్‌లకు పెంచినట్లు వెల్లడించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025-2027 ఎడిషన్‌లో ఇదే తమకు ఇదే తొలి సిరీస్ అని.. ఈసారీ ఫ్రాంక్ వొరిల్ ట్రోఫీని తామే సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.అదే విధంగా ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌తో ఐదు టీ20లు కూడా ఆడనున్నట్లు ఓలివర్ తెలిపారు. ఏడాది తర్వాత జరునున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇదే ఆరంభ సన్నాహకం కానుందని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఆసీస్ ప్రస్తుతంశ్రీలంక పర్యటనలో ఉంది. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఇక ఆసీస్ ఇప్పటికే డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లకు షెడ్యూల్మూడు టెస్టులుతొలి టెస్టు: జూన్ 25- 20- బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్రెండో టెస్టు: జూలై 3-7- సెయింట్ జార్స్, గ్రెనెడామూడో టెస్టు: జూలై 12- 16- కింగ్స్టన్, జమైకాటీ20 సిరీస్‌తొలి టీ20- జూలై 20- కింగ్స్టన్, జమైకారెండో టీ20- జూలై 22- కింగ్స్టన్, జమైకామూడో టీ20- జూలై 25- బసెటెరె, సెయింట్ కిట్స్నాలుగో టీ20- జూలై 26- బసెటెరె, సెయింట్ కిట్స్ఐదో టీ20- జూలై 28- బసెటెరె, సెయింట్ కిట్స్అతడి జ్ఞాపకార్థంవెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో విజేతకు ఫ్రాంక్ వొరిల్ అవార్డు ప్రదానం చేస్తారు. వెస్టిండీస్ జట్టు తొలి నల్లజాతి కెప్టెన్‌గా పేరొందిన వొరిల్ జ్ఞాపకార్థం ఈ ట్రోఫీని ప్రవేశపెట్టారు. 1960-61లో తొలిసారి ఆస్ట్రేలియాలో ఈ ట్రోఫీని ప్రదానం చేశారు.ఇక 1995 నుంచి ఇప్పటి దాకా ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అయితే, గతేడాది జరిగిన టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ ఆసీస్ ఆధిపత్యాన్ని తగ్గించింది. గబ్బాలో అనూహ్య విజయంతో సిరీస్‌ను 1-1తో డ్రా చేసి.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్‌పై టెస్టు విజయం నమోదు చేసింది.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లు ముగిసిన తర్వాత వెస్టిండీస్ పాకిస్తాన్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రిజ్వాన్ బృందంతో సొంతగడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. జూలై 31 నుంచి టీ20లు, ఆగష్టు 8 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. -
ICC: జై షా కీలక ముందడుగు.. చిన్న జట్ల పాలిట శాపం?!
టెస్టు క్రికెట్ మనుగడ కోసం సిరీస్‌లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త తరహా మార్పుల గురించి యోచిస్తోంది. సంప్రదాయ ఫార్మాట్‌పై మరింత ఆసక్తి పెంచేందుకు, ఎక్కువ సంఖ్యలో హోరాహోరీ సమరాలు చూసేందుకు టెస్టులను.. రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని భావిస్తోంది. టెస్టు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడే మూడు ప్రధాన జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో ఒక శ్రేణి... ఇతర జట్లు కలిపి మరో శ్రేణిలో ఉండే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. దీని అమలు, విధివిధానాలపై ఇంకా స్పష్టత లేకున్నా... ఐసీసీ చైర్మన్‌గా జై షా(Jay Shah) ఎంపికయ్యాక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.సీఏ, ఈసీబీ చైర్మన్లతో చర్చలుఈ అంశంపై చర్చించేందుకు ఈ నెలలోనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ మైక్ బెయిర్డ్, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్లతో జై షా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన భవిష్యత్తు పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2027తో ముగుస్తుంది. ఆ తర్వాతి నుంచి కొత్త విధానాన్ని తీసుకురావాలని ఐసీసీ అనుకుంటోంది. తీవ్రంగా వ్యతిరేకించిన చిన్న జట్లునిజానికి ఇలాంటి ప్రతిపాదన 2016లో వచ్చింది. అయితే ఇలా చేస్తే తమ ఆదాయం కోల్పోవడంతో పాటు పెద్ద జట్లతో తలపడే అవకాశం కూడా చేజారుతుందని జింబాబ్వే, బంగ్లాదేశ్ సహా పలు జట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి.ఈ నేపథ్యంలో ఐసీసీ అప్పట్లో ఈ ఆలోచనను పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఇది ముందుకు వచ్చింది. టాప్–3 జట్ల మధ్యే ఎక్కువ మ్యాచ్‌లు చూడాలని అభిమానులు కోరుకుంటారని, ఆ మ్యాచ్‌లే అత్యంత ఆసక్తికరంగా సాగి టెస్టు క్రికెట్ బతికిస్తాయంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri) తదితరులు ఈ తరహా రెండు శ్రేణుల టెస్టు సిరీస్‌లకు గతంలోనే మద్దతు పలికారు. పెద్ద జట్టు, చిన్న జట్టు మధ్య టెస్టులు జరిగితే ఎవరూ పట్టించుకోరని అతను ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్తాన్ టెస్టుల్లో తొలిసారి ఇలా... బులవాయో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు రెండు టెస్టులతో కూడిన ద్వైపాక్షిక సిరీస్‌ను తొలిసారి దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా అవతల తొలి టెస్టు సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో అఫ్గానిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 205/8తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే అదే స్కోరు వద్ద ఆలౌటైంది.కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (103 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆఖరి రోజు ఆటలో 15 బంతులు ఎదుర్కొన్న జింబాబ్వే ఒక్క పరుగు కూడా జత చేయకుండా రెండు వికెట్లను కోల్పోయింది. ఇరు జట్ల మధ్య భారీ స్కోర్లు నమోదైన తొలి టెస్టు చివరకు ‘డ్రా’ కావడంతో... ఈ విజయంతో అఫ్గానిస్తాన్ 1–0తో టెస్టు సిరీస్ చేజిక్కించుకుంది. కెరీర్ బెస్ట్ (7/66) ప్రదర్శన కనబర్చిన స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 48 పరుగులు చేసిన రషీద్, 11 వికెట్లు పడగొట్టాడు. రహమత్ షాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న అఫ్గానిస్తాన్ జట్టు వన్డే సిరీస్‌ను 2–0తో చేజక్కించుకుంది. ఇప్పుడు టెస్టు సిరీస్ కూడా నెగ్గి... పర్యటనను విజయవంతంగా ముగించింది. ఐసీసీ టెస్టు హోదా సాధించిన అనంతరం 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అఫ్గానిస్తాన్... అందులో నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓవరాల్‌గా అఫ్గానిస్తాన్‌కు ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. తటస్థ వేదికగా 2018–19లో ఐర్లాండ్‌తో భారత్‌లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో గెలిచిన అఫ్గానిస్తాన్ తొలి సిరీస్ కైవసం చేసుకోగా... 2019లో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులోనూ నెగ్గి అఫ్గానిస్తాన్ సిరీస్ పట్టేసింది. ఈ రెండు ఆసియాలో జరగ్గా... ఇప్పుడు తొలిసారి జింబాబ్వే గడ్డపై అఫ్గాన్ టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. 2020–21లో అఫ్గానిస్తాన్, జింబాబ్వే మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1–1తో ‘డ్రా’ గా ముగిసింది. చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
అత్యుత్తమ టెస్టు జట్టు కెప్టెన్‌గా బుమ్రా.. భారత్ నుంచి మరొకరికి చోటు
క్రికెట్ ఆస్ట్రేలియా 2024 ఏడాదికి గానూ అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టు( Cricket Australia's Test team of 2024)ను ప్రకటించింది. ఈ టీమ్‌కు టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను కెప్టెన్‌గా ఎంచుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. కేవలం ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రమే చోటిచ్చింది.భారత్ నుంచి మరొకరికి చోటుకాగా 2024లో టెస్టుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లతో సీఏ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఉండగా.. జో రూట్(Joe Root) వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు.లంక ఆటగాడికి స్థానంఇక నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర.. వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ తార హ్యారీ బ్రూక్, శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్ కోటాలో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ క్యారీ స్థానం సంపాదించగా.. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, భారత స్టార్ బుమ్రా, ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఎంపికయ్యారు. ఏకైక స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా 2024కు గానూ ఎంచుకున్న అత్యుత్తమ టెస్టు జట్టుయశస్వి జైస్వాల్(భారత్), బెన్ డకెట్(ఇంగ్లండ్), జో రూట్(ఇంగ్లండ్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్(శ్రీలంక), అలెక్స్ క్యారీ(ఆస్ట్రేలియా), మ్యాచ్ హెన్రీ(న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్- భారత్), జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా).2024లో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే?యశస్వి జైస్వాల్ఈ ఏడాదిలో 15 టెస్టులాడి 1478 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉనఆయి. అత్యధిక స్కోరు 214బెన్ డకెట్బెన్ డకెట్ 2024లో 17 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1149 రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 153.జో రూట్ఇంగ్లండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఈ సంవత్సరం 17 టెస్టుల్లో ఆడి 1556 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఆరు శతకాలు, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 262.రచిన్ రవీంద్రకివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ఈ ఏడాది 12 టెస్టు మ్యాచ్‌లలో కలిపి.. 984 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు: 249.హ్యారీ బ్రూక్ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2024లో 12 టెస్టుల్లో కలిపి 1100 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. అత్యధిక స్కోరు 317.కమిందు మెండిస్శ్రీలంక తరఫున ఈ ఏడాది అద్భుత ఫామ్ కనబరిచిన కమిందు మెండిస్ 9 టెస్టులు ఆడి.. 1049 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. హయ్యస్ట్ స్కోరు: 182.అలెక్స్ క్యారీఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 2024లో తొమ్మిది టెస్టులు ఆడాడు. 42 డిస్మిసల్స్లో భాగం కావడంతో పాటు.. నాలుగు స్టంపౌట్లు చేశాడు. అదే విధంగా.. మూడు అర్ధ శతకాల సాయంతో 440 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98.మ్యాట్ హెన్రీకివీస్ పేసర్ మ్యాచ్ హెన్రీ ఈ ఏడాది తొమ్మిది టెస్టులాడి 48 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 7-67.జస్ప్రీత్ బుమ్రాటీమిండియా వైస్ కెప్టెన్ 2024లో పదమూడు టెస్టు మ్యాచ్‌లు ఆడి ఏకంగా 71 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 6-45. భారత్ తరఫున అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరిన ఫాస్ట్‌బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆసీస్‌తో తొలి టెస్టుకు సారథ్యం వహించి.. భారత్‌ను 275 పరుగుల తేడాతో గెలిపించాడు. జోష్ హాజిల్వుడ్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ సంవత్సరం 15 టెస్టు మ్యాచ్‌లలో కలిపి 35 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5-31.కేశవ్ మహరాజ్సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ ఏడాది 15 టెస్టుల్లో పాల్గొని 35 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5-59. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో సౌతాఫ్రికా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
Champions Trophy 2025: ఐసీసీ అధికారిక ప్రకటన.. ఇకపై
చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించింది. అదే విధంగా.. ఇకపై భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా పాకిస్తాన్ అక్కడ పర్యటించబోదని తెలిపింది. కాగా వచ్చే ఏడాది జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును పాక్‌కు పంపే ప్రసక్తి లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐసీసీకి తేల్చి చెప్పింది. తాము టోర్నీలో పాల్గొనాలంటే తటస్థ వేదికల(హైబ్రిడ్ విధానం)పై టీమిండియా మ్యాచ్‌లను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తొలుత ఇందుకు అంగీకరించలేదు.షరతులు విధించిన పీసీబీఅనేక చర్చలు, ఐసీసీ గట్టిగా హెచ్చరించిన అనంతరం పీసీబీ ఎట్టకేలకు పంతం వీడింది. అయితే, ఇకపై భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా హాజరుకాబోమని.. తమకు కూడా తటస్థ వేదికలు ఏర్పాటు చేయాలని షరతు విధించినట్లు వార్తలు వచ్చాయి. ఐసీసీ తాజా ప్రకటనను బట్టి ఆ ఊహాగానాలు నిజమని తేలాయి.ఆ టోర్నీలన్నింటికి ఇదే నిబంధనఇకపై భారత్- పాకిస్తాన్లలో ఐసీసీ టోర్నమెంట్లు జరిగినపుడు హైబ్రిడ్ విధానాన్ని పాటిస్తామని గురువారం తెలిపింది. అంటే.. ఇరుజట్లు తమ దాయాది దేశాల్లో ఇకపై ఆడబోవని స్పష్టం చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025(పాకిస్తాన్)తో పాటు మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ 2025(భారత్), పురుషుల టీ20 ప్రపంచకప్ 2026(భారత్- శ్రీలంక) టోర్నీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.ఆస్ట్రేలియాలో మహిళల టోర్నమెంట్లుఅంతేకాదు.. మహిళల టీ20 ప్రపంచకప్ 2028 ఆతిథ్య హక్కులను కూడా పాకిస్తాన్ దక్కించుకుందని ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది. దీనిని కూడా హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహిస్తామని పేర్కొంది. ఇక 2029- 2031 మధ్య మహిళల సీనియర్ జట్లకు సంబంధించిన అన్ని ఐసీసీ టోర్నీలకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ తెలిపింది.కాగా హైబ్రిడ్ విధానంలో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ-2025కి టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. మరోవైపు.. పాకిస్తాన్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ టోర్నీలో అడుగుపెట్టింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి ఈ అవకాశం దక్కించుకుంది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇక ఈ టోర్నీకి సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది.చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు -
టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరో 12 రోజుల్లో తెరలేవనుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షురూ కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టుకు 13 సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టులో ఇద్దరు ఆన్క్యాప్డ్ ప్లేయర్లు నాథన్ మెక్‌స్వీనీ, జోష్ ఇంగ్లిష్‌లకు చోటు దక్కింది. తొలి టెస్టుకు మైఖల్ నసీర్ గాయం కారణంగా దూరమయ్యాడు. భారత్-ఎ జట్టుతో జరిగిన రెండో అనాధికారిక టెస్టులో నసీర్ గాయపడ్డాడు.ఓపెనర్‌గా నాథన్ మెక్‌స్వీనీ..భారత్-ఎ జట్టుతో జరిగిన సిరీస్‌లో నాథన్ మెక్‌స్వీనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.రెండు మ్యాచ్‌ల్లోనూ మెక్‌స్వీనీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. పెర్త్ టెస్టులో ఉస్మాన్ ఖవాజాతో కలిసి మెక్‌స్వీనీ ఓపెనింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.జోష్ ఇంగ్లిష్ కూడా ఇటీవల కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల జట్టులో కీలక సభ్యునిగా ఉన్న ఇంగ్లిష్.. ఇప్పుడు క్యారీకి బ్యాకప్‌గా చోటు సంపాదించుకున్నాడు.పెర్త్ టెస్టుకు ఆసీస్ జట్టు: స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్చదవండి: ‘పాకిస్తాన్లో ఆడేదే లేదు’ -
భారత క్రికెటర్లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. అంపైర్‌పై కిషన్ ఫైర్?
మెక్కే వేదికగా ఆ్రస్టేలియా ‘ఎ’ తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ‘ఎ’ ఓటమి పాలైంది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో హైడ్రామా చోటు చేసుకుంది. టీమిండియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఇదే విషయంపై భారత జట్టును అంపైర్ బెన్ ట్రెలోర్, షవాన్ క్రెగ్లు మందలించారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు సైతం తాము ఏ తప్పు చేయలేదని అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఫీల్డ్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.అసలేం జరిగిందంటే?ఆఖరి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఎ విజయానికి 86 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్లు మెక్‌స్వీనీ, బ్యూ వెబ్‌స్టర్ భారత ప్లేయర్లు ఫీల్డ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో అంపైర్ షాన్ క్రెయిగ్ భారత జట్టుకు కొత్త బంతిని అందించాడు.అయితే బంతిని మార్చడంపై భారత ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారు. 'మీరు బంతిని స్క్రాచ్ చేశారు. కాబట్టి మేం బాల్‌ను మార్చాం. దీనిపై ఇక ఎలాంటి చర్చ లేదు. ఆట కొనసాగించండి' అంటూ అంపైర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదంతా స్టంప్ మైక్రోఫోన్లో రికార్డు అయింది. అయితే అంపైర్ వ్యాఖ్యలకు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఘాటుగా బదులిచ్చాడు. "మేము ఏమీ చేయలేదు. మీ నిర్ణయం అత్యంత మూర్ఖత్వం’’ అని అన్నాడు. ఈ క్రమంలో కిషన్‌పై అంపైర్ అగ్రహం వ్యక్తం చేశాడు. మీపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇది మంచి పద్దతి కాదు. మీ జట్టు చేసిన పనికి బంతిని మార్చాం'' అని అంపైర్ పేర్కొన్నాడు.క్లారిటీ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇక ఈవివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. భారత ఆటగాళ్లు ఎవరూ ఎటువంటి బాల్ టాంపరింగ్ పాల్పడలేదు. పూర్తిగా దెబ్బతిన్నడం వల్లనే బంతిని మార్చాల్సి వచ్చింది. ఈ విషయం నాలుగో రోజు ఆటకు ముందే ఇరు జట్ల కెప్టెన్, మేనేజర్‌కు తెలియజేశారు. ఈ వివాదంపై తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకోబడవు" అని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.చదవండి: IND vs NZ: ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్.. అసలు ఆ షాట్ అవసరమా? వీడియో -
2027 వరకు హెడ్ కోచ్‌గా అతడే.. సీఏ ప్రకటన
ఆస్ట్రేలియా పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు పొడిగింపు ఇచ్చారు. 2027 సీజన్ ముగిసేదాకా మెక్డొనాల్డే హెడ్ కోచ్‌గా కొనసాగుతాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ప్రకటించింది. అంటే దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచకప్ దాకా మెక్‌డొనాల్డ్ ఆసీస్ జట్టుతో ఉంటాడు. జస్టిన్ లాంగర్ తప్పుకోవడంతో 2022లో మెక్‌డొనాల్డ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు.డబ్ల్యూటీసీతో పాటు వన్డే వరల్డ్ కప్మెక్డొనాల్డ్ కోచింగ్‌లోనే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సాధించింది. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌నూ కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునే లక్ష్యంతోనే ఆయన పదవీకాలాన్ని పొడిగించినట్లు తెలిసింది.అందుకే పొడిగించాంఈ లోపే వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో మెక్‌డొనాల్డ్‌పై సీఏ మరోసారి నమ్మకం ఉంచింది. హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్ ఇప్పటికే నిరూపించుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ అన్నారు. జట్టు నిలకడైన విజయాల్లో మెక్‌డొనాల్డ్ కీలకపాత్ర పోషిస్తున్నాడని, దీంతో కోచింగ్ బృందాన్ని మరింత పటిష్ట పరిచేందుకే పొడిగింపు ఇచ్చామని హాక్లీ తెలిపారు. ఇక.. తనకు లభించిన పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన మెక్‌డొనాల్డ్.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తానని చెప్పారు. చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ -
మహిళా క్రికెటర్‌తో ‘బంధం’.. శ్రీలంక మాజీ ప్లేయర్‌కు భారీ షాక్!
శ్రీలంక మాజీ క్రికెటర్ దులిప్ సమరవీరకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలో కోచ్‌గా పనిచేస్తున్న అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 20 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా.. రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయిలోనూ అతను పనిచేయడానికి వీలుండదు. ప్రస్తుతం విక్టోరియా రాష్ట్ర మహిళల జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్న సమరవీర.. ఓ మహిళా క్రికెటర్‌తో బలవంతంగా సంబంధం పెట్టుకోవడంపై సీఏ కన్నెర్ర చేసింది. అంతేకాదు.. సమరవీర తీవ్రమైన అతిక్రమణకు పాల్పడ్డాడని ఆగ్రహించింది. ఇది సీఏ నియమావళికి విరుద్ధమని, క్రికెట్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను అసీస్ బోర్డు ఉపేక్షించదని ఒక ప్రకటనలో పేర్కొంది. 2008 నుంచి ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో కాగా సమరవీర 1993–1995 మధ్య కాలంలో శ్రీలంక తరఫున ఏడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. తదనంతరం 2008లో ఆస్ట్రేలియాలో కోచింగ్ బృందంలో చేరాడు. మొదట క్రికెట్ విక్టోరియా మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. సుదీర్ఘకాలం పాటు విక్టోరియా జట్టుకు సేవలందించాడు. అదే విధంగా.. మహిళల బిగ్‌బాష్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. రెండు వారాల క్రితం విక్టోరియా సీనియర్ మహిళల జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమించారు. కానీ ఓ మహిళా క్రికెటర్‌తో పెట్టుకున్న అనుచిత సంబంధం ఆస్ట్రేలియాతో బంధాన్నే తెగదెంపులు చేసింది. నిషేధం కారణంగా.. అతడు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయి జట్టుకు, లీగ్‌లకు, అకాడమీకి, బోర్డుకు పనిచేయడానికి వీలుండదు. చదవండి: రూ. 45 లక్షలు ఇస్తేనే భారత్‌కు ఆడతా.. కారణం చెప్పిన నగాల్ -
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో దుమ్ములేపిన యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెగర్క్‌తో పాటు మరో క్రికెటర్ వరల్డ్‌కప్ జట్టుతో ప్రయాణించనున్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ట్రావెలింగ్ రిజర్వ్స్‌గా ఇద్దరు బ్యాటర్లను ఎంపిక చేసింది. జేక్ ఫ్రేజర్- మెగర్క్‌తో మాథ్యూ షార్ట్‌కు కూడా అవకాశం ఇచ్చింది.స్టీవ్ స్మిత్‌తో పాటు వాళ్లకు మొండిచేయిఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంగాల ఆశలకు గండిపడినట్లయింది. కాగా ఈసారి వరల్డ్‌కప్‌లో మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా ఒమన్‌తో తలపడనుంది.దుమ్ములేపిన మెగర్క్ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జేక్ ఫ్రేజర్-మెగర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. లుంగి ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 330 పరుగులు సాధించాడు.ఈ ఓపెనింగ్ బ్యాటర్ స్ట్రైక్‌రేటు ఏకంగా 234.04 ఉండటం విశేషం. ఇక ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న మెగర్క్.. 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో కూడా స్థానం సంపాదించుకునే అర్హతలు కలిగి ఉన్నా సీనియర్లు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు.అందుకే ఇలా జరిగిందిఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో జేక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్ జట్టు ఫైనల్ 15 కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేశాడు.ఇక మాథ్యూ షార్ట్ సైతం బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అయితే, వీరిద్దరు టాపార్డర్ బ్యాటర్లు కావడం వల్లే మొదటి 15 మంది సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కలేదు’’ అని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.చదవండి: శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు! -
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కొనసాగనున్నారు. మిచ్ మార్ష్‌తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా వరల్డ్‌కప్ విన్నర్లతో..క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం. -
స్టోయినిస్‌కు మొండిచెయ్యి.. కొత్తగా నలుగురికి అవకాశం
2024-25 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన 23 మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (మార్చి 28) ప్రకటించింది. ఈ జాబితాలో లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మార్కస్ స్టోయినిస్, ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కలేదు. వీరితో పాటు ఆస్టన్ అగర్, మార్కస్ హ్యారిస్, మైకేల్ నెసర్, మ్యాట్ రెన్షాలకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ లభించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా నలుగురు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ కల్పించింది. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మ్యాట్ షార్ట్, ఆరోన్ హార్డీ కొత్తగా కాంట్రాక్ట్ పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బార్ట్లెట్ తొలిసారి కాంట్రాక్ట్ పొందగా.. మిగతా ముగ్గురు గతంలో వార్షిక కాంట్రాక్ట్ పొందారు. ఈ వార్షిక కాంట్రాక్ట్ టీ20 వరల్డ్‌కప్ అనంతరం అమల్లోకి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా 2024-25: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, జే రిచర్డ్సన్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
T20I: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన
ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. ఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఏడాది ఆగష్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసీస్- అఫ్గన్ మధ్య సిరీస్ జరగాల్సి ఉంది. అఫ్గనిస్తాన్‌లో పరిస్థితుల దృష్ట్యా యూఏఈలో అఫ్గన్ ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. కారణం ఇదే ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గన్ ప్రభుత్వం మహిళలు, బాలికల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందన్న కారణంతో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా 2021లోనూ సీఏ ఇదే కారణంతో ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టును రద్దు చేసింది. అఫ్గనిస్తాన్‌లో రోజురోజుకూ బాలికలు, మహిళల పరిస్థితి దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా అఫ్గన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలికలు హైస్కూల్‌కు వెళ్లకుండా, మహిళలు ఉన్నత విద్యనభ్యసించకుండా, ఉద్యోగాలు చేయకుండా కఠిన నిబంధనలు విధించిందనే వార్తల నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన అండర్-19 వుమెన్ టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్‌కు ఫుల్ మెంబర్ జట్లలో అఫ్గనిస్తాన్(మహిళలు క్రికెట్ ఆడకూడదనే నిబంధన) ఒక్కటే హాజరు కాలేదు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించామన్న క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చివరగా అప్పుడే కాగా చివరగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ తలపడ్డాయి. ఇందులో గ్లెన్ మాక్స్వెల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో మూడు వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్ క్రికెట్ బోర్డు పరిస్థితిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి సీఈఓ గాఫ్ అలార్డిస్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఫుల్ మెంబర్‌కు తాము మద్దతుగా నిలవకతప్పదని పేర్కొన్నారు. చదవండి: Rohit Sharma: రోహిత్ క్రీజులో ఉన్నంతవరకే ముంబైకి మా మద్దతు! వీడియో An update to our Aussie men's team schedule ⬇️ CA will continue its commitment to the participation of women and girls cricket around the world and will work closely with the ICC and the Afghanistan Cricket Board to resume bilateral matches in the future. pic.twitter.com/OIO5PLjle5 — Cricket Australia (@CricketAus) March 19, 2024 -
పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్వెల్..
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ గ్లెన్ మాక్స్వెల్ ఓ వివాదంలో చికుకున్నాడు. జనవరి 19న ఆసీస్ క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్న ‘‘సిక్స్ అండ్ అవుట్’’ బ్యాండ్ అడిలైడ్‌లో ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అనుమతి లేకుండానే మాక్స్వెల్ పాల్గోనున్నాడు. అంతేకాకుండా ఫుల్‌గా తాగి ఆసుపత్రి పాలయ్యాడు. పీకల దాగా తాగిన మాక్స్వెల్ పబ్‌లోనే సోయలేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కాగా ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది. అయితే తాజాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ప్రకటించిన ఆసీస్ జట్టులో మాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. విండీస్‌తో టీ20ల దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇచ్చారు. అంతే తప్ప అతడిని జట్టు నుంచి తప్పించడానికి పబ్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు మాక్స్వెల్ కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే జట్టును ఫైనల్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో మెల్బోర్న్ కెప్టెన్సీ నుంచి మాక్సీ తప్పుకున్నాడు. చదవండి: SA20 2024: జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే.. కట్‌చేస్తే.. 52 పరుగులకే ఆలౌట్! -
డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్.. మార్ష్‌కు ప్రమోషన్! ఏకంగా రూ.6 కోట్లు
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా మార్ష్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో మార్ష్‌కు ప్రమోషన్ ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఏడాది గాను మార్స్‌కు టాప్ సెంట్రాల్ కాంట్రక్ట్ ఇచ్చి భారీగా అతడి జీతాన్ని పెంచాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మార్ష్ ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో మిడిల్ టైర్లో ఉన్నాడు. అయితే టాప్ టైర్లో ఉన్న ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులకోవడంతో.. మార్ష్ ప్రమోషన్ దాదాపు ఖాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అతడు టాప్ టైర్ కాంట్రాక్ట్‌కు ప్రమోషన్ పొందితే.. అతడు 5 లక్షల యూఎస్ డాలర్ల నుంచి 8 లక్షల యూఎస్ డాలర్ల వరకు వార్షిక వేతనం పొందే అవకాశముంది. అంటే భారత కరెన్సీలో సూమారు రూ. 4 కోట్ల నుంచి 7 కోట్ల వరకు అందనుంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అత్యధిక వేతనాన్ని పొందుతున్నాడు. అతడికి జీతం రూపంలో క్రికెట్ ఆస్ట్రేలియా 2 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ.16 కోట్లు) చెల్లిస్తోంది. -
బీసీసీఐ అదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆస్ట్రేలియా కంటే 28 రేట్లు ఎక్కువ!
బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా).. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ప్రపంచక్రికెట్లో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్ బోర్డు కొనసాగిస్తోంది. ప్రతీ ఏటా తమ నికర అదాయాన్ని బీసీసీఐ పెంచుకుంటూ పోతుంది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం బీసీసీఐ నెట్ వర్త్ 2.25 బిలియన్ డాలర్లు (రూ.18760 కోట్లు). కాగా ఇతర ఏ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ దారిదాపుల్లో లేదు. భారత క్రికెట్ బోర్డు తర్వాత రెండో స్ధానంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక అదాయం 79 మిలియన్ డాలర్లు(రూ. 660 కోట్లు). అంటే ఆసీస్ క్రికెట్ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రేట్లు అధికంగా ఉంది. ఇక ఈ జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఉంది. ఈసీబీ నెట్‌వర్త్ 59 మిలియన్ డాలర్లు(సుమారు రూ.490 కోట్లు). బీసీసీఐకి అదాయం ఎలా అంటే? బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను, టోర్నమెంట్ నిర్వహణ, క్రికెట్ ఆసోషియేషన్‌లకు నిధుల రిలీజ్ చేయడం వంటివి చూసుకుంటాయి. బోర్డులకు మీడియా రైట్స్, స్పాన్సర్ షిప్‌ల రూపంలో అదాయాన్ని పొందుతాయి. కాగా ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ బోర్డు ఆర్థిక వృద్ధి బాగా పెరిగింది. ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా అర్జిస్తోంది. 2023-27 కాలానికి గాను ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి రూ. 48,390.32 కోట్లు చెల్లించాయి. వరల్డ్‌కప్ ద్వారా భారీ అదాయం.. వన్డే వరల్డ్‌కప్-2023కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి.. భారత అర్ధిక వ్యవస్ధపై మాత్రం కాసుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఎకమోనిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. రూ. 22,000 కోట్లు భారత అర్ధిక వ్యవస్ధలోకి వచ్చినట్లు సమాచారం. చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్.. సౌతాఫ్రికాకు ఊహించని షాక్! ఇక అంతే సంగతి -
భారత్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. స్టార్ ఆటగాళ్లంతా ఇంటికి
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో ఆరుగురు స్వదేశానికి బయల్దేరతారని వెల్లడించింది. వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టోయినిస్, ఇంగ్లిస్, సీన్ అబాట్‌లకు విశ్రాంతినిస్తున్నట్లు పేర్కొంది. వీరిలో స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా రెండో టీ20 ముగిసిన అనంతరమే స్వదేశానికి బయల్దేరగా.. మిగతా నలుగురు ఇవాళ మ్యాచ్ (మూడో టీ20) అనంతరం స్వదేశానికి బయల్దేరతారని ప్రకటించింది. ఈ ఆరుగురికి ప్రత్యామ్నాయంగా క్రికెట్ ఆస్ట్రేలియా నలుగురు ఆటగాళ్లను ప్రకటించింది. వీరిలో జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్ ఇదివరకే భారత్‌కు చేరుకోగా.. బెన్ డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్‌లు నాలుగో టీ20 సమయానికంతా జట్టులో చేరతారని వెల్లడించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. ఆసీస్ జట్టులో స్టార్ ఆటగాళ్లు మిస్ కానుండటంతో ఈ సిరీస్ ఇకపై కల తప్పనుంది. భారత్ జట్టులోని స్టార్ ఆటగాళ్లు సైతం వరల్డ్‌కప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. భారత్‌తో టీ20 సిరీస్‌కు అప్డేట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. మాథ్యూ వేడ్ (కెప్టెన్), బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, కేన్ రిచర్డ్సన్ -
వరల్డ్‌కప్ అత్యుత్తమ జట్టు ఇదే.. కెప్టెన్‌గా కోహ్లి! రోహిత్‌కు నో ఛాన్స్
వన్డే ప్రపంచకప్-2023 తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా నవంబర్ 12న బెంగళూరు వేదికగా జరిగిన భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌తో లీగ్ స్టేజి ముగిసింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అద్బుతమైన సెంచరీతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్(128 నాటౌట్)కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీ లీగ్ దశలో ప్రదర్శన ఆధారంగా 12 మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో కోహ్లి దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో 594 పరుగులు చేసిన విరాట్.. టోర్నీ టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్ ఎంపికయ్యారు. అదే విధంగా మూడో స్ధానంలో కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, నాలుగో స్ధానంలో విరాట్ కోహ్లికి చోటు దక్కింది. ఐదవ స్ధానంలో ప్రోటీస్ ఆటగాడు మార్క్రమ్కు స్ధానం లభించింది. ఇక ఆల్‌రౌండ్ కోటాలో గ్లెన్ మాక్స్వెల్, మార్కో జానెసన్, రవీంద్ర జడేజాకు క్రికెట్ ఆస్ట్రేలియా చోటిచ్చింది. ఫాస్ట బౌలర్ల కోటాలో షమీ, బుమ్రా, మధుషంక ఉన్నారు. అదే విధంగా ఈ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడమ్ జంపాకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అవకాశమిచ్చింది. అయితే ఈ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్‌ను క్రికెట్ పరిగణలోకి తీసుకోకపోవడం గమానార్హం. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన వరల్డ్‌కప్ అత్యుత్తమ జట్టు ఇదే 1.క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్) (591 పరుగులు) 2.డేవిడ్ వార్నర్ (499 పరుగులు) 3.రచిన్ రవీంద్ర (565 పరుగులు, 5 వికెట్లు) 4.విరాట్ కోహ్లీ (కెప్టెన్) (594 పరుగులతో పాటు ఒక్క వికెట్) 5.ఐడెన్ మార్క్రామ్ (396 పరుగులు) 6.గ్లెన్ మాక్స్వెల్ (396 పరుగులు, 5 వికెట్లు) 7.మార్కో జాన్సెన్ (157 పరుగులతో పాటు 17 వికెట్లు) 8.రవీంద్ర జడేజా (111 పరుగులతో పాటు 17 వికెట్లు) 9.మహ్మద్ షమీ (17 వికెట్లు) 10.ఆడమ్ జంపా (22 వికెట్లు) 11.జస్ప్రీత్ బుమ్రా (17 వికెట్లు) 12.దిల్షాన్ మధుశంక (12వ ఆటగాడు) (21 వికెట్లు) -
వరల్డ్‌కప్ జట్టును అధికారికంగా ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఒక్క మార్పు
క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ 2023లో పాల్గొనే తమ జట్టును కొద్దిసేపటి కిందట అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో ఊహించిన విధంగానే గాయం నుంచి పూర్తి కోలుకోని ఆస్టన్ అగర్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో మార్నస్ లబూషేన్ జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుంటున్న ట్రవిస్ హెడ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మిగతా జట్టంతా ముందుగా ప్రకటించిన విధంగా యథాతథంగా కొనసాగుతుంది. Australia, here's your squad to take on the ODI World Cup in India starting on October 8! Congratulations to all players selected 👏 #CWC23 pic.twitter.com/xZAY8TYmcl — Cricket Australia (@CricketAus) September 28, 2023 కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా కొద్ది రోజుల కిందట తమ వరల్డ్‌కప్ ప్రొవిజనల్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళ (సెప్టెంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో సీఏ ఓ మార్పు చేసింది. ప్రొవిజనల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన లబూషేన్ ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి, గాయపడిన అగర్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆసీస్.. టీమిండియాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 3న పాకిస్తాన్‌తో కమిన్స్ సేన తలపడుతుంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే ఆస్ట్రేలియా జట్టు ఇదే: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ -
ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ జట్టులో కీలక పరిణామం
ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయం కారణంగా ప్రపంచకప్ తొలి భాగానికి దూరమవుతాడనుకున్న ట్రవిస్ హెడ్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు తెలుస్తుంది. హెడ్ స్థానంలో ప్రపంచకప్ జట్టులోకి వస్తాడనుకున్న మార్నస్ లబూషేన్ ఇతర ఆటగాడి రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక కానున్నట్లు సమాచారం. ఆసీస్ ప్రొవిజనల్ జట్టులో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ కాలి కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో లబూషేన్ ఆసీస్ వరల్డ్‌కప్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తుంది. తొలుత అగర్‌కు రీప్లేస్‌మెంట్‌గా మాథ్యూ షార్ట్ లేదా తన్వీర్ సంగాను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే టీమిండియాతో ఆఖరి వన్డేలో మ్యాక్స్‌వెల్ బంతితో రాణించడంతో (4 వికెట్లు) స్పిన్నర్‌కు బదులు ప్రొఫెషనల్ బ్యాటర్‌ను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే క్రికెట్ ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ప్రకటించకపోగా.. లబూషేన్‌ను అగర్ స్థానంలో జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది. అగర్ స్థానంలో వరల్డ్‌కప్ జట్టులోకి వస్తామని కలలు కన్న మాథ్యూ షార్ట్, తన్వీర్ సంగాకు ఈ ఊహించని పరిణామంతో నిరాశే ఎదురైంది. మ్యాక్స్‌వెల్ స్పిన్నర్‌గా రాణించి ఈ ఇద్దరి ఆశలను అడియాసలు చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ స్థానాన్ని మ్యాక్సీ భర్తీ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా నమ్మకంగా ఉంది. పై పేర్కొన్న మార్పులకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడనున్న విషయం తెలిసిందే. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆసీస్.. టీమిండియాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 3న పాకిస్తాన్‌తో కమిన్స్ సేన తలపడుతుంది. వరల్డ్‌కప్ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా టీమ్: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ -
క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ప్రతి ఆస్ట్రేలియా ఆటగాడు (దేశవాలీ, అంతర్జాతీయ ఆటగాళ్లు) నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్‌తో బ్యాటింగ్‌కు దిగడం తప్పనిసరి చేసింది. ఇటీవలికాలంలో బ్యాటర్లు తరుచూ ఫాస్ట్ బౌలింగ్‌లో గాయపడుతుండటంతో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. సీఏ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది ఆసీస్ క్రికెటర్లు తమ మునుపటి ప్రాక్టీస్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ తదితరులు నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడరు. సీఏ తాజా నిర్ణయంతో వీరంతా తప్పనిసరిగా మెడ భాగం సురక్షితంగా ఉండేలా హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. కాగా, నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఫిలిప్ హ్యూస్ మరణాంతరం (2012) ప్రత్యేకంగా తయారు చేయించింది. హ్యూస్ ఈ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోయే వాడు కాదు. 2019 యాషెస్ సిరీస్‌లో ఇంచుమించు ఇలాంటి ప్రమాదమే మరొకటి సంభవించి ఉండేది. నాడు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ స్టీవ్ స్మిత్‌ను మెడ భాగంలో బలంగా తాకింది. అంత జరిగాక కూడా స్మిత్ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడే వాడు కాదు. ఇది ధరిస్తే అతని హార్ట్ బీట్ అమాంతంగా పెరుగుతుందని అతను చెప్పుకొచ్చేవాడు. వార్నర్ సైతం నెక్ ప్రొటెక్టర్ ధరిస్తే, అది తన మెడలోకి చొచ్చుకుపోయేదని చెప్పి తప్పించుకునే వాడు. సీఏ తాజా నిర్ణయంతో వీరు కారణాలు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న సిరీస్ సందర్భంగా రబాడ వేసిన ఓ రాకాసి బౌన్సర్ కెమారూన్ గ్రీన్ మెడ భాగంలో బలంగా తాకింది. అయితే అతను ఈ నెక్ ప్రొటెక్టర్ ఉండటంతో బ్రతికి బయటపడ్డాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే క్రికెట్ ఆస్ట్రేలియా నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మరోవైపు స్వదేశంలోనూ బౌన్సీ పిచ్‌లు ఎక్కువగా ఉండటంతో దేశవాలీ క్రికెటర్లు కూడా ముందు జాగ్రత్తగా ఈ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించి బ్యాటింగ్‌కు దిగాలని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన జారీ చేసింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జాతీయ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆసీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్ అనంతరం ఆసీస్ సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు టీమిండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. తదనంతరం అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. -
ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఆసీస్ జట్టుకు నేరుగా గెలవడం చేతగాక ఇలా చీటింగ్ చేసి గెలవాలని చూసిందంటూ ఇంగ్లండ్ అభిమానులు ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. నిజానికి బెయిర్ స్టో ఔట్ సరైనదే. బంతి డెడ్ కాకముందే క్రీజులో నుంచి బయటికి వెళ్లి మాట్లాడడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ వికెట్ల వైపు బంతిని వేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అయితే దీన్ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా పేర్కొంటూ ఆస్ట్రేలియా టీమ్‌పై విమర్శలు చేశారు ఇంగ్లీష్ అభిమానులు. ఐదో రోజు మొదటి సెషన్ ముగిసిన అనంతరం లార్డ్స్ లాంగ్ రూమ్‌లో ఉన్న కొందరు ఎంసీసీ సభ్యులు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లను బూతులు తిట్టారు. వీరితో ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ వాగ్వాదానికి దిగారు. సాధారణంగా మిగిలిన క్రికెట్ గ్రౌండ్లో క్రికెటర్లు, డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లే దారిలో వేరే వాళ్లు ఉండడానికి, కూర్చోవడానికి అవకాశం ఉండదు. అయిలే లార్డ్స్‌లో మాత్రం లాంగ్ రూమ్ పేరుతో ఎంసీసీ సభ్యుల కోసం ఓ లాంగ్ రూమ్ ఉంటుంది. ఇందులో మెర్లీబోన్ క్రికెట్ క్లబ్, మిడిల్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. వీళ్లు వీవీఐపీల హోదాల లాంగ్ రూమ్‌లో కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచే ఇరుజట్ల క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కొంతమంది ప్రతినిధులు ఉస్మాన్ ఖవాజాతో గొడవపడ్డారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ ప్రతినిధులను వారించాల్సింది పోయి ఉస్మాన్ ఖవాజాను బలవంతంగా తోసేశారు. ఆ తర్వాత వార్నర్‌ను కూడా టార్గెట్ చేయడంతో తాను కూడా ఏం తగ్గలేదు. అయితే వివాదం మరింత ముదురుతుందేమోనని సెక్యూరిటీ వచ్చి వార్నర్‌ను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. దీనిపై ఉస్మాన్ ఖవాజా స్పందించాడు. ''ఇది నిజంగా చాలా నిరుత్సాహపరిచింది. వాళ్లు మమ్మల్ని బూతులు తిట్టారు. ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. అందుకే నేను వాళ్లను నిలదీశా.. వాళ్లలో కొందరు మాపై నిందలు వేశారు. ఇది మమ్మల్ని అవమానించడమే.. ఎంసీసీ మెంబర్స్ నుంచి ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు'' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంసీసీ ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ కోరుతూ బహిరంగ లేఖను విడుదల చేసింది.''ఆస్ట్రేలియా క్రికెట్‌కు, ఉస్మాన్ ఖవాజా, వార్నర్‌లకు క్షమాపణలు. అమర్యాదగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దురుసుగా ప్రవర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.గ్రౌండ్లో జరిగిన విషయాన్ని నిలదీస్తే అధికారం బయటివాళ్లకు లేదు. అది వాళ్లకు సంబంధం లేని విషయం.'' అంటూ ప్రకటన విడుదల చేసింది. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 MCC Statement.#Ashes pic.twitter.com/fWYdzx1uhD — Marylebone Cricket Club (@MCCOfficial) July 2, 2023 జరిగింది ఇదీ.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని వదిలేసిన జానీ బెయిర్‌స్టో, ఓవర్ అయిపోయిందని భావించి కీపర్ వైపు చూడకుండానే ముందుకు వచ్చేశాడు. జానీ బెయిర్‌స్టో క్రీజు దాటడాన్ని గమనించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, వికెట్లవైపు త్రో వేశాడు. అది తగలడంతో ఆస్ట్రేలియా వికెట్ కోసం అప్పీల్ చేసింది. రన్ తీయాలనే ఉద్దేశంతో జానీ బెయిర్‌స్టో క్రీజు దాటలేదు. ఓవర్ అయిపోయిందని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో మాట్లాడాలని ముందుకు నడుచుకుంటూ వచ్చేశాడు. వెనకాల ఏం జరిగిందో కూడా తెలియని జానీ బెయిర్‌స్టో, అవుట్ కోసం అప్పీల్ చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక తెల్లమొహం వేశాడు. థర్డ్ అంపైర్ ఔట్ అని ఇవ్వడంతో చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్.. ఇకపై కష్టమే..!
5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన (కాలు బెణికింది) వారి తురుపు ముక్క, స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ సిరీస్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. లయోన్ లేని లోటు ఆసీస్‌కు ఎదరుదెబ్బగా పరిగణించబడుతుంది. లయోన్ స్థానంలో సీఏ ఎవరిని కొత్తగా ఎంపిక చేయలేదు. మూడో టెస్ట్‌కు లయోన్ స్థానంలో టాడ్ మర్ఫీ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మర్ఫీ ప్రతిభను (4 టెస్ట్‌ల్లో 14 వికెట్లు) పరిగణలోకి తీసుకుని సీఏ అతనివైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన మర్ఫీ.. ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. ఆసీస్-ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్ట్ హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి మొదలు కానుంది. కాగా, రెండో టెస్ట్, రెండో రోజు ఆటలో బెన్ డకెట్ క్యాచ్ అందుకోబోతూ నాథన్ లయోన్ కాలు బెణికింది. యాదృచ్చికంగా ఈ మ్యాచ్ లయోన్‌కు తన కెరీర్లో వరుసగా వందో టెస్ట్ మ్యాచ్. గాయపడిన అనంతరం లయోన్ బరిలోకి దిగనప్పటికీ..నాలుగో రోజు జట్టు కోసం పెద్ద సాహసమే చేశాడు. కుంటుతూనే బ్యాటింగ్‌కు వచ్చి తన జట్టుకు అతి మూల్యమైన పరుగులు సమకూర్చాడు. ఈ మ్యాచ్‌లో లయోన్ లేకపోయినా ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. స్టోక్స్ పోరాటం వృధా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆసీస్ అంతిమంగా విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వారికి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాపించాడు. వీరోచితమైన ఇన్నింగ్స్‌తో తన జట్టును గెలిపించినంత పని చేశాడు. ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక్కడే అద్భుతమైన పోరాటం చేశాడు. జట్టులో డకెట్్ (83) మినహా మిగతా వారెవ్వరి నుంచి సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్ 327 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ఫైర్..!
-
చాలా హాస్యాస్పదంగా ఉంది.. ఆస్ట్రేలియా బోర్డుపై విరుచుకుపడిన వార్నర్
బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై 2018లో క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు అతడి కెప్టెన్సీపై జీవితకాల బ్యాన్ విధించింది. అయితే ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకోలేదు. దాంతో అతడు మళ్లీ టీమ్ వైస్ కెప్టెన్ అయ్యి.. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును కూడా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో సీఏ విధించిన కెప్టెన్సీ బ్యాన్పై గతేడాది నవంబర్‌లో రివ్యూ పిటిషన్‌ను వార్నర్ దాఖలు చేశాడు. ఇందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. అయితే ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్.. కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో తన రివ్యూ పిటిషన్‌ను వార్నర్ ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి కీలక వాఖ్యలు చేశాడు. "నా పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను గతాన్ని మార్చిపోవాలని భావిస్తుంటే.. వారు మాత్రం ఇంకా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఎవరూ జవాబుదారీగా ఉండకూడదని, ఎవరూ నిర్ణయం తీసుకోకూడదనుకొన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియాలో నాయకత్వలోపం సృష్టంగా కన్పిస్తోంది. ఇదే విషయంపై నేను టెస్టు మ్యాచ్‌లు ఆడే సమయంలో పదే పదే ఫోన్ కాల్స్ వచ్చేవి. నేను లాయర్లతో మాట్లాడడేవాడిని. అది నా ఏకాగ్రతను దెబ్బతీసింది. ఇదంతా నాకు ఆగౌరవంగా అనిపించింది. అందుకే గతాన్ని మర్చిపోవాలని భావిస్తున్నా. ఈ కథ అంతా గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. కానీ ఈ విషయంపై మాత్రం నేను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా" అని సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ పేర్కొన్నాడు. -
ఎస్సీజీ గేట్‌కు సచిన్ పేరు
సిడ్నీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోమవారం (ఏప్రిల్ 24) 50వ పుట్టినరోజు జరుపుకున్నాడు. క్రికెట్ ప్రేక్షకులకు, ప్రత్యేకించి ‘మాస్టర్’ బ్యాట్స్‌మన్ అభిమానులకు ఇది పండగ రోజు. ఈ ‘ఫిఫ్టీ’ని మరింత చిరస్మరణీయం చేసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వైపు నుంచి అపురూప కానుక లభించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోని ఓ గేట్‌కు సచిన్ పేరు పెట్టింది. ఈ మైదానం అతనికెంతో ప్రత్యేకమైంది. ఈ వేదికపై ‘లిటిల్ మాస్టర్’ మూడు శతకాలు సహా 785 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 241 (2004లో). ఇక్కడ సచిన్ 157 సగటు నమోదు చేయడం మరో విశేషం. సోమవారం సచిన్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీజీ, న్యూసౌత్‌వేల్స్ వేదికల చైర్మన్ రాడ్ మెక్ గియోచ్, సీఈఓ కెర్రీ మాథెర్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ ‘సచిన్ గేట్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సచిన్ అనుభవాన్ని ప్రస్తావించారు. ‘భారత్ వెలుపల సిడ్నీ నా ప్రియమైన మైదానం.1991–92లో నా తొలి ఆసీస్ పర్యటన మొదలు కెరీర్ ముగిసేదాకా ఎస్సీజీలో నాకు మరిచిపోలేని స్మృతులెన్నో వున్నాయి’ అని సచిన్ పేర్కొన్నారు. సచిన్ సమకాలికుడు బ్రియాన్ లారా (విండీస్) కూడా అక్కడ గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌ల ఆడటంతో మరో గేట్‌కు లారా పేరు పెట్టారు. తనకు కలిసొచ్చిన ఈ మైదానం పేరును లారా తన కుమార్తెకు ‘సిడ్నీ’ అని పెట్టుకున్నాడు. -
పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా అధికారికంగా ద్రువీకరించింది. కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ''మారియా కమిన్స్ చనిపోవడం చాలా బాధాకారం. క్రికెట్ ఆస్ట్రేలియా తరపున పాట్ కమిన్స్, అతని కుటుంబసభ్యులకు మా ప్రగాడ సానభూతి. కమిన్స్ తల్లి మృతికి సంతాపంగా టీమిండియాతో నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఆసీస్ క్రికెటర్లు నల్ల రిబ్బన్లతో(బ్లాక్ ఆర్మ్ బాండ్స్) బరిలోకి దిగుతారు.. '' అంటూ ట్వీట్ చేసింది. పాట్ కమిన్స్ తల్లి మృతిపై బీసీసీఐ సహా టీమిండియా ఆటగాళ్లు తమ సంతాపాన్ని ప్రకటించారు. ''ఈ విషాద సమయంలో కమిన్స్, అతని కుటుంబసభ్యులుకు మా సానుభూతి తెలియజేస్తున్నాం'' అంటూ ట్వీట్ చేశారు. కాగా తల్లి అనారోగ్యం కారణంగా పాట్ కమిన్స్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ముగియగానే స్వదేశానికి వెళ్లిపోయాడు. తల్లిని దగ్గరుండి చూసుకోవాలన్న అతని కోరికను మన్నించిన క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకరించింది. తన తల్లి మారియా చివరి రోజుల్లో పక్కనే ఉండాలని భావించిన కమిన్స్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని ఇటీవలే పత్రికా ప్రకటనలో పేర్కొన్నాడు. We are deeply saddened at the passing of Maria Cummins overnight. On behalf of Australian Cricket, we extend our heartfelt condolences to Pat, the Cummins family and their friends. The Australian Men's team will today wear black armbands as a mark of respect. — Cricket Australia (@CricketAus) March 10, 2023 On behalf of Indian Cricket, we express our sadness at the passing away of Pat Cummins mother. Our thoughts and prayers are with him and his family in this difficult period 🙏 — BCCI (@BCCI) March 10, 2023 చదవండి: మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు -
ఆస్ట్రేలియా క్రికెట్లో కలవరం.. తర్వాత ఎవరు?
ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక విషయంలో కలవరం మొదలైంది. ప్రస్తుతం జట్టులో నాథన్ లియోన్ మాత్రమే ప్రధాన స్పిన్నర్‌గా కనిపిస్తున్నాడు. లియోన్ వయస్సు 35 సంవత్సరాలు. రిటైర్మెంట్కు దగ్గరికి వచ్చిన అతను మహా అయితే మరో రెండు సంవత్సరాలు ఆడే అవకాశం ఉంది. దిగ్గజం షేన్ వార్న్ తర్వాత టాప్‌క్లాస్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న లియోన్ తన కెరీర్లో 117 టెస్టులాడి 468 వికెట్ల పడగొట్టాడు. దశాబ్దం కాలంగా లియోన్ ఆసీస్ టెస్టు జట్టులో ఏకైక ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. మరి అతను రిటైర్ అయ్యాకా ఆసీస్ క్రికెట్లో స్పిన్ భాద్యతలు తీసుకునేది ఎవరనేదానిపై చర్చ మొదలైంది. ఆసీస్ లాంటి ఫాస్ట్ పిచ్ మైదానాలపై పేస్ బౌలర్లకు కొదువ లేదు. ఆ దేశం నుంచి వచ్చే బౌలర్లలోనే ఎక్కువగా మీడియం, ఫాస్ట్ బౌలర్లే కనిపిస్తారు తప్ప స్పిన్నర్లు చాలా తక్కువ. స్వదేశంలో ఆడినంత వరకు పేస్ దళంతోనే మ్యాచ్‌లు గెలిచే ఆస్ట్రేలియా భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లకు వచ్చేసరికి స్పిన్నర్లను వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే టాడ్ మర్ఫీ రూపంలో ఆస్ట్రేలియా జట్టుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు రెండు టెస్టులు కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ఇదే విషయమై ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు. ''ప్రస్తుతం ఆస్ట్రేలియాకు పెద్ద దిక్కులా మారాడు. వార్న్ లాంటి దిగ్గజ ఆటగాడిని భర్తి చేయలేకపోయిన ఉన్నంతలో అతను టాప్ క్లాస్ స్పిన్నర్. మరి లియోన్ రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ క్రికెట్లో స్పిన్ బాధ్యతలు తీసుకునేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. అందుకు నా సమాధానం 22 ఏళ్ల టాడ్ మర్ఫీ. టీమిండియాతో తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా తరపున టాడ్ మర్ఫీ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్లతో ఆకట్టుకొని తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడు వికెట్లలోనూ ఐదు టాప్‌క్లాస్ బ్యాటర్లవే ఉన్నాయి. ఉపఖండం పిచ్‌లపై ప్రభావం చూపుతున్న ఒక డెబ్యూ బౌలర్ తర్వాతి కాలంలో జట్టుకు ప్రధాన స్పిన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. నాథన్ లియోన్ అలా వచ్చినవాడే. అతని వారసత్వాన్ని టాడ్ మర్ఫీ కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. అయితే ఆస్ట్రేలియాకు టాడ్ మర్ఫీ రూపంలో ఒక మంచి స్పిన్నర్ దొరికినట్లే. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న మర్ఫీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్బుతాలు చేయగలడన్న నమ్మకం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇరుజట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. రెండు టెస్టుల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. ఇక మూడో టెస్టు మార్చి ఒకటి నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు -
టీమిండియాతో రెండో టెస్ట్.. స్పీడ్ గన్ వచ్చేస్తున్నాడా.. ఆసీస్ మైండ్‌గేమ్ ఆడుతుందా..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. తొలి మ్యాచ్‌లోనే ఎదురైన ఘోర పరాభవం నేపథ్యంలో ఆసీస్ రెండు టెస్ట్‌లో భారీ మార్పులకు వెళ్లనుందని క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక వెబ్సైట్ ద్వారా క్లూ వదిలింది. Mitchell Starc will link up with the Australian squad in Delhi with his recovery progressing well.@LouisDBCameron | #INDvAUS https://t.co/rMqXXpwBgV — cricket.com.au (@cricketcomau) February 11, 2023 తొలి టెస్ట్‌లో ఓటమిపాలైన గంటల వ్యవధిలోనే క్రికెట్ ఆస్ట్రేలియా తమ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రెండో టెస్ట్‌కు సంసిద్ధంగా ఉన్నాడంటూ ట్వీట్ చేసింది. ఇది నిజమో లేక ఆసీస్ టీమ్ మైండ్‌గేమ్‌లో భాగమో తెలీదు కానీ.. తమ స్పీడ్ గన్ వేలి గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, అతను త్వరలోనే న్యూఢిల్లీలో ఆసీస్ క్యాంప్‌లో చేరతాడని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా ప్రకటించింది. రెండో టెస్ట్‌కు వేదిక అయిన అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందా లేక పేసర్లకు సహకరించే అవకాశం ఉందా అన్న కనీస సమాచారం లేకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ప్రకటన చేయడం వెనుక మైండ్‌గేమ్ ఉంటుందని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలోకి ఓసారి వెళ్తే.. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ స్పిన్నర్ ఫ్రెండ్లీగా పిచ్‌గా చూశాం. ఇలాంటి పిచ్‌పై ఏ జట్టైనా అదనపు స్పిన్నర్‌కు తీసుకోవాలని భావిస్తుంది కానీ, హడావుడిగా గాయం నుంచి పూర్తిగా కోలుకోని పేసర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అనుకోదు. తొలి టెస్ట్ కోల్పోయిన బాధలో ఉన్న ఆసీస్.. టీమిండియాను మిస్ లీడ్ చేసే ప్రయత్నంలో స్టార్క్ సంసిద్ధతను పావుగా వాడుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇందుకు తొలి టెస్ట్ అనంతరం ఆసీస్ కెప్టెన్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. మ్యాచ్ అనంతరం కమిన్స్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. రెండో టెస్ట్‌పై ఇప్పటినుంచే డిస్కషన్ చేయడంలో అర్ధం లేదని అన్నాడు. రెండో టెస్ట్ కోసం ఆసీస్ తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయన్న ప్రశ్న ఎదురైనప్పుడు కమిన్స్ ఈ రకంగా స్పందించాడు. న్యూఢిల్లీ టెస్ట్‌కు ఆసీస్ మరో పేసర్ జోష్ హేజిల్‌వుడ్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ అందుబాటులో ఉంటారా..? తొలి మ్యాచ్‌లో విఫలమైన మ్యాట్ రెన్షా, హ్యాండ్స్కోంబ్, పేసర్ బోలాండ్‌లను తప్పిస్తారా అన్న ప్రశ్నలు ఎదురైనప్పుడు కమిన్స్ మాట్లాడుతూ.. తదుపరి మ్యాచ్‌లో పెద్దగా మార్పులు ఉంటాయని నేను అనుకోను అంటూ దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పాడు. కమిన్స్ చేసిన ఈ వ్యాఖ్యల బట్టి చూస్తే.. ఆసీస్ టీమ్ టీమిండియాతో మైండ్‌గేమ్ మొదలుపెట్టిందన్న విషయం స్పష్టమవుతోంది. ఏదిఏమైనప్పటికీ ఆసీస్ తుది జట్టులో ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు వరకు ఆగాల్సిందే. రెండో టెస్ట్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభంకానుంది. -
'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టండి'
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో కఠినమైన సవాల్‌ను ఎదుర్కోనున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వన్డే, టి20ల్లో టాప్ ర్యాంక్‌లో ఉన్న టీమిండియా టెస్టుల్లో కూడా నెంబర్‌వన్ కావాలంటే సిరీస్ విజయం తప్పనిసరి. ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేది లేనిది కూడా సిరీస్ విజయంతోనే ముడిపడి ఉంది. ఒక రకంగా రోహిత్‌కు ఇది సవాల్ అని చెప్పొచ్చు. అంతేకాదు ఒకవేళ ఆసీస్‌తో సిరీస్‌ను ఓడిపోతే రోహిత్ కెప్టెన్సీతో పాటు టెస్టు కెరీర్‌కు ముగింపు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రోహిత్ ఎంత జాగ్రత్తగా ఆడితే అంత మంచిది. ఇదిలా ఉంటే తొలిటెస్టు జరగనున్న నాగ్‌పూర్ పిచ్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ 'డాక్టర్డ్ పిచ్(Doctored Pitch)' అని పేర్కొనడం ఆసక్తి రేపింది. అంతేకాదు జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. స్మిత్ వ్యవహారంపై క్రికెట్ అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. అయితే మ్యాచ్‌కు రెండురోజుల ముందు క్యురేటర్ రోలింగ్‌కు ముందు.. పిచ్ సెంటర్లో వాటర్ కొట్టడంతో సమస్య మొదలైంది. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేసే లెగ్‌స్టంప్‌వైపు మరోసారి నీళ్లు కొట్టి రోలింగ్ చేశారు. దీనిని ఆస్ట్రేలియా క్రికెట్ తప్పుబట్టింది. భారత్ తమకు అనుకూలంగా పిచ్ తయారు చేసుకోవడం మంచిదే.. కానీ ఇలా పదే పదే పిచ్‌ను నీళ్లతో తడపడం మాకు నచ్చలేదని.. ఇదొక 'డాక్టర్డ్ పిచ్(Doctored Pitch)'లాగా తయారైందంటూ కామెంట్ చేశారు. ఇక స్మిత్ కూడా పిచ్‌పై లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్‌కు బ్యాటింగ్ చేయడం కాస్త కఠినంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా క్రికెట్ సహా స్టీవ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. 'డాక్టర్డ్ పిచ్(Doctored Pitch)' అని పేర్కొన్న ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ''నాగ్‌పూర్ పిచ్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ చేస్తున్న ఆరోపణలు వింతగా అనిపిస్తున్నాయి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడం కోసమే వాటర్ కొట్టి పిచ్‌ను ఎక్కువసార్లు రోలింగ్ చేశారు. అనవసరంగా దీనిని పెద్ద విషయం చేస్తున్నారు. పిచ్‌పై మాట్లాడడం మానేసి ఆటపై ఫోకస్ చేయడం మంచిది.'' అని పేర్కొన్నాడు. ''టెస్టు క్రికెట్ టైమ్ అయిపోయిందని చాలా మంది అంటున్నారు. అయితే నాగ్‌పూర్ టెస్టు మొదటి రోజు మ్యాచ్‌కే 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది టెస్టు క్రికెట్‌కి ఉన్న క్రేజ్.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడానికి నాలుగు సాలిడ్ మ్యాచులు ఉన్నాయి. ఈ సిరీస్ మాకు ఛాలెంజింగ్‌గా ఉంటుందని తెలుసు. అయితే గెలవడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో మాకు పక్కాగా తెలుసు. ఏ మ్యాచ్‌కి అయిన సన్నద్ధత చాలా ముఖ్యం. రేపు ఆడబోయే 22 మంది క్రికెటర్లు కూడా క్వాలిటీ క్రికెట్ ఆడతారు.ఎవరైతే బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకే విజయం వరిస్తుంది. రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో లేకపోవడం తీరని లోటే. అయితే అతని రోల్‌ని భర్తీ చేయగల ప్లేయర్లు జట్టులో ఉన్నారు. శుబ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారీ సెంచరీలు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఏం చేయగలడో అందరికీ తెలుసు. ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనేది ఇంకా డిసైడ్ చేయలేదు. మ్యాచ్ సమయానికి ఈ విషయంలో క్లారిటీ రానుంది.'' అని చెప్పుకొచ్చాడు. Picture Perfect 📸 🏆 CAN. NOT. WAIT ⌛️#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/OqvopNKbHd — BCCI (@BCCI) February 8, 2023 The Nagpur pitch could prove testy for the Aussie left-handers....#INDvAUS pic.twitter.com/fbmN0nFsbX — SEN Cricket (@SEN_Cricket) February 8, 2023 Steve Smith thinks left-handers could have it particularly tough in Nagpur #INDvAUS pic.twitter.com/EudwrlHIRu — cricket.com.au (@cricketcomau) February 7, 2023 చదవండి: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!' ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్
Aaron Finch Retirement: కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు తొలి టీ20 వరల్డ్‌కప్ అందించిన స్టార్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇదివరకే టెస్ట్, వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఫించ్.. పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు కెరీర్‌ను కొనసాగించలేనని తెలిసే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు ఫించ్ వెల్లడించాడు. కెరీర్ ఆసాంతం తనకు మద్దతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులకు, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్ ఎత్తుపల్లాల్లో తనకు అండగా నిలిచిన కుటుంబానికి, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. 2015 వన్డే ప్రపంచకప్, 2021లో టీ20 ప్రపంచకప్ గెలవడం తనకు చిరకాలం గుర్తుండిపోతుందని రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా, ఫించ్ సారధ్యంలో ఆసీస్ 2021 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తరఫున 5 టెస్ట్‌లు, 146 వన్డేలు, 103 టీ20లు ఆడిన ఫించ్.. 17 వన్డే సెంచరీలు, 2 టీ20 సెంచరీలు, 2 టెస్ట్ ఫిఫ్టీలు, 30 వన్డే ఫిఫ్టీలు, 19 టీ20 ఫిఫ్టీల సాయంతో 278 టెస్ట్ పరుగులు, 5406 వన్డే పరుగులు, 3120 టీ20 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (172) ఫించ్ పేరిటే ఉంది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సమయంలో ఫించ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ దేశవాలీ, క్లబ్, ఇతరత్రా లీగ్‌లకు అందుబాటులో ఉంటాడు. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
BGT 2023: 36 ఆలౌట్ గుర్తుందా.. సిరీస్ ఓటమి గుర్తు లేదా..?
IND VS AUS: దాయాదుల సమరం, యాషెస్ సిరీస్ తర్వాత క్రికెట్లో అంత క్రేజ్ ఉన్న సిరీస్ ఏదైనా ఉందంటే..? అది భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనేని తప్పక చెప్పాల్సిందే. ఇరు జట్ల మధ్య గత 27 ఏళ్లుగా జరుగుతున్న ఈ రైవల్రీలో ఇది చాలా సార్లు నిరూపితమైంది. ఈ విషయాన్ని పక్కకు పెడితే.. ఆసీస్ క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతి సిరీస్ ప్రారంభానికి ముందు ప్రత్యర్థి జట్టుపై మాటల యుద్ధానికి దిగి, ఆ జట్టును నైతికంగా బలహీన పర్చాలని వ్యూహాలను రచిస్తుందన్న విషయం విధితమే. ఆసీస్ ఆడే ఈ మైండ్ గేమ్‌లో మేటి జట్లు సైతం చిక్కి విలవిలలాడిన సందర్భాలు మనం చాలా చూశాం. All out for 36 😳The Border-Gavaskar Trophy starts on Thursday! #INDvAUS pic.twitter.com/Uv08jytTS7— cricket.com.au (@cricketcomau) February 6, 2023 BGT 2023 ప్రారంభానికి ముందు కూడా ఆసీస్ ఇలాంటి మైండ్ గేమ్నే మొదలుపెట్టింది. టీమిండియా ఆటగాళ్లను, జట్టు ప్రదర్శనను తక్కువ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డే (క్రికెట్ ఆస్ట్రేలియా) రంగంలోకి దిగి టీమిండియాను కించపర్చే విధంగా ట్వీట్ చేసింది. 2020-21 సిరీస్‌లో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌటైన విషయాన్ని ప్రస్తావించి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. సీఏ ఆడిన ఈ మైండ్ గేమ్‌కు టీమిండియా ఆటగాళ్లు కానీ, యాజమాన్యం కానీ స్పందించనప్పటికీ.. భారత మాజీ ఓపెనర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో స్పందించాడు. And the series score-line? #JustAsking 🫶 https://t.co/u0X43GgS8k— Aakash Chopra (@cricketaakash) February 6, 2023 భారత్ 36 పరుగులకే ఆలౌటైన విషయం ఓకే.. సిరీస్ సంగతేంటీ..? అంటూ సుతిమెత్తగా కౌంటరిచ్చాడు. ఆ సిరీస్‌లో తొలి టెస్ట్‌లోనే టీమిండియా ఓటమిపాలు కావడంతో 4 టెస్ట్‌ల సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని అంతా ఊహించారు. అయితే అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా ఆసీస్‌కు వారి స్వదేశంలోనే ఫ్యూజుల ఎగిపోయేలా చేసి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్నే ఆకాశ్ చోప్రా పరోక్షంగా ప్రస్తావించి.. ఆసీస్ మైండ్‌గేమ్‌కు కౌంటరిచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కాగా, 2020-21 సిరీస్‌లో విరాట్ కోహ్లి తొలి టెస్ట్ అనంతరం తప్పుకున్నప్పటికీ.. యువకులతో కూడిన యంగ్ ఇండియా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్‌కు షాకిచ్చింది. -
అందంతో మతిపోగొడుతున్న మహిళా క్రికెటర్
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ తన అందచందాలతో కుర్రకారు గుండెళ్లో రైళ్లు పరిగెత్తించింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్ లో పెర్రీ తళుక్కున మెరిసింది. ఈ కార్యక్రమానికి ఆసీస్ మెన్స్ క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి ఎల్లీస్ పెర్రీపైనే నెలకొంది. అందుకు కారణం ఆమె వేసుకొచ్చిన దుస్తులు. రెడ్ కలర్ డ్రెస్‌లో బ్లూ కార్పెట్‌పై క్లీవేజ్ షో చేస్తూ దగదగ మెరిసిపోయిన ఎల్లీస్ పెర్రీ అవార్డు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రౌండ్లో తన ఆటతో అభిమానులను మంత్రముగ్దులను చేసిన ఎలీస్ పెర్రీ.. తాజాగా అవార్డు కార్యక్రమంలో తన అందచందాలతో అలరించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 32 ఏండ్ల ఈ ఆసీస్ ఆల్ రౌండర్.. 2007 నుంచి కంగారు జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 10 టెస్టులు, 128 వన్డేలు, 131 టీ20 మ్యాచ్ లు ఆడింది. టెస్టులలో 752 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉండటం విశేషం. బౌలర్ గా 37 వికెట్లు పడగొట్టింది. వన్డేలలో పెర్రీ.. 3,369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక టీ20లలో 1,418 రన్స్ చేసి 117 వికెట్లు సాధించింది. ఇక అవార్డుల విషయానికి వస్తే.. ►స్టీవ్ స్మిత్ ఉత్తమ ఆస్ట్రేలియా క్రికెటర్(అలెన్ బోర్డర్ మెడల్) అవార్డు సొంతం చేసుకోగా.. ఉత్తమ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌గా బెత్‌మూనీ(బెలిండా క్లార్క్) అవార్డు గెలుచుకుంది. ►మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా ►ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- బెత్ మూనీ ►మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- డేవిడ్ వార్నర్ ►వుమెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- తాహిలా మెక్‌గ్రాత్ ►మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- మార్కస్ స్టోయినిస్ ►వుమెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-అన్నాబెల్ సదర్లాంఢ్ ►మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- మైకెల్ నాసర్ ►బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- లాన్స్ మోరిస్ ►కమ్యూనిటి ఇంపాక్ట్ అవార్డు- ఉస్మాన్ ఖవాజా -
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. సిరీస్ బహిష్కరణ
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ షాకిచ్చింది. ఈ ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరగాల్సిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు సీఏ ఇవాళ (జనవరి 12) ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం మహిళలు, అమ్మాయిల ప్రాధమిక హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఏ వెల్లడించింది. 2021 సెప్టెంబర్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, అమ్మాయిలకు విద్య, ఉపాధి దూరం చేయడంతో పాటు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించిందని, దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో పరోక్షంగా కూడా సమర్ధించేది లేదని పేర్కొంది. పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ వ్యాప్తికి సీఏ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల క్రికెట్‌పై అంక్షలను సహించేది లేదని తెలిపింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమకు పూర్తి మద్దతు ప్రకటించిందని వివరించింది. తాలిబన్ ప్రభుత్వం మహిళలు, అమ్మాయిలపై అంక్షలు ఎత్తి వేస్తే వారితో సత్సంబంధాలు కొనసాగించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని అంది. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇలా వ్యవహరించడం ఇది తొలిసారి కాదు. గతంలో హోబర్ట్‌లో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను ఇదే కారణంగా చూపి రద్దు చేసింది. -
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్’ దూరం?!
IPL 2023- Mumbai Indians- Cameron Green: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ మినీ వేలం-2023లో ఏకంగా 17 కోట్లు పెట్టి కొన్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కొన్నాళ్లపాటు కేవలం బ్యాటర్‌గానే సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13 వరకు అతడు స్పెషలిస్టు బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని, ఆ తర్వాతే అతడు బౌలింగ్ చేస్తాడని సమాచారం. ఒకవేళ ఏదేని కారణాల చేత టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడకపోతే మాత్రం ఐపీఎల్లో తొలి మ్యాచ్ నుంచి బౌలింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వేలికి గాయం! దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా గ్రీన్ కు గాయమైన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి బంతి బలంగా తాకింది. రక్తం కూడా కారడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అనంతరం ఎక్స్‌రేకు వెళ్లగా వేలు విరిగినట్లు తేలింది. దీంతో అతడు ప్రొటిస్‌తో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్ తర్వాత ఆసీస్.. భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడనుంది. గాయం ఇబ్బంది పెడితే.. ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా గ్రీన్ గనుక టెస్టు సిరీస్ ఆడితే.. నాలుగు వారాల పాటు అతడు బౌలింగ్‌కు దూరంగా ఉంటాడని సీఏ గతంలో పేర్కొంది. అయితే, ఇప్పుడు గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. భారత పర్యటన నాటికి కోలుకుంటే టీమిండియాతో సిరీస్‌లో ఆడతాడు.. గాయం ఇబ్బంది పెడితే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకూ దూరమయ్యే అవకాశం లేకపోలేదు. కాగా వేలంలో ముంబై గ్రీన్ కోసం 17.5 కోట్లు ఖర్చు చేయగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్‌కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం! IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
దెబ్బ అదుర్స్.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్
గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియా క్రికెట్ మీడియాలో డేవిడ్ వార్నర్ పేరు హాట్ టాపిక్. కారణం కెప్టెన్సీ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియాతో సున్నం పెట్టుకోవడమే. 2018లో బాల్ టాంపరింగ్ వివాదం అతని మెడకు చుట్టుకొని రెండేళ్ల నిషేధంతో పాటు ఆసీస్‌కు కెప్టెన్ కాకుండా లైఫ్‌టైమ్ బ్యాన్ విధించింది. అయితే తనపై కెప్టెన్సీ లైఫ్‌టైమ్ బ్యాన్ ఎత్తివేయాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు అప్పీల్ చేసుకుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. సొంత బోర్డు నుంచే కనీస మద్దతు కరువవడంతో తెగ బాధపడిపోయిన వార్నర్..'' మీ కెప్టెన్సీకో దండం.. నా అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నాని.. ఇకపై ఆ విషయం కూడా ఎత్తను'' అంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వార్నర్ తీరుపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ''కెప్టెన్సీ కాదు ముందు మీ ఆటతీరులో దమ్ము చూపించండి.. అప్పుడు కెప్టెన్సీపై చర్చకు రండి'' అంటూ పరోక్షంగా వార్నర్‌కు సవాల్ విసిరింది. నిజానికి వార్నర్ కూడా అంత గొప్ప ఫామ్‌లో అయితే లేడనే చెప్పాలి. ఇటీవలే ముగిసిన టి20 వరల్డ్‌కప్‌లోనూ వార్నర్ పెద్దగా ప్రభావం చూపించింది లేదు. అందునా టెస్టుల్లో వార్నర్ మెరిసి చాలా కాలమైపోయింది. వార్నర్ బ్యాట్ నుంచి శతకం జాలువారి మూడేళ్లు కావొస్తుంది. దీనికి తోడు ఆటను పక్కనబెట్టి కెప్టెన్సీ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియాతో సున్నం పెట్టుకోవడం సొంత అభిమానులకు కూడా నచ్చలేదు. అన్ని వైపుల నుంచి వార్నర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన కామెంట్స్‌ను వార్నర్ సీరియస్‌గా తీసుకున్నాడనిపించింది. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో తనపై వస్తున్న విమర్శలన్నింటికి చెక్ పెట్టాడు. మెల్బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టు వార్నర్ కెరీర్లో వందో టెస్టు కావడం విశేషం. తన వందో టెస్టులో సెంచరీతో మెరిసి అన్నింటికి సమాధానం చెప్పాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే తన పంతం నెరవేర్చుకున్నాడు డేవిడ్ వార్నర్. శతకంతో మెరవడమే సూపర్ అనుకుంటే.. ఏకంగా డబుల్ సెంచరీతో కథం తొక్కి సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. దాదాపు 1089 రోజులు శతకం లేకుండా కొనసాగిన వార్నర్ ఇన్నింగ్స్‌లకు ఇది మరో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఏ బోర్డు అయితే తనకు సవాల్ విసిరిందో అదే బోర్డుతో చప్పట్లు కొట్టించుకున్నాడు వార్నర్. ఇది అందరికి సాధ్యం కాదు. కచ్చితంగా వార్నర్ కెరీర్లో ఈ ఇన్నింగ్స్ ఎప్పటికి మధురానుభూతిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. A double century for David Warner! But his #OhWhatAFeeling jump comes at a cost! 😬#AUSvSA | @Toyota_Aus pic.twitter.com/RqJLcQpWHa — cricket.com.au (@cricketcomau) December 27, 2022 చదవండి: వారీ ఎంత పని జరిగే.. గట్టిగా తాకుంటే ప్రాణం పోయేదే! -
'మానసిక వేదనకు గురయ్యా'.. సొంత బోర్డుపై ఆగ్రహం
ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ శనివారం సొంత బోర్డు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శనాస్త్రాలు సంధించాడు. కెప్టెన్ అయ్యే అవకాశం లేకుండా లైఫ్‌టైమ్ బ్యాన్ విధించడంపై అప్పీల్‌కు వెళ్తే కనీస మద్దతు లభించకపోవడం దారుణమని పేర్కొన్నాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఈ అంశం నన్ను మానసిక వేదనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్(SandpaperGate) వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరున్ బెన్‌క్రాప్ట్‌లు కలిసి బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వారిపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌పై ఏడాది నిషేధంతో పాటు కెప్టెన్ కాకుండా లైఫ్‌టైమ్ బ్యాన్ విధించింది. ఇటీవలే వెస్టిండీస్ పర్యటన సందర్భంగా.. రెండో టెస్టుకు ముందు వార్నర్ తన కెప్టెన్సీపై లైఫ్‌టైమ్ బ్యాన్ ఎత్తేయాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు అప్పీల్ చేశాడు. దానిపై అతను బోర్డుతో తీవ్రంగా పోరాడినప్పటికి మద్దతు కరువయిపోయింది. అయితే తన వాదనలను బోర్డు ఎదుట చెప్పేందుకు సిద్ధమని.. కానీ బోర్డు మాత్రం బహిరంగంగా చర్చించాలని పట్టుబట్టింది. ఇదంతా నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే అంశంలా కనిపించింది. అందుకే కెప్టెన్సీ బ్యాన్‌ను ఎత్తేయాలనే అభ్యర్థనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం వార్నర్‌ను మానసిక వేదనకు గురి చేసింది. ఆ ప్రభావం ఆటపై కూడా పడింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 5, 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తాజాగా వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియాపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.'' కొంతమంది పనిగట్టుకొని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంతలా అంటే అది నా ఆటపై తీవ్ర ప్రభావం చూపించింది. కెప్టెన్సీపై లైఫ్‌టైమ్ బ్యాన్ ఎత్తేయాలని అప్పీల్ చేస్తే బోర్డు నుంచి మద్దతు కరువయింది. ఇది నన్ను మానసిక వేదనకు గురి చేసింది. నావైపు నుంచి సమస్యను విన్నవించుకున్నప్పటికి.. క్రికెట్ ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకు ఎలాంటి మద్దతు రాలేదు. నా జట్టు సహచరులు, సిబ్బంది నుంచి మంచి సపోర్ట్ ఉన్నప్పటికి క్రికెట్ ఆస్ట్రేలియాకు నేను కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదని స్పష్టంగా అర్థమైంది. ఇది నాకు నిజంగా కష్టకాలంలా ఉంది. దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు ద్వారా డేవిడ్ వార్నర్ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకోనున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ వార్నర్‌కు వందో మ్యాచ్ కానుంది. అయితే జనవరి 2020 నుంచి వార్నర్ బ్యాట్ నుంచి ఒక్క టెస్టు సెంచరీ కూడా రాలేదు. ప్రస్తుతం జట్టులో సీనియర్ క్రికెటర్‌గా ఉన్న వార్నర్.. ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు 99 టెస్టులు, 141 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Virat Kohli: శ్రుతి మించిన బంగ్లా ఆటగాళ్ల చర్య.. కోహ్లి ఆగ్రహం షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు -
సూర్యను కొనగలిగేంత డబ్బు మా దగ్గర లేదు.. ఆటగాళ్లందరిపై వేటు వేస్తేనే!
Suryakuma Yadav: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. బిగ్‌బాష్ లీగ్‌లలో సూర్య సంచలన ఇన్నింగ్స్ చూడాలని ఉన్నా.. అతడిని కొనే స్థోమత క్రికెట్ ఆస్ట్రేలియాకు లేదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ను అందుకోవడం ప్రపంచంలోని ఏ ఆటగాడకి సాధ్యం కాదని కొనియాడాడు. లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా మూడు పదుల వయసులో టీమిండియా తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. టీ20 ఫార్మాట్లో అత్యుత్తమంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2022లో 239 పరుగులు చేసిన ఈ ముంబైకర్.. న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లోనూ మెరిశాడు. కివీస్‌తో రెండో టీ20 సందర్భంగా పొట్టి ఫార్మాట్లో రెండో శతకం నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న సూర్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో ది గ్రేడ్ క్రికెటర్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన గ్లెన్ మాక్స్వెల్ ‘స్కై’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గ్లెన్ మాక్స్వెల్ (PC: Glenn Maxwell Twitter) సూర్య.. వేరే లెవెల్.. అంతే! ‘‘నిలకడైన ఆటకు మారుపేరుగా మారి మాకు తలనొప్పి తెప్పిస్తున్నాడంటే నమ్మండి! ఆస్ట్రేలియా.. కాదు కాదు ప్రపంచంలోనే ఇప్పుడు తన దరిదాపుల్లోకి వెళ్లే ఆటగాడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే, ఐపీఎల్లో తన ప్రదర్శనతో ఒక్కోసారి జోస్ బట్లర్.. యాదవ్‌తో పోటీపడగలడు. ఏదైమైనా ‘స్కై’ది వేరే లెవల్!’’ అంటూ ఈ పవర్ హిట్టర్ సూర్యను కొనియాడాడు. ఆ స్థోమత మాకు లేదు! ఇక బిగ్‌బాష్ లీగ్ ప్రస్తావన నేపథ్యంలో.. ‘‘మా దగ్గర సూర్యకుమార్‌ను కొనగలిగేంత డబ్బు లేదు. ఒకవేళ తనను సొంతం చేసుకోవాలనుకుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులోని ప్రతి ఆటగాడు.. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లను తొలగించాల్సి వస్తుందేమో! అందరి జీతం కట్‌చేస్తే.. అప్పుడైనా తనను కొనగలిగే స్థోమత వస్తుందనుకుంటా’’ అంటూ మాక్సీ.. సూర్యకుమార్‌ను ఆకాశానికెత్తాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటుతున్న సూర్య త్వరలోనే టెస్టుల్లోనూ అరంగేట్రం చేస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బోర్డుతో తెగదెంపులు చేసుకున్న తర్వాతే ప్రపంచంలోని ఇతర క్రికెట్ లీగ్‌లలో ఆడే అవకాశం ఉంటుందని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సూర్య గురించి మాక్స్వెల్ సరదాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఇటీవల కాలు విరగ్గొట్టుకున్న మాక్సీ.. మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. చదవండి: NZC: సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న మరో న్యూజిలాండ్ ప్లేయర్! దేశం తరఫున ఆడటం.. Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను! -
'నెంబర్ వన్ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు'
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ తీరును ఎండగట్టాడు. అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారని.. మరో అవకాశం ఇవ్వాలని అడిగితే పదవి నుంచి తొలగించారంటూ అసహనం వ్యక్తం చేశాడు. విషయంలోకి వెళితే.. 2021లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్‌ను ఎగురేసుకుపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. దీని వెనకాల ప్రధాన కారణం అప్పటి కోచ్ జస్టిన్ లాంగర్. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 4-0తేడాతో గెలవడంలోనూ లాంగర్‌దే ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చు. అతని హయాంలోనే ఆస్ట్రేలియా మళ్లీ టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంది. ఇప్పటికీ ఆస్ట్రేలియానే టెస్టుల్లో నెంబర్‌వన్‌గా ఉంది. ఎంత కాదన్నా కోచ్, ఆటగాళ్లు కలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అలా ఏడాది వ్యవధిలో రెండు గొప్ప ఫీట్లు సాధించిన కోచ్‌గా లాంగర్ పేరు గడించాడు. ఆ తర్వాత తన పదవిని పొడిగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం లాంగర్ పదవిని మరో ఆరు నెలల పాటు మాత్రమే పొడిగించింది. పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన సమయంలోనే లాంగర్‌ను తొలగించి ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను కొత్త కోచ్‌గా ఎంపిక చేసింది. అలా లాంగర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియాతో బంధం ముగిసింది. తాజాగా తనకు జరిగిన అన్యాయంపై లాంగర్ డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు.''తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు పిరికివాళ్లని.. కానీ మెజారిటీ ఆటగాళ్లు మద్దతు ఇచ్చారు. పాట్ కమిన్స్ సహా కొందరు ఆటగాళ్లు నా ముందు మంచిగా నటించి వెనుక మత్రం గోతులు తవ్వినట్లుగా అనిపించింది. కోచ్‌గా నేను నచ్చకపోతే ముఖం మీద చెప్పాల్సింది.. ఇలా వెనుక మాట్లాడడం తగదు. కోచ్‌కు, ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం కామన్. నాకు తెలియకుండా పాట్ కమిన్స్ లాంటి కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం మాలో జరిగిన కొన్ని విషయాలను లీక్ చేశారు. ఇది నా దృష్టిలో పెద్ద తప్పు. ఇక నేను పదవికి రాజీనామా చేసే సమయానికి జట్టు నెంబర్‌వన్‌లో ఉంది. దానిని కూడా సరిగ్గా ఎంజాయ్ చేయకుండానే నన్ను కోచ్ పదవి నుంచి తప్పించారు.'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు సరికొత్త ఫార్మాట్లో 2024 టి20 వరల్డ్‌కప్ -
నేనేమీ క్రిమినల్‌ను కాదు.. నాయకుడినే.. నరకం అనుభవించా: మండిపడ్డ వార్నర్
David Warner Can Request Review Of His Leadership Ban Now: ‘‘2018లో కేవలం నాలుగు రోజుల్లోనే నిర్ణయం జరిగిపోయింది. కానీ దానికి సంబంధించిన అభ్యర్థనపై స్పందించేందుకు తొమ్మిది నెలల సమయం తీసుకున్నారు’’ అంటూ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తానేమీ క్రిమినల్‌ను కాదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(ఏఈ) తీరును విమర్శించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా 2018 నాటి బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో వార్నర్ భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే వీల్లేకుండా సీఏ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సీఏ తీసుకున్న నిర్ణయంతో తన విషయంలో పునరాలోచన చేయాల్సిందగా డేవిడ్ వార్నర్ విజ్ఞప్తి చేసే అవకాశం లభించింది. 9 నెలల తర్వాత జీవితకాల నిషేధాల ఎత్తివేతపై ఆటగాళ్లు, సిబ్బంది బోర్డును ఆశ్రయించేలా నిబంధనలు సులభతరం చేయాలంటూ ఆస్ట్రేలియా ఆటగాళ్ల యూనియన్ గతంలో సీఏను అభ్యర్థించింది. ఈ క్రమంలో దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఏ వెల్లడించింది. స్పందించిన వార్నర్ ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా మీడియాతో మాట్లాడుతూ.. తన విషయంలో బోర్డును ఆశ్రయించే అవకాశం రావడం హర్షించదగ్గ పరిణామమని పేర్కొన్నాడు. అయితే, నిషేధం విధించడంలో ఉన్నంత తొందర.. ఇలాంటి అంశాలను సమీక్షించే అంశంలో మాత్రం లేకపోవడం దురదృష్టకరమన్నాడు. బాల్ టాంపరింగ్ వివాద సమయంలో తాను, తన కుటుంబం తీవ్ర వేదనకు గురయ్యామంటూ చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నేనేమీ క్రిమినల్‌ను కాదు ‘‘నేనేమీ నేరస్తుడిని కాదు.. ప్రతీ వ్యక్తికి తన తప్పు ఏమిటో.. అందుకు ఎంతకాలం శిక్ష అనుభవించాలో.. తెలుసుకునే అవకాశం ఇవ్వాలి. ఇందుకు సంబంధించి తదుపరి పరిణామాలేమిటో తెలుసుకునేందుకు.. పునరాలోచన చేయమని అప్పీలు చేసుకునే హక్కు కల్పించాలి. వాళ్లు నాపై నిషేధం విధించారు. కానీ జీవితకాల నిషేధం విధించడం నా పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడమే. నా పేరు పక్కన సీ(కెప్టెన్) లేదంటే వీసీ(వైస్ కెప్టెన్) అన్న హోదా ఉన్నా లేకపోయినా నేను మా జట్టుకు నాయకుడినే’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. బాల్ టాంపరింగ్ వివాదం వల్లే 2018లో కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా జరిగిన ‘బాల్ టాంపరింగ్’ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో నాటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహా డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై వేటు పడిన విషయం తెలిసిందే. చదవండి: ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ Suryakumar Yadav: సూర్య అత్యుత్తమ టీ20 బ్యాటర్ కాదా!? కివీస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
టీ20 వరల్డ్ కప్ బెస్ట్ టీమ్.. వాళ్లకు మాత్రం స్థానం లేదు! హవా ఎవరిదంటే!
టీ20 ప్రపంచకప్-2022 ఆదివారం(నవంబర్ 13)తో ముగిసిపోయింది. ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ రెండోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటిన ఆటగాళ్లతో క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను సోమవారం ప్రకటించింది. ఇప్పటికే ఐసీసీ కూడా ప్రపంచకప్ అత్యుత్తమ జట్టును ప్రకటిచింది. తాజగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌కు చోటుదక్కింది. అదే విధంగా ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ నుంచి గరిష్టంగా ముగ్గురు ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపికచేసింది. వారిలో కెప్టెన్ జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ ఉన్నారు. ఇక రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ నుంచి షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిదికి స్థానం దక్కింది. న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిఫ్స్, జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రజా, బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తిఫిజర్ రెహ్మన్, ప్రోటీస్ స్పీడ్ స్టార్ అన్రీచ్ నోర్జేకు కూడా ఈ జట్టులో చోటుదక్కింది. కాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టులో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టు: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, విరాట్ కోహ్లి, గ్లెన్ ఫిలిఫ్స్ సూర్యకుమార్ యాదవ్, సికిందర్ రజా, షాదాబ్ ఖాన్, సామ్ కర్రాన్, షాహీన్ ఆఫ్రిది, ముస్తాఫిజుర్ రెహ్మన్, అన్రీచ్ నోర్జే చదవండి: టీ20 వరల్డ్‌కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు -
ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా పాట్ కమిన్స్
ఆస్ట్రేలియా వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్.. తాజాగా వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. గత నెలలో ఆరోన్ ఫించ్ టి20లపై దృష్టి వన్డేల నుంచి రిటైర్ కావడంతో అప్పటినుంచి కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై ఆసీస్ క్రికెట్లో చర్చ నడిచింది. తాజాగా నిరీక్షణకు తెరదించుతూ కమిన్స్‌ను వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇక టి20 జట్టును ఆరోన్ ఫించ్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టి20 ప్రపంచకప్ తర్వాత ఫించ్ రిటైర్ అయ్యే అవకాశం ఉండడంతో మరో కొత్త కెప్టెన్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కమిన్స్‌ను మూడు ఫార్మట్లకు కెప్టెన్‌ను చేస్తారా లేక టి20 కెప్టెన్‌గా మరొకరిని నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఫించ్ స్థానంలో డేవిడ్ వార్నర్‌కు వన్డే జట్టు పగ్గాలు అప్పగిస్తారని భావించారు. కానీ 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా శాండ్ పేపర్ వివాదంలో చిక్కుకున్న వార్నర్ నాయకత్వ బాధ్యతలు చేపట్టకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. గత వారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంపై చర్చ జరిగింది. నిషేధాన్ని ఎత్తివేయడానికి అవసరమైన కోడ్ సవరణను సమీక్షించారు. కానీ కోడ్‌ను ఇంకా సవరించలేదు. దీంతో వార్నర్‌కు కెప్టెన్సీని అప్పగించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న కమిన్స్‌కే వన్డే బాధ్యతలను కూడా అప్పగించారు. జట్టులో స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లకు బదులు.. ఇద్దరు కెప్టెన్లు ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆసీస్ బోర్డు కమిన్స్ వైపు మొగ్గు చూపింది. ఆస్ట్రేలియాకు కమిన్స్ 27వ వన్డే కెప్టెన్ కాగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆసీస్ పురుషుల జట్టుకు సారథ్యం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్ అతడే కావడం విశేషం. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతుండగా.. జట్లన్నీ పొట్టి ఫార్మాట్‌పైనే ఫోకస్ పెట్టాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుంది. రాబోయే ఆరు నెలల కాలంలో ఆస్ట్రేలియా జట్టు 15 టెస్టులు ఆడనుంది. Pat Cummins has been named Australia's 27th ODI captain 🙌 pic.twitter.com/T0p02wwjiP — Cricket Australia (@CricketAus) October 17, 2022 చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు.. దటీజ్ కోహ్లి -
డేవిడ్ వార్నర్‌కు భారీ ఊరట
టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు భారీ ఊరట లభించింది. 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో జీవితకాల నిషేధం (కెప్టెన్సీ విషయంలో) ఎదుర్కొంటున్న అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ తియ్యటి కబురు చెప్పనుందని తెలుస్తుంది. సీఏ.. వార్నర్‌పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు ఫించ్ తర్వాత ఆసీస్ పరిమిత ఓవర్ల పగ్గాలు కూడా అప్పజెప్పాలని డిసైడైనట్లు కధనాలు వినిపిస్తున్నాయి. రేపు జరుగబోయే సీఏ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. వార్నర్‌పై కెప్టెన్సీ బ్యాన్ ఎత్తివేయాలని అభిమానులు, ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల నుంచి భారీ స్థాయిలో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సీఏ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఇదే బాల్ టాంపరింగ్ ఉదంతంలో వార్నర్‌తో పాటు నాటి ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్, ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ముగ్గురు ఆటగాళ్లు నేరం అంగీకరించిన నేపథ్యంలో బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు, స్టీవ్ స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం పడింది. అయితే ఈ కేసులో వార్నర్‌ను కీలక సూత్రధారిగా పరిగణించిన సీఏ.. అతనిపై లైఫ్ టైమ్ కెప్టెన్సీ బ్యాన్‌ను విధించింది. -
ఆస్ట్రేలియా జట్టు హెడ్‌కోచ్‌గా షెల్లీ నిట్ష్కే..
ఆస్ట్రేలియా మహిళల జట్టు హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ షెల్లీ నిట్ష్కే ఎంపికయ్యంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం వెల్లడించింది . షెల్లీ నిట్ష్కే నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా మహిళలల జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేయనుంది. కాగా అంతకుముందు ఆసీస్ హెడ్ కోచ్‌గా పనిచేసిన మథ్యూ మాట్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనుంది. ప్రపంచంలోనే అత్యత్తుమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన షెల్లీ నిట్ష్కే.. ఆస్ట్రేలియా తరపున 80 వన్డేలు, 36 టీ20లు, 6 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించింది. ఆమె తన కెరీర్లో 3000 పైగా పరుగులతో పాటు, 150 వికెట్లు పడగొట్టింది. ఇక కోచ్‌గా కూడా షెల్లీ నిట్ష్కేకు అపారమైన అనుభవం ఉంది. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె దేశీవాళీ జట్టు సౌత్ ఆస్ట్రేలియాకు కోచ్‌గా కూడా పని చేసింది. అదే విధంగా 2018లో ఆస్ట్రేలియా జట్టు మహిళలల ఆస్టెంట్ కోచ్‌గా ఆమె పనిచేసింది. మరోవైపు 2019 నుంచి బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్ జట్టు హెడ్‌కోచ్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే తాజాగా ఆసీస్ కోచ్‌గా ఎంపిక కావడంతో పెర్త్ స్కార్చర్ జట్టు హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి ఆమె తప్పుకోనుంది. చదవండి: Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే.. -
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా సీనియర్ గుడ్‌బై
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో మరో శకం ముగిసింది. ఆ జట్టు సీనియర్ క్రికెటర్ రేచల్ హేన్స్ గురువారం అంతర్జాతీయం సహా అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించింది. 2009లో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రేచల్ హేన్స్ దశాబ్దానికి పైగా ఆసీస్ క్రికెట్లో ప్రధాన బ్యాటర్‌గా సేవలందించింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలిచిన ఆరు మేజర్ టోర్నీల్లో రేచల్ హేన్స్ ఉండడం విశేషం. ఇక ఆస్ట్రేలియా తరపున రేచల్ హేన్స్ 6 టెస్టుల్లో 383 పరుగులు, 77 వన్డేల్లో 2585 పరుగులు, 84 టి20ల్లో 850 పరుగులు చేసింది. హేన్స్ ఖాతాలో రెండు వన్డే సెంచరీలు ఉన్నాయి. కాగా టెస్టుల్లో అరంగేట్రం ఇచ్చిన డెబ్యూ మ్యాచ్‌లోనే హేన్స్ 98 పరుగులు చేసి ఆకట్టుకుంది. హేన్స్ కెరీర్‌ను రెండు భాగాలుగా విడదీయొచ్చు. 2009 నుంచి 2013 వరకు, ఆ తర్వాత నాలుగేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన హేన్స్ 2017 నుంచి 2022 వరకు ఆటలో కొనసాగింది. ఇక హేన్స్ చివరగా బర్మింగ్హమ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆడింది. ఈ మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా స్వర్ణ పతకం గెలిచింది. ఇక హేన్స్ పలు సందర్భాల్లో జట్టును నడిపించింది. 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ భుజం గాయంతో పక్కకు తప్పుకోవడంతో నాయకత్వ బాధ్యతలు నిర్వహించింది. ఆ తర్వాత 2018లో తొలిసారి వైస్ కెప్టెన్ అయిన రేచల్ హేన్స్ 2020లో టి20 వరల్డ్ కప్, 2022లో వన్డే వరల్డ్‌కప్‌ను గెలవడంలో.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా స్వర్ణం గెలవడంలోనూ కీలకపాత్ర పోషించింది. ''ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఒక రేచల్ హేన్స్ సేవలు కోల్పోనుంది. దాదాపు దశాబ్దానికి పైగా క్రికెట్లో సేవలందించిన రేచల్ హేన్స్ ఇవాళ ఆటకు వీడ్కోలు పలకడం మా దురదృష్టం. ఇన్నేళ్లలో ఆమె జట్టు తరపున ఎన్నో విజయాల్లో పాలు పంచుకుంది. రేచల్ హేన్స్ ఆడిన కాలంలో ఆస్ట్రేలియా ఆరు మేజర్ టోర్నీలు గెలవడం ఆమెకు గర్వకారణం. మలి ప్రయాణం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాం'' అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ నిక్ హాక్లీ చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రేచల్ హేన్స్ ఈ సీజన్ తర్వాత అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోనుంది. చదవండి: 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్! క్రికెట్లో విషాదం.. అంపైర్ అసద్ రౌఫ్ హఠాన్మరణం -
కొత్త జెర్సీ విడుదల చేసిన ఆస్ట్రేలియా.. 'సంక్రాంతి ముగ్గులాగే ఉంది'
అక్టోబర్-నవంబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా 2022 టి20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్ ఎగురేసుకపోయింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న ఆసీస్ బుధవారం ప్రపంచకప్‌కు ధరించబోయే నూతన జెర్సీని ఆవిష్కరించింది. బ్లాక్ అండ్ యెల్లో కాంబినేషన్లో కాస్త కొత్తగా కనిపిస్తున్న జెర్సీపై ఎడమవైపు టి20 ప్రపంచకప్ 2022 అని రాసి ఉండగా.. మధ్యలో ఆస్ట్రేలియా అని ఇంగ్లీష్‌లో.. కుడివైపు ఆస్ట్రేలియా చిహ్నం ఉంటుంది. ఇక జెర్సీ కింది బాగంలో గ్రీన్, గోల్డ్ కాంబినేషన్లో ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది. జెర్సీకి సంబంధించిన విషయాలను క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ''టి20 ప్రపంచకప్ కోసం కొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉంది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన జెర్సీపై క్రికెట్ అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''ఆస్ట్రేలియా కొత్త జెర్సీలోని డిజైన్ సంక్రాంతి ముగ్గును తలపిస్తుంది'' అంటూ పేర్కొన్నారు. ఇక అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టి20 ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్ 16 నుంచి 23 వరకు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూఫ్-ఏలో శ్రీలంక, నమీబియా, ఊఏఈ, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూఫ్-బిలో వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వేలు ఉన్నాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరుకుంటాయి. ఇక సూపర్-12 దశలో గ్రూఫ్-1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్‌తో పాటు ఎ1, బి2 క్వాలిఫై జట్లు ఉండగా.. గ్రూప్-2లో టీమిండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు బి1, ఏ2 క్వాలిఫయింగ్ జట్లు ఉండనున్నాయి. ఇక అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తున్న టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 23న(ఆదివారం) జరగనుంది. View this post on Instagram A post shared by Cricket Australia (@cricketaustralia) చదవండి: సూర్యకుమార్లో మనకు తెలియని రొమాంటిక్ యాంగిల్.. టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా.. -
ఆసీస్ కెప్టెన్‌గా వార్నర్.. ఫించ్ మద్దతు కూడా ఇతనికే..!
ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ వైదొలిగిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న డిస్కషన్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కొందరేమో టెస్ట్ సారధి పాట్ కమిన్స్‌కే వన్డే కెప్టెన్సీ కూడా కట్టబెట్టాలని అంటుంటే.. మరికొందరేమో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరును సూచిస్తున్నారు. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉండేందుకు వార్నర్ సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్‌పై జీవితకాల నిషేధం (కెప్టెన్సీ విషయంలో) ఉన్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏ విధంగా స్పందిస్తుందో వేచి చేడాల్సి ఉంది. సమస్యను పరిష్కరించుకునేందుకు (బ్యాన్ ఎత్తివేత) డేవిడ్ భాయ్ స్వయంగా రంగంలోకి దిగి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో అతనికి తాజాగా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అలాగే పలువురు క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దల మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫించ్ స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి కూడా వైదొలుగుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసమే వార్నర్ కూడా ఎదురుచూస్తున్నాడని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మెగా టోర్నీ తర్వాత ఫించ్ పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటే.. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ మొత్తం కోసం పావులు కదపాలన్నది వార్నర్ ప్లాన్‌గా తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వార్నర్ టీ20 వరల్డ్‌కప్ అనంతరం ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. -
ఆండ్రూ సైమండ్స్‌కు నివాళి ప్రకటించనున్న ఆసీస్, జింబాబ్వే క్రికెటర్లు
ఆండ్రూ సైమండ్స్.. క్రికెట్లో ఈ పేరు తెలియని వారుండరు. ఆటలో ఎన్ని వివాదాలున్నా గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. అతని ఆటకు ఫిదా అయిన అభిమానులు చాలా మందే ఉన్నారు. కానీ మే 14.. 2022.. ఆస్ట్రేలియా క్రికెట్లో పెను విషాదం నింపింది. ఎందుకంటే అదే రోజు 46 ఏళ్ల వయసులో ఆండ్రూ సైమండ్స్ భౌతికంగా దూరమయ్యాడు. టౌన్స్‌విల్లే నగరం బయట జరిగిన యాక్సిడెంట్లో కారు తునకాతునకలు అవడంతో సైమండ్స్ మృతి చెందినట్లు పోలీసులు దృవీకరించారు. అయితే అంతకముందే ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా గుండెపోటుతో మరణించడం.. ఇలా రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు క్రికెటర్లు దూరమవడం ఆసీస్ అభిమానులను కలచివేసింది. Photo Credit: Getty Images ఇక విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. కాగా ఆదివారం ఆసీస్, జింబాబ్వేలు తొలి వన్డే ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ఆండ్రూ సైమండ్స్ స్వస్థలమైన టౌన్స్‌విల్లేలో జరగనుంది. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆండ్రూ సైమండ్స్‌కు ఘన నివాళి ప్రకటించనుంది. ఈ కార్యక్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు సైమండ్స్ భార్య, పిల్లలు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు పాల్గొననున్నారు. కాగా ఈ సిరీస్‌లో మూడు వన్డేలు టౌన్స్‌విల్లే వేదికగానే జరగనున్నాయి. Photo Credit: Getty Images ఇక 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిద్యం వహించాడు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..! Andrew Symonds: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ -
క్రికెట్లో 'ఆ' స్వరం ఇక వినపడదు..!
ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ సుదీర్ఘ కాలం తర్వాత తన క్రికెట్ వ్యాఖ్యానానికి ముగింపు పలికారు. ఇకపై తాను కామెంటరీ చేయబోనని ఆయన ప్రకటించారు. ఆరోగ్యపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇయాన్ వెల్లడించారు. 78 ఏళ్ల చాపెల్ ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత ప్రతిష్టాత్మక చానల్ 9 ద్వారా తన కామెంటరీని మొదలు పెట్టారు. తన అద్భుత వ్యాఖ్యానంతో క్రికెట్ ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేశారు. సూటి విమర్శలు, సునిశిత విశ్లేషణతో అత్యుత్తమ వ్యాఖ్యాతగా ఎదిగిన చాపెల్ 45 ఏళ్ల పాటు ఈ రంగాన్ని శాసించారు. ఆస్ట్రేలియా తరఫున 75 టెస్టులు ఆడి 5345 పరుగులు చేసిన ఇయాన్ చాపెల్ ఇందులో 30 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించారు. 16 వన్డేల్లో కూడా ఆయన ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సార్లు స్టార్ ఆటగాళ్లనుంచి విమర్శలు ఎదుర్కొన్నానని...అయితే ఏనాడూ తాను సూటి వ్యాఖ్యానం విషయంలో వెనక్కి తగ్గలేదన్న చాపెల్, క్రికెట్ బాగు కోసమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. -
'లంక దుస్థితికి చలించి'.. ఆసీస్ క్రికెటర్ల కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పెద్ద మనుసు చాటుకుంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ప్రజలకు సహాయం అందిస్తున్న యూనిసెఫ్‌కు(UNICEF) తమ వంతు విరాళాన్ని ప్రకటించింది. ఇటీవలే కంగారూలు.. లంకలో మూడు టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడిన సంగతి తెలిసిందే. లంకలో నెలకొన్న పరిస్థితులను ఆసీస్ ఆటగాళ్లు దగ్గరుండి చూశారు. ఎన్ని కష్టాలున్నా లంక, ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లను లంక ప్రేక్షకులు బాగా ఆదరించారు. లంక ప్రజల అభిమానం చూరగొన్న ఆసీస్ క్రికెటర్లు వారికి స్వయంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే లంక పర్యటనలో భాగంగా వచ్చిన ప్రైజ్ మనీని యూనిసెఫ్ ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్లు లంక చిన్నారులకు అందించనుంది. ఆస్ట్రేలియాలో యూనిసెఫ్ కు ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20లలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీ (45వేల ఆస్ట్రేలియా డాలర్లు)ని లంకలో యూనిసెఫ్ కు అందించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ధరాభారం పెరిగి పెద్దలతో పాటు చిన్నారులు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారి బాగోగులు చూసుకోవడానికి పనిచేస్తున్న యూనిసెఫ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ప్రైజ్ మనీని అందించనున్నారు. ఇదే విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో ప్రజల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయనేది ప్రపంచం ముందు కనబడుతున్న సత్యం. మేము అక్కడ పర్యటించినప్పుడు వాళ్ల కష్టాలను స్వయంగా చూశాం. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం. తద్వారా చిన్నారులకు, పేద ప్రజలకు సాయం చేయాలని ఆశించాం’ అని అన్నాడు. కాగా కమిన్స్ ఇలా సాయం చేయడం తొలిసారి కాదు. గతేడాది కరోనా సందర్బంగా ఆక్సిజన్ సిలిండర్లు లేక భారత్ లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్యాట్ కమిన్స్, క్రికెట్ ఆస్ట్రేలియా లు కలిసి 50వేల డాలర్ల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఇక లంక పర్యటనలో ఆసీస్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. కానీ వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. ఇక టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. చదవండి: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ -
ఆస్ట్రేలియా కెప్టెన్ అనూహ్య నిర్ణయం.. గౌరవించిన సీఏ
ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోనుంది. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మెగ్ లానింగ్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపింది. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా తరపున బిజీ క్రికెట్ ఆడాను. కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు మానసికంగా అలసిపోయిన నాకు విశ్రాంతి కావాలనిపిస్తుంది. అందుకే ఈ లాంగ్ బ్రేక్. త్వరలో మళ్లీ జట్టులోకి వస్తా అంటూ 30 ఏళ్ల లానింగ్ పేర్కొంది. ''వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్న మెగ్ లానింగ్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం.. మా క్రికెట్లో బ్రేక్ అనే పదానికి మెగ్ లానింగ్ అర్హురాలు'' అంటూ ట్విటర్లో పేర్కొంటూ ఆమెకు మద్దతిచ్చింది. ఇటీవలే నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆసీస్ మహిళల జట్టు స్వర్ణం పతకం ఎగురేసుకుపోయిన సంగతి తెలిసింది. టీమిండియా మహిళలతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా వుమెన్స్ విజయం సాధించిన స్వర్ణం కొల్లగొట్టగా.. భారత్ రజతం కైసవం చేసుకుంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో మెగ్ లానింగ్ తనదైన ముద్ర వేసింది. లానింగ్ ఖాతాలో రెండు మహిళల వన్డే ప్రపంచకప్‌లతో పాటు.. నాలుగు టి20 ప్రపంచకప్‌లు ఉండడం విశేషం. ఇందులో మూడు టి20 ప్రపంచకప్‌లు(2014, 2018, 2020)లానింగ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా గెలవడం విశేషం. మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డులు.. ►వన్డేల్లో అత్యధిక సెంచరీలు మెగ్ లానింగ్ పేరిటే ఉన్నాయి. వన్డేల్లో లానింగ్ 15 సెంచరీలు సాధించింది. ►టి20ల్లో ఆస్ట్రేలియా మహిళల తరపున 2వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా రికార్డు. ►మిథాలీ రాజ్(భారత్), చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్) తర్వాత 150 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మూడో క్రీడాకారిణిగా రికార్డు ►ఓవరాల్‌గా మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా మహిళల జట్టు తరపున 6 టెస్టుల్లో 93 పరుగులు, 100 వన్డేల్లో 4463 పరుగులు, 115 టి20ల్లో 3007 పరుగులు సాధించింది. If anyone deserves a break, it's Meg Lanning. pic.twitter.com/BC8fKTwSDw — Cricket Australia (@CricketAus) August 10, 2022 చదవండి: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్.. మళ్లీ నెంబర్ 1 స్థానానికి! -
ఆటగాళ్లకు కోట్లలో ఆఫర్.. సొంత లీగ్‌కు తూట్లు పొడిచే యత్నం!
క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్వహించే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)కు ఆటగాళ్లు తూట్లు పొడిచే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది యూఏఈ వేదికగా జనవరిలో ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్టీ 20) ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో కోట్ల రూపాయలు కుమ్మరించి స్టార్ ఆటగాళ్లను ఆడించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌లో ఆడే 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐఎల్టీలో ఆడేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారత కరెన్సీలో దాదాపు రూ.30 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రతీఏటా బీబీఎల్ డిసెంబర్లో మొదలై.. ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఇక ఈ ఏడాది డిసెంబర్ 13న మొదలుకానున్న బీబీఎల్ ఫిబ్రవరి 4 వరకు జరగనుంది.ఇదే సమయంలో ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ 20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు మొదటి ఎడిషన్ జరగనుంది. మొత్తం ఆరుజట్లు ఉండగా.. ఈ జట్లను దాదాపు ఐపీఎల్‌తో సంబంధమున్న సంస్థలే కొనుగోలు చేయడం విశేషం. యూఏఈ వేదికగా జరుగుతున్న తొలి సీజన్‌ను విజయవంత చేసేందుకు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని అన్ని జట్లు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌లో ఆడుతున్న 15 మంది ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లకు బీబీఎల్ వదిలేసి.. ఐఎల్టీ లీగ్‌లో పాల్గొనేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఏఈ టి20 లీగ్‌లో ఒక్కో టీమ్‌కి 2.5 మిలియన్ డాలర్లు (రూ.20 కోట్లు) పర్సు వాల్యూని కేటాయించారు. దీంతో స్టార్ ప్లేయర్లను 450000 డాలర్లు (దాదాపు 3.5 కోట్లు) ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐపీఎల్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ మిగిలిన క్రికెట్ లీగులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. పొరుగుదేశం పాక్‌లో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధికంగా చెల్లించే మొత్తం రూ.1.9 కోట్లు మాత్రమే... ఐపీఎల్ తర్వాత అత్యంత పాపులారిటీ దక్కించుకున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. దీంతో యూఏఈ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్లు, బిగ్‌బాష్ లీగ్ ఆడకుండా అదే సమయంలో యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు 15 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు రూ.4 కోట్ల దాకా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆశచూపిస్తున్నారని సమాచారం. రూ.4 కోట్లంటే ఐపీఎల్లో అన్క్యాప్డ్ రిజర్వు ప్లేయర్‌కి ఇచ్చే మొత్తం. అయితే బీబీఎల్ ద్వారా వచ్చే దానితో పోల్చుకుంటే, ఆసీస్ క్రికెటర్లకు ఇది చాలా ఎక్కువ మొత్తమే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాకి భయం పట్టుకుంది. అయితే బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే అనుమతి తప్పనిసరి. కానీ బిగ్‌బాష్ లీగ్‌లో ఆటగాళ్లకు అలాంటి అవసరం లేదు. లీగ్‌లో ఆడాలా వద్దా అనేది ఆటగాళ్ల నిర్ణయానికే వదిలేస్తుంది అక్కడి సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా). అందుకే 2014 నుంచి ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు బీబీఎల్ ఆడింది లేదు. వార్నర్ ఒక్కడే కాదు.. చాలా మంది ఆసీస్ క్రికెటర్లు బీబీఎల్‌ను మధ్యలోనే వదిలేసి వేరే లీగ్ ఆడేందుకు వెళ్లిపోతుంటారు. ఆసీస్ క్రికెటర్లు ఆ డబ్బుకి ఆశపడి యూఏఈ టీ20 లీగ్‌లో ఆడాలని నిర్ణయం తీసుకుంటే, స్టార్ ప్లేయర్లు లేకుండా బీబీఎల్‌ని నిర్వహించాల్సి ఉంటుంది. మిగిలిన దేశాల ప్లేయర్లు కూడా యూఏఈ టీ20 లీగ్ ఆడేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తే బీబీఎల్ నిర్వహణే కష్టమైపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోందట ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. బీసీసీఐ మాదిరిగానే తమ ప్లేయర్లు, విదేశీ టీ20ల్లో లీగుల్లో పాల్గొనకుండా నియంత్రించాలనే ఆలోచనలో కూడా సమాచారం. ఇక ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి యూఏఈ నుంచి 7 లక్షల డాలర్లు (దాదాపు 5.5 కోట్లు) ఆఫర్ వచ్చిందని, అలాగే ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కి కూడా దాదాపు రూ.6 లక్షల డాలర్లకు పైగా ఆఫర్ వచ్చందని... ఈ ఇద్దరూ యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియాని అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. చదవండి: NED vs NZ: పసికూనపై కివీస్ ప్రతాపం.. సిరీస్ క్లీన్‌స్వీప్ Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..! -
డేవిడ్ వార్నర్‌కు భారీ ఆఫర్.. 'ఆ లీగ్'లో ఆడించేందుకు విశ్వ ప్రయత్నాలు
David Warner: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను బిగ్ బాష్ లీగ్‌లో (బీబీఎల్) ఆడించే నిమిత్తం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్‌తో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. వార్నర్ బీబీఎల్‌లో ఆడేందుకు ఒప్పుకుంటే 5 లక్షల డాలర్ల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఏకు చెందిన కీలక ప్రతినిధి వెల్లడించారు. నివేదికల ప్రకారం..బీబీఎల్ అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ అయిన ఛానెల్ 7తో క్రికెట్ ఆస్ట్రేలియాకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ఛానల్ 7తో ఒప్పందం సమయంలో బీబీఎల్ భారీ సంఖ్యలో వ్యూయర్ షిప్ దక్కించుకుంటుందని సీఏ హామీ ఇచ్చింది. అయితే ఊహించిన దాంట్లో సగం వ్యూయర్ షిప్ కూడా రాకపోవడంతో సీఏపై ఛానల్ 7 దావా వేసింది. బీబీఎల్‌లో క్వాలిటీ ఆటగాళ్లు లేరని, అందు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఛానల్ 7 వాదిస్తుంది. దీంతో సీఏ దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ఆటగాళ్లను బీబీఎల్ బరిలోకి దించితే వ్యూయర్ షిప్ భారీగా పెరుగుతుందని భావిస్తుంది. ఇందుకోసం వార్నర్‌కు ఊహకందని భారీ మొత్తం ఆఫర్ చేయాలని నిర్ణయించుకుంది. అంతర్జాతీయ షెడ్యూల్, తదితర కారణాల వల్ల వార్నర్ ఇప్పటివరకు కేవలం మూడే మూడు బీబీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అతను చివరిసారిగా బీబీఎల్ 2014 సీజన్లో కనిపించాడు. ఇదిలా ఉంటే, వార్నర్ వచ్చే ఏడాది బీబీఎల్ సమయానికి యూఏఈలో జరిగే టీ20 లీగ్‌లో ఆడాలని భావిస్తున్నట్లు అతని మేనేజర్ తెలిపాడు. యూఏఈ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వార్నర్‌కు యూఏఈ లీగ్‌లోని ఫ్రాంచైజీలు కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వార్నర్ బీబీఎల్‌ను కాదని యూఏఈ లీగ్‌లో ఆడితే బీబీఎల్ ప్రసారదారు ఛానల్ 7కు భారీ నష్టం వస్తుందని అంచనా. ఆసీస్ ప్రేక్షకులు వార్నర్ కోసం బీబీఎల్‌ను కాదని యూఏఈ లీగ్‌ను చూసే అవకాశాలే ఎక్కువ. చదవండి: అదరగొట్టిన సూర్యకుమార్.. నెం1 స్థానానికి చేరువలో! -
ఆస్ట్రేలియా మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కన్నుమూత..!
క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ లారీ సాల్(96) మంగళవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో పెర్త్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాల్ మరణించినట్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. 1982 నుంచి 1995 వరకు ఆస్ట్రేలియా జట్టుకు జాతీయ సెలెక్టర్‌గా పనిచేశారు. అతని పని చేసిన కాలంలోనే స్టీవ్ వా,మార్క్ వా, మార్క్ టేలర్, ఇయాన్ హీలీ, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, డామియన్ మార్టిన్, జస్టిన్ లాంగర్, మాథ్యూ హేడెన్ వంటి ఆసీసీ దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 35 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సాల్ 1701 పరుగులు చేశాడు. అతని కెరీర్లో ఒక ఫస్ట్ క్లాస్ సెంచరీ ఉంది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 7వ ఆస్ట్రేలియన్ ఇన్ఫాంట్రీ బెటాలియన్‌లో పనిచేసినందున లారీ సాల్‌కు 'కల్నల్' అనే మారుపేరు కూడా ఉంది. చదవండి: TNPL: మురళీ విజయ్‌కు చేదు అనుభవం.. డీకే..డీకే అంటూ ఫాన్స్ కేకలు.. అతనేం చేశాడంటే..! -
డిస్నీ–స్టార్‌తో సీఏ ఒప్పందం
మెల్బోర్న్: భారత ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ‘డిస్నీ–స్టార్’తో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సుదీర్ఘ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే క్రికెట్ మ్యాచ్‌ల్ని భారత్‌లో ఏడేళ్లపాటు ప్రసారం చేసే ఒప్పందాన్ని డిస్నీ స్టార్‌తో కుదుర్చుకుంది. వచ్చే సీజన్ (2023–24) నుంచి ఒప్పందంలో భాగంగా ఆసీస్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్), మహిళల బీబీఎల్ టోర్నమెంట్లను భారత్‌లో డిస్నీ–స్టార్ నెట్వర్క్ ప్రసారం చేస్తుంది. ప్రస్తుతం సోనీ నెట్వర్క్ వద్ద సీఏ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులున్నాయి. 2017–18 సీజన్ నుంచి సోనీ చానెళ్లు ఆస్ట్రేలియా మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్నాయి. క్రికెట్ క్రేజ్ ఉన్న భారత్‌లో తమ మ్యాచ్‌ల ఆదరణ మరింత పెరిగేందుకు స్టార్ నెట్‌వర్క్‌తో ఒప్పందం దోహదం చేస్తుందని సీఏ సీఈఓ నిక్ హాక్లీ తెలిపారు. -
BBL 2022-23: మరో మహా సంగ్రామం ఎప్పటి నుంచి అంటే..?
Big Bash League 2022-23: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సక్సెస్ అయిన మరో క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహా సంగ్రామానికి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. 2022-23 సీజన్ పురుషుల వెర్షన్ ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి ప్రారంభంకానుండగా.. మహిళల బీబీఎల్ అంతకంటే రెండు నెలల ముందు అక్టోబర్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. Our heroes are returning home! For the first time in three years, every Club is playing at home and we couldn't be more pumped 🤩 Full #WBBL08 schedule deets: https://t.co/oUaicm0FOH pic.twitter.com/oXPyYwRr71 — Weber Women's Big Bash League (@WBBL) July 6, 2022 సిడ్నీ థండర్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్‌తో పురుషుల బీబీఎల్ మొదలుకానుండగా.. బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్ మధ్య మ్యాచ్‌తో మహిళల టోర్నీ ప్రారంభంకానుంది. మహిళల టోర్నీ అక్టోబర్ 13న మొదలై నవంబర్ 27 వరకు జరుగనుండగా.. పురుషుల లీగ్ డిసెంబర్ 13 నుంచి వచ్చే ఏడాది (2023) జనవరి 25 వరకు జరుగుతుంది. ఈ రెండు లీగ్‌లకు సంబంధించిన ఫిక్షర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.. 🗓 #BBL12 SCHEDULE 🗓 The 12th instalment of the Big Bash is coming your way this summer! pic.twitter.com/npDQAd7U7c — KFC Big Bash League (@BBL) July 14, 2022 చదవండి: BBL: మరోసారి రెనెగేడ్స్‌తో జట్టు కట్టిన భారత కెప్టెన్! -
శ్రీలంకతో టెస్టు సిరీస్.. ఐదేళ్ల తర్వాత మాక్స్వెల్ రీ ఎంట్రీ..!
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ట్రావిస్ హెడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో మాక్స్‌వెల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 29న ప్రారంభం కానుంది. ఈ రెండు టెస్టులు కూడా గాలే వేదికగానే జరగనున్నాయి. ఇక మాక్స్వెల్ చివరి సారిగా 2017 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. 2013లో భారత్‌పై టెస్టుల్లో మాక్స్వెల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడిన మాక్స్వెల్ 339 పరుగులతో పాటు 8 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ (విసి), మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ చదవండి: వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..! -
వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..!
నాలుగేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు. ఈ ఘటన జరగిన సమయంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్ క్రాఫ్ట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది కాలం పాటు నిషేదం విధించింది. ఇక నిషేధం ముగిసిన ఏడాది వరకు స్మిత్‌ను కెప్టెన్సీకి అనర్హుడిగా ప్రకటించారు. అదే విధంగా డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై క్రికెట్ ఆస్ట్రేలియా జీవిత కాల నిషేదం విధించింది. అయితే తాజా పరిణామాల ప్రకారం.. వార్నర్ కెప్టెన్సీపై జీవిత కాల నిషేదం ఎత్తి వేసే యోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు బెన్ హార్న్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 2018 బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో వార్నర్‌పై విధించిన కెప్టెన్సీ నిషేదాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా పునః పరిశీలిస్తుంది. ఈ నిషేదంతో టీ20 లీగ్‌లలో వార్నర్ తన కెప్టెన్సీ అవకాశాలు కోల్పోతున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా ఆ దేశ మేజర్ టోర్నీ బిగ్‌బాష్ లీగ్‌లో కూడా కేవలం ఆటగాడిగానే వార్నర్ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై నిషేదం ఎత్తి వేయనున్నట్లు సమాచారం. చదవండి: IND-W Vs SL-W: రాణించిన షఫాలీ, రోడ్రిగ్స్.. శ్రీలంకపై భారత్ ఘనవిజయం -
కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణం క్రీడాభిమానులను కలచివేసింది. ఎన్ని వివాదాలున్నా.. తన విధ్వంసకర బ్యాటింగ్‌కు.. ఢిపరెంట్‌గా ఉండే హెయిర్‌స్టైల్‌కు అభిమానులు చాలా మందే ఉన్నారు. గత శనివారం రాత్రి టౌన్స్విల్లీలోని క్వీన్స్‌ల్యాండ్‌లో సైమండ్స్ కారు భయంకరమైన యాక్సిడెంట్‌కు గురవ్వడంతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్డించారు. బ్రిస్బేన్ కొరియర్ మెయిల్ అనే పత్రిక సైమండ్స్ కారు యాక్సిడెంట్ ఫోటోలు రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు నెలల వ్యవధిలోనే ఆసీస్ క్రికెట్ ఇద్దరు ఆటగాళ్లను కోల్పోవడం క్రీడాలోకాన్ని దిగ్ర్బాంతికి గురి చేసింది. ఇక సైమండ్స్ మృతిపై అతని సోదరి లూయిస్ విచారం వ్యక్తం చేసింది. తన సోదరుడు చనిపోయిన స్థలాన్ని సందర్శించిన లూయిస్.. ఒక ఎమోషనల్ నోట్‌ను అక్కడ ఉంచింది. ''చాలా తొందరగా వెళ్లిపోయావ్.. రెస్ట్ ఇన్ పీస్ ఆండ్రూ సైమండ్స్. నీ జీవితంలో ఒక రోజు మిగిలి ఉన్నా బాగుండేది.. ఇకపై నీ ఫోన్‌కాల్ నాకు వినపడదు. నా హృదయం ముక్కలయింది. నేను నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను బ్రదర్'' అంటూ రాసుకొచ్చింది. లూయిస్ రాసిన నోట్‌ను మియా గ్లోవర్ అనే రిపోర్టర్ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం సైమండ్స్‌కు తన సోదరి రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనతి కాలంలోనే ఆస్ట్రేలియా టీమ్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సైమండ్స్ పేరు తెచ్చుకున్నారు. కెరీర్లో 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 198 వన్డేల్లో 5088 పరుగులు చేసిన సైమండ్స్.. అందులో ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆల్‌రౌండర్.. 133 వికెట్లు పడగొట్టాడు.2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సైమండ్స్.. మొత్తం 26 మ్యాచ్‌ల్లో 1463 పరుగులు చేయగా.. వాటిలో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 పరంగా 14 మ్యాచ్‌ల్లో.. రెండు హాఫ్ సెంచరీలతో 337 పరుగులు చేశాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు సైమండ్స్ వీడ్కోలు పలికాడు. చదవండి: ఆ క్రికెటర్‌ను బూతులు తిట్టారు.. నెలల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు..! ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే..? Floral tributes lay at the crash site where Andrew “Roy” Symonds lost his life on Saturday night, outside of Townsville. The letter, penned by his sister, reads “I will always love you my brother” @TheTodayShow pic.twitter.com/Wt3EZGc6Ty — Mia Glover (@miaglover_9) May 15, 2022 -
ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే..
క్రికెట్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్ తగిలింది. ఆసిస్ లెజెండరీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సైమండ్స్ ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు మాత్రమే కాకుండా అత్యంత నైపుణ్యం కలిగిన ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే సైమండ్స్ తన ఆటతో పాటు పలు కాంట్రవర్శీలతో కూడా వార్తల్లో నిలిచాడు. ఇవి అతని క్రికెట్ కెరీర్‌ని కాస్త మసకబారేలా చేశాయి. అందులో ముఖ్యమైంది మంకీ గేట్ వివాదం. వివాదాలతో వార్తల్లో.. సైమండ్స్ క్రికెట్ చరిత్రలో ‘మంకీగేట్’ వివాదం ఓ కుదుపు కుదిపేసింది. అప్పుడు ఏం జరిగిందంటే.. 2008లో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ తనను ‘మంకీ’ అన్నాడని ఆండ్రూ సైమండ్స్ ఆరోపించాడు. అయితే హర్భజన్ మాత్రం తాను అలా అనలేదని చెప్పాడు. హర్భజన్ సింగ్‌కి అవతలివైపు నాన్స్టైయికింగ్లో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ టెండూల్కర్, ఈ విషయంలో హర్భజన్‌కు మద్దతుగా నిలిచాడు. భజ్జీ మంకీ అనలేదని, హిందీలో ఒక అసభ్య పదం ప్రయోగించాడని చెప్పాడు. ఆ పదం తాను స్వయంగా విన్నానని స్పష్టం చేశాడు. ఈ విషయం మీద దాదాపు కొన్ని రోజుల పాటు వివాదం, విచారణ సాగింది. చివరకు భజ్జీపై ఒక టెస్టు మ్యాచ్ నిషేదం, జరిమానా విధించారు. మైఖెల్ క్లార్క్ వైస్-కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2008లో డార్విన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ నుంచి సైమండ్స్ ప్రవర్తన సరిగా లేదని ఇంటికి పంపింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఎందుకంటే సైమండ్స్ యాజమాన్యం నిర్వహించే సమావేశాలు హాజరవడం కంటే చేపల వేటకు వెళ్లేందుకు ఇష్టపడేవాడు. 2005లో కార్డిఫ్‌లో బంగ్లాదేశ్‌తో ట్రై-సిరీస్ మ్యాచ్‌కు ముందు సైమండ్స్ ఆస్ట్రేలియన్ జట్టు నుంచి తొలగించారు. మ్యాచ్‌కు మునుపటి సాయంత్రం మద్యం సేవించడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 2009లో, ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియన్ జట్టులో ఉన్నప్పుడు మూడవసారి క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ట్వంటీ20 ప్రపంచ కప్ నుంచి తొలగించారు. సైమండ్స్ స్వభావం తన క్రికెట్ కెరీర్‌ను దెబ్బ తీసిందనే చెప్పాలి. సైమండ్స్ తన కెరీర్లో అనేక వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ, అతను ప్రపంచ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. చదవండి: Andrew Symonds: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి -
Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం
క్వీన్స్‌ల్యాండ్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ మృతి చెందాడు. గత రాత్రి టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో 46 ఏళ్ల సైమండ్స్ మరణించాడు. 1998లో ఆస్ట్రేలియా తరపున వన్డే ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసిన సైమండ్స్.. దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. 2003, 2007 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే సైమండ్స్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఐసీసీ, ఆసీస్ మాజీ ఆటగాళ్లు ఆడమ్ గ్రిల్‌కిస్ట్, గిల్లెస్పీ, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఫ్లెమింగ్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విటర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. Think of your most loyal, fun, loving friend who would do anything for you. That’s Roy. 💔😞 — Adam Gilchrist (@gilly381) May 15, 2022 Shocking news to wake up to here in India. Rest in peace my dear friend. Such tragic news 💔🥲 pic.twitter.com/pBWEqVO6IY — VVS Laxman (@VVSLaxman281) May 15, 2022 'కారు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మరణించారని తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. మేము మైదానంలోనూ బయట మంచి సంబంధాన్ని పంచుకున్నాము. వారి కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు. Devastated to hear about Andrew Symonds passing away in a car crash in Australia. We shared a great relationship on & off the field. Thoughts & prayers with the family. #AndrewSymonds pic.twitter.com/QMZMCwLdZs — Shoaib Akhtar (@shoaib100mph) May 14, 2022 ఆస్ట్రేలియా క్రికెట్ మరో అత్యుత్తమైన ఆటగాడని కోల్పోయింది. రెండు ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్రపోషించిన క్వీన్స్ ల్యాండర్ సైమండ్స్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో మేము తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ విషాద సమయంలో సైమండ్స్ కుటుంబానికి క్రికెట్ ఆస్ట్రేలియా, స్నేహితులు, సన్నిహితులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. Vale Andrew Symonds. We are shocked and saddened by the loss of the loveable Queenslander, who has tragically passed away at the age of 46. pic.twitter.com/ZAn8lllskK — Cricket Australia (@CricketAus) May 15, 2022 దిగ్గజ క్రికెటర్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ కూడా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాం అంటూ ట్వీట్ చేశారు. Horrendous news to wake up to. Utterly devastated. We are all gonna miss you mate.☹️ #RIPRoy — Jason Gillespie 🌱 (@dizzy259) May 14, 2022 చదవండి: (క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి) Deeply saddened by the passing of Andrew Symonds. 💔#RIPRoy pic.twitter.com/qFYbJI2V8y — Mumbai Indians (@mipaltan) May 15, 2022 ఆండ్రూ సైమండ్స్ మృతి పట్ల భారత క్రికెటర్ విరాట్ కోహ్లి సంతాపం వ్యక్తం చేశాడు. ఈ వార్త తనని దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కోహ్లి.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని, ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించే శక్తిని సైమండ్స్ కుటుంబ సభ్యులకు దేవుడు అందివ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్ ద్వారా తన సంతాపాన్ని తెలిపాడు. Shocking and saddening to hear of Andrew Symonds passing. May his soul RIP and God give strength to his family in this difficult moment. 🙏🏻 — Virat Kohli (@imVkohli) May 15, 2022 -
ఐపీఎల్ 2022 నుంచి వైదొలిగిన కేకేఆర్ స్టార్ బౌలర్
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్.. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2022 నుంచి వైదొలిగాడు. తుంటి ఎముక గాయం కారణంగా కమిన్స్ లీగ్‌ను వీడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. గాయం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికి వచ్చే నెలలో శ్రీలంక పర్యటన ఉన్న కారణంగా కమిన్స్ ఐపీఎల్ వీడినట్లు సమాచారం. ప్రస్తుతం స్వదేశానికి పయనమయిన కమిన్స్ సిడ్నీలోని రీహాబిలిటేషన్ సెంటర్‌కు చేరుకోనున్నాడు. లంకతో సిరీస్ వరకు ఫిట్నెస్ సాధించి వన్డే, టెస్టు సిరీస్‌లకు సిద్దంగా ఉండాలని కమిన్స్ భావించాడు. కాగా లంకతో టి20 సిరీస్‌కు కమిన్స్ దూరంగా ఉండనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా సిరీస్ జరగడంపై అనుమానాలు ఉన్నప్పటికి.. దుబాయ్ వేదికగా ఈ సిరీస్‌ను నిర్వహించాలనే యోచనలో లంక్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్లో కేకేఆర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కమిన్స్ ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 56 పరుగులు సాధించి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యంత వేగంగా ఫిఫ్టీ అందుకున్న బ్యాటర్‌గా కేఎల్ రాహుల్‌తో కలిసి కమిన్స్ సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కమిన్స్ 63 పరుగులతో పాటు బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్ 22 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక కేకేఆర్ ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కేకేఆర్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికి ప్లే ఆఫ్ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. చదవండి: Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌షాక్.. కీలక సమయంలో యువ ఆటగాడు దూరం! IPL 2022: సీఎస్కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్ఆర్హెచ్ బాటలోనేనా! -
'వార్న్.. సాక్సుల్లో నోట్ల కట్టలు దాచేవాడు'
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ భౌతికంగా దూరమై నెలరోజులు కావొస్తుంది. బుధవారం మెల్బోర్న్ వేదికగా వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహించనుంది. మరికొద్ది గంటల్లో వార్న్ అంత్యక్రియలు ముగియనున్నాయి. ఇప్పటికే ఆసీస్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సహా చాలా మంది క్రికెట్ అభిమానులు వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు మెల్బోర్న్కు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్.. దిగ్గజ స్పిన్నర్‌తో ఉన్న జ్ఞాపకాలను పంచకున్నాడు. ''కొన్నేళ్ల పాటు డ్రెస్సింగ్‌రూమ్‌లో మా ఇద్దరి మధ్య చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక విషయం మాత్రం ఎప్పటికి మరిచిపోను. సౌతాఫ్రికాతో బాక్సింగ్ టెస్టు అనుకుంటా.. ఆ మ్యాచ్ మూడోరోజు ఆట ప్రారంభమైంది. ఆ సందర్భంలో ఒక పని విషయమై వార్న్ దగ్గరికి వెళ్లాను. అయితే అప్పటికే వార్న్ తన హెల్మెట్ పక్కన సాక్సులను గది మొత్తం పరిచాడు. ఆ సాక్సుల్లో వంద ఆస్ట్రేలియన్ డాలర్ల నోట్ల కట్టలు ఉండలుగా చుట్టు ఉన్నాయి. ఇదంతా చూసి ఏంటిదంతా.. డబ్బు అంతా ఎక్కడిది అని అడిగాను. రాత్రి కాసినో ఆడాను. ఆ గేమ్‌లో ఈ డబ్బును సొంతం చేసుకున్నాను. . దాదాపు 40 నోట్ల కట్టలు ఉంటాయి.. లెక్కపెట్టడానికి ఒకరోజు పడుతుంది. డబ్బు కింగ్ అన్నది ఇది చూస్తే నీకు అర్థమవుతుంది కదా బ్రదర్ అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి వార్న్ దగ్గర సాక్స్, బూట్లు చాలా ఉండేవి. మేం ఏం పర్యటనకు వెళ్లినా వార్న్ తన వెంట చాలా జతల సాక్స్‌లు, బూట్లు పట్టుకొచ్చేవాడు.'' అని సైమండ్స్ పేర్కొన్నాడు. చదవండి: ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్‌ను వెనక్కునెట్టి ఆరో స్థానానికి చేరుకున్న బంగ్లాదేశ్ ICC Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్‌లు -
ఆస్ట్రేలియాకు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. తుంటి ఎముక గాయంతో బాధపడుతున్నట్లు తేలినందున మార్ష్ పాక్‌తో జరగనున్న మిగతా వన్డేలు ఆడడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గాయం తీవ్రత పెద్దగా లేదని రెండు వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఒక రకంగా ఆస్ట్రేలియాకు ఇది షాకింగ్ న్యూస్ అయినప్పటికి.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మాత్రం ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే గాయపడిన మార్ష్ స్వదేశం వెళ్లకుండా ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు రానున్నాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతుండడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరినప్పటికి ఒకటి, రెండు మ్యాచ్‌లకు దూరమైనప్పటికి ఆ తర్వాత సీజన్ అంతా అందుబాటులో ఉండనున్నాడు. భారత్‌కు రానున్న మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్ రిహాబిటేషన్ సెంటర్లో ఫిజియో పాట్రిక్ ఫర్హాత్ పర్యవేక్షణలో రికవరీ అవ్వనున్నాడు. ఇప్పటికే సౌతాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్ట్జే పాట్రిక్ ఫర్హాత్ నేతృత్వంలోనే కోలుకుంటున్నాడు. ఏప్రిల్ 7న నోర్జ్టే ఢిల్లీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మార్ష్ కూడా ఏప్రిల్ రెండో వారంలో జట్టుతో కలిసే అవకాశం ఉంది. కాగా మిచెల్ మార్ష్ గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అందరికి గుర్తుండే ఉంటుంది. అదే తరహా మెరుపులు మార్ష్ నుంచి ఐపీఎల్లో చూసే అవకాశం ఉంది. మరో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రత్యేక అనుమతితో వార్న్ అంత్యక్రియల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. వచ్చే వారంలో వార్న్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరవచ్చు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ తర్వాతి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముస్తాఫిజుర్ రెహ్మాన్, లుంగీ ఎన్గిడి అందుబాటులోకి రానున్నారు. చదవండి: Nicholas Pooran: కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్ అయితే ఎలా? Virat Kohli: కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లిని ఊరిస్తున్న రికార్డులు -
ఆస్ట్రేలియా బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు స్పిన్ కన్సల్టెంట్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ధృవీకరించింది. పాకిస్తాన్ తో టెస్టు సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా లాహోర్‌లో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. ఈ వైట్‌బాల్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్ సలహాదారుగా వెట్టోరి వ్యవహరించనున్నాడు. కాగా వెట్టోరి 2019 నుంచి 2021 వరకు బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. అదే విధంగా గతంలో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఇక వెట్టోరి తన అంతర్జాతీయ కెరీర్లో 705 వికెట్లు సాధించాడు. వాటిలో 365 టెస్టు, 305 వన్డే, 38 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి రెండు టెస్టులు డ్రా ముగిశాయి. ఇక సిరీస్‌లో అఖరి టెస్టు లాహోర్ వేదికగా జరుగుతోంది. మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది. చదవండి: IPL 2022: చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఓపెనర్ వచ్చేశాడు! -
చనిపోవడానికి 8 గంటల ముందు మెసేజ్ చేశాడు.. అప్పుడు: గిల్‌క్రిస్ట్
హఠాన్మరణం చెందిన దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్‌ను తలచుకుని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు తనకు మెసేజ్ చేశాడంటూ సహచర ఆటగాడిని గుర్తు చేసుకున్నాడు. తన నుంచి వచ్చిన ఆ సందేశాన్ని ఎన్నడూ డెలిట్ చేయనంటూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా మార్చి 4న థాయ్‌లాండ్‌లోని విల్లాలో వార్న్ అకాల మరణం చెందిన విషయం విదితమే. అప్పటి వరకు సరాదాగా గడిపిన స్పిన్ మాంత్రికుడు హఠాన్మరణం చెందాడు. ఈ నేపథ్యంలో అతడి భౌతిక కాయాన్ని శుక్రవారం నాటికి ఆస్ట్రేలియాకు పంపించనున్నారు. ఈ క్రమంలో ఏబీసీ న్యూస్‌తో మాట్లాడిన గిల్‌క్రిస్ట్ వార్న్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘తనతో మాట్లాడి వారం కావస్తోంది. బహుశా తను చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు అనుకుంటా.. నాకో చక్కని సందేశం పంపాడు. నన్ను ముద్దుగా చర్చ్ అని పిలిచేవాడు. ఈ నిక్‌నేమ్ మా స్నేహితుల్లో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. చనిపోవడానికి ముందు పంపిన మెసేజ్‌లో.. ‘‘చర్చ్, రాడ్ మార్ష్‌కు నువ్వు ఘన నివాళి అర్పించావు’’ అని కొనియాడాడు. అదే చివరిసారి తను నాకు పంపిన సందేశం. దానిని నా జీవితంలో డెలిట్ చేయను’’ అని గిల్‌క్రిస్ట్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఆసీస్ క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ మృతి చెందిన గంటల వ్యవధిలోనే వార్న్ సైతం తుదిశ్వాస విడవడం గమనార్హం. చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే! -
ఆస్ట్రేలియా వేదికగా భారత్-పాక్ వన్డే సిరీస్..?
Australia To host India, Pakistan In Tri Series: చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్థాన్‌ల మధ్య పోరుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా దాయాదులతో కలుపుకుని ముక్కోణపు సిరీస్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సీఏ చీఫ్ నిక్ హాక్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్‌లు చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడ్డాయి. అయితే, ఆసీస్ క్రికెట్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలతో భారత, పాక్ క్రికెట్ అభిమానుల్లో ఈ అంశానికి సంబంధించిన చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇదే విషయాన్ని పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఈ ఏడాది జనవరిలో ప్రతిపాదించాడు. అయితే, మూడు దేశాలు కాకుండా ఇంగ్లండ్‌ను కలుపుకుని నాలుగు దేశాల సిరీస్‌ను ఏర్పాటు చేయాలని రమీజ్ రాజా ఐసీసీని కోరాడు. తాజాగా హాక్లీ వ్యాఖ్యలతో మరోసారి భారత్-పాక్ సిరీస్ అంశం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే, భారత్-పాకిస్థాన్ మధ్య ముక్కోణపు సిరీస్ జరగడం దాదాపుగా అసాధ్యమని భారత క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2023 వరకు టీమిండియా షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్‌లు తలపడనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 23న జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇదివరకే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వివాదాస్పద బౌలర్ -
షేన్ వార్న్ అంత్యక్రియలకు తేదీ ఖరారు
Shane Warne Funeral: ఈనెల (మార్చి) 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్యక్రియలు ఘనంగా జరపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ సాయంత్రం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య వార్న్ తుది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించేందుకు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. There's nowhere in the world more appropriate to farewell Warnie than the 'G. Victorians will be able to pay tribute to Shane and his contribution our state, and his sport, at a memorial service at the MCG on the evening of March 30th. Info and tickets will be available soon. — Dan Andrews (@DanielAndrewsMP) March 9, 2022 ఎంసీజీతో వార్న్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా అంతిమ సంస్కారాలు ఇక్కడే నిర్వహించాలనుకున్నామని విక్టోరియా రాష్ట్ర సర్వోన్నతాధికారి డేనియల్ ఆండ్రూస్ బుధవారం వెల్లడించారు. వార్న్ విగ్రహం కూడా ఎంసీజీ బయటే ఉండటంతో అభిమానులంతా అక్కడే నివాళులర్పిస్తున్నారు. వార్న్ పార్ధివ దేహం థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు రావాల్సి ఉంది. కాగా, 1969 సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించిన వార్న్.. అండర్-19 విభాగంలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1992లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వార్న్.. తన స్పిన్ మాయాజాలంతో పదిహేనేళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాశించాడు. ఈ క్రమంలో 145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్లో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి -
Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం
ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వార్న్ మరణ వార్త తెలిసి.. క్రికెట్ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతి గురవుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మేటి స్పిన్నర్‌గా పేరుపొందిన షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరపున 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు షేన్ వార్న్ సొంతం. టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్ల హాల్ అందుకున్నాడు. అనూహ్యంగా బంతి తిప్పడంలో మేటి అయిన వార్న్.. 2013లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌గా నిలిచాడు. 1999 వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో వార్న్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్‌తోనూ షేన్ వార్న్‌కు అనుబంధం ఉంది. 2008 ఆరంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్లో రాజస్తాన్ టైటిల్ గెలవడంలో అటు కెప్టెన్‌గా.. ఆటగాడిగా షేన్ వార్న్ కీలకపాత్ర పోషించాడు. -
పాక్ పర్యటనకు వెళ్తే నీ భర్త ప్రాణాలతో తిరిగిరాడు.. ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు
Pakistan Vs Australia: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సిరీస్ ప్రారంభానికి ముందే బెదిరింపుల పర్వం మొదలైంది. పాక్ పర్యటనకు వెళ్తే నీ భర్త ప్రాణాలతో తిరిగిరాడంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ భార్యకు సోషల్‌మీడియా వేదికగా బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విషయమై అగర్ భార్య మెడిలీన్ క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు ఫిర్యాదు చేయగా, ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్తంగా విచారణ చేపట్టాయి. భారత్ కేంద్రంగా ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి బెదిరింపు మెసేజ్వచ్చినట్లు ప్రాధమిక విచారణలో తేలిందని, ఈ బెదిరింపు మెసేజ్‌ను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పేర్కొన్నాయి. కాగా, పాట్ కమిన్స్ సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరి 27న పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ పర్యటనలో ఆసీస్ 3 టెస్ట్‌లు, 3 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. మార్చి 4న రావల్పిండి వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: విండీస్ స్పిన్ దిగ్గజం కన్నుమూత -
25 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు.. జట్టును ప్రకటించిన ఆసీస్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెలలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా 3 టెస్టులు, 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే పాక్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆసీస్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. కాగా గాయం కారణంగా యాషెస్ సిరీస్ మధ్యలో నుంచి తప్పుకున్న జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్వెప్సన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ జట్టుకు పాట్ కమిన్స్ నాయకత్వం వహించనున్నాడు. ఇక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు కమిన్స్ కెప్టెన్‌గా అద్భుతమైన విజయం అందించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్) ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్ , నాథన్ లి యోన్, మిచెల్ మార్ష్, మైఖేల్ నెజర్ మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ -
లాంగర్ రాజీనామా.. ఆస్ట్రేలియా కొత్త కోచ్ ఎవరంటే!
Australia Cricket Team New Head Coach: జస్టిన్ లాంగర్ రాజీనామా నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్థానంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌ను నియమించింది. ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. కాగా ఆసీస్ కోచ్‌గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్ విజ్ఞప్తి పట్ల బోర్డు సానుకూలంగా స్పందించలేదు. దీంతో అతడు తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో ఆండ్రూకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. ఇక ఆస్ట్రేలియా తరఫున 2009లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆండ్రూ అదే ఏడాది తన చివరి మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో టీమిండియాతో 2009లో జరిగిన సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళరూకు ప్రాతినిథ్యం వహించాడు. 2013లో ఆండ్రూ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. చదవండి: Justin Langer: ఆసీస్ హెడ్‌కోచ్‌కు షాకిచ్చిన బోర్డు.. టీ20 వరల్డ్‌కప్, యాషెస్ విజయాలు.. అయినా తప్పని రాజీనామా U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! JUST IN: @CricketAus confirms Andrew McDonald has been appointed interim head coach of the Aussie men's team. More to come. — cricket.com.au (@cricketcomau) February 5, 2022 -
Justin Langer: ఆసీస్ హెడ్‌కోచ్‌కు షాకిచ్చిన బోర్డు.. రాజీనామా చేయక తప్పలేదు!
Justin Langer Resigns As Australia Coach: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్‌గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తానెంతగానో ప్రేమించే హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో అనేక చర్చల అనంతరం.. జస్టిన్ లాంగర్ తన పదవి నుంచి వైదొలిగినట్లు అతడి మేనేజ్మెంట్ కంపెనీ డీఎస్ఈజీ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు... ‘‘మా క్లైంట్ జస్టిన్ లాంగర్.. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో నిన్నటి చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నారు’’ అని పేర్కొంది. కాగా ఆసీస్ క్రికెట్ బోర్డుతో కుదిరిన ఒప్పందం ప్రకారం జస్టిన్ లాంగర్ జూన్ వరకు తన పదవిలో కొనసాగాల్సి ఉంది. అయితే, దీర్ఘకాలం పాటు పదవీ కాలాన్ని పొడిగించాలని కోరగా... బోర్డు అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ క్రమంలో సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే, సీఏ నేషనల్ టీమ్స్ హెడ్ బెన్ ఒలివిర్తో ఈ విషయం గురించి చర్చించగా.. సానుకూల ఫలితం రాలేదు. దీంతో లాంగర్ రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే... ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్, ప్రస్తుత టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సహా పలువురు కీలక ఆటగాళ్లతో లాంగర్‌కు అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. చదవండి: సాండ్విచ్ కూడా తినడానికి అవకాశం ఇవ్వలేదు.. కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా? ఈ క్రమంలో ఆటగాళ్లతో విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటాడని, అంతా తాను చెప్పినట్లే జరగాలనే నియంతృత్వ ధోరణితో ఉంటాడని ఆటగాళ్లు అతడి వ్యవహారశైలిపై మండిపడినట్లు సమాచారం. ఆయనతో తమకు పొసగడం లేదంటూ కోచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పడంతో ఆయనను కొనసాగించేందుకు బోర్డు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా లాంగర్ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్ చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన యాషెస్ సిరీస్‌లోనూ 4-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
అదే జరిగితే, యావత్ పాకిస్థాన్ మీకు స్వాగతం పలుకుతుంది.. మహ్మద్ రిజ్వాన్
Australia Tour Of Pakistan 2022: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది మార్చ్-ఏప్రిల్ నెలల్లో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఒప్పుకుంది. పర్యటనలో భాగంగా ఆసీస్-పాక్ జట్ల మధ్య మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ జరగనున్నాయి. అయితే, ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భద్రతా కారణాలను సాకుగా చూపి పాక్ పర్యటనకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనపై పాక్ మాజీలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలాకాలం తర్వాత ప్రపంచ మేటి జట్టు తమ దేశంలో పర్యటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇటీవల కాలంలో కొన్ని జట్లు నిరాధారమైన కారణాల చేత తమతో క్రికెట్ ఆడేందుకు వెనకడుగు వేశాయని, ఇది తమను, తమ అభిమానులు తీవ్రంగా కలచి వేసిందని, అంతే కాకుండా తమ దేశ క్రికెట్ బోర్డును భారీగా నష్టాల పాలు చేసిందని వాపోయాడు. ఫైనల్‌గా ఆసీస్ జట్టు తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకోవడం శుభపరిణామమని, ఈ పర్యటన కార్యరూపం దాల్చితే, యావత్ పాక్ ఆసీస్ జట్టుకు స్వాగతం పలుకుతుందని, ఈ సిరీస్ కోసం తామెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చాడు. పాక్ ఆటగాళ్లు షాదాబ్ ఖాన్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్‌లు బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతూ.. ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతూ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నారని పేర్కొన్నాడు. ఈ బంధం బలపడేందుకు పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ తన వంతు సహకారాన్ని అందించాడని గుర్తు చేశాడు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌తో తెగదెంపులు.. ఇకపై..! -
కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్
ఆస్ట్రేలియా స్పీడస్టర్ బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమే అవుతుంది. అయినప్పటికి తన బౌలింగ్‌లో పదును మాత్రం పోలేదని మరోసారి నిరూపించాడు. తాజాగా 45 ఏళ్ల బ్రెట్ లీ తన కొడుకు ప్రీస్టన్తో కలిసి ఇంటి ఆవరణలోని గార్డెన్లో సరదాగా క్రికెట్ ఆడాడు. ఈ నేపథ్యంలో బ్రెట్ లీ బంతి విసిరాడు. బ్యాటింగ్ చేస్తున్న ప్రీస్టన్కు కనీసం టచ్ చేసే అవకాశం రాలేదు. ఈలోగా బంతి వేగంగా పాదాల మధ్య నుంచి వచ్చి మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. చదవండి: అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ ‘హిట్’... అశూ, అక్షర్ కూడా అద్భుతం! దీనికి సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. '' వయసు పెరుగుతున్న బ్రెట్ లీ బౌలింగ్‌లో పదును మాత్రం తగ్గలేదు. బంతిని వదిలేశారో ఇక అంతే సంగతులు.. కొడుకనే కనికరం లేకుండా క్లీన్ బౌల్డ్ చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది.ఇక 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆడిన బ్రెట్ లీ అన్ని ఫార్మాట్లు కలిపి 718 వికెట్లు తీశాడు. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్నాడు. Blink and you'll miss it 😳 Brett Lee has shown no mercy to his son 😂 👉 https://t.co/PytmEwGeQa pic.twitter.com/bWcQQ9WAnw — Fox Cricket (@FoxCricket) December 30, 2021 -
ఓపెనర్‌గా రోహిత్ శర్మ, వికెట్ కీపర్‌గా పంత్.. విరాట్ కోహ్లికి నోఛాన్స్ !
2021 ఏడాదికు గాను టెస్ట్ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా శ్రీలంక టెస్ట్ సారథి దిమిత్ కరుణరత్నేను ఎంపికచేసింది. ఈ జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కరుణరత్నేకు అవకాశం దక్కింది. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో మార్నస్ లాబుషేన్, జోరూట్ కు చోటు ఇచ్చారు. ఇక ఐదో స్ధానంలో పాకిస్తాన్ ఆటగాడు ఫవాద్ ఆలంకి చోటు దక్కింది. ఈ జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. అదే విధంగా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అశ్విన్, అక్షర్ పటేల్‌కు చోటు ఇచ్చింది. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో కైల్ జేమీసన్, హాసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిదిను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ఈ జట్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నే (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జో రూట్, ఫవాద్ ఆలం, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవి అశ్విన్, కైల్ జామీసన్, అక్షర్ పటేల్, హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది చదవండి: ఒకే జట్టులో సచిన్, ధోని,యువరాజ్.. కోహ్లి, రోహిత్‌కు నోఛాన్స్! -
ఇది నిజంగా సిగ్గుచేటు.. ఆ క్రికెటర్లు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడంపై నిషేధం!
Cricket Australia: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్), యాషెస్ సిరీస్ ఆడుతున్న క్రికెటర్లు అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడాన్ని నిషేధించాలని భావిస్తోంది. న్యూ సౌత్ వేల్స్, విక్టోరియాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కరోనా పాజిటివ్ వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన కారణంగా ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ యాషెస్ రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడికి కూడా వైరస్ సోకినట్లు తేలినట్లు సమాచారం. దీంతో సీఏ నిబంధనలు మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే మాట్లాడుతూ... ‘‘మేము ఎల్లప్పుడూ జాగ్రత్తగానే ఉంటాం. అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిజానికి ఇదొక వేకప్ కాల్ లాంటిది. వైరస్ అనేది కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు. యాషెస్, బిగ్‌బాష్ లీగ్ ఆడుతున్న క్రికెటర్లు అభిమానులకు కాస్త దూరంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా కొంతమంది బౌలర్లు మైదానంలో ఉండగానే ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ మీడియా కంటపడ్డారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన సీఏ బాస్.. ‘‘నిజంగా ఇది సిగ్గుచేటు. బీబీఎల్ ఆడుతున్న కొంతమంది అభిమానులతో మమేకం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాల్సిందే. బయో బబుల్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. చదవండి: IPL 2022: "నాకు ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది" Ashes Series: సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్ -
'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్రూం అద్దానికి అంటించా'
Steve Smith Says Ian Chapell Coloumn Stuck On Bathroom Mirror: ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కెరీర్లో బాల్ టాంపరింగ్ ఉదంతం ఒక చీకటికోణంలా మిగిలిపోయింది. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, బెన్క్రాఫ్ట్లతో కలిసి స్మిత్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడడం సంచలనంగా మారింది. ఈ అంశం అప్పట్లో తీవ్ర దుమారం రేపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీరియస్‌గా పరిగణించింది. కెప్టెన్సీ పదవి నుంచి స్మిత్‌ను తొలిగించిన సీఏ అతనితో పాటు డేవిడ్ వార్నర్‌పై ఏడాదిపాటు నిషేధం.. బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. అలా 2018 నుంచి 2019 వరకు క్రికెట్‌కు దూరంగా ఉన్న స్మిత్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా తాజాగా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌కు సిద్ధమవుతున్న ఈ ఆసీస్ ఆటగాడు మరోసారి ఆ చీకటి రోజులను గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో ఇయాన్ చాపెల్ చేసిన వ్యాఖ్యలు తనకు ఎప్పటికి గుర్తుండిపోయాయని చెప్పుకొచ్చాడు. '' బాల్ టాంపరింగ్ ఉదంతం నాకు చీకటిరోజులు. ఈ ఉదంతంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న నేను నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. నాకు ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలు బాగా గుర్తున్నాయి. ఒక పత్రికలో ఇయాన్ చాపెల్ తన కాలమ్‌లో '' బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు ఆటకు దూరం కానున్న స్మిత్ .. ఏడాది తర్వాత రీ ఎంట్రీలో అతనిలో అదే బ్యాటర్ కనబడడు'' అని పేర్కొన్నాడు. ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నేను ఆ పేపర్ ముక్కను కట్‌చేసి నా బాత్రూం గోడకు తగిలించాను. ప్రతీరోజు రాత్రి నిద్రపోయే ముందు.. ఉదయం నిద్ర లేవగానే దానిని చూసుకునేవాడిని. ఆ వ్యాఖ్యల చదువుతూ బ్రష్ చేసేవాడిని. అయితే 2019లో రీఎంట్రీ తర్వాత యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించాను. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అటు చాపెల్‌కు.. విమర్శలకు ఒక విషయం చెప్పా.. అదేంటంటే.. ''నిషేధం తర్వాత నేను ఏం కోల్పోలేదు.. అది ఇంకా నా దగ్గరే ఉంది''. ఈ విషయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నేను సాధించాననే సంతోషం కలుగుతుంది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా! ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ టెస్టు సిరీస్ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఇక సెక్స్ స్కాండల్ ఆరోపణలతో టిమ్ పైన్ అనూహ్యంగా కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడంతో పాట్ కమిన్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇక 2019లో జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఏడాది నిషేధం నుంచి తిరిగొచ్చిన స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు సహా మొత్తంగా 777 పరుగులు సాధించి ఆసీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్ స్మిత్!
Cricket Australia Confirms Steve Smith To Replace Tim Paine As Test Captain.. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌ను సంప్రదించినట్లు రిపోర్ట్స్‌లో వెల్లడైంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్ ఆసీస్ టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశాలే ఎక్కువని జోరుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా స్మిత్ పేరు మరోసారి బయటికి రావడంతో ఆసక్తి నెలకొంది. చదవండి: Pat Cummins : ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్..! కాగా స్టీవ్ స్మిత్ 2015-18 కాలంలో ఆస్ట్రేలియాకు టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మంచి విజయాలు అందుకుంది. అయితే 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోటెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ ఉదంతం స్మిత్ కెరీర్‌ను పాతాళంలోకి నెట్టింది. బెన్‌క్రాప్ట్‌తో కలిసి వార్నర్, స్మిత్ బాల్ టాంపరింగ్ చేశారని నిరూపితం కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేదం.. బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు బహష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు స్మిత్ ఒక ఏడాది పాటు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టకూడదంటూ మరో నిర్ణయం తీసుకుంది. ఇక నిషేధం ముగిసిన తర్వాత జట్టులోకి వచ్చిన స్మిత్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. చదవండి: యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. వరల్డ్‌కప్ హీరోకు నో ఛాన్స్ ఇక 2017లో ఆటగాడిగా ఉన్న సమయంలో మహిళతో అసభ్యకర చాటింగ్ చేశాడని టిమ్ పైన్‌పై ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనని ఒప్పుకున్న టిమ్ పైన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. కీలకమైన యాషెస్ సిరీస్‌కు ముందు పైన్ కెప్టెన్సీ వదిలేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేదానిపై తర్జనభర్జనలో ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డులో ఉన్న పలువురు అధికారులు స్మిత్ పేరును ప్రతిపాదించారు. కెప్టెన్‌గా కమిన్స్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయంగా స్మిత్ కనిపిస్తున్నాడని.. పైగా అతనికి టెస్టుల్లో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉందని వారు పేర్కొన్నారు. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా ఒకవేళ అన్ని కలిసివస్తే స్టీవ్‌స్మిత్‌ను మరోసారి ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా చూసే అవకాశం ఉంది. స్టీవ్ స్మిత్ టెస్టు కెప్టెన్‌గా 34 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 18 విజయాలు.. 10 పరాజయాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా టెస్టు కెప్టెన్‌గా స్మిత్‌కు 52.9% సక్సెస్ ఉండడం విశేషం. 2010లో ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన స్టీవ్ స్మిత్ 77 టెస్టులు, 128 వన్డేలు, 52 టి20లు ఆడాడు. -
ఆ ఫాస్ట్ బౌలర్‌కు భారీ షాక్.. మ్యాచ్ ఆడకుండా నిషేధం
James Pattinson cops fine, one-match ban: ఆసీస్ మాజీ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ పాటిన్సన్కు క్రికెట్ ఆస్ట్రేలియా షాకిచ్చింది. ఈ స్పీడ్‌స్టర్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత పెట్టడంతో పాటుగా.. మ్యాచ్ నిషేధం విధించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది. కాగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా పాటిన్సన్ విక్టోరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో న్యూసౌత్‌వేల్స్‌తో మ్యాచ్ సందర్భంగా నాలుగో రోజు ఆటలో పాటిన్సన్ దుందుడుకుగా ప్రవర్తించాడు. న్యూసౌత్ వేల్స్ కెప్టెన్ డేనియల్ హ్యూజెస్ ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్ ఆడాడు. పాటిన్సన్ బౌలింగ్‌లో అదే తరహాలో ఆటను కొనసాగించాడు. దీంతో చిరాకుపడిన పాటిన్సన్.. అతడి వైపుగా కోపంగా బంతిని విసరగా.. పాదానికి దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో పాటిన్సన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. క్రికెట్ ఆస్ట్రేలియా సైతం అతడి అనుచిత ప్రవర్తనను ఉపేక్షించేది లేదంటూ గట్టి చర్యలు తీసుకుంది. కాగా పాటిన్సన్ ఇటీవలే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందుకు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక గాయాల కారణంగా పలు సిరీస్‌లకు దూరమవడం.. అదే సమయంలో హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి పేసర్లు జట్టులోకి రావడంతో పాటిన్సన్కు అవకాశాలు సన్నగిల్లాయి. చదవండి: #JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?! Ouch! Daniel Hughes 71* (283) continues to defy Victoria despite copping this throw from James Pattinson in the second session #SheffieldShield pic.twitter.com/ChTkupId1n — cricket.com.au (@cricketcomau) November 8, 2021 Ouch! Daniel Hughes 71* (283) continues to defy Victoria despite copping this throw from James Pattinson in the second session #SheffieldShield pic.twitter.com/ChTkupId1n — cricket.com.au (@cricketcomau) November 8, 2021 -
ఆఫ్ఘనిస్తాన్‌కి షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
Australia Postpone First Ever Test Match Against Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నవంబర్ 27 నుంచి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. దేశంలో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మహిళల క్రీడలపై నిషేధం విధించారు. దీంతో ఆస్ట్రేలియా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహిళా క్రికెట్‌పై నిషేధం కొనసాగితే టెస్టును రద్దు చేయాలని ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్లుఘా దేశ క్రికెట్ బోర్డును సూచించినట్లు సమాచారం. "ప్రస్తుత అనిశ్చితి దృష్ట్యా ఆఫ్ఘాన్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ నిర్వహించడం సరికాదని మేం భావిస్తున్నాం. అందకే ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుతో చర్చల తర్వాత టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేయాలాని నిర్ణయించకున్నాము. ఆఫ్ఘనిస్తాన్‌లో పురుషులు, మహిళల క్రికెట్ అభివృద్దికి ఆస్ట్రేలియా ఎప్పడూ కట్టుబడి ఉంటుంది" అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఆస్ట్రేలియా నిర్ణయంపై ఆఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ నబీ స్పందించాడు. ఈ ఏడాది టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం నిరాశపరిచింది అని తెలిపాడు. "ఈ సంవత్సరం టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం నిరాశపరిచింది, అయితే మ్యాచ్ వాయిదా మాత్రమే వేయబడింది. పూర్తిగా రద్దు కానుందున నేను సంతోషంగా ఉన్నాను" అని నబీ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2021 NZ Vs NAM: కివీస్ బౌలర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. -
క్రికెట్ ఆస్ట్రేలియాలో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల కన్నుమూత
Former Australia Spinner Peter Philpott Passed Away: ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ అలన్ డేవిడ్సన్ కన్నుమూసిన గంటల వ్యవధిలోనే క్రికెట్ ఆస్ట్రేలియాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ స్పిన్నర్ పీటర్ ఫిల్పాట్ 86 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూశాడు. పీటర్ మృతితో క్రికెట్ ఆస్ట్రేలియాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. లెగ్‌స్పిన్ ఆల్‌రౌండర్ అయిన పీటర్.. 60వ దశకంలో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించాడు. 8 టెస్ట్‌ల్లో 38.46 సగటుతో 26 వికెట్లు తీసుకున్నాడు. కెరీర్ అత్యుత్తమ దశలో ఉండగానే పీటర్ 31 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. చదవండి: టీమిండియాతో మ్యాచ్ రోజు పాక్ కెప్టెన్ తీవ్ర ఆవేదనలో ఉన్నాడు..! -
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ కన్నుమూత...
Alan Davidson: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ అలాన్ డేవిడ్సన్(92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిడ్నీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో వెల్లడించింది. 44 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్సన్ 186 వికెట్లు సాధించాడు. 1959లో కాన్పూర్ టెస్టులో భారత్‌పై 7 వికెట్లు పడగొట్టి తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలును నమోదు చేశారు. 193 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అతడు 6804 పరుగులు, 672 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: టిక్కెట్లు లేకుండానే.. ఫ్యాన్స్ రచ్చ.. ఐసీసీ క్షమాపణలు -
ఆసీస్ బెదిరింపులకు తలొగ్గిన తాలిబన్లు.. మహిళల క్రికెట్‌కు గ్రీన్ సిగ్నల్..?
కాబుల్: అఫ్గాన్ మహిళలు క్రికెట్ ఆడేందుకు తాలిబన్లు విముఖత చూపితే పురుషుల జట్టుతో నవంబర్‌లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దు చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అఫ్గాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. అఫ్గాన్ మహిళలు క్రికెట్ ఆడేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ అజీజుల్లా ఫజ్లీ వెల్లడించారు. ఈ ప్రక్రియ ఎలా జరగుతుందనేది త్వరలోనే తెలియజేస్తామని, అఫ్గానీ మహిళలు కచ్చితంగా శుభవార్తను వింటారని ఆయన తెలిపారు. అఫ్గాన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనరని, అఫ్గానీ మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ ప్రకటించిన కొద్దిరోజులకే ఫజ్లీ ఈ మేరకు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: అదే జరిగితే చారిత్రక సిరీస్ రద్దు.. తాలిబన్లకు క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్ ఇదిలా ఉంటే, మహిళల క్రికెట్‌ను రద్దు చేయరాదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) గత గురువారం తాలిబన్ ప్రభుత్వాన్ని కోరింది. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేయాలనుకుంటే.. తమ జట్టుతో నవంబర్ 27న జరగాల్సి ఉన్న చారిత్రక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్ది చెందాలన్నదే తమ ఉద్దేశమని, మహిళల క్రికెట్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంది. ఈ విషయమై ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ కూడా ఘాటుగానే స్పందించాడు. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేస్తే.. త్వరలో జరుగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్ నుంచి ఆ దేశాన్ని తప్పించాలని ఐసీసీని డిమాండ్ చేశాడు. అయితే తాలిబన్ల ప్రకటన ఆధారంగా పురుషుల జట్టును శిక్షించవద్దని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని వేడ్కొంది. కాగా, అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి అక్కడ అరచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కఠినమైన షరియా చట్టాల పేరుతో తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళా క్రికెట్‌ను నిషేధించారు. చదవండి: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు.. -
అదే జరిగితే చారిత్రక సిరీస్ రద్దు.. తాలిబన్లకు క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్
కాబుల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి అక్కడ అరచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కఠినమైన షరియా చట్టాల పేరుతో తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా అఫ్గాన్ మహిళలు.. క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబన్ ప్రభుత్వం ఫత్వా జారీ చేసింది. క్రీడల్లో పాల్గొన్నప్పుడు మహిళల శరీర భాగాలు బహిర్గతం అవుతాయన్న కారణంగా క్రీడలపై నిషేధం విధిస్తున్నట్లు వారు బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహిళల క్రికెట్‌ను రద్దు చేయరాదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) గురువారం తాలిబన్ ప్రభుత్వాన్ని కోరింది. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేయాలనుకుంటే.. తమ జట్టుతో నవంబర్ 27న జరగాల్సి ఉన్న చారిత్రక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్ది చెందాలన్నదే తమ ఉద్దేశమని, మహిళల క్రికెట్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉంటే, మహిళల క్రికెట్‌పై అంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం పురుషుల క్రికెట్‌కు సంపూర్ణ మద్దతు తేలియజేయడం విశేషం. పురుషుల క్రికెట్ విషయాల్లో తల దూర్చబోరని స్పష్టమైన హామీనిచ్చిన తాలిబన్లు.. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా మ్యాచ్‌లు ఆడవచ్చని, తమవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని అఫ్గాన్ క్రికెట్ బోర్డుకు భరోసా ఇచ్చారు. తమకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, తమ దేశ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా ఎటువంటి అభ్యంతరాలు ఉండబోవని స్పష్టం చేసిన తాలిబన్లు మహిళల క్రికెట్ విషయంలో మాత్రం తమ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చదవండి: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు.. -
ఆసీస్ జట్టు ఇదే; వరల్డ్‌కప్ ద్వారా అరంగేట్రం చేయనున్న ఆటగాడు
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గర పడుతుండడంతో టోర్నీలో పాల్గొననున్న దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్ 10లోగా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటంచాల్సిందిగా ఐసీసీ సూచించింది. తాజాగా గురువారం ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ప్రాబబుల్స్‌కు ఆరోన్ పించ్ సారధ్యం వహించనున్నాడు. ఇక ఇటీవలే బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన జోష్ ఇంగ్లీష్‌కి తొలిసారి ఆసీస్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న అరంగేట్ర క్రికెటర్‌గా జోష్ ఇంగ్లీష్ నిలవనున్నాడు. డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉండనున్నారు. ఇక సూపర్ 12లో గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్‌ని అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత 30న ఇంగ్లాండ్, నవంబరు 6న వెస్టిండీస్‌తో తలపడనుంది. వీటితో పాటు క్వాలిఫయర్స్ నుంచి సూపర్-12లోకి రానున్న రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆడనుంది. ఇక వ్యక్తిగత కారణాలతో స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్‌కు దూరంగా ఉండాలని భావించాడు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో 1-4 తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) స్మిత్‌ను టీ20 ప్రపంచకప్‌లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లీష్, కేన్ రిచర్డ్సన్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, స్వీప్సన్, ఆడమ్ జంపా రిజర్వు ప్లేయర్లు: డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్ Our Australian men's squad for the ICC Men’s #T20WorldCup! 🇦🇺 More from Chair of Selectors, George Bailey: https://t.co/CAQZ4BoSH5 pic.twitter.com/aqGDXZu0t9 — Cricket Australia (@CricketAus) August 19, 2021 -
ధోని సిక్సర్ల మాయ చూడాల్సిందే; వీడియో వైరల్
ముంబై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి క్రికెట్ ఆస్ట్రేలియా ఒక స్పెషల్ వీడియో తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. బుధవారం 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ధోనీకి మంగళవారం అర్ధరాత్రి నుంచే అభిమానులు సోషల్ మీడియా విషెస్ చెప్తూ.. పాత ఫొటోలు, వీడియోల్ని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో పాటు చాలా మంది ప్రముఖులు, క్రికెటర్లు ధోనీకి విషెస్ చెప్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేకంగా రూపొందించిన ఈ వీడియోలో ధోని బాదిన సిక్సర్లను పొందుపరిచారు. ధోని 2004లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2005లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సిరీస్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 123 బంతుల్లో 148 పరుగులతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత ధోని ఎప్పుడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 145 బంతుల్లో 183 పరుగులు చేసిన ధోని టీమిండియా తరపున వికెట్ కీపర్‌గా అత్యుత్తమ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల బాదిన జాబితాలో ధోని ఐదవ స్థానంలో ఉన్నాడు. ధోని తన కెరీర్లో 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలు సాధించి ఐసీసీ మూడు మేజర్ ట్రోపీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. 📽 WATCH: MS Dhoni's best ever sixes in Australia. https://t.co/tRadt6XCkI — cricket.com.au (@cricketcomau) July 7, 2021 -
'నేను నిన్ను ప్రేమిస్తున్నా'.. నా భార్యకు ఏం అర్థం అయిందో!
సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు ఇండియా అంటే విపరీతమైన అభిమానం. ఇప్పటికే ఇండియన్ సినిమాలకు సంబంధించిన పాటలు, ఫైట్స్, డైలాగ్స్ పలికి అందరిని అలరిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే విపరీతమైన అభిమానం చూపే వార్నర్ మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లోని డైలాగ్స్, డాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. తాజాగా వార్నర్ తన భార్య కాండీస్కు తెలుగులో లవ్ ప్రపోజ్ చేశాడు. కాండీస్.. నేను నిన్ను ప్రేమిస్తున్నా.. అంటూ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అయితే వార్నర్ లవ్, వైఫ్, బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ హ్యాష్ టాగ్ జత చేశాడు. వార్నర్ రాసిన కామెంట్ కాండీస్కు అర్థం అయిందో లేదో తెలియదు. అతని హ్యాష్ ట్యాగ్స్‌ను బట్టి విషయాన్ని గ్రహించిన కాండీస్.. లవ్ సింబల్‌తో రిప్టై ఇచ్చింది. ఐపీఎల్ 14వ సీజన్ రద్దు కావడంతో ఆసీస్ చేరుకున్న వార్నర్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ జరుగుతున్న సమయంలోనే డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. వార్నర్ స్థానంలో కేన్ విలియమ్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ఐపీఎల్ 14వ సీజన్లో ఎస్ఆర్హెచ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. లీగ్ రద్దయ్యే సమయానికి 7 మ్యాచ్‌లాడి 6 ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. చదవండి: వార్నర్ మళ్లీ మొదలుపెట్టాడు.. ఈసారి రౌడీ బేబీతో 'రాములో రాములా' పాటకు వార్నర్ డ్యాన్స్.. ట్రోల్ చేసిన భార్య View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
AUS VS ENG: యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల
సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం విడుదల చేసింది. ఈసీబీతో చర్చించిన అనంతరం ఈ షెడ్యూల్ రిలీజ్ చేసినట్లు సీఏ ప్రకటించింది. కాగా పురుషుల జట్టు షెడ్యూల్‌తో పాటు మహిళల జట్టు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఎప్పుడైనా నవంబర్-డిసెంబర్లో జరిగే యాషెస్ సిరీస్ టీ20 ప్రపంచకప్ కారణంగా డిసెంబర్- జనవరిలో జరగనుంది. మొత్తం ఐదు టెస్టులు జరగనున్న నేపథ్యంలో బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 6 నుంచి 11 వరకు తొలి టెస్టు జరగనుంది. డిసెంబర్ 16 నుంచి 20 వరకు అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టు డే నైట్ పద్దతిలో నిర్వహించనున్నారు. ఇక బాక్సింగ్ డే టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్బోర్న్లో జరగనుండగా.. నాలుగో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 5 నుంచి 9 వరకు జరగనుంది. ఇక సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు పెర్త్ వేదికగా జనవరి 14 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. అయితే యాషెస్ కన్నా ముందు అఫ్గానిస్థాన్‌తో ఓ టెస్టు మ్యాచ్‌కు ఆసీస్ అతిథ్యం ఇవ్వనుంది. అఫ్గాన్ జట్టుకు కంగారులు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమానంగా నిలిచినా.. అంతకముందు(2017-18లో) ఆసీస్ విజేతగా నిలవడంతో సంప్రదాయం ప్రకారం యాషెస్ ట్రోపీని ఆసీస్ తమవద్దే ఉంచుకుంది. కాగా నవంబర్ -డిసెంబర్లో టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆసీస్ జట్టు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. ఆ తర్వాతే ఇరు జట్ల మధ్య యాషెస్ సిరీస్ మొదలుకానుంది. ఇక మహిళల జట్ల యాషెస్ సిరీస్ జవవరి- ఫిబ్రవరి మధ్యలో ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు నిర్వహించనున్నారు. చదవండి: 500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (పురుషుల జట్టు)- యాషెస్ షెడ్యూల్ తొలి టెస్టు: డిసెంబర్ 6 నుంచి 11 వరకు (బ్రిస్సేన్) రెండో టెస్టు (డే నైట్): డిసెంబర్ 16 నుంచి 20 వరకు (అడిలైడ్) మూడో టెస్టు( బాక్సింగ్ డే టెస్టు): డిసెంబర్ 26 నుంచి 30 వరకు (మెల్బోర్న్) నాలుగో టెస్టు : జనవరి 5 నుంచి 9 వరకు (సిడ్నీ) ఐదో టెస్టు :జనవరి 14 నుంచి 18 వరకు (పెర్త్) మహిళల జట్టు- యాషెస్ షెడ్యూల్ జనవరి 27 నుంచి 30 వరకు కాన్బెర్రా వేదికగా టెస్టు మ్యచ్ ఫిబ్రవరి 4: తొలి టీ20 (సిడ్నీ) ఫిబ్రవరి 6: రెండో టీ20 (సిడ్నీ) ఫిబ్రవరి 10: మూడో టీ20 (అడిలైడ్) ఫిబ్రవరి 13: తొలి వన్డే( అడిలైడ్) ఫిబ్రవరి 16: రెండో వన్డే(మెల్బోర్న్) ఫిబ్రవరి 19 : మూడో వన్డే( మెల్బోర్న్) Lock in these dates. Two huge #Ashes series are coming right up! 🔐 Get your tickets through an early access window exclusively for our interstate travel program: https://t.co/IPV70lgiKu pic.twitter.com/s1UCND5qZK — Cricket Australia (@CricketAus) May 19, 2021 -
Ball Tampering:ఇక్కడితో ముగించండి.. ఆసీస్ బౌలర్ల వేడుకోలు
సిడ్నీ: క్రికెట్లో బాల్ టాంపరింగ్ ఉదంతం పెను దుమారం రేపింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. అయితే బ్యాన్‌క్రాఫ్ట్ తాజాగా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ..తాను బాల్ టాంపరింగ్ చేయడం ఆసీస్ జట్టులో మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో బాల్ టాంపరింగ్ ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. బాల్ టాంపరింగ్ ఉదంతంలో మిగతా బౌలర్ల హస్తం ఉందంటూ అక్కడి మీడియా కోడై కూసింది. ఈ విషయంపై ఆసీస్ క్రీడా జర్నలిస్టులు సీఏపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో రంగంలోకి దిగిన సీఏ బ్యాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సీఏ మరోమారు విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అప్పటి మ్యాచ్‌లో బౌలర్లుగా ఉన్న పాట్ కమిన్స్, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్, మిచెల్ స్టార్క్‌లు స్పందించారు. ఆసీస్ ప్రజలను ఉద్దేశిస్తూ ఈ నలుగురు కలిసి ఒక సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.''ఆస్ట్రేలియన్ ప్రజలారా..మా నిజాయితీపై మాకు పూర్తి నమ్మకముంది. మా సమగ్రత, వ్యక్తిత్వంపై కొందరు ఆస్ట్రేలియన్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు మాకు బాధ కలిగించాయి. అయినా ఈ ప్రశ్నలకు మేం వివిధ సందర్బాల్లో ఎన్నోసార్లు సమాధానాలు ఇచ్చాము. ఒకవేళ అవసరం అనుకుంటే.. మరోసారి దానిపై చర్చ పెట్టండి.. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వాస్తవానికి ఆరోజు మ్యాచ్‌లో బంతి షేప్ మార్చడానికి బయటనుంచి మైదానంలోకి ఒక పదార్థం తీసుకొచ్చారన్న సంగతి మాకు తెలియదు. బాల్ టాంపరింగ్ జరిగిందని అంపైర్లు గుర్తించాకా.. మైదానంలో ఉన్న స్క్రీన్‌పై బంతి షేప్ మారిందంటూ చూపించిన తర్వాత మాకు మిషయం అర్థమైంది. ఆరోజు మ్యాచ్‌లో ఉన్న ఇద్దరు అంపైర్లు నీల్ లాంగ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్.. మంచి అనుభవం కలిగినవారు. వారిద్దరు బంతిని పరిశీలించి షేప్ మారిందని చెప్పారు. బ్యాన్‌క్రాఫ్ట్ అప్పటికే సాండ్పేపర్కు బంతిని రుద్దాడని మాకు తెలియదు. కానీ అతను బాల్ టాంపరింగ్ చేస్తున్నట్లు ఇతర బౌలర్లకు కూడా తెలుసని చెప్పాడు. ఇది నిజం కాదు. ఒక బౌలర్‌గా మా బాధ్యత బంతులు విసరడం మాత్రమే.. బంతి షేప్ మారిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ మాకెలా తెలుస్తాయి. వార్నర్, స్మిత్, బ్యాన్‌క్రాఫ్ట్‌లు చేసింది తప్పు కాబట్టే శిక్ష అనుభవించారు. కానీ ఈ ఉదంతం నుంచి మంచి పాఠాలు నేర్చుకున్నాం. మేము ఆటను ఆడే విధానం.. మైదానంలో ప్రవర్తించే తీరును ప్రజలు మంచి దృష్టితో చూడాలి. ఇలాంటి పుకార్లు, అవాస్తవాలను నమ్మద్దొని కోరుకుంటున్నాం. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది.. ఇక ఇది ముందుకు సాగవలసిన సమయం.'' అంటూ ముగించారు. చదవండి: వార్నర్ రిటైరైన తర్వాత బుక్ రాస్తాడని భావిస్తున్నా: బ్రాడ్ ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు View this post on Instagram A post shared by 7Cricket (@7cricket) -
Ball Tampering: మళ్లీ తెరపైకి ‘ట్యాంపరింగ్’
మెల్బోర్న్: మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన ‘బాల్ ట్యాంపరింగ్’ వివాదం మరోసారి ముందుకు వచ్చింది. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) నిషేధం విధించింది. వారి శిక్ష ముగిసి మళ్లీ మైదానంలోకి దిగడంతో అంతా ముగిసిపోయినట్లు భావించగా... బాన్‌క్రాఫ్ట్ తాజా వ్యాఖ్యలతో ఆ వివాదాన్ని మళ్లీ రేపాడు. ‘బాల్ ట్యాంపరింగ్ గురించి బౌలర్లకు తెలుసా’ అంటూ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ బాన్‌క్రాఫ్ట్...‘దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా’ అన్నాడు. దాంతో ఇందులో ఆసీస్ బౌలర్లకు కూడా భాగం ఉందని కొత్తగా చర్చ మొదలైంది. బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలపై సీఏ వెంటనే స్పందించింది. 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎవరి వద్దనైనా ఇంకా అదనపు సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని... అవసరమైతే దీనిపై పునర్విచారణ చేస్తామని కూడా ప్రకటించింది. అంతే కాకుండా అవినీతి నిరోధానికి సంబంధించిన సీఏ ప్రత్యేక బృందం (ఇంటిగ్రిటీ యూనిట్) వెంటనే బాన్‌క్రాఫ్ట్‌తో మాట్లాడింది. నాడు ఇచ్చిన వాంగ్మూలంకంటే అదనంగా ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అంటూ ప్రశ్నించింది. ఆశ్చర్యమేమీ లేదు: క్లార్క్ బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఒక్కసారిగా ఏదో అనూహ్యం జరిగిపోయినట్లు స్పందిస్తున్నారని, అయితే ఇందులో అంతగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. ‘బంతిని ట్యాంపరింగ్ చేసిన విషయం జట్టులో ముగ్గురు ఆటగాళ్లకే తెలుసంటే ఎలా నమ్ముతాం. బంతిని షైనింగ్ చేసిన తర్వాత ఎవరైనా బౌలర్ వద్దకే విసురుతారు. వారికి ఆ తేడా అర్థం కాదా. అలాంటి ఘటన ఒక్కసారిగా ఏమీ జరిగిపోదు. దానికి ముందు ఎంతో ప్రణాళిక ఉండే ఉంటుంది. అందులో ఎవరెవరు భాగస్వాములో తెలియాలి కదా. అయితే ఆసీస్ బోర్డు ఈ విషయంలో అసలు నిజాలను దాటి పెట్టేందుకే ప్రయత్నించింది’ అని క్లార్క్ ఘాటుగా విమర్శించాడు. -
రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు
మెల్బోర్న్: విండీస్‌తో జులై 10 నుంచి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 23 మంది సభ్యులతో కూడిన బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సోమవారం ప్రకటించింది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ పర్యటన నిమిత్తం ఆసీస్ సెలెక్షన్ కమిటీ ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. అరోన్ ఫించ్ సారథ్యంలోని ఆసీస్ జట్టు విండీస్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా జంబో జట్టును ప్రకటించింది. జట్టు వివరాలు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆస్టన్ అగర్, జేసన్ బెహ్రెరెన్డార్ఫ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మోసిస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిలే మెరిడిత్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, జై రిచర్డ్సన్, తన్వీర్ సంఘా, డి షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వెప్సన్, అండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు -
సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్నాక భారత మహిళల క్రికెట్ జట్టు మరో విదేశీ పర్యటనకు సిద్ధం కానుంది. సెప్టెంబర్‌లో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించకపోయినా... ఆస్ట్రేలియా మహిళల జట్టు పేస్ బౌలర్ మేగన్ షూట్ ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో వెల్లడించింది. ‘సెప్టెంబర్ రెండో వారంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ జట్టుకు డార్విన్‌లో శిక్షణ శిబిరం ఉంది. భారత్‌తో సిరీస్ తర్వాత బిగ్‌బాస్ లీగ్, మహిళల నేషనల్ క్రికెట్ లీగ్, యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్‌కప్, కామన్వెల్త్ గేమ్స్‌లతో ఆస్ట్రేలియా క్రికెటర్లు బిజీబిజీగా ఉండనున్నారు’ అని మేగన్ షూట్ తెలిపింది. 28 ఏళ్ల మేగన్ ఆస్ట్రేలియా తరఫున 65 వన్డేలు ఆడి 99 వికెట్లు... 73 టి20 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీసింది. వాస్తవానికి భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి సన్నాహకంగా ఈ ఏడాది జనవరిలోనే ఆస్ట్రేలియాలో పర్యటించాల్సింది. అయితే కరోనా కారణంగా భారత పర్యటన వాయిదా పడింది. -
'ఇప్పటికీ భయపడుతున్నా.. కిడ్నాప్‌తో నాకు సంబంధం లేదు'
సిడ్నీ: ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ వ్యవహారం క్రికెట్ ఆస్ట్రేలియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురు రెండు గంటల పాటు కారులో తిప్పారు. సిడ్నీ నగరానికి దూరంగా గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి గన్‌తో బెదిరించారు. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మెక్‌గిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా బుధవారం మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నలుగురు కిడ్నాపర్లలో ఒక వ్యక్తి మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు కావడంతో కొత్త మలుపు తీసుకుంది. ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత స్టువర్ట్ మెక్‌గిల్ న్యూట్రల్ బే ఏరియాలోని అరిస్టాటిల్స్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ మారియా సొటిరోపౌలోస్‌తో పరిచయం పెరిగి అది ప్రేమకు దారి తీసింది. అప్పటినుంచి వారిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ విషయం మారినో సోదరుడికి తెలియడంతో మెక్‌గిల్ కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా కిడ్నాప్ వ్యవహారంపై మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ మారియా స్పందించింది. స్టువర్ట్ గిల్‌ను బంధించిన ప్రదేశం 'ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను భయపడుతూనే ఉన్నా. కిడ్నాప్ తర్వాత ఆ భయం మరింత పెరిగింది.. ఈ సమయంలో నేను సురక్షితంగా ఉంటానో లేదో తెలియదు. అసలు ఇప్పటికి ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. కిడ్నాప్ వ్యవహారంలో నా సోదరుడు పాత్ర ఉందని తెలుసుకున్నా. అయినా మేమిద్దరం తోడబుట్టినవాళ్లమే అయినా ఎవరి జీవితాలు వారివి. నా సోదరునితో నాకు మంచి రిలేషన్షిప్ లేదు.. అందుకే అతనికి దూరంగా ఉంటున్నా. మెక్‌గిల్ విషయంలో నా సోదరుడు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. అంటూ చెప్పుకొచ్చింది. కాగా స్టువర్ట్ మెక్‌గిల్ ఆసీస్ తరపున 1998-2010 మధ్యకాలంలో 44 టెస్టులు ఆడి 208 వికెట్లు తీశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీసినా వార్న్ నీడలో మెక్‌గిల్ అంతగా పాపులర్ కాలేకపోయాడు. చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్ -
ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్లో ఒకప్పుడు సత్తా చాటిన స్టార్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.బుధవారం తెల్లవారుఝామున వాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విషయంలోకి వెళితే.. 50 ఏళ్ల మెక్‌గిల్‌ను గత నెల 14న ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఓ వాహనంలో సిడ్నీ నుంచి దూరమైన ప్రదేశానికి తీసుకెళ్లి ఓ బిల్డింగ్‌లో బంధించి అతన్ని తీవ్రంగా కొట్టి గన్‌తో బెదిరించారు. అతని నుంచి వాళ్లు భారీ మొత్తంలో డిమాండ్ చేశారు. అనంతరం గంట తర్వాత మెక్‌గిల్‌ను విడిచి పెట్టారు. అయితే ఈ ఘటన జరిగిన వారం తర్వాత మెక్‌గిల్ కిడ్నాప్ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా స్టువర్ట్ మెక్‌గిల్ ఆసీస్ తరపున 1998-2010 మధ్యకాలంలో 44 టెస్టులు ఆడి 208 వికెట్లు తీశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీసినా వార్న్ నీడలో మెక్‌గిల్ అంతగా పాపులర్ కాలేకపోయాడు. చదవండి: 'నాన్న తొందరగా వచ్చేయ్.. నిన్ను మిస్సవుతున్నాం' కరోనా.. విరాళం అందించిన మరో ఆసీస్ క్రికెటర్ -
ఐపీఎల్ 2021: ఆసీస్ క్రికెటర్లకు షాక్
మెల్బోర్న్: ఐపీఎల్ ఆడటానికి భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు షాక్ తగిలింది. విమానాల నిషేధం అనేది పూర్తయ్యేవరకూ స్వదేశానికి అనుమతించబోమని క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) స్పష్టం చేసింది. దాంతో ఎవరూ ఇక్కడకు రావొద్దని సూచించింది. నిషేధం ముగిసేవరకూ భారత్‌లోనే ఉండాలని క్రికెటర్లకు తెలిపింది. ప్లేయర్ల కోసం ప్రత్యేక అనుమతులు అనేవి లేవని, ప్రభుత్వం కఠిన నిబంధనలను మే 15 వరకూ అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటివరకూ క్రికెటర్లను దేశంలోకి అనుమతించబోమని సీఏ తెలిపింది. దీనిపై ఆస్ట్రేలియా పీఎం మోరిసన్ నైన్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ.. నిషేధం అమల్లో ఉన్న సమయంలో భారత్ నుంచి వచ్చే ఎవరికైనా జరిమానా లేదా జైలు అనేది ఒకే రకంగా ఉంటుందని హెచ్చరించారు. ఇక్కడ ఆస్ట్రేలియన్లకు కూడా ఇదే వర్తిస్తుందన్నారు. ఇక నిషాధాన్ని సమర్ధించుకున్నారు. ఇక తమ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ చేసిన ‘బ్లడ్ ఆన్ యువర్ హ్యాండ్స్‘వ్యాఖ్యలపై మోరిసన్ స్పందిస్తూ.. అది అర్థం లేని వ్యాఖ్య అని కొట్టి పారేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక విమానాలు వేయమని, మీరే సొంత ఖర్చులు పెట్టుకుని రావాలని కఆ దేశం పీఎం మోరిసన్ కొన్ని రోజుల క్రితమే స్పష్టం చేశారు. అదే సమయంలో నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఎవరినీ దేశంలోకి అనుమతించమన్నారు. దీనిపై ఆసీస్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ ధ్వజమెత్తాడు. ఇలా మీ దేశ పౌరుల్ని వదిలేస్తారా.. మీకెంత ధైర్యం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈమేరకు ట్వీటర్ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మీరు మమ్మల్ని స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టకపోతే అంతకంటే దారుణం ఇంకొటి ఉండదు. మాకు ఏది జరిగినా దానికి మీరే కారణం అవుతారు. మమ్మల్ని చిన్నచూపు చూడటానికి మీకెంత ధైర్యం. క్వారంటైన్ సిస్టమ్‌ను ఎలా పరిష్కరిస్తారు. నేను గవర్నమెంట్ అనుమతితోనే ఐపీఎల్లో పని చేయడానికి ఇక్కడికి వచ్చా. కానీ గవర్నమెంట్ నిర్లక్ష్యానికి గురవుతున్నా’ అంటూ ట్వీటర్ వేదికగా స్లేటర్ మండిపడ్డాడు. మీ చేతికి రక్తం అంటింది అంటూ మరో అడుగు ముందుకేసీ మరీ మోరిసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మాకు చార్టర్ విమానం వేయండి: సీఏకు లిన్ విజ్ఞప్తి
ఢిల్లీ: తమకు వచ్చేవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ స్ప‘ష్టం చేశాడు. ఈ విషయాన్ని మంగళవారం న్యూకార్పోరేషన్ మీడియాకు తెలిపిన లిన్.. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు చార్టర్ ప్లేన్ వేయమని విజ్ఞప్తి చేసినట్లు తెలిపాడు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత తామంతా(ఆస్ట్రేలియా క్రికెటర్లు) క్షేమంగా స్వదేశానికి వచ్చేందుకు చార్టర్ విమానాన్ని వేయమని కోరినట్లు తెలిపాడు. ‘సీఏకు టెక్స్ట్ మెసేజ్ చేశాను. ప్రతీ ఐపీఎల్ టోర్నమెంట్ ద్వారా సీఏ 10 శాతం డబ్బును సంపాదిస్తుంది. ఇప్పుడు ఆ డబ్బును మాకు చార్టర్ విమానం వేయడానికి ఖర్చు చేస్తుందనే భావిస్తున్నా. మా కంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము కఠినమైన బయోబబుల్‌లో ఉంటున్నాము. వచ్చేవారం వ్యాక్సిన్ కూడా వేయించుకుంటాము. దాంతో మమ్మల్ని టోర్నీ ముగిసిన తర్వాత చార్టర్ విమానం ద్వారా ఇంటికి చేరుస్తారని ఆశిస్తున్నా. మేము షార్ట్ కట్లు గురించి అడగడం లేదు. మేము సంతకాలు చేసేటప్పుడే రిస్క్ తెలుసుకునే చేశాం. ఈ మెగా టోర్నీ పూర్తయి ఎంత తొందరగా ఇంటికి క్షేమంగా చేరుకుంటే అంత కంటే మంచిది మరొకటి ఉండదు’ అని లిన్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియా క్రికెటర్, కేకేఆర్ సభ్యుడు ప్యాట్ కమిన్స్ .. పీఎం కేర్స్‌కు 50వేల యూఎస్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.భారత్‌లో కరోనా రోగులకు ఆక్సిజన్ సప్లయ్ కొరత ఉన్న కారణంగా తనవంతు విరాళాన్ని ప్రకటించాడు. అదే సమయంలో ఐపీఎల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న మిగిలిన ఆసీస్ క్రికెటర్లను కూడా సాయం చేయాలని కోరాడు. కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం నాటికి కోవిడ్ కేసుల అప్డేట్ విడుదల చేసే సమయానికి గత 24 గంటల్లో 3, 23,144 కొత్త కేసులు నమోదు కాగా, 2,771 మృత్యువాత పడ్డారు. -
ఐపీఎల్‌కు కరోనా ఎసరు.. గుడ్‌బై చెబుతున్న ఆటగాళ్లు!
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించిన బీసీసీఐ ఈసారి మాత్రం భారత్‌లోనే టోర్నీని నిర్వహిస్తోంది. బయో బబుల్ నిబంధనల నడుమ ఈ మెగా ఈవెంట్ కొనసాగుతోంది. అయితే, గత నాలుగు రోజులుగా భారత్‌లో కరోనా రోజూవారీ కేసులు 3 లక్షలకు పైగా నమోదవుతున్న వేళ కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి స్వదేశానికి పయనమవుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆండ్రూ టై(రాజస్తాన్ రాయల్స్), ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆడం జంపా, కేన్ రిచర్డ్సన్ ఇంటిబాటపట్టారు. Courtesy: IPL Twitter ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్-2021 ఆడుతున్న తమ క్రికెటర్లు, కోచ్‌లు, కామెకంటేటర్లతో టచ్‌లో ఉన్నామని, ఎప్పటికప్పుడు పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో కరోనా వ్యాప్తి ఉధృతమవుతోందని, ఇలాంటి కష్ట సమయంలో కచ్చితంగా తాము భారతీయులకు మద్దతుగా నిలబడతామని, అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ సూచనల మేరకు తమ క్రికెటర్లను వెనక్కి పిలిపించే అవకాశాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు.. ‘‘బయో సెక్యూరిటీ ప్రొటోకాల్స్ నడుమ ఐపీఎల్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్‌లు, కామెంటేటర్లతో క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ కాంటాక్ట్‌లో ఉంటోంది. భారత్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. భారత్‌కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’’అని ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్వెల్, నాథన్ కౌల్టర్ నైల్ తదితర 14 మంది ఆసీస్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోగా, మిగతా క్రికెటర్లు కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తే తీవ్ర ప్రభావం పడటం ఖాయం. ఇక ఈ విషయంపై స్పందించిన కౌల్టర్ నైల్ మాట్లాడుతూ... ‘‘ప్రతి ఒక్కరి మనఃస్థితి, అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి. ఆండ్రూ ఇంటికి వెళ్లడం నాకు ఆశ్చర్యం కలిగించింది. జంప్స్, రిచో కూడా వెళ్లిపోయారు. నేను జంప్స్‌తో మాట్లాడాను. స్వదేశానికి వెళ్లడం వెనుక గల కారణాలపై తన వాదన విన్నాను. నాకు మాత్రం బయోబబుల్‌లో ఉండటమే సురక్షితంగా అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక చేతి వేలి గాయం కారణంగా రాజస్తాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్, మరో క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. చదవండి: బెయిస్టో అప్పుడు టాయిలెట్లో ఉంటే తప్ప -
'మేం బాగానే ఉన్నాం.. మీ పని చూసుకోండి'
సిడ్నీ: ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ తాజగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 12 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. దీంతో ఫించ్ దంపతులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ట్రోల్స్ చేశారు. అంతేగాక ఫించ్ భార్య ఎమీపై లైంగిక వేధింపులతో పాటు అసభ్యకరమైన సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఫించ్ భార్య ఎమీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమను ట్రోల్ చేసిన వారిపై మండిపడింది. 'ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గులేదా. దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడండి.. అంతేకాని ఇలా అసభ్య సందేశాలు పంపించి మీ పరువు తీసుకోకండి. నా భర్త ఒక్క మ్యాచ్‌లో సరిగా ఆడనందుకు ఇలాంటి చెత్త విమర్శలు చేస్తారా? ఫించ్ ఆటగాడిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్నాడు. అతని ఆటతీరును తప్పుపట్టేందుకు మీకు అర్హత లేదు. అయినా మా వైవాహిక జీవితంలో మేం బాగానే ఉన్నాం.. ఇలాంటి పనికిమాలిన పోస్టులు పెట్టేకంటే మీ పని చూసుకుంటే బాగుంటుంది.'అంటూ హెచ్చరించింది. ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా తరపున 132 వన్డేల్లో 5232 పరుగులు, 68 టీ20ల్లో 2162 పరుగులు, 5 టెస్టుల్లో 278 పరుగులు చేశాడు.కాగా కివీస్‌తో సిరీస్‌కు ముందు ఫించ్ 29 టీ20 మ్యాచ్‌లాడి 495 పరుగులు సాధించాడు. వీటిలో ఐపీఎల్, బిగ్‌బాష్ సహా పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక కివీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 బుధవారం వెల్లింగ్టన్లో జరగనుంది. చదవండి: 'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి' మహిళా క్రికెటర్‌తో ట్వీటర్ క్లాష్: ఈసీబీ వార్నింగ్ -
'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి'
సిడ్నీ: టీమిండియాతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోపీని 2-1 తేడాతో ఆసీస్ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లతో లాంగర్‌కు పొసగడం లేదని.. అతని ప్రవర్తనతో వారు ఇబ్బందులకు గురవుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో లాంగర్ ఆటగాళ్లతో ముభావంగా ఉండడం... తాను ఏం చెబితే అది చేయాలని.. ముఖ్యంగా గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో బౌలింగ్ విషయంలో జోక్యం చేసుకొని అనవసర సలహాలు ఇచ్చేవాడని.. ఆసీస్ బౌలర్లు కూడా అతని తీరుతో సంతృప్తిగా లేరంటూ పేర్కొంది. ఈ విషయాలను తాను సీరియస్‌గా తీసుకున్నానని.. జట్టుతో తనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తానని లాంగర్ అప్పట్లో స్పందించాడు. అయితే తాజాగా ఆటగాళ్లతో కోచ్‌గా తన ప్రవర్తన బాలేదంటూ మీడియాలో మరోసారి వార్తలు లీక్ అవడం తనను బాధించిందని లాంగర్ తెలిపాడు. ఈ వార్తలతో తాను మానసికంగా కుంగిపోతున్నానని.. నా ఫ్యామిలీకి ఈ విషయాలు తెలిసి బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ''నా వరకు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఎన్నో ఏళ్లు ఆటగాడిగా జట్టుకు సేవలందించా. ఆటగాడిగా ఉన్నప్పుడు రాని విమర్శలు కోచ్ పదవిలో ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. టెస్టు సిరీస్ ముగిసిన రెండు వారాలకు ఆటగాళ్లతో నా ప్రవర్తన బాలేదంటూ వార్తలు వచ్చాయి. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆటగాళ్లు లేక అసిస్టెంట్ కోచ్ నా వద్దకు వచ్చి సమస్యను చెప్తే సరిపోతుంది. ఈ విషయం వాళ్లకు అప్పుడే చెప్పా. నేను ఎక్కడ పనిచేసినా నిజాయితీతో ఉంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. బహుశా నేను ఏంచుకన్న దారి ఆటగాళ్లకు నచ్చలేదు. అందుకే వారు నాతో సరిగా ఉండలేకపోయారు. అయితే పదే పదే అదే విషయాన్ని గుర్తు చేస్తూ మీడియాలో కథనాలు లీక్ అవడం భాదించింది. చివరకు నా భార్య కూడా ఇన్ని అవమానాలు పడుతూ ఆసీస్ సీనియర్ జట్టుకు కోచ్‌గా పనిచేయడం అవసరమా అని ప్రశ్నించింది. నేను మాట్లాడే మాటలు సూటిగా ఉండొచ్చు.. కానీ నాకు మనసు ఉంటుంది. పైకి అది గట్టిగా కనిపించినా.. లోపల మాత్రం చాలా బాధ ఉంది. ఆటగాళ్లతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను ఎప్పటికి సిద్ధమే'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా? ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! -
సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా!
సిడ్నీ: ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు కెప్టెన్.. ప్రధాన బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఆసీస్, టీమిండియా సిరీస్ మధ్యలో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గజ్జల్లో గాయం అవడంతో మూడో వన్డేతో పాటు టీ 20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన వార్నర్‌ను మూడు, నాలుగు టెస్టులకు మాత్రం ఎంపికయ్యాడు. అతను పూర్తి ఫిట్‌గా లేకున్నా కూడా సీఏ అతన్ని బరిలోకి దింపిందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే తాను వంద శాతం ఫిట్‌గా ఉన్నానని.. అందుకే మిగిలిన టెస్టులకు ఎంపిక చేశారంటూ వార్నర్ అప్పట్లో చెప్పుకొచ్చాడు. అయితే చివరి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్ 5,13, 1,48 పరుగులు చేశాడు. తాజాగా వార్నర్‌కు గజ్జల్లో గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దాంతో పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించేందుకు కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని వార్నరే స్వయంగా వెల్లడించాడు. దీంతో ఏప్రిల్ మొదటివారం నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 2021 సీజన్లో డేవిడ్ వార్నర్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఐపీఎల్లోపూ పూర్తి స్తాయిలో కోలుకుంటే కచ్చితంగా పాల్గొంటానని స్పష్టం చేశాడు. ఐపీఎల్లో పాల్గొనాలంటే సీఏ జారీ చేసిన ఎన్వోసీ తప్పనిసరిగా ఉండాలి. వార్నర్ ఫిట్‌గా లేకుంటే మాత్రం సీఏ ఎన్వోసీ ఇవ్వదు.. దీంతో ఎన్వోసీ లేకుండా అతను ఐపీఎల్లో ఆడలేడు. అలా చూసుకుంటే వార్నర్ ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరమైతే మాత్రం ఎస్ఆర్హెచ్కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. వార్నర్ దూరమైతే అతని స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ వ్యహరించే అవకాశం ఉంది. 2018లో బాల్ టాంపరింగ్ కారణంగా డేవిడ్ వార్నర్‌పై ఏడాది నిషేధం పడగా.. అప్పుడు హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 142 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్.. 5,254 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016లో వార్నర్ సారధ్యంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: 'ఓడిపోయుండొచ్చు.. కోహ్లి మనసు గెలిచాం' అశ్విన్ అవసరం తీరిపోయింది.. కమ్‌బ్యాక్ కష్టమే -
ఐపీఎల్: ఆసీస్ ఆటగాళ్లకు సీఏ కీలక సూచన
సిడ్నీ: ఐపీఎల్ 14వ సీజన్లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లను అనుమతిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాత్కాలిక సీఈవో నిక్ హాక్లీ బుధవారం తెలిపాడు. అయితే ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనాలంటే ఎన్వోసీ(నిరభ్యంతర పత్రం) తప్పనిసరిగా పొందాలంటూ పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభ సమయానికి ఆటగాళ్లకు గాయాల సమస్యలు ఉంటే తప్ప ఎన్వోసీ జారీ చేయడంలో ఎటువంటి సమస్య ఉండబోదని సీఏ స్పష్టం చేసింది. కాగా ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికా టూర్‌ను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో కరోనా స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా పర్యటనను నిరవదిక వాయిదా వేసుకున్నట్లు సీఏ ఇప్పటికే తెలిపింది. కాగా ఆసీస్ జట్టుకు న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత ఐపీఎల్ ముగిసేవరకు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చదవండి: 'నేను కావాలని చేయలేదు.. క్షమించండి' గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు ఆస్ట్రేలియా నుంచి 20 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. కాగా ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.. ఈ వేలంలో ఆసీస్ ఆటగాళ్లైన స్మిత్, మ్యాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్‌లకు మంచి ధర దక్కే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఐపీఎల్ ఎప్పుడు నిర్వహించాలనేదానిపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బిజీ కానుంది.ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ మార్చి 28తో ముగియనుంది. దీంతో వారం వ్యవధిలో.. అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ 2021 జరిగే అవకాశం ఉంది. కాగా ఈసారి ఐపీఎల్‌ను మాత్రం స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. మొత్తం 8 జట్టు ఉండడంతో ఇంటా బయటా నిర్వహించాల్సి రావడంతో వేదిక విషయంలో తర్జన భర్జన పడుతుంది. చదవండి: ఆ రికార్డు బంగ్లా క్రికెటర్‌కే సాధ్యమైంది -
ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే!
మెల్బోర్న్: ఆసీస్ జట్టులో విభేదాలు ఉన్నాయని.. దానికి కారణం ఆ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ అని సిడ్నీ హెరాల్డ్ ప్రతిక పేర్కొంది. కోచ్ వ్యవహారశైలితో ఆటగాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారని.. దీంతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లు లాంగర్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లుగా రాసుకొచ్చింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో కోచ్ లాంగర్ స్పందించాడు. 'ఆటగాళ్లతో విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదు. అయినా ఇందులో నిజమెంతనేది నేను పట్టించుకోను. ఆటగాళ్లు తమ తిండి విషయాల్లో ఒకరు కావాలనుకుంటే నా పని నేను చేసినట్లు కాదు. ఇటీవలే టీమిండియాతో జరిగిన గబ్బా టెస్టులో మా ఆటగాడు సాండ్విచ్ తినడానికి మైదానంలోకి తీసుకువచ్చాడు. గత అనుభవాల దృష్యా ఆసీస్ ఆటగాళ్లపై నిరంతరం నిఘా ఉందని.. జేబులో ఏదైనా తీసుకెళ్తే అది ప్రమాదంగా మారే అవకాశం ఉందని.. తీసుకురావద్దని అతనికి చెప్పా. దీనిని కూడా తప్పే అంటే ఇంకేం చేయలేను.చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే ఇక బౌలింగ్ వ్యవహారాల్లో తలదూర్చకపోవడానికి కారణం ఉంది. బౌలింగ్ కోచ్ ఉన్నప్పుడు అతనే బౌలర్లను పర్యవేక్షిస్తాడు. పైగా నేనెప్పుడు బౌలర్ల సమావేశానికి హాజరుకాను.. కానీ కొన్ని నెలలుగా వాటిలో కూడా మార్పులు చోటుచేసుకోవడంతో దానిపై దృష్టి పెట్టాల్సి వచ్చిందంటూ' చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటికే టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆసీస్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా కోచ్ లాంగర్ వివాదం ఎక్కడికి తీసుకెళుతుందో వేచి చూడాలి. చదవండి: ఐపీఎల్లో ఆడేందుకు నేను సిద్ధం -
'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్ చేయండి'
సిడ్నీ: టీమిండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో ఆసీస్ 2-1 తేడాతో ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌పై నోరు పారేసుకొని కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయాలంటూ సీఏకు సూచించాడు. ప్రస్తుతం కమిన్స్ టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.చదవండి: టాప్‌లో కోహ్లి.. రెండుకే పరిమితమైన రోహిత్ 'ఆసీస్ జట్టులో ప్రస్తుతం కమిన్స్‌కు కెప్టెన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అతను ఫాంలో ఉంటే ఎంతలా రెచ్చిపోతాడనేది టీమిండియాతో జరిగిన సిరీస్ అందుకు నిదర్శనం. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కమిన్స్ తన ప్రవర్తనతోనూ ఆకట్టుకున్నాడు. టిమ్ పైన్ కెప్టెన్సీని నేను తప్పుబట్టలేను.. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో మాత్రం అతను ఒక కెప్టెన్‌గా తన చర్యలతో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే కమిన్స్ కెప్టెన్‌ను చేయాలంటే స్మిత్, వార్నర్, హాజిల్‌వుడ్, నాథన్ లయన్ లాంటి ఉన్న సీనియర్ ఆటగాళ్ల మద్దతు కావాల్సిందే.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్ జట్టుకు పరిమిత ఓవర్లతో పాటు టీ20ల్లో ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో ప్రపంచ నెంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతున్న కమిన్స్ 34 టెస్టుల్లో 164, 69 వన్డేల్లో 111, 30 టీ20ల్లో 37 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ బౌలర్‌గా మంచి క్రేజ్ ఉన్న కమిన్స్‌ను 2019 డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్ జట్టు రూ. 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. చదవండి: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం -
ఆటగాళ్లపై జాత్యాహంకార వ్యాఖ్యలు నిజమే
సాక్షి. న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల ముగిసిన సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లు జాతి వివక్షను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించింది. భారత ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా ఆసీస్ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని టీమిండియా మేనేజ్మెంట్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. చదవండి: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించామని.. నిబంధనల ప్రకారం నిందితులను మైదానంలోకి అడుగుపెట్టకుండా దీర్ఘకాల నిషేధం విధిస్తామని సీఏ అధికారులు వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు పుజారా, విహారి, అశ్విన్, పంత్‌లు గాయాల బారిన పడినప్పటికీ సమయోచితంగా పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో సఫలమయ్యారు. ఇక ఆఖరిదైన నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు మరోసారి చెలరేగి ఆసీస్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. -
సీఏదే తప్పు.. గబ్బాలో మొదటి టెస్టు ఆడుంటే
బ్రిస్బేన్: 1988 నుంచి 32 ఏళ్ల పాటు బ్రిస్బేన్ మైదానంలో ఓటమెరుగని ఆసీస్‌కు టీమిండియా చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ ఓడిపోవడంపై మాజీ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ క్రికెట్ ఆస్ట్రేలియా తీరును తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంప్రదాయం ప్రకారం బోర్డర్ గవాస్కర్ ట్రోపీని గబ్బాలో మొదలుపెట్టుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని.. ఆతిథ్య జట్టుకు 2-1తేడాతో పరాభవం జరిగేదికాదని అభిప్రాయపడ్డాడు. చదవండి: నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్ 'ప్రతీ ఏడాదిలో సమ్మర్ సీజన్లో ఆసీస్ ఎప్పుడు టెస్టు మ్యాచ్ ఆడినా.. గబ్బా వేదికగానే ఆరంభమవుతుంది. కానీ ఈసారి ఆ రూల్‌కు సీఏ వ్యతిరేకంగా వ్యవహరించింది. ఒకవేళ గబ్బాలో మొదటిటెస్టు జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆసీస్‌కు గబ్బా వేదిక బాగా కలిసొచ్చిన మైదానం.. 32 ఏళ్ల పాటు అక్కడ మాకు ఓటమి అనేది తెలియదు. ఇక్కడ తొలి మ్యాచ్ జరగుంటే ఆసీస్ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేది. కానీ సీఏ మాత్రం విరుద్ధంగా అడిలైడ్ వేదికగా బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను అడిలైడ్‌లో ప్రారంభించింది. అంతేగాక టీమిండియా ఎప్పుడు వచ్చినా గబ్బా వేదికగానే తొలి టెస్టు ఆడాల్సి ఉండేది.. దీంతో పాటు పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్(వాకా) మైదానంలో ఈసారి ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశమే నన్ను సీఏను తప్పు పట్టేలా చేసింది.'అంటూ తెలిపాడు. -
థ్యాంక్యూ బీసీసీఐ.. మంచి గిఫ్ట్ ఇచ్చారు
బ్రిస్బేన్: బోర్డర్ గవాస్కర్ ట్రోపీని విజయవంతం చేసినందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) బీసీసీఐకి థ్యాంక్స్ చెబుతూ ట్విటర్ వేదికగా లేఖను విడుదల చేసింది. కరోనా తర్వాత జరిగిన ఈ సిరీస్‌ను ఒక మరుపురానిదిగా మార్చినందుకు ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో విడుదల చేసిన ఈ లేఖపై సీఏ ఛైర్పర్సన్ ఎర్ల్ ఎడింగ్స్, సీఈవో నిక్ హోక్లీ సంతకాలు ఉన్నాయి. సీఏ రాసిన లేఖలో సారాంశం ఈ విధంగా ఉంది.. 'కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సిరీస్‌కు సహకరించిన బీసీసీఐకి ముందుగా థ్యాంక్స్. ఇక కఠినమైన కోవిడ్ నిబంధనలు.. బయో బబుల్ ఆంక్షల ప్రకారం ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినందుకు భారత ఆటగాళ్ళకు మా ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌కు పైగా ఈ సిరీస్‌ను వీక్షించారు. దీంట్లో బీసీసీఐ ప్రోత్పాహం మరువలేనిది.. వారి స్నేహం, నమ్మకం, నిబద్ధత ఇకపై కూడా అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు జరిగిన అన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోపీలలో దీనికి ఉన్నతమైన స్థానం ఉంటుంది. సిరీస్ సందర్భంగా ఎన్నో వివాదాలు.. సంతోషకర సంఘటనలు చాలానే చూశాం. సిరీస్‌లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఇరు జట్లు టీమ్ స్పిరిట్‌తో ముందుకు వెళ్లడం మంచి విషయంగా పరిగణించవచ్చు.కోహ్లి గైర్హాజరీలో టీమిండియాను ముందుకు నడిపించిన అజింక్యా రహానేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పాట్ కమిన్స్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(నాలుగో టెస్టు) రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, స్టీవ్ స్మిత్, శుబ్‌మన్ గిల్, కామెరాన్ గ్రీన్‌లకు మా అభినందనలు. ఇక చివరిగా మాకు మరిచిపోలేని సిరీస్ అందించినందుకు బీసీసీఐకి మరోసారి థ్యాంక్స్ అంటూ ముగించారు.చదవండి: 'నా కొడుకు సెంచరీ చేసుంటే బాగుండేది' ఐపీఎల్ ముగిసిన తర్వాత నేరుగా ఆసీస్‌కు పయనమైన భారత జట్టు ముందుగా వన్డే సిరీస్‌తో మొదలుపెట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయినా.. టీ20 సిరీస్ వచ్చేసరికి 2-1 తేడాతో టీమిండియా ఆసీస్‌పై ఆధిక్యతను కనబరిచింది. ఇక నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటైన టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇండియా ఆటతీరుపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అయితే వీటన్నింటిని పట్టించుకోకుండా కోహ్లి గైర్హాజరీలో రహానే నాయకత్వంలో మెల్బోర్న్ టెస్టులో గెలిచి విమర్శలకు చెక్ పెట్టింది. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న టీమిండియాను అశ్విన్, హనుమ విహారిలు తమదైన ఓపికను ప్రదర్శించి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించారు. ఇక నిర్ణయాత్మకంగా మారిన గబ్బా టెస్ట్‌లో టీమిండియా సరైన సమయంలో జూలు విదిల్చింది. ఆటలో భాగంగా 5వ రోజు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. గిల్, పుజారా, పంత్ రాణించడంతో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అంతేగాక 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆసీస్‌కు చెక్ పెట్టి రికార్డును తిరగరాసింది.చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది : పంత్ An open letter to our friends in Indian Cricket, and to everyone who played their part to help deliver this memorable series! 🤜🤛 @BCCI pic.twitter.com/rk4cluCjEz — Cricket Australia (@CricketAus) January 20, 2021 -
పాపం పకోవ్‌స్కీ.. మళ్లీ ఔట్!
ఏ ముహుర్తానా ఆసీస్- భారత్‌ల మధ్య సిరీస్ ప్రారంభమైందో తెలియదుగాని ఆది నుంచి చూసుకుంటే ఇరు జట్లలో ఎవరు ఒక ఆటగాడు గాయపడుతూనే వస్తున్నారు. ఇప్పటికే టీమిండియా నుంచి ఆరుగురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవగా.. అటు ఆసీస్‌లోనూ గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియన్ యువ ఓపెనర్ విల్ పకోవ్‌స్కీ గాయపడిన సంగతి తెలిసిందే. విల్ పకోవ్‌స్కీ.. టెక్నిక్‌గా చూస్తే మంచి ప్రతిభావంతుడు. కానీ చిన్నప్పటి నుంచి గాయాలు అతన్ని వేధిస్తూనే ఉన్నాయి. టీమిండియాతో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 64, 8 పరుగులు చేశాడు. (చదవండి: ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే) అయితే సిడ్నీ టెస్టులో ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ సమయంలో పకోవ్‌స్కీ డైవ్ చేయగా అతని భుజానికి బలమైన గాయమైంది. అతని భుజం ఎముక పాక్షికంగా పక్కకు జరగడంతో నొప్పితో బాధపడుతున్నాడని.. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. దీంతో అతను ఇరు జట్లకు కీలకంగా మారిన బ్రిస్బేన్ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు అతని ఫిట్నెస్ను పరీక్షించి నాలుగో టెస్టుకు ఎంపిక చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఏ తెలిపింది. కాగా జనవరి 15 నుంచి టీమిండియా- ఆసీస్‌ల మధ్య బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది.(చదవండి: 'ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధం') -
బ్రిస్బేన్‌లో టెస్టు ఆడతాం: బీసీసీఐ
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు వేదిక విషయంలో సందిగ్ధత వీడింది. బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ సమాచారం అందించింది. అయితే మ్యాచ్ ముగిశాక ఒక్క రోజు కూడా తాము అక్కడ ఉండబోమని, వెంటనే భారత్‌కు వెళ్లిపోయే ఏర్పాట్లు చేయాలని కోరింది. ‘చివరి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కు తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేయమని వారిని కోరాం. అందుబాటులో ఉన్న మొదటి ఫ్లయిట్లోనే పంపిస్తే మంచిది. వీలుంటే మ్యాచ్ ముగిసిన రాత్రి కూడా అక్కడ ఆగకుండా బయల్దేరాలని భావిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ప్రేక్షకులను అనుమతించడం లేదని బోర్డు స్పష్టం చేసింది. కఠిన బయో బబుల్ వాతావరణంలో క్రికెటర్లు ఉండబోతున్నారని, ఇలాంటి స్థితిలో తాము రిస్క్ తీసుకోలేం కాబట్టి అభిమానులను ఒక్క మ్యాచ్‌కూ అనుమతించమని వెల్లడించింది. -
హమ్మయ్య! అందరికీ నెగెటివ్
మెల్బోర్న్: హమ్మయ్య! భారత క్రికెటర్లకే కాదు... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కే ఇది పెద్ద ఊరట. ఆటగాళ్లంతా కోవిడ్–19 పరీక్షల నుంచి నెగెటివ్‌గా బయటపడ్డారు. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు వచ్చిన ముప్పేమీ లేదిపుడు. ‘ఆటగాళ్లతో పాటు జట్టు సహాయ సిబ్బందిలో ఎవరికీ కరోనా సోకలేదు. ఆదివారం వీరందరికీ ‘ఆర్టీ–పీసీఆర్’ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా... సోమవారం ఫలితాలన్నీ నెగెటివ్‌గానే వచ్చాయి’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలు కరోనా నిబంధనల్ని ఉల్లంఘించారని, బయో బబుల్ దాటి బయటకొచ్చి రెస్టారెంట్ రుచులు చూశారని గగ్గోలు పెట్టిన ఆసీస్ ప్రభుత్వ వర్గాలు ఇక తమ నోటికి తాళం వేసుకుంటాయేమో! ఎందుకంటే ఇప్పటికే ఈ ఉదంతంపై బీసీసీఐతో కలిసి సీఏ ఉమ్మడి దర్యాప్తు చేపడుతుందంటూ చేసిన ప్రకటనలకు ఇక కాలం చెల్లినట్లే! రెస్టారెంట్లో భోంచేసిన ఆ ఐదుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచినప్పటికీ సోమవారం జట్టుతో పాటే సిడ్నీకి చేరుకున్నారు. తాజాగా రిపోర్టులు కూడా నెగెటివ్‌గా రావడంతో ఇప్పుడు అంతా కలిసే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారు. 25 శాతం మంది వీక్షకులకే ప్రవేశం సిడ్నీలో నమోదవుతున్న కరోనా కేసుల దృష్ట్యా మూడో టెస్టుకు వచ్చే వీక్షకుల సంఖ్యను 25 శాతానికి కుదించారు. ఈ మైదానం మొత్తం సామర్థ్యం 38 వేల సీట్లు. దీంతో పదివేల లోపే ప్రేక్షకుల్ని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో టెస్టు కోసం ఇది వరకే జారీ చేసిన టికెట్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేసి అంతా కొత్తగా అంటే సీటుకు, సీటుకు మధ్య భౌతిక దూరం వుండేలా తిరిగి జారీ చేస్తారు. దీనిపై సీఏ తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లీ మాట్లాడుతూ ‘న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలోని ప్రజారోగ్యం దృష్ట్యా మేం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. మూడో టెస్టు సజావుగా, సురక్షితంగా జరిగేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. ప్రేక్షకుల సంఖ్యను కుదిస్తాం’ అని అన్నారు. ఎలా‘గబ్బా’! భారత ఆటగాళ్ల రెస్టారెంట్ వ్యవహారం సద్దుమణిగినప్పటికీ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈనెల 15 నుంచి జరగాల్సిన నాలుగో టెస్టుపైనే సందిగ్ధత పూర్తిగా తొలగలేదు. కాస్త అయోమయం ఉన్నప్పటికీ బీసీసీఐ సోమవారం చేసిన ప్రకటన సీఏకు ఊరటనిచ్చింది. ‘షెడ్యూల్ ప్రకారమే నాలుగో టెస్టు జరుగుతుంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. అయితే నిబంధనలు పాటిస్తేనే బ్రిస్బేన్‌కు రావాలని లేదంటే అక్కర్లేదని ఘాటుగా వ్యాఖ్యానించిన క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు రాస్ బేట్స్ వ్యాఖ్యలపై బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
ఐసోలేషన్‌లో రోహిత్ శర్మ
మెల్బోర్న్: భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ అభిమానం కారణంగా భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్ శర్మ, యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, పృథ్వీ షా, వికెట్‌కీపర్ రిషభ్ పంత్, పేసర్ నవదీప్ సైనీలను ఐసోలేషన్‌కు తరలించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం వెల్లడించింది. ఆటగాళ్లు బయో బబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది. ► సీఏ ప్రొటోకాల్ ప్రకారం ఆటగాళ్లు ఇన్డోర్ ప్రదేశాల్లో భోజనం చేయకూడదు. ప్రజా రవాణా వ్యవస్థను వాడకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ కాలిబాటన వారికి సమీపంలోని అవుట్డోర్ వేదికలకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ► అయితే శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా మెల్బోర్న్లోని సమీప రెస్టారెంట్‌కు వెళ్లి భారత క్రికెటర్లు అల్పాహారం చేస్తుండగా... అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వారికి తెలియకుండా క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. ఇది తెలుసుకున్న రోహిత్ శర్మ తనను వారించినట్లు, రిషభ్ పంత్ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని ఆ అభిమాని ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో ఈ సంగతి సీఏ దృష్టికి వచ్చింది. ► బయో బబుల్ దాటి వచ్చారనే ఆరోపణలతో తాజాగా సీఏ ఈ ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచింది. దీంతో వీరు ప్రయాణాల్లో, ప్రాక్టీస్ సమయాల్లో... మిగతా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7 నుంచి జరుగనున్న మూడో టెస్టు కోసం ఇరు జట్లు 2 రోజుల ముందుగా సిడ్నీకి వస్తాయి. ► ‘ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మన వాళ్లకు నిబంధనల గురించి బాగా తెలుసు. వారిపై బీసీసీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టడం లేదు. రెండో టెస్టు లో భారత్ చేతిలో ఓటమి అనంతరం ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఇలాంటి ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేస్తోంది. మూడో టెస్టు ముందర భారత జట్టును కలవరపెట్టేందుకు ఇది ఓ ప్రయత్నమైతే, ఇది చాలా చెడ్డ కుట్ర అని భావించవచ్చు. ఇప్పుడు ఈ వివాదం 2007–08లో జరిగిన ‘మంకీ గేట్’ నాటి పరిస్థితులను తలపిస్తోంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వివరణ ఇచ్చారు. రెస్టారెంట్లో భారత క్రికెటర్లు -
స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్
కాన్బెర్రా : బిగ్‌బాష్ లీగ్ 2020లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో మెకేంజీ హార్వే అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. హార్వే అందుకున్న క్యాచ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌నే కాదు బౌలర్‌ను కూడా షాక్‌కు గురిచేసింది. కష్టసాధ్యమైన క్యాచ్‌ను హార్వే సూపర్డైవ్ చేసి అందుకున్న తీరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. హార్వే సాధించిన ఈ ఫీట్ సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జరిగింది. (చదవండి : వైరల్ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని) మెల్బోర్న్ రెనేగేడ్స్ బౌలర్ మిచెల్ పెర్రీ వేసిన ఫుల్‌టాస్ బంతిని అలెక్స్ హేల్స్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. ఆ షాట్ తీరు చూస్తే ఎవరైనా ఫోర్ అనుకుంటారు. కానీ బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న హార్వే ముందుకు డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. హార్వే క్యాచ్‌తో షాక్‌కు గురైన హేల్స్ నిరాశగా వెనుదిరగగా.. బౌలర్ పెర్రీ ఆశ్చర్యం వక్తం చేస్తూ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. అమేజింగ్ హార్వే.. ఇది క్యాచ్ ఆఫ్ ది టోర్న్‌మెంట్ అవుతుందా? హార్వేను బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది వరల్డ్ అనొచ్చా? దీనిపై మీ కామెంట్ ఏంటి అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా మ్యాచ్‌కు ముందు వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు ఆటను కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 17 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నబీ 33 పరుగులతో రాణించాడు. (చదవండి: క్యారీ స్టన్నింగ్ క్యాచ్.. వహ్వా అనాల్సిందే) అనంతరం 20 ఓవర్లలో 173 పరుగుల సవరించిన లక్ష్యాన్ని సిడ్నీ థండర్స్ ముందు ఉంచారు. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, అలెక్స్ హేల్స్ దాటిగా ఆడడంతో సిడ్నీ థండర్స్ వేగంగా పరుగులు సాధించింది. హేల్స్ వెనుదిరిగిన అనంతరం మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగింది. అప్పటికి సిడ్నీ థండర్స్ 12 ఓవర్లలో 117 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో డక్‌వర్త్ లుయీస్ పద్దతిలో సిడ్నీ థండర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. The catch of the tournament!? The best fielder in the world!? What a grab...#BBL10 | @BKTtires pic.twitter.com/ByRq1ecBCL — cricket.com.au (@cricketcomau) January 1, 2021 -
ఆసీస్ భయంతోనే వార్నర్‌ను ఆడిస్తుందా?
మెల్బోర్న్ : టీమిండియాతో జరగనున్న మూడో టెస్టులో డేవిడ్ వార్నర్ 100శాతం ఫిట్‌గా లేకున్నా మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని ఆసీస్ అసిస్టెంట్ కోచ్ అండ్రూ మెక్‌డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. అయితే మెక్‌డొనాల్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్నర్ ఫిట్‌నెస్‌పై పలు సందేహాలకు తావిస్తుంది. మొదటి రెండు టెస్టులు చూసుకుంటే ఆసీస్ ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా శతకం సాధించలేకపోయారు.(చదవండి : జహీర్ బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు క్లీన్‌బౌల్డ్) ఆసీస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 1,1*,0,8 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఆసీస్ గెలిచిన మొదటి టెస్టులో బ్యాట్స్మెన్ల కన్న బౌలర్ల చలువతోనే గట్టెక్కిందనడంలో సందేహం లేదు. స్మిత్ ఒక్కడే కాదు మిగతా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే వార్నర్ ఫిట్‌గా లేకున్నా.. అతను జట్టులోకి వస్తే జట్టు బలోపేతం అవుతుందనే సీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒక రకంగా రానున్న మూడు, నాలుగు టెస్టుల్లో బ్యాటింగ్ ఇలా కొనసాగితే సిరీస్ కోల్పోతామనే భయంతోనే వార్నర్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చారని పలువురు భావిస్తున్నారు. వార్నర్ రాకతో జట్టు బలోపేతం అవడం నిజమే అయినా.. ఒక ఆటగాడు ఫిట్‌గా లేకున్నా ఎలా ఆడిస్తారనే దానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే వార్నర్‌తో పాటు తుది జట్టులోకి రానున్న పుకోవిస్కీ, సీన్ అబాట్‌ల ఫిట్‌నెస్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్) కాగా భారత్‌తో జరిగిన రెండో వన్డే తర్వాత గజ్జల్లో గాయంతో వార్నర్ మూడో వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. వార్నర్ నాలుగు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని అంతా భావించినా.. గాయం తగ్గకపోవడంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మూడు, నాలుగు టెస్టులకు గానూ జో బర్న్స్ స్థానంలో వార్నర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇరుజట్ల మధ్య జనవరి 7వ తేదీ నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. కరోనా నేపథ్యంలో మూడో టెస్టును సిడ్నీ లేక మెల్బోర్న్లో జరపాలా అనే దానిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం రాలేదు. -
సిడ్నీ టెస్టుకు డేవిడ్ వార్నర్ రెడీ
పేలవ బ్యాటింగ్‌తో ఇబ్బందులు పడుతున్న ఆస్ట్రేలియా జట్టుకు కాస్త ఊరట! గజ్జల్లో గాయంతో ఆటకు దూరమైన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పూర్తిగా కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. మూడో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం ప్రకటించిన జట్టులో వార్నర్‌కు చోటు దక్కింది. అతనితో పాటు విల్ పకోవ్‌స్కీ, సీన్ అబాట్లను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరంతా గురువారం సాయంత్రం ఆసీస్ జట్టుతో చేరి సిడ్నీ టెస్టు కోసం ప్రాక్టీస్ మొదలు పెడతారు. తొలి రెండు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమైన ఓపెనర్ జో బర్న్స్‌పై వేటు పడింది. మూడో టెస్టు వేదికగా సిడ్నీ ఖరారు అయినా... సిడ్నీలో ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా ఆంక్షల కారణంగా భారత్, ఆసీస్ జట్లు వెంటనే అక్కడికి వెళ్లడం లేదు. జనవరి 4 వరకు ఆటగాళ్లంతా మెల్బోర్న్లో ఉండి ప్రాక్టీస్ కొనసాగిస్తారని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ వెల్లడించారు. -
డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్
సిడ్నీ : టీమిండియాతో జరగనున్న మూడో టెస్టుకు ఆసీస్ విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ అందుబాటులోకి రానున్నాడు. మొదటి రెండు టెస్టుల్లో ఆడిన ఓపెనర్ జో బర్న్స్ స్థానంలో వార్నర్‌ను ఎంపిక చేసినట్లు ఆసీస్ జట్టు సెలెక్టర్ ట్రేవర్ హోన్స్ తెలిపాడు. ఈ మేరకు మూడు, నాలుగు టెస్టులకు 18 మందితో ఆసీస్ జట్టును ప్రకటించింది. కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే.గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. (చదవండి : ‘స్టీవ్ స్మిత్‌పై నాకు నమ్మకం ఉంది’) అయితే వార్నర్ టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు.. కానీ గాయం తీవ్రతపై స్పష్టం లేకపోవడంతో మొదటి రెండు టెస్టులకు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా వార్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేశామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. వాస్తవానికి జో బర్న్స్ మొదటి రెండు టెస్టుల్లో పర్వాలేదనిపించే ప్రదర్శన నమోదు చేశాడు. బర్న్స్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 8,51*, 0,4 కలిపి 125 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థసెంచరీ ఉంది. అయితే మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ప్రదర్శన స్థిరంగా ఉండడంతో వార్నర్ కోసం బర్న్స్‌ను పక్కడపెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. మరోవైపు త్యాగి బౌన్సర్‌తో గాయపడ్డ పుకోవిస్కిని ఎంపిక చేసినా తుది జట్టులోకి వచ్చే దానిపై స్పష్టత లేదని తెలిపింది. కాగా వార్నర్ రాకతో ఆసీస్ కాస్త బలంగా తయారైనట్లు కనిపిస్తుంది. అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియాపై ఘన విజయం సాధించిన ఆసీస్‌కు మెల్బోర్న్లో షాక్ తగిలింది. టీమిండియా సమిష్టి ప్రదర్శనతో రెండో టెస్టులో ఆసీస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్, విల్ పుకోవిస్కీ, మార్కస్ హారిస్, మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రేవిస్ హెడ్, మాట్ హెన్రిక్స్, టిమ్ పైన్ (కెప్టెన్), పాట్ కమిన్స్, కెమెరాన్ గ్రీన్, సీన్ అబాట్,నాథన్ లైయన్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, జోష్ హాజిల్‌వుడ్, జేమ్స్ ప్యాటిన్సన్, మైఖేల్ నాజర్ -
అతను వార్నర్ కాదు.. డేవిడ్ ఖాన్ అట!
సిడ్నీ : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇండియన్ హీరోలను ఇమిటేట్ చేయడంలో ముందువరుసలో ఉంటాడు. కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉన్న వార్నర్ చాలా ఇండియన్ సినిమాల డైలాగ్‌లను, హీరో మేనరిజమ్‌లు, డ్యాన్స్‌లతో అలరించాడు. లాక్డౌన్ సమయంలో నిత్యం ఏదో ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఎంటర్టైన్ చేశాడు. తాజాగా వార్నర్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ ఇలా చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలను ఇమిటేట్ చేసిన వీడియో ఒకటి ట్రెండింగ్‌గా నిలిచింది. ఏఐ ఫేస్‌యాప్ ఉపయోగించి వార్నర్ డాన్-2 సినిమాలో షారుక్‌లా కనిపించాడు. వీడియోలో అతనిలా స్టంట్స్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లో ఇరగదీశాడు. ' ఇంత వయొలన్స్ నేను ఎప్పుడూ చేయలేనని.. కానీ ఈ హీరో ఎవరో మీకు అర్థమై ఉంటుందంటూ క్యాప్షన్ జత చేశాడు. (చదవండి : ధోని రనౌట్‌కు 16 ఏళ్లు..) దీంతో పాటు హృతిక్ కీలకపాత్ర పోషించిన జోదా అక్బర్ సినిమాలో హృతిక్ పాత్రలో వార్నర్ మెరవడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డాన్-2 సినిమాకు దర్శకత్వం వహించిన ఫర్హాన్ అక్తర్ వార్నర్ వీడియోపై వినూత్న రీతిలో స్పందించాడు. బాలీవుడ్‌కు కొత్త డాన్ వచ్చాడు. అతనే డేవిడ్ వార్నర్.. సారీ డేవిడ్ ఖాన్ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. కాగా భారత్, ఆసీస్ మధ్య జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు వార్నర్ ఆడేది అనుమానంగానే ఉంది. అతని ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలు ఉండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా రెండో టెస్టుకు అతన్ని దూరం పెట్టాలని నిర్ణయించింది. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. (చదవండి : 'మీ చిన్నారులు తెగ ముద్దొచ్చేస్తున్నారు') View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
బ్రాడ్‌మన్ టోపీ విలువ రూ. 2 కోట్ల 51 లక్షలు
సిడ్నీ: ఆస్ట్రేలియా దివంగత దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ తన అరంగేట్రం టెస్టులో ధరించిన బ్యాగీ గ్రీన్ టోపీకి 4 లక్షల 50 వేల ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 2 కోట్ల 51 లక్షలు) ధర పలికింది. సిడ్నీలో నిర్వహించిన వేలంలో ఆస్ట్రేలియా వ్యాపారవేత్త పీటర్ ఫ్రీడ్మన్ ఈ మొత్తం వెచి్చంచి బ్రాడ్‌మన్ టోపీని సొంతం చేసుకున్నాడు. క్రికెటర్ల వస్తువులకు లభించిన రెండో అత్యధిక మొత్తమిది కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా మేటి స్పిన్నర్ షేన్ వార్న్ టోపీ వేలంలో 10 లక్షల 7 వేల 500 ఆస్ట్రేలియన్ డాలర్లకు (రూ. 5 కోట్ల 61 లక్షలు) అమ్ముడుపోయింది. (చదవండి : ఒక్క ఓవర్.. ఐదు వికెట్లు.. సూపర్ కదా) 1928 నుంచి 1948 మధ్య కాలంలో 52 టెస్టులు ఆడిన బ్రాడ్‌మన్ 99.94 సగటుతో 6,996 పరుగులు చేశారు. వేలంలో అమ్ముడుపోయిన టోపీని బ్రాడ్‌మన్‌కు 1928 నవంబర్‌లో బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్రం టెస్టులో అందజేశారు. ఓవరాల్‌గా బ్రాడ్‌మన్ వద్ద 13 బ్యాగీ గ్రీన్ టోపీలు ఉన్నాయి. వేలంలోకి వచి్చన టోపీని బ్రాడ్‌మన్ 1928 అరంగేట్రం సిరీస్‌లోని నాలుగు టెస్టుల్లో ధరించారు. బ్రాడ్‌మన్ ఈ టోపీని 1959లో తన ఫ్యామిలీ ఫ్రెండ్ పీటర్ డన్హమ్కు బహుమతిగా ఇచ్చారు. అయితే ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో ఈ ఏడాది పీటర్ డన్హమ్కు ఎనిమిదేళ్ల జైలుశిక్ష పడింది. దాంతో డన్హమ్ వద్ద ఉన్న బ్రాడ్‌మన్ టోపీని వేలం వేసి తద్వారా వచి్చన మొత్తంతో తమ బాకీలు తీర్చాలని డన్హమ్ బాధితులు కోరడంతో ఆ టోపీ వేలంలోకి వచ్చింది.(చదవండి : 'మీ చిన్నారులు తెగ ముద్దొచ్చేస్తున్నారు') -
టీమిండియాతో మ్యాచ్ : ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ
సిడ్నీ : భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఆసీస్ నుంచి మరో కీలక ఆటగాడు దూరమయ్యాడు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల రిత్యా టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇదే విషయంపై ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. 'కుటుంబ కారణాల రిత్యా స్టార్క్ టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచంలో అన్నింటి కన్నా కుటుంబం ముఖ్యం.. దాని తరువాతే ఏదైనా. మిచెల్‌కు కావలసినంత సమయాన్ని ఇస్తాం. తాను అనుకున్నప్పుడే జట్టులోకి రావచ్చు. అయితే మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తాడనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. తన కోసం ఎదురు చూస్తుంటాం.' అని లాంగర్ పేర్కొన్నాడు. (చదవండి : ప్రియురాలి కోరిక.. సొంత దేశానికి రిటైర్మెంట్) కాగా ఆసీస్ జట్టును గాయాల బెడద పీడిస్తోంది. వన్డే సిరీస్ తర్వాత స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఆస్టన్ అగర్ దూరం కాగా.. తాజాగా స్టార్క్ కూడా దూరమయ్యాడు. కాగా నేడు జరిగే మ్యాచ్‌లో ఆసీస్ జట్టు స్టార్క్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందనేది వేచి చూడాలి. కాగా ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమిండియా మరో విజయం సాధించి సిరీస్ గెలవాలని చూస్తుంటే.. ఆసీస్ మాత్రం మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తుంది. (చదవండి : 'గిల్.. ఇదేమైనా క్లబ్ క్రికెట్ అనుకున్నావా') -
క్రికెట్ ఆస్ట్రేలియాపై షేన్ వార్న్ అసంతృప్తి
సిడ్నీ : ఆసీస్ స్పిన్ దిగ్గజం.. మాజీ బౌలర్ షేన్ వార్న్ క్రికెట్ ఆస్ట్రేలియాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాన్బెర్రా వేదికగా నేడు జరుగుతున్న మూడో వన్డేకు కమిన్స్‌ను పక్కనపెట్టడంపై తప్పుబట్టాడు. వాస్తవానికి ఐపీఎల్ 13 వ సీజన్ తర్వాత ఆసీస్ ఆటగాళ్లు నేరుగా టీమిండియాతో వన్డే సిరీస్ ఆడాల్సి వచ్చింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో రానున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని ఆసీస్ ప్రధాన బౌలర్‌గా ఉన్న కమిన్స్‌కు మూడో వన్డే నుంచి విశ్రాంతి కల్పించారు. సుదీర్ఘమైన ఐపీఎల్ ఆడడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. (చదవండి : 21 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు) అయితే షేన్ వార్న్ ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ కామెంట్స్ చేశాడు. 'పాట్ కమిన్స్‌కు విశ్రాంతినివ్వడంపై నేను నిరాశకు లోనయ్యా. ఐపీఎల్ ఆడినంత మాత్రానా ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తారా? ఇలా అయితే ఆటగాళ్లను ఐపీఎల్‌కు పంపించాల్సింది కాదు.. ఏ లీగ్ ఆడినా ఆటగాళ్లకు దేశం తరపున ఆడడమే మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. అలసిపోయారనే భావనతో కమిన్స్ లాంటి ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం సరికాదు. ఐపీఎల్ అనేది ఒక లీగ్.. ఏడాదికి ఇలాంటి లీగ్‌లు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఆడుతున్నది అంతర్జాతీయ వన్డే మ్యాచ్. మూడో వన్డేలో కమిన్స్ ఆడిస్తే బాగుండేది. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం నాకు నచ్చలేదు' అని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్ స్టార్ బౌలర్‌గా పేరు పొందిన కమిన్స్ ఐపీఎల్ 13వ సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. రూ.16 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యానికి నిరాశనే మిగిల్చాడు. 14 మ్యాచ్‌లాడిన కమిన్స్ 7.86 ఎకానమి రేటుతో 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
టి20 సిరీస్‌కు వార్నర్ దూరం
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారత్‌తో రేపు జరిగే చివరి వన్డేతో పాటు 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతనికి గజ్జల్లో గాయమైంది. గాయానికి చికిత్సతో పాటు వార్నర్ కోలుకునేందుకు కొంత సమయం కావాలని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)... టెస్టు సిరీస్‌కల్లా అతను ఫిట్‌గా ఉండాలని కోరుకుంటోంది. వార్నర్ స్థానంలో డార్సీ షార్ట్‌ను ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. మరోవైపు ప్రధాన పేసర్ ప్యాట్ కమిన్స్‌కు మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి కల్పించింది. అతను కూడా రేపు జరిగే వన్డేతో పాటు టి20 సిరీస్‌లో బరిలోకి దిగడు. ‘వార్నర్, కమిన్స్ మా టెస్టు జట్టు ప్రణాళికల్లో ఎంతో కీలక ఆటగాళ్లు. వార్నర్ కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. కమిన్స్‌కు మాత్రం ఫిట్‌గా ఉండేందుకు కొంత విరామం ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. తల తిరిగినట్లనిపించింది: స్మిత్ వరుసగా రెండో సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించిన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అసలు రెండో వన్డేలో ఆడతాననుకోలేదని అన్నాడు. మ్యాచ్ రోజు ఉదయం చాలా తీవ్రమైన తలపోటుతో బాధ పడినట్లు అతను వెల్లడించాడు. ‘ఉదయం బాగా తల తిప్పినట్లనిపించింది. మ్యాచ్ రోజు ఉదయం మైదానానికి వచ్చిన సమయంలో కూడా ఇదే పరిస్థితి. అసలు రెండో వన్డే ఆడతానని భావించలేదు. అయితే టీమ్ డాక్టర్ పలు రకాల చికిత్సలతో నా పరిస్థితిని చక్కదిద్దారు. చెవి లోపలి భాగంలో బాగా నొప్పి అనిపించింది. దానిని చక్కదిద్దిన తర్వాతే పరిస్థితి మెరుగ్గా మారింది. ఒక కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడం సంతోషకరం’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు. -
అలా ప్రవర్తిస్తే సహించేది లేదు: ఆసీస్ కోచ్
సిడ్నీ: స్లెడ్జింగ్ పేరిట హద్దులు దాటి ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తమ ఆటగాళ్లకు స్పష్టం చేశాడు. మ్యాచ్ మధ్యలో సరదా సంభాషణలకు చోటు ఉంటుందని, పోటీతత్వంతో ముందుకు సాగాలే తప్ప అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. కాగా ఆస్ట్రేలియా జట్టు అంటేనే స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల దృష్టి మరల్చేందుకు మాటల యుద్ధానికి దిగుతూ వారిని మానసికంగా దెబ్బకొట్టడం ఆసీస్ క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం ద్వారా గతంలో వారు అనేక విజయాలు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత ఆసీస్ ఆటగాళ్లు కాస్త దూకుడు తగ్గించారు.(చదవండి: ఓపెనర్‌గా అతడే సరైన ఆప్షన్: సచిన్) కాగా ప్రస్తుతం టీమిండియా సుదీర్ఘ ఆసీస్ పర్యటన నేపథ్యంలో జస్టిన్ లాంగర్ ఈ విషయం గురించి విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో మీరు గమనించవచ్చు. మైదానం లోపల, వెలుపల మా ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. ఇక ఇప్పుడు కూడా సరదా సంభాషణలకు, పరిహాసాలకు చోటు ఉంటుందేమో గానీ, అసభ్య దూషణలకు దిగితే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక 2018-19 నాటి భారత పర్యటనలో ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పెన్- టీమిండియా సారథి కోహ్లి మధ్య జరిగిన వాగ్యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కోహ్లి వ్యవహారశైలిని మేమెంతగానో ప్రేమిస్తాం. అందులో హాస్య చతురతే తప్ప, అంతగా తప్పుబట్టాల్సిన విషయమేదీ లేదు. నిజానికి ఆసీస్- ఇండియా సిరీస్ అంటే ప్రేక్షకులకు మంచి వినోదం లభిస్తుంది. ముఖ్యంగా కరోనా సమయంలో మజాను పంచుతుంది. ఆర్థికంగా కూడా టీమిండియా టూర్ ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎంతగానో అవసరం’’ అని పేర్కొన్నాడు. ఇక యువ ఆటగాడు విల్ పుకోవ్స్కీను జట్టులోకి తీసుకునే అంశం గురించి లాంగర్ మాట్లాడుతూ.. ‘‘అమోఘమైన ప్రతిభ అతడి సొంతం. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా అతడు టెస్టు తుదిజట్టులోకి వస్తాడు. అది ఈ సిరీస్‌లోనైనా లేదా వచ్చే సిరీస్‌లోనైనా కావొచ్చు’’ అని అతడి అరంగేట్రంపై సంకేతాలు ఇచ్చాడు. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న సంగతి తెలిసిందే.(చదవండి: కోహ్లి దూరం: ఆ చాన్స్ కొట్టేస్తే లక్కీయే!) -
ఆ ఐదుగురిని తరలించారు
సిడ్నీ : కరోనా వైరస్ కేసుల కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు షెడ్యూల్ దెబ్బ తినరాదని భావించిన బోర్డు (సీఏ) వేగవంతంగా తగిన చర్యలు చేపట్టింది. కోవిడ్–19 సమస్య ఉన్న అడిలైడ్ నుంచి ప్రత్యేక విమానంలో తమ ఆటగాళ్లందరినీ సిడ్నీ (న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం)కి తరలించింది. సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలన్నీ తమ సరిహద్దులను మూసివేశాయి. సీఏ తరలించిన ఆటగాళ్లలో టెస్టు కెప్టెన్ టిమ్ పైన్, మార్నస్ లబ్‌షేన్, మాథ్యూ వేడ్, ట్రావిస్ హెడ్, గ్రీన్ ఉన్నారు. వీరితో పాటు ఆసీస్ ‘ఎ’ టీమ్, బిగ్ బాష్ లీగ్‌లో ఉన్న క్రికెటర్లను కూడా బోర్డు సురక్షిత ప్రాంతమైన సిడ్నీకి మార్చింది. దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో ఆడుతున్న పైన్ తదితరులు కరోనా పరిణామాల కారణంగా అడిలైడ్‌లోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా వీరంతా తమ సాధనపైనే దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని... అడిలైడ్ నుంచి తరలించకపోతే మున్ముందు మరింత సమస్య ఎదురయ్యేదని సీఏ పేర్కొంది. అయితే తొలి టెస్టు వేదికలో మాత్రం మార్పు ఉండదని మరోసారి స్పష్టం చేసింది. డిసెంబర్ 17 నుంచి అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అప్పటిలోగా పరిస్థితి అదుపులోకి వస్తుందని సీఏ ఆశిస్తోంది. సోమవారం నమోదైన 14 కొత్త కేసులతో పోలిస్తే సౌత్ ఆస్ట్రేలియాలో మంగళవారం 5 మాత్రమే రావడం ఊరట. -
భారత్‌తో టెస్టు.. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 17 నుంచి అడిలైడ్ ఓవల్ మైదానంలో ఇరు జట్ల మధ్య తొలిసారిగా డే-నైట్ టెస్టు జరుగుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇదే మొదటి మ్యాచ్ కాగా... ఈ పోరు చూసేందుకు సుమారు 27,000 మంది ప్రేక్షకులకు అంటే స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందికి అవకాశమిస్తామని సీఏ మంగళవారం ప్రకటించింది. కోవిడ్‌తో ఇప్పుడన్నీ క్రికెట్ మ్యాచ్‌లు బయో బబుల్‌లో ప్రేక్షకుల్లేకుండా గప్‌చుప్‌గా నిర్వహిస్తున్నారు. వచ్చే నెలలో వీక్షకులు మైదానానికి వస్తే ‘మహమ్మారి’ తర్వాత ప్రేక్షకులు తిలకించే తొలి క్రికెట్ మ్యాచ్ అదే అవుతుంది. ‘అడిలైడ్ ఓవల్‌లో 50 శాతం మందికి అనుమతిస్తాం. టెస్టు జరిగే ఐదు రోజులూ 27 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతాం’ అని సీఏ తమ క్రికెట్ వెబ్సైట్లో పేర్కొంది. (చదవండి: ఇక... అమెజాన్ ప్రైమ్ క్రికెట్) అయితే మెల్బోర్న్లో ‘బాక్సింగ్ డే’ (డిసెంబర్ 26 నుంచి 30 వరకు) టెస్టుకు మాత్రం కేవలం 25 శాతం మందినే అనుమతిస్తామని విక్టోరియా ప్రభుత్వం తెలిపింది. సిడ్నీలో మూడో టెస్టుకు 50 శాతం, బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టుకు 75 శాతం ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. పూర్తిస్థాయి క్రికెట్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు టీమిండియా నేడు దుబాయ్ నుంచి అక్కడికి బయలుదేరుతుంది. కరోనా ప్రొటోకాల్ (పరీక్షలు, క్వారంటైన్) అనంతరం ముందుగా మూడు వన్డేలు (నవంబర్ 27 నుంచి), తర్వాత మూడు టి20లు (డిసెంబర్ 4 నుంచి) ఆడుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిశాక నాలుగు టెస్టుల సిరీస్ డిసెంబర్ 17 నుంచి ‘పింక్‌బాల్’ మ్యాచ్‌తో మొదలవుతుంది. (చదవండి: ఐపీఎల్13 చాంపియన్.. ముంబై ఇండియన్స్) -
'టీమిండియాపై స్లెడ్జింగ్ ఈసారి కష్టమే'
సిడ్నీ : ఆసీస్ అంటేనే స్లెడ్జింగ్‌కు మారుపేరు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గతంలోనూ చాలా సార్లు ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు పాల్పడి మానసికంగా వారిపై విజయం సాధించేవారు. 2000వ సంవత్సరం నుంచి 2012 వరకు ఆసీస్ తిరుగులేని జట్టుగా ఉన్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లపై కవ్వింపు చర్యలకు పాల్పడి సగం విజయాలు సాధించేవారు. ఆండ్రూ సైమండ్స్- హర్బజన్ మంకీగేట్ వివాదం ఇలాంటి కోవకు చెందినదే. గత దశాబ్ద కాలంలో ఆసీస్ ఆటగాళ్లలో స్లెడ్జింగ్ విపరీతంగా ఉన్నా ఈ మధ్యన కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. (చదవండి : అందుకే ముంబై అలా చెలరేగిపోతోంది) ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా సుధీర్ఘ పర్యటనలో భాగంగా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. కాగా నవంబర్ 27 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆసీస్ మాజీ ఆటగాడు స్టీవ్ వా స్లెడ్జింగ్ అంశాన్ని మరోసారి ప్రస్థావనకు తెచ్చాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టీవా పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. 'ఈసారి కోహ్లి సేనపై స్లెడ్జింగ్ కాస్త కష్టమే అని చెప్పొచ్చు. భారత ఆటగాళ్లపై స్లెడ్జింగ్ పనిచేయకపోవచ్చు. ఎందుకంటే టీమిండియా కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. అలాంటి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు దిగితే వారికి బూస్ట్‌నిచ్చి సిరీస్‌లో మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆసీస్ ఆటగాళ్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. టీమిండియాను వదిలేయండి.. వారి ఆటను ఆడనివ్వండి..దయచేసి ఎవరు స్లెడ్జింగ్‌కు పాల్పడొద్దు. ఇక కోహ్లి విషయానికి వస్తే ఆసీస్ సిరీస్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే వరల్డ్ కాస్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి నిజానికి ఆసీస్ పర్యటనపై కసితో ఉన్నాడు. 2018-19 ఇండియా పర్యటనలో స్మిత్.. కోహ్లిలు ఒకరినొకరు పోటీపడగా.. అందులో స్మిత్ పైచేయి సాధించాడు. ఆ సిరీస్‌లో స్మిత్ మూడు సెంచరీలు చేయగా.. కోహ్లి పెద్దగా రాణించలేకపోయాడు. నెంబర్‌వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కోహ్లి ఆ పేరును నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు.అని స్టీవా తెలిపాడు. కాగా 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోపిని టీమిండియా నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. -
నవంబర్ 27న తొలి పోరు
భారత క్రికెట్ జట్టు చివరిసారిగా మార్చి 2న మైదానంలోకి దిగింది. న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడిన తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్నా... కరోనా కారణంగా ప్రపంచం తలకిందులై పోయింది. బయో బబుల్‌లో ఐపీఎల్ వినోదం పంచుతున్నా... సగటు భారత అభిమాని అంతర్జాతీయ క్రికెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగే టీమిండియా పర్యటన అధికారికంగా ఖరారైంది. మూడు ఫార్మాట్లలో కలిపి 10 మ్యాచ్‌లతో ఈ పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. కోవిడ్–19 కఠిన పరిస్థితులను అధిగమించి సరిగ్గా 269 రోజుల విరామం తర్వాత భారత జట్టు సిడ్నీ వేదికగా నవంబర్ 27న జరిగే తొలి వన్డేతో మళ్లీ బరిలోకి దిగనుంది. మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. టీమిండియా సుదీర్ఘ ఆసీస్ టూర్‌కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కరోనా పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాలతో చర్చించిన తర్వాత తమ అంగీకారాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు అక్కడి ప్రభుత్వం తెలియజేసింది. గతంలోనే షెడ్యూల్ ప్రకటించేందుకు సీఏ సిద్ధమైనా... ఆంక్షల కారణంగా ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు స్వల్ప మార్పులతో మొత్తం పర్యటన వివరాలను సీఏ వెల్లడించింది. ఆస్ట్రేలియా దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కేవలం 14 కేసులు మాత్రమే నమోదు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 1500 మాత్రమే. ఈ సిరీస్‌లో భారత్–ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు జరుగుతాయి. మెల్బోర్న్లో రోజూ 25 వేల ప్రేక్షకులకు అనుమతి! నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టుకు అడిలైడ్ వేదిక కానుంది. ఇది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలి డే అండ్ నైట్ కావడం విశేషం. భారత్ తమ ఏకైక డే–నైట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించగా... ఆసీస్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు, ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు రోజుల డే అండ్ నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతుంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో కూడా దాదాపు అంతా ప్రధాన జట్టు ఆటగాళ్లే ఉండే అవకాశం ఉంది. సాంప్రదాయం ప్రకారం ఈసారి కూడా బాక్సింగ్ డే టెస్టుకు మెల్బోర్న్ మైదానమే వేదిక కానుంది. అయితే విక్టోరియా రాష్ట్రంలోనే కరోనా ప్రభావం ఉండటంతో లక్ష సామర్థ్యం గల ఈ స్టేడియంలో రోజూ నాలుగో వంతు సుమారు 25 వేల మంది ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని సీఏ పరిశీలిస్తోంది. మరోవైపు భారత క్రికెటర్లు కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో సీఏ, బీసీసీఐతో చర్చిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 14 రోజుల క్వారంటైన్... బీసీసీఐ ఎన్ని విధాలా విజ్ఞప్తి చేసినా క్వారంటైన్ విషయంలో మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం క్రికెటర్లకు ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టంగా చెప్పింది. నవంబర్ 10న దుబాయ్‌లో ఐపీఎల్ ముగిసిన అనంతరం భారత బృందం ప్రత్యేక విమానంలో సిడ్నీకి బయలుదేరి వెళుతుంది. నిజానికి భారత్ ముందుగా బ్రిస్బేన్ వెళ్లాల్సి ఉన్నా, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించలేదు. సిడ్నీ ఒలింపిక్ పార్క్‌కు దగ్గరిలోనే ఒక హోటల్లో వీరికి బస ఏర్పాటు చేస్తున్నారు. ఈ హోటల్‌ను ఇతర అతిథులు ఎవరూ ఉండకుండా ప్రత్యేకంగా టీమిండియా కోసం సిద్ధం చేశారు. ఆటగాళ్లంతా నవంబర్ 12 నుంచి హోటల్లోనే 14 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలోనే ఉన్న బ్లాక్‌టౌన్‌లో టీమ్ ప్రాక్టీస్ చేస్తుంది. క్వారంటైన్ ముగిసిన సరిగ్గా రెండు రోజుల తర్వాత టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
'కెరీర్ మొత్తం మానసిక క్షోభకు గురయ్యా'
మెల్బోర్న్ : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తాను మానసిక క్షోభతో యుద్ధం చేస్తున్నట్లు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు చానెల్ 7కు ఇంటర్య్వూ ఇచ్చిన జాన్సన్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ' రిటైర్మెంట్ తర్వాత జీవితంలో చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నా. కానీ ఇలాంటి పరిస్థితులను చిన్న వయసులోనే ఎదుర్కొన్నా.. ఆట ముగిసిన తర్వాత రూమ్‌కు వెళ్లాకా ఎన్నోసార్లు ఒంటరితనంగా ఫీలయ్యేవాడిని. కుటుంబానికి దూరంగా నివసించడం లాంటివి నన్ను నిరాశకు గురిచేసేవి. క్రికెట్లో భాగంగా అవన్నీ పట్టించుకునేవాడిని కాను. అలా కెరీర్ మొత్తం మానసికక్షోభకు గురయ్యేవాడిని. (చదవండి : డబుల్ ధమాకా.. సన్‌రైజర్స్ సంబరాలు) అయితే ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మాత్రం జీవితంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నా. ఎందుకో తెలియదు గానీ ఆటకు దూరమైన తర్వాత కుటుంబానికి దగ్గరగా ఉంటున్నా ఏదో తెలియని ఒంటరితనం నన్ను నిరాశకు గురిచేస్తుంది. వీటన్నింటి నుంచి బయటపడడానికి.. నా మెదుడును యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కొన్ని పనులను అలవాటు చేసుకున్నా. క్రికెట్ ఆడేటప్పుడు ఇలాంటి ఒంటరితనాన్ని ఎన్నోసార్లు అనుభవించా... మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్.. 2011లో జరిగిన యాషెస్ సిరీస్‌లో క్రికెట్‌ను అంతగా ఎంజాయ్ చేయలేకపోయా.' అంటూ జాన్సన్ తెలిపాడు. ప్రపంచ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలరల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న మిచెల్ జాన్సన్ ఆసీస్ తరపున 73 టెస్టుల్లో 313 వికెట్లు, 153 వన్డేల్లో 239 వికెట్లు,30 టీ20ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 2015లో ఆసీస్ వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో మిచెల్ జాన్సన్ ప్రధాన పాత్ర పోషించాడు. 2013-14 యాషెస్ సిరీస్ జాన్సన్ కెరీర్లో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. మిచెల్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 13.97 సగటుతో మొత్తం 37 వికెట్లు తీశాడు. ఇండియన్ ప్రీమియర్‌లీగ్‌లో కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్లకు మిచెల్ జాన్సన్ ప్రాతినిధ్యం వహించాడు. -
వన్డేలతో మొదలు...
మెల్బోర్న్: కంగారూ గడ్డపై భారత జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సిరీస్‌కు గురువారం పచ్చజెండా ఊపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తేదీలతో సహా తుది షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదించడం లాంఛనమే. అయితే ఈ పూర్తి స్థాయి పర్యటనలో చిన్న మార్పు చోటుచేసుకుంది. సుదీర్ఘ ద్వైపాక్షిక సమరంలో ఇన్నాళ్లు ముందుగా పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌లు జరుగుతాయన్న సీఏ ఇప్పుడు మార్చింది. తొలుత వన్డేలు... ఆ తర్వాతే టి20 జరుగుతాయని ప్రకటించింది. కంగారూ గడ్డపై అడుగుపెట్టగానే సిడ్నీలో భారత ఆటగాళ్లు క్వారంటైన్ అవుతారు. ఇదీ షెడ్యూల్... సిడ్నీలో కరోనా ప్రొటోకాల్ ముగిశాక... అక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోనే వచ్చే నెల 27, 29 తేదీల్లో తొలి రెండు వన్డేలు జరుగుతాయి. ఆఖరి వన్డే కాన్‌బెర్రాలోని మనుక ఓవల్ మైదానంలో డిసెంబర్ 1న జరుగుతుంది. ఇదే వేదికపై 4న తొలి టి20 నిర్వహిస్తారు. మిగతా రెండు పొట్టి మ్యాచ్‌ల్ని మళ్లీ సిడ్నీలో నిర్వహిస్తారు. 6, 8 తేదీల్లో ఎస్సీజీలో రెండు, మూడో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక నాలుగు టెస్టుల సిరీస్ పింక్‌బాల్‌తో మొదలవుతుంది. డిసెంబర్ 17 నుంచి 21 వరకు అడిలైడ్ ఓవల్‌లో తొలి డేనైట్ టెస్టు జరుగుతుంది. బాక్సింగ్ డే టెస్టు 26 నుంచి 30 వరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తారు. అప్పుడు కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా విక్టోరియా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తే ‘బాక్సింగ్ డే’ టెస్టు వేదికను అడిలైడ్ ఓవల్‌కు మారుస్తారు. ఇది బ్యాకప్ వేదికైనా డేనైట్ టెస్టు కాదు. మూడో టెస్టు జనవరి 7 నుంచి 11 వరకు సిడ్నీలో, చివరి టెస్టు జనవరి 15 నుంచి 19 వరకు బ్రిస్బేన్‌లో జరుగుతాయి. -
ఆసీస్‌కు భారత్ జంబో బృందం!
ముంబై: వచ్చే నెలలో కోహ్లి సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. పూర్తిస్థాయిలో అన్ని ఫార్మాట్లు ఆడనున్న నేపథ్యంలో అక్కడికి టీమిండియా జంబో సేనతో బయల్దేరుతుంది. పైగా కరోనా ప్రొటోకాల్ కూడా ఉండటంతో ఒకేసారి భారీ జట్టునే పంపనున్నట్లు తెలిసింది. మొత్తం 32 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళతారు. ఇందులో భారత్ ‘ఎ’ ఆటగాళ్లు కూడా ఉంటారు. యూఏఈలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు అక్కడి నుంచే నేరుగా ఆసీస్‌కు పయనమవుతారు. కరోనా మహమ్మారి తర్వాత కోహ్లి సేన ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే. రెండున్నర నెలల పాటు సాగే ఈ పర్యటనలో భారత్ మూడు టి20లు, మూడు వన్డేలతోపాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. ఇందులో ఒక డే–నైట్ టెస్టు జరుగుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్ ముగిశాక టెస్టు జట్టులో లేని ఆటగాళ్లను స్వదేశానికి పంపే అవకాశాల్ని అప్పటి పరిస్థితుల్ని బట్టి తీసుకుంటుంది. ‘జంబో సేన’ ఎందుకంటే... ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఏ దేశంలోనూ పూర్తిస్థాయిలో పునరుద్ధరించనే లేదు. పైగా వెళ్లిన ప్రతీ ఒక్కరు క్వారంటైన్ కావాల్సిందే. దీంతో టూర్ మధ్యలో ఆటగాడు ఎవరైనా గాయపడితే ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే ప్రత్యేక విమానం (చార్టెడ్ ఫ్లయిట్) కావాలి. తీరా భర్తీ అయిన ఆటగాడు అక్కడికి వెళ్లాక జట్టుతో కలిసే అవకాశం కూడా ఉండదు. 14 రోజులు క్వారంటైన్లో గడపాల్సిందే. ఈ సమయంలో రెండు, మూడుసార్లు కోవిడ్ పరీక్ష చేస్తారు. ప్రయాణ బడలికలో కానీ, ఇతరత్రా సౌకర్యాల వల్ల కరోనాను పొరపాటున అంటించుకుంటే ఇంత వ్యయప్రయాసలోర్చి పంపిన ఆటగాడు ఆడే అవకాశం క్లిష్టమవుతుంది. ఇవన్నీ కూలంకశంగా పరిశీలించిన సీనియర్ సెలక్షన్ కమిటీ ఏకంగా జంబో సేనను పంపడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత బృందమే రెండు మూడు జట్లుగా ఏర్పడి ప్రాక్టీస్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే సుదీర్ఘంగా సాగే ఈ టూర్ పూర్తిగా ఆటగాళ్ల వరకే పరిమితమవుతుంది. క్రికెటర్ల వెంట సతీమణులు, ప్రియసఖిలకు అనుమతి లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్లో మాత్రం భార్య, గర్ల్‌ఫ్రెండ్స్‌పై నిర్ణయాన్ని ఆయా ఫ్రాంచైజీలకే వదిలేసిన సంగతి తెలిసిందే. ముందుగా పొట్టి మ్యాచ్‌లు... కంగారూ గడ్డపై ముందుగా భారత్ మూడు పొట్టి మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం టి20లు ముగిశాక... వన్డేలు ఆడుతుంది. అయితే దీనికి సంబంధించిన తేదీలను మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోగా తుది షెడ్యూల్‌ను భారత బోర్డుకు తెలియజేసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా టెస్టు స్పెషలిస్టులైన చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలకు మ్యాచ్ ప్రాక్టీస్ ఏర్పాట్లపై బోర్డు దృష్టి పెట్టింది. ఐపీఎల్లో అవకాశంరాని వీరిద్దరికి దేశవాళీ టోర్నీలు కూడా లేక ఎలాంటి ప్రాక్టీసే లేకుండా పోయింది. కరోనా తర్వాత అసలు బరిలోకే దిగలేని వీరి కోసం బోర్డు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసే పనిలో పడింది. సిడ్నీలో క్వారంటైన్? భారత జట్టు బ్రిస్బేన్‌లో అడుగు పెట్టినా... క్వారంటై న్ మాత్రం అక్కడ కుదరదు. క్వీన్స్లాండ్ ప్రభు త్వం కరోనా నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల్ని అక్కడ బస చేసేందుకు అనుమతించడం లేదు. దీంతో సిడ్నీ లేదంటే కాన్బెర్రాలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సీఏ ఉన్నతాధికారులు న్యూసౌత్‌వేల్స్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
వచ్చే వారంలో ఆసీస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక!
ముంబై: మరో మూడు వారాల్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ పూర్తిస్థాయి సిరీస్‌లలో పాల్గొననుంది. కానీ జట్టు ఎంపికపై ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి పెట్టింది. వచ్చే వారం ఆయా జట్లను ప్రకటించే అవకాశాలున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆదివారం బీసీసీఐ చీఫ్ గంగూలీ మాట్లాడుతూ తేదీలు మినహా వేదికలు, మ్యాచ్‌లు ఖరారయ్యాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో క్వీన్స్లాండ్ రాష్ట్రం నుంచి ఆమోదం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎదురుచూస్తోంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పూర్తిస్థాయి షెడ్యూల్‌ను తేదీలతోసహా సీఏ ప్రకటిస్తుంది. రెండున్నర నెలల పాటుసాగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 12న అక్కడికి బయల్దేరనుంది. అనంతరం 14 రోజుల క్వారంటైన్ ముగిశాక కసరత్తు ప్రారంభిస్తుంది. ఐపీఎల్ వర్క్‌లోడ్, ఆటగాళ్ల గాయాలను దృష్టిలో పెట్టుకొని త్వరలో జట్టును ఎంపిక చేసే అవకాశముంది. ఇప్పటికే భువనేశ్వర్, ఇషాంత్ శర్మ సహా పలువురు ఆటగాళ్లు గాయపడి లీగ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. -
బీసీసీఐకి తలనొప్పిగా ఆసీస్ పర్యటన
ముంబై: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచనలో పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్ నవంబర్‌లో ఆసీస్‌కు పయనం కావాల్సి ఉంటుంది. ఆటగాళ్ల ఆసీస్ ప్రయాణానికి సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. ఈ స్వల్ప సమయంలో చార్టెర్డ్ విమానాల ఏర్పాటు, క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి వసతి, జట్ల ఎంపిక, ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహణ, పర్యటనకు తీసుకెళ్లాల్సిన ఆటగాళ్ల సంఖ్య ఇలా ప్రతీ విషయంలోనూ బీసీసీఐ ముందు అనేక సవాళ్లు నిలిచాయి. మరోవైపు ఆస్ట్రేలియాలోని క్వారంటైన్ నిబంధనలు ప్రతీ రాష్ట్రానికి వేర్వేరుగా ఉండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా తలపట్టుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా ఉంటే... మరో చోట ఈ నిబంధన ఏడు రోజులుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం 4 టెస్టులకు వేర్వేరు వేదికలు ఉండటంతో పాటు... వన్డే, టి20 ఫార్మాట్లు కూడా ఆడాల్సి రావడంతో ఆటగాళ్లకు ఎలాంటి క్వారంటైన్ విధించాలనే అంశంపై సీఏ ఇంకా అస్పష్టతతోనే ఉంది. దీంతో కేవలం ఒక ఫార్మాట్‌తోనే సిరీస్‌ను ముగించాలా? లేక రెండే వేదికల్లో మ్యాచ్‌లన్నీ ముగించాలా అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వీటిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టతనిచ్చే వరకు బీసీసీఐ వేచి చూడాల్సిందే. -
‘క్వారంటీన్ నిబంధనలు మారవు’
సిడ్నీ: ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో కోవిడ్–19కు సంబంధించిన ఆంక్షల్లో తమకు కొన్ని సడలింపులు ఇవ్వాలంటూ బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని క్రికెట్ ఆస్ట్రేలియా తిరస్కరించింది. ప్రస్తుతం అక్కడి నిబంధనల ప్రకారం విదేశాలనుంచి ఎవరు వచ్చినా సరే...కనీసం రెండు వారాల పాటు హోటల్ క్వారంటీన్లో ఉండాల్సిందే. అయితే ఇది తమ ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీస్తుందని, దానికి బదులుగా బయో సెక్యూర్ బబుల్‌లో సాధన చేసేందుకు అవకాశం ఇవ్వాలని భారత బోర్డు కోరింది. భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ముందుగా బ్రిస్బేన్‌లో అడుగు పెట్టాల్సి ఉంది. అయితే అక్కడి క్వీన్స్లాండ్ ప్రభుత్వం మాత్రం కరోనా నిబంధనల్లో ఏమాత్రం సడలింపులు ఇవ్వమని తేల్చేసింది. భారత క్రికెట్ జట్టయినా సరే, ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనంటూ అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత బృందం ఆస్ట్రేలియాకు వెళుతుంది. -
‘బయో బబుల్’ కోసం రూ. 159 కోట్లు
మెల్బోర్న్: కరోనాతో ఆర్థికంగా కుదేలైన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీలు నిర్విఘ్నంగా జరిగేందుకు వీలుగా కోవిడ్–19 బయో బబుల్ బడ్జెట్‌ను భారీగా పెంచింది. 30 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు (రూ.159 కోట్లు) బయో బబుల్ నిర్వహణ కోసమే వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది చివర్లో 4 టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. దీనితో పాటు బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)ను సురక్షిత పరిస్థితుల్లో నిర్వహించేందుకు సీఏ ఈ భారీ మొత్తాన్ని కేటాయించింది. నిజానికి బ్రాడ్‌కాస్టర్ ‘చానెల్ సెవెన్’తో తమ ఒప్పందాన్ని నిలుపుకునేందుకే సీఏ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. చానెల్ సెవెన్, సీఏల మధ్య 300 మిలియన్ డాలర్ల (రూ. 1592 కోట్లు) ప్రసార హక్కుల ఒప్పందం ఉంది. అయితే అత్యంత ప్రేక్షకాదరణ ఉండే బీబీఎల్‌ను తాజా పరిస్థితుల్లో సీఏ నిర్వహించదేమోనన్న అనుమానంతో ఈ ఒప్పందం నుంచి తప్పుకునేందుకు చానెల్ సెవెన్ సిద్ధమైంది. ఇదే జరిగితే సీఏకు భారీ నష్టం వాటిల్లుతుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు టోర్నీలను సురక్షితంగా నిర్వహించేందుకు తొలుత 10 మిలియన్ డాలర్లు (రూ. 53 కోట్లు)గా ఉన్న బయో బబుల్ బడ్జెట్‌ను 30 మిలియన్ డాలర్లకు పెంచింది. (చదవండి: కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి') -
బ్యాటింగ్ కోచ్ అవసరం లేదు!
మెల్బోర్న్: కరోనా వైరస్ దెబ్బ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై బాగానే పడింది. ఆర్థిక నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో బోర్డు తాజాగా 40 మందిపై వేటు వేసింది. ఈ జాబితాలో బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున 65 టెస్టులు, 120 వన్డేలు ఆడిన హిక్ 2016నుంచి ఆసీస్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సీఈఓ కెవిన్ రాబర్ట్స్‌ను సాగనంపిన సీఏ తాజాగా హిక్ సేవలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ సారి అధిక వేతన భత్యాలు పొందుతున్న వారిపైనే సీఏ గురిపెట్టింది. ఈ తొలగింపులతో ఏకంగా రూ. 210 కోట్లు (4 కోట్ల ఆసీస్ డాలర్లు) భారం తగ్గుతుందని సీఏ భావిస్తోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీఏ పొదుపు చర్యల్లో భాగంగానే సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. పైగా ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌కు కూడా ఆతిథ్యమివ్వడం లేదని ప్రకటించిన మరుసటి రోజే ఇక అనవసరమనుకున్న సిబ్బందిని తొలగించింది. అలాగే అండర్–19 మినహా జూనియర్ స్థాయి, ద్వితీయ శ్రేణి క్రికెట్ టోర్నీలను షెడ్యూల్ నుంచి తప్పించింది. మరో వైపు తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపడుతున్న నిక్ హాక్లీపై ఐసీసీ మాజీ సీఈ మాల్కమ్ స్పీడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కష్టకాలంలో హాక్లీ బాధ్యతలు చేపడుతున్నాడు. సరిగ్గా చెప్పాలంటే తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలర్ తన తొలి ఓవర్‌ను కోహ్లిని వేస్తున్నట్లుగా అతని పరిస్థితి కనిపిస్తోంది’ అని మాల్కమ్ అన్నాడు. -
‘ఆయన కావాలనే చేస్తున్నారు’
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్‌కు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చాలా కాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టి20 ప్రపంచకప్‌ను ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేదని ఐసీసీ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడానికి ఆయనే కారణమని బీసీసీఐ భావిస్తోంది. భారత బోర్డు ఐపీఎల్ నిర్వహించుకోవడం లేదా ఇతర ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం లేకుండా కావాలనే మనోహర్ ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ అధికారి ఒకరు ఆరోపించారు. భారతీయుడై ఉండి ఇప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగానే ఆయన పని చేస్తున్నారని విమర్శించారు. ‘త్వరలో పదవీకాలం ముగిసిపోయే శశాంక్ మనోహర్ లేని గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు. టి20 ప్రపంచ కప్ నిర్వహించడం తమ వల్ల కాదని ఆస్ట్రేలియా చేతులెత్తేసిన తర్వాత దానిని ప్రకటించేందుకు నెల రోజులు కావాలా. ఏదో ఒకటి తేల్చేయవచ్చు కదా. ఇది ఒక్క ఐపీఎల్ గురించే కాదు. ఈ ఆలస్యం అన్ని దేశాలకు సమస్యగా మారింది. బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేసిన మనోహర్ ఐసీసీలో మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తినేలా పని చేశారు. అయినా ఐసీసీ సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక గురించి ఇంకా ఎందుకు ప్రకటించడం లేదు’ అని సదరు అధికారి అన్నారు. -
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఆశలు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ నిర్వహణ సాధ్యం అయ్యేలా లేదని ఆతిథ్య దేశం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ఫ్రాంచైజీల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏదో విధంగా ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందని పులువురు ఫ్రాంచైజీ యజమానులు అభిప్రాయపడుతున్నారు. పూర్తిస్థాయిలో లేదా కుదించైనా, భారత్‌లో కుదరకపోతే విదేశాల్లోనైనా లీగ్‌ను నిర్వహించడంపై బీసీసీఐ దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇటీవలే లీగ్ నిర్వహణపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించిన బీసీసీఐ, తదుపరి కార్యాచరణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ నిర్వహణపై స్పష్టతనివ్వడంతో ఫ్రాంచైజీలన్నీ బీసీసీఐ వైపు ఆశగా చూస్తున్నాయి. లీగ్ పరిధి విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నారు. ‘పూర్తి స్థాయి లీగ్ నిర్వహించేందుకే బీసీసీఐ ప్రయత్నిస్తుంది అందులో సందేహం లేదు. కానీ సమయానుకూలతను బట్టి టోర్నీని కుదించినా మంచిదే. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణే సులభంగా ఉంటుంది. 2009లో కూడా కేవలం నెల వ్యవధిలో లీగ్‌ను దక్షిణాఫ్రికాకు తరలించాం. భారత్‌లో నిర్వహణ సాధ్యం కాకుంటే శ్రీలంక, న్యూజిలాండ్‌లో నిర్వహించవచ్చు. ఒక్కసారి లీగ్‌పై ప్రకటన వస్తే స్పాన్సర్లు కూడా వారంతటవారే వస్తారు’ అని వాడియా అభిప్రాయపడ్డారు. మరోవైపు మైదానాల్లోకి ప్రేక్షకుల్ని అనుమతించకపోయినప్పటికీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్పాన్సర్లను ఆకట్టుకోవచ్చని చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. వ్యూయర్షిప్ కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయ పడిన ఆయన... ఐపీఎల్ తేదీలు ప్రకటించాకే స్పాన్సర్లు ఫ్రాంచైజీలను సంప్రదిస్తారని అన్నారు. మరో ఫ్రాంచైజీకి చెందిన అధికారి మాట్లాడుతూ ఐపీ ఎల్ జరిగితే వ్యక్తిగత స్పాన్సర్‌షిప్‌ల కన్నా కూడా బీసీసీఐ సెంట్రల్ పూల్ ద్వారానే అధిక ఆదాయం పొందవచ్చని చెప్పాడు. ఆదాయం గురించి పక్కన పెడితే ఐపీఎల్ నిర్వహణకు సెప్టెంబర్–అక్టోబర్ తగిన సమయమని అన్నాడు. -
ప్రపంచకప్ సాధ్యం కాదు
మళ్లీ కరోనానే పైచేయి సాధించింది. మరో మెగా ఈవెంట్ తోక ముడిచింది. పొట్టి ప్రపంచకప్ కూడా నిర్వహణకు దూరమైంది. ఐసీసీ ఇంకా ప్రకటించనప్పటికీ నిర్వాహక దేశం ఆస్ట్రేలియా ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ అసాధ్యమని స్పష్టం చేసింది. రేపో మాపో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. మెల్బోర్న్: ఇప్పుడు ప్రపంచంలో ఏ రంగం కరోనాను ఎదుర్కోలేకపోతోంది. అలాగే క్రీడా రంగం కూడా మహమ్మారి ముందు నిలువలేకపోతోంది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ సహా ఎన్నో ఆటలు, ఫార్ములాలు రద్దయిపోయాయి. కొన్నేమో వాయిదా పడ్డాయి. ఇప్పుడు టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ పరిస్థితి కూడా అక్కడికే వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గత రెండు సమావేశాల్లో తేల్చని టోర్నీ భవితవ్యాన్ని ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా తేల్చింది. ఇపుడున్న పరిస్థితుల్లో మెగా టోర్నీ అసాధ్యమని స్పష్టం చేసింది. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ 16 జట్లను తీసుకొచ్చి టోర్నీని నిర్వహించలేమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ ప్రకటించారు. ఇందులో పాల్గొనే దేశాలన్నీ కూడా కరోనా కాటుకు విలవిలలాడుతున్నాయి. అంతర్జాతీయ దారులన్నీ మూసుకొనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఏ ఇక నాన్చుడు ధోరణి తగదని... టోర్నీ కుదరదని చెప్పేసింది. మంగళవారం ఎడింగ్స్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘కోవిడ్ ప్రపంచమంతా పాకింది. పోటీ పడే దేశాల్లోనూ కరోనా ఉధృతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 16 జట్లను ఆస్ట్రేలియాకు రప్పించి, ప్రపంచకప్ నిర్వహించే అవకాశాలైతే లేవు. ఇది అత్యంత క్లిష్టం. అసాధ్యం కూడా! అయితే మా ప్రకటన రద్దు లేదంటే వాయిదానో కాదు. మాకున్న అవకాశాలు, ప్రత్యామ్నాయాలు ఐసీసీ ముందుంచాం. దీనిపై చర్చించి నిర్ణయించాల్సింది ఐసీసీనే’ అని తెలిపారు. గత వారం సమావేశమైన ఐసీసీ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ టోర్నీపై ఏ నిర్ణయం తీసుకోకుండానే మీటింగ్‌ను ముగించింది. ఇంకొంత కాలం వేచిచూసే ధోరణిలో ఐసీసీ ఉంది. కానీ రాను రాను కోవిడ్ కోరలు చాస్తుందే కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ ఆఖరు దాకా సరిహద్దుల్ని మూసేసింది. నిజానికి ఆసీస్‌లో వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కేసుల సంఖ్య ఇంకా 10 వేలను కూడా చేరుకోలేదు. సుమారు 7000 మంది వైరస్ బారిన పడగా... 6000 మంది కోలుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీని నిర్వహించి అనవసర ఇబ్బందుల్ని తలకెత్తుకోవడం ఎందుకని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావించింది. పొట్టి కప్ ఈ ఏడాది జరగకపోతే వచ్చే ఏడాది అనుమానమే. 2021లో బిజీ షెడ్యూల్ దృష్ట్యా నిర్వహణ కష్టంగా మారొచ్చు. 2022లో భారత్‌లోనే మెగా ఈవెంట్ జరుగుతుంది. కాబట్టి ఆసీస్ ఈవెంట్‌కు చోటుండదు. హాక్లీకి అదనపు బాధ్యతలు టి20 ప్రపంచకప్ నిర్వాహక కమిటీ సీఈఓ అయిన నిక్ హాక్లీ ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ స్థానంలో ఉన్న కెవిన్ రాబర్ట్స్‌ను సోమవారం తొలగించింది. బోర్డు వ్యవహారాలను చక్కదిద్దడంలో రాబర్ట్స్ విఫలమయ్యారనే అసంతృప్తితో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్–19తో సీఏ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ఆటగాళ్ల కాంట్రాక్టు ఫీజుల్లో కోత పెట్టిన సీఏ తన సిబ్బందిని తగ్గించుకుంది. 25 శాతం మేర ఉద్యోగులను రెండు నెలల క్రితమే సాగనంపింది. -
సీఏ జీతాల్లో కోత
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోన్న కోవిడ్–19 ప్రభావం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై పడింది. కరోనాతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా భారీ స్థాయిలో జీతాల కోత విధింపుతో పాటు సిబ్బందిని తీసివేయనున్నట్లు సీఏ గురువారం ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 30 వరకు తమ ఉద్యోగుల, కాంట్రాక్టర్ల జీతాల్లో 80 శాతం కోత విధించనున్నట్లు సీఏ వెల్లడించింది. దీనితో పాటు ఈ పరిస్థితుల్లో ఎలాంటి క్రీడా ఈవెంట్లు జరిగే వీలు లేనందున ఈ రెండు నెలల పాటు కొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. -
'టిమ్ పైన్ ఉత్తమ కెప్టెన్‌గా నిలుస్తాడు'
సిడ్నీ : ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో కెప్టెన్‌గా వైదొలిగిన స్టీవ్ స్మిత్ స్థానంలో పైన్ కెప్టెన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిమ్ పైన్ సారథ్యంలో భారత జట్టుకు టెస్టు సిరీస్ కోల్పోయినా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్‌ను నిలబెట్టుకున్నామాని లియోన్ తెలిపాడు. నాథన్ లియోన్ మాట్లాడుతూ.. ' మా జీవితంలో బాల్ ట్యాంపరింగ్ వివాదం ఎప్పటికి వెంటాడుతుంది. అలాంటి సమయంలో కష్టకాలంలో ఉన్న జట్టును తన నాయకత్వ ప్రతిభతో మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు పైన్ ప్రయత్నించాడు. కెప్టెన్‌గా టిమ్ పైన్ తన విశ్వసనీయతను కాపాడుకుంటునే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అతని నిజాయితీయే పైన్‌ను ఏదో ఒకరోజు ఉత్తమ కెప్టెన్‌గా నిలబెడుతుంది. రోజు రోజుకు కెప్టెన్సీలో పైన్ మరింత రాటు దేలుతున్నాడు' అంటూ ప్రశంసలు కురిపించాడు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అన్ని క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా జూన్ నెలకు వాయిదా వేసింది. (కరోనాతో మాజీ క్రికెటర్ మృతి) (పొలాక్ మదిలో సచిన్ కానీ అతడి జాబితాలో..) -
ఐపీఎల్‌కు ఆసీస్ ఆటగాళ్లు గుడ్ బై!
మెల్బోర్న్ : కరోనా వైరస్ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్-13వ సీజన్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వివిధ ఐపీఎల్ ప్రాంచైజీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిసింది. కాగా ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నారు. 'ఐపీఎల్లో ఆడాలా? వద్దా? అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. ఆటగాళ్లు ఐపీఎల్‌తో వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం తమకు తెలుసు. కానీ ఈ విషయంలో తాము సలహా మాత్రమే ఇవ్వగలం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు సరైన నిర్ణయమే తీసుకుంటారననే మేము భావిస్తున్నాం' అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ తెలిపాడు. మరోవైపు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలా? లేక యూకేలో జరగనున్న హండ్రడ్ సిరీస్‌కు అనుమతి ఇవ్వాలా? అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా సమీక్ష నిర్వహించనుంది. (అలెక్స్ హేల్స్‌కు కరోనా సోకిందా?) కాగా ఆస్ట్రేలియాకు చెందిన మొత్తం 17 మంది ఆటగాళ్లు ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో పేసర్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తదితరులు ఐపీఎల్‌తో ఒప్పందాన్ని వదులకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ వేలంలో 3.2 మిలియన్ డాలర్లు (రూ.15.2 కోట్లు) పలికిన కమిన్స్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌ను ఏప్రిల్15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రసుత్తం కరోనా వైరస్ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్ జరగుతుందా అనేది అనుమానంగానే ఉంది.ఒకవేళ ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి తప్పుకుంటే అది మిగతా దేశాల క్రికెటర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో కరోనా వైరస్ ప్రభావం తగ్గితే మినీ ఐపీఎల్ నిర్వహించాలనే యోచనలో ఉన్న బీసీసీఐ ఆశలు నెరవేరకపోవచ్చు. -
ఆసీస్ క్రికెటర్‌కు కరోనా?
-
ఆసీస్ క్రికెటర్‌కు కరోనా.. మ్యాచ్‌కు దూరం?!
సిడ్నీ: తమ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ అనారోగ్యం పాలైన నేపథ్యంలో.. అతడికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ నేపథ్యంలో అతడిని క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించింది. దీంతో శుక్రవారం నాటి ఆసీస్- కివీస్ తొలి వన్డే మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘ అంతర్జాతీయ ప్రయాణాల తర్వాత కేన్ 14 రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. అతడు గొంతుకు ఇన్ఫెక్షన్ సోకినట్లు మా వైద్య సిబ్బంది పేర్కొంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రొటోకాల్ ప్రకారం అతడికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. జట్టుకు దూరంగా ఉంచుతున్నాం. టెస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడైన తర్వాత.. అతడు పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారణ అయిన తర్వాత తిరిగి జట్టులోకి తీసుకుంటాం’’అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి తెలిపారు. (ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు!) ఇక కరోనా వ్యాప్తి భయంతో మొదటి వన్డేను క్లోజ్డ్ డోర్స్‌లో నిర్వహించనున్నట్లు సీఏ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్... బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ప్రాణాంతక వైరస్ ‘కోవిడ్19’ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పటికే వేల మందిని చంపేసింది. లక్ష మందికిపైగా సోకింది. దీంతో కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఐపీఎల్ నిర్వాహకులను కూడా ఈ వైరస్ భయం గడగడలాడిస్తోంది. (చివరి రోజు మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే!) JUST IN: Aussie quick Kane Richardson will miss today's #AUSvNZ ODI with results of COVID-19 test still pending. DETAILS: https://t.co/jNsxVLgRGc pic.twitter.com/SZRYEnQcJd — cricket.com.au (@cricketcomau) March 13, 2020 -
క్లార్క్‌కు వచ్చిన నష్టం ఏంటో ?
ఆక్లాండ్ : ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరగనున్న చాపెల్- హాడ్లీ ట్రోఫీని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ టోకెన్ గేమ్స్‌గా అభివర్ణించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తీరిక లేకుండా షెడ్యూల్ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'తీరికలేని షెడ్యూల్‌తో వరుసగా జరుగుతున్న మ్యాచ్‌లను ఎవరు చూస్తారు. ఈ సిరీస్ ద్వారా జరిగే మ్యాచ్‌లు ఒక టోకెన్ గేమ్స్ లాంటివి. నేను క్రికెట్ అభిమానినే. కానీ వన్డే సిరీస్‌లు జరపడానికి ఇది అనువైన సీజన్ కాదు. మహిళల ప్రపంచకప్ గెలుపుతో క్రికెట్ సీజన్ ముగిసింది. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు జరిగాయి. మాకు ఇన్ని మ్యాచ్‌లు అవసరం లేదు'అని క్లార్క్ పేర్కొన్నాడు. (మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు) అయితే న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బోల్ట్ మైకేల్ క్లార్క్ కు తనదైన శైలిలో స్పందించాడు.'రసవత్తకరమైన సిరీస్ అతనికి టోకెన్ గేమ్స్‌గా ఎందుకు అనిపించిందో అర్థం కావడం లేదన్నాడు. అతని సమస్య ఏంటో నాకు తెలియదు. ఈ సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ కూడా జరిగే అవకాశం ఉండటంతో ప్రేక్షకులకు కావాల్సిన మజా లభిస్తుందన్నాడు. క్రికెట్ ఆడటానికి ఆస్ట్రేలియా అద్భుతమైన ప్రదేశం. న్యూజిలాండ్ కన్నా అక్కడి మైదానాలు పెద్దవి. ఈ సిరీస్ మ్యాచ్‌లకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరవుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌తో ఈ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. కొంతమంది మాట్లాడే మాటల్లో అర్థమే లేదు ' అని చెప్పుకొచ్చాడు. గెలుపే లక్ష్యంగా తాము ఈ సిరీస్‌లో బరిలోకి దిగనున్నట్లు బౌల్ట్ పేర్కొన్నాడు.(కోహ్లి, రోహిత్‌లు కాదు.. రాహులే గ్రేట్!) కాగా వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేల్లో ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి.ఈ సీజన్లో ఆస్ట్రేలియా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సిరీస్‌లు ఆడింది. భారత్‌తో 1-2, సౌతాఫ్రికాతో 0-3తో వన్డే సిరీస్‌లు కోల్పోయింది. అంతకు ముందు సౌతాఫ్రికాపైనే 2-1తో టీ20 సిరీస్ గెలిచింది. మార్చి 7నే సౌతాఫ్రికా పర్యటనను ముగించుకున్న ఆసీస్.. 5 రోజుల గ్యాప్‌తోనే 13 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్దమైంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
'మాకు ధోని లాంటి ఫినిషర్ కావాలి'
సిడ్నీ : ఆసీస్ జట్టుకు పరిమిత ఓవర్లలో ఎంఎస్ ధోని లాంటి ఫినిషర్ ఉంటే బాగుంటుందని మాజీ ఆటగాడు, ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. ఇప్పుడు జట్టు మేనేజ్మెంట్ ధోనీ లాంటి ఫినిషర్ కోసమే వెతుకుందని అభిప్రాయపడ్డాడు. 'గతంలో మా జట్టులో మైక్ హస్సీ, మైఖేల్ బెవాన్ వంటి ఫినిషర్లు ఉండేవారు. అయితే బెస్ట్ ఫినిషర్‌గా మాత్రం ధోనిని మించిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పటికే ధోని ఎన్నోసార్లు అది రుజువు చేశాడు. ఉదాహరణకు 2011 ప్రపంచకప్ చూసుకుంటే మహీ నాలుగో స్థానంలో వచ్చి 90 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు కప్‌ను అందించాడు. ఇంగ్లండ్ క్రికెట్లోనూ జాస్ బట్లర్ మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా ప్రసుత్తం మా జట్టుకు కూడా ధోని లాంటి ఫినిషర్ అవసరం ఉంది. జట్టు ఇన్నింగ్స్‌లో ఐదు, ఆరు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు మంచి ఫినిషర్లు అయి ఉండాలి.. అందుకోసం అన్వేషిస్తున్నాం' అంటూ లాంగర్ పేర్కొన్నాడు. (పాకిస్తాన్లో ధోని ఫీవర్!) కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ ఆతిథ్య జట్టుకు క్లీన్‌స్వీప్‌తో సమర్పించేసుకుంది. కాగా సరైన ఫినిషర్ లేకనే జట్టు ఓటమి పాలయిందని పలువురు ఆసీస్ మాజీ క్రికెటర్లు తెలిపారు. అయితే ప్రొటీస్‌తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో మిచెల్ మార్ష్ ఆరవ స్థానంలో వచ్చి 32, 36 పరుగులు సాధించాడు. తాజాగా మార్చి 13 నుంచి కివీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్ తరపున టెస్టు ఓపెనర్‌గా ప్రాతినిథ్యం వహించిన జస్టిన్ లాంగర్ 105 టెస్టుల్లో 7696 పరుగులు, 8 వన్డేల్లో 160 పరుగులు చేశాడు. కాగా మాథ్యూ హెడెన్‌తో కలిసి ఆసీస్‌కు టెస్టుల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు.(హోలీ శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా క్రికెటర్లు) -
మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు
మెల్బోర్న్ : ఆసీస్ సారథిగా స్టీవ్ స్మిత్ సరైన వ్యక్తి కాదంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో ఆసీస్ కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల మీడియా సమావేశంలో మైకేల్ క్లార్క్ పాల్గొనగా.. ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను మళ్లీ నియమించాలంటారా? అని ఒక విలేకరి ప్రశ్నించాడు. 'ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతమంది కెప్టెన్లు అవసరం లేదు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక కెప్టెన్ ఉండడం కన్నా.. మూడు ఫార్మాట్లకూ కలిపి ఒకే కెప్టెన్ ఉండటం మంచిది' అని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్ తర్వాత కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. (భార్యకు విడాకులు.. భరణంగా రూ.285 కోట్లు!) 'పాట్ కమిన్స్ ఆటను బాగా అర్ధం చేసుకుంటాడు. అతను ఓపెనింగ్ బౌలర్ మాత్రమే గాక బ్యాటింగ్ కూడా చేయగలడు. మైదానంలోనూ కమిన్స్ చాలా చురుకుగా ఉంటాడు. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పటి పరిస్థితుల్లో ఆసీస్ జట్టుకు ఉత్తమ కెప్టెన్ అవసరం. స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మన్.. అది నేనూ ఒప్పుకుంటా.. కానీ కెప్టెన్సీ చేయడానికి సరైన వ్యక్తి మాత్రం కాదనుకుంటున్నా. ఇక టిమ్ పైన్ ఇప్పటికే కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పైన్ వీడ్కోలు చెప్పేవరకు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కొనసాగే హక్కు అతనికి ఉంది. టిమ్ ఇప్పుడు 35 ఏళ్లు ఉన్నాడు. ఈ వేసవి తర్వాత అతను వీడ్కోలు గురించి ఆలోచిస్తాడని అనుకుంటున్నా. హోమ్ సిరీస్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిస్తే టిమ్ పైన్ వీడ్కోలు పలకడానికి అదే అనువైన సమయం అంటూ' మైకేల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు. (మైకేల్ క్లార్క్ భావోద్వేగ సందేశం) కాగా బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిషేధం కారణంగా స్మిత్ తన కెప్టెన్సీని కోల్పోయాడు. దీంతో పరిమిత ఓవర్లకు ఆరోన్ ఫించ్, టెస్ట్ ఫార్మాట్‌కు టిమ్ పైన్ కెప్టెన్లుగా ఉన్నారు. స్మిత్ పునరాగమనం చేసి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆసీస్ మాజీలు మళ్లీ స్మిత్‌కు పగ్గాలు ఇవ్వాలంటున్న తరుణంలో క్లార్క్ మాత్రం స్మిత్ కెప్టెన్‌గా సరైన వ్యక్తి కాదంటూ తేల్చి చెప్పాడు.(జర్నలిస్టుపై కోహ్లి ఆగ్రహం) -
'నేను ఇంతలా మారడానికి నా భార్యే కారణం'
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి మనందరికీ తెలిసిందే. మైదానంలో ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడో బయట కూడా అంతే దూకుడుగా ఉంటాడు. స్లెడ్జింగ్ చేయడం, ప్రత్యర్థి ఆటగాడిని కవ్వించడంలో వార్నర్ తర్వాతే ఎవరైనా ఉంటారనడంలో సందేహం లేదు. ఇక మైదానం వెలుపల అతిగా మద్యం తాగి గొడవపడిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే బాల్ ట్యాంపరింగ్ అనంతరం మాత్రం వార్నర్ వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చింది. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన డేవిడ్ వార్నర్ తన దూకుడైన ఆటతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. మ్యాచ్ ఆరంభంలోనే విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ.. ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే వార్నర్ తన ఆటతో కంటే వ్యక్తిగత చర్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు.(‘దయచేసి మీ నోటిని అదుపులో పెట్టుకోండి’) 2013లో జరిగిన యాషెస్ సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్‌తో ఒక పబ్‌లో ఘర్షణకు దిగాడు. రూట్‌పై భౌతిక దాడికి దిగి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నాడు. ఆ ఘటన అనంతరం దక్షిణాఫ్రికాలో క్వింటన్ డికాక్తోనూ వార్నర్ గొడవపడ్డాడు. ఇవన్నీ ఓ ఎత్తయితే.. స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌తో కలిసి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడడం మరో ఎత్తు. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడి 12 నెలలు నిషేధం ఎదుర్కొన్నాడు.అయితే ఇవేమి వార్నర్ బ్యాటింగ్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. పునరాగమనం తర్వాత ఐపీఎల్-12, ప్రపంచకప్-2019, యాషెస్ 2019, పలు ద్వైపాక్షిక సిరీస్‌లలో తన బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు. గతేడాదికి గాను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిష్టాత్మక అలెన్ బోర్డర్ పతకాన్ని దక్కించుకున్నాడు.(ఇది కదా అసలైన ప్రతీకారం) తాను ఇంతలా మారడానికి తన భార్య క్యాండీస్ ప్రోత్సాహం ఎంతో ఉందని వార్నర్ చెప్పుకొచ్చాడు.' క్యాండీస్.. నాకున్న చెడు అలవాట్లను మాన్పించింది. నువ్వు ఎందుకు క్రమశిక్షణతో ఉండవు? ఎందుకు మద్యం తాగుతున్నావు? అంటూ హెచ్చరించేది. ఎందుకు త్వరగా లేవడం లేదు? అంటూ ప్రశ్నించేది. ఇక మద్యం తాగితే ఒక్కోసారి నా తల వెనక భాగంలో కొట్టేది (నవ్వుతూ). అలా నా భార్య నన్ను కంట్రోల్లో పెట్టింది. ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లలో మద్యం తాగడం ఓ సంస్కృతి. సహచరులందరూ తాగినప్పటికీ.. క్యాండీస్ మాట వినడం తప్ప నాకు వేరే మార్గం లేదు. సరైన సమయంలో నా భార్యను వివాహం చేసుకొని మంచిగా మారిపోయాను. ఈ క్రెడిట్ అంత నా భార్యదే' అని వార్నర్ చెప్పుకొచ్చాడు. -
అసభ్యంగా ప్రవర్తించాడని క్రికెటర్‌కు జరిమానా
మెల్బోర్న్ : ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ జరిమానా విధించింది. దేశవాలి టీ20బిగ్‌బాష్‌లీగ్‌లో మార్కస్ స్టొయినిస్ మెల్బోర్న్ స్టార్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో శనివారం మెల్బోర్న్ స్టార్స్, రినిగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో స్టొయినిస్ తన సహచర ఆటగాడైన కేన్ రిచర్డ్సన్పై అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆటగాడిగా ప్రవర్తన నియమావళి ఉల్లగించినందుకు గాను కోడ్ ఆఫ్ కండక్ట్ కింద స్టొయినిస్‌కు 7500 ఆస్ట్రేలియన్ డాలర్లను జరిమానాగా విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.' నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నా. కేన్ రిచర్డ్‌సన్‌తో అసభ్యంగా ప్రవర్తించినందుకు గ్రౌండ్‌లోనే అంపైర్ల ముందు అతనికి క్షమాపణ చెప్పాను. నేను ఎందుకలా ప్రవర్తించానో నాకు మాత్రమే తెలుసు. క్రికెట్ ఆస్ట్రేలియా నాకు వేసిన జరిమానాను అంగీకరిస్తున్నా' అని మార్కస్ స్టొయినిస్ స్పందించాడు. సరిగ్గా ఆరు వారాల క్రితం ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్ విక్టోరియా తరపున మ్యాచ్ ఆడుతూ ఇదే తరహాలో తీవ్ర అసభ్యపదజాలంతో దూషించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ సస్పెన్షన్‌తో పాటు భారీ జరిమానాను విధించింది. దీంతో నవంబర్‌లో పాక్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో పాటిన్సన్ మొదటి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా బిగ్‌బాష్ లీగ్‌లో ఈ ఏడాది స్టొయినిస్ అసాధారణ ఆటతీరు కనబరిచి 281 పరుగులతో లీగ్ టాప్ స్కోర్ర్లలో ఒకడిగా నిలిచినా, జనవరిలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు కేన్ రిచర్డ్సన్ మాత్రం ఈ సిరీస్‌కు ఎంపిక కావడం విశేషం. 2018లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినప్పటి నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పు చేసిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది. బాల్ ట్యాంపరింగ్ చేసినందుకు అప్పటి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది , బౌలర్ బెన్‌క్రాప్ట్ 9 నెలల పాటు జట్టుకు దూరమయ్యరు.కాగా మార్కస్ స్టొయినిస్‌ను డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 4.80 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా, కేన్ రిచర్డ్సన్ను ఆర్సీబీ రూ. 4 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. (క్రికెట్‌కు పఠాన్ గుడ్‌బై ) (ముగిసిన ఐపీఎల్ వేలం) -
నన్నెవరు ఇష్టపడరు.. అందుకే జట్లు మారుతున్న: ఫించ్
ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 4.4 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫించ్ ఆర్సీబీకి వెళ్లడంపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ట్విటర్లో స్పందించింది. ' ఆసీస్ స్టార్ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఐపీఎల్ వేలంలో ఆర్సీబీకి వెళ్లాడు. ఆ జట్టులో ఉన్న సభ్యులంతా అతడిని ఇష్టపడతారని ఆశిస్తున్నామంటూ' ట్వీట్ చేయడంతో పాటు ఓ వీడియోనూ షేర్ చేశారు. ఆ వీడియోలో ఆస్ట్రేలియా టిమ్ పైన్, ఆరోన్ పించ్‌లు ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నారు. గతంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దృష్టి మరల్చడానికి టిమ్ పైన్ స్టంప్ మైక్రోఫోన్ ద్వారా ఫించ్‌తో సరదాగా మాట్లాడాడు. ' ఫించ్.. ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో టీమ్‌లు మారావు. దాదాపు అన్ని జట్లతో ఆడావ్' అని పైన్ అన్నాడు. దీనికి బదులుగా ఫించ్.. ' అవును అన్ని జట్లకు ఆడాను.. ఒక్క ఆర్సీబీకి తప్ప' అని బదులిచ్చాడు. అప్పుడు పైన్ అందుకుంటూ.. ' నిన్ను ఆ జట్టు ఎందుకు తీసుకోదు.. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నిన్ను ఇష్టపడరా ?' అంటూ సరదాగా అడిగాడు. ' అవును నన్ను ఎవరు ఇష్టపడరు.. అందుకే అన్ని జట్లు మారతున్నా అంటూ' .. ఫించ్ సమాధానమిచ్చాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో ఫించ్ ఆర్సీబీకి వెళ్లడం విశేషం. ఈ వీడియోనూ కాస్తా క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'ఐపీఎల్ వేలంలో ఆరోన్ ఫించ్ ఆర్సీబీకి వెళ్లాడు. ఇప్పుడు కోహ్లి అతన్ని ఇష్టపడతాడులే' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రసుత్తం ఆర్సీబీకి ఆడనున్న ఆరోన్ పించ్ ఐపీఎల్లో ఏడు జట్లకు ఆడాడు. ఇప్పుడు ఆర్సీబీతో కలిపి 8 వ జట్టుకు ఆడనున్నాడు. కాగా, ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఫించ్‌తో పాటు ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్సన్(రూ. 4 కోట్లు) , దక్షిణాఫ్రికా నుంచి ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్(రూ. 10 కోట్లు), బౌలర్ డేల్ స్టేయిన్(రూ. 2 కోట్లు)లను సొంతం చేసుకుంది. (చదవండి : సహచరులతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లి) Aussie star Aaron Finch is off to @RCBTweets in the #IPLAuction2020. Let's hope his new teammates like him 😂😂😂 pic.twitter.com/VGfUFfJffq — cricket.com.au (@cricketcomau) December 19, 2019 -
రెండు డే నైట్ టెస్టులు ఆడండి!
మెల్బోర్న్/కోల్‌కతా: వచ్చే ఏడాది చివర్లో తమ దేశంలో పర్యటించనున్న భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండు టెస్టులను డే నైట్‌లో ఆడాలని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) కోరుకుంటోంది. వచ్చే జనవరిలో భారత్‌లో వన్డే సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా రానున్న సందర్భంగా ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో చర్చించాలని సీఏ చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ భావిస్తున్నారు. అయితే ఆ్రస్టేలియా ప్రతిపాదనపట్ల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సానుకూలంగా స్పందించే అవకాశం కనిపించడంలేదు. ‘అధికారికంగా క్రికెట్ ఆ్రస్టేలియా నుంచి నాకు ఎలాంటి సమాచారం అందలేదు. అయినా ఒకే సిరీస్‌లో రెండు డే నైట్ టెస్టులంటే ఎక్కువే. సిరీస్‌లో ఒక డే నైట్ మ్యాచ్ ఉంటే చాలు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఆ్రస్టేలియా పర్యటనకు వెళ్లనున్న భారత్ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. -
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్.. ఏడాది నిషేధం
సిడ్నీ: క్రికెట్ జట్టు సమాచారాన్ని గోప్యంగా ఉంచకుండా తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎమిలీ స్మిత్‌పై ఏడాది నిషేధం పడింది. మహిళల బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా ఈ నెల ఆరంభంలో సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోబార్ట్ హరికేన్స్ క్రీడాకారిణి ఎమిలీ స్మిత్ జట్టు ఎలెవన్ పేర్లను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మ్యాచ్ ఆరంభానికి గంట ముందు ఆమె జట్టులో ఎవరు ఆడుతున్నారో అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బట్టబయలు చేశారు. ఇది క్రికెట్ నిబంధనలకు విరుద్ధం. క్రికెట్ ఆస్ట్రేలియా ఆర్టికల్ 2.3.2 ప్రకారం స్మిత్‌పై 12 నెలల నిషేధం పడింది. ఈ పోస్ట్ బెట్టింగ్‌కు సంబంధించి ఉపయోగించబడే సమాచారానికి దారితీస్తుందని, జట్టు రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం నేరం అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇది అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా.. ఎమిలీ స్మిత్‌పై 12 నెలల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఏడాది నిషేధంలో స్మిత్‌పై తొమ్మిది నెలలు పూర్తి సస్పెన్షన్ కొనసాగనుంది. ఇక చివరి మూడు నెలలు అందుబాటులోకి వచ్చినా జట్టులో ఎంపికకు అనర్హురాలిగానే ఉండాల్సి ఉంటుంది. -
ఆసీస్ క్రికెటర్లకు పేరంటల్ లీవ్స్
సిడ్నీ: క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) కొత్తగా పేరంటల్ లీవ్స్‌ను ప్రవేశపెట్టింది. సీఏ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు ఇకపై ఈ సెలవుల్ని తీసుకోవచ్చని సీఏ తెలిపింది. ఇందులో భాగంగా మహిళా క్రికెటర్ తల్లయితే గరిష్టంగా 12 నెలలు సెలవులో ఉండొచ్చు. కాంట్రాక్టులో భాగంగా ఆమెకు రావాల్సిన ఆరి్థక ప్రయోజనాలి్న, వేతనంతో కూడిన సెలవుల్ని మంజూరు చేస్తారు. ప్రాథమికంగా మహిళా క్రికెటర్లకే ఇవ్వాలనుకున్నప్పటికీ పురుష క్రికెటర్లు తండ్రి అయినా కూడా సెలవులు ఇవ్వాలని సీఏ నిర్ణయించింది. అయితే వీరికి గరిష్టంగా మూడు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఈ జూలై 1 నుంచే ఇది అమల్లోకి వచి్చందని సీఏ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్టు వ్యవధి మేరకు సెలవులు పూర్తయ్యాక గ్యారంటీగా కాంట్రాక్టు పొడిగింపు ఉంటుందని సీఏ భరోసా ఇచి్చంది. చిన్నారుల్ని దత్తత తీసుకున్నా సెలవులు తీసుకోవచ్చని సీఏ తెలిపింది. -
నేను గే కాదు; క్లారిటీ ఇచ్చిన ఫాల్క్‌నర్
‘నిన్న రాత్రి నేను చేసిన పోస్టు అపార్థాలకు దారి తీసింది. నేను స్వలింగ సంపర్కుడిని(గే) కాదు. ఏదేమైనప్పటికీ ఎల్బీజీటీ కమ్యూనిటీ నుంచి నాకు అద్భుతమైన మద్దతు లభించింది. ఈ విషయాన్ని నేనెన్నటికీ మరచిపోలేను. ఎవరిదైనా ప్రేమే. ఇక రోబుస్టా నాకు మంచి స్నేహితుడు. ఇంకో విషయం.. రాత్రి చెప్పినట్లు ఐదేళ్లుగా కలిసి ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉంటున్నామని ఉద్దేశం. అయినా ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో మద్దతుగా నిలవడం చాలా బాగుంది’ అంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ తాను గేను కానని స్పష్టం చేశాడు. కాగా సోమవారం తన 29వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను ఫాల్క్‌నర్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ‘నా బాయ్‌ఫ్రెండ్ రొబుస్టాతో పాటు మా అమ్మతో కలిసి పుట్టిన రోజు డిన్నర్’ అంటూ టుగెదర్ఫర్5ఇయర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఫాల్క్‌నర్ గే అని, స్వలింగ సంపర్కుడినంటూ ప్రకటన చేసిన తొలి ఆసీస్ క్రికెటర్ అని పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఫాల్క్‌నర్‌తో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కూడా ఈ కథనాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి కరీనా కేస్లెర్ మాట్లాడుతూ.. ‘ వ్యాపార భాగస్వామి, హౌజ్‌మేట్ అయిన స్నేహితుడితో తనకు ఉన్న అనుబంధం గురించి ఫాల్క్‌నర్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. అతడు చేసిన ఈ జోక్ కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నాం. పత్రికలు కూడా ఈ విషయం గురించి ప్రచురించే ముందు అతడిని సంప్రదించలేదు. దీంతో గందరగోళం నెలకొంది. ఎల్జీబీటీ కమ్యూనిటీకి జేమ్స్, సీఏ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 69 వన్డేలు, 24 టి20లు ఆడిన ఫాల్క్‌నర్... ఏడాదిన్నరగా జట్టులోకి ఎంపిక కాలేదు. కాగా, తాను ‘గే’నంటూ చెప్పుకొన్న తొలి అంతర్జాతీయ క్రికెటర్ ఇంగ్లండ్‌కు చెందిన స్టీవెన్ డేవిస్. 2011లో అతడీ మేరకు ప్రకటన చేశాడు. View this post on Instagram There seems to be a misunderstanding about my post from last night, I am not gay, however it has been fantastic to see the support from and for the LBGT community. Let’s never forget love is love, however @robjubbsta is just a great friend. Last night marked five years of being house mates! Good on everyone for being so supportive. A post shared by James Faulkner (@jfaulkner44) on Apr 29, 2019 at 5:07pm PDT