టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు భారీ ఊరట లభించింది. 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో జీవితకాల నిషేధం (కెప్టెన్సీ విషయంలో) ఎదుర్కొంటున్న అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ తియ్యటి కబురు చెప్పనుందని తెలుస్తుంది. సీఏ.. వార్నర్‌పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు ఫించ్ తర్వాత ఆసీస్ పరిమిత ఓవర్ల పగ్గాలు కూడా అప్పజెప్పాలని డిసైడైనట్లు కధనాలు వినిపిస్తున్నాయి.
రేపు జరుగబోయే సీఏ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. వార్నర్‌పై కెప్టెన్సీ బ్యాన్ ఎత్తివేయాలని అభిమానులు, ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల నుంచి భారీ స్థాయిలో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సీఏ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఇదే బాల్ టాంపరింగ్ ఉదంతంలో వార్నర్‌తో పాటు నాటి ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్, ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ముగ్గురు ఆటగాళ్లు నేరం అంగీకరించిన నేపథ్యంలో బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు, స్టీవ్ స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం పడింది. అయితే ఈ కేసులో వార్నర్‌ను కీలక సూత్రధారిగా పరిగణించిన సీఏ.. అతనిపై లైఫ్ టైమ్ కెప్టెన్సీ బ్యాన్‌ను విధించింది.
Comments
Please login to add a commentAdd a comment