ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 4.4 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫించ్ ఆర్‌సీబీకి వెళ్లడంపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ట్విటర్‌లో స్పందించింది. ' ఆసీస్ స్టార్ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఐపీఎల్ వేలంలో ఆర్‌సీబీకి వెళ్లాడు. ఆ జట్టులో ఉన్న సభ్యులంతా అతడిని ఇష్టపడతారని ఆశిస్తున్నామంటూ' ట్వీట్ చేయడంతో పాటు ఓ వీడియోనూ షేర్ చేశారు.
ఆ వీడియోలో ఆస్ట్రేలియా టిమ్ పైన్, ఆరోన్ పించ్‌లు ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నారు. గతంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దృష్టి మరల్చడానికి టిమ్ పైన్ స్టంప్ మైక్రోఫోన్ ద్వారా ఫించ్‌తో సరదాగా మాట్లాడాడు. ' ఫించ్.. ఐపీఎల్‌లో ఇప్పటికే ఎన్నో టీమ్‌లు మారావు. దాదాపు అన్ని జట్లతో ఆడావ్' అని పైన్ అన్నాడు. దీనికి బదులుగా ఫించ్.. ' అవును అన్ని జట్లకు ఆడాను.. ఒక్క ఆర్‌సీబీకి తప్ప' అని బదులిచ్చాడు.
అప్పుడు పైన్ అందుకుంటూ.. ' నిన్ను ఆ జట్టు ఎందుకు తీసుకోదు.. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నిన్ను ఇష్టపడరా ?' అంటూ సరదాగా అడిగాడు. ' అవును నన్ను ఎవరు ఇష్టపడరు.. అందుకే అన్ని జట్లు మారతున్నా అంటూ' .. ఫించ్ సమాధానమిచ్చాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో ఫించ్ ఆర్‌సీబీకి వెళ్లడం విశేషం. ఈ వీడియోనూ కాస్తా క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'ఐపీఎల్ వేలంలో ఆరోన్ ఫించ్ ఆర్‌సీబీకి వెళ్లాడు. ఇప్పుడు కోహ్లి అతన్ని ఇష్టపడతాడులే' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రసుత్తం ఆర్‌సీబీకి ఆడనున్న ఆరోన్ పించ్ ఐపీఎల్‌లో ఏడు జట్లకు ఆడాడు. ఇప్పుడు ఆర్‌సీబీతో కలిపి 8 వ జట్టుకు ఆడనున్నాడు. కాగా, ఐపీఎల్ వేలంలో ఆర్‌సీబీ ఫించ్‌తో పాటు ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్‌సన్(రూ. 4 కోట్లు) , దక్షిణాఫ్రికా నుంచి ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్(రూ. 10 కోట్లు), బౌలర్ డేల్ స్టేయిన్(రూ. 2 కోట్లు)లను సొంతం చేసుకుంది. (చదవండి : సహచరులతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లి)
Aussie star Aaron Finch is off to @RCBTweets in the #IPLAuction2020. Let's hope his new teammates like him 😂😂😂 pic.twitter.com/VGfUFfJffq
— cricket.com.au (@cricketcomau) December 19, 2019
Comments
Please login to add a commentAdd a comment