Tim Paine
-
బౌన్సీ పిచ్‌లపై జురెల్ బ్యాటింగ్ భళా.. తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ ప్రశంసలు కురిపించాడు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ తుది జట్టులో కచ్చితంగా చోటు దక్కించుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. బౌన్సీ పిచ్‌లపై మెరుగైన ప్రదర్శన చేసిన ధ్రువ్ జురెల్.. ఆసీస్‌తో సిరీస్‌లో గనుక ఆడకపోతే తాను ఆశ్చర్యపోతానని పేర్కొన్నాడు.కాగా ఆసీస్‌తో కీలక టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా పిచ్‌పై అవగాహన కోసం.. భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు భారత జట్టు ఆటగాళ్లు బరిలోకి దిగగా... రెండో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా ఆడారు.మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళఅయితే, ఈ పోరులో మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ జురెల్ చక్కటి ఆటతీరు కనబర్చాడు. బౌన్సీ వికెట్‌పై పేసర్లను సమర్థంగా ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్‌లో 80, రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన మాజీ క్రికెటర్ టిమ్ పైన్... 23 ఏళ్ల ధ్రువ్ ఆట తీరు తనను ఆకట్టుకుందని కొనియాడాడు. ‘ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడి బ్యాటింగ్ శైలి చూసిన తర్వాత బోర్డర్–గావస్కర్ సిరీస్ తుది జట్టులో అతడు ఆడకపోతే ఆశ్చర్యపోవాల్సిందే.మెరుగైన షాట్ సెలెక్షన్‌తో ఆకట్టుకున్నాడుధ్రువ్ ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆటతీరు చూస్తుంటే... సహచర ఆటగాళ్ల కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. ఆసీస్ పిచ్‌లపై రాణించాలంటే పేస్‌ను, బౌన్స్‌ను ఎదుర్కోవడం తెలిసి ఉండాలి. అది ధ్రువ్‌లో చూశాను. సాధారణంగా భారత జట్టు ఆటగాళ్ల ప్రదర్శన కన్నా అతడు మెరుగైన షాట్ సెలెక్షన్‌తో ఆకట్టుకున్నాడు. మెల్బోర్న్ పిచ్‌పై అతడు చేసిన పరుగులు చాలా విలువైనవి. ఆసీస్ పేసర్లను ఎదుర్కోవడం అంత సులువు కాకపోయినా... జురెల్‌లో ఆ సత్తా ఉందని మాత్రం చెప్పగలను. రిషబ్ పంత్ రూపంలో టీమిండియాకు అత్యుత్తమ వికెట్ కీపర్ అందుబాటులో ఉన్నా... కనీసం ప్లేయర్‌గానైనా ధ్రువ్ భారత జట్టులో ఉంటాడని అనుకుంటున్నా’ అని పైన్ అన్నాడు. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్... కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. పంత్ తిరిగి జట్టులోకి రావడంతోఅయితే, ప్రమాదం నుంచి కోలుకొని రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రావడంతో జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఇటీవల న్యూజిలాండ్తోసిరీస్లోనూ జురెల్ జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు ఆడిన అనధికారిక టెస్టులో రాణించడంతో ధ్రువ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే మిడిలార్డర్లో నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు బదులు ధ్రువ్ జురెల్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్ -
WC: ఎవరిపై వేటు? ప్రతిసారీ నేనే.. నేనే అంటే కుదరదు.. చెత్త సలహాలు వద్దు!
Ben Stokes' ODI Retirement Backflip For WC 2023: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అండగా నిలిచాడు. స్టోక్స్‌పై విమర్శలు గుప్పించిన ఆస్ట్రేలియా మాజీ సారథి టిమ్ పైన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. చెత్త సలహాలు మానుకోవాలంటూ హితవు పలికాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2019 హీరో స్టోక్స్ ఇటీవలే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. హీరో వచ్చేస్తున్నాడు.. మెగా ఈవెంట్ నేపథ్యంలో అతడిని మళ్లీ వన్డేల్లో ఆడించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో స్టోక్స్ బరిలోకి దిగనుండటంతో హర్షం వ్యక్తం చేశారు. అయితే, స్టోక్స్ యూటర్న్‌పై ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ స్పందించిన తీరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. SEN టాస్మానియాతో మాట్లాడుతూ.. ‘‘వన్డేల్లో రిటైర్మెంట్పై బెన్ స్టోక్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆసక్తి కలిగించింది. మీరు బెంచ్‌పై కూర్చోండి! అంటే ప్రతిచోటా నేనే.. నేనే.. నేనే అన్నట్లుగా ఉంది కదా! నాకు ఇష్టం వచ్చినపుడు ఆడతా.. అది కూడా మేజర్ ఈవెంట్లలో మాత్రమే ఆడతా అంటే.. ఏడాది పాటు కష్టపడ్డ ఆటగాళ్లు ఎక్కడికిపోవాలి? ఇప్పుడు నేను ఆడతాను.. మీరు బెంచ్‌కే పరిమితం కావాలి అని వాళ్లకు చెప్తాడా?’’ అంటూ స్టోక్స్ స్వార్థపరుడన్న ఉద్దేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో టిమ్ పైన్ మాటలు నెట్టింట వైరల్ కాగా మైకేల్ వాన్ తనదైన శైలిలో స్పందించాడు. టిమ్‌కు కౌంటర్ ఇచ్చిన వాన్ ‘‘ఇంతవరకు బెన్ స్టోక్స్ లాంటి నిస్వార్థపరుడైన క్రికెటర్‌ను నేనింత వరకు చూడలేదు. తనకంటే జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తాడు. మిగతా ఏ క్రికెటర్‌తో పోల్చినా ఈ విషయంలో తనే ముందుంటాడు. టిమ్.. ఇలాంటి హాస్యాస్పద సలహాలు ఇవ్వడం మానుకో!’’ అంటూ దిమ్మతిరిగే ట్వీట్‌తో టిమ్ పైన్‌కు కౌంటర్ వేశాడు. కాగా 32 ఏళ్ల స్టోక్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక వన్డే కెరీర్లో ఇప్పటి వరకు 105 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 2924 పరుగులు చేశాడు. ఎవరిపై వేటు? ఇందులో మూడు సెంచరీలు, 21 ఫిఫ్టీలు ఉన్నాయి. ఇక ఈ ఫార్మాట్లో ఈ రైట్ ఆర్మ్ పేసర్ మొత్తంగా 74 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 5- వికెట్ హాల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. స్టోక్స్ రీఎంట్రీతో ఎవరిపై వేటు పడనుందన్న అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయమైంది. చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్‌లో మలింగ రీఎంట్రీ! అతడి స్థానంలో.. Ben stokes is the most selfless cricketer I have ever known .. He puts Team before himself more than any other player .. Ridiculous suggestion from Tim .. https://t.co/jUXwzl1z2e — Michael Vaughan (@MichaelVaughan) August 19, 2023 -
ఏంటి స్టోక్స్ ఇది.. అస్సలు ఊహించలేదు? అతడిని బలిచేశారు!
2019 వరల్డ్‌కప్ విన్నింగ్ హీరో, ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు స్టోక్స్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో వన్డేలతో పాటు వరల్డ్‌కప్‌కు ప్రకటించిన ఇంగ్లండ్ ప్రిలిమనరీ జట్టులో స్టోక్స్‌కు చోటుదక్కింది. ఇక ఇది ఇలా ఉండగా.. స్టోక్స్ తన నిర్ణయాన్ని మార్చుకోవడాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ తప్పుపట్టాడు. స్టోక్స్ యూటర్న్ తీసుకోవడంతో ఒక ఆటగాడు ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడని పైన్ అభిప్రాయపడ్డాడు. "బెన్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అతడు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఎందుకంటే ప్రపంచకప్ వంటి టోర్నీలో ఆడేందుకు ఆటగాళ్లు దాదాపు ఏడాది నుంచి కష్టపడతున్నారు. అటువంటిది సడన్‌గా మనసు మార్చుకోని వరల్డ్‌కప్ వంటి పెద్దటోర్నీలో ఆడుతానంటే ఎలా కుదురుతుంది? ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఆడాలని కలలు కన్న ఆటగాళ్లు బెంచ్‌లో కూర్చోవాలా? అంటూ పైన్ ప్రశ్నలవర్షం కురిపించాడు. అదే విధంగా ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇదే విషయంపై పైన్ మాట్లాడుతూ.. స్టోక్స్ బౌలింగ్ చేస్తాడో లేదో నాకు తెలియదు. కేవలం బ్యాటర్‌గా అయితే సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం 100 శాతం తప్పు అవుతోంది. స్టోక్స్ కోసం హ్యారీ బ్రూక్‌ను బలిచేశారు. అది సరైన నిర్ణయం కాదు. ఎందకంటే బ్రూక్స్ మిడిలార్డర్లో అద్బుతంగా రాణిస్తున్నడని అతడు పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! -
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై!
ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో టాస్మానియాకు ప్రాతినిథ్యం వహించిన పైన్.. తన 18 ఏళ్ల బంధానికి ముగింపు పలికాడు. శుక్రవారం షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం పైన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అతడికి సహాచర ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఈ సందర్భంగా టిమ్ పైన్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇక పైన్ తన చివరి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో అతడు 95 మ్యాచ్‌లు ఆడాడు. అతడు 2005లో సౌత్ ఆస్ట్రేలియాపై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అత్యధిక ఔట్లు చేసిన టాస్మానియన్ వికెట్ కీపర్‌గా పైన్(295) రికార్డు కలిగి ఉన్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో దాదాపు 30 సగటుతో అతడు 4000కు పైగా పరుగులు చేశాడు. కాగా పైన్ కెరీర్లో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ముఖ్యంగా ఓ మహిళకు అభ్యంతరకర మెసేజీలు చేసిన ('సెక్స్టింగ్') స్కాంలో పైన్ ఇరుక్కున్నాడు. దీంతో అతడు 2021లో కీలకమైన యాషెస్ ఆసీస్ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ వివాదం అతడి కెరీర్‌నే మలుపు తిప్పేసింది. Massive congratulations to @tdpaine36 on an exceptional career with the @TasmanianTigers and @CricketAus 💪 pic.twitter.com/0oDPUVhqRp — Brent Costelloe (@brentcostelloe) March 17, 2023 చదవండి: బంగ్లాదేశ్ కెప్టెన్‌కు చేదు అనుభవం.. కాలర్ పట్టి లాగి! వీడియో వైరల్ -
'జడేజా చీటింగ్ చేశాడా'.. చూసి మాట్లాడండి!
దాదాపు ఐదు నెలల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో జడేజా ఐదు వికెట్లు తీసి రీఎంట్రీలో అదుర్స్ అనిపించాడు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కోబ్, టాడ్ మార్ఫే రూపంలో ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. జడేజాకు టెస్టుల్లో ఐదు వికెట్ల హాల్ అందుకోవడం ఇది 11వ సారి. ఈ విషయం పక్కనబెడితే.. జడేజా చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు జడ్డూ సిద్ధమయ్యాడు. అప్పటికే జడేజా 30 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. క్రీజులో అలెక్స్ క్యారీ, హ్యాండ్స్కోబ్ ఉన్నారు. అయితే బౌలింగ్ వేయడానికి ముందు సిరాజ్ వద్దకు వెళ్లిన జడ్డూ అతని చేతిపై నుంచి ఏదో తీసుకున్నాడు. దానిని తాను బౌలింగ్ చేస్తున్న చేతికి రాశాడు. ఏం చేశాడన్నది క్లారిటీ లేదు కానీ వీడియో చూస్తే తన వేలికి ఏదైనా లోషన్ రాసుకొని ఉంటాడనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. అయితే జడేజా తీరుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ ఆసక్తికరంగా స్పందించాడు. గ్రిప్పింగ్ కోసం జడేజా చేసిన పనిపై నువ్వేమంటావని టిమ్ పైన్ని అడగ్గా..'' ఇంట్రెస్టింగ్'' అని కామెంట్ చేశాడు. మరికొందరు..జడేజా ఏమైనా చీటింగ్ చేశాడా'' అంటూ కామెంట్ చేయగా.. కొందరు మాత్రం ''అలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం జడ్డూకు లేదని.. అది కేవలం లోషన్ మాత్రమేనని.. చూసి మాట్లాడండి'' అంటూ జడ్డూకు మద్దతు పలికారు. ఏది ఏమైనా జడేజా తన చర్యతో అందరి చూపు తన వైపుకు తిప్పుకున్నాడు. చదవండి: అశ్విన్‌దే కాదు షమీది కూడా రికార్డే -
టిమ్ పెయిన్ సంచలన ఆరోపణలు
-
Aus Vs SA: ‘మేమే కాదు దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసింది’
Tim Paine- Ball Tampering- Sandpaper Scandal- సిడ్నీ: 2018లో కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా జరిగిన ‘బాల్ టాంపరింగ్’ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. దాంతో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై వేటు పడటంతో పాటు తర్వాతి మ్యాచ్‌నుంచి టిమ్ పెయిన్ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే నాటి ఘటనను తన పుస్తకం ‘ద పెయిడ్ ప్రైస్’లో గుర్తు చేసుకున్న పెయిన్... తామే కాదు, తర్వాతి టెస్టులో దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే స్థానిక ప్రసారకర్తల సహాయంతో ఆ వీడియోను దాచేశారని అతను ఆరోపించాడు. ‘సిరీస్ నాలుగో టెస్టులో ఇది జరిగింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ చేతిలో ఉన్న బంతిపై చాలా పగుళ్లు ఉన్న దృశ్యం అక్కడి భారీ స్క్రీన్‌పై కనిపించింది. కానీ ఆ వెంటనే దానిని తొలగించారు. మేం ఈ విషయంపై అంపైర్లతో మాట్లాడినా అసలు ఎవరూ పట్టించుకోలేదు’ అని పెయిన్ చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఘటన సమయంలో తమ ముగ్గురు క్రికెటర్లకు ఎవరూ అండగా నిలవలేదని విషయాన్ని అతను అంగీకరించాడు. ‘సాధారణంగా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సహచర క్రికెటర్లు ఆదుకోవాలి. మానసికంగా వారికి అండగా నిలవాలి. కానీ వారందరినీ వెలి వేసినట్లు చూశారు’ అని పెయిన్ చెప్పాడు. చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ T20 WC 2022: అక్తర్, బ్రాడ్ హాగ్‌లు దొరికేశారు కదా..! -
18 నెలల తర్వాత మళ్లీ బ్యాట్ పట్టిన ఆసీస్ మాజీ కెప్టెన్
ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ 18 నెలల విరామం తర్వాత మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో గురువారం మొదలైన మ్యాచ్‌లో పైన్ తన సొంత జట్టు టాస్మేనియా తరపున బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పైన్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా 2017లో ఒక మహిళకు ఆసభ్యకర సందేశాలు పంపిన విషయం వెలుగులోకి రావడంతో 2021 ఏప్రిల్‌లో యాషెస్ సిరీస్ నుంచి తప్పుకుని పైన్ ఆటనుంచి నిరవధిక విరామం తీసుకున్నాడు. చదవండి: IND vs SA: వన్డేల్లో గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా -
రీఎంట్రీ ఇవ్వనున్న ఆసీస్ వివాదాస్పద క్రికెటర్
ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్.. వివాదస్పద క్రికెటర్ టిమ్ పెయిన్ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. 2017లో ఒక మహిళకు అసభ్యకర సందేశాలు పంపిన వివాదం వెలుగులోకి రావడంతో గత ఏడాది నవంబర్‌లో ఆసీస్ టెస్టు కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆటనుంచి కూడా అతను విరామం తీసుకున్నాడు. ఇప్పుడు తాజాగా తన దేశవాళీ జట్టు టాస్మేనియా ప్రాక్టీస్ సెషన్లో అతను కూడా పాల్గొన్నాడు. అక్టోబర్ 6 నుంచి జరిగే షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో పెయిన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. టిమ్ పైన్ ఆసీస్ తరపున 35 టెస్టుల్లో 1534 పరుగులు, 35 వన్డేల్లో 890 పరుగులు, 12 టి20ల్లో 82 పరుగులు సాధించాడు. -
'ఆ భారత క్రికెటర్లు మొత్తం సిరీస్‌నే రిస్క్‌లో పెట్టారు'
2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టీమిండియా అత్యున్నతమైన టెస్టు సిరీస్ విజయాల్లో ఇది ఒకటి. విరాట్ కోహ్లి సారథ్యంలో భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా.. ఆడిలైడ్ వేదికగా జరగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. తొలి టెస్టు అనంతరం వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ కోహ్లి తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. దీంతో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు ఆజింక్యా రహానే చేపట్టాడు. అయితే మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆడిలైడ్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టుకు ముందు హై డ్రామా నడిచింది. కొంతమంది భారత ఆటగాళ్లు బయో బబుల్‌ను ఉల్లంఘించి రెస్టారెంట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..ఈ విషయం అప్పటిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే రెస్టారెంట్‌కు వెళ్లిన ఆటగాళ్ల అందరికి కొవిడ్ పరీక్షలలో నెగిటివ్ తేలడంతో మూడు టెస్టుకు అందుబాటులో ఉన్నారు. తాజాగా వూట్ అనే ప్లాట్‌ఫామ్.. ఆస్ట్రేలియా-భారత్ సిరీస్‌ను‘బందో మే త దమ్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించింది. అయితే తాజాగా ఇదే విషయంపై అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మరోసారి గుర్తుచేశాడు. "నలుగురు, ఐదుగురు భారత ఆటగాళ్లు మొత్తం టెస్ట్ సిరీస్‌ను రిస్క్‌లో పెట్టారు. వారు ఫుడ్ కోసం వెళ్లారో ఎందుకోసం వెళ్లారో నాకు తెలియదు గానీ, కాస్త నిజాయితీగా వ్యవహరించి ఉంటే బాగుండేది" అని టిమ్ పైన్ పేర్కొన్నాడు. ఇక ఇదే విషయంపై పాట్ కమిన్స్ మాట్లాడూతూ.. "భారత క్రికెటర్లు అలా చేయడం మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లకి చికాకు కలిగించింది. ఎందుకంటే వారి కుటుంబాలతో క్రిస్మస్ సంబరాలు జరపుకోకుండా ఈ సిరీస్‌కు బయోబబ్లలో ఉన్నారు. మా జట్టు అన్నిటిని త్యాగం చేసి ఈ సిరీస్‌కు సిద్దమైంది. అయితే పర్యటక జట్టు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు" అని పాట్ కమిన్స్ తెలిపాడు. కాగా ఈ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. చదవండి: Tim Paine Thanks Rahane: 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు' -
'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు'
2020 ఏడాది చివర్లో బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. కోహ్లి సారధ్యంలో డే నైట్ టెస్టు ఆడిన టీమిండియా అడిలైడ్‌లో బొక్కా బోర్లా పడింది. 36 పరుగులకే ఆలౌటై టెస్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ తర్వాత కోహ్లి పెటర్నిటి సెలవులపై స్వదేశానికి వెళ్లిపోవడంతో రహానేకు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత భారత్ 2-1తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. సీనియర్లు లేకుండా, కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా ఆస్ట్రేలియాను గబ్బా టెస్టులో ఓడించి, 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. భారత క్రికెట్ చరిత్రలో ఈ సిరీస్ విజయం చాలా ప్రత్యేకమైనదిగా చిరస్థాయిగా మిగిలిపోయింది. తాజాగా వూట్ అనే ప్లాట్‌ఫామ్.. ఆస్ట్రేలియా-భారత్ సిరీస్‌ను‘బందో మే త దమ్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించింది. ఈ డాక్యుమెంటరీలో సిరీస్‌లో ఆటగాళ్ల అనుభవాలు, విశేషాలను పంచుకుంది. తాజాగా అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అడిలైడ్ టెస్టులో రహానే.. కోహ్లిని రనౌట్ చేసిన విషయాన్ని మరొకసారి గుర్తుచేశాడు. ‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 20-30 పరుగుల వద్ద ఉన్నప్పుడు అనుకుంటా... లైటింగ్ పోయింది. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే విరాట్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు. కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మాకు నష్టం జరిగేదే. మ్యాచ్ గడిచేకొద్దీ విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకుపోతున్నాడు. మరో ఎండ్‌లో రహానే కూడా బాగా ఆడుతున్నాడు. ఇద్దరూ కలిసి చక్కగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. లక్కీగా రహానే, కోహ్లీని రనౌట్ చేశాడు. మా వరకూ అదే గేమ్ ఛేజింగ్ మూమెంట్. అప్పటిదాకా మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోతుందనే భయపడ్డాం. అయితే కోహ్లీ అవుట్ అయ్యాక మాలో నమ్మకం పెరిగింది..ఎందుకంటే విరాట్ కోహ్లీ బెస్ట్ ప్లేయర్. అతన్ని అవుట్ చేస్తే మిగిలిన వారిని ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అనుకున్నట్టే కోహ్లీ అవుట్ అయ్యాక మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చేసింది... ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే...’ అంటూ ‘బందో మే త దమ్’ అనే డాక్యుమెంటరీలో కామెంట్ చేశాడు ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అయితే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకి ఆలౌట్ కావడంతో.. భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆధిక్యం సాధించామనే సంతోషం టీమిండియాకు ఎక్కువసేపు నిలవలేదు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 45 నిమిషాల్లోనే కుప్పకూలింది. 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మహ్మద్ షమీ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరడంతో 36/9 వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ తెరపడింది. It’s finally here!🏏 20 players, 4 Tests, 2 of cricket’s best teams, 1 mind-blowing story! Come & witness the Baap of all Fightbacks & the blood, sweat and tears that went into achieving it. Watch Neeraj Pandey’s Bandon Mein Tha Dum, streaming now on Voot Select. pic.twitter.com/8YeCMfrTVf — Voot (@justvoot) June 16, 2022 చదవండి: క్రికెట్లో ఇలాంటి అద్భుతాలు అరుదుగా.. 134 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పృథ్వీ షా Shaheen Afridi: పాక్ బౌలర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా.. ఒక్కదానికే! -
Justin Langer: ఆసీస్ హెడ్‌కోచ్‌కు షాకిచ్చిన బోర్డు.. రాజీనామా చేయక తప్పలేదు!
Justin Langer Resigns As Australia Coach: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్‌గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తానెంతగానో ప్రేమించే హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో అనేక చర్చల అనంతరం.. జస్టిన్ లాంగర్ తన పదవి నుంచి వైదొలిగినట్లు అతడి మేనేజ్మెంట్ కంపెనీ డీఎస్ఈజీ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు... ‘‘మా క్లైంట్ జస్టిన్ లాంగర్.. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో నిన్నటి చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నారు’’ అని పేర్కొంది. కాగా ఆసీస్ క్రికెట్ బోర్డుతో కుదిరిన ఒప్పందం ప్రకారం జస్టిన్ లాంగర్ జూన్ వరకు తన పదవిలో కొనసాగాల్సి ఉంది. అయితే, దీర్ఘకాలం పాటు పదవీ కాలాన్ని పొడిగించాలని కోరగా... బోర్డు అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ క్రమంలో సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే, సీఏ నేషనల్ టీమ్స్ హెడ్ బెన్ ఒలివిర్తో ఈ విషయం గురించి చర్చించగా.. సానుకూల ఫలితం రాలేదు. దీంతో లాంగర్ రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే... ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్, ప్రస్తుత టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సహా పలువురు కీలక ఆటగాళ్లతో లాంగర్‌కు అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. చదవండి: సాండ్విచ్ కూడా తినడానికి అవకాశం ఇవ్వలేదు.. కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా? ఈ క్రమంలో ఆటగాళ్లతో విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటాడని, అంతా తాను చెప్పినట్లే జరగాలనే నియంతృత్వ ధోరణితో ఉంటాడని ఆటగాళ్లు అతడి వ్యవహారశైలిపై మండిపడినట్లు సమాచారం. ఆయనతో తమకు పొసగడం లేదంటూ కోచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పడంతో ఆయనను కొనసాగించేందుకు బోర్డు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా లాంగర్ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్ చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన యాషెస్ సిరీస్‌లోనూ 4-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
అలెక్స్ క్యారీకి జాక్‌పాట్.. టిమ్ పైన్ స్థానంలో
Alex Carey Test Debut By Ashes Series Repalces Tim Paine.. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల ఆటగాడు.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. కీలకమైన యాషెస్ సిరీస్ ద్వారా అలెక్స్ క్యారీ ఎంట్రీ ఇవ్వనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ 8 నుంచి మొదలుకానున్న యాషెస్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా మొదటి రెండు టెస్టులు ఆడనున్న జట్టును ఎంపికచేసింది. 15 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టుకు పాట్ కమిన్స్ నాయకత్వం వహించనుండగా.. స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక సెక్స్ స్కాండల్ ఆరోపణలతో కెప్టెన్సీ వదులుకున్న టిమ్ పైన్ యాషెస్ సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పైన్ స్థానంలో ఎంపికైన అలెక్స్ క్యారీ ఆసీస్ తరపున 461వ టెస్టు ఆటగాడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. చదవండి: Steve Smith: 'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్రూం అద్దానికి అంటించా' ఇదే విషయమై ఆస్ట్రేలియన్ క్రికెట్ సెలక్టర్స్ చైర్మన్ జార్జ్ బెయిలీ మాట్లాడాడు. '' పరిమిత ఓవర్ల క్రికెట్లో అలెక్స్ క్యారీ రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. వికెట్ కీపర్‌గా.. బ్యాటర్‌గా సక్సెస్ అయిన అలెక్స్ క్యారీ టెస్టుల్లోనూ అదే రీతిలో ఆడుతాడనే నమ్మకముంది. అతని దూకుడైన ఆటతీరు జట్టుకు ఇప్పుడు చాలా అవసరం. పైన్ స్థానంలో అతన్ని ఎంపికచేశాం. ఆసీస్ తరపున 461 వ టెస్టు ఆటగాడిగా ఎంట్రీ ఇవ్వనున్న క్యారీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాడని భావిస్తున్నాం.'' అని చెప్పుకొచ్చాడు. ఇక అలెక్స్ క్యారీ ఆస్ట్రేలియా తరపున 45 వన్డేల్లో 1203 పరుగులు.. 38 టి20ల్లో 233 పరుగులు సాధించాడు. చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా తొలి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్) అలెక్స్ కారీ, కామెరున్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రేవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మైఖేల్ నేజర్, జై రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్వెప్సన్ -
Tim Paine: టిమ్ బెస్ట్ వికెట్ కీపర్.. తను డ్రెస్సింగ్ రూంలో ఉంటే చాలు!
Nathan Lyon Said Tim Paine Want the World Best Wicketkeeper in Team: మహిళకు అసభ్య సందేశాలు పంపాడన్న ఆరోపణల నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా టెస్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్‌కు సహచర ఆటగాడు నాథన్ లియాన్ మద్దతుగా నిలిచాడు. కేవలం ఆస్ట్రేలియాలోనే కాకుండా... ప్రపంచం మొత్తంలో అత్యుత్తమ వికెట్ కీపర్ టిమ్ అని కొనియాడాడు. అతడు డ్రెస్సింగ్‌రూంలో ఉంటే వాతావరణం బాగుంటుందన్నాడు. అంతేతప్ప పైన్ కారణంగా ఆటగాళ్ల దృష్టి ఇతర విషయాలకు మళ్లుతుందనుకోవడం సరికాదని చెప్పుకొచ్చాడు. కాగా 2017లో ఓ మహిళకు అభ్యంతరకర మెసేజ్‌లు పంపినట్లు అంగీకరించిన పైన్.. టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఈ మేరకు ప్రకటన చేయడంతో.. జట్టులో అతడికి చోటు ఉంటుందా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతడు గనుక జట్టుతో చేరితే ఇటీవల పరిణామాల ప్రభావం ఇతర ఆటగాళ్లపై పడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ మట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో దేశంలోనే కాదు.. ప్రపంచంలో కూడా అత్యుత్తమ వికెట్ కీపర్ టిమ్. ఆసీస్ డ్రెస్సింగ్‌రూంలో వందకు వంద శాతం తనకు మద్దతు లభిస్తుందని నమ్ముతున్నా. తన కారణంగా మా దృష్టి మళ్లుతుందనడం సరికాదు. మేము ప్రొఫెషనల్ ఆటగాళ్లం. మా పని క్రికెట్ ఆడటం మాత్రమే. ఇతర విషయాలను పట్టించుకోము. ఆటగాళ్లుగా మా విధులేమిటన్న అంశంపై మాత్రమే దృష్టి సారిస్తాం’’ అని క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు. ఇక సెలక్షన్‌కు తాను అందుబాటులో ఉంటానని పైన్ స్పష్టం చేసిన నేపథ్యంలో... బెస్ట్ వికెట్ కీపర్ జట్టులోకి రావాలని తాను కోరుకుంటానని, ఒక బౌలర్‌గా ఇది తన స్వార్థమని చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022 Auction- KL Rahul: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..! ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధం? IND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో -
క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు
క్రికెట్ చరిత్రలో కొంతమంది ఆటగాళ్లు ఎంతమంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వారి వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులు కెరీర్‌కు మాయని మచ్చగా మిగిలిపోతాయి. తాజాగా టిమ్ పైన్ ఉదంతం అందుకు ఉదాహరణ. బాల్ టాంపరింగ్ ఉదంతంతో స్మిత్ కెప్టెన్సీ కోల్పోగా.. అతని నుంచి బాధ్యతలు స్వీకరించిన టిమ్ పైన్ ఆస్ట్రేలియాను బాగానే నడిపించాడు. అయితే కీలకమైన యాషెస్ సిరీస్‌కు ముందు టిమ్‌పైన్‌పై సెక్స్ ఆరోపణలు వచ్చాయి. 2017లో ఒక మహిళతో అసభ్యకరమైన చాటింగ్ చేసినట్లు తేలింది. ఇది నిజమేనని ఒప్పుకున్న పైన్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆటగాడిగా మంచిపేరు తెచ్చుకున్నప్పటికి సెక్స్ స్కాండల్ ఉదంతం అతని కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోనుంది. ఈ నేపథ్యంలో గతంలోనూ క్రికెటర్లు సెక్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. - సాక్షి, వెబ్‌డెస్క్ షాహిద్ అఫ్రిది: మేటి ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది వివాదాల్లోనూ అంతే గుర్తింపు పొందాడు. ఒక దశలో రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వెనక్కి వచ్చిన అఫ్రిది సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించాడు తన కెరీర్‌లాగే ఆఫ్రిదీ జీవితంలో వివాదాలు చాలా ఎక్కువే. ఓ టోర్నీ కోసం సింగపూర్ వెళ్లిన అఫ్రిది.. అక్కడ మరో క్రికెటర్‌తో కలిసి ఇద్దరు అమ్మాయిలతో గడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆఫ్రిదీని 2000 ఐసీసీ ఛాంపియన్స్ట్రోఫీ నుంచి తప్పిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా నిలిచింది. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా అబ్దుల్ రజాక్: పెళ్లయిన తర్వాత తనకు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ స్వయంగా వెల్లడించాడు. ఒక టీవీ కార్యక్రమంలో, 39 ఏళ్ల మాజీ క్రికెటర్ తనకు ఆరుగురు మహిళలతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు ఒప్పుకున్నాడు. అందులో ఒక మహిళతో ఒకటిన్నర సంవత్సరాలు డేటింగ్ చేశాడని ఒప్పుకున్నాడు. షాహిన్ అఫ్రిది: ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో షాహిన్ అఫ్రిది ఒక సంచలనం. రోజురోజుకు ఆటలో పదును పెంచుకుంటున్న షాహిన్ అఫ్రిది వ్యక్తిగత జీవితంలో మాత్రం బ్యాడ్‌బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు. చాలా మంది అమ్మాయిలతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ను ఏర్పరచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయ్. షాహీన్ ప్రైవేట్ చాట్ స్క్రీన్ షాట్‌ను ఓ బాధితురాలు పోస్ట్ చేసింది. అమ్మాయిల్ని ట్రాప్ చేయడంలో అఫ్రిది ముందుంటాడని ఆమె ఆరోపించింది. షేన్ వార్న్ : సెక్స్ స్కాండల్ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్. క్రికెట్ చరిత్రలో మేటి స్పిన్నర్‌గా నిలిచిపోయిన వార్న్ కెరీర్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అతను హాంప్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కొందరు మోడళ్లతో సరసాలాడడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మెల్బోర్న్లో హోటల్ గదిలో పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఇక యాషెస్ సిరీస్ లో భాగంగా.. బ్రిటిష్ నర్సును లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి హర్షలే గిబ్స్: దక్షిణాఫ్రికా ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న హర్షలే గిబ్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేవాడు. అమ్మాయిలతో తాను ప్రవర్తించిన తీరును గిబ్స్ తన తన ఆత్మకథ (టు ది పాయింట్) లో స్వయంగా వెల్లడించడం విశేషం. ఆ ఆత్మకథలో తాను మహిళలతో ప్రవర్తించిన తీరును గూర్చి వివరించడం వివాదాలకు దారి తీసింది. క్రిస్ గేల్: యూనివర్సల్ బాస్ అని ముద్దుగా పిలుచుకునే క్రిస్ గేల్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఎంజాయ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన గేల్.. 2012లో శ్రీలంక వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ సమయంలో ముగ్గురు బ్రిటిష్ మహిళలను తన హోటల్ గదులకు బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. హోటల్ బాడీగార్డ్ సాయంతో ఆ ముగ్గురు మహిళలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజమనేది తెలియరాలేదు. కెవిన్ పీటర్సన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్.. కెవిన్ పీటర్సన్ కూడా సెక్స్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికా 'బిగ్ బ్రదర్' సెలబ్రిటీ వెనెస్సా నిమ్మోతో ఎఫైర్ కలిగి ఉన్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇది పీటర్సన్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇయాన్ బోథమ్: క్రికెట్ లో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సర్ ఇయాన్ బోథమ్ కూడా సెక్స్ ఆరోపణలు ఎదుర్కోవడం విశేషం. మైదానంలో హుందాగా ప్రవర్తించే ఈ క్రికెటర్ బయట అపకీర్తిని మూటగట్టుకున్నాడు. భోథమ్ తన భార్యను మోసం చేస్తూ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేగాక బోథమ్‌కు ఆస్ట్రేలియన్ వెయిట్రెస్‌తో కూడా ఎఫైర్ ఉంది.ఇక మాజీ మిస్ యునివర్స్ బార్బడోస్ లిండీ ఫీల్డ్‌తో భోథమ్ నడిపిన అఫైర్ 1980లలో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసింది. మహ్మద్ షమీ: టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై ఇలాంటి ఆరోపణలు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. స్వయంగా షమీ భార్య హసిన్ జహాన్ .. నా భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ పేర్కొనడం సంచలనం సృష్టించింది. దీంతో షమీ ఇబ్బందుల్లో పడ్డాడు. అతను ఇతర మహిళలతో షమీ చాట్ చేస్తున్న ఫోటోలను జహాన్ మీడియాతో పంచుకుంది. ప్రస్తుతం వీరిద్దరు వేరువేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. చదవండి: Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్ స్మిత్! -
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్ స్మిత్!
Cricket Australia Confirms Steve Smith To Replace Tim Paine As Test Captain.. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌ను సంప్రదించినట్లు రిపోర్ట్స్‌లో వెల్లడైంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్ ఆసీస్ టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశాలే ఎక్కువని జోరుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా స్మిత్ పేరు మరోసారి బయటికి రావడంతో ఆసక్తి నెలకొంది. చదవండి: Pat Cummins : ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్..! కాగా స్టీవ్ స్మిత్ 2015-18 కాలంలో ఆస్ట్రేలియాకు టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మంచి విజయాలు అందుకుంది. అయితే 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోటెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ ఉదంతం స్మిత్ కెరీర్‌ను పాతాళంలోకి నెట్టింది. బెన్‌క్రాప్ట్‌తో కలిసి వార్నర్, స్మిత్ బాల్ టాంపరింగ్ చేశారని నిరూపితం కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేదం.. బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు బహష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు స్మిత్ ఒక ఏడాది పాటు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టకూడదంటూ మరో నిర్ణయం తీసుకుంది. ఇక నిషేధం ముగిసిన తర్వాత జట్టులోకి వచ్చిన స్మిత్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. చదవండి: యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. వరల్డ్‌కప్ హీరోకు నో ఛాన్స్ ఇక 2017లో ఆటగాడిగా ఉన్న సమయంలో మహిళతో అసభ్యకర చాటింగ్ చేశాడని టిమ్ పైన్‌పై ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనని ఒప్పుకున్న టిమ్ పైన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. కీలకమైన యాషెస్ సిరీస్‌కు ముందు పైన్ కెప్టెన్సీ వదిలేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేదానిపై తర్జనభర్జనలో ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డులో ఉన్న పలువురు అధికారులు స్మిత్ పేరును ప్రతిపాదించారు. కెప్టెన్‌గా కమిన్స్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయంగా స్మిత్ కనిపిస్తున్నాడని.. పైగా అతనికి టెస్టుల్లో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉందని వారు పేర్కొన్నారు. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా ఒకవేళ అన్ని కలిసివస్తే స్టీవ్‌స్మిత్‌ను మరోసారి ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా చూసే అవకాశం ఉంది. స్టీవ్ స్మిత్ టెస్టు కెప్టెన్‌గా 34 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 18 విజయాలు.. 10 పరాజయాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా టెస్టు కెప్టెన్‌గా స్మిత్‌కు 52.9% సక్సెస్ ఉండడం విశేషం. 2010లో ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన స్టీవ్ స్మిత్ 77 టెస్టులు, 128 వన్డేలు, 52 టి20లు ఆడాడు. -
ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్..!
Pat Cummins certain to take over Australias captaincy for the Ashes: ఓ మహిళకు అసభ్యకర సందేశాలు పంపాడన్న ఆరోపణల నేపథ్యంలో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి టిమ్‌పైన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. పైన్ రాజీనామా నేపథ్యంలో కొత్త సారథి ఎవరన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఆసీస్ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అదేవిధంగా ఆసీస్ టెస్ట్ వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను నియమించే అవకాశం ఉంది. ఇక ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే టిమ్‌పైన్ సారథ్యంలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టులో కమిన్స్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టిమ్ పైన్‌కు జట్టులో స్థానం ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది. ఒక వేళ కమిన్స్ ఆసీస్ సారథ్య బాధ్యతలు చేపడితే అది ఒక చరిత్ర కానుంది. ఎందుకంటే 1964 తర్వాత నుంచి ఆస్ట్రేలియా కు ఒక బౌలర్ ఆ జట్టుకు కెప్టెన్సీ చేపట్టలేదు. 1964లో ఆసీస్ కెప్టెన్‌గా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్‌గా రిచి బెనాడ్ బాధ్యతలు చేపట్టాడు. ఇక కమిన్స్ చరిత్రను తిరిగి రాయనున్నాడో లేదో వేచి చూడాలి. చదవండి: IND Vs NZ 2nd T20 : రోహిత్ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే? -
మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆస్ట్రేలియా కెప్టెన్సీకి టిమ్ పైన్ రాజీనామా
Tim Paine Announces Resignation as Australian Test Cricket Captain Over Private Text Exchange: యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఓ మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపడాన్న ఆరోపణల నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి పైన్ తప్పుకున్నాడు. "ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న నా నిర్ణయాన్ని ఈరోజు ప్రకటిస్తున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ నాకు, నా కుటుంబానికి, మాజట్టుకు సరైన నిర్ణయం” అని టిమ్ పైన్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. 2017 లో తన సహోద్యోగికు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు అతడు వెల్లడించాడు. ఈ సంఘటనపై విచారణ జరుగుతుందిని, ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నాని టిమ్ పైన్ తెలిపాడు. ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. "టిమ్ పైన్ ఆస్ట్రేలియా పురుషుల టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీనిపై మరింత సమాచారం త్వరలో అందిస్తాం అని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. కాగా 2017లో ఓ మహిళకు అసభ్యకరమైన రీతిలో మేసేజ్‌లు పంపాడాన్న ఆరోపణలు పైన్‌పై వచ్చాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా.. నిజమేనని ధృవీకరించింది. కాగా యాషెస్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. #BREAKING: Tim Paine has announced he will step down as Captain of the Australian Test team. He read a statement but did not take any questions from the media.@WINNews_Tas pic.twitter.com/57fBcDKvZp — Brent Costelloe (@brentcostelloe) November 19, 2021 -
మిమ్మల్ని ఎవరూ రమ్మని బలవంతం చేయడం లేదు: టిమ్ పైన్
Tim Paine Comments On England Key Players: ఇంగ్లండ్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ కీలక వాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు లేకపోయినా ఈ ఏడాది యాషెస్ సిరీస్ తప్పక జరుగుతుందని అతడు తెలిపాడు. ఈ వారంలోపు యాషెస్‌లో పాల్గోనే జట్టును ఇంగ్లండ్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పైన్ వెల్లడించాడు. కాగా ఇటీవల కాలంలో ఇంగ్లండ్ అగ్రశ్రేణి ఆటగాళ్లు కెప్టెన్ జో రూట్, జోస్ బట్లర్, జేమ్స్ ఆండర్సన్ బయో-బబుల్ ఆంక్షలను సడలించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే వీళ్ల అభ్యర్ధను అసీస్ ప్రభుత్వం నిరాకరించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన టిమ్ పైన్ ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ తీరుపై పెదవి విరిచాడు. "వాళ్లు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎవరూ మిమ్మల్ని రమ్మని బలవంతం చేయడం లేదు. మీరు రాకూడదనుకుంటే, రాకండి. అయినా యాషెస్ సీరీస్ ముందుకు వెళ్తోంది. మొదటి టెస్ట్ డిసెంబర్ 8 న జరుగుతుంది. జో రూట్ ఇక్కడ ఉన్నా లేకపోయినా, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇక్కడకు వస్తారు అనుకుంటున్నా. మేం మెరుగైన సౌకర్యాలే కల్పిస్తాం. ఎందుకంటే మీతో పాటు మేం కూడా అవే నిబంధనలు(బయో బబుల్) పాటించాలి కదా " అని టిమ్ పైన్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది డిసెంబర్లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. రెండు దేశాల మధ్య ప్రసిద్ధ యాషెస్ సిరీస్ జరగనుంది. అయితే అంతకు ముందు సిరీస్‌కు వ్యతిరేకంగా ఇంగ్లీష్ ఆటగాళ్లు తిరుగుబాటు మొదలు పెట్టడంతో యాషెస్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చదవండి:Chris Gayle: అందుకే నేను తప్పుకొంటున్నా... -
కివీస్‌కు క్షమాపణలు చెప్పిన ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ న్యూజిలాండ్ జట్టుకు క్షమాపణలు చెప్పాడు. ఇటీవలే ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మొదలవ్వకముందు టీమిండియానే విజేతగా నిలుస్తుందని పైన్ అంచనా వేశాడు. కానీ అతని అంచనాలకు భిన్నంగా కివీస్ సూపర్ విక్టరీ సాధించి టెస్టు చాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో కివీస్‌ను అభినందించిన పైన్ తన అంచనా తప్పినందుకు క్షమించాలంటూ న్యూజిలాండ్‌ను కోరాడు. ''ఒక్కోసారి మనం వేసుకునే అంచనాలు తప్పడం సహజమే. ఏడాదిన్నరగా టీమిండియా అద్భుత ఫామ్‌లో ఉండడంతో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను భారత్ గెలుస్తుందని అంచనా వేసుకున్నా. కానీ నేను అనుకున్నదానికంటే కివీస్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. నిజానికి కివీస్‌కు కీలక మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ద్వారా మంచి ప్రాక్టీస్ లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న విలియమ్సన్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టింది. ఒక చిన్న ద్వీపంలా కనిపించే కివీస్ ఈ అద్భుత ఫీట్‌ను సాధించడం ఆనందంగా ఉంది. నా అంచనా తప్పినందుకు మరోసారి క్షమాపణ అడుగుతున్నా'' అంటూ ముగించాడు. ఇదే టిమ్ పైన్ గతంలో టీమిండియా ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలిచినప్పుడు.. టీమిండియా మమ్మల్ని మోసం చేసి సిరీస్ గెలిచిదంటూ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 249 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 139 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కివీస్ జట్టు భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. చదవండి: కోహ్లి.. ఇంకా ఎన్నాళ్లు ఈ నిరీక్షణ టీమిండియా చీటింగ్ చేసి సిరీస్ గెలిచింది: పైన్ -
టీమిండియానే ప్రపంచ ఛాంపియన్.. ఆసీస్ కెప్టెన్ జోస్యం
సిడ్నీ: మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియానే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందని ఆసీస్ టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ జోస్యం చెప్పాడు. తుది సమరంలో ప్రత్యర్ధి న్యూజిలాండ్ కూడా బలమైన జట్టే అయినప్పటికీ.. భారత్‌కే అవకాశలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ మెగా పోరులో టీమిండియా తమ సహజసిద్ధమైన క్రికెట్ ఆడినా న్యూజిలాండ్‌పై అలవోకగా నెగ్గగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా కూడా భారత్‌లాగే బలమైన బ్యాకప్ జట్టును కలిగి ఉండాలని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కాగా, ఇటీవల కాలంలో టీమిండియాపై తరుచూ విమర్శలు చేస్తూ వస్తున్న పైన్, భారత్‌పై సానుకూలంగా స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఆసీస్ గతేడాది స్వదేశంలో భారత్, న్యూజిలాండ్ జట్లతో చెరో టెస్ట్ సిరీస్ ఆడింది. వీటిలో కివీస్‌పై 3-0తేడాతో నెగ్గిన మాజీ ప్రపంచ ఛాంపియన్.. భారత్ చేతిలో మాత్రం 1-2తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న కివీస్‌పై విశ్లేషకులు భారీ అంచనాలు కలిగి ఉన్నారు. కివీస్ జట్టు అన్ని రంగాల్లో భారత్ కంటే పటిష్టంగా ఉందని, మరి ముఖ్యంగా ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులకు కివీస్ ఆటగాళ్లు బాగా అలవాటు పడ్డారని, ఇదే వారి విజయానికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 18న ఐసీసీ టాప్ టూ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. చదవండి: కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్.. షెడ్యూల్ ప్రకటించిన నిర్వహకులు -
బాల్ టాంపరింగ్ వివాదం సద్దుమణిగినట్టే: ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియాలో పెను దుమారం రేపిన బాల్ టాంపరింగ్ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగిందని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ వెల్లడించాడు. బాన్‌క్రాఫ్ట్‌తో బౌలర్లు సమావేశమై సమస్యను పరిష్కరించుకున్నారని అతను ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విలేఖరులు అడిన ప్రశ్నలకు తికమక పడిన బాన్‌క్రాఫ్ట్.. ఒత్తిడిలో అలా మాట్లాడాడని, ఈ ఉదంతం గురించి బౌలర్లకు ముందుగానే తెలుసన్న విషయమై అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించాడు. కాగా, 2018లో వెలుగు చూసిన బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఘటనపై పునర్విచారణ జరిపేందుకు తాము సిద్దమని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది.దీంతో నాటి జట్టులో సభ్యులైన కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్‌లు బాన్‌క్రాఫ్ట్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఈ ముగ్గురు బౌలర్లు ఆ వివాదంలో తమ పాత్ర ఏమీ లేదంటు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకులో ఏదో సమాధానం చెప్పానని బాన్‌క్రాఫ్ట్ తమకు వివరణ ఇచ్చాడని వారు పేర్కొన్నారు. ఈ విషయమై బాన్‌క్రాఫ్ట్ కూడా అదే సమాధానం చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తనను సంప్రదించిన సీఏ ఇంటిగ్రిటీ యూనిట్‌కు వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. కాగా, 2018లో కేప్‌టౌన్ వేదికగా ఆసీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బంతికి సాండ్ పేపర్ రుద్దుతూ కెమెరాల కంటపడ్డాడు. దీంతో అతనితో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై నిషేధం విధించారు. చదవండి: 500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం.. -
కోహ్లి అత్యుత్తమ ఆటగాడు.. మాట మార్చిన ఆసీస్ కెప్టెన్
మెల్బోర్న్: ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత జట్టు మోసం చేసి గెలిచిందని, రెండేళ్ల కిందట కోహ్లి సాధారణ ఆటగాడు మాత్రమేనని, అతన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ టెస్ట్ సారధి టిమ్ పైన్.. మాట మార్చాడు. అతని వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ప్రపంచపు అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని కొనియాడాడు. అసలుసిసలైన పోటీతత్వం కలిగినకోహ్లిని కలకాలం గుర్తుంచుకుంటానన్నాడు. కోహ్లితో పోటీ ఎప్పటికీ మజానిస్తుందని పేర్కొన్నాడు. కోహ్లి లాంటి ఆటగాడు జట్టులో ఉండాలని ఏ కెప్టెన్ అయినా కోరుకుంటాడని తెలిపాడు. మైదానంలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు ఆటలో భాగమని, తాము దాన్ని ఆస్వాధిస్తామని వెల్లడించాడు. కాగా టిమ్ పైన్, కోహ్లిల మధ్య నాలుగేళ్ల క్రితం ఓ మ్యాచ్‌లో వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కోహ్లి గైర్హాజరీలో టీమిండియా ఈ ఏడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫిని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. చదవండి: బట్లర్ జట్టులో విధ్వంసకర వీరులకు దక్కని చోటు -
సోషల్ మీడియా ప్రభావం.. మాట మార్చిన పైన్
సిడ్నీ: టీమిండియా మమ్మల్ని చీట్ చేసి సిరీస్ గెలిచిందంటూ ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పైన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. పైన్ తీరును విమర్శిస్తూ నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. సోషల్ మీడియా ప్రభావంతో పైన్ దెబ్బకు మాట మార్చేశాడు. ''సిరీస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. వాటికి మాత్రమే నేను సమాధానం చెప్పా. టీమిండియా జట్టు బ్రిస్బేన్ వెళ్లరంటూ మాకు వార్తలు వచ్చాయి. మమ్మల్ని పక్కదారి పట్టించేందుకే టీమిండియా అలా చెప్పిందేమో అనుకున్నా. దీనికి తోడు మూడో టెస్టులో మ్యాచ్ మధ్యలో టీమిండియా బ్యాట్స్‌మన్ ప్రతీసారి గ్లౌజ్‌లు తీస్తూ.. ఫిజియోను రప్పించి ఏవోవో మాట్లాడుకున్నారు. ఇదంతా మా ఏకాగ్రతను దెబ్బతీసేందుకేమోనని భావించా. అందుకే సైడ్ షోస్ అనే పదం వాడాల్సి వచ్చింది. అంతేగానీ టీమిండియా చీటింగ్ చేసి సిరీస్ గెలిచిందనలేదు. మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత పట్టు బిగించాల్సింది. కానీ టీమిండియా అద్బుత ప్రతిభతో సిరీస్‌ను ఎగురేసుకుపోయింది. నేను చేసిన వ్యాఖ్యలను భారత అభిమానులు తప్పుగా భావించి ట్రోల్ చేశారు. కానీ ఇలాంటివి నేను పట్టించుకోను.. ఎందుకంటే భారత అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం. వారు ఏం చేసినా నేను సరదాగానే తీసుకుంటాను. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న గౌరవం ఏంటో తెలిసొచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయంతో టీమిండియా సిరీస్‌ను ఆరంభించింది. ఆ తర్వాత కోహ్లి పెటర్నిటీ లీవ్స్‌పై స్వదేశానికి తిరిగి వచ్చేయడం.. పలువురు సీనియర్ ఆటగాళ్లు గాయపడడంతో టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవడం కష్టమేనని అంతా భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ రహానే సారధ్యంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘన విజాయన్ని సాధించింది. ఆ తర్వాత మూడో టెస్టు డ్రా చేసకున్నా.. గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకోవడమేగాక బోర్డర్ గవాస్కర్ ట్రోపీని కూడా చేజెక్కించుకుంది. ఈ సిరీస్ మొత్తంగా చూసుకుంటే రిషబ్ పంత్, సుందర్, శుబ్‌మన్ గిల్, సిరాజ్‌లు అద్భుతంగా రాణించి సిరీస్ గెలవడంలో కీలకపాత్ర వహించారు. చదవండి: టీమిండియా చీటింగ్ చేసి సిరీస్ గెలిచింది: పైన్ Things Paine Loves to do. https://t.co/NSuwhIZHMp pic.twitter.com/RznJUGJ5Jz — Mahi (@i_stanKohli18) May 13, 2021 Tim Paine after Gabba loss : Indians are very good at distracting & Niggling Indian fans be like - #TimPaine pic.twitter.com/egNpSGlMp3 — Ankit Anand (@iamankitanands) May 13, 2021 Australian Cricket Greats Vs. Tim Paine pic.twitter.com/uJA8BuO39x — Godman Chikna (@Madan_Chikna) May 13, 2021 India very good at creating “sideshows” ! - Tim Paine Indians - #gabba #timpaine #RishabhPant pic.twitter.com/Dzo6egAMqJ — ICT FAN💙 (@Spellbounded17) May 13, 2021 Gabba We reading Tim Paine Comments after winning Historical Test Series pic.twitter.com/TmnDUELPUU — How Football Saved Humans - Great Book to Read (@HowHumans) May 13, 2021 -
టీమిండియా చీటింగ్ చేసి సిరీస్ గెలిచింది: పైన్
సిడ్నీ: గతేడాది ఆసీసీ గడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోపీని టీమిండియా 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో సిరీస్ ముగిసి దాదాపు ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తమ దృష్టి మళ్లించడంతోనే సిరీస్ ఓడిపోయామంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ''టీమిండియా మమ్మల్ని పక్కదారి(సైడ్ షోస్) పట్టించిన విధానం సూపర్‌గా ఉంది. మూడో టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా మొదట గబ్బాకు వెళ్లమని చెప్పారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా నాలుగో టెస్టును ఎక్కడ నిర్వహించాలా అనే ఆలోచనలో పడింది. ఇంతలో ఏమైందో కానీ మళ్లీ మనసు మార్చుకొని గబ్బాలో ఆడుతామని టీమిండియానే పేర్కొంది. ఇలా మా ఏకాగ్రతను దెబ్బతీసేందుకే టీమిండియా మమ్మల్ని పక్కదారి పట్టించింది. అందుకే మ్యాచ్‌పై సరిగ్గా దృష్టి పెట్టలేక ఓడిపోయాం.. అలా ఈ విషయంలో చీటింగ్ చేసి టీమిండియా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా ఎగురేసుకుపోయింది.'' అంటూ కామెంట్లు చేశాడు. కాగా టిమ్ పైన్ వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ''దొంగల పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లుందని.. సిరీస్ ముగిసిన వెంటనే ఎందుకు ఇలా అనలేదు... మీరు చేసే చీటింగ్‌లలో మేమెంత..'' అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు. ఇక అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయంతో టీమిండియా సిరీస్‌ను ఆరంభించింది. ఆ తర్వాత కోహ్లి పెటర్నిటీ లీవ్స్‌పై స్వదేశానికి తిరిగి వచ్చేయడం.. పలువురు సీనియర్ ఆటగాళ్లు గాయపడడంతో టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవడం కష్టమేనని అంతా భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ రహానే సారధ్యంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘన విజాయన్ని సాధించింది. ఆ తర్వాత మూడో టెస్టు డ్రా చేసకున్నా.. గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకోవడమేగాక బోర్డర్ గవాస్కర్ ట్రోపీని కూడా చేజెక్కించుకుంది. ఈ సిరీస్ మొత్తంగా చూసుకుంటే రిషబ్ పంత్, సుందర్, శుబ్‌మన్ గిల్, సిరాజ్‌లు అద్భుతంగా రాణించి సిరీస్ గెలవడంలో కీలకపాత్ర వహించారు. చదవండి: WTC FInal: భారత్‌కు ‘సన్నద్ధతలేమి’ సమస్య కాదు 'చాలా థ్యాంక్స్.. మమ్మల్ని బాగా చూసుకున్నారు' -
'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్ చేయండి'
సిడ్నీ: టీమిండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో ఆసీస్ 2-1 తేడాతో ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌పై నోరు పారేసుకొని కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయాలంటూ సీఏకు సూచించాడు. ప్రస్తుతం కమిన్స్ టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.చదవండి: టాప్‌లో కోహ్లి.. రెండుకే పరిమితమైన రోహిత్ 'ఆసీస్ జట్టులో ప్రస్తుతం కమిన్స్‌కు కెప్టెన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అతను ఫాంలో ఉంటే ఎంతలా రెచ్చిపోతాడనేది టీమిండియాతో జరిగిన సిరీస్ అందుకు నిదర్శనం. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కమిన్స్ తన ప్రవర్తనతోనూ ఆకట్టుకున్నాడు. టిమ్ పైన్ కెప్టెన్సీని నేను తప్పుబట్టలేను.. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో మాత్రం అతను ఒక కెప్టెన్‌గా తన చర్యలతో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే కమిన్స్ కెప్టెన్‌ను చేయాలంటే స్మిత్, వార్నర్, హాజిల్‌వుడ్, నాథన్ లయన్ లాంటి ఉన్న సీనియర్ ఆటగాళ్ల మద్దతు కావాల్సిందే.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్ జట్టుకు పరిమిత ఓవర్లతో పాటు టీ20ల్లో ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో ప్రపంచ నెంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతున్న కమిన్స్ 34 టెస్టుల్లో 164, 69 వన్డేల్లో 111, 30 టీ20ల్లో 37 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ బౌలర్‌గా మంచి క్రేజ్ ఉన్న కమిన్స్‌ను 2019 డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్ జట్టు రూ. 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. చదవండి: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం -
స్పైడర్మాన్ అంటూ రిషభ్ పాట.. వైరల్
బ్రిస్బేన్: గత సిరీస్‌లో ఆసీస్ కెప్టెన్, రిషభ్ పంత్ మధ్య జరిగిన ‘బేబీ సిట్టర్’ సంభాషణపై ఆసక్తికర చర్చ సాగింది. తాజా సిరీస్‌లో గత మూడు టెస్టుల్లోనూ పైన్‌తో పంత్ పెద్దగా పెట్టుకున్నట్లు కనిపించలేదు. కానీ చివరి పంచ్ అనుకున్నాడేమో సోమవారం పైన్‌ను ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. స్మిత్ అవుటై కెప్టెన్ క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో పంత్... ‘స్పైడర్మాన్, స్పైడర్మాన్’ అంటూ పాడటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా అదే సినిమా హిందీ డబ్బింగ్ పాటను కొనసాగిస్తున్నట్లు నా మనసు నువ్వే దోచుకున్నావంటూ ‘తూనే చురాయా మేరా దిల్ కా చైన్’ అంటూ పాటను పాడటం భారత బృందంలో నవ్వులు పుట్టించింది. కాగా, రిషభ్ పంత్ (138 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు) రాణించడంతో బ్రిస్బేన్ టెస్టులో భారత్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది. దాంతోపాటు 2-1 తో బోర్డర్ గావస్కర్ ట్రోఫిని వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రిషభ్ పంత్ నిలిచాడు. 21 వికెట్లు ఖాతాలో వేసుకున్న ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇక సోమవారం నాటి ఆటలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో రిషభ్‌పంత్ సాగించిన ‘స్పైడర్ మాన్’ పాటకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. (చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది : పంత్) రోహిత్... స్మిత్‌లా: సిడ్నీ టెస్టులో పంత్ బ్యాటింగ్ గార్డ్ చెరిపేసే ప్రయత్నం స్మిత్ చేసినట్లు వార్తలు రావడం, తాను షాడో ప్రాక్టీస్ మాత్రమే చేసినట్లు స్మిత్ చెప్పడం తెలిసిందే. ఇప్పుడు రోహిత్ శర్మ ఇలాగే తన చేతలతో స్మిత్‌ను కాస్త ఉడికించే ప్రయత్నం చేశాడు. స్మిత్ క్రీజ్‌లో ఉన్న సమయంలో అతని ఎదురుగా రోహిత్ పిచ్ పైకి వెళ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి చూపించాడు! నువ్వు చేసింది ఇదేనా అనే అనే భావం అందులో కనిపించింది. (చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్: భారత జట్టు ఇదే!) Rishab pant singing from behind the stumps "Spiderman Spiderman Tune churaya mera dil ka chain 🤣🤣😍😍 What a entertainer he is 🤣😍@RishabhPant17 pic.twitter.com/mnKpVSKstT — AVinash_RAo (@Avinash21181121) January 18, 2021 Rohit doing a Steve Smith 😛😂😂@ImRo45#INDvsAUSTest #IndiavsAustralia #AUSvsIND #RohitSharma pic.twitter.com/W1t1GiyCLG — D s 45 (@imDs45) January 18, 2021 -
'అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా'
సిడ్నీ: టీమిండియాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ భారత్ బౌలర్ అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో పైన్ తన ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పుకున్నాడు. భారత స్పిన్నర్ అశ్విన్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టిమ్ పైన్ మాట్లాడాడు. (చదవండి: ‘భారత్‌కు వచ్చినప్పుడు చూపిస్తా’) 'అశ్విన్‌తో అలా ప్రవర్తించి ఉండకూడదు..నా చర్యకు సిగ్గుపడుతున్నా.భవిష్యత్‌లో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటానన్నాడు.తన మాటలతో తప్పుడు సంకేతాలిచ్చానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మైదానంలో స్టంప్‌మైక్ ఉంటుందన్న విషయం తెలిసి కూడా దురదృష్టవశాత్తూ నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చాను. అది తెలిసి చాలా బాధపడ్డాను. ఆటలో జాగ్రత్తగా ఉండాలని నిన్న జరిగిన చర్యతో తెలుసుకున్నాడు. భవిష్యత్తులో ఇలా జరగకుండా మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తా.' అని పైన్ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి నుంచి గట్టెక్కిన విషయం తెలిసిందే. హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ నిలకడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే ఈ ఇద్దరి బ్యాటింగ్‌కు విసిగిపోయిన పైన్.. స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. కాగా ఆటలో భాగంగా మూడోరోజు కూడా పైన్ పుజారా ఔట్ విషయంలోనూ ఫీల్డ్ అంపైర్ విల్సన్‌పై మండిపడిన విషయం తెలిసిందే. అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు పైన్‌పై ఐసీసీ నిబంధన 2.8 ప్రకారం మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించారు.(చదవండి: స్టీవ్ స్మిత్.. మళ్లీ చీటింగ్ చేశాడు..!) -
అశ్విన్‌కే సాధ్యమైంది...
ఛాతీపై, భుజాలపై, పొత్తి కడుపుపై, పక్కటెముకలపై, మోచేతిపై... ఇవేమీ శత్రువు కత్తి పోట్ల గాయాలు కావు! ఆస్ట్రేలియా బౌలర్లు సంధించిన పదునైన బంతుల కారణంగా అశ్విన్‌కు తగిలిన దెబ్బలు ఇవి. ‘ప్రతికూల పరిస్థితుల్లో మా అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది’... ఆదివారం ఈ వ్యాఖ్య చేసిన అశ్విన్ సోమవారం దానిని చేసి చూపించాడు. అతని భార్య ప్రీతి చెప్పినదాని ప్రకారం... రాత్రంతా వెన్ను నొప్పితో బాధపడిన అశ్విన్ సరిగా కూర్చోలేకపోయాడు. షూ లేస్ కట్టడం కూడా కష్టంగా మారింది. సోమవారం బ్యాటింగ్‌కు వెళ్లే ముందు, టీ విరామ సమయంలో కూడా అతను పూర్తిగా నిలబడే ఉన్నాడు. కానీ ఏం జరిగినా ఓటమిని అంగీకరించని అశ్విన్ తత్వం భారత్‌ను ఓటమి భారం నుంచి తప్పించింది. ఎలాగైనా మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాలని సంకల్పంతో బరిలోకి దిగిన అతను తన పట్టుదలను చూపించాడు.(స్టీవ్ స్మిత్.. మళ్లీ చీటింగ్ చేశాడు..!) ముగ్గురు టాప్ పేసర్లు విరుచుకుపడుతున్నా అతను వెన్ను చూపలేదు. చివరి సెషన్లో ఆసీస్ బౌలర్లు తొలి బంతి నుంచే బౌన్సర్లతో అశ్విన్‌పై విరుచుకుపడ్డారు. కమిన్స్ బంతి పక్కటెముకలకు తగిలిన సమయంలోనైతే అతను విలవిల్లాడిపోయాడు. ఫిజియో చికిత్స చేయాల్సి వచ్చింది. ఆపై పదే పదే తన చెస్ట్ గార్డ్‌ను సరి చేసుకుంటూ అతను జాగ్రత్త పడ్డాడు. ఏ బంతి ఆడినా ఫీల్డర్ చేతుల్లో పడుతుందేమో అన్నంత తీవ్ర ఒత్తిడిలో ఆడిన అశ్విన్ చివరకు తన బ్యాటింగ్ సత్తా ప్రదర్శించాడు. ఆసీస్ బౌలర్లకు మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకుండా కొన్ని చక్కటి షాట్లు ఆడి జట్టును గట్టెక్కించాడు. అశ్విన్ టెస్టు కెరీర్లో నాలుగు సెంచరీలు ఉన్నా... వాటితో పోలిస్తే ఇక్కడ సాధించిన పరుగుల విలువే ఎక్కువ! (విహారి పోరాటం అదిరింది.. ఆసీస్ అలసింది) -
‘భారత్‌కు వచ్చినప్పుడు చూపిస్తా’
పాపం...ఆసీస్ కెప్టెన్ పైన్‌కు ఏదీ కలిసి రాలేదు. గెలవాల్సిన మ్యాచ్ చేజారాక అందులో తాను మూడు క్యాచ్‌లు వదిలేయడం అతని బాధను రెట్టింపు చేసింది. పంత్ 3, 56 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌లను వదిలేసిన కెప్టెన్ చివర్లో విహారి క్యాచ్‌ను కూడా జారవిడిచాడు. చివర్లో అసహనం పెరిగిపోవడంతో అతను అశ్విన్‌ను స్లెడ్జింగ్ చేసే ప్రయత్నం చేసి భంగపడ్డాడు. ‘బ్రిస్బేన్‌లో నీ కోసం ఎదురు చూస్తుంటా’ అంటూ అశ్విన్‌ను రెచ్చగొట్టడంతో ‘భారత్‌లో కూడా నీ కోసం ఎదురు చూస్తా. అదే నీకు చివరి సిరీస్ అవుతుంది’ అంటూ అశ్విన్ ఘాటుగా బదులిచ్చాడు. దాంతో మరింత ఆగ్రహంగా ‘నాపై నా జట్టుకు నమ్మకముంది’ అంటూ బూతును ప్రయోగించాడు. అయితే ఏం చేసినా అశ్విన్ ఏకాగ్రతను భంగపర్చలేకపోయాడు. విహారి జతగా ఔట్ కాకుండా అజేయంగా నిలిచిన అశ్విన్ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. -
'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్ అంపైర్‌ది'
సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఫీల్డ్ అంపైర్ విల్సన్‌పై అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సమయంలో చతేశ్వర్ పుజారా ఔట్ అంటూ టిమ్ పైన్ డీఆర్ఎస్ కోరాడు. అయితే నిర్ణయం తనకి వ్యతిరేకంగా రావడంతో సహనం కోల్పోయి ఫీల్డ్ అంపైర్ విల్సన్‌తో వాదనకి దిగాడు. తొలుత సర్దిచెప్పే ప్రయత్నం చేసిన విల్సన్.. టిమ్ పైన్ నోరు జారడంతో విల్సన్ కూడా సీరియస్‌గానే బదులిచ్చాడు. (చదవండి: ఒకవేళ అక్కడ సచిన్ ఉంటే పరిస్థితి ఏంటి?) ఇక అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 56వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజారా.. బంతిని ముందుకు ఫుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. అతను ఊహించని విధంగా టర్న్, బౌన్స్ అయిన బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్లి పుజారా శరీరాన్ని తాకి.. అనంతరం షార్ట్ లెగ్‌లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ వెడ్ బంతిని క్యాచ్‌గా అందుకోగా.. ఔట్ కోసం ఆస్ట్రేలియా అప్పీల్ చేసింది. కానీ.. ఫీల్డ్ అంపైర్ విల్సన్ ఆ ఔట్ అప్పీల్‌ని తిరస్కరించాడు. దాంతో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ డీఆర్ఎస్ కోరాడు.(చదవండి: వాటే సెన్సేషనల్ రనౌట్..!) అయితే రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకినట్లు హాట్‌స్పాట్, స్నికో మీటర్లో ఎక్కడా కనిపించలేదు. దాంతో థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్‌ఫర్ట్ తుది నిర్ణయానికి రాలేక నిర్ణయాధికారం ఫీల్డ్ అంపైర్‌కే వదిలేశాడు. అప్పటికే విల్సన్ నాటౌట్ ఇచ్చి ఉండటంతో.. అతను అదే నిర్ణయానికి కట్టుబడగా సహనం కోల్పోయిన పైన్ అసహనం వ్యక్తం చేస్తూ బూతులందుకున్నాడు. పైన్ మాటలు విన్న అంపైర్ విల్సన్ 'ఆ నిర్ణయం థర్డ్ అంపైర్ తీసుకున్నాడు నేను కాదు' అంటూ కోపంగా బదులిచ్చాడు. -
ముంబైలో ఆడమన్నా ఆడతాం: ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: మ్యాచ్ ఎక్కడ నిర్వహిస్తారన్న అంశతో సంబంధం లేకుండా కేవలం ఆటపై దృష్టి సారించడం మాత్రమే తమ నైజమని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జరిగినా, ముంబైలో జరిగినా తమకు తేడా ఉండదని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రపంచంలో శక్తిమంతమైన బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న టిమ్ పైన్.. ప్రత్యర్థి జట్టు శిబిరం నుంచి వస్తున్న వార్తలు కాస్త గందరగోళానికి గురిచేస్తున్నాయన్నాడు. చివరి టెస్టు వేదిక ఎక్కడన్న విషయం గురించి తాము ఆలోచించడం లేదని, ప్రస్తుతం జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించాడు.(చదవండి: చిత్తుగా ఓడిన పాక్: నంబర్ 1 జట్టుగా కివీస్) కాగా ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఆసీస్- టీమిండియా మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని భారత ఆటగాళ్లు స్పష్టంగా చెప్పేశారు. అంతేగాక ఈ టెస్టు ఆడకుండానే స్వదేశానికి వెళ్తామని కూడా కొంతమంది హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్రమంలో టిమ్ పైన్ మాట్లాడుతూ.. ప్రొటోకాల్ పాటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు. (చదవండి: మళ్లీ ఆంక్షలా... మా వల్ల కాదు!) ‘‘సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇరు జట్లు వరుస సిరీస్‌లతో బిజీ అయ్యాయి. టెస్టు క్రికెట్ ఆడుతున్నాయి. రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవే. అంతేకాదు పరస్పర గౌరవంతో ముందుకు సాగుతాయి. అయితే కొన్ని రోజులుగా అవతలి వైపు శిబిరం నుంచి వినిపిస్తున్న మాటలు చిరాకైతే తెప్పించడం లేదు గానీ.. కాస్త అసాధారణంగా అనిపిన్నాయి. ఏదేమైనా మూడో టెస్టుపైనే ప్రస్తుతం మేం దృష్టి సారించాం’’ అని టిమ్ పైన్ చెప్పుకొచ్చాడు. కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. -
అతడు కచ్చితంగా మాటల యుద్ధానికి దిగుతాడు: కైఫ్
సిడ్నీ: అడిలైడ్ వేదికగా డిసెంబరు 17 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా- ఆసీస్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. తొలి డే- నైట్ టెస్టుకు ముందు వార్మప్ మ్యాచ్‌ల ద్వారా ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీసు దొరికింది. ఈ మ్యాచ్ భారత జట్టు కూర్పునకు దోహదం చేయగా.. ఆఖరి రోజు ఆస్ట్రేలియా ‘ఏ’ బ్యాట్స్‌మన్ అదరగొట్టినప్పటికీ గాయాల బెడద ఆ జట్టుకు సమస్యగా మారింది. ముఖ్యంగా ఓపెనర్ల అంశం కంగారూలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వార్నర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. యువ ఓపెనర్ పకోవ్‌స్కీ కన్షన్ కాగా.. అతడి స్థానంలో వచ్చిన హారిస్ విఫలమయ్యాడు. (చదవండి: 5 మిలియన్ల ప్రేమ; అత్యధికులు వాళ్లే: వార్నర్) దీంతో ఓపెనింగ్ సమస్య ఆసీస్‌కు పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్నెట్వర్క్తో మాట్లాడుతూ.. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కచ్చితంగా స్లెడ్జింగ్‌కు దిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అదే సమయంలో ఫించ్, వార్నర్, స్మిత్ వంటి ఆటగాళ్లు మాత్రం సంయమనంగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చాడు. వారంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు కావడమే ఇందుకు కారణం అని పేర్కొన్నాడు. ‘‘ ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లు ఆరోన్ ఫించ్ గానీ, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్ వంటి వాళ్లు భారత ఆటగాళ్లతో వాగ్యుద్దానికి దిగే అవకాశమే లేదు. కానీ టిమ్ పైన్ అలా కాదు. అతడు ఐపీఎల్ ఆడటం లేదు. (చదవండి: వైరల్: కూల్ కెప్టెన్.. అంతగా ఆవేశపడితే ఎలా!!) ఇండియాకు వెళ్లే అవసరం లేదని తనకు తెలుసు. కాబట్టి కచ్చితంగా రెచ్చిపోతాడు. భారత ఆటగాళ్లను ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఐపీఎల్‌తో పాటు మరో కారణం కూడా ఉంది. నిజానికి స్మిత్, వార్నర్‌పై బాల్ టాంపరింగ్ వివాదంలో సస్పెండ్ అయినపుడు పైన్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ జట్టులో తిరిగి చోటు సంపాదించుకున్నారు. ఒకవేళ ఈ టెస్టు సిరీస్‌లో గనుక పైన్ బ్యాట్స్‌మెన్‌గా విఫలమైతే అతడిపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జట్టు సారథ్య బాధ్యతల విషయం పక్కన పెడితే తుదిజట్టులో స్థానం సంపాదించుకోవడమే కష్టంగా మారుతుంది. కాబట్టి అతడు వీలైనంత దూకుడు ప్రదర్శిస్తాడు’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. పర్యాటక జట్టుతో మాటల యుద్ధానికి దిగే బదులు ఆట మీద దృష్టి సారిస్తే కాస్తైనా ఫలితం ఉంటుందని హితవు పలికాడు. -
ఆ ఐదుగురిని తరలించారు
సిడ్నీ : కరోనా వైరస్ కేసుల కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు షెడ్యూల్ దెబ్బ తినరాదని భావించిన బోర్డు (సీఏ) వేగవంతంగా తగిన చర్యలు చేపట్టింది. కోవిడ్–19 సమస్య ఉన్న అడిలైడ్ నుంచి ప్రత్యేక విమానంలో తమ ఆటగాళ్లందరినీ సిడ్నీ (న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం)కి తరలించింది. సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలన్నీ తమ సరిహద్దులను మూసివేశాయి. సీఏ తరలించిన ఆటగాళ్లలో టెస్టు కెప్టెన్ టిమ్ పైన్, మార్నస్ లబ్‌షేన్, మాథ్యూ వేడ్, ట్రావిస్ హెడ్, గ్రీన్ ఉన్నారు. వీరితో పాటు ఆసీస్ ‘ఎ’ టీమ్, బిగ్ బాష్ లీగ్‌లో ఉన్న క్రికెటర్లను కూడా బోర్డు సురక్షిత ప్రాంతమైన సిడ్నీకి మార్చింది. దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో ఆడుతున్న పైన్ తదితరులు కరోనా పరిణామాల కారణంగా అడిలైడ్‌లోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా వీరంతా తమ సాధనపైనే దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని... అడిలైడ్ నుంచి తరలించకపోతే మున్ముందు మరింత సమస్య ఎదురయ్యేదని సీఏ పేర్కొంది. అయితే తొలి టెస్టు వేదికలో మాత్రం మార్పు ఉండదని మరోసారి స్పష్టం చేసింది. డిసెంబర్ 17 నుంచి అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అప్పటిలోగా పరిస్థితి అదుపులోకి వస్తుందని సీఏ ఆశిస్తోంది. సోమవారం నమోదైన 14 కొత్త కేసులతో పోలిస్తే సౌత్ ఆస్ట్రేలియాలో మంగళవారం 5 మాత్రమే రావడం ఊరట. -
‘టీమిండియా రాకపోతే.. తీవ్రంగా నష్టపోతాం’
సిడ్నీ: ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) దృష్టంతా భారత్‌పైనే ఉంది. కరోనా వైరస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉన్నప్పటికీ అక్కడ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అంతా సద్దుమణిగి క్రీడా టోర్నీలో కూడా ఆరంభమైతే కొన్ని బోర్డులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మళ్లీ గాడిన పడాలంటే భారత్ పర్యటన ఒక్కటే మార్గమంటున్నారు ఆ దేశ క్రికెటర్లు. ఈ సీజన్ చివర్లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యాటించాల్సి ఉండటంతో అది ఏమౌతుందోనని ఆసీస్ క్రికెటర్లు ఆందోళనలోనే ఉన్నారు. భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తేనే ఆర్థికంగా ఏర్పడ్డ నష్టాలను సీఏ పూడ్చుకోగలుగుతుందని టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కొన్ని రోజుల క్రితం పేర్కొనగా, తాజాగా ఆ దేశ స్టార్ ఆటగాడు లబూషేన్ సైతం ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ నిర్ణీత షెడ్యూల్లో భారత జట్టు పర్యటనకు రాకపోతే అది ఆర్థికపరమైన వినాశానికి దారి తీస్తుందన్నాడు. (‘టీమిండియా పర్యటనే మాకు శరణ్యం’) ఈ టోర్నీ జరగకపోతే తనతో పాటు జట్టుకు దేశానికి కూడా తీవ్ర నష్టమేనని లబూషేన్ వెల్లడించాడు. మరో 3నుంచి 4 నెలల్లో కానీ, 4 నుంచి 5 నెలల్లో కానీ అంతా చక్కబడుతుందని లబూషేన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ అదే జరిగితే ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ కచ్చితంగా వస్తుందన్నాడు. ఇటీవల టిమ్ పైన్ మాట్లాడుతూ.. టీమిండియా పర్యటనపై తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, తమ కష్టాలకు భారత పర్యటనతో ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నానని పైన్ అన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ రాకపోతే 250 నుంచి 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందన్నాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా-ప్రభుత్వం మధ్య ఇప్పటికే చర్చలు నడిచాయన్నాడు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా కొన్ని ఆంక్షల్ని సడలించడమే కాకుండా, చార్టెడ్ విమానాలు, ఐసోలేషన్ వంటివి టీమిండియా క్రికెటర్ల కోసం ప్రత్యేకం ఏర్పాటు చేస్తుందన్నాడు. కాగా, ఆస్ట్రేలియాలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. దాంతో లాక్డౌన్ రూల్స్‌ను కూడా సడలిస్తూ ముందుకు సాగుతోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలో 6,800 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతి చెందిన వారి సంఖ్య వంద కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. (అతని రీఎంట్రీ ఖాయం.. బెట్ వేస్తా: రాయుడు) -
‘టీమిండియా పర్యటనే మాకు శరణ్యం’
సిడ్నీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోన్న కరోనా వైరస్ ప్రభావం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై పడింది. ప్రపంచ ధనిక క్రికెట్ బోర్డుల్లో ఒకటైన సీఏ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఈ సంక్షోభంతో భారీ స్థాయిలో ఆటగాళ్ల జీతాల కోత విధింపుతో పాటు సిబ్బందిని కూడా తొలగించడానికి కూడా సీఏ సిద్ధమైంది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి జూన్ 30 వరకూ ఉద్యోగుల, కాంట్రాక్టర్ల జీతాల్లో 80 శాతం కోత విధించనున్నారు. అయితే ప్రస్తుతం సీఏను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటే టీమిండియాతో సిరీసే శరణ్యమని ఆ జట్టు టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. తమ ఆర్థిక కష్టాలు తీరాలంటే టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎలాగైనా రావడం ఒక్కటే మార్గమన్నాడు. (సరైన సమయంలో చెబుతాం) ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లాల్సి ఉంది. దీనిపై సీఏ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్ ఆఖర్లో భారత్-ఆస్ట్రేలియాల టెస్టు సిరీస్ సజావుగా సాగితేనే తమ క్రికెట్ బోర్డు ఆర్థిక కష్టాలన్నీ తీరుతాయని పైన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ సక్రమంగా జరిగితే తమ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ రాకపోతే 250 నుంచి 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందన్నాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా-ప్రభుత్వం మధ్య ఇప్పటికే చర్చలు నడిచాయన్నాడు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా కొన్ని ఆంక్షల్ని సడలించడమే కాకుండా, చార్టెడ్ విమానాలు, ఐసోలేషన్ వంటివి టీమిండియా క్రికెటర్ల కోసం ప్రత్యేకం ఏర్పాటు చేస్తుందన్నాడు. (నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశావ్ అన్నాడు..!) టీమిండియా పర్యటనపై తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, తమ కష్టాలకు భారత పర్యటనతో ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నానని పైన్ అన్నాడు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ మరుసటి ఏడాదికి వాయిదా పడగా, క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్ నిరవధిక వాయిదా వేశారు. అదే సమయంలో అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ కూడా డైలమాలో పడింది. కరోనాపై పోరాటంలో ఆస్ట్రేలియా కచ్చితమైన మార్గదర్శకాలతో ముందుకెళుతున్న తరుణంలో క్రికెట్ టోర్నీలపై కూడా కఠినంగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపు వరల్డ్‌కప్, మరొకవైపు భారత్ పర్యటన అంశాలు ఇప్పుడు సీఏను ఇరకాటంలో పడేస్తున్నాయి. ఒకవేళ కరోనా ఉధృతి తగ్గకపోతే మాత్రం సీఏ ఆర్థికంగా ఇంకా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. (బుమ్రాకు ‘చుక్కలు’ చూపించాడు..!) -
'టిమ్ పైన్ ఉత్తమ కెప్టెన్‌గా నిలుస్తాడు'
సిడ్నీ : ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో కెప్టెన్‌గా వైదొలిగిన స్టీవ్ స్మిత్ స్థానంలో పైన్ కెప్టెన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిమ్ పైన్ సారథ్యంలో భారత జట్టుకు టెస్టు సిరీస్ కోల్పోయినా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్‌ను నిలబెట్టుకున్నామాని లియోన్ తెలిపాడు. నాథన్ లియోన్ మాట్లాడుతూ.. ' మా జీవితంలో బాల్ ట్యాంపరింగ్ వివాదం ఎప్పటికి వెంటాడుతుంది. అలాంటి సమయంలో కష్టకాలంలో ఉన్న జట్టును తన నాయకత్వ ప్రతిభతో మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు పైన్ ప్రయత్నించాడు. కెప్టెన్‌గా టిమ్ పైన్ తన విశ్వసనీయతను కాపాడుకుంటునే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అతని నిజాయితీయే పైన్‌ను ఏదో ఒకరోజు ఉత్తమ కెప్టెన్‌గా నిలబెడుతుంది. రోజు రోజుకు కెప్టెన్సీలో పైన్ మరింత రాటు దేలుతున్నాడు' అంటూ ప్రశంసలు కురిపించాడు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అన్ని క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా జూన్ నెలకు వాయిదా వేసింది. (కరోనాతో మాజీ క్రికెటర్ మృతి) (పొలాక్ మదిలో సచిన్ కానీ అతడి జాబితాలో..) -
స్టీవ్ స్మిత్‌పై ‘నిషేధం’ ముగిసింది
సిడ్నీ: రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. గతేడాది యాషెస్ సిరీస్ ద్వారా టెస్టులో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్‌లో విశేషంగా రాణించి తన విలువ ఏమిటో చూపించాడు స్మిత్. కాగా, స్మిత్ నిషేధం ఎదుర్కొనే సమయంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) పెద్దలు అతనిపై మరో ఆంక్ష కూడా విధించారు. ఆసీస్ జట్టులో పునరాగమనం చేసినప్పటికీ రెండేళ్ల పాటు స్మిత్‌ను కెప్టెన్సీకి దూరంగా ఉంచాలని నిర్ణయించారు. అయితే ఆ నిషేధాన్ని కూడా స్మిత్ పూర్తి చేసుకున్నాడు. 2020, మార్చి 29వ(ఆదివారం) తేదీతో స్మిత్‌పై ఉన్న రెండేళ్ల పాటు కెప్టెన్సీకి దూరంగా ఉండాలన్న నిషేధం ముగిసింది. (ఐపీఎల్‌కు ఆసీస్ ఆటగాళ్లు గుడ్ బై!) ఇక స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించడమే సీఏ ముందున్న విధి. మరి స్మిత్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారో.. మరి కొంతకాలం వేచి చూస్తారా అనేది సీఏ యాజమాన్యం ఆలోచనపైనే ఆధారపడి వుంటుంది. ప్రస్తుతం ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా అరోన్ ఫించ్ ఉండగా, టెస్టు కెప్టెన్‌గా టిమ్ పైన్ కొనసాగుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫించ్‌ను తప్పించాలనే ఆలోచనలో సీఏ లేదు. అలాడే పైన్ కూడా టెస్టుల్లో కొనసాగించాలనే చూస్తోంది. వీరిద్దరి కెప్టెన్సీపై కోచ్ జస్టిన్ లాంగర్ ఇటీవల ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకంగా టిమ్ పైన్ నాయకత్వ లక్షణాలు అమోఘం అంటూ కొనియాడాడు. అదే సమయంలో స్మిత్‌కు అదనపు భారాన్ని ఇవ్వడం కూడా ఆసీస్ క్రికెట్ పెద్దలకు ఇష్టం లేదు. కెప్టెన్‌గా స్మిత్ సమర్థుడైనప్పటికీ ఆ బాధ్యతలు అప్పచెప్పి బ్యాటింగ్ ఒత్తిడి తీసుకురాకూడదనేది సీఏ యోచన. రాబోవు సిరీస్‌ల్లో పైన్, ఫించ్‌లు కెప్టెన్లుగా విఫలమైతే మాత్రం మళ్లీ స్మిత్‌నే సారథిగా చేసే అవకాశం ఉంది. ('స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా సరైనోడు కాదు') -
మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు
మెల్బోర్న్ : ఆసీస్ సారథిగా స్టీవ్ స్మిత్ సరైన వ్యక్తి కాదంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో ఆసీస్ కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల మీడియా సమావేశంలో మైకేల్ క్లార్క్ పాల్గొనగా.. ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను మళ్లీ నియమించాలంటారా? అని ఒక విలేకరి ప్రశ్నించాడు. 'ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతమంది కెప్టెన్లు అవసరం లేదు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక కెప్టెన్ ఉండడం కన్నా.. మూడు ఫార్మాట్లకూ కలిపి ఒకే కెప్టెన్ ఉండటం మంచిది' అని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్ తర్వాత కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. (భార్యకు విడాకులు.. భరణంగా రూ.285 కోట్లు!) 'పాట్ కమిన్స్ ఆటను బాగా అర్ధం చేసుకుంటాడు. అతను ఓపెనింగ్ బౌలర్ మాత్రమే గాక బ్యాటింగ్ కూడా చేయగలడు. మైదానంలోనూ కమిన్స్ చాలా చురుకుగా ఉంటాడు. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పటి పరిస్థితుల్లో ఆసీస్ జట్టుకు ఉత్తమ కెప్టెన్ అవసరం. స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మన్.. అది నేనూ ఒప్పుకుంటా.. కానీ కెప్టెన్సీ చేయడానికి సరైన వ్యక్తి మాత్రం కాదనుకుంటున్నా. ఇక టిమ్ పైన్ ఇప్పటికే కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పైన్ వీడ్కోలు చెప్పేవరకు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కొనసాగే హక్కు అతనికి ఉంది. టిమ్ ఇప్పుడు 35 ఏళ్లు ఉన్నాడు. ఈ వేసవి తర్వాత అతను వీడ్కోలు గురించి ఆలోచిస్తాడని అనుకుంటున్నా. హోమ్ సిరీస్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిస్తే టిమ్ పైన్ వీడ్కోలు పలకడానికి అదే అనువైన సమయం అంటూ' మైకేల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు. (మైకేల్ క్లార్క్ భావోద్వేగ సందేశం) కాగా బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిషేధం కారణంగా స్మిత్ తన కెప్టెన్సీని కోల్పోయాడు. దీంతో పరిమిత ఓవర్లకు ఆరోన్ ఫించ్, టెస్ట్ ఫార్మాట్‌కు టిమ్ పైన్ కెప్టెన్లుగా ఉన్నారు. స్మిత్ పునరాగమనం చేసి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆసీస్ మాజీలు మళ్లీ స్మిత్‌కు పగ్గాలు ఇవ్వాలంటున్న తరుణంలో క్లార్క్ మాత్రం స్మిత్ కెప్టెన్‌గా సరైన వ్యక్తి కాదంటూ తేల్చి చెప్పాడు.(జర్నలిస్టుపై కోహ్లి ఆగ్రహం) -
కోహ్లికి స్మిత్ ఫిదా..
టీమిండియా సారథి విరాట్ కోహ్లి అసాధారణ ఆటగాడంటూ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా స్మిత్, కోహ్లిలు గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. స్మిత్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లి అసాధారణ ఆటగాడని, అన్ని ఫార్మాట్లలో అతడు సాధించిన రికార్డులు అమోఘమని కొనియాడాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి భవిష్యత్తులో మరిన్నో కొత్త రికార్డులు సృష్టిస్తాడని స్మిత్ అభిప్రాయపడ్డాడు. కేవలం బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా జట్టును నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చాడని అన్నారు. ఈ ఏడాది జరగబోయే టీ 20 ప్రపంచకప్‌లో గెలుపు కోసం టీమిండియా ఆటగాళ్లు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తారని స్మిత్ అభిప్రాయపడ్డారు. ఆసీస్టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ నాయకత్వంలో ఆసీస్ జట్టు అద్భుత విజయాలను సాధించిందని అన్నారు. యాషెస్ సిరీస్‌లో పైన్ కీలక పాత్ర పోషించాడని అన్నారు. ప్రస్తుతం నాలుగు రోజుల టెస్ట్ గురించి చర్చ జరుగుతుందని.. కానీ తాను మాత్రం ఐదు రోజుల టెస్ట్ క్రికెట్‌నే ఇష్టపడతానని స్మిత్ అన్నాడు. చదవండి: అది భారత్‌కు ఎంతో అవమానకరం: అక్తర్ -
‘బంగ్లాదేశ్ తర్వాత మా టార్గెట్ భారత్!’
సిడ్నీ: స్వదేశంలో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేయండంపై టెస్టు సారథి టిమ్ పైన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో 296 పాయింటలతో టీమిండియా(360) తరువాతి స్థానంలో ఉంది. అయితే మ్యాచ్ అనంతరం టిమ్ పైన్ మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో టీమిండియతో జరగబోయే టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తన్నుట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా భారత్-ఆసీస్ సిరీస్ అంటేనే అటు ఆటగాళ్లకు ఇటు అభిమానులకు నోరూరించే సిరీస్ అని అభివర్ణించాడు. ‘పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం తమ తదుపరి లక్ష్యం బంగ్లాదేశ్ ఆతర్వాత టీమిండియా. రెండు టెస్టుల సిరీస్ కోసం జూన్‌లో బంగ్లాదేశ్‌కు వెళుతున్నాం. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి టీమిండియా సిరీస్‌పై దృష్టి పెడతాం. గత టెస్టు సిరీస్‌లో మాపై టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది. అయితే అప్పటి ఆసీస్ జట్టు పరిస్థితులు వేరు. ప్రస్తుత పరిస్థితులు వేరు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్నాం. వార్నర్, స్మిత్, లబుషేన్‌లతో బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉంది. పేస్, స్పిన్‌తో ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టే బౌలర్లు ఆసీస్ జట్టులో ఉన్నారు. దీంతో టీమిండియా-ఆసీస్‌ల మధ్య జరగబోయే టెస్టు సిరీస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లుకు కీలకం. ఎవరు గెలిస్తే వారికి లాభం చేకూరుతుంది. అయితే టీమిండియాపై టెస్టు సిరీస్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ ఆరాటపడుతుతున్నారు. అందుకే టీమిండియాతో సిరీస్ మా ఆటగాళ్లకు, ఫ్యాన్స్‌కు నోరూరుతోంది. ఈ సిరీస్ కోసం మేమందరం వేచిచూస్తున్నా’ అని ఆసీస్ టెస్టు సారథి టిమ్ పైన్ పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా 2-0తో కైవసం చేసుకుంది. ఇక టీమిండియా కూడా గతేడాది వరుస విజయాలతో జోరుమీదుంది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈ ఏడాది ఆరంభంలో టీ20లపై దృష్టి పెట్టిన టీమిండియా.. వరల్డ్‌కప్ ముగిశాక టెస్టులపై ఫోకస్ పెట్టనుంది. వరుసగా టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు ఇంకా చాలా సమయమే ఉన్నా ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా యావత్ క్రికెట్ ప్రపంచం ముఖ్యంగా టెస్టు క్రికెట్ అభిమానులు టీమిండియా-ఆసీస్ సిరీస్కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఎక్కువగా చర్చించుకుంటున్నారు. దీంతో ఆ సిరీస్ విజేత ఎవరో వేచి చూడాలి. చదవండి: అతడు ప్రపంచంలోనే చెత్త కీపర్! కోహ్లి కోసం పరుగెడతాం -
నన్నెవరు ఇష్టపడరు.. అందుకే జట్లు మారుతున్న: ఫించ్
ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 4.4 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫించ్ ఆర్సీబీకి వెళ్లడంపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ట్విటర్లో స్పందించింది. ' ఆసీస్ స్టార్ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఐపీఎల్ వేలంలో ఆర్సీబీకి వెళ్లాడు. ఆ జట్టులో ఉన్న సభ్యులంతా అతడిని ఇష్టపడతారని ఆశిస్తున్నామంటూ' ట్వీట్ చేయడంతో పాటు ఓ వీడియోనూ షేర్ చేశారు. ఆ వీడియోలో ఆస్ట్రేలియా టిమ్ పైన్, ఆరోన్ పించ్‌లు ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నారు. గతంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దృష్టి మరల్చడానికి టిమ్ పైన్ స్టంప్ మైక్రోఫోన్ ద్వారా ఫించ్‌తో సరదాగా మాట్లాడాడు. ' ఫించ్.. ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో టీమ్‌లు మారావు. దాదాపు అన్ని జట్లతో ఆడావ్' అని పైన్ అన్నాడు. దీనికి బదులుగా ఫించ్.. ' అవును అన్ని జట్లకు ఆడాను.. ఒక్క ఆర్సీబీకి తప్ప' అని బదులిచ్చాడు. అప్పుడు పైన్ అందుకుంటూ.. ' నిన్ను ఆ జట్టు ఎందుకు తీసుకోదు.. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నిన్ను ఇష్టపడరా ?' అంటూ సరదాగా అడిగాడు. ' అవును నన్ను ఎవరు ఇష్టపడరు.. అందుకే అన్ని జట్లు మారతున్నా అంటూ' .. ఫించ్ సమాధానమిచ్చాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో ఫించ్ ఆర్సీబీకి వెళ్లడం విశేషం. ఈ వీడియోనూ కాస్తా క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'ఐపీఎల్ వేలంలో ఆరోన్ ఫించ్ ఆర్సీబీకి వెళ్లాడు. ఇప్పుడు కోహ్లి అతన్ని ఇష్టపడతాడులే' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రసుత్తం ఆర్సీబీకి ఆడనున్న ఆరోన్ పించ్ ఐపీఎల్లో ఏడు జట్లకు ఆడాడు. ఇప్పుడు ఆర్సీబీతో కలిపి 8 వ జట్టుకు ఆడనున్నాడు. కాగా, ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఫించ్‌తో పాటు ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్సన్(రూ. 4 కోట్లు) , దక్షిణాఫ్రికా నుంచి ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్(రూ. 10 కోట్లు), బౌలర్ డేల్ స్టేయిన్(రూ. 2 కోట్లు)లను సొంతం చేసుకుంది. (చదవండి : సహచరులతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లి) Aussie star Aaron Finch is off to @RCBTweets in the #IPLAuction2020. Let's hope his new teammates like him 😂😂😂 pic.twitter.com/VGfUFfJffq — cricket.com.au (@cricketcomau) December 19, 2019 -
అతడు ప్రపంచంలోనే చెత్త కీపర్!
పెర్త్: ఆస్ట్రేలియా టెస్టు సారథి, వికెట్ కీపర్ టిమ్ పైన్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు వరుస కామెంట్స్ చేస్తున్నారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో పైన్ చేసిన చిన్న తప్పిదానికి అతడిపై ఆసీస్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. తొలి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టిమ్ పైన్ చెత్త కీపంగ్‌తో కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కివీస్ బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మిచెల్ స్టార్ వేసిన 35వ ఓవర్ ఐదో బంతిని రాస్ టేలర్ కవర్ పాయింట్ దిశగా తరలించి సింగిల్ తీశాడు. అయితే నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న వాట్లింగ్, టేలర్ వద్దని వారించినా రెండో పరుగు కోసం సగం క్రీజు వరుకు చేరుకున్నాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ లియోన్ బంతిని వేగంగా అందుకొని వికెట్ కీపర్ చేతుల్లోకి విసిరిడు. ఆ సులువైన బంతిని అందుకోవడంలో పైన్ విఫలమయ్యాడు. దీంతో వాట్లింగ్‌కు పైన్ రూపంలో జీవనధారం లభించింది. సులువైన బంతిని అందుకోడంలో విఫలమైన టిమ్ పైన్ సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ రనౌట్ మిస్సయినప్పటికీ ఆసీస్‌కు వచ్చిన పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే వాట్లింగ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 పరుగులకే ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే చాలా సులువైన బంతిని అందుకోవడంలోనే పైన్ తడబడటంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ‘అసలు పైన్ జట్టులో ఎందుకో నాకర్థం కావడం లేదు. కీపింగ్‌లో ఎలాంటి గొప్పతనం, కొత్తదనం లేదు.. ఇక బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కేవలం కెప్టెన్‌గా ఉన్నందునే జట్టులో ఇంకా కొనసాగుతున్నాడు. యువ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి అవకాశం ఇచ్చి.. స్మిత్‌కు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి టిమ్ పైన్‌ను జట్టు నుంచి సాగనంపడం బెటర్’అంటూ ఓ నెటజన్ కామెంట్ చేయగా.. ‘ప్రపంచంలోనే చెత్త కీపర్ టిమ్ పైన్’ అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కులు చూపించారు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడటంతో 217 పరుగులకే ఆలౌటైంది.(గాయం కారణంగా హేజిల్‌వుడ్ బ్యాటింగ్‌కు దిగలేదు). దీంతో కివీస్ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చదవండి: ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు.. ‘గుర్తుపెట్టుకోండి.. అతడే మ్యాచ్ డిసైడర్’ An early chance goes by! Paine fumbles with Watling out of the frame! #AUSvNZ live: https://t.co/0Uay6Vh9fg pic.twitter.com/mjZUiWrrqH — cricket.com.au (@cricketcomau) December 14, 2019 -
కోహ్లి కోసం పరుగెడతాం: పైన్ కొంటె రిప్లై
బ్రిస్బేన్: భారత్ తొలిసారి పింక్ బాల్ టెస్టులో ఆడటం ఒకటైతే, అది కూడా స్వదేశంలోనే ముందుగా గులాబీ బాల్ పరీక్షను సిద్ధం కావడం మరొకటి. భారత్ పర్యటనకు బంగ్లాదేశ్ వచ్చిన క్రమంలో ముందస్తు షెడ్యూల్ లేని పింక్ బాల్ మ్యాచ్‌ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చొరవ తీసుకుని మరీ అందుకు బీసీబీని కూడా ఒప్పించాడు. ఈ క్రమంలోనే ముందుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు. దీనికి కోహ్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆపై బీసీబి కూడా ఒప్పుకోవడంతో పింక్ బాల్ టెస్టు సాధ్యమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించడం ఒకటైతే, ఆసీస్‌తో పింక్ బాల్ టెస్టు ఆడాలంటూ ఇప్పటికే పలువురు మాజీలు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగానే, ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌కు సైతం ఇదే ప్రశ్న ఎదురైంది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ విజయం సాధించిన తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ పైన్‌ను భారత్‌తో పింక్ బాల్ టెస్టు గురించి ఒక జర్నలిస్టు ప్రశ్నించాడు. ‘మీరు భారత్‌తో పింక్ బాల్ టెస్టు ఆడటానికి సిద్ధంగా ఉన్నారా’ అని అడిగాడు. దానికి పైన్ కాస్త కొంటెగానే సమాధానం చెప్పాడు. ‘మేము సిద్ధమే.. మరి అక్కడ కోహ్లి ఒప్పుకోవాలి కదా. ఒకవేళ కోహ్లి మంచి మూడ్‌లో ఉంటే ఒప్పుకుంటాడు. అప్పుడు మా మధ్య పింక్ బాల్ టెస్టు జరుగుతుంది. మేము పింక్ బాల్ టెస్టును భారత్‌తో ఆడటానికి యత్నించాం. మళ్లీ ప్రయత్నిస్తాం కూడా. అవసరమైతే కోహ్లి నిర్ణయం కోసం పరుగెడతాం. ఏదొక రోజు పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌కు మేము ఊహించిన సమాధానాన్ని పొందుతాం. అది కచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడ్నుంచో భారత్‌తో పింక్ బాల్ టెస్టు ఆడాలనుకుంటున్నాం. కానీ కోహ్లి అందుకు సిద్ధంగా లేడు. ఇప్పుడు భారత్ పింక్ బాల్ టెస్టు ఆడింది కాబట్టి, తమతో వచ్చే సమ్మర్లో పింక్ బాల్ టెస్టు ఉంటుందనే అనుకుంటున్నా’ అని అన్నాడు. తాను మళ్లీ కోహ్లిని పింక్ బాల్ మ్యాచ్ కోసం అడుగుతానని, అప్పుడు అతని నుంచి అనుమతి వస్తే మ్యాచ్ జరుగుతుందన్నాడు. అది కూడా కోహ్లి మంచి మూడ్‌లో ఉన్నప్పుడు అయితేనే తమ మధ్య పింక్ బాల్ టెస్టు సాధ్యమవుతుందని చమత్కరించాడు. గత ఏడాది అడిలైడ్‌లో భారత్‌తో పింక్ బాల్ మ్యాచ్ కోసం ఆసీస్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పింక్ బాల్‌తో మ్యాచ్‌కు కోహ్లి నో చెప్పడంతో అది జరగలేదు. కాగా, ఇప్పుడు టీమిండియా పింక్ బాల్ టెస్టులకు ఆసక్తి చూపుతూ ఉండటంతో ఆసీస్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. -
బెన్ స్టోక్స్ మరీ ఇంత ‘చీప్ షాట్’ కొడతావా!
బ్రిస్బేన్: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రాసిన ఆన్ ఫైర్ పుస్తకంపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా ఈ ఏడాది జరిగిన యాషెస్ సిరీస్‌ను తన రాసిన పుస్తకంలో ఉదహరించడమే కాకుండా ఆసీస్ క్రికెటర్లను టార్గెట్ చేశాడు. స్టోక్స్ రాసిన బుక్‌లో డేవిడ్ వార్నర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించడంతో వివాదం పెద్దదిగా మారింది. యాషెస్ సిరీస్‌లో వార్నర్ ఎప్పుడూ స్లెడ్జింగ్ చేస్తూనే ఉన్నాడని, ఏ సమయంలోనూ తన నోటిని కట్టిపెట్టిన సందర్భం లేదంటూ స్టోక్స్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. ఈ పుస్తకాన్ని సంబంధించిన పేజీలు ఒక్కొక్కటిగా బ్రిటీష్ న్యూస్ పేపర్లో రావడం, అందులో వార్నర్ పేరునే ప్రధానంగా పేర్కొనడంతో ఆసీస్ క్రికెట్లో అలజడి రేగింది. దీనిపై యాషెస్ సిరీస్‌లో ఆసీస్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న టీమ్ పైన్ స్పందించడమే కాకుండా స్టోక్స్ చిల్లర వేషాలు వేస్తున్నాడంటూ విమర్శించాడు. ‘ ఇది స్టోక్స్ చీప్ ట్రిక్.. చీప్ షాట్. అతని పుస్తకాల్ని సేల్ చేసుకోవడం కోసం చేసిన చిల్లర పని. వార్నర్ పేరును రాసి వివాదం సృష్టిస్తే పుస్తకాలు అమ్మకాలు వేగంగా జరుగుతాయనే స్టోక్స్ భావించాడు. అంతేకానీ అందులో వాస్తవం లేదు. యాషెస్ సిరీస్‌లో వార్నర్ ఎక్కువ సేపు నా పక్కనే ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడంటూ స్టోక్స్ బుక్‌లో పేర్కొనడంలో నిజం లేదు. ఇదంతా బుక్‌పై ఒక హైప్ క్రియేట్ చేయడం కోసమే స్టోక్స్ చేశాడు’ అని పైన్ పేర్కొన్నాడు. మరొకవైపు స్లెడ్జింగ్ చేయడం అనేది ఇంగ్లండ్ క్రికెట్లో భాగమే అయినప్పుడు దాని కోసం స్టోక్స్ దాన్నే ఎందుకు ప్రస్తావించాడో చెప్పాలన్నాడు. స్లెడ్జింగ్ అనేది ఇంగ్లండ్ క్రికెట్లో కామన్ ట్రెండే కదా.. మరి ఎందుకో ఆ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించినట్లు అని పైన్ కౌంటర్ అటాక్ చేశాడు. బుక్స్‌ను సాధ్యమైనంత త్వరగా అమ్మేసుకుని మార్కెట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వార్నర్ స్లెడ్జింగ్ చేశాడంటూ స్టోక్స్ తన పుస్తకంలో రాసుకున్నాడన్నాడు. -
‘నేను స్మిత్ కెప్టెన్సీకి సహకరిస్తా’
మెల్బోర్న్: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో గతేడాది నిషేధానికి గురైన ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కొన్ని నెలల క్రితం పునరాగమనం చేశాడు. 12 నెలల పాటు నిషేధం ఎదుర్కొన్న స్మిత్.. ఆపై క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కెప్టెన్సీ పదవికి మాత్రం దూరమయ్యాడు. అయితే యాషెస్ సిరీస్‌లో విశేషంగా రాణించిన తర్వాత స్మిత్‌కు మళ్లీ కెప్టెన్సీ అప్పచెప్పలనే వాదన తెరపైకి వచ్చింది. ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్.. స్మిత్ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించాడు. స్మిత్ ఒక తెలివైన కెప్టెన్ అంటూ కొనియాడాడు. దాంతో స్మిత్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం ఖాయమంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆసీస్ టెస్టు కెప్టెన్ ఉన్న టిమ్ పైన్.. ఇక దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి అనివార్యం కానుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. దీనిపై తాజాగా స్పందించిన పైన్.. ‘ ప్రస్తుత సమయంలో ఆసీస్ కెప్టెన్సీ పదవిని ఎంజాయ్ చేస్తున్నా. ఏదొక రోజు స్మిత్ మళ్లీ పగ్గాలు అందుకుంటాడనే ఆశిస్తున్నా. స్మిత్‌ను కెప్టెన్‌గా తిరిగి నియమిస్తే నాకు అభ్యంతరం ఏమీ లేదు. నేను స్మిత్ కెప్టెన్సీకి సహకరిస్తా’ అని పేర్కొన్నాడు. అయితే కెప్టెన్సీ కోసం బీబీఎల్‌ను వదిలేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం పైన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘నాకు ఆసీస్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం చాలా ముఖ్యమైనది. జట్టును ముందుండి నడిపించడంపైనే దృష్టి పెడుతున్నా. దాంతో బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)ను వదిలేయాలని నిర్ణయించుకున్నా. ఒక కెప్టెన్‌గా నాకొచ్చి ప్రతీ చాన్స్‌ను వినియోగించుకోవాలంటే నేను రీచార్జ్ కావాల్సి ఉంది. ఆ క్రమంలోనే బీబీఎల్‌కు స్వస్తి చెబుదామని అనుకుంటున్నా. నా టెస్టు కెరీర్ ముగిసిన తర్వాతే బీబీఎల్‌లో అడుగుపెడతా. ప్రస్తుతం నా దృష్టంతా నాపై ఉన్న బాధ్యతపైనే’ అని పైన్ ఇటీవల పేర్కొన్నాడు. -
బీబీఎల్‌ను వదిలేస్తున్నా: పైనీ
మెల్బోర్న్: కొన్ని రోజుల క్రితం ముగిసిన యాషెస్ సిరీస్‌లో తనతో పాటు పీటర్ సీడెల్ కూడా గాయంతోనే ఆడాడని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైనీ పేర్కొన్నాడు. తాను వేలి గాయంతో బాధపడితే, సిడెల్ తుంటి గాయంతో సతమతమయ్యాడన్నాడు. తమ ఇద్దరి గాయాలు పెద్దగా ఆందోళన పరిచే గాయాలు కాకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదన్నాడు. చివరి టెస్టులో తన వేలికి తీవ్ర గాయమైనప్పటికీ వెంటనే రికవరీ అయినట్లు తెలిపాడు. తనకు అన్నికంటే ముఖ్యమైనది ఎర్రబంతి క్రికెట్లో ఆడటమేనని స్పష్టం చేశాడు. అందుకోసం కొన్ని త్యాగాలను చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ‘నాకు ఆసీస్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం చాలా ముఖ్యమైనది. జట్టును ముందుండి నడిపించడంపైనే దృష్టి పెడుతున్నా. దాంతో బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)ను వదిలేయాలని నిర్ణయించుకున్నా. ఒక కెప్టెన్‌గా నాకొచ్చి ప్రతీ చాన్స్‌ను వినియోగించుకోవాలంటే నేను రీచార్జ్ కావాల్సి ఉంది. ఆ క్రమంలోనే బీబీఎల్‌కు స్వస్తి చెబుదామని అనుకుంటున్నా. నా టెస్టు కెరీర్ ముగిసిన తర్వాతే బీబీఎల్‌లో అడుగుపెడతా. ప్రస్తుతం నా దృష్టంతా నాపై ఉన్న బాధ్యతపైనే’ అని పైనీ పేర్కొన్నాడు. ఆసీస్ తన తదుపరి టెస్టును పాకిస్తాన్‌తో ఆడనుంది. నవంబర్ 21వ తేదీన పాకిస్తాన్‌తో గబ్బా స్టేడియంలో జరుగనున్న టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ తలపడనుంది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో సమంగా ముగిసిన సంగతి తెలిసిందే. -
‘ఆ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది’
లండన్: ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి టిమ్ పైన్ నిర్ణయంపై ఆ జట్టు సహాయక కోచ్, మాజీ సారథి రికీ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకోవడంపై పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని తాము భావించామని, టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాడు. అయితే మ్యాచ్ ఫలితం తేలే వరుకు టిమ్ పైన్ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని తెలియదన్నాడు. ‘ఆసీస్ టాస్ గెలిచిందని మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ప్రకటించిన వెంటనే.. నేను మా ఆటగాళ్లకు బ్యాటింగ్‌కు సిద్దంకండి అని చెప్పాను. కానీ మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ మా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మేం అంచనా వేసినట్టే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. దీంతో లంచ్ విరామం వరకు ఇంగ్లండ్ 103 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. లేదంటే ఇంగ్లండ్ మా ముందు భారీ స్కోర్ నిలిపేదె. టిమ్ పైన్ నిర్ణయం పూర్తిగా తప్పని నేను చెప్పటం లేదు. కానీ నిర్ణయాత్మక టెస్టులో తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అని నా అభిప్రాయం’అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక యాషెస్ ఐదో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ (70), సారథి జోయ్ రూట్(57) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ మార్ష్ ఐదు వికెట్లతో చెలరేగగా.. కమిన్స్(3/84) రాణించాడు. ఇక ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్ ఓవల్ టెస్టులో గెలిచి సంపూర్ణంగా యాషెస్ సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలతో ఉండగా.. ఎలాగైనా గెలిచి సిరీస్ డ్రా చేసి పరువు నిలుపుకోవాలని ఆతిథ్య ఇంగ్లండ్ ఆరాటపడుతోంది. (చదవండి: ‘నన్ను ఆస్ట్రేలియన్లు అసహ్యించుకున్నారు’) -
దిగ్గజాల వల్ల కాలేదు.. మరి పైన్ సాధిస్తాడా?
మాంచెస్టర్: యాషెస్ సిరీస్ అంటే ఆసీస్-ఇంగ్లండ్‌లకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఇది ఇరు జట్ల మధ్య జరిగే ఒక యుద్ధంగా చెప్పొచ్చు. మరి అటు మెగా యుద్ధంలో ఒక కెప్టెన్‌కు అరుదైన అవకాశం వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది. అందులోనూ దిగ్గజాల వల్ల కానిది.. అనుకోకుండా జట్టు కెప్టెన్ అయి దాన్ని సాధిస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. ఇప్పుడు ఈ తరహా రికార్డే ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌ను ఊరిస్తోంది. ఆసీస్ దిగ్గజ ఆటగాళ్లు, మాజీ కెప్టెన్లు అయిన గ్రెగ్ చాపెల్, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్‌లకు సాధ్యం కానిది.. పైన్ ముంగిట నిలిచింది. ఇంగ్లండ్ గడ్డపై ఆసీస్ యాషెస్ సిరీస్‌ను గెలిచిన సందర్బాలు చాలా తక్కువే. సుమారు 18 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లో ఆసీస్ చివరిసారిగా యాషెస్ సిరీస్ గెలిస్తే, అప్పట్నుంచి ఇప్పటివరకూ ఇంగ్లండ్ వేదికలో ఆసీస్ మళ్లీ ఆ సిరీస్‌ను గెలవలేదు. ఇంగ్లండ్‌లో 2001లో స్టీవ్ వా నేతృత్వంలోని ఆసీస్ యాషెస్ సిరీస్‌ను గెలిచింది. ఆ తర్వాత ఆసీస్ ఆ చాన్స్ ఇవ్వలేదు ఇంగ్లండ్. తమ దేశంలో ఓడించడమంటే మీ వల్ల కాదనే విషయాన్ని ఇంగ్లండ్ చాటి చెబుతూనే ఉంది. అయితే తాజా యాషెస్ సిరీస్‌లో టిమ్ పైనీ నేతృత్వంలోని ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ సిరీస్‌లో తొలి టెస్టును ఆసీస్ గెలవగా, రెండో టెస్టు డ్రా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్, నాల్గో టెస్టులో ఆసీస్‌లు విజయం సాధించాయి. దాంతో ఆసీస్‌దే పైచేయిగా ఉంది. ఇక చివరి టెస్టును ఆసీస్ గెలిస్తే పైన్ అరుదైన ఘనతను లిఖిస్తాడు. అదే సమయంలో సుదీర్ఘ కాలంగా ఇంగ్లండ్ గడ్డపై యాషెస్‌ను గెలవలేకపోతున్న అపవాదుకు కూడా బ్రేక్ పడుతుంది. 2010లో ఆసీస్ తరఫున అరంగేట్రం చేసిన పైన్.. ప్రధానంగా టెస్టుల్లోనే కనిపిస్తాడు. ఇప్పటివరకూ ఆసీస్ జట్టుకు అడపా దడపా కెప్టెన్‌గా వ్యవహరించిన పైన్.. యాషెస్ సిరీస్ కూడా కెప్టెన్‌గా నియమించింది క్రికెట్ ఆస్ట్రేలియా. బాల్ ట్యాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కోవడంతో వారిని ఆసీస్ యాషెస్ జట్టుకు కెప్టెన్లుగా నియమించడానికి సీఏ మొగ్గు చూపలేదు. ఆ క్రమంలోనే పైన్ కెప్టెన్‌గా ఎంపిక కావడానికి మార్గం సుగమం అయ్యింది. ఇలా యాక్సిడెంటల్‌గా ఆసీస్‌కు సారథిగా ఎంపికైన పైన్.. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రాణించలేదు. కాకపోతే కెప్టెన్‌గా మాత్రం ఒక మైలురాయిని చేరుకునేందుకు చేరవయ్యాడు. గురువారం నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగనున్న చివరిదైన ఐదో యాషెస్ టెస్టును ఆసీస్ గెలిస్తే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఫలితంగా ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ సిరీస్‌లు గెలిచిన కొద్ది మంది ఆసీస్ కెప్టెన్ల జాబితాలో పైన్ చోటు సంపాదిస్తాడు. మరి ఈ అరుదైన ఫీట్‌ను పైన్ సాధిస్తాడో లేదో చూడాలి. -
‘మా కెప్టెన్‌కు మతిపోయినట్లుంది’
లీడ్స్: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవడంతో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని ఆసీస్ మాజీ కెప్టెన్లు.. పైనీనే ప్రధానంగా తప్పుబడుతున్నారు. ఫీల్డ్‌లో పైనీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ చివరి వరుస ఆటగాడు జాక్ లీచ్ ఔట్‌పై డీఆర్ఎస్కు వెళ్లడాన్ని ప్రశ్నిస్తున్నారు. ‘ మా కెప్టెన్‌కు మతిపోయినట్లుంది’ అని ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ విమర్శంచగా, ‘ అనవసరంగా రివ్యూని వృథా చేసుకున్నాడు’ అని మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ ధ్వజమెత్తాడు. ‘ పైనీకి మతిభ్రమించినట్లుంది. లీచ్ ఔట్‌పై రివ్యూకు వెళ్లడం ఏమిటి. అది క్లియర్‌గా లెగ్ సైడ్‌కు వెళుతున్నట్లు కనిపిస్తుంది. అటువంటి సమయంలో ఉన్న ఒక్క రివ్యూను ఎలా వాడతాడు. అది ఔట్ కాదనే విషయం సహచర క్రికెటర్లకు అర్థమైంది. కానీ పైనీ మాత్రం ఏకపక్షంగా రివ్యూకు వెళ్లి అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు’ అని చాపెల్ విమర్శించారు. లీచ్ ఔట్‌పై రివ్యూకు వెళ్లి దాన్ని కోల్పోవడంతో స్టోక్స్ ఔట్‌పై రివ్యూకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. నాథన్ లయన్ బౌలింగ్‌లో స్టోక్స్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతి ప్యాడ్లకు తాకింది. దీనిపై ఆసీస్ అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ జోయల్ విల్సన్ తిరస్కరించాడు. అయితే ఆసీస్‌కు రివ్యూ వెళ్లే అవకాశం లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడాల్సి వచ్చింది. ఆపై అది మిడిల్ వికెట్‌కు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. ఒకవేళ ఆ సమయంలో స్టోక్స్ ఔటై ఉంటే ఆసీస్ గెలిచేది. ఆసీస్‌తో మ్యాచ్‌లో వికెట్ తేడాతోనే ఇంగ్లండ్ గెలవడానికి పైనీ తప్పుడు నిర్ణయమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
యాషెస్ సమరానికి సై..
సమరంలో సమ ఉజ్జీలు అంటే ఎలా ఉండాలి. ప్రతిష్టాత్మక యాషెస్ పోరులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల తరహాలో ఉండాలి. 70 సిరీస్‌లు జరిగితే ఒక జట్టు 33 సిరీస్‌లు గెలిస్తే, మరో జట్టు 32 సార్లు సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. కేవలం ఐదు సిరీస్‌లు మాత్రమే సమంగా ముగిశాయంటే పోటీ తీవ్రత ఏమిటో తెలుస్తుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అభిమానుల దృష్టిలో ఇది ఒక క్రికెట్ సిరీస్ మాత్రమే కాదు. కెరీర్లను మార్చేయగల అవకాశం. యాషెస్‌ను గెలిపించి జీవితకాలం హీరోలుగా మారిపోయినవారు, యాషెస్‌లో విఫలమై ఎప్పటికీ ఆ మచ్చను చెరుపుకోలేక అంతర్ధానమైపోయినవారు ఇరు జట్లలోనూ కోకొల్లలుగా కనిపిస్తారు. ధనాధన్ క్రికెట్ జమానాలో కూడా టెస్టులకు ఊపిరి పోస్తున్న హోరాహోరీ సమరానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మొదలై సెప్టెంబర్ 16న ముగిసే యాషెస్ సమరంలో తుది విజేత ఎవరో? బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ అభిమానులకు కనువిందు చేసే మరో పోరు ఇంగ్లండ్ గడ్డపైనే జరగబోతోంది. 137 ఏళ్ల చరిత్ర గల యాషెస్ సిరీస్‌కు నగారా మోగింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో నేటి నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. 2017–18 సీజన్లో ఆసీస్ గడ్డపై జరిగిన యాషెస్‌ను ఆస్ట్రేలియా 4–0తో సొం తం చేసుకుంది. అంతకుముందు (2015లో) స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 3–2తో గెలుచుకున్న ఇంగ్లండ్ మళ్లీ దానిని సాధించాలని పట్టుదలగా ఉంది. బలాబలాలపరంగా ఇంగ్లండ్ పటిష్టంగా కనిపిస్తుండగా... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆసీస్ గట్టి పోటీనివ్వాలని భావిస్తోంది. 2001 తర్వాత ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆస్ట్రేలియాతో ఏ ఫార్మాట్లో కూడా ఇంగ్లండ్ ఓడలేదు. మరోవైపు తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఆర్చర్ ఔట్! వరల్డ్ కప్ విజయం తర్వాత ఇంగ్లండ్ దేశంలో ఆ జట్టుపై భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. ప్రపంచకప్ ఫైనల్ ఆడిన జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ఇప్పుడు యాషెస్ తొలి టెస్టు బరిలో ఉండగా, స్వదేశంలో రూట్ తొలిసారి యాషెస్ సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఇందులో పేస్ బౌలర్ ఆర్చర్‌కు చోటు దక్కలేదు. సీనియర్ బౌలర్లు, టెస్టుల్లో అత్యధిక వికెట్ల జాబితాలో టాప్–10లో ఉన్న అండర్సన్, బ్రాడ్లపైనే కీలక బాధ్యత ఉంచింది. వీరిద్దరు స్వదేశంలోని అనుకూల వాతావరణంలో చెలరేగితే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. ఐర్లాండ్‌తో టెస్టులో రాణించిన క్రిస్ వోక్స్ మూడో పేసర్‌గా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కొంతకాలంగా బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నా... మొయిన్ అలీ స్పిన్‌పై ఇంగ్లండ్ నమ్మకముంచింది. ఓపెనర్లు బర్న్స్, జేసన్ రాయ్‌లతో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డెన్లీ తొలిసారి యాషెస్ ఆడుతున్నారు. రూట్, బెయిర్‌స్టో, బట్లర్లతో జట్టు బ్యాటింగ్ మెరుగ్గా కనిపిస్తోంది. సిరీస్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చగల ఆటగాడిగా అందరి దృష్టి బెన్ స్టోక్స్‌పైనే ఉంది. నైట్‌క్లబ్ దాడి కేసులో విచారణ కారణంగా స్టోక్స్ గత యాషెస్‌కు దూరమయ్యాడు. ప్రపంచకప్ తర్వాత హీరోగా మారిన అతను ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లోనూ సత్తా చాటితే ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిచిపోవడం ఖాయం. సరిగ్గా చెప్పాలంటే ఆసీస్‌తో పోలిస్తే ఇంగ్లండ్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటే అందుకు స్టోక్స్ కారణం. అయితే ఐర్లాండ్‌తో టెస్టులో బయటపడ్డ బ్యాటింగ్ బలహీనతను ఇంగ్లండ్ అధిగమించాల్సి ఉంది. స్టార్క్‌పై వేటు! సొంతగడ్డపై గత యాషెస్ సిరీస్ (2017–18) విజయంతో సంబరాలు చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత చావుదెబ్బ తింది. దక్షిణాఫ్రికాతో 1–3తో సిరీస్ ఓడిపోవడంతో పాటు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి పరువు కోల్పోయింది. ఆ తర్వాత పాక్‌పై 1–0తో సిరీస్ నెగ్గినా, భారత్ చేతిలో తొలిసారి సిరీస్ ఓడి చెత్త రికార్డును నమోదు చేసింది. బలహీన శ్రీలంకపై నెగ్గినా అది చెప్పుకోదగ్గ విజయం కాదు. ఈ నేపథ్యంలో ఆసీస్ నిజంగా తమ ప్రతిష్ట పెంచుకునేందుకు యాషెస్ అవకాశం కల్పిస్తోంది. ఆటగాళ్ల ఫామ్, ప్రత్యర్థిని బట్టి చూస్తే అది అంత సులువు కాదు. వాస్తవంగా చెప్పాలంటే కంగారూలు సిరీస్‌ను ‘డ్రా’గా ముగించి యాషెస్ నిలబెట్టుకుంటే పెద్ద ఘనతే అవుతుంది. వరల్డ్ కప్ ఆడిన స్మిత్, వార్నర్‌లతో పాటు నిషేధం ముగిసిన తర్వాత బాన్‌క్రాఫ్ట్ తొలిసారి టెస్టు బరిలో దిగుతున్నాడు. మైదానంలో ఈ ముగ్గురికి ఇంగ్లండ్ అభిమానుల హేళనలు తప్పవు! గత యాషెస్‌లో అత్యద్భుతంగా ఆడిన స్మిత్నుంచి ఆసీస్ ఎంతో ఆశిస్తున్నా వరల్డ్‌కప్‌లో అతని ఆట చూస్తే పాత స్మిత్లాగా కనిపించడం లేదు. వార్నర్ కూడా ఒత్తిడిని అధిగమించి చెలరేగాల్సి ఉంది. ఓపికతో పాటు నిలకడగా ఆడే ఖాజా జట్టు బలం కాగా, మిడిలార్డర్లో హెడ్, వేడ్ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాల్సి ఉంది. వీరిద్దరు తొలిసారి యాషెస్ బరిలోకి దిగుతున్నారు. 17 మంది సభ్యుల బృందంలో ఏకంగా ఆరుగురు పేస్ బౌలర్లను తీసుకున్న ఆసీస్ తొలి టెస్టులో మాత్రం సీనియర్ మిషెల్ స్టార్క్‌ను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. టెస్టుల్లో అతని ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడంతో ప్యాటిన్సన్ తుది జట్టులో ఆడటం ఖాయమైంది. చాలా కాలం తర్వాత వస్తున్న ప్యాటిన్సన్... కమిన్స్ తోడుగా చెలరేగితే ఆసీస్ మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. యాషెస్ చరిత్ర గణాంకాల్లో... 1882 నుంచి 2018 వరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య 330 టెస్టులు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 134 గెలవగా, ఇంగ్లండ్ 106 గెలుచుకుంది. మరో 90 టెస్టులు డ్రాగా ముగిశాయి. యాషెస్‌లో మొత్తం ఐదు ట్రిపుల్ సెంచరీలు నమోదయ్యాయి. వీటిలో బ్రాడ్‌మన్ రెండు (334, 304) చేయగా, బాబ్ సింప్సన్ (311), బాబ్ కౌపర్ (307) ఒక్కోటి చేశారు. ఇంగ్లండ్ తరఫున ఏకైక ట్రిపుల్ సెంచరీ చేసిన లెన్ హటన్ (364)దే యాషెస్‌లో అత్యధిక స్కోరు అత్యధిక స్కోరు: ఇంగ్లండ్ 903/7 డిక్లేర్డ్ (1938లో) అత్యల్ప స్కోరు: ఆస్ట్రేలియా 36 ఆలౌట్ (1902లో) అత్యధిక పరుగులు/సెంచరీలు: బ్రాడ్‌మన్ (37 టెస్టుల్లో 5028/ 19 సెంచరీలు) అత్యధిక వికెట్లు: షేన్ వార్న్ (36 టెస్టుల్లో 195 వికెట్లు) అత్యుత్తమ బౌలింగ్: ఇన్నింగ్స్‌లో జిమ్ లేకర్ (10/53), మ్యాచ్‌లో జిమ్ లేకర్ (19/90; 1956 మాంచెస్టర్ టెస్టులో) అత్యధిక మ్యాచ్‌లు: సిడ్నీ గ్రెగరీ (52) కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు: అలెన్ బోర్డర్ (28) తుది జట్లు ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, రాయ్, డెన్లీ, బట్లర్, స్టోక్స్, బెయిర్‌స్టో, అలీ, వోక్స్, బ్రాడ్, అండర్సన్. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), వార్నర్, బాన్‌క్రాఫ్ట్, ఖాజా, స్మిత్, హెడ్/ మిషెల్ మార్ష్, వేడ్, కమిన్స్, ప్యాటిన్సన్, లయన్, సిడిల్/ హాజల్‌వుడ్. -
పంత్.. నా బిడ్డను ఆడిస్తావా : రోహిత్
ముంబై : టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన స్లెడ్జింగ్.. బ్యాటింగ్‌తో సిరీస్ ఆసాంతం వార్తల్లో నిలిచిన ఈ యువ క్రికెటర్.. బెస్ట్ బేబీసిట్టర్‌గా ఆసీస్ కెప్టెన్ సతీమణి బొన్ని పైన్ చేత కితాబు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తండ్రైన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. సైతం తన కూతురుని ఆడించాలని పంత్‌ను కోరుతున్నాడు. గుడ్ మార్నింగ్ అనే పంత్ ట్వీట్‌కు బదులిస్తూ.. ‘శుభోధయం బడ్డీ.. నీవు మంచి బేబీ సిట్టర్‌వని విన్నా. రితికాను సంతోషంగా ఉంచాలంటే నాకు ఓ బేబీ సిట్టర్ కావాలి అంటూ సరదాగా పేర్కొన్నాడు. ఇక రోహిత్ ఒక్కడే పంత్ సాయం కోరడం లేదు.. బొన్ని పైన్ సైతం మరోసారి పంత్ సాయం కోరింది. ‘పంత్ నీవు ఫ్రీగా ఉంటే మరోసారి నాపిల్లలను ఆడించవా!’ అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో 21 ఏళ్ల ఈ యువ క్రికెటర్ 20 క్యాచ్‌లు, 350 పరుగులతో అద్భుతంగా రాణించాడు. వన్డే తుది జట్టులోకి ధోని రావడంతో భారత్‌కు తిరుగొచ్చిన పంత్.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ వరకు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. జనవరి 23 నుంచి భారత్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. Morning buddy. Heard your a good baby sitter, need one right now. Ritika will be quite happy 😃 @RishabPant777 https://t.co/JkGWTYpnBk — Rohit Sharma (@ImRo45) 9 January 2019 -
సిడ్నీ టెస్ట్ : ముగిసిన నాలుగో రోజు ఆట
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వెలుతురు లేమి, వర్షం కారణంగా తొలుత తాత్కాలికంగా మ్యాచ్ నిలిపేసిన అంపైర్లు.. పరిస్థితి మెరుగుపడకపోవడంతో నాలుగోరోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో 322 పరుగులు వెనకబడిన ఆతిథ్య జట్టు ఫాలో ఆన్ ఆడుతోంది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా(4), మార్కస్ హారిస్(2)లు ఉన్నారు. ఆట ముగిసే సమయానికి నాలుగు ఓవర్లకు వికెట్ కోల్పోకుండా ఆసీస్ 6 పరుగులు చేసింది. ఇక భారీ ఆధిక్యం సాధించిన భారత్‌కు విజయం ఖాయం అనుకుంటున్న సందర్భంలో వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగానే నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా.. చివరకు వెలుతురు లేమితో మ్యాచ్‌ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగో రోజు కేవలం 25.2 ఓవర్లే ఆటనే జరిగింది. ఇక చివరిదైన ఐదో రోజు వాతావరణం సహకరిస్తేనే భారత్ గెలుపు లాంఛనం కానుంది. -
30 ఏళ్ల తర్వాత ఆసీస్..!
సిడ్నీ : భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌ను తప్పించుకోలేకపోయింది. ఇలా సొంతగడ్డపై ఆసీస్ ఫాలోఆన్ ఆడటం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1988లో సొంత గడ్డపై చివరిసారి ఇదే సిడ్నీ మైదానంలో ఇంగ్లండ్‌తో ఫాలో ఆన్ ఆడిన ఆసీస్.. మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇక విదేశాల్లో 2005లో చివరగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాలో ఆన్ ఆడిన ఆసీస్ పరాజయం పాలైంది. తాజా టెస్ట్‌లో వరణుడు పదే పదే అడ్డుపడటంతో మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 300 పరుగులుకే ఆలౌట్ కావడంతో పర్యాటక జట్టుకు 322 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. వర్షం అంతరాయంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉంది. వరుణుడు కరుణిస్తే భారత్ విజయం దాదాపు ఖాయమే. ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ఆధిక్యం సాధించిన కోహ్లిసేన.. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ సొంతం చేసుకోనుంది. తద్వారా ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టుగా రికార్డు సృష్టించనుంది. -
హలో... నేను పైన్‌ను! అటు ఎవరు?
శుక్రవారం ఆట ముగిశాక, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మీడియా సమావేశంలో ఉండగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే... పైన్ మాటలను రికార్డు చేసేందుకు జర్నలిస్టు ఒకరు తన ఫోన్‌ను అతడి ముందు పెట్టాడు. ఈలోగా ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పైన్ ఏమాత్రం సంకోచించకుండా ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. ‘నేను టిమ్ పైన్ మాట్లాడుతున్నా. అటు ఎవరు’? అని ప్రశ్నించాడు. దీనికి ‘హాంకాంగ్ నుంచి క్యాసీని మాట్లాడుతున్నా. మీరెవరంటూ?’ సమాధానం వచ్చింది. అనంతరం ‘మీకు మార్టిన్ కావాలా? అతడు మీడియా సమావేశంలో ఉన్నాడు. నేను అతడితో మీకు కాల్ చేయించవచ్చా?’ అని పైన్ అడగ్గా... ‘మెయిల్స్ చెక్ చేసుకోమనండి’ అని జవాబిచ్చాడు. ఈ విషయం మార్టిన్‌కు చెబుతానని పైన్ నవ్వుతూ సంభాషణను ముగించాడు. -
హలో.. నేను టిమ్‌పైన్ మాట్లాడుతున్నా!
సిడ్నీ : ‘హలో నేను టిమ్‌పైన్ మాట్లాడుతున్నా..’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్రెస్ మీట్ మధ్యలో ఓ జర్నలిస్ట్ ఫోన్‌కు సమాధనమివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారత్‌తో చివరి టెస్ట్ సందర్భంగా రెండో రోజు ఆట అనంతరం టిమ్ పైన్ మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో భారీస్కోర్తో భారత్ ఆదిపత్యం చలాయించినప్పటికి.. టిమ్ పైన్ మాత్రం ఒత్తిడిని దరిచేరనీయ లేదు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు టిమ్ పైన్ సీరియస్‌గా సమాధానాలు చెబుతున్న సమయంలో ఓ మొబైల్ ఫోన్ మోగింది. దీంతో ఈ ఫోన్ ఎవరిది అంటూ టిమ్ ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. ‘నేను టిమ్‌పైన్ మాట్లాడుతున్నా.. మీకు ఎవరు కావాలి’? అంటూ అడిగాడు. దానికి అవతలి వ్యక్తి తన పేరు కేసీ అని, తనకు మార్టిన్ కావాలని అడిగింది. అతడు ప్రెస్మీట్లో మధ్యలో ఉన్నాడని, తర్వాత అతనితో కాల్ చేయిస్తానని పైన్ చెప్పాడు. ఒక్కసారి అతన్ని మెయిల్ చెక్ చేసుకోమని కేసీ చెప్పడంతో అలాగే అంటూ టిమ్ పైన్ ఫోన్ పెట్టేశాడు. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో ఓ జర్నలిస్ట్‌కు వచ్చిన ఫోన్ కాల్ లిప్ట్ చేసి టిమ్ పైన్ మాట్లాడటం చూసి అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
గెలిస్తే గొప్ప ఘనతవుతుంది!
సిడ్నీ: నాలుగేళ్ల క్రితం ధోని అనూహ్య రిటైర్మెంట్తో సిడ్నీలో జరిగిన చివరి టెస్టుతోనే కోహ్లి కెప్టెన్‌గా బాధ్యత చేపట్టాడు. ఆ సమయంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న భారత్ కోహ్లి నాయకత్వంలో వరుస విజయాలు సాధించి నంబర్‌వన్‌గా ఎదిగింది. ఇప్పుడు ‘టాప్’ హోదాలో మరోసారి అదే మైదానానికి వచ్చిన కోహ్లి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడం ఎంతో కష్టమని, ఇప్పుడు గనక దానిని సాధిస్తే అది చాలా పెద్ద ఘనత అవుతుందని వ్యాఖ్యానించాడు. ‘నేను వరుసగా మూడో సారి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాను. ఇక్కడ సిరీస్ గెలుపు ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. నా నాయకత్వంలో ఇక్కడి నుంచి భారత జట్టు కొత్త ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు నంబర్‌వన్‌గా మళ్లీ వచ్చాం. దానిని కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాం. అందుకే సిరీస్ గెలిస్తే దానిని నేను మాత్రమే కాకుండా జట్టంతా గొప్ప ఘనతగా భావిస్తుంది’ అని కోహ్లి అన్నాడు. తన దృష్టిలో గత రికార్డులకు ఎలాంటి విలువ లేదని, తాను చరిత్రను పట్టించుకోనని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లలో ఎప్పుడైనా గెలవాలనే కసి ఉండాలన్నాడు. ‘మనకు ఏదైనా లక్ష్యం మాత్రమే ఉంటే ఒకటి రెండు మ్యాచ్‌ల తర్వాత అది ముగిసిపోతుంది. కానీ ఎప్పుడైనా గెలవాలనే కసి ఉంటే మాత్రం అది ఆగిపోదు. మెల్బోర్న్ టెస్టులో గెలిచిన క్షణాన ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారితో సహా ప్రతీ ఒక్కరు తమ భావోద్వేగాలు ప్రదర్శించారు. అందరిలోనూ ఒక రకమైన కసి అక్కడ కనిపించింది. నిజాయతీగా చెప్పాలంటే గతంలో ఏం జరిగిందనేది అనవసరం. నేను వర్తమానంపైనే దృష్టి పెట్టి పని చేస్తా’ అని కోహ్లి కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాలో సిరీస్ విజయంతో తాను ఏదో నిరూపించుకోవాలని భావించడం లేదన్న భారత కెప్టెన్... కొత్త సంవత్సరాన్ని గెలుపుతో ప్రారంభిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. అశ్విన్ గాయం కొత్తది కాదు! వరుసగా రెండు విదేశీ పర్యటనల్లోనూ ప్రధాన స్పిన్నర్ అశ్విన్ ఒకే తరహా గాయంతో బాధపడుతున్నాడని, దీనికి పరిష్కారం చూడాల్సి ఉందని కోహ్లి వ్యాఖ్యానించాడు. ‘ఇంగ్లండ్‌లో, ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అశ్విన్‌కు ఒకే తరహా గాయం ఉండటం దురదృష్టకరం. దీనికి చికిత్స తీసుకోవడంపై అతను దృష్టి పెట్టాడు. ఫిజియో, ట్రైనర్ కూడా అందుకు సహకరిస్తున్నారు. టెస్టు క్రికెట్లో అతను ఎంత కీలకమో తెలుసు కాబట్టి 100 శాతం ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. సరైన సమయంలో కోలుకోలేకపోతున్నందుకు అశ్విన్ కూడా బాధపడుతున్నాడు’ అని కోహ్లి చెప్పాడు. మరోవైపు ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి బౌలింగ్‌పై కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. నిజానికి అశ్విన్ గైర్హాజరులో ఆఫ్ స్పిన్ లోటు కనిపించడం లేదని, విహారి పార్ట్‌టైమర్‌గానే ఆ పని చేస్తున్నాడని కోహ్లి చెప్పాడు. అతనికి ఎప్పుడు అవకాశం ఇచ్చినా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ తమకు మంచి ప్రత్యామ్నాయంగా మారాడని కోహ్లి అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
సిరీస్ కోల్పోతామనే బెంగ లేదు!
సిడ్నీ: నాలుగో టెస్టులో భారత్ గెలిచినా లేదా ‘డ్రా’ చేసుకున్నా ఆస్ట్రేలియా గడ్డపై తొలి సిరీస్ విజయమవుతుంది. స్వదేశంలో టీమిండియాకు సిరీస్ కోల్పోయిన మొదటి ఆసీస్ కెప్టెన్‌గా టిమ్ పైన్ ఖాతాలో చెత్త రికార్డు చేరుతుంది. అయితే తాను దాని గురించి అతిగా ఆలోచించడం లేదని, జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టినట్లు పైన్ చెబుతున్నాడు. ‘మా ఆటను మెరుగుపర్చుకొని సాధ్యమైనంత ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం ముఖ్యం. మేం కూడా ప్రతీ టెస్టు గెలవాలని కోరుకుంటాం. కానీ అది సాధ్యం కాదు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ జట్టును ఎదుర్కొంటున్నాం. సిరీస్ కోల్పోవడం గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. మా ఆటను బాగుపర్చడం, భారత్‌కు గట్టి పోటీనివ్వడమే ప్రస్తుతం నా లక్ష్యం’ అని పైన్ పేర్కొన్నాడు. -
పంత్.. నీ స్లెడ్జింగ్‌ను స్వాగతిస్తున్నా: ఆస్ట్రేలియా ప్రధాని
-
పంత్.. నీ స్లెడ్జింగ్‌ను స్వాగతిస్తున్నా: ఆస్ట్రేలియా ప్రధాని
సిడ్నీ : భారత్-ఆస్ట్రేలియాల బోర్డర్ గావాస్కర్ టెస్ట్ సిరీస్ ఆసాంతం టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్‌పంత్ హాట్ టాపిక్ అవుతున్నాడు. మైదానంలో ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్‌తో వ్యవహరించిన తీరు.. అనంతరం వారి కుటుంబంతో గడపడం, పైన్ సతీమణి బెస్ట్ బేబీసిట్టర్ అంటూ.. పంత్‌ను కొనియాడటం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే చివరి టెస్ట్ ఆడేందుకు సిడ్నీకి వచ్చిన ఇరు జట్ల ఆటగాళ్లకు ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తన నివాసంలో విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రిషభ్ పంత్ ఆసీస్ ప్రధానికి తారసపడగా.. అక్కడున్న టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం పరిచయం చేయబోయ్యారు. మారిసన్ వెంటనే ‘అయ్యో ఇతను నాకెందుకు తెలియదు.. పంత్.. నీవు స్లెడ్జ్ చేశావ్ కదా! నీ స్లెడ్జింగ్‌ను నేను స్వాగతిస్తున్నాను. మేం ఇలాంటి రసవత్తర పోరునే ఇష్టపడతాం’ అని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక మూడో టెస్ట్‌లో పైన్-పంత్‌ల మధ్య స్లెడ్జింగ్ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పైన్.. ‘జట్టులోకి ధోని వచ్చాడు. ఇక నువ్వు ఇక్కడే మా బిగ్‌బాష్ లీగ్ ఆడుకో. హోబర్ట్ హరికేన్స్ తరఫున బ్యాటింగ్ చెయ్. అలా ఆసీస్‌లో సెలవుల్ని అస్వాదించు. అన్నట్లు నేను నా భార్య సినిమాకెళ్లి చాలా రోజులైంది. నువ్వు మా ఇంట్లో బేబీ సిట్టర్‌గా ఉంటే మేమిద్దరం సినిమాని ఎంజాయ్ చేస్తాం’ అంటూ స్లెడ్జింగ్ చేశాడు. దీనికి రిషభ్ కూడా దీటుగానే బదులిచ్చాడు. పైన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మయాంక్‌తో ‘ఈ రోజు మనం ఓ ప్రత్యేక అతిథిని చూస్తున్నాం. పెద్దగా బాధ్యతలేని పని. అదే తాత్కాలిక కెప్టెన్. ఎపుడైనా ఇలాంటి తాత్కాలిక కెప్టెన్‌ను చూశామా? దాని గురించి విన్నామా? అతన్ని ఔట్ చేసేందుకు శ్రమించాల్సిన పనిలేదు బాయ్స్ (బౌలర్లనుద్దేశించి). మాట్లాడితే చాలు. అతిగా మాట్లాడటమే ఇష్టం. అంతే’ అని నోటితోనే బదులిచ్చాడు. ఇదంతా వివాదం కాకపోవడంతో ఈ మ్యాచ్ ఆరోగ్యకరంగానే ముగిసింది. ఇక ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న కోహ్లిసేన.. రేపటి (గురువారం) నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్ట్‌ను సైతం నెగ్గి చరిత్రసృష్టించాలని భావిస్తోంది. -
పంత్... బెస్ట్ బేబీసిట్టర్!
సిడ్నీ: మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్, భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ క్రీజ్‌లో నోటికి పని చెప్పారు. ఒకరు బ్యాటింగ్ చేస్తుంటే మరొకరు స్లెడ్జింగ్‌కు దిగారు. హద్దులు దాటని ఈ కామెంట్లు ఆ టెస్టులో ఓ భాగమయ్యాయి. అలాగే ఇద్దరి మాటల తూటాలు మీడియాలో బాగానే పేలాయి. అప్పుడు పైన్ చేసిన కామెంట్‌ను పంత్ తాజాగా నిజం చేశాడు. ‘బెస్ట్ బేబీ సిట్టర్’గా అతని భార్య నుంచే కితాబు అందుకున్నాడు. బేబీ సిట్టర్ అంటే తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేనపుడు పసిపిల్లల ఆలనాపాలన చూసే సంరక్షకుడని అర్థం. ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తన నివాసంలో కొత్త సంవత్సరం సందర్భంగా మంగళవారం ఇరు జట్లకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఇందుకు పైన్ భార్య బోని తన ఇద్దరి పిల్లల్ని తీసుకొచ్చింది. వారిలో ఒకరిని పంత్ ఎత్తుకున్నాడు. పక్కనే బోని మరో చిన్నారిని ఎత్తుకుంది. ఈ ఇద్దరిపై కెమెరాలు క్లిక్‌మన్నాయి. అంతే ఆ ఫొటోను పైన్ భార్య బోని తన ఇన్‌స్ట్రాగామ్‌లో సరదాగా ‘పంత్ బెస్ట్ బేబీ సిట్టర్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. మొత్తానికి ‘బాక్సింగ్ డే’ టెస్టులోని స్లెడ్జింగ్ వేడి ‘న్యూ ఇయర్’లో ఇలా చల్లబడింది. మూడో టెస్టులో రిషభ్ బ్యాటింగ్ చేస్తుంటే పైన్ వ్యంగాస్త్రాలు సంధించాడు. ‘జట్టులోకి ధోని వచ్చాడు. ఇక నువ్వు ఇక్కడే మా బిగ్‌బాష్ లీగ్ ఆడుకో. హోబర్ట్ హరికేన్స్ తరఫున బ్యాటింగ్ చెయ్. అలా ఆసీస్‌లో సెలవుల్ని అస్వాదించు. అన్నట్లు నేను నా భార్య సినిమాకెళ్లి చాలా రోజులైంది. నువ్వు మా ఇంట్లో బేబీ సిట్టర్‌గా ఉంటే మేమిద్దరం సినిమాని ఎంజాయ్ చేస్తాం’ అంటూ స్లెడ్జింగ్ చేశాడు. దీనికి రిషభ్ కూడా దీటుగానే బదులిచ్చాడు. మయాంక్‌తో ‘ఈ రోజు మనం ఓ ప్రత్యేక అతిథిని చూస్తున్నాం. పెద్దగా బాధ్యతలేని పని. అదే తాత్కాలిక కెప్టెన్. ఎపుడైనా ఇలాంటి తాత్కాలిక కెప్టెన్‌ను చూశామా? దాని గురించి విన్నామా? అతన్ని ఔట్ చేసేందుకు శ్రమించాల్సిన పనిలేదు బాయ్స్ (బౌలర్లనుద్దేశించి). మాట్లాడితే చాలు. అతిగా మాట్లాడటమే ఇష్టం. అంతే’ అని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు. ఇదంతా వివాదం కాకపోవడంతో ఆరోగ్యకరంగానే ముగిసింది. -
మెల్బోర్న్లో మువ్వన్నెలు
‘మెల్బోర్న్ వాతావరణం ఎలా ఉంది’... గత 24 గంటల్లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశాల్లో ఒకటి. ఇందులో భారత క్రికెట్ అభిమానులే పెద్ద సంఖ్యలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఎంసీజీలో టీమిండియా విజయం వాకిట నిలిచిన దశలో వాన వస్తే ఎక్కడ మ్యాచ్ ‘డ్రా’గా ముగుస్తుందోనని వారంతా సహజంగానే ఆందోళన చెందారు. అందరూ భయపడినట్లే వర్షం రానే వచ్చింది... తొలి సెషన్‌ను మొత్తం తుడిచి పెట్టేసింది కూడా. కానీ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై వరుణుడు కూడా కరుణించలేదు. వాన ఆగిన తర్వాత మ్యాచ్ కొనసాగగా మన పేసర్లు బుమ్రా, ఇషాంత్ చెలరేగిపోయారు. వర్షానికి మరో అవకాశం ఇవ్వకుండా 27 బంతుల్లోనే ఆట ముగించేశారు... ఫలితంగా మూడో టెస్టులో భారీ విజయం భారత్ సొంతమైంది. సిరీస్‌లో 2–1 ఆధిక్యంతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీ టీమిండియాను వీడకుండా చెంతనే ఉండిపోయింది. ఇక సిడ్నీలో కూడా ఇదే తరహాలో సత్తా చాటితే ఏడు దశాబ్దాల్లో తొలిసారి కంగారూ గడ్డపై సిరీస్ కూడా మన సొంతమవుతుంది. మెల్బోర్న్: ఎంసీజీ మైదానంలో చివరి రోజు లాంఛనం ముగిసింది. ఆసీస్ చివరి వరుస బ్యాట్స్‌మెన్ పట్టుదలతో ఆదివారానికి చేరిన మూడో టెస్టు మ్యాచ్ ముగిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. ఓవర్‌నైట్ స్కోరుకు 3 పరుగులు మాత్రమే జత చేయగలిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆసీస్‌ను ఆదుకున్న కమిన్స్ (114 బంతుల్లో 63; 5 ఫోర్లు, సిక్స్), లయన్ (50 బంతుల్లో 7)లను ఎనిమిది బంతుల వ్యవధిలో ఔట్ చేసి టీమిండియా గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో నిలవడంతో సిరీస్ ఓడిపోయే అవకాశం లేదు కాబట్టి సొంతగడ్డపై 2016–17 సీజన్లో గెలుచుకున్న బోర్డర్–గావస్కర్ ట్రోఫీని భారత్ నిలబెట్టుకుంది. మ్యాచ్‌లో 9 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన జస్ప్రీత్ బుమ్రా (9/86)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది. వర్షం వచ్చినా... నిర్ణీత సమయం ప్రకారం ఉ.గం.10.30కి (ఆసీస్ సమయం) ఆట ప్రారంభం కావాల్సింది. అయితే అంతకు ముందునుంచే కురుస్తున్న వర్షం వల్ల అది సాధ్యం కాలేదు. చిరుజల్లులతో పాటు మధ్యలో కొద్ది సేపు వర్షం జోరుగా కురిసింది. పిచ్‌తో పాటు ఔట్‌ఫీల్డ్‌ను కూడా కవర్ చేసిన అనంతరం అంపైర్లు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. వాన ఆగకపోవడంతో 15 నిమిషాలు ముందుగానే లంచ్ విరామం తీసుకున్నారు. అయితే లంచ్ సమయంలో వర్షం తగ్గగా, మొత్తంగా 1 గంటా 45 నిమిషాలు ఆలస్యంగా ఆట మొదలైంది. వర్షం తర్వాత మొదలైన ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముగించేందుకు భారత బౌలర్లకు 4.3 ఓవర్లు మాత్రమే సరిపోయాయి. ఇషాంత్ వేసిన తొలి ఓవర్లో చేసిన మూడు పరుగులే ఆస్ట్రేలియా చివరి రోజు జోడించగలిగింది. రెండు ఓవర్లు మెయిడిన్లుగా ముగిసిన అనంతరం బుమ్రా వేసిన బంతిని కమిన్స్ స్లిప్‌లోకి ఆడగా, పుజారా చక్కటి క్యాచ్ అందుకున్నాడు. ఇషాంత్ వేసిన తర్వాతి ఓవర్లోనే పుల్ షాట్ ఆడబోయి లయన్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ విజయం పూర్తయింది. భారత జట్టులో నుంచి కోహ్లి, పుజారాలను తీసేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మా పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ మీ వద్ద ఉంటూ కూడా జట్టులో లేకపోతే ఏం చేయగలం. ప్రస్తుతం మాత్రం అందరూ అసహనంతోనే ఉన్నారు. ఇప్పుడు మా ముందు మరో సవాల్ నిలిచింది. మేం బ్యాటింగ్‌లో కాసిన్ని ఎక్కువ పరుగులు చేస్తేనే మా బౌలర్లు ఏమైనా చేయగలరు. భారత జట్టులో కూడా లోపాలు ఉన్నాయి. కోహ్లి, పుజారాలను ఔట్ చేస్తే పట్టు దక్కించుకోవచ్చు. ఆసీస్ గడ్డపై మా బలం పేస్ బౌలింగే కాబట్టి బౌన్స్ ఉండే పిచ్‌లను మేం ఆశిస్తాం. వారికి అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేసి అప్పగించామేమో అని కొన్ని సార్లు మాకనిపిస్తోంది. భారత్‌లో పచ్చిక ఉండే వికెట్లు సిద్ధం చేయరు కదా. అయితే అన్ని రంగాల్లో రాణించిన భారత్‌కు గెలిచే అర్హత ఉంది. పెర్త్ టెస్టు తర్వాత మా ఆట మెరుగైందని భావించాం. కానీ తాజా ఫలితం చాలా నిరాశ కలిగించింది. –టిమ్ పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్ మేం ఇక్కడితో ఆగిపోదల్చుకోలేదు. సిడ్నీలో మరింత సానుకూల దృక్పథంతో ఆడేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ఈ విజయం అందించింది. మేం మూడు విభాగాల్లోనూ బాగా ఆడటం వల్లే ట్రోఫీని నిలబెట్టుకోగలిగాం. తాజా ఫలితం నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. మా జట్టు బలాన్ని బట్టి చూస్తే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని మాకు గట్టి నమ్మకం ఉంది. నాలుగు, ఐదు రోజుల్లో బ్యాటింగ్ చేయడం కష్టం కాబట్టే ఫాలోఆన్ ఇవ్వలేదు. ఈ గెలుపు ఘనత అంతా మా బౌలర్లదే. మా దేశవాళీ క్రికెట్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్లే ఈ ఫలితాలు వచ్చాయి. ప్రతికూల పరిస్థితుల్లో పాత బంతితో అక్కడ మన బౌలర్లు కనబర్చిన ప్రదర్శన విదేశాల్లో పనికొచ్చింది. పుజారా ఎప్పటిలాగే బాగా ఆడాడు. ఆస్ట్రేలియాలో పరిస్థితులకు అనుగుణంగా అతను తన ఆటను మార్చుకున్నాడు. మయాంక్ పట్టుదల చూపించగా, విహారి సుదీర్ఘ సమయం క్రీజ్‌లో పాతుకుపోవడం వల్లే మేం మరింత విశ్వాసంతో బ్యాటింగ్ చేయగలిగాం. టెస్టు క్రికెట్లోకి వచ్చిన సంవత్సరం లోపే సత్తా చాటిన బుమ్రా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్. పెర్త్‌లాంటి పిచ్‌పై బుమ్రాను ఎదుర్కోవాలని నేనెప్పుడూ కోరుకోను. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌లో తొలిసారి ఆధిక్యం కనబర్చడం చాలా సంతోషంగా ఉంది. ఇక నాలుగో టెస్టు గెలవకుండా మా ఏకాగ్రతకు ఏదీ భంగం కలిగించలేదు. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ రోహిత్ శర్మకు పుత్రికోత్సాహం... భారత క్రికెటర్ రోహిత్ శర్మ తండ్రయ్యాడు. అతని భార్య రితిక ఆదివారం రాత్రి ముబైలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితిక బంధువు సీమాఖాన్ (బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ భార్య) నిర్ధారించింది. ప్రస్తుతం రోహిత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 443/7 డిక్లేర్డ్; ఆస్ట్రేలియా తొలి ఇన్నిం గ్స్ 151; భారత్ రెండో ఇన్నింగ్స్: 106/8 డిక్లేర్డ్; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హారిస్ (సి) మయాంక్ (బి) జడేజా 13; ఫించ్ (సి) కోహ్లి (బి) బుమ్రా 3; ఖాజా (ఎల్బీ) (బి) షమీ 33; షాన్ మార్‡్ష (ఎల్బీ) (బి) బుమ్రా 44; హెడ్ (బి) ఇషాంత్ 34; మిషెల్ మార్‡్ష (సి) కోహ్లి (బి) జడేజా 10; పైన్ (సి) పంత్ (బి) జడేజా 26; కమిన్స్ (సి) పుజారా (బి) బుమ్రా 63; స్టార్క్ (బి) షమీ 18; లయన్ (సి) పంత్ (బి) ఇషాంత్ 7; హాజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (89.3 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–6; 2–33; 3–63; 4–114; 5–135; 6–157; 7–176; 8–215; 9–261; 10–261. బౌలింగ్: ఇషాంత్ శర్మ 14.3–1–40–2; బుమ్రా 19–3–53–3; జడేజా 32–6–82–3; షమీ 21–2–71–2; విహారి 3–1–7–0. -
అందుకే ఓడాం : ఆసీస్ కెప్టెన్
మెల్బోర్న్ : భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఓటమికి బ్యాట్స్‌మెన్ అనుభవరాహిత్యమే కారణమని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి కొంచెం నిరాశను కలిగించింది. పెర్త్ విజయం పునరావృతం అవుతుందని భావించాను. కానీ బ్యాటింగ్ లైనప్ అనుభవరాహిత్యం మా కొంపముంచింది. ప్రపంచ దిగ్గజ పేస్ అటాక్ ఉన్న జట్టుతో ఆడుతున్నాం. కానీ మా జట్టులో టాప్-6 బ్యాట్స్‌మెన్ అనుభవం లేనివారే. మా తప్పిదాలను తెలుసుకొని ముందుకు సాగుతాం. మా ఆటగాళ్లు వారి శక్తి మేరకు కష్టపడ్డారు. సిడ్నీ టెస్ట్ మాకో పెద్ద చాలెంజ్. ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించి.. సిరీస్‌ను కాపాడుకుంటాం. మా బ్యాటింగ్ ఆర్డర్‌పై మరోసారి సమాలోచనలు జరుపుతాం. సిడ్నీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌దే పూర్తి క్రెడిట్. వారు అద్భుతంగా ఆడారు. ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ అద్భుతం. అతనో నాణ్యమైన ఆటగాడు. ఈ సిరీస్ అసాంతం అతను అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతనిలా రాణించే ఆటగాళ్లు కావాలి. ఒక్క విషయంలో తప్ప ఈ ఏడాది బాగానే గడిచింది. వచ్చే ఏడాది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులోకి రాబోతున్నారు. ఇది ఆసీస్ జట్టుకు కలిసొచ్చే అంశం.’ అని పైన్ చెప్పుకొచ్చాడు. మూడో టెస్ట్‌లో భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. ఆధిపత్యాన్ని చలాయిస్తాం: కోహ్లి ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘సిరీస్‌లో మా ఆధిపత్యాన్ని ఇక్కడితో ఆపదల్చుకోలేదు. ఈ విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కాబట్టి.. రెట్టించిన ఉత్సాహంతో సిడ్నీ టెస్టులో ఆడతాం. సిరీస్‌లో గెలిచిన రెండు టెస్టుల్లోనూ భారత్ జట్టు అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించింది. అయితే.. ఆస్ట్రేలియా గడ్డపై మా పని ఇంకా ముగియలేదు. ఆఖరి టెస్టులో విజయం సాధించాలి. ఆ మ్యాచ్‌లో గెలిచేందుకు ఏ అవకాశం లభించినా.. చేజార్చుకోం. కచ్చితంగా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తాం’ అని విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. చివరి టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను భారత్ కాపాడుకుంటే సిరీస్ భారత్ వశం కానుంది. -
మెల్బోర్న్లో చరిత్ర సృష్టించిన భారత్
-
ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం
-
బాక్సింగ్ డే టెస్ట్ భారత్‌దే!
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి విజయం నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 399 పరుగుల భారీలక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు భారత్ బౌలర్ల దాటికి కుదేలైంది. ఏకంగా 137 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ గెలుపుతో భారత్ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించింది. ప్యాట్ కమిన్స్ అద్భుత అర్ధ సెంచరీతో విజయం కోసం భారత్ చివరి రోజు వరకు నిరీక్షించాల్సి వచ్చింది. 258/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. మరో మూడు పరుగుల్లోనే చివరి రెండు వికెట్లు కోల్పోయింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యమైనప్పటికీ విజయం వరించడానికి మాత్రం ఎంతోసేపు పట్టలేదు. కమిన్స్(63; 114 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్)ను బుమ్రా ఔట్ చేయగా.. నాథన్ లయన్(7; 50 బంతులు) ను ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో బాక్సింగ్ డే టెస్ట్ భారత్ వశమైంది. ఇక ఇది టెస్ట్‌ల్లో భారత్‌కు 150వ విజయం కావడం విశేషం. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో జట్టుగా భారత్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన బూమ్రాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి విజయం.. ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో 8 బాక్సింగ్ డే టెస్ట్‌లు ఆడిన భారత్.. తొలి సారి విజయం సాధించింది. ఐదు సార్లు ఆసీస్ విజయం సాధించగా.. రెండు టెస్ట్‌లు డ్రాగా ముగిసాయి. ఇక ఆసీస్ పర్యటనలో భారత్ సిరీస్ కోల్పోకుండా ఉండటం భారత్‌కు ఇది నాలుగోసారి. 1980-81, 1958-86, 2000-04 పర్యటనల్లో భారత్ సిరీస్‌లను డ్రా చేసుకోంది. చివరి టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను భారత్ కాపాడుకుంటే సిరీస్ భారత్ వశం కానుంది. తద్వారా ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనే కోహ్లిసేన లక్ష్యం నెరవేరతుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 443/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 106/8 డిక్లేర్డ్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 151 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 261 ఆలౌట్ -
టిమ్‌పైన్‌కు స్లెడ్జింగ్ రుచి చూపించిన పంత్
-
పైన్ మంచి అవకాశం కోల్పోయాడు : ముంబై ఇండియన్స్
ముంబై : ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్ బంగారంలాంటి అవకాశం కోల్పోయాడని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ పేర్కొంది. భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పైన్ తన నోటికి పనిచెబుతూ రోహిత్‌ను కవ్వించిన విషయం తెలిసిందే. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని ఏకాగ్రతను దెబ్బతీసేలా సిక్స్ కొడితే ముంబై జట్టుకి మారిపోతానని రెచ్చగొట్టాడు. వీటిని పట్టించుకోని హిట్‌మ్యాన్.. నిలకడగా తన బ్యాటింగ్ కొనసాగించాడు. అనంతరం ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. టిమ్‌పైన్‌కు మంచి ఆఫర్ ఇచ్చాడు. ‘పైన్ ముంబై అభిమానిలా కనిపిస్తున్నాడు.. మూడో టెస్ట్‌లో సెంచరీ చేస్తే ముంబై జట్టులోకి తీసుకుంటాం’ అని తెలిపాడు. అయితే ఈ వ్యాఖ్యలనే కోట్ చేస్తూ ముంబై ఇండియన్స్ జట్టు తమ అధికారిక ట్విటర్లో పైన్ మంచి అవకాశాన్ని కోల్పోయాడని పోస్ట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పైన్ 26(67 బంతులు) జడేజా బౌలింగ్‌లో రిషభ్ పంత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ టిమ్ పైన్ మిషన్ ఫెయిల్ అయిందంటూ ట్వీట్ చేసింది. ”If he (Paine) gets a hundred here, I will put in a word about him to my boss at Mumbai Indians and we'll buy him. Looks like he's a fan of Mumbai." - @ImRo45 Tim Paine: c Pant b Jadeja - 26 (67) #CricketMeriJaan #AUSvIND pic.twitter.com/c36xdjZRYW — Mumbai Indians (@mipaltan) December 29, 2018 -
మాంకీ.. టెంపరరీ కెప్టెన్ వచ్చాడు: పంత్ స్లెడ్జింగ్
మెల్బోర్న్ : స్లెడ్జింగ్ చేయడంలో తానేం తక్కువ కాదంటున్నాడు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో కమిన్స్‌కు మాటకు మాటతోనే బదులిచ్చిన ఈ యువ వికెట్ కీపర్ తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆ జట్టు కెప్టెన్ టీమ్‌పైన్‌కు అదే తరహాలో బుద్ది చెప్పాడు. ఇక మూడో రోజు ఆటలో టీమ్ పైన్ తన నోటి దురుసు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పదే పదే సూటి పోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడు. ‘ధోని వచ్చాడు కదా.. ఇప్పుడేం చేస్తావ్? వచ్చి బీబీఎల్ ఆడుతావా?’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కవ్వించాడు. పైన్ ఎంత రెచ్చగొట్టినా.. పంత్ మాత్రం సహనం కోల్పోకుండా తన ఆటను కొనసాగించాడు. ఇదంతా మనసులో పెట్టుకున్న పంత్ అవకాశం కోసం ఎదురు చూసి సరైన రీతిలో బదులిచ్చాడు. నాలుగో రోజులో ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన పైన్‌పై మాటల దాడి చేసి.. తానేం తక్కువ కాదని ‘స్లెడ్జింగ్ నీకు ఒక్కడికే కాదు.. మాకు తెలుసు’ అన్నట్లు వ్యవహరించాడు. ఫార్వార్డ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్‌తో మాట్లాడుతూ.. ‘మాంకీ.. ఈ రోజు నీకు ఓ ముఖ్య అతిథి కనిపిస్తాడు. కమాన్ మాంకీ. ఎప్పుడైన, ఎక్కడైనా తాత్కలిక కెప్టెన్ అనే పదం విన్నావా? అతను ఔట్ అవ్వడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. అతనికి మాట్లాడటం అంటే ఇష్టం. అదొక్కటే అతను చేయగలడు.’ అని సెటైరిక్‌గా వ్యాఖ్యానిస్తూ రెచ్చగొట్టాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్స్ మైక్స్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. టిమ్ పైన్ దురదృష్టమో.. ఏమో కానీ పంత్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పంత్ స్లెడ్జింగ్‌ను భారత్ అభిమానులు సమర్ధిస్తున్నారు. యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని, పైన్‌కు దిమ్మతిరిగినట్లుంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇక పంత్ స్లెడ్జింగ్‌పై టాలీవుడ్ హాస్య నటుడు వెన్నెల కిషోర్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. ఓ అభిమాని పోస్ట్‌కు బదులుగా ‘ఏదో మనసులో పెట్టుకున్నాడు. పాపం టిమ్.. క్యూట్‌గా అంపైర్‌కు ఫిర్యాదు చేసినట్టున్నాడు’ అని తన కామిక్ స్టైల్లో రిప్లే ఇచ్చాడు. Edo manasulo pettukunnadu🤣🤣..Paapam tim cute ga umpire ku complain chesinattunnadu — vennela kishore (@vennelakishore) December 29, 2018 చదవండి : పంత్‌పై నోరుపారేసుకున్న టిమ్ పైన్ -
పంత్‌పై నోరుపారేసుకున్న టిమ్ పైన్
మెల్బోర్న్ : గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను మించినవారు లేరనడంలో అతిశయోక్తి లేదేమో! భారత్‌తో సిరీస్‌కు ముందు తాము మారిపోయామని సుద్దపూస మాటలు చెప్పిన ఆసీస్ ఆటగాళ్లు.. ఆచరణలో మాత్రం దాన్ని చూపించడం లేదు. తొలి టెస్ట్ నుంచే మాటలతో రెచ్చగొడుతూ.. కవ్వింపు చర్యలకు పాల్పుడుతూ వచ్చిన ఆటగాళ్లు.. తాజాగా మూడో టెస్ట్‌లో కూడా అదే తరహా ప్రవర్తనను కనబర్చారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌కు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. నోటికెంత వస్తే అంత మాట్లాడుతూ భారత ఆటగాళ్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. రెండో రోజు ఆటలో రోహిత్ సిక్స్ కొడితే.. ముంబైజట్టుకు మారిపోతానని కవ్వించిన పైన్.. మూడో రోజు ఆటలో వికెట్ కీపర్ పంత్‌ను టార్గెట్ చేస్తూ నోరుపారేసుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న పంత్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ రెచ్చగొట్టాడు. ఆసీస్‌తో జరిగే వన్డే జట్టులో చోటు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ‘పంత్.. ధోని వచ్చేశాడు కదా..ఏం చేస్తావ్.. బీబీఎల్‌లో హరికేన్స్ జట్టు తరఫున ఆడుతావా?’ అంటూ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దీన్ని ఏమాత్రం పట్టించుకోని పంత్ తనపని తాను చేసుకుంటూ పోయాడు. పైన్ వ్యాఖ్యలు స్టంప్స్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఇక తొలిటెస్ట్‌లో కమిన్స్‌కు దీటుగా పంత్ స్లెడ్జింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్ ఆటగాళ్లు ఎంత రెచ్చగొడుతున్నా.. భారత ఆటగాళ్లు సహనం ప్రదర్శించడం వల్ల వివాదాస్పదం కావడం లేదు కానీ.. వారికి దీటుగా స్పందిస్తే మైదానంలో పెద్ద గొడవలే జరుగుతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా చేష్టలతోనే బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని చేతులు కాల్చుకున్నా.. ఆసీస్ ఆటగాళ్లకు బుద్ది రావడం లేదని మండిపడుతున్నారు. Tim Paine doing some recruiting for the @HurricanesBBL out in the middle of the 'G... 😂 #AUSvIND pic.twitter.com/6btRZA3KI7 — cricket.com.au (@cricketcomau) December 28, 2018 -
టిమ్ పైన్‌కు రోహిత్ శర్మ ఆఫర్ !
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ స్లెడ్జింగ్‌పై టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ స్పందించాడు. పైన్‌కు ఓ మంచి ఆఫర్ కూడా ఇచ్చాడు. తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో పైన్ సెంచరీ చేస్తే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంటామన్నాడు. తానే స్వయంగా తమ ముంబై జట్టు బాస్‌తో మాట్లాడి జట్టులోకి తీసుకునేలా ఒప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఇక మూడో టెస్ట్‌లో భాగంగా రెండో రోజు ఆటలో రోహిత్ ఏకాగ్రత దెబ్బతినేలా టిమ్‌పైన్ స్లెడ్జింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నఅరోన్ ఫించ్‌తో పరోక్షంగా ‘నువ్వు ఇప్పుడు సిక్స్ కొడితే.. నేను ముంబైకి మారిపోతా’ అంటూ కవ్వించాడు. అయితే ఈ వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోని రోహిత్ తన బ్యాటింగ్‌ను నిలకడగా కొనసాగించాడు. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు రోహిత్ ఈ స్టెడ్జింగ్పై స్పందిస్తూ.. ‘నేను పైన్ మాటలు విన్నా. కానీ పట్టించుకోలేదు. కేవలం నా బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి సారించాను. కానీ అదే సమయంలో నేను రహానేతో సరదాగా మచ్చటించాను. పైన్ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. మా ముంబై బాస్‌ను ఒప్పించి మరీ కొనుగోలు చేస్తాం. అతన్ని చూస్తే ముంబై అభిమానిలా ఉన్నాడు.’ అని రహానేతో చెప్పానని రోహిత్ పేర్కొన్నాడు. తన వెన్నునొప్పి గురించి మాట్లాడుతూ.. ‘ఈ సమస్యతో నేను తొలిసారి బాధపడుతున్నాను. ఇప్పేడేం అంతగా నొప్పి లేదు. ప్రస్తుతం బాగానే ఉంది. గతంలో ఇదే తరహా సమస్యతో బాధపడ్డ కోహ్లితో మాట్లాడాను. ఇది తిరగబెట్టే సమస్యా అని చెప్పాడు. నిన్న ఈ నొప్పిని అంతగా పట్టించుకోలేదు. కానీ కోహ్లి చెప్పిన విషయంతో ప్రస్తుతం జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. రెండో రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెన్ను నొప్పితో రోహిత్ ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే. చదవండి: నువ్వు సిక్స్ కొడితే.. ముంబైకి మారిపోతా..! -
నువ్వు సిక్స్ కొడితే.. ముంబైకి మారిపోతా..!
మెల్బోర్న్: మేం మారిపోయామని ఆసీస్ క్రికెటర్లు ఎంత చెప్పుకున్నా అది వాస్తవంలో కనిపించదనేది మరోసారి రుజువైంది. టీమిండియాతో మూడో టెస్టులో సైతం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ తన నోటికి పని చెప్పాడు. భారత ఆటగాడు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతన్ని కవ్వించే యత్నం చేశాడు పైన్. రోహిత్ అంటేనే సిక్సర్లకు మారుపేరు. అటువంటిది రోహిత్‌ను ఇక్కడ సిక్స్ కొట్టి చూడు అంటూ స్లెడ్జింగ్ దిగాడు. రోహిత్ శర్మ అర్ధ శతకం పూర్తి చేశాడు. టెస్టు కెరీర్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే తాపత్రయంతో చాలా ఓపికగా ఆడుతున్నాడు. అయితే రోహిత్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆసీస్ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ వికెట్ల వెనకాల నుంచి ప్రయత్నించాడు. లయాన్ బౌలింగ్‌లో రోహిత్‌ను టీజ్ చేయడం మొదలుపెట్టాడు. దీనికి ఐపీఎల్‌ను ముడిపెడుతూ రోహిత్‌కు సవాల్ విసిరాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ లెగ్‌లో అరోన్ ఫించ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఫించ్‌కు రోహిత్‌కు పోటీ పెట్టాడు. ‘ఫించ్ నువ్వు ఐపీఎల్లో దాదాపు అన్ని జట్ల తరపున ఆడావు కదా. బెంగళూరు తప్ప మిగతా జట్లకు ఆడా’ అంటూ పైన్‌కు బదులిచ్చాడు. దీన్ని రోహిత్‌కు ఆపాదిస్తూ ... నువ్వు ఇప్పుడు సిక్స్ కొడితే.. నేను ముంబైకి మారిపోతా’ అంటూ సవాల్ విసిరాడు. అయితే రోహిత్ మాత్రం ఆ వ్యాఖ్యలను పట్టించుకోకుండా తన బ్యాటింగ్‌ను నిలకడగా కొనసాగించాడు. రోహిత్‌ను టిమ్ పైన్ టీజ్ చేసిన మాటలు వికెట్ల దగ్గర మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. తన తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 443/7 వద్ద డిక్లేర్ చేయగా, రోహిత్ 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. Aaron Finch discusses the IPL banter with skipper Tim Paine when Rohit Sharma was out in the middle #AUSvIND pic.twitter.com/wcuElzaHHE — cricket.com.au (@cricketcomau) 27 December 2018 -
నా సెంచరీ గురించి మాట్లాడటం వృథా : కోహ్లి
పెర్త్ : ఓటమి తర్వాత వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడటం అనవసరమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 146 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘జట్టుగా మేం బాగానే ఆడాం. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాకంటే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ పిచ్‌పై 330 పరుగులు చాలా ఎక్కువ. వారు విజయానికి అర్హులు. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. పిచ్‌ను పరిశీలించినప్పుడు మాకు జడేజా గుర్తుకు రాలేదు. ఆ సమయంలో నలుగురు పేసర్లు చాలు అనుకున్నాం. కానీ నాథన్ అద్భుతంగా రాణించాడు. ఓడినప్పుడు వ్యక్తిగత ప్రదర్శనల గురించి ప్రస్తావించడం అసంబద్ధం. నా వికెట్ విషయంలో అంపైర్ నిర్ణయంపై కూడా స్పందించడం వృథా. అది మైదానంలో జరిగింది. అక్కడే వదిలేయాలి. ప్రస్తుతం నా దృష్టంతా తదుపరి మ్యాచ్‌పైనే.’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఇక ఈ విజయంపై ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతోనే ఇది సాధ్యమైందన్నాడు. నాథన్ లయన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ప్రతీ జట్టు ఇలాంటి స్పిన్నర్‌ను కోరుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇది చాలా కఠినమైన మ్యాచ్ అని, ఇరు జట్లు మంచి పేస్‌బలగంతో పోటీ పడ్డాయన్నాడు. ఈ విజయం పట్ల గర్వంగా ఉందని, ఉస్మాన్ ఖాజా చాలా సేపు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. ఇక బాల్ ట్యాంపరింగ్ ఘటన అనంతరం ఆసీస్ టెస్ట్‌ల్లో తొలి విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. చదవండి: కోహ్లిసేన ఓటమికి కారణాలివేనా? -
కోహ్లిసేన ఓటమికి కారణాలివేనా?
పెర్త్ : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన భారత్.. రెండో టెస్ట్‌లో చతికిలపడింది. తొలి టెస్ట్ విజయంతో సిరీస్‌లో ఆధిక్యం సాధించిన కోహ్లి సేన.. అదే ఊపును కొనసాగిస్తుందని అందరూ భావించారు. తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించి విజయాన్నందుకున్న టీమిండియా రెండో టెస్ట్‌లో స్వియ తప్పిదాలతో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. జట్టు కూర్పు, ఓపెనర్ల విఫలం, తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం భారత విజయవకాశాలను దెబ్బతీశాయి. స్పిన్నర్ లేకపోవడం.. తొలి టెస్ట్‌లో రాణించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయంతో సెకండ్ మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో మరో స్పిన్నర్ రవీంద్ర జడేజాను తీసుకోకుండా కోహ్లి పెద్ద తప్పు చేశాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, చివరకు జట్టులోని ఆటగాళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు. పిచ్‌ను అంచనా వేసే విషయంలో కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు పప్పులో కాలేశారు. పేస్‌కు అనుకూలిస్తుందని భ్రమపడి నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగారు. ఇది భారత్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ విషయం ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ 8 వికెట్లతో చెలరేగడంతో స్పష్టమైంది. ఇక ఒక్క బౌలింగ్‌లోనే కాదు.. అటు బ్యాటింగ్‌లోని పెద్ద దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ అనంతరం ఈ విషయం సుస్పష్టమైంది. కోహ్లి వికెట్ అనంతరం అందరూ బౌలర్లే కావడంతో వికెట్ కీపర్ రిషభ్ పంత్ దాటిగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ స్థానంలో జడేజా.. పంత్‌కు తోడుగా ఉండి ఉంటే మరో మంచి భాగస్వామ్యంతో భారత్‌కు స్పల్ప ఆధిక్యమన్నా లభించేది. అప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. భారత ఓటమి అనంతరం టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయాన్నే చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో చెలరేగిన మహ్మద్ షమీ సైతం ఒక స్పిన్నర్ ఉంటే బాగుండూ అని అభిప్రాయపడ్డాడు. కొంపముంచిన అంపైర్ నిర్ణయం.. భారత తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కూడా భారత్ కొంపముంచింది. హ్యాండ్స్కోంబ్ పట్టిన క్యాచ్‌తో వివాదాస్పద రీతిలో పెవిలియన్ చేరిన కోహ్లి అప్పటికే అద్భుత సెంచరీతో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. జట్టు స్కోర్ 251 పరుగుల వద్ద కోహ్లి(123) ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ అనంతరం మరో 32 పరుగుల్లోపే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఆతిథ్య జట్టు 43 పరుగులు ఆధిక్యం లభించింది. కోహ్లి మరికొద్ది సేపు ఉంటే.. పంత్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉండేది. భారీ ఆధిక్యం సాధించకపోయినా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై పైచేయి సాధించేది. ఇది ఇరు జట్ల సెకండ్ ఇన్నింగ్స్‌లపై ప్రభావం చూపేది. ఓపెనర్ల విఫలం.. ఈ సిరీస్‌లో ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌లు దారుణంగా విఫలమవుతుండటం భారత బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాట్స్‌మెన్ తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. అంతేకాకుండా ప్రత్యిర్థి బౌలర్లకు బలంగా మారుతోంది. ఈ ప్రభావం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 2 పరుగులు చేయగా.. మురళీ విజయ్ డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ డకౌట్ కాగా.. మురళి విజయ్ కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో చతేశ్వరా పుజారా(24, 4) దారుణంగా విఫలమయ్యాడు. ఇక కోహ్లి ఔట్ అయిన అనంతరం మ్యాచ్ చేజారినట్లు ఇతర ఆటగాళ్లు భావించడం కూడా భారత్‌కు ప్రతికూలంగా మారుతోంది. ఈ విషయం చివరి రోజు ఆటతో స్పష్టమైంది. కనీస పోరాట పటిమ ప్రదర్శించకుండా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. విహారి, పంత్‌లు వారికి దక్కిన చక్కని అవకాశాలను ఉపయోగించుకోవడం లేదు. అంతా కోహ్లిపైనే ఆధారపడటం కూడా భారత్‌కు అంతమంచిది కాదు. -
భారత్ ఘోర పరాజయం
-
పెర్త్ టెస్ట్: భారత్ ఘోర పరాజయం!
పెర్త్ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ ఘోర పరాజాయాన్ని మూటగట్టుకుంది. తొలి టెస్టులోనే విజయం సాధించి కొత్తగా కనిపించిన భారత జట్టు మళ్లీ పాత దారిలోకే వచ్చేసింది. 287 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. 140 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్ దారుణంగా విఫలమవడంతో మిడిలార్డర్, లోయరార్డర్ సైతం చేతులెత్తేసింది. రహానే (30), పంత్ (30), విహారి (28), విజయ్ (20), కోహ్లి(17)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నాలుగో రోజు కోహ్లి ఔటైన క్షణమే మ్యాచ్‌పై భారత్ ఆశలు ఆవిరయ్యాయి. అయినప్పటికి ఇంత దారుణంగా ఓడుతుందని ఎవరూ ఊహించలేదు. 112/5 ఓవర్ నైట్‌స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 28 పరుగులు జోడించి చేతులెత్తేసింది. స్టార్క్, లయన్లు మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఉమేశ్ యాదవ్(2), ఇషాంత్ శర్మ(0), బుమ్రా(0)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆసీస్ 146 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని 4 టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆస్ట్రేలియా తొన్ని ఇన్నింగ్స్ 326 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 243 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ 283 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 140 ఆలౌట్ -
అతను నీ కెప్టెన్.. కానీ నువ్వు కూడా అతణ్ణి ఇష్టపడవు!
మేం మంచివాళ్లుగా మారిపోయాం అంటూ ఆస్ట్రేలియన్లు ఎంతగా చెప్పుకున్నా, ఎక్కడో ఒక చోట ప్రత్యర్థిని కవ్వించేందుకు వారి ‘లోపలి మనిషి’ బయటకు వస్తూనే ఉంటాడు. పెర్త్ టెస్టులో కూడా ఇలాగే జరిగింది. భారత కెప్టెన్ కోహ్లి, ఆసీస్ కెప్టెన్ పైన్ మధ్య మాటల యుద్ధం ఆపేందుకు... చివరకు అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆసీస్ ఇన్నింగ్స్ 71వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బుమ్రా బౌలింగ్‌లో మిడ్‌వికెట్ దిశగా ఆడిన పైన్ సింగిల్ పూర్తి చేసుకోబోతున్న సమయంలో లాంగాఫ్‌లో ఉన్న కోహ్లి క్రీజ్ వైపు నడిచాడు. వీరిద్దరు బాగా దగ్గరకు వచ్చి ఒకరినొకరు ఢీకొట్టుకున్నంత పని చేశారు! ఈ సమయంలో కోహ్లి ‘నేను నిన్నేమీ అనడం లేదు కదా. ఎందుకు ఆ అసహనం’ అని పైన్‌తో అన్నాడు. దాంతో ‘నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు’ అంటూ పైన్ బదులిచ్చాడు! దాంతో అంపైర్ క్రిస్ గాఫ్నీ జోక్యం చేసుకొని మాట్లాడింది చాలు, మీరిద్దరు కెప్టెన్లు అంటూ సర్దిచెప్పాల్సి వచ్చింది. ‘నేనేమీ తిట్టడం లేదు, మాట్లాడటంలో తప్పేమీ లేదంటూ పైన్ చెప్పే ప్రయత్నం చేసినా అంపైర్ మళ్లీ అడ్డుకున్నారు. కోహ్లి ఔటైన తర్వాత కూడా క్రీజ్‌లో ఉన్న విజయ్‌తో ‘అతను నీ కెప్టెన్ అని నాకు తెలుసు. కానీ వ్యక్తిగా నువ్వు కూడా అతడిని ఇష్టపడవు’ అని పైన్ వ్యాఖ్యానించడం విశేషం! అయితే, ఆట ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు మొహమ్మద్ షమీ, హాజల్‌వుడ్ దీనిని తేలిగ్గా తీసుకున్నారు. ఐదు రోజుల పాటు సాగే మ్యాచ్‌లో ఇలాంటివి జరుగుతుంటాయని, వాటిని సరదాగా తీసుకోవాలని అన్నారు. -
పెర్త్ టెస్ట్: కోహ్లి, పైన్‌ల మాటల యుద్దం!
పెర్త్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌లో వివాదాస్పద రీతిలో ఔటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో తన నోటికి పనిచెప్పాడు. మూడో రోజు ఆటలో భాగంగా ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్‌పై నోరుపారేసుకున్నాడు. పలుమార్లు ఔటవ్వకుండా తప్పించుకున్న పైన్ దగ్గరకు వెళ్లి.. ‘మీరు ఇలా ఆడితే సిరీస్ 2-0గా మారుతుంది’ అని హెచ్చరించాడు. దీనికి పైన్ సైతం అదే రీతిలో బదులిచ్చాడు. ‘మీరు ముందు బ్యాటింగ్ చేయాల్సింది కదా బిగ్‌హెడ్’ అని కోహ్లి మాటలను తిప్పి కొట్టాడు. ఇవి స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది మూడో రోజు ఆట చివరి ఓవర్లో చోటు చేసుకుంది. Exchange of words between Virat and Paine. #AUSvIND pic.twitter.com/vz6niE90tO — Silly Point (@FarziCricketer) December 16, 2018 మాములుగా ఆసీస్ అంటే ఊగిపోయే కోహ్లి.. ఈ సారి కూడా అలానే రెచ్చిపోయాడు. అటు బ్యాట్‌తోను రాణించాడు. శతకం బాది ఆసీస్‌కు తన సత్తా ఏంటో చూపించాడు. కానీ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైన కోహ్లి.. అసహనం వ్యక్తం చేస్తూనే మైదానం వీడాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగుల ఆధిక్యం సాధించిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 326 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ 283 ఆలౌట్ -
సెకండ్ టెస్ట్: నాలుగు వికెట్లు ఔట్.. ఆసీస్ ఆధిక్యం 175!
పెర్త్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 175 పరుగులకు చేరింది. భారత పేస్ బౌలర్ల ధాటిని తట్టుకొని.. ఉస్మాన్ ఖవాజా 40 పరుగులతో, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. షమీ రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ 283 పరుగులకు ముగిసింది. 172/3 ఓవైర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లిసేన.. ఆదిలోనే అజింక్యా రహానే (51:105 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం హనుమ విహారితో కోహ్లి ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 214 బంతుల్లో 11 ఫోర్లతో కోహ్లి కెరీర్లో 25వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోతున్న ఈజోడిని హజల్‌వుడ్ దెబ్బతీశాడు. హనుమ విహారి(26)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో 5వ వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి ఔట్.. టీమిండియా ప్యాకప్.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి కోహ్లి బలవ్వడంతో భారత్ వికెట్లను చకచకా కోల్పోయింది. కమిన్స్ వేసిన 93వ ఓవర్ చివరి బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్‌లో ఉన్న హ్యాండ్స్కోంబ్ చేతిలో పడింది. అయితే బంతి మాత్రం నేలకు తాకిన సమయంలోనే ఫీల్డర్ చేతిలో పడినట్లు రిప్లేలో కనబడింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్‌గా ప్రకటించాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. చివరల్లో దాటిగా ఆడే ప్రయత్నం చేసిన పంత్.. టేలండర్ల సాయంతో 27 పరుగులు జోడించాడు. నాథన్ లయన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్ (36) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరి వికెట్‌గా బుమ్రా ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. 5 వికెట్లతో స్పిన్నర్ లయన్ భారత బ్యాట్స్‌మన్ పతనాన్ని శాసించాడు. స్టార్క్, హజల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కగా.. కమిన్స్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఓపెనర్ ఆరోన్ ఫించ్ గాయపడి.. రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. మహ్మద్ షమీ వేసిన 13వ ఓవర్ తొలిబంతి.. ఫించ్ కుడి చూపుడు వేలుకు బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిలాడిన ఫించ్ మైదానం వీడాడు. అతన్ని ఎక్స్‌రే కోసం ఫిజియోలు ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రమైతే ఫించ్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్ ఓడిన కంగారులకు ఫించ్ గాయం కంగారుపెడుతోంది. మరో ఓపెనర్ హారిస్ (20)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్ష్(5)ను షమీ పెవిలియన్‌కు చేర్చాడు. మరో ఆసీస్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ను ఇషాంత్ శర్మ ఔట్ చేయగా.. ట్రావిస్ హేడ్ను షమీ పెవిలియన్‌కు పంపాడు. -
హమ్మయ్య.. ఆసీస్‌ను పడగొట్టారు!
పెర్త్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన ఆతిథ్య జట్టు.. రెండో రోజు ఆటలో మాత్రం చతికిలపడింది. 277/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మన్.. నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్‌ను 300 దాటించారు. ఈ తరుణంలో భారత పేసర్లు ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లు విజృంభించడంతో మరో 26 పరుగులు జోడించి చాపచుట్టేసింది. కెప్టెన్ టిమ్ పైన్ 38(88 బంతులు, 5 ఫోర్లు), ప్యాట్‌కమిన్స్ 19(66 బంతులు)లు జాగ్రత్తగా ఆడేప్రయత్నం చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని ఉమేశ్ యాదవ్ చక్కటి బంతితో విడదీశాడు. కమిన్స్‌ను బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో 7 వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే బుమ్రా టిమ్ పైన్‌ను ఔట్ చేయడం.. మిగిలిన రెండు వికెట్లు స్కార్క్ (6), హజల్‌వుడ్ (0)లను ఇషాంత్ తన ఖాతాలో వెసుకోవడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో ఇషాంత్‌శర్మకు నాలుగు వికెట్లు పడగా.. బుమ్రా, ఉమేశ్ యాదవ్, విహారిలకు రెండేసి వికెట్లు దక్కాయి.