
ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ 18 నెలల విరామం తర్వాత మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో గురువారం మొదలైన మ్యాచ్‌లో పైన్ తన సొంత జట్టు టాస్మేనియా తరపున బరిలోకి దిగాడు.
అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పైన్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా 2017లో ఒక మహిళకు ఆసభ్యకర సందేశాలు పంపిన విషయం వెలుగులోకి రావడంతో 2021 ఏప్రిల్‌లో యాషెస్ సిరీస్ నుంచి తప్పుకుని పైన్ ఆటనుంచి నిరవధిక విరామం తీసుకున్నాడు.
చదవండి: IND vs SA: వన్డేల్లో గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా