
ఫెఫీల్డ్ షీల్డ్ 2023-24 ఎడిషన్ ఫైనల్ ఇవాళ (మార్చి 21) ప్రారంభమైంది. టస్మానియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కెప్టెన్ సామ్ వైట్‌మన్ (104) సెంచరీతో కదంతొక్కగా.. ఆర్కీ షార్ట్ (50), హిల్టన్ కార్ట్‌వైట్ (55), కూపర్ కొన్నొల్లీ (73 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు.
మరి కొద్ది సమయంలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా.. కూపర్ చెలరేగిపోయాడు. టస్మానియా బౌలర్లపై బౌండీరలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టస్మానియా బౌలర్లలో ఫ్రీమన్ 3 వికెట్లు పడగొట్టగా.. లియాన్ కర్లిసైల్ 2, రిలే మెరిడిత్, గేబ్ బెల్, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టోర్నీలో ఈ సారి కూడా ఫైనలిస్ట్ అయిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గడిచిన రెండు సీజన్లలో ఛాంపియన్‌గా కొనసాగుతూ హ్యాట్రిక్‌పై కన్నేసింది.
Comments
Please login to add a commentAdd a comment