Tasmania
-
ఒక్క పరుగు.. 8 వికెట్లు.. కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్
ఆస్ట్రేలియా దేశీ టోర్నీ వన్డే కప్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం ఎదురైంది. టాస్మానియాతో మ్యాచ్‌లో 52 పరుగుల వద్ద కేవలం రెండు వికెట్లు కోల్పోయిన ఈ జట్టు.. ఈ స్కోరుకు కేవలం ఒక్క పరుగు జతచేసి మిగిలిన ఎనిమిది వికెట్లు నష్టపోయింది. ఆ ఒక్క రన్ కూడా వైడ్ రూపంలో విశేషం. మరి డిఫెండింగ్ చాంపియన్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఇంత భారీ షాకిచ్చిన ఆ బౌలర్లు ఎవరంటే?!లిస్ట్-ఏ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన టాస్మానియా కెప్టెన్ జోర్డాన్ సిల్క్.. వెస్టర్న్ ఆస్ట్రేలియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఓపెనర్ ఆరోన్ హార్డీ(7)ని పేసర్ టామ్ రోజర్స్ అవుట్ చేయగా.. మరో ఓపెనర్ ఆర్సీ షార్ట్(22) వికెట్‌ను బ్యూ వెబ్‌స్టర్ పడగొట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ బాన్‌క్రాఫ్ట్(14) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకన్నాడు. ఈ క్రమంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాతి ఓవర్ నుంచే టాస్మానియా స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ తన మ్యాజిక్ మొదలుపెట్టాడు. 16వ ఓవర్లో రెండు వికెట్లు తీయగా.. వెస్టర్న్ ఆస్ట్రేలియా స్కోరు 52-4గా మారింది. ఇక ఆ తర్వాత వెబ్‌స్టర్ వెనుదిరిగి చూడలేదు. పేసర్ బిల్లీ స్టాన్‌లేక్‌తో కలిసి.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దిమ్మతిరిగేలా షాకిస్తూ వరుసగా పెలివియన్‌కు పంపాడు.వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బిల్లీ స్టాన్లేక్ రెండు వికెట్లు కూల్చగా.. 18వ ఓవర్ ఆఖరి బంతికి వెబ్‌స్టర్ తనఖాతాలో మరో వికెట్ జమచేసుకున్నాడు. అదే విధంగా.. 20వ ఓవర్లో మరో రెండు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.. ఆ మరుసటి ఓవర్లో పదో వికెట్‌ను కూల్చాడు. దీంతో వెస్టర్న్ ఆస్ట్రేలియా 20.1 ఓవర్లలో 53 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ క్రమంలో 28 బంతుల వ్యవధిలో వైడ్ రూపంలో ఒక్క పరుగు పొంది.. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక 53 పరుగులకే చాప చుట్టేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా వన్డే కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.మరోవైపు.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా కేవలం 8.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 55 పరుగులు చేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆరు వికెట్లతో చెలరేగిన బ్యూ వెబ్‌స్టర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక వెస్టర్న్ ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ఆర్సీ షార్ట్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND vs NZ 2nd Test: చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లి -
Sheffield Shield 2024 Final: సెంచరీతో కదంతొక్కిన సామ్
ఫెఫీల్డ్ షీల్డ్ 2023-24 ఎడిషన్ ఫైనల్ ఇవాళ (మార్చి 21) ప్రారంభమైంది. టస్మానియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కెప్టెన్ సామ్ వైట్మన్ (104) సెంచరీతో కదంతొక్కగా.. ఆర్కీ షార్ట్ (50), హిల్టన్ కార్ట్‌వైట్ (55), కూపర్ కొన్నొల్లీ (73 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. మరి కొద్ది సమయంలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా.. కూపర్ చెలరేగిపోయాడు. టస్మానియా బౌలర్లపై బౌండీరలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టస్మానియా బౌలర్లలో ఫ్రీమన్ 3 వికెట్లు పడగొట్టగా.. లియాన్ కర్లిసైల్ 2, రిలే మెరిడిత్, గేబ్ బెల్, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టోర్నీలో ఈ సారి కూడా ఫైనలిస్ట్ అయిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గడిచిన రెండు సీజన్లలో ఛాంపియన్‌గా కొనసాగుతూ హ్యాట్రిక్‌పై కన్నేసింది. -
సముద్ర గర్భంలో ఏకంగా 8 అగ్నిపర్వతాలు
అవున్నిజమే. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 8 అగ్ని పర్వతాలు! అంటార్కిటికా మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున చాలాకాలంగా నిద్రాణంగా ఉన్నాయట. ఇవి ఒక్కోటీ సగటున కిలోమీటరు పై చిలుకు ఎత్తులో ఉన్నాయి. వీటిలో అతి పెద్ద అగ్నిపర్వత శ్రేణి 1.5 కిలోమీటర్ల ఎత్తుంది! టాస్మేనియా నుంచి అంటార్కిటికా మధ్య 20 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనలు చేపట్టిన సీఎస్ఐఆర్ఓ వోయేజ్ నౌకలోని పరిశోధక బృందం వీటి ఉనికిని తాజాగా గుర్తించింది. 3డి ఇమేజింగ్ ద్వారా ఈ పర్వతాలను అత్యంత స్పష్టంగా మ్యాపింగ్ కూడా చేసింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం నిజంగా అద్భుతమని సీఎస్ఐఆర్ఓ జియో ఫిజిసిస్ట్ డాక్టర్ క్రిస్ యూల్ చెప్పారు. సముద్ర ప్రవాహాల వేగం అత్యంత ఎక్కువగా ఉండే ధ్రువ ప్రాంతంలో ఇవి ఉండటం ఆశ్చర్యమేనని ఆయనన్నారు. వీటిలో నాలుగు పర్వతాల ఉనికిని కొన్నేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడది ధ్రువపడటంతో పాటు వాటి పక్కనే మరో నాలుగు అగ్నిపర్వతాలు కూడా ఉన్నట్టు తేలింది. ఇవి మకారీ ద్వీపానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాయి. భూ అయస్కాంత శక్తి చాలని ఫలితంగా బహుశా 20 లక్షల ఏళ్ల కింద ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. సీఎస్ఐఆర్ఓ వోయేజ్ ప్రాజెక్టును అమెరికా, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా తలపెట్టాయి. సముద్ర అంతర్భాగపు రహస్యాలను అన్వేషించడంతో పాటు వాటిని స్పష్టంగా మ్యాపింగ్ చేయడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ‘‘అంటార్కిటికా మహాసముద్రపు ధ్రువ ప్రవాహ గతి సముద్ర అడుగు భాగాన్ని ఢీకొనడం వల్ల ఏర్పడే భారీ సుడిగుండాలు వేడిమితో పాటు కర్బనాన్ని సముద్రంలో అన్నివైపులకూ చెదరగొడతాయి. అలా గ్లోబల్ వార్మింగ్ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తాయి’’ అని వోయేజ్ మిషన్ చీఫ్ కో సైంటిస్టు డాక్టర్ హెలెన్ ఫిలిప్స్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే
అభిమానం అనేది ఒక వ్యక్తిని ఎంత దూరమైనా ప్రయాణం చేసేలా చేస్తోంది. మనకిష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్న కుతూహలం ఉంటుంది. ఒకవేళ మనకు దగ్గర్లో ఉన్న సినిమా థియేటర్లో టికెట్ దొరక్కపోతే.. వంద కిలోమీటర్లు దూరం ఉన్నా సరే వెర్రి అభిమానం అంత దూరం మనల్ని తీసుకెళ్తుంది. అలా చూసినప్పుడే మనకు ఆత్మసంతృప్తి. క్రికెట్లో కూడా అలాంటి పిచ్చి అభిమానం ఉన్న ఫ్యాన్స్ కొందరుంటారు. ఆ కోవకు చెందిన వాడే మిస్టర్ మాట్. తస్మానియాకు చెందిన మాట్కు క్రికెట్ అన్నా.. ఆస్ట్రేలియా జట్టు అన్నా విపరీతమైన అభిమానం. ఆ వెర్రి అభిమానమే అతన్ని తస్మానియా నుంచి వయా చైనా, సైప్రస్‌లు మీదుగా ఇంగ్లండ్‌కు తీసుకొచ్చింది. 58 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణం చేసిన మ్యాట్ లార్డ్స్‌కు చేరుకున్నాడు. కానీ మ్యాట్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. యాషెస్ సిరీస్ ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అభిమానులైతే టి20ల కంటే ఎక్కువగా యాషెస్‌ను ఆదరిస్తారు. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రసవత్తరంగా సాగడంతో లార్డ్స్ టెస్టుపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో టికెట్లన్నీ ఆన్ లైన్ లో మూడు రోజుల ముందే ముగిశాయి. అయితే 58 గంటలు ప్రయాణించి లార్డ్స్ కు వచ్చిన మ్యాట్.. స్టేడియంలోకి ఎంట్రీ కావడానికి టికెట్ ను ముందుగా బుక్ చేసుకోలేదు.లార్డ్స్ కు చేరుకున్నాకా అతడికి టికెట్ దక్కలేదు. దీంతో అతడు లార్డ్స్ స్టేడియం ముందు ''నాకు ఒక టికెట్ కావాలి. నేను లార్డ్స్ లో మ్యాచ్ చూసేందుకు గాను 58 గంటలు జర్నీ చేసి వచ్చాను. దయచేసి నాకు ఒక టికెట్ ఇప్పించండి.''అని ప్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ అయిన బర్మీ ఆర్మీని మ్యాట్ ఒక టికెట్ ఉంటే ఇప్పించండి అంటూ బతిమాలుకున్నాడు. దీంతో బర్మీ ఆర్మీలోని ఒక వ్యక్తి అతని అభిమానానికి కరిగిపోయి తన టికెట్‌ను అతనికి ఇచ్చేశాడు. దీంతో రెండో టెస్టు తొలి రోజున మూడో సెషన్లో అతను గ్రౌండ్లోకి చేరుకొని మ్యాచ్ వీక్షించి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Can we help Aussie Matt out? He’s travelled from Tasmania with no ticket!#Ashes pic.twitter.com/h1pZ3p4xJj — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023 ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా క్రితం రోజు స్కోరుకు మరో 76 పరుగులు జోడించి 416 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. మూడో సెషన్లో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. బెన్ డకెట్ 86, ఓలీ పోప్ 39 పరుగులతో ఆడతున్నారు. ఇంగ్లండ్ ఓవర్‌కు 4 పరుగులకు పైగా రన్‌రేట్‌తో పరుగులు సాధిస్తుండడం విశేషం. చదవండి: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన Ashes 2023: కామెంటరీ కంటే ఐస్‌క్రీం ఎక్కువైపోయిందా! -
చేసిందే తప్పు.. వేలు చూపిస్తూ అసభ్య ప్రవర్తన
క్రికెట్లో మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ గతేడాది అక్టోబర్‌లోనే ఐసీసీ చట్టం తెచ్చింది. అప్పటినుంచి మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగణిస్తున్నారు. ఇక మన్కడింగ్ అంటే బౌలర్ బంతిని విడవకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే ఔట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధంగా పరిగణించినా ఇప్పుడు మాత్రం రనౌట్‌గా చూస్తున్నారు. అయితే ఒక తస్మానియా క్రికెటర్ మాత్రం తాను ఔట్ అని తెలిసినా కొంచెం కూడా సహనం లేకుండా క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించి అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఎస్సీఏ(SCA Cricket)లీగ్‌లో క్లార్మౌంట్, న్యూ నొర్ఫోక్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ సమయంలో బౌలర్ బంతిని విడవకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటి ముందుకు వచ్చాడు. ఇది గమనించిన బౌలర్ బెయిల్స్‌ను ఎగురగొట్టి మన్కడింగ్ చేశాడు. రనౌట్ కింద పరిగణించిన అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో కోపంతో పెవిలియన్ బాట పట్టిన బ్యాటర్ చేతిలోని బ్యాట్‌ను, హెల్మెట్‌ను గాల్లోకి ఎగిరేసి.. చేతికున్న గ్లోవ్స్‌ను కాలితో తన్నాడు. ఆ తర్వాత వేలిని చూపిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్రికెటర్ ఆఫ్ ది ఫీల్డ్ ఏం చేసినా పట్టించుకోరు.. కానీ ఆన్‌ఫీల్డ్‌లో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఈ చర్య అంపైర్ సహా ఆటగాళ్లను షాక్‌కు గురిచేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సదరు క్రికెటర్‌పై మ్యాచ్ రిఫరీ చర్య తీసుకున్నారు. ఆన్‌ఫీల్డ్ అబ్రస్టకింగ్ చేసినందుకు జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించినట్లు తెలిసింది. A Tasmanian cricketer was NOT happy after getting out via a Mankad and launched his bat, helmet and gloves into the air! 🤬🤯 pic.twitter.com/y64z4kwpE3 — Fox Cricket (@FoxCricket) March 28, 2023 చదవండి: బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ -
6 బంతుల్లో 4 పరుగులు.. చేతిలో 5 వికెట్లు.. అయినా ఓటమి
ఆస్ట్రేలియన్ వుమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ తుది సమరంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హోబర్ట్ వేదికగా సౌత్ ఆస్ట్రేలియా-టాస్మానియా జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన ఫైనల్ మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగి క్రికెట్లోని అసలుసిసలు మజాను ప్రేక్షకులకు అందించింది. అసలు ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్మానియా నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. One of the wildest finishes to a cricket match condensed down to a minute. You're welcome #WNCLFinal pic.twitter.com/97hUMPcuxE — cricket.com.au (@cricketcomau) February 25, 2023 ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించి (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో), సౌత్ ఆస్ట్రేలియాకు 243 పరుగుల టార్గెట్‌ను కుదించారు. ఈ క్రమంలో చివరి నిమిషం వరకు సౌత్ ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగింది. చివరి ఓవర్‌కు ముందు సమీకరణలు ఇలా ఉన్నాయి. ఆఖరి ఓవర్లో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 4 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సౌత్ ఆస్ట్రేలియా జట్టు గెలుపు నల్లేరుపై నడకే అని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగింది. సౌత్ ఆస్ట్రేలియా జట్టు చివరి ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. టాస్మానియా బౌలర్ కోయటే ఆఖరి ఓవర్లో మ్యాజిక్ చేసింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో పాటు రెండు రనౌట్లు చేసి తన జట్టును వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలబెట్టింది. -
అలుపెరుగని బాటసారి.. 11 రోజులు నాన్–స్టాప్ జర్నీ.. ప్రపంచ రికార్డు
సిడ్నీ: పొడవైన ముక్కు, పొడవైన కాళ్లతో చూడగానే ఆకట్టుకొనే గాడ్విట్ పక్షి ఒకటి (శాస్త్రీయ నామం లిమోసా ల్యాపోనికా) అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఈశాన్య టాస్మానియా ద్వీపంలోని అన్సాన్స్ బే వరకూ 11 రోజుల్లో 8,425 మైళ్లు (13,558.72 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా ప్రయాణం సాగించడం గమనార్హం. కేవలం ఐదు నెలల వయసున్న ఈ మగ పక్షి (234684) ఈ నెల 13వ తేదీన అలాస్కా నుంచి బయలుదేరింది. ఓషియానియా, వనౌతు, న్యూ కాలెడోనియా తదితర ద్వీపాల గగనతలం నుంచి ప్రయాణం సాగించింది. ఈ నెల 24వ తేదీన అన్సాన్స్ బే ప్రాంతంలో కాలుమోపింది. సరిగ్గా చెప్పాలంటే 11 రోజుల ఒక గంట సమయంలో అలుపెరుగని తన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ పక్షికి సైంటిస్టులు 234684 అనే ఒక నంబర్ ఇచ్చారు. అలాస్కాలో పలు గాడ్విట్ పక్షులకు 5జీ శాటిలైట్ ట్యాగ్లు అమర్చి గాల్లోకి వదిలారు. వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిగతా పక్షులకంటే 234684 నంబర్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించినట్లు తేల్చారు. నాన్–స్టాప్‌గా గాల్లో దూసుకెళ్తూ 11 రోజుల ఒక గంటలో టాస్మానియాకు చేరుకుందని న్యూజిలాండ్‌లోని పుకొరోకొరో మిరండా షోర్బర్డ్ సెంటర్ ప్రకటించింది. నీటిపై వాలితే మృత్యువాతే గాడ్విట్ పక్షులు వలసలకు పెట్టింది పేరు. ప్రతిఏటా వేసవిలో టాస్మానియాకు చేరుకుంటాయి. అక్కడ సంతతిని వృద్ధి చేసుకొని యూరప్ దేశాలకు తిరిగి వస్తుంటాయి. 2021లో 4బీబీఆర్‌డబ్ల్యూ అనే గాడ్విట్ మగ పక్షి 8,108 మైళ్లు(13,050 కిలోమీటర్లు) నాన్–స్టాప్‌గా ప్రయాణించింది. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఈ రికార్డును 234684 పక్షి బద్దలుకొట్టింది. ఇది 11 రోజుల ప్రయాణంలో సగంబరువును కోల్పోయి ఉంటుందని టాస్మానియాలోని పక్షి శాస్త్రవేత్త ఎరిక్ వోహ్లర్ చెప్పారు. ఈ రకం పక్షులు నీటిపై వాలలేవని, ఒకవేళ వాలితే చనిపోతాయని తెలిపారు. ఎందుకంటే వాటి కాలి వేళ్లను కలుపుతూ చర్మం ఉండదని వెల్లడించారు. గాట్‌విట్ జాతి పిట్టల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. అవి బార్–టెయిల్డ్ గాడ్విట్, బ్లాక్–టెయిల్డ్ గాడ్విట్, హడ్సోనియన్ గాడ్విట్, మార్బ్ల్డ్ గాడ్విట్. పొడవైన ముక్కును సముద్ర తీరాల్లోని ఇసుకలోకి దూర్చి అక్కడున్న పురుగులు, కీటకాలను తింటాయి. -
18 నెలల తర్వాత మళ్లీ బ్యాట్ పట్టిన ఆసీస్ మాజీ కెప్టెన్
ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ 18 నెలల విరామం తర్వాత మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో గురువారం మొదలైన మ్యాచ్‌లో పైన్ తన సొంత జట్టు టాస్మేనియా తరపున బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పైన్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా 2017లో ఒక మహిళకు ఆసభ్యకర సందేశాలు పంపిన విషయం వెలుగులోకి రావడంతో 2021 ఏప్రిల్‌లో యాషెస్ సిరీస్ నుంచి తప్పుకుని పైన్ ఆటనుంచి నిరవధిక విరామం తీసుకున్నాడు. చదవండి: IND vs SA: వన్డేల్లో గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా -
ఎమర్జెన్సీకి ఫోన్ చేసి తల్లిని కాపాడిన 4ఏళ్ల బుడతడు
నాలుగేళ్ల చిన్నారి ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్చేసి మరీ తన తల్లిని కాపాడుకున్నాడు. అసలేం జరిగిందంటే...తస్మానియాకి చెందిన నాలుగేళ్ల బాలుడు రెండు రోజుల క్రితమే అంబులెన్స్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ని ఎలా డయల్ చేయాలో నేర్చుకున్నాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఆమె తల్లి మూర్చతో కింద పడిపోయింది. దీంతో సదరు బాలుడు ఆ ఎమర్జెన్సీ నెంబర్ '000కి' కాల్ చేసి అమ్మ కింద పడిపోయిందని చెప్పాడు. వెంటనే పారామెడికల్స్ వచ్చి ఆ బాలుడి తల్లికి సకాలంలో వైద్యం అందించి ఆమెను రక్షించారు. అంతేకాదు సదరు అంబులెన్స్ పారామెడికల్ అధికారులు ఆ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక సర్టిఫికేట్‌ని కూడా ప్రధానం చేశారు. ఆ బాలుడి తల్లి ఒక నర్సు ఆమె ఫోన్ అన్‌లాక్‌లో ఉంటే ఎలా ఓపెన్ చేయాలో, ఎమర్జెన్సీ నెంబర్‌కి ఎలా కాల్ చేయాలో నేర్పించినట్లు తెలిపారు. అదే ఈ రోజు తన జీవితాన్ని కాపాడుతుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తన కొడుకు ఒక చిన్న హిరో అయిపోయాడంటూ మురిసిపోయారు. ఈ ఘటనతో ఆ బాలుడు వార్తల్లో నిలిచాడు. అంతేకాదు ఈ విషయం సోషల్ మాధ్యమాలో కూడా తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ పిల్లవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ...చిన్న ఛాంపియన్ అని ప్రశంసిస్తున్నారు. (చదవండి: వైట్ హౌస్‌లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు) -
చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప..!
Rare Pink Hand Fish Spotted In Australia: ఆస్ట్రేలియాలో టాస్మానియన్ తీరంలో తొలిసారిగా అరుదైన చేతులతో నడిచే గులాబీ చేప(పింక్ హ్యాండ్ ఫిష్) కనిపించింది. అయితే ఈ పింక్ హ్యాండ్ ఫిష్‌ను గతంలో 1999లో సముద్రం అడుగున ఈత కొట్టే ఒక డైవర్ గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా టాస్మానియా దక్షిణ తీరానికి 120 మీటర్ల లోతులో ఈ పింక్ హ్యాండ్ ఫిష్‌ని ఆస్ర్టేలియా పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు. (చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!) ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంటార్కిటిక్ అండ్ మెరైన్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ నెవిల్లే బారెట్ అతని బృందం పగడపు పీతలు, చేప జాతులు గురించి సర్వే చేయడానికి మెరైన్ పార్క్ సముద్రగర్భంలో ఒక కెమెరాను ఉంచింది. అయితే ఆ మెరైన్ స్టడీస్ రీసెర్చ్ అసిస్టెంట్ యాష్లీ బాస్టియాన్సెన్ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఈ పింక్ హ్యాండ్‌ఫిష్‌ను గుర్తించింది. అంతేకాదు ఆ ఫుటేజ్‌లో ఈ పింక్ ఫిష్ పీతలో దాడి నుంచి తప్పించేకునే నిమిత్తం కంగారుగా వెళ్లుతున్నట్లుగా కనిపించింది. ఈ అత్యధునిక సాంకేతికతో కూడిన కెమెరా తమకు మంచి చిత్రాలతో కూడిన అరుదైన జాతులను గురించి తెలియజేసింది అని ప్రొఫెసర్ బారెట్ అన్నారు. అంతేకాదు ఇలాంటి అరుదైన జాతులు లోతైన ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరుచుకుంటాయని చెప్పారు. పైగా ఈ పింక్ ఫిష్‌లు అధిక-పరిమాణ చేతులు కలిగి ఉంటాయని అవి సముద్రగర్భం వెంబడి నడవడం, ఈత కొట్టడం వంటివి చేస్తాయని పేర్కొన్నారు. (చదవండి: పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!) -
12 పరుగులకే ఆరు వికెట్లు..
పెర్త్: ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్‌లో భాగంగా ద మార్ష్ కప్ వన్డేల్లో టోర్నీలో విక్టోరియా జట్టు పరుగు తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. సోమవారం తస్మానియాతో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు ఓటమి అంచుల వరకూ వెళ్లి చిరస్మరణీయమైన గెలుపును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా జట్టు 47.5 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. సదర్లాండ్(53) హాఫ్ సెంచరీ సాధించగా, గ్లెన్ మ్యాక్స్ వెల్(34) ఫర్వాలేదనిపించాడు. ఇక మాథ్యూ షాట్(27) సమయోచితంగా ఆడటంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. అయితే 186 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన తస్మానియా లక్ష్యానికి చేరువగా వచ్చి ఓటమి పాలైంది. 12 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోవడంతో తస్మానియాకు పరాజయం తప్పలేదు. 172 పరుగుల వరకూ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన తస్మానియా.. ఆపై మరో 12 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. బెన్ మెక్‌డెర్మాట్(78) ఒక్కడే మెరిశాడు. విక్టోరియా బౌలర్లలో ట్రెమైన్,కోలీమ్యాన్లు తలో నాలుగు వికెట్లతో చెలరేగి పోవడంతో తస్మానియా వరుసగా వికెట్లను చేజార్చుకుని ఓటమి చెందింది. ఐదు పరుగులు సాధిస్తే విజయం దక్కించుకునే సమయంలో ఐదు వికెట్లను తస్మానియా చేజార్చుకోవడం ఇక్కడ మరో అంశం. Tasmania needed five runs to win from 11 overs with five wickets in hand and then: WW.11W.W1W 😱🤯#MarshCup | @MarshGlobal pic.twitter.com/vwiAHSKI1o — cricket.com.au (@cricketcomau) September 23, 2019 -
జెండర్‌ను మార్చుకునే కొత్త చట్టం
టాస్మానియా దేశం లింగ వివక్షను రూపుమాపడానికి కొత్త చట్టం తెస్తోంది. ఇకపై ఆ దేశంలో పదహారు సంవత్సరాలు దాటిన ట్రాన్స్జెండర్లు ఎవ్వరి అనుమతి లేకుండా తమ జెండర్‌ను మార్చుకోవచ్చు. అలాగే జనన ధృవీకరణ పత్రాలపై, వివాహం చేసుకునేటప్పుడు, చివరికి డెత్ సర్టిఫికెట్లో కూడా తమ జెండర్‌ను చట్టబద్దంగా నమోదు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ముర్కిసన్ స్వతంత్ర ఎమ్మెల్సీ రూత్ ఫారెస్ట్ ప్రవేశ పెట్టిన బిల్లును ఎగువ సభ ఆమోదించగా, వచ్చేవారం నుంచి అధికారికంగా అమలు కాబోతోంది. ఒకవేళ పదహారు సంవత్సరాల కన్నా వయసు తక్కువగా ఉండి జెండర్‌ను మార్చాలనుకుంటే అందుకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి అవసరం. ఇందుకు వారు కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వాములుగా మారిన ఇద్దరు ట్రాన్స్జెండర్ల మధ్య విడాకులు తీసుకోవడానికి ముందు తమ తమ బర్త్ సర్టిఫికేట్లపై లింగ మార్పిడికి వీలుండదు. అంతేకాకుండా ఈ బిల్లు ద్వారా లింగ వివక్ష, హోమోసెక్సువల్ గురించిన అసభ్యకర భాషను కూడా నిషేధించారు. ‘ఈ చట్టం వల్ల మా దేశంలో ఎలాంటి లింగ వివక్ష లేకుండా అందరూ సమానమే’నన్న భావన పెరుగుతుందని ఈ బిల్లు పెట్టిన రూత్ ఫారెస్ట్ అన్నారు. -
వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!
-
వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!
హోబర్ట్ : క్రికెట్లో ఇప్పటివరకు బౌండరీ లైన్ వద్దనే ఫీల్డర్లు కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడం చూసుంటాం. కానీ స్లిప్‌లో మిరాకిల్ క్యాచ్‌లు చూడటం చాలా అరుదు. ఎందుకంటే అనూహ్యంగా వచ్చే బంతులను అందుకోవాలంటే.. ఫీల్డర్లు ఎంతో చురుకుగా, చాకచక్యంగా ఉండాలి. దీంతో బౌండరీల వద్ద కంటే స్లిప్‌లో ఫీల్డిండ్ చేయడమే యమా డేంజరు. అయితే స్లిప్‌లో అనూహ్య క్యాచ్‌లు అందుకొని జట్టుకు విజయాలు అందించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్ స్లిప్‌లో పట్టిన క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ వేడ్‌ను, ఆ జట్టు ఆటగాళ్లను తెగ మెచ్చుకుంటున్నారు. టీమ్ వర్క్ అంటే ఇది అని కామెంట్ చేస్తున్నారు. ఆసీస్‌లో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా న్యూసౌత్ వేల్స్, టాస్మానియా మధ్య జరిగిన మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ పట్టిన క్యాచ్ క్రికెట్లోని అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. దాదాపు నేలపాలైందనుకున్న క్యాచ్‌ను వేడ్ ఎంతో చాకచక్యంగా అందుకున్నాడు. జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో న్యూ సౌత్ వేల్స్ బ్యాట్స్‌మన్ డేనియల్ హ్యూస్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఉన్న అలెక్స్ డూలాన్ వదిలేశాడు. ఆ బాల్ నేలను తాకుతుందనగా.. క్షణాల్లో తన ఎడమవైపు డైవ్ చేసి దానిని అందుకున్నాడు మాథ్యూ వేడ్. సహజంగా వికెట్ కీపర్ అయిన వేడ్.. ఆ స్కిల్స్‌ను ఉపోయోగించి క్యాచ్ అందుకున్నాడు. -
ఈ చేపకు ఈత రాదు!
టాస్మానియా : పక్షులకు ఎగరడం, చేపలకు ఈదడం ఎవరైనా నేర్పుతారా? అయితే పక్షుల్లో అన్నిరకాల పక్షులూ ఎగరలేవనే విషయం మనకు తెలిసిందే. మరి చేపల్లో ఈదడం రాని చేపగురించి ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న చేపను ఓసారి చూడండి.. నిజంగానే ఈ చేపకు ఈదడం రాదు. మనిషిలా రెండు కాళ్లతో నడుస్తూ గమ్యాన్ని చేరుకుంటుంది. అలాగని ఇది చేపజాతి కాదని చెప్పలేం. ఈ విషయమై శాస్త్రవేత్త డాక్టర్ లిమ్ లిండ్ మాట్లాడుతూ.. ‘కోళ్లు కూడా పక్షులే. అయినా అవి ఎక్కువ దూరం ఎగరలేవు, ఎక్కువ ఎత్తుకూ ఎగరలేవు. అలాగే ఇవి కూడా ఓ రకం చేపలే అయినా వీటికి ఈదడం రాదు. అందుకే ఇవి ఎక్కువగా కదలవు. అలా ఓచోట కూర్చొని ఉన్నట్లుగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాయి. 1980కు ముందు టాస్మానియా ఆగ్నేయ తీరప్రాంతంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ విరివిగా కనబడేవి. కానీ రానురాను వీటి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు అరుదుగా, చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే ప్రయోగశాలలో పునరుత్పత్తి చేసి... ఈ నడిచే చేపల జాతిని రక్షించే దిశగా పరిశోధనలు చేస్తున్నార’ని చెప్పారు. -
పాంటింగ్‌కు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. తన సొంత రాష్ట్రమైన తస్మానియాకు పాంటింగ్ ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తస్మానియా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే పలు కార్యక్రమాల్లో పాంటింగ్ క్రియాశీలక పాత్ర పోషించనున్నాడు. ప్రధానంగా ఆ రాష్ట్ర అత్యున్నత స్థాయి వ్యాపార కార్యకలాపాలు, విద్యా వృద్ధి, ఎనర్జీ తదితర విభాగాల అభివృద్ధికి పాంటింగ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీనిపై స్పందించిన పాంటింగ్ ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాన్నాడు. తనకున్న అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలతో తస్మానియా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తానని పాంటింగ్ తెలిపాడు. ఇందుకోసం ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని స్పష్టం చేశాడు.