ఎమర్జెన్సీకి ఫోన్‌ చేసి తల్లిని కాపాడిన 4ఏళ్ల బుడతడు | 4 Old Boy From Tasmania Saved Mothers Life Calling Emergency No | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీకి ఫోన్‌ చేసి తల్లిని కాపాడిన 4ఏళ్ల బుడతడు

Published Thu, Sep 8 2022 6:06 PM | Last Updated on Thu, Sep 8 2022 7:07 PM

4 Old Boy From Tasmania Saved Mothers Life Calling Emergency No - Sakshi

నాలుగేళ్ల చిన్నారి ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్‌చేసి మరీ తన తల్లిని కాపాడుకున్నాడు. అసలేం జరిగిందంటే...తస్మానియాకి చెందిన నాలుగేళ్ల​ బాలుడు రెండు రోజుల క్రితమే  అంబులెన్స్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్‌ని ఎలా డయల్‌ చేయాలో నేర్చుకున్నాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఆమె తల్లి మూర్చతో కింద పడిపోయింది.

దీంతో సదరు బాలుడు ఆ ఎమర్జెన్సీ నెంబర్‌ '000కి' కాల్‌ చేసి అమ్మ కింద పడిపోయిందని చెప్పాడు. వెంటనే పారామెడికల్స్‌ వచ్చి ఆ బాలుడి తల్లికి సకాలంలో వైద్యం అందించి ఆమెను రక్షించారు. అంతేకాదు సదరు అంబులెన్స్‌ పారామెడికల్‌ అధికారులు ఆ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక సర్టిఫికేట్‌ని కూడా ప్రధానం చేశారు. ఆ బాలుడి తల్లి ఒక నర్సు ఆమె ఫోన్‌ అన్‌లాక్‌లో ఉంటే ఎలా ఓపెన్‌ చేయాలో, ఎమర్జెన్సీ నెంబర్‌కి ఎలా కాల్‌ చేయాలో నేర్పించినట్లు తెలిపారు.

అదే ఈ రోజు తన జీవితాన్ని కాపాడుతుందని ఊహించలేదని చెప్పారు.  ప్రస్తుతం తన కొడుకు ఒక చిన్న హిరో అయిపోయాడంటూ మురిసిపోయారు. ఈ ఘటనతో ఆ బాలుడు వార్తల్లో నిలిచాడు. అంతేకాదు ఈ విషయం సోషల్‌ మాధ్యమాలో కూడా తెగ వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ పిల్లవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ...చిన్న ఛాంపియన్‌ అని ప్రశంసిస్తున్నారు. 

(చదవండి: వైట్‌ హౌస్‌లో సందడి చేసిన బరాక్‌ ఒబామా దంపతులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement