
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతగా అడాల్ఫ్ హిట్లర్ పేరుగాంచాడు. హిట్లర్ అనేక దేశాలలో విధ్వంసం సృష్టించాడు. లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నాడు. హిట్లర్ నియంతృత్వం ఎంతగా పెరిగిందంటే అతని కారణంగా ఒక దేశంతో మరో దేశం పోరాడేందుకు సిద్ధం అయ్యింది. అలాంటి హిట్లర్ చొరవతోనే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు మనం హిట్లర్ జీవితంలోని ఒక రహస్యం గురించి తెలుసుకుందాం.
ప్రపంచమంతా హిట్లర్ నియంతృత్వానికి ఆందోళన చెందింది. ఈ నేపధ్యంలోనే అతన్ని చంపడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. ఎవరికీ ఇది అంత సులభం కాలేదు. హిట్లర్‌ను వెన్నంటి ఉండే నాజీ సైన్యం అతనిని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడేది. ఆహారంలో విషం కలిపి, తనను ఎవరైనా చంపేస్తారేమోనని హిట్లర్ నిత్యం భయపడేవాడు. దీనిని తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని కూడా అనుసరించాడు.
హిట్లర్‌కు సన్నిహితులైన 15 మంది మహిళలు ఆయనకు వడ్డించే ఆహారాన్ని మొదట రుచి చూసేవారు. ఎప్పుడైనా ఆహారంలో విషం కలిపితే, దానిని రుచి చూసే మహిళ చనిపోతుంది. అప్పుడు హిట్లర్ ప్రాణాలకు రక్షణ ఏర్పడుతుంది. హిట్లర్ ఆహారం తీసుకునే ప్రతిసారీ ఈ మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు. హిట్లర్ తినే ఆహార పదార్థాలు అధికంగా ఉండటం వలన వాటిని పలువురు మహిళలు రుచి చూసేవారు.
హిట్లర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పలు పద్ధతులను ఉపయోగించేవాడు. ఎటువంటి దాడికి గురికాని సైనిక బంకర్లలో తల దాచుకునేవాడు. భారీ స్థాయిలో ఉన్న నాజీ సైన్యం అతనిని నిరంతరం కాపాడుతుండేది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంతలా తాపత్రయపడిన హిట్లర్ చివరికి విషాహారం కారణంగానే మృతి చెందాడు.
ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?
Comments
Please login to add a commentAdd a comment