
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. అనకాపల్లి అనాథా శ్రయంలో ముగ్గురు విద్యార్థుల మృతి చెందగా, 37 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. మరో ఘటనలో చిత్తూరు అపోలో ఆసుపత్రిలో 70 మంది విద్యార్థులు విషాహారం తిని అస్వస్థత గురయ్యారు.
ఈ కేసులను జాతీయ మానవ హక్కుల సంఘం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీ , డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో నివేదిక పంపాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.

Comments
Please login to add a commentAdd a comment