NHRC
-
ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారు?
సాక్షి, నూఢిల్లీ : తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ప్రజాప్రతినిధులపై దాడి జరుగుతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. దాడికి పాల్పడ్డ వారి పేర్లు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని నిలదీసింది. ఈ ఘటనపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి శుక్రవారం నోటీసులిచ్చింది. తిరుపతి ఘటనపై వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి 18న ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ‘ఫిబ్రవరి 3న తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు నేను, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం బస్సులో వెళ్తున్నాం. మాతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వేరే పార్టీకి చెందిన కొందరు మా బస్సును అడ్డగించారు. రాడ్లతో బస్సు అద్దాలు ధ్వంసం చేసి లోపలకు చొరబడ్డారు. నాపైన, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లపైన భౌతిక దాడికి పాల్పడ్డారు. చొక్కాలు చించి మరీ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన అంతా పోలీసుల సాక్షిగానే జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే’ అంటూ ఎంపీ గురుమూర్తి ఆ ఫిర్యాదులో తెలిపారు.ఎఫ్ఐఆర్లో ఎంపీ ఫిర్యాదు చేసిన వారి పేర్లేవి?ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ ఘటనకు సంబంధించిన వార్తలు కూడా న్యూస్ ఛాన్నెళ్లు, పత్రికల్లో కూడా వచ్చాయి. దాడికి పాల్పడ్డ వారి పేర్లను ప్రస్తావిస్తూ తిరుపతి ఎస్పీకి ఎంపీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఎస్వీయూ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ 18/2025లో ఎంపీ ప్రస్తావించిన పేర్లు లేవు. ప్రజా ప్రతినిధులు వెళుతున్న బస్సుకు పోలీసు ఎస్కార్ట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్‌ను సైతం ఎస్పీకి ఇచ్చారు. అయినా వారికి పోలీసులు సరైన భద్రత ఎందుకు కల్పించలేదు?’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ఎందుకు చేర్చలేదో, ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్పై జరిపిన విచారణ, పూర్తి సమాచారం, ఆధారాలతో సహా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. -
ఏపీ ప్రభుత్వానికి NHRC కీలక ఆదేశాలు
ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల అక్రమాల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాల విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది.సీనియర్ ర్యాంక్ అధికారితో విచారణ జరిపి యాక్షన్ టేకెన్ రిపోర్టు నాలుగు వారాల్లో పంపాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎన్హెఆర్సీ పలు ప్రశ్నలు సంధించింది. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ తగిన భద్రత ఎందుకు కల్పించలేదు? ఎఫ్ఐఆర్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు ఎందుకు చేర్చలేదు? అని డీజీపీని ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదిక పరిస్థితిని అందించడంతో పాటు.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో దాడులతో మానవ హక్కులకు భంగం వాటిల్లిన ఘటనపై స్పందించాలని డీజీపీకి సూచించింది.కాగా, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనపై ఇటీవలే జాతీయ మానవ హక్కుల సంఘానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ నుంచి వివరణ కోరింది. -
ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో దళిత యువకుణ్ణి అకారణంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి హింసించిన కేసులో డీజీపీతోపాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ అమానవీయమైన ఘటనపై ఆ ప్రాంతంతో లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకు తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. ఆ అధికారి నాలుగు వారాల్లోగా నిష్పాక్షికంగా విచారణ జరిపి తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది.వరద సమయంలో తమ కాలనీలో సమస్యపై పులిసాగర్ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. దీంతో విద్యావంతుడైన ఆ దళిత యువకుడిని దారుణంగా వేధించి, పోలీస్ స్టేషన్ లాకప్‌లో అర్ధ్ధనగ్నంగా మహిళా కానిస్టేబుళ్ల ముందు నిలబెట్టారు. చంపేస్తానని ఇన్స్పెక్టర్ బాజీలాల్ బెదిరించాడు. ఈ ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీలు పిల్లి గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీలు మార్గాని భరత్‌రామ్, గోరంట్ల మాధవ్‌తో కలిసి ఆయన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని, బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని పులి సాగర్‌కు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి కమిషన్ ఈ నోటీసులిచ్చిoది. పులి కృపానంద సాగర్ అనే దళిత యువకుడిపై అక్కడి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కులవివక్ష చూపించడంతోపాటు కస్టోడియల్ హింసకు గురి చేశారని ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక బ్రెత్రెన్ చర్చి వద్ద నీరు నిలిచిపోయిందని ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు హింసించారని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించినందుకు ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీఐ బాజీలాల్ అతన్ని పోలీస్ స్టేషన్లో ఉంచి అవమానించడంతోపాటు అత్యంత అమానవీయంగా చొక్కా విప్పి కొట్టారని, కులం పేరుతో అసభ్యంగా దూషించారని ఫిర్యాదులో తెలిపారు. లాకప్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ ఎదుట ఇబ్బందికర పరిస్థితుల్లో కొన్ని గంటలపాటు నిలబెట్టారని తెలిపారు. ఆ తర్వాత అతన్ని ఒక బండరాయికి కట్టి గోదావరిలో పడేశారని పేర్కొన్నారు. ఈ దారుణ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. ఊచల మధ్య ఒక మహిళా పోలీసు దగ్గర నిలబడి ఉన్న దృశ్యాలకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను కూడా ఆయన ఫిర్యాదుకు జత చేశారు. దీని ఆధారంగా మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీకి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఆన్లైన్లో నోటీసులిచ్చిoది. ఈ అమానవీయ ఘటనపై రాజమండ్రికి సంబంధం లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకు తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. 4 వారాల్లోగా నిష్పాక్షికంగా నివేదిక తమకు పంపాలని స్పష్టం చేసింది. బాధితుడు లేవనెత్తిన సమస్యలు, పారిశుద్ధ్య లోపంపై జిల్లా కలెక్టర్ ఏం చర్య తీసుకున్నారో తెలపాలంటూ మరో నోటీసు ఇచ్చారు. -
ములుగు ఎన్కౌంటర్.. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పౌరహక్కుల సంఘం ఆరోపణలను తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి ఖండించారు. ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు.ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది దుష్ప్రచారం. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండిస్తున్నాను. ఎదురుకాల్పులకు కొద్ది రోజుల ముందు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇద్దరు ఆదివాసీలను దారుణంగా హత్య చేశారు. ఇలాంటి ఘటనలను అడ్డుకొనేందుకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగారు.మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలు వినియోగించారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో సాయుధులైన ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. శవపరీక్షలు.. హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకే జరుగుతున్నాయి. విచారణ అధికారిగా ఇతర జిల్లా డిఎస్పీని నియమించాము. దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మహిళా మావో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు సైతం ఉన్నారు. మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్ కాగా, మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్ జిల్లాకు చెందినవారు. ఉదయం 6.16 గంటల ప్రాంతంలో చెల్పాక-ఐలాపూర్ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. దాదాపు అరగంటకుపైగా కాల్పులు జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలంలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, 303 రైఫిల్, ఇన్సాస్ తుపాకీ, ఎస్బీబీఎల్ గన్, సింగిల్‌షాట్ తుపాకీ, తపంచా, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రాణం తీసినా భూములివ్వం!
దుద్యాల్: తమ ప్రాణాలు తీసినా సరే భూములు మాత్రం కంపెనీల కోసం ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలోని లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండా ప్రజలు తేల్చి చెప్పారు. శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) అధికారులు ఈ మూడు గ్రామాల్లో పర్యటించారు.ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ లా ముఖేశ్, ఇన్స్పెక్టర్లు రోహిత్‌సింగ్, యతి ప్రకాశ్‌శర్మ బాధిత కుటుంబాలను కలిసి అభిప్రాయాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు పోలీసులు తమపట్ల అమానుషంగా వ్యవహరించారని గిరిజన మహిళలు గోడు వెళ్లబోసుకొన్నారు. రోటిబండతండాకు చెందిన సోనీబాయి, కిష్టబాయి, జ్యోతి, ప్రమీల, వాల్మీబాయి, జార్పుల రూప్సింగ్ నాయక్, సీత తదితరులను అధికారులు ప్రశ్నించారు. తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, చివరికి ప్రాణాలు తీసినా భూములు మాత్రం ఇవ్వబోమని ఈ సందర్భంగా బాధితులు తేల్చి చెప్పారు. కోర్టుల చుట్టూ తిరిగేందుకు తమ వద్ద డబ్బు లేదని చెప్పగా.. ప్రభుత్వ లీగల్ ఎయిడ్ ద్వారా ఉచితంగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ పర్యటనపై అధికారులు నివేదిక సిద్ధంచేసి కమిషన్‌కు అందజేయనున్నారు. ఈ నెల 11న లగచర్ల ఘటన జరగగా.. బాధిత గిరిజనులు 18న ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్హెచ్ఆర్సీ అడిగిన ప్రశ్నలివే.. ప్రశ్న: దాడి జరిగిన రాత్రి మీ మీ ఇళ్లలో ఎం జరిగింది? జవాబు: కరెంట్ తీసి పోలీసులు ఇళ్లలోకి దూరి మగవారిని తీసుకెళ్లారు, ఆడవారిని బెదిరించారు. అడ్డుపడితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు. ప్రశ్న: పోలీసులు మిమ్మల్ని కొట్టారా? జవాబు: కొట్టారు, అసభ్యకరంగా తిట్టారు సార్. ప్రశ్న: మీ డిమాండ్స్ ఏమిటి? జవాబు: మా ప్రాంతంలో కంపెనీలు వద్దు. మేము భూములు ఇవ్వం. మా జోలికి రావొద్దు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేసి మా కుటుంబ సభ్యులను విడిచిపెట్టాలి. కమిషన్ చేసిన సూచనలు.. ఎఫ్ఐఆర్లో పేరున్నవారు లొంగిపోతే 14 రోజులు రిమాండ్‌కు పంపి, బెయిల్ ఇస్తారు. ఎఫ్ఐఆర్లో పేరు లేనివారు ముందస్తు బెయి ల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ వేసుకోవాలి. లేదంటే ప్రస్తుతం జైలులో ఉన్నవారికి కూడా బెయిల్ రాదు. భూములు, కేసుల వ్యవహారాన్ని న్యాయస్థానాలు చూసుకుంటా యి. గ్రామాల్లోని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు మీ జోలికి రారు. నా కొడుకుకు సంబంధం లేదునా కొడుకు బాష్యానాయక్కు దాడితో ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజంతా మేకలు కాసేందుకు వెళ్లాడని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. అర్ధరాత్రి వచ్చి ఇంటి నుంచి తీసుకెళ్లడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టారు. – సోనీబాయి, బాధితురాలుబతిమాలినా వదిలిపెట్టలేదు నా భర్త ప్రవీణ్ పాల ఆటో నడుపుతాడు. ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు వచ్చి తలుపు తట్టారు. మేము భయపడి తీయకపోవడంతో కాళ్లతో బలంగా తలుపులు తన్నేసి లోపలికి వచ్చారు. ఇంట్లోని బీరువాను పగలగొట్టి చూశారు. నాకు డెలివరీ సమయం ఉందని బతిమాలినా వినకుండా నా భర్తను లాక్కెళ్లారు. పోలీసులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. – జ్యోతి, బాధితురాలు -
రేవంత్ ప్రభుత్వంపై NHRC ఆగ్రహం..
-
లగచర్ల ఘటన.. సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఫార్మా బాధితుల అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. లగచర్ల ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. ఘటన తీవ్రత నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం లా అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో కూడిన జాయింట్ టీమ్‌ను లగచర్ల పంపాలని నిర్ణయించింది.వారం రోజుల్లో ఈ అంశంపై జాయింట్ టీం నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల దాడిపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల భయంతో ఊరు విడిచి గ్రామస్తులు వెళ్లిపోవడం తీవ్రమైన విషయం అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చామంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. ఆయా కమిషన్లను కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
న్యాయం కోసం ఢిల్లీ బాట పట్టిన లగచర్ల ఫార్మా బాధితులు
-
లగచర్ల ఘటన: NHRCలో బాధితుల ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఘటన వ్యవహారం ఢిల్లీని తాకింది. లగచర్ల ఘటనకు బాధ్యులను చేస్తూ పోలీసులు కొందరిని అరెస్ట్ చేయడంతో బాధితులు.. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. లగచర్ల బాధితులు సోమవారం ఉదయం ఢిల్లీలో మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా లగచర్లలో అక్రమ అరెస్ట్‌లు, అక్కడ హింసపై బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. లగచర్లలో నేడు జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ సందర్బంగా అక్కడున్న సమస్యలపై వివరాలు సేకరించనున్నారు ఎస్టీ కమిషన్ సభ్యులు. -
ఢిల్లీకి చేరిన ‘లగచర్ల’!
సాక్షి, న్యూఢిల్లీ/బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై దాడి, గిరిజన రైతుల అరెస్టుల అంశం ఢిల్లీకి చేరింది. రైతుల అరెస్టులపై తక్షణమే విచారణ జరిపించాలని... బాధితులకు వెంటనే సహాయం అందించి, రక్షణ కల్పించాలంటూ ఇప్పటికే జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఆన్లైన్ ద్వారా 19 ఫిర్యాదులు అందాయి. అంతేకాదు నేరుగా ఈ కమిషన్లతోపాటు మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేసేందుకు కొందరు లగచర్ల బాధితులు, కుటుంబ సభ్యులు ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఎన్హెచ్ఆర్సీలను కలసి.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు. బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌జాదవ్ కూడా ఢిల్లీకి వెళ్లారు. పోలీసులు వేధిస్తున్నారంటూ ఆందోళన వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలో ఫార్మా విలేజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. తాము భూములు ఇవ్వబోమంటూ అక్కడి గిరిజన రైతులు కొంతకాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇటీవల భూసేకరణ అంశంపై గ్రామసభ నిర్వహించేందుకు అధికారులు వెళ్లగా.. స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు కలెక్టర్, అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు.. మూడు కేసులు నమోదు చేసి, 20 మందికిపైగా అరెస్టు చేశారు. మరికొందరి కోసం గాలింపు జరుపుతున్నారు. అయితే పోలీసులు తమ పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని గిరిజన కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమ భూము లు కోల్పోతామేమోనన్న భయంతోనే నిరసన వ్యక్తం చేశామని చెబుతున్నాయి. కానీ పోలీసులు అర్ధరాత్రి గ్రామానికి విద్యుత్ సరఫరా ఆపేసి మరీ, ఇళ్లపై దాడి చేశారని బాధిత కుటుంబాల వారు ఆరోపిస్తున్నారు. తమ వారిని తీవ్రంగా కొట్టి అరెస్టు చేశారని.. మహిళలను కూడా వేధించారని పేర్కొంటున్నారు. ఈ అంశంలో కల్పించుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్లకు ఈ అంశాలపై ఫిర్యాదులు చేయనున్నారు. నేడు లగచర్లకు ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడి రాక కొడంగల్ రూరల్: లగచర్ల, ఫార్మా విలేజీ ప్రతిపాదిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడు హుస్సేన్ నాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్‌నాయక్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పర్యటించనున్నట్లు గిరిజన మోర్చా నేతలు తెలిపారు. వారు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడంతోపాటు, గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకుంటారని వెల్లడించారు. -
NHRC చైర్ పర్సన్ విజయభారతిని కలిసిన YSRCP ఎంపీల బృందం
-
‘డీజీపీ పట్టించుకోవట్లేదు’.. NHRCలో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ, సాక్షి: ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీల బృందం మంగళవారం ఉదయం NHRC యాక్టింగ్ చైర్ పర్సన్ విజయభారతిని కలిసి ఫిర్యాదు లేఖ అందజేసింది.ప్రస్తుతం.. ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిని మానవ హక్కుల సంఘం దృష్టికి వైఎస్సార్సీపీ ఎంపీలు తీసుకెళ్లారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారు. పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డినీ నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న డీజీపీ పట్టించుకోవడం లేదు. వెంటనే జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని విచారణ జరపాలి. మానవహక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఎంపీలు కోరారు. .. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని, యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని, రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని విజయభారతికి తెలియజేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఆమె.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎంపీలకు హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్‌ను కలిసిన బృందంలో వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ , మేడ రఘునాథ్ రెడ్డి , డాక్టర్ తనూజా రాణి, బాబురావు ఉన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం: వైవీ సుబ్బారెడ్డివైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, ప్రతి కార్యకర్తకు తాము అండగా నిలబడతామని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.‘ప్రతి కార్యకర్తకు మేము అండగా నిలబడతాం.57 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు.12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదు.హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను అరెస్టు చేయకుండా ఐదు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు.మా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ అంశాలన్నింటిని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాం.మా కార్యకర్తలను హింసించి వారి నుంచి అనుకూల స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు.తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ఎన్హెచ్ఆర్సీని కోరాం’అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఏపీలో శాంతిభద్రతలు లేవు: ఎంపీ గొల్లబాబురావుచంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగ నడుపుతోందిరెడ్ బుక్ లో ఉన్న వారిని హింసిస్తున్నారుఇది రాక్షస రాజ్యం, నియంత రాజ్యం ఏపీలో శాంతిభద్రతలు లేవుడీజీపీ హోమ్ మినిస్టర్ పనిచేయడం లేదుఏపీ హోమ్ మినిస్టర్ కక్ష కట్టినట్టు మాట్లాడుతున్నారుప్రజలలోకి వెళ్లి అరాచకాలను ఎండగడతాంకార్యకర్తలు తిరగబడితే పరిస్థితి ఏంటి..? ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ఇప్పటిదాకా మా కార్యకర్తలు శాంతియుతంగా ఉన్నారుఇక మా కార్యకర్తలు తిరగబడితే పరిస్థితి ఎక్కడికెళ్తుందో తెలియదుఇప్పటివరకు డిఫెన్స్ ఆడాం , ఇక ఆఫెన్స్ మొదలు పెడతే ఎలా ఉంటుందోతక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘాన్ని కోరాఅక్రమ అరెస్టులను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లాపీఎం, సీఎం జోక్యం చేసుకొని ఎరాచకాన్ని ఆపాలిసూపర్సిక్స్ అమలు చేయలేకే దాడులు: ఎంపీ మేడ రఘునాథ్రెడ్డిసూపర్ సిక్స్ అమలు చేయలేక దాడులకు పాల్పడుతున్నారుఏపీలో అరాచక పాలనను ఆపాలని ఎన్ హెచ్ ఆర్ సినీ కోరాంమా హయాంలో రెండు లక్షల 75 వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలు అందించాంప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలిప్రతిపక్షాన్ని అణిచివేసే ప్రయత్నాలను మానుకోవాలికార్యకర్తలకు అండగా ఉంటాం: ఎంపీ తనూజారాణిసోషల్ మీడియా కార్యకర్తలకు మేము అండగా నిలబడతాంవారిపై జరుగుతున్న వేధింపులను మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లాం -
ఏపీలో మహిళల భద్రత గాల్లో దీపం..
-
ఏపీలో మహిళల భద్రత గాల్లో దీపం.. ఎన్హెచ్ఆర్సీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: జాతీయ మానవ హక్కుల సంఘం యాక్టింగ్ చైర్పర్సన్ విజయభారతిని వైఎస్సార్సీపీ మహిళా నేతల బృందం మంగళవారం కలిసింది. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. మహిళా నేతల బృందంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ డాక్టరు తనుజారాణి, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాధవి ఉన్నారు.కూటమి ప్రభుత్వంలో 77 మంది మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరిగిన విషయాన్ని కమిషన్ దృష్టికి వైఎస్సార్సీపీ తీసుకెళ్లింది. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక దందాల్లో సీఎం హోంమంత్రి బీజీగా ఉన్నారని.. మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన దిశా యాప్‌ను నిరుపయోగం చేశారని ఫిర్యాదులో వెల్లడించారు.దిశా యాప్ నిర్వీర్యం చేయడంతో మహిళల భద్రత గాల్లో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ అంశాల్లో వెంటనే జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతకు తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైఎస్సార్సీపీ నేతలు విన్నవించారు. -
గుడ్లవల్లేరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనలో వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలను చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నో రోజులుగా వ్యవహారం జరుగుతున్నా బయటకెందుకు రాలేదని ప్రశి్నంచింది. అర్థరాత్రి వరకూ విద్యార్థినులు ధర్నా చేయడం.. ఘటనపై వివిధ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచి్చనట్లు ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది. విద్యార్థినుల వీడియోలను రహస్య కెమెరాలతో రికార్డ్ చేసి, వాటిని అమ్మడం వంటి వ్యవహారాలు జరగడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడింది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందని తీవ్రస్థాయిలో ప్రశి్నంచింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం తమకు వివరించాలని అందులో పేర్కొంది. -
ఏపీ ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు రోజుల వ్యవధిలో ఏపీలో జరిగిన మూడు ఘోరమైన ప్రమాదాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అలాగే, చిత్తూరు సమీపంలోని మురకంబట్టు ప్రాంతంలోని అపొలో మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యి 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్..అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం, 37మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ 3 ఘటనలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆరోపించింది. 2 వారాల్లో ఈ 3 ఘటనలపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. అచ్యుతాపురం ఘటనలో ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్ట్, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, నష్టపరిహారం వంటి విషయాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా సాయం అందిందా లేదా అనే సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా తమకు తెలపాలని పేర్కొంది. -
ఏపీ ప్రభుత్వానికి NHRC నోటీసులు వరుస ఘటనలపై సీరియస్
-
ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలు.. ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. అనకాపల్లి అనాథా శ్రయంలో ముగ్గురు విద్యార్థుల మృతి చెందగా, 37 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. మరో ఘటనలో చిత్తూరు అపోలో ఆసుపత్రిలో 70 మంది విద్యార్థులు విషాహారం తిని అస్వస్థత గురయ్యారు.ఈ కేసులను జాతీయ మానవ హక్కుల సంఘం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీ , డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో నివేదిక పంపాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. -
అచ్యుతాపురం ఘటనపై NHRC సీరియస్.. ఏపీ సర్కార్‌కు నోటీసులు
-
అచ్యుతాపురం ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్.. ఏపీ సర్కార్‌కు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీ.. డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యాజమాన్యం నిర్లక్ష్యం తదితర అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.కాగా, విశాఖలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలిపోయిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది. దుర్ఘటన తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం తరలించకపోవడం... వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం... శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయకపోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది.ఏదైనా దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో బాధిత కుటుంబాలకు సమాచారం అందించి భరోసా కల్పించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చి సహాయక చర్యలు, ఇతర ముఖ్య సమాచారాన్ని అందిపుచ్చుకునే వ్యవస్థను తేవడం పరిపాటి. అయితే తాజా ఘటనలో అలాంటి చర్యలేవీ లేకపోగా కూటమి సర్కారు స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది. -
2022లో 175 మంది లాకప్ డెత్...
సాక్షి, హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్నప్పుడు పలు కారణాలతో జరుగుతున్న మరణాలు.. లాకప్‌డెత్‌లు ఏటికేడాది పెరుగుతున్నాయి. 2022లో ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 175 మంది లాకప్‌డెత్ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ మేరకు లాకప్‌డెత్‌లపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) గణాంకాలను కేంద్ర హోంశాఖ.. పార్లమెంట్‌కు సమర్పించింది. హోంశాఖ నివేదిక ప్రకారం.. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 669 మంది లాకప్‌డెత్ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన ఖదీర్‌ఖాన్ లాకప్‌డెత్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలోనూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరియమ్మ కస్టోడియల్ డెత్ సంచనాలకు దారితీసింది. గుజరాత్ రాష్ట్రంలో గత అయిదేళ్లలో 80 మంది కస్టోడియల్ డెత్‌కు గురయినట్లు ఆ నివేదిక పేర్కొంది. కాగా, దేశంలో అత్యధికంగా లాకప్‌డెత్‌లు గుజరాత్‌లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ లాకప్‌డెత్‌లు ఎక్కువే నమోదవుతున్నాయి. కస్టడీలో ఉన్న వారి మృతికి పోలీసుల చిత్రహింసలే ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. లాకప్‌డెత్‌ల విషయంలో నామమాత్రంగా చర్యలు మినహా పోలీసులపై కఠిన చర్యలు ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతిపాదనల మేరకు 201 కేసులలో బాధిత కుటుంబాలకు రూ. 5,80,74,998 పరిహారాన్ని ప్రభుత్వాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కందుకూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు
సాక్షి, అమరావతి: గత నెల 28న నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్ షోలో ఎనిమిదిమంది మృతిచెందిన ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ – ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. జనాలు ఎక్కువమంది వచ్చారని చూపించుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇరుకైన వీధుల్లో రోడ్‌షో ఏర్పాటు చేసి తొక్కిసలాటకు తావిచ్చారని, దీంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడకు చెందిన వైద్యుడు అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ ఎన్హెచ్ఆర్సీకి గత నెల 29న ఫిర్యాదు చేశారు. ఇరుకైన వీధుల్లో జనాలు పోగైతే డ్రోన్ షాట్స్ బాగా వస్తాయని, వీటిని పార్టీ పబ్లిసిటీ కోసం వినియోగించుకోవచ్చని నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా రోడ్ షోకు ప్రణాళిక రచించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం చేసిన చర్యల ఫలితంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతిచెందారని ఫిర్యాదుదారుడు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కందుకూరు ఘటనపై నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తన ఫిర్యాదుపై ఈ నెల 10వ తేదీన కమిషన్ కేసు నమోదు చేసిందని రాధాకృష్ణ ‘సాక్షి’ తో చెప్పారు. -
ఏపీలో సంక్షేమ పథకాలు అద్భుతం
పెదకాకాని(పొన్నూరు): ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో అమలు చేస్తున్న సచివాలయ వ్యవస్థ సేవలు, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్ జనరల్ సంతోష్ మెహ్రా (ఇన్వెస్టిగేషన్) ప్రశంసించారు. గుంటూరు జిల్లా పెదకాకాని సచివాలయం, నంబూరు రైతు భరోసా కేంద్రాన్ని మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ గోచిపాతల శ్రీనివాసరావుతో కలసి సందర్శించారు. ఈ బృందానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి స్వాగతం పలికారు. సచివాలయాల పనితీరు, ప్రభుత్వ పథకాలపై జేసీ రాజకుమారి సంతోష్ మెహ్రాకు వివరించారు. సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో సంతోష్ మెహ్రా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలు విజయవంతం కావడమే లక్ష్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పనితీరుపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు పోషకాహారం అందించడం, ప్రతి నెలా 1వ తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందజేయడంపై ప్రశంసల జల్లు కురిపించారు. రైతు భరోసా కేంద్రాల సేవలు భేష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని సంతోష్ మెహ్రా అన్నారు. నంబూరు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఏడీ వెంకటేశ్వర్లు వ్యవస్థ అమలు తీరును వివరించారు. ఆర్డీవో ప్రభాకరరెడ్డి, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ , గ్రామ సచివాలయ జిల్లా అధికారి కావూరి గీతారాణి, ఎంపీడీవో టీవీ విజయలక్ష్మి, ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించిన ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ రామవరప్పాడు: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకమైన సేవలు అందించడం అభినందనీయమని జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంతోష్ మెహరా అన్నారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తొలుత సంతోష్ మెహరాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృందం ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసాదంపాడు, గూడవల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల్లోని సచివాలయాలను సోమవారం ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ సభ్యులు డాక్టర్ జి.శ్రీనివాసరావుతో కలసి సందర్శించారు. కలెక్టర్ ఢిల్లీరావు.. సంతోష్ మెహరాకు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న వివిధ శాఖల వారి పనితీరును వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను బృందానికి తెలిపారు. చదవండి: (Somu Veerraju: ప్రధాని పర్యటనలో భారీ కుట్ర) అవినీతికి, వివక్షకు తావు లేకుండా పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500కు పైగా సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. ఎన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యలు పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. సచివాలయ వ్వవస్థలో వలంటీర్ల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని.. అర్హులైన ప్రతి లబ్ధిదారుని గడపకు వెళ్లి స్వయంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని వివరించారు. దిశ యాప్ గరించి.. దిశ యాప్‌ను సంతోష్ మెహరా స్వయంగా పరిశీలించారు. దిశ యాప్ ఆయన ఉపయోగించగానే మంగళగిరిలోని దిశ కంట్రోల్ పోలీస్ స్టేషన్ సమాచారం అందుకుని స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో చేస్తున్న కృషి హర్షణీయమన్నారు. గ్రామ సచివాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంతోష్ మెహరా కోరారు. జెడ్పీ సీఈవో సూర్యప్రకాష్, డ్వామా పీడీ సునీత, డీపీవో కేపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ కేసుపై ఎన్‌హెచ్చార్సీ, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బాలిక సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ సరిగా స్పందించడం లేదని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఈ కేసులో బాధిత బాలికకు పూర్తిన్యాయం జరిగేదాకా, నిందితులను అరెస్ట్ చేసి, దోషులకు శిక్షపడేదాకా ఆందోళనలు, ధర్నాలు, ఇతర రూపాల్లో ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అలాగే బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో దీనిపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నగర పార్టీలోని వివిధ విభాగాలు, నాయకులతోపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు సోమవారం సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు. -
‘దిశ’హత్యాచార ఘటన: పోలీసులు చెప్పిందే నమోదు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచార ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఏర్పాటు చేసిన బృందంపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీసీ సిర్పుర్కర్ కమిషన్ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎన్హెచ్ఆర్సీ డీఐజీ మంజిల్ సైనీ, ఇన్స్పెక్టర్లు దీపక్‌కుమార్, అరుణ్ త్యాగిల విచారణ బుధవారంతో ముగిసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మృతదేహాలు పడి ఉన్న తీరు, పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారు వంటి కీలక అంశాలను ఘటనాస్థలి నుంచి సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు మాత్రమే ఎందుకు నమోదు చేశారని త్రిసభ్య కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: రెండ్రోజుల్లో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ ‘దిశ’నిందితులను పోలీసులు విచారించిన ప్రైవేటు అతిథిగృహం వాచ్మెన్, చటాన్‌పల్లికి నిందితులను తరలించిన వాహనాల డ్రైవర్లను కూడా కమిషన్ విచారించింది. ఎన్కౌంటర్ తర్వాత మృతదేహాలకు పంచనామా నిర్వహించిన వైద్యులు, పోలీస్ క్షతగాత్రులకు వైద్యం అందించిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులను కమిషన్ నేడు విచారించనుంది. శుక్రవారం వీసీ సజ్జనార్‌ను విచారించే అవకాశముందని తెలిసింది. -
రైతుల ఆందోళనలతో ప్రతికూల ప్రభావమెంత?
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు పారిశ్రామిక, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం చూపాయని, ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో కరోనా రక్షణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ, యూపీ, హరియాణా, రాజస్తాన్ ప్రభుత్వాలకు, పోలీస్ చీఫ్‌లకు కేంద్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో కరోనా ప్రొటోకాల్స్ ఉల్లంఘన, తదుపరి పరిణామాలు, వివిధ రంగాలపై ఆందోళనల ప్రభావంపై నివేదికలు సమర్పించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, హోంశాఖ, ఆరోగ్య శాఖలను కమిషన్ ఆదేశించింది. రైతు ఆందోళనలపై పలు ఫిర్యాదులు కమిషన్‌కు అందాయని, వీటి కారణంగా దాదాపు 9వేల కంపెనీల యూనిట్లపై ప్రభావం పడిందని తెలిపింది. నిరసనలతో రవాణా రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైందని, పేషంట్లు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, పాదచారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయని కమిషన్ తెలిపింది. మార్గాల మూసివేతతో ఆయా ప్రాంతాల్లోని స్థానికులు ఇళ్లకు చేరుకోకుండా అడ్డుకున్నారని తెలిపింది. వీటిపై తీసుకున్న చర్యలను నివేదించాలని 4 రాష్ట్రాలను కోరింది. శాంతియుత పద్ధతుల్లో ఆందోళన జరిపే హక్కు అందరికీ ఉందని, కానీ ఈ విషయంలో మానవహక్కుల అంశం ముడిపడి ఉన్నందున జోక్యం చేసుకోవాల్సి వస్తోందని వివరించింది. రైతు ఆందోళనలతో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలపై, ఉత్పత్తి, రవాణాపై, ఇతర ఇబ్బందులపై సమగ్ర నివేదికను అక్టోబర్ 10 నాటికి సమర్పించాలని ఐఈజీ(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్)ను కమిషన్ ఆదేశించింది. నిరసన ప్రదేశంలో హక్కుల కార్యకర్త గ్యాంగ్ రేప్‌కేసులో పరిహారంపై ఝజ్జర్ డీఎం ఇంతవరకు నివేదిక ఇవ్వలేదని, అక్టోబర్ 10 నాటికి తప్పక రిపోర్టు సమర్పించాలని పేర్కొంది. ఈ నిరసన కార్యక్రమాలతో సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి ఎదురైన సమస్యల గురించి ఒక సర్వే నిర్వహించి నివేదికనివ్వాలని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్‌ను కమిషన్ కోరింది. -
రైతుల ఆందోళన: కేంద్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర తీసుకోచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన దీక్ష ఇప్పటికే పలుసార్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. రాజస్థాన్, హరియాణా,యూపీ సహా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నోటిసులు జారీచేసింది. ఈ ఆందోళనలు మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే కమిషన్ ఈ ఆందోళన ప్రభావాన్ని ముదింపు చేయాలని ఆదేశిస్తోందని తెలిపింది. శాంతియుత పద్ధతుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే ఆందోళనలు కమిషన్ గౌరవిస్తుందని తెలిపింది. కాగా, పారిశ్రామిక రంగంపై ఆందోళనల ప్రభావాన్ని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్’ లెక్కించి అక్టోబర్ 10 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అదే విధంగా, కోవిడ్-19 ప్రోటోకాల్ ఉల్లంఘనల ప్రభావాన్ని‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక రూపంలో అందించాలని తెలిపింది. గతంలో ఆందోళన జరిగే ప్రదేశం వద్ద మానవ హక్కుల కార్యకర్త గ్యాంగ్ రేప్‌కు గురైన ఘటనపై ఝజ్జర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతుల ఆందోళనల కారణంగా సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి కల్గిన విఘాతంపై ‘ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’(యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ) అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలను జారీచేసింది. చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం ! చదవండి: కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం.. చదవండి: మళ్లీ రైతు రక్తం చిందింది.. సిగ్గుతో దేశం తలవంచుకుంటోంది: రాహుల్ ఫైర్ -
విస్తుగొలిపే విషయాలు.. దేశంలో జుడీషియల్, పోలీసు కస్టడీ మరణాలు..
జీవితంలో గడిచిపోయిన ప్రతి క్షణం వెలకట్టలేనిది. ఆ కాలాన్ని తిరిగి ఇవ్వాలంటే.. అది ఎవరి వల్లా కాదు.. అయితే మన దేశంలో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న నిర్దోషులు అనేక మంది ఉన్నారు. ఇంటారాగేషన్ పేరుతో ఒంట్లోని శక్తినంతా లాగేశాక.. చివరికి జీవచ్ఛవాల్లా ఉన్న వారిని నిర్దోషులుగా విడుదల చేయడం పరిపాటి. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పిన విషయాలు దేశంలో జైళ్ల పరిస్థితిని తెలియజేస్తోంది. సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 3 సంవత్సరాలలో 348 మంది పోలీసు కస్టడీలో మరణించగా.. 5221 మంది జ్యుడీషియల్ కస్టడీలో మరణించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పారు. అంతే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో పోలీసు కస్టడీలో 23 మంది చనిపోయారని, అదే సమయంలో జ్యుడీషియల్ కస్టడీలో 1295 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. ఎన్హెచ్ఆర్సీ, ఎన్సీఆర్బీ గణాంకాల్లో చాలా తేడాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డుల ప్రకారం గత 10 సంవత్సరాలలో, 1,004 మంది పోలీసుల కస్టడీలో మరణించారు. అందులో 40శాతం మంది సహజంగా లేదా అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోగా.. 29శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ నివేదికలో దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా చనిపోయారా? లేదా పోలీసుల చిత్రహింసల కారణంగానా..? అనేది స్పష్టం చేయలేదు. అలాగే పోలీస్ కస్టడీ మరణాలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల్లో చాలా తేడాలు ఉన్నాయి. నిందుతులు ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే..! దీనిపై సామాజిక కార్యకర్త సమీర్ మాట్లాడుతూ.. "ఖైదీలను హింసించడాన్ని వ్యతిరేకిస్తున్న అనేక మంది అధికారులు పోలీసు శాఖలో ఉన్నారు. పోలీసులు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు. అందువల్ల న్యాయస్థానాల ద్వారా నేరస్తులను విచారించడానికి చట్టపరమైన నిబంధనలను ఉపయోగిస్తారు. తీహార్ జైలులో ఓ ఖైదీ హత్యకు సంబంధించి డిప్యూటీ జైలర్, ఇతర జైలు సిబ్బంది పేర్లు బహిర్గతమయ్యాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ చట్టం అటువంటి విషయాలపై స్పష్టంగా ఉంది. నిందితులు ఏ పదవిలో ఉన్నా ప్రాసిక్యూట్ చేస్తారు.’’ అని అన్నారు. క్రూరంగా హింసించే హక్కును ఏ చట్టమూ పోలీసులకు ఇవ్వలేదు ఓ మానవ హక్కుల కార్యకర్త స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. సంబంధిత పోలీసు అధికారులపై కేసును ప్రభుత్వ అనుమతి తర్వాత మాత్రమే నమోదు చేయవచ్చు. అయితే ప్రభుత్వాలు దీనికి బహిరంగంగా అమలు చేయడానికి ఇష్టపడవు. ఇది ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సిగ్గుచేటు. పోలీసు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను అనుమానిత నేరస్థులుగా మాత్రమే పరిగణించాలి అంతే కానీ వారిని నిర్బంధంలో క్రూరంగా హింసించే హక్కును ఏ చట్టమూ పోలీసులకు ఇవ్వదు. ఈ సమస్యపై దేశంలోని పోలీసులు, పరిపాలనా వ్యవస్థ సున్నితంగా ఉండడం అత్యవసరం’’ అని ఓ సామాజిక కార్యకర్త అన్నారు. కాగా హిందుస్తానీ బిరదారీ వైస్ ఛైర్మన్ విశాల్ శర్మ మాట్లాడుతూ.. ఏదైనా కస్టడీ మరణంపై పోలీసు శాఖ ద్వారానే సరైన నిష్పాక్షిక విచారణ జరగాలని పేర్కొన్నారు. అలాగే ప్రమేయం ఉన్న పోలీసులను చట్ట ప్రకారం శిక్షించాలని సూచించారు. -
కరోనా నేపథ్యంలో ఆదుకోండి..
సాక్షి, అమరావతి: కరోనా నుంచి తమను కాపాడి, ఆదుకునేందుకు చర్యలు చేపట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)ను సెక్స్ వర్కర్లు కోరారు. ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ అరుణ్‌కుమార్ మిశ్రాకు వినతిపత్రం ఇచ్చినట్టు సెక్స్ వర్కర్స్, అక్రమ రవాణా బాధితుల రాష్ట్ర సమాఖ్య(విముక్తి సంస్థ) రాష్ట్ర కన్వీనర్ మెహరున్నీసా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనాతో తీవ్రంగా ప్రభావితులైన సెక్స్ వర్కర్లను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఎన్హెచ్ఆర్సీ 2020 అక్టోబర్ ఐదో తేదీన, 2021 మే 31న అన్ని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించినా అమలులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జాప్యాన్ని నిరోధించేలా ఎన్హెచ్ఆర్సీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు మెహరున్నీసా పేర్కొన్నారు. -
NHRC చైర్మన్‌గా జస్టిస్ అరుణ్ మిశ్రా.. ఖర్గే అభ్యంతరం
ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా(ఎన్హెచ్ఆర్సీ) బాధ్యతలు స్వీకరించారు. మాజీ జస్టిస్ హెచ్ఎల్ దత్తు పదవీకాలం ముగిసిన తర్వాత.. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ పోస్టు గత ఏడాది డిసెంబర్ నుంచి ఖాళీగా ఉన్నది. ఇవాళ జస్టిస్ అరుణ్ మిశ్రాతో పాటు ఓ ప్యానెల్ సభ్యుడు కూడా చేరారు. అయితే అరుణ్ మిశ్రాను మోదీ నేతృత్వంలోని హై పవర్డ్ కమిటీ రాష్ట్రపతికి రికమెండ్ చేసింది. ఆ హైపవర్డ్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ఉన్నారు. కాగా మల్లిఖార్జున్ ఖర్గే అరుణ్ మిశ్రా నియామకాన్ని తప్పుబట్టారు.షెడ్యూల్డ్ కాస్ట్ లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తిని ఎన్హెచ్ఆర్సీ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. జస్టిస్ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జిగా 2014లో చేరారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయన రిటైర్ అయ్యారు. కోల్‌కతా, రాజస్థాన్ హైకోర్టుల్లో ఆయన చీఫ్ జస్టిస్‌గా చేశారు. జస్టిస్ మిశ్రా తండ్రి హర్గోవింద్ మిశ్రా మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా చేశారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2020 డిసెంబర్లో పదవీ విరమణ చేశారు. కాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ చంద్ర పంత్ ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం -
ఉపాధి పనుల్లో... వలస కార్మికులకు కోటా
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పనుల్లో వలస కార్మికులకు కోటా ఏర్పాటు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నియమించిన అధ్యయన బృందం సిఫారసు చేసింది. భారతదేశంలో వలస కార్మకుల సామాజిక భద్రత, ఆరోగ్య హక్కులపై పరిశోధన, అధ్యయనం చేయాలంటూ అక్టోబరు 18, 2019న ఢిల్లీలోని కేరళ డెవలప్మెంట్ సొసైటీకి ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, మహారాష్ట్రల్లోని నాలుగు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన మొత్తం 4,400పై ఈ అధ్యయనం నిర్వహించారు. అనంతరం అధ్యయన బృందం కేంద్ర కార్మికశాఖ, గ్రామీణాభివద్ధిశాఖ, వినియోగదారుల వ్యవహారాలు శాఖలతోపాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పలు సిఫారసులు చేసింది. ఈ అధ్యయనాన్ని ఎన్హెచ్ఆర్సీ ఇటీవల ఆమోదించింది. కార్మికశాఖకు సిఫారసులు జాతీయ స్థాయిలో వలస కార్మికుల సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం నిమిత్తం అంతర్ రాష్ట్రాల వలస మండలి ఏర్పాటు చేయాలి. అంతర్ రాష్ట్ర వలస కార్మికులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాలి. 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా రాష్ట్ర, కేంద్ర స్థాయిలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలి. గ్రామీణాభివద్ధి శాఖ: ఉపాధి హామీ పథకంలో వలస కార్మికులకు కోటా కేటాయించాలి. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని వలస కార్మికుల కోసం మెరుగుపరచాలి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ వారు వన్ నేషన్–వన్ రేషన్ కార్డు ఫాస్ట్ ట్రాక్‌లో అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు: కార్మిక విభాగాలు తప్పనిసరిగా వలస కార్మికుల జాబితా రూపొందించాలి. వలస కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించాలి. వాటిని పనిచేసే చోట ఏర్పాటు చేసేలా చూడాలి. విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం వలస కార్మికుల పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. వలసకార్మికుల నైపుణ్యాన్ని గుర్తించి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. వలస కార్మికుల సొంత రాష్ట్రాలు కానీ, పనిచేసే చోట అక్కడి రాష్ట్రాలువారికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ వలస కార్మికుల కోసం వారి సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకొనేలా రిమోట్ ఓటింగ్ హక్కు కల్పించాలి. ( చదవండి: వలసపక్షుల బెంగ ) -
విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌లో గతేడాది విషవాయువులు లీకైన దుర్ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తినిచ్చాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. బాధితులకు పరిహారం అందించడంలో సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన కార్యాచరణ నివేదికను అంగీకరిస్తున్నట్టు తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన 12 మంది కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున, రెండుమూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన 485 మందికి రూ.లక్ష చొప్పున అందజేయడంతోపాటు 12 మందిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించినట్టు ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిపింది. గతేడాది మే 7న జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరించిన విషయం విదితమే. ‘ఆర్ఆర్వీ పురం, నందమూరి నగర్, కంపరపాలెం, పద్మనాభ నగర్, ఎస్సీ, బీసీ కాలనీ, మేఘాద్రిపేట కాలనీల్లోని 17 వేల ఇళ్ల నుంచి 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి 23 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశాం. ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షల చొప్పున, ప్రాథమిక చికిత్స పొందిన 99 మందికి రూ.25 వేల చొప్పున అందజేశాం. ప్రభావిత ప్రాంతాల్లోని 19,893 మందికి రూ.10 వేల చొప్పున, చనిపోయిన 25 జంతువులకు సంబంధించి యజమానులకు రూ.8,75,000 అందజేశాం. ఎన్జీటీ, ఢిల్లీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వద్ద రూ.50 కోట్లు డిపాజిట్ చేశాం’ అని సంబంధిత అధికారులు తెలియజేశారని వెల్లడించింది. 437 మందిని విచారించి 12 మందిపై క్రిమినల్ చర్యలు ప్రారంభించడంతోపాటు సంస్థ సీఈవో, డైరెక్టర్లు, సీనియర్ అధికారుల పాస్‌పోర్టులు సీజ్ చేసినట్టు తెలిపారని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ చీఫ్ కంట్రోల్ ఎక్స్‌ప్లోజివ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. చదవండి: పేదల గూటికి టీడీపీ గండి! ఎస్ఈసీకి ఎదురుదెబ్బ.. ఆ అధికారం మీకెక్కడుంది!? -
వివాదంలో ఎమ్మెల్యే.. మహిళ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు భూ కబ్జాలను అడ్డుకున్నందుకు తన కుటుంబ సభ్యులపై కేసులు బనా యించి వేధిస్తున్నారని మిర్యాలగూడ పట్టణానికి చెందిన బంటు మణెమ్మ గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మిర్యాలగూడటౌన్ పోలీసులు కుమ్ముక్కై తమను వేధిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే, పోలీసుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నామని, ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని వివరించారు. ఎమ్మెల్యే, అతడి అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను అడ్డుకుని బాధితులకు అండగా నిలిచిన తన భర్త, న్యాయవాది బుచ్చిబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నట్లు తెలిపారు. (విలాసాల లేడీ.. రూ.4కోట్ల మోసం) ఎమ్మెల్యే ఒత్తిడితో మిర్యాలగూడ పోలీసులు తమ ఇంట్లోకి చొరబడి ముఖ్యమైన ఫైళ్లు, కాగితాలు, పాస్ పుస్తకాలు, దస్తావేజులతో పాటుగా కీలకమైన పత్రాలను లాక్కెళ్లారని ఆమె వివరించారు. తన భర్త, కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించిన మిర్యాలగూడ పోలీసులు, వేధింపులకు కారణమైన ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎన్ని చీవాట్లు పెట్టినా మార్పు రాదా?!
సాక్షి, నల్గొండ: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ వార్డులో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఉన్న కొద్దిమంది సిబ్బందికి కనీసం పీపీఈ కిట్లు కూడా లేకపోవడంతో వారు చేతులెత్తేశారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కరోనా రోగులకు, వారి సహాయకులే సేవలు చేస్తున్నారు. అవగాహన రాహిత్యంతో మాస్కులు కూడా ధరించకుండానే రోగులతో దగ్గరగా ఉంటున్నారు. తమవారిని కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. కాగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఇటీవల ఇదే ఆస్పత్రిలో బొప్పని యాదయ్య అనే రోగి మృతి చెందడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వైద్య శాఖకు చీవాట్లు పెట్టినా ఎలాంటి మార్పు కానరావడం లేదు. (అయ్యో... బిడ్డ) (సిబ్బందిలేక.. ఇబ్బంది !) -
విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ విచారణ
సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) మంగళవారం ఢిల్లీలో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో 194 కాలేజీలను తనిఖీ చేశామని అందులో లోపాలు ఉన్నాయని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. ఆ మేరకు కోటి 80లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించినట్లు నివేదికలో పేర్కొంది. అనధికారికంగా హాస్టల్ నడుపుతున్న కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, సెలవు రోజుల్లో క్లాసులో నిర్వహణపై కాలేజీలకు జరిమానా విధించినట్లు తెలిపింది. నివేదికను పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ.. విద్యార్థుల సమస్యలపై తల్లిదండ్రులతో కాలేజీ యాజమాన్యాలు ఓరియంటేషన్ జరపాలని ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించింది. కాగా తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. -
అయ్యో... బిడ్డ
సాక్షి, నల్లగొండ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, ఆక్సిజన్ సరఫరా లేక కొడుకు నరకయాతన పడుతుండగా... ఏం చేయాలో దిక్కుతోచక కన్నతల్లి తల్లడిల్లింది. బిడ్డను పిలుస్తూ, సపర్యలు చేస్తూ రోదించింది. ఆమె అలా చూస్తుం డగానే కుమారుడి ప్రాణం గాల్లో కలిసి పోయింది. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి ఎందరి హృదయాలనో బరువెక్కించింది. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఈ ఘటన జరిగింది. దీన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన బొప్పని యాదయ్య (40) ఆరోగ్యం బాగోలేక శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేరగా, శనివారం సాయంత్రం శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్ అందించారు. కొద్దిసేపటి తర్వాత ఆక్సిజన్ అయిపోయింది. తల్లి లక్ష్మమ్మ కుమారుడి అవస్థను చూసి ఎంతగా రోదించినా ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదు. గిలగిలలాడిన యాదయ్య తుదిశ్వాస విడిచాడు. యాదయ్య లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతని భార్య కూడా ఐదేళ్ల క్రితం చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి లక్ష్మమ్మ తన పెన్షన్ డబ్బులతోనే యాదయ్య, అతని పిల్లలను సాకుతోంది. ఈ క్రమంలో యాదయ్యకు ఆయాసం ఎక్కువ కావడంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చింది. పరీక్షించిన వైద్యులు శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించినా.. కరోనా లక్షణాలు ఉండడంతో అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చేర్చారు. అతను శ్వాస ఆడక శనివారం సాయంత్రం మరణించాడు. సకాలంలో వైద్యం అందితే బతికేవాడు నా కుమారుడికి సరైన సమయంలో వైద్యం, ఆక్సిజన్ అందితే బతికేవాడని తల్లి లక్ష్మమ్మ తెలిపింది. డాక్టర్లు ఎవరూ పట్టించుకోలేదని, ఆక్సిజన్ పెట్టినా అది అయిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక చనిపోయినట్లు ఆరోపించింది. యాదయ్యకు కరోనా లక్షణాలు ఉండడంతో అతని నుంచి నమూనాలు తీసుకుని పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌కు పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంకా రిజల్ట్ రాలేదని పేర్కొన్నాయి. సుమోటోగా కేసు నమోదు ఆస్పత్రి బెడ్‌పై కుమారుడు యాదయ్యకు తల్లి సేవలు చేస్తూ రోదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ ఆగస్టు 21లోగా అన్ని ఆధారాలతో పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఎంహెచ్ఓ కొండల్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. నివేదిక కోరిన కలెక్టర్ యువకుడి మృతిపై పూర్తిస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం యాదయ్య తీవ్ర శ్వాస ఇబ్బంది, దగ్గు, జ్వరంతో చికిత్స కోసం 17న ఆస్పత్రిలో చేరాడని, అతను అప్పటికే అలర్జి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరి వ్యాధి (సీఓపీడీ)తో బాధపడుతున్నాడని కలెక్టర్ వివరించారు. వచ్చిన వెంటనే కరోనా అనుమానిత వార్డులో చేర్చుకుని సంబంధిత డాక్టర్, సిబ్బంది శక్తివంచన లేకుండా వైద్యసేవలు అందించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయాడన్నారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే సంబంధీకులపై చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్ఆర్సీ నుంచి ఇంకా నోటీసులు రాలేదని, వచ్చాక స్పందిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని పేర్కొన్నారు. -
ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు!
పాట్నా: ముజఫర్ నగర్ రైల్వే స్టేషన్లో జరిగిన హృదయ విదారక ఘటనకు సంబంధించి బీహార్ ప్రభుత్వం, రైల్వేపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ముజఫర్ నగర్ రైల్వే స్టేషన్లో ఒక మహిళ చనిపోగా, ఆమె కొడుకు శవం దగ్గర ఏడుస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ మహిళ రైల్వే స్టేషన్లో సరైన ఆహారం, వసతి లేకే చనిపోయిందని లాయర్ మహమ్మూద్ ఎన్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. (‘కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్’) మే 25న రైల్వే స్టేషన్లో దీనికి సంబంధించి రికార్డు అయిన సీసీ ఫుటేజీని సీజ్ చేయాలని కోరారు. బీహార్ ప్రభుత్వం, రైల్వే శాఖలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా సదరు మహిళ కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆదేశించాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు. బీహార్ రైల్వే కనీస వసతులు కూడా రైళ్లో కల్పించలేదని, శిశు, మహిళ సంరక్షణ విషయంలో విఫలమైందని ఎన్హెచ్ఆర్సీకి తెలిపారు. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సదురు మహిళ మే 24న శ్రామిక్‌రైల్లో గుజరాత్ నుంచి బయలుదేరి మే 25 కు గుజరాత్‌కు చేరుకుంది. అయితే ఆమెకు సరైన ఆహారం, వసతి లభించక మరణించింది. (వైరస్ భయం: ఫ్లైట్‌లో ‘ఆ నలుగురు’) -
లాక్డౌన్: తొలి ఐదు వారాలు చితక్కొట్టారు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లోకొచ్చిన తొలినాళ్లలో పోలీసుల అత్యుత్సాహం వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారని ఓ ఎన్జీఓ అధ్యయనంలో వెల్లడైంది. లాక్డౌన్ నిబంధనలు పాటించలేదనే కారణంతో పోలీసులు వారిని చితక్కొట్టారని, తీవ్ర గాయాలతో ఆ అభాగ్యులు మృతి చెందారని కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (సీహెచ్ఆర్ఐ) అధ్యయనం తెలిపింది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా తొలి ఐదు వారాలు పోలీసులు కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేశారని, ఆ క్రమంలో కొన్ని చోట్ల మితిమీరి ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. పోలీసు చర్యలతో మార్చి 25 నుంచి ఏప్రిల్ 30 వరకు దేశవ్యాప్తంగా 12 మరణాలు సంభవించాయని వెల్లడించింది. వారిలో ముగ్గురు పోలీసులు కొట్టారనే అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపింది. మీడియా కథనాల ఆధారంగా ఈ వివరాలు సేకరించామని సీహెచ్ఆర్ఐ పేర్కొంది. మరణించిన వారిలో ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పంజాబ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు సీహెచ్ఆర్ఐ హెడ్ దేవికా ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించి జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని, బాధ్యులపై చర్యలకు విజ్ఞప్తి చేశామని అన్నారు. అయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ మరణాలకు కారణమైనవారిని సస్పెండ్ చేయడమో.. బదిలీ చేయడమో చేశాయని దేవికా వెల్లడించారు. కానీ, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఇక ఈ మరణాలతోపాటు లాక్డౌన్ సమయంలో ఇతర కారణాలతో అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు కూడా మరణించారని దేవికా తెలిపారు. -
నిర్భయ కేసు: 20న ఉరి; విడాకులు కోరిన అక్షయ్ భార్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరి నుంచి తప్పించుకునే మార్గాలు అన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. ఈ సమయంలో నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ మరో పిటిషన్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు మంగళవారం రోజున ఔరంగాబాద్ ప్యామిలీ కోర్టులో విడాకుల కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ‘‘అత్యాచారం కేసులో నా భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ నా భర్త నిర్దోషి. రేప్ కేసులో ఉరితీసిన దోషి భార్యగా నేను ఉండాలనుకోవడం లేదు’’ అంటూ ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ మార్చి 19న విచారణకు రానుంది. ఈ విషయం గురించి పునీత తరఫు న్యాయవాది ముకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘హిందూ వివాహ చట్టం 13(2)(11) ప్రకారం కొన్ని ప్రత్యేక కేసుల్లో విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రత్యేక కేసుల్లో అత్యాచారం కూడా ఉంది. తన భర్త అత్యాచారం కేసులో దోషి అని తేలితే భార్య విడాకులు తీసుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు. అయితే కొందరు న్యాయనిపుణులు ఆమె పిటిషన్‌ను విమర్శిస్తున్నారు. నేరం జరిగిన 8 ఏళ్ల తర్వాత, శిక్ష పడిన చాలా రోజుల తర్వాత విడాకుల పిటిషన్ వేస్తే కోర్టు అక్షయ్ కుమార్‌కు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అన్నారు. చదవండి: నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి కాగా, నిర్భయ కేసులో నలుగురు దోషులకు మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2012లో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆరుగురు దోషుల్లో ఒకరు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. ప్రధాన దోషి రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముఖేశ్ సింగ్ తల్లి విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్హెచ్ఆర్సీ నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ తల్లి ఉరిశిక్ష అమలుపై జోక్యం చేసుకోవాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను తోసిపుచ్చినట్లు ఎన్హెచ్ఆర్సీ అధికారులు తెలిపారు. చదవండి: అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు -
మార్చి 26న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్చి 26న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారెవరైనా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యా నికి గురైనా, వివక్షకు గురికాబడిన వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. బాధితులు రిజిస్టర్ పోస్టు లేదా ఈ మెయిల్/ ఫ్యాక్స్ ద్వారా వినతులు సమర్పించవచ్చని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఫిర్యాదు చేయదలచిన వారు మార్చి 13వ తేదీలోపు registrar & nhrc@nic.in, jrlawnhrc@nic.in మెయిల్ చేయాలని 011–24651332, 34 నంబర్లకు ఫ్యాక్స్ చేయవచ్చన్నారు. రిజిస్టర్ పోస్టు చేయాలనుకునేవారు టు రిజిస్ట్రార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ్ అధికార్ భవన్ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్ఏ, న్యూఢిల్లీ, 110023 చిరునామా కు పంపాలని సూచించింది. -
ముగిసిన ఎన్హెచ్ఆర్సీ విచారణ..
-
దిశ కేసు: ఎన్‌కౌంటర్‌పై రెండు నివేదికలు
సాక్షి, హైదరాబాద్: సంచలనం రేపిన ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్హెచ్ఆర్సీ ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు ప్రాథమిక దర్యాప్తు నివేదిక కూడా సిద్ధం చేశారని సమాచారం. డిసెంబర్ 7న హైదరాబాద్ వచ్చిన ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ఎన్కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి బ్రిడ్జి పరిసరాలను సందర్శించారు. మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో భద్రపరిచిన నిందితుల మృతదేహాలను, పోస్టుమార్టం రిపోర్టులనూ పరిశీలించారు. తిరుగుప్రయాణంలో తొండుపల్లి గేట్ వద్ద ఆగి.. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎస్పీఏ)లో ఎన్కౌంటర్ మృతుల కుటుంబ సభ్యులను, దిశ తండ్రి, సోదరి నుంచి వివరాలు సేకరించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, ప్రత్యక్షసాక్షులతో పాటు, ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ అధికారులు, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను ప్రశ్నించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై, కానిస్టేబుల్‌నూ విచారించారు. బుధవారం ఎన్హెచ్ఆర్సీ బృందం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పోలీసులను మరోసారి ప్రశ్నించింది. త్వరలోనే సమగ్ర నివేదిక! దిశ, నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు, ఎన్కౌంటర్లో పాల్గొన్న 10 మంది పోలీసులు, పంచనామా చేసిన నలుగురు రెవెన్యూ అధికారులు, ఆర్డీవో, నలుగురు ఫోరెన్సిక్ సిబ్బంది సహా దాదాపు 30 మంది స్టేట్మెంట్లను రికార్డు చేíసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన విచారణతో ప్రాథమిక నివేదికను సీల్డ్ కవర్లో ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీకి సమర్పిస్తారు. పూర్తి వివరాలతో త్వరలోనే సమగ్ర నివేదిక అందజేస్తారని సమాచారం. సుప్రీంకోర్టులోనూ ఈ ఘటనపై నివేదిక ప్రతిని సమర్పించే అవకాశాలూ ఉన్నాయి. డీఎన్ఏకు సంబంధించిన అందాల్సిన ఓ రిపోర్టును సైబరాబాద్ పోలీసులే ఎన్హెచ్ఆర్సీకి పంపుతారని సమాచారం. సాయంత్రం ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ఢిల్లీకి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. నేడు మృతదేహాల అప్పగింతపై స్పష్టత ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలు తమ కుమారుల మృతదేహాలు ఇవ్వాలని అధికారులను కోరుతున్నాయి. కోర్టు కేసుల నేపథ్యంలో మృతదేహాలను వారికి ఇంకా అప్పగించలేదు. గురువారం హైకోర్టులో ఈ కేసులు విచారణకు రానున్న నేపథ్యంలో మృతదేహాల అప్పగింతపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మాకు న్యాయం చేయండి ►‘హక్కుల’బృందం వద్ద ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రుల మొర నారాయణపేట/మక్తల్: ‘మా బిడ్డలు తప్పుచేశారు.. శిక్షించాలని చెప్పాం.. కానీ ఇలా చంపుతారని అనుకోలేదు.. మాకు న్యాయం చేయండి’ అంటూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం బృందం సభ్యులకు దిశ హత్యకేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల తల్లిదండ్రులు మొర పెట్టుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాలను బుధవారం రాష్ట్ర పౌరహక్కుల సంఘం బృందం సందర్శించింది. ఈ బృందం సభ్యులు ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి పలు విషయాలను రికార్డు చేసుకున్నారు. దిశను హత్యచేసిన సంఘటనలో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా చటాన్‌పల్లి వద్ద మీ బిడ్డ నవీన్‌తో పాటు మిగతా ముగ్గురు పోలీసులపై దాడి చేయడంతోనే ఎన్కౌంటర్ చేశామని చెబుతున్నరని.. దీనిపై మీరే మంటారని నవీన్ తల్లి లక్ష్మిని రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ బృందం అడగ్గా, అది నిజం కాదని చెప్పింది. కోర్టు తీర్పు రాకముందే తన భర్తను ఎన్కౌంటర్ చేసి చంపడం న్యాయమా? అంటూ చెన్నకేశవులు భార్య రేణుక, సంఘం సభ్యుల ముందు బోరుమంది. తన కోడలు గర్భిణి అని, ఆమెకు న్యాయం చేయాలని చెన్నకేశవులు తండ్రి కుర్మన్న వేడుకున్నాడు. ‘మేము పేదవాళ్లం మాకు ఎవరూ దిక్కులేరనే కదా ఇలా చేశారు. అదే ఉన్నోళ్లు అయితే ఇలా చేసేవారా’అంటూ శివ తండ్రి రాజప్ప ప్రశ్నించాడు. ‘ఉన్న ఒక్క కొడుకును పొగొట్టుకున్నాం...మాకు చేతగాకున్న ఉన్న ఆడ బిడ్డ కోసం బతుకుతున్నాం’అంటూ ఆరీఫ్ తల్లిదండ్రులు హుసేన్, మౌలానా బీ బోరుమన్నారు. తమ కొడుకును ఇలా చంపుతారని అనుకోలేదని అన్నారు. -
హత్యాచారం చేసింది ఆ నలుగురే
-
దిశ : చీకట్లోనే ఎదురు కాల్పులు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్కౌంటర్ కేసులో ఎన్హెచ్ఆర్సీ బృందానికి షాద్‌నగర్, శంషాబాద్ పోలీసులు మంగళవారం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించారు. నవంబర్ 27 నుంచి ఈ నెల 6 వరకు అసలేం జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు, ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టుతో పాటు సమర్పించారు. ఇక నలుగురు నిందితులది నేరస్వభావమని, తమపై దాడి చేసి కాల్చబోయారని, దీంతో ఆత్మరక్షణ కోసం వారివైపు చీకట్లోనే ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పోలీసులు నివేదికలో పలు కీలక విషయాలు పొందుపరిచారు. గత నెల 27న రాత్రి 9.40 గంటలకు శంషాబాద్ (తొండుపల్లి) టోల్గేట్ వద్ద దిశను అపహరించిన మహమ్మద్ ఆరిఫ్, నవీన్, శివ, చింతకుంట చెన్నకేశవులు హత్యాచారం చేసినట్లు వివరించారు. ఘటన జరిగిన రోజు బాధితురాలితో మాట్లాడిన టోల్గేట్ సిబ్బంది, నిందితులు మాట్లాడిన పంక్చర్ షాపు, వైన్‌షాపు యజమానులు, లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డి, కొత్తూరు, నందిగామ పెట్రోల్ బంకు సిబ్బంది వంటి ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన వివరాలను పొందుపరిచారు. పోస్టుమార్టం నివేదికలు, సీసీ ఫుటేజ్‌లు దిశపై అత్యాచారం జరిగిందని నిరూపించేందుకు కావాల్సిన ఫోరెన్సిక్ రిపోర్టు, లారీలో సేకరించిన రక్తం నమూనాలు, ఇతర స్రావాలు, వెంట్రుకలు, నిందితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్ రిపోర్టును పోలీసులు నివేదికకు జతపరిచారని సమాచారం. నిందితులు దిశను లారీలో తరలిస్తుండగా సేకరించిన వీడియో ఫుటేజ్‌లని కూడా పోలీసులు ఎన్హెచ్ఆర్సీ బృందానికి సమర్పించారు. ఇటు నిందితుల పోస్టుమార్టం రిపోర్టును కూడా జత చేశారు. కాల్పులు వచ్చిన వైపు ఫైరింగ్ చేశాం.. నలుగురు నిందితుల్లో ఇద్దరు మాత్రమే కాల్పులకు తెగబడితే నలుగురిపై ఎందుకు కాల్పులు జరిపారన్న విషయంపైనా పోలీసులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దిశ వస్తువులు చూపిస్తామంటూ చటాన్‌పల్లి వద్దకు తీసుకెళ్లిన తర్వాత ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల వద్ద పిస్టళ్లు లాక్కుని శివ, నవీన్ తో కలసి బ్రిడ్జికి తూర్పువైపు పరుగులు తీశారన్నారు. తమపై నిందితులు కాల్పులు జరుపుతూ పరుగులు పెట్టారని తెలిపారు. తాము ఆత్మరక్షణ కోసం వారివైపు చీకట్లోనే ఎదురు కాల్పులు జరిపామన్నారు. నిందితుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాక.. తెల్లవారుజామున గాలించగా సమీపంలోని పొలంలో నలుగురు మరణించినట్లు గుర్తించామని, అంతే తప్ప ఎవరినీ గురి చూసి కాల్చలేదని వివరించారని తెలిసింది. ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పోలీసులను ఎన్హెచ్ఆర్సీ బృందం సోమవారమే విచారించిన విషయం తెలిసిందే. పెట్రోల్ బంకు సిబ్బంది వాంగ్మూలం.. దిశ హత్యాచారం ఘటన జరిగిన 27వ తేదీ అర్ధరాత్రి ఆమె మృతదేహాన్ని తగులబెట్టేందుకు పెట్రోల్ కోసం కొత్తూరు, నందిగామ బంకుల వద్ద కు నిందితులు శివ, నవీన్ వెళ్లారు. దీనిపై సదరు బంకు సిబ్బందిని కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు విచారించారు. పెట్రోల్ కోసం ఎవరెవరు వచ్చారు? వచ్చింది వీరేనా? అని ఫొటోలు చూపించి ధ్రువీకరించుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి విదేశీ మీడియా షాద్‌నగర్‌టౌన్ : దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి మంగళవారం విదేశీ మీడియా ప్రతినిధులు వచ్చారు. అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులు షాద్‌నగర్ చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన దిశ దహనం, హంతకుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ది న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెందిన సౌత్ ఏసియా ప్రతినిధి జెఫ్రే గెటిల్‌మెన్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు ఘటనా స్థలాలను పరిశీలించారు. ఘటనాస్థలి వద్ద వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. -
‘దిశ’ కేసు : ఎన్హెచ్ఆర్సీ ముందుకు షాద్‌నగర్ సీఐ
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా విచారణను కొనసాగించింది. విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని పోలీస్ అకాడెమీలో ఉన్న ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధుల ముందు షాద్‌నగర్ సీఐ శ్రీధర్ హాజరయ్యారు. ఇక దిశ హత్యకేసు నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన బంక్ యజమాని ప్రవీణ్‌ను కూడా ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు విచారించనున్నారు. ఇదిలాఉండగా.. ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్హెచ్ఆర్సీ బృందం మంగళవారం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. (చదవండి : చటాన్‌పల్లి ఎన్కౌంటర్ కేసులో కీలక మలుపు) (చదవండి : ఎన్‌కౌంటర్‌పై గాయపడ్డ పోలీసుల వెర్షన్!) -
దిశ కేసు: గాయపడ్డ పోలీసులను ఎన్హెచ్ఆర్సీ విచారణ
-
ఎన్‌కౌంటర్‌పై గాయపడ్డ పోలీసుల వెర్షన్!
సాక్షి, హైదరాబాద్: దిశ కేసులోని నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. ఎన్కౌంటర్లో గాయపడిన పోలీసులను బృందం సభ్యులను ప్రధానంగా విచారించారు. సంఘటన జరిగిన తీరు, తాము గాయపడ్డ తీరును పోలీసులు వారికి వివరించారు. చదవండి:చటాన్‌పల్లి ఎన్కౌంటర్ కేసులో కీలక మలుపు చటాన్‌పల్లి వద్ద సంఘటనా స్థలికి తెల్లవారుజామున నిందితులను పోలీసులు తీసుకెళ్లారని, అక్కడ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఒక్కసారిగా నిందితులు తిరగబడ్డారని, ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడిచేసి పారిపోయేందుకు ప్రయత్నించారని గాయపడ్డ పోలీసులు వివరించారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి నుంచి సర్వీస్ రివాల్వర్‌ను సైతం నిందితులు లాకొని..కొంతదూరం పారిపోయాక కాల్పులు జరిపారని, దీంతో గత్యంతరంలేక పోలీసులు ఆత్మరక్షణ కోసమే ప్రతి కాల్పులు జరిపారని తెలిపారు. మరోవైపు ఎన్కౌంటర్ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు ఎన్హెచ్ఆర్సీకి తెలిపారు. ఈ ఘటనా స్థలిలో పంచనామా నిర్వహించి, ఆధారాలు సేరించామని, సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఫోరెన్సిక్ నిపుణులతో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపిన పోలీసులు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్, సీసీటీవీ విజువల్స్, ఇతర కేసు వివరాలను ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. చదవండి: వెంకటేశ్వర్లు, అరవింద్‌ను ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సీ -
చటాన్‌పల్లి ఎన్కౌంటర్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: దిశ కేసులోని నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై విచారణ జరుపుతున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందానికి సైబరాబాద్ పోలీసులు మంగళవారం కీలక సాక్ష్యాలు అందజేశారు. ఎన్కౌంటర్ ఘటనలో చనిపోయిన నిందితులే దిశపై అత్యాచారం జరిపి.. హత్య చేసినట్టు రుజువు చేసే ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిన నివేదికను పోలీసులు ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్య, మృతదేహం కాల్చివేత తదితర పరిణామాలకు సంబంధించి తమ దర్యాప్తులో సేకరించిన ఆధారాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ కేసులో అత్యంత కీలకమైన శాస్త్రీయ ఆధారాలు కూడా ఎన్‌హెచ్చ్‌ఆర్సీకి అందజేసిన నివేదికలో ఉన్నట్టు సమాచారం. సంఘటనాస్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్ట్, ఘటనా స్థలంలో నిందితుల లారీ సంచరించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఎన్హెచ్ఆర్సీకి పోలీసులు అందజేశారు. చదవండి: దిశ కేసు.. వెలుగులోకి కీలక వీడియో కొత్తూరు సమీపంలో నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజీని సైతం సమర్పించినట్టు తెలుస్తోంది. దిశ హత్యాచారం కేసులో శరవేగంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఈ కేసులో తాము సేకరించిన ఆధారాలు, కేసుకు సంబంధించిన కీలక వివరాలు ఎన్హెచ్ఆర్సీ ముందు పెట్టారు. ఇక, దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం వరకు మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచనున్నారు -
ఉత్తరాదినే ఉల్లంఘనం ఎక్కువట!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో నమోదవుతున్న కేసుల్లో ఉత్తరాది రాష్ట్రాలవే ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే.. ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లోనే ఈ తరహా ఘటనలు అధికంగా చోటుచేసుకుంటునాయి. ఎన్హెచ్ఆర్సీ 2016–17కు సంబంధించి నివేదికను బట్టి ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. మానవహక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగుతుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తారు. మరికొన్ని సార్లు దినపత్రికలు, చానళ్లలోచూసి ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఒక్క యూపీలోనే సగం కేసులు దేశంలో మానవహక్కుల ఉల్లంఘనపై ఏటా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎన్హెచ్ఆర్సీ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతుంటుంది. ఇందులో అత్య«ధి కంగా వచ్చే ఫిర్యాదులు ఉత్తరప్రదేశ్ నుంచే కావడం గమనార్హం. ఏటా దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. ఒక్క యూపీ నుంచే 30 నుంచి 40 వేల వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో ఎన్కౌంటర్లకు సంబంధించినవే వేల సంఖ్యలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్హెచ్ఆర్సీ విడుదల చేసిన నివేదిక 2016–17 పేర్కొన్న అంశాల ప్రకారం.. 42,590 కేసుల నమోదుతో యూపీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా 8,750, ఢిల్లీ 6,368, హరియాణా 4,596, బిహార్ 3,765 ఉన్నాయి. 928 కేసులతో తెలంగాణ 17వ స్థానం, 1,250 కేసులతో ఏపీ 10వ స్థానంలో నిలిచింది. కాగా 2017 నుంచి ఇప్పటివరకు 5,178 ఎన్కౌంటర్లు యూపీలోనే అయినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. వీటిలో 103 మంది నేరస్తులు మరణించారు. ఇక తెలంగాణలో గత ఆరేళ్లలో 10 ఎన్కౌంటర్లు జరగ్గా.. అందులో దాదాపు 25 వరకు వ్యక్తులు మరణించారు. ఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది? ఒకవేళ ఎన్హెచ్ఆర్సీ విచారణలో ఎన్కౌంటర్ బూటకమని తేలితే సదరు బాధిత కుటుంబాలకు రూ.ఒక లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. మిగతా కేసు ల్లో వ్యక్తులు, ఇతర సంస్థలు, పరిశ్రమల ‡తప్పిదాల వల్ల మనుషుల ప్రాణాలకు నష్టం వాటిల్లితే.. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు అందజేయాలని సిఫారసు చేస్తుంది. ఉమ్మడి ఏపీలో బూటకపు ఎన్కౌంటర్లు.. 2002కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలులో జరిగిన 19 ఎన్కౌంటర్లలో 16 బూటకపువేన ని ఎన్హెచ్ఆర్సీ తేల్చిచెప్పింది. ఆయా ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
దిశ: వెంకటేశ్వర్లు, అరవింద్‌ను ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం సోమవారం సాయంత్రం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసింది. నగరంలోని కేర్ ఆస్పత్రిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌లను కలిసి వారి నుంచి వాంగ్మూలాన్ని సేకరించింది. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో దిశ కేసు నిందితులు హతమవ్వగా.. నిందితులు జరిపిన ఎదురుకాల్పల్లో వీరిద్దరు గాయపడ్డారు. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్లు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో వీరిని కలిసిన ఎన్హెచ్ఆర్సీ బృందం.. దాదాపు అరగంటపాటు వారిని ప్రశ్నించి.. పలు వివరాలు సేకరించింది. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ బృందం దిశ కుటుంబసభ్యులు, ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల వాంగ్మూలం తీసుకొని.. వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే. ‘తప్పు చేసిన మా బిడ్డలను శిక్షించమనే చెప్పాం. మా బిడ్డలను అన్యాయంగా కాల్చి చంపారు..’ అంటూ ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులు ఎన్హెచ్ఆర్సీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు హత్యాచార ఘటన గురించి దిశ తండ్రితోపాటు సోదరిని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు అడిగి తెలుసున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో వీరందరి నుంచి ఎన్హెచ్ఆర్సీ బృందం స్టేట్మెంట్ రికార్డు చేసింది. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన నలుగురు యువకుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచేందుకు నాలుగు ఫ్రీజర్ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఇందుకోసం గాంధీ ఆస్పత్రి మార్చురీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అర్ధరాత్రి సమయంలో మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశముందని తెలుస్తోంది. నిందితుల మృతదేహాలను వచ్చే శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
దిశ: ఇప్పటికైనా మృతదేహాలు అప్పగించండి!
సాక్షి, మహబూబ్‌నగర్: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతపరిచిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులైన నలుగురు గత శుక్రవారం తెల్లవారుజామున పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఈ ఎన్కౌంటర్ ఘటనపై ఒకవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ).. మరోవైపు తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుల మృతదేహాలను అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులకు అప్పగించకుండా వచ్చే శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు మృతుల కుటుంబసభ్యులు మాత్రం తాము కడసారి చూపునకు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను చూడలేదని, ఇకనైనా మృతదేహాలను అప్పగించాలని నిందితుడు చెన్నకేశవుల తండ్రి రాజయ్య సోమవారం మీడియాతో కోరారు. ఇంకా ఎన్నిరోజులు మృతదేహాలు ఉంచుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మృతదేహాలు అప్పగించడంలో ఆలస్యం చేయడం వల్ల దిశగానీ, చనిపోయినా తమ పిల్లలుగానీ బతికొస్తారా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎవరూ అండగా లేకపోవటంతోనే ఇలా అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్హెచ్ఆర్సీ ముందు గోస వెళ్లబోసుకున్న కుటుంబసభ్యులు మక్తల్ : ‘కోర్టు తీర్పు రాకముందే మా బిడ్డలను అన్యాయంగా ఎన్కౌంటర్ చేశారు. మాకు న్యాయం చేయండి’ అంటూ ఎన్కౌంటర్లో మృతి చెందిన నలుగురి కుటుంబీకులు ఎన్హెచ్ఆర్సీ బృందం ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా పోలీసు ప్రత్యేక బృందం మహ్మద్ పాషా తండ్రి ఆరిఫ్ హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కుర్మన్నలను ప్రత్యేక వాహనంలో బందోబస్తు మధ్య హైదరాబాద్‌లోని ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటలకు వారి ఇళ్ల వద్ద వదిలేశారు. అయితే నిందితుల తల్లిదండ్రులతో ఒకరి తర్వాత ఒకరితో ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు 2 గంటల పాటు మాట్లాడినట్లు తెలుస్తోంది. మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉండేది.. ఎందుకిలా ప్రవర్తించారు.. ఇంటి నుంచి ఎప్పుడెళ్లారు.. సంఘటనలో పోలీసులు వారిని ఎప్పుడు తీసుకెళ్లారు.. ఆ తర్వాతేం జరిగింది.. పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన మీ బిడ్డలపై మీరు ఏమనుకుంటున్నారు..?’ అని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. అదే చివరి చూపైంది.. ‘పోయిన శుక్రవారం ఉదయం 3.30 గంటలకు మా బిడ్డలను లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డితో వచ్చి పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారని మా బిడ్డలను అడిగితే ఓ అమ్మాయి బైక్ అడ్డు రావడంతో యాక్సిడెంట్లో చనిపోయిందని.. అందుకే తీసుకెళ్తున్నాం అని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఓ ఆడపిల్లను పెట్రోల్ పోసి అంటించి చంపింది మీ పిల్లలనే అని పక్కన వారు వచ్చి చెబితేనే తెలిసింది. ఆ తర్వాత రోజు పోలీసులు షాద్‌నగర్‌కు పిలిపించి సంతకాలు పెట్టించుకున్నారు. అంతే అదే చివరిగా మా పిల్లలను చూడడం.. మాట్లాడటం. ఆ తర్వాత టోల్గేట్ వద్ద వచ్చి విడిచిపెట్టిపోయారు. సరిగ్గా వారం తర్వాత శుక్రవారం రోజు ఉదయం 7 గంటలకు మా బిడ్డలను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలిసింది. తప్పు చేస్తే శిక్షించమనే చెప్పాం. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు’ అని మృతుల తల్లిదండ్రులు ఎన్హెచ్ఆర్సీ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. చెన్నకేశవులు భార్య గర్భిణిగా ఉందని, ఆమెకు న్యాయం చేయాలంటూ చెన్నకేశవులు తండ్రి కుర్మన్న వారిని వేడుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను ఎప్పుడిస్తారు సారూ? తమ పిల్లల మృతదేహాలను ఎప్పుడిస్తారంటూ ఎన్హెచ్ఆర్సీ సభ్యులను తల్లిదండ్రులు అడిగినట్లు తెలుస్తోంది. ‘సోమవారం హైకోర్టు తీర్పు ఉంది.. ఆ తర్వాత మేము మీకు సమాచారమిస్తాం.. మీ పిల్లల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. ఎప్పుడిస్తామనేది సోమవారం తెలుస్తుంది’.. అని సముదాయించినట్లు సమాచారం. -
వారిని ఏ తుపాకీతో కాల్చారు?
సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్కౌంటర్ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సభ్యుల బృందం విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆ బృందం పోలీసులను పలు వివరాలు అడిగి తెలుసుకుంది. తొలుత దిశను దహనం చేసిన ప్రాంతం నుంచి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం వరకు పరిశీలించారు. ఇంతదూరం నిందితులు ఎలా వచ్చారు? అంతా ఒకే దగ్గర ఎలా పడిపోయా రు? నిందితుల శరీరంలో ఎలాంటి బుల్లెట్లు లేకపోవడంపై సభ్యులు దృష్టిసారించినట్లు సమాచారం. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్‌లను పోలీసులు ఏ రకం తుపాకీతో కాల్చారు? పిస్టల్స్‌తోనా.. పెద్ద గన్స్ వాడారా? పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారు? ఇద్దరు నిందితులు తొలుత ఫైర్ ఓపెన్ చేస్తే.. పోలీసులు నలుగురిని ఎందుకు కాల్చాల్సి వచ్చింది? అన్న విషయాలపై ఎన్హెచ్ఆర్సీ బృందం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే మృతుల శరీరంలో బుల్లెట్లు లేకపోవడంపై ఓ పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ.. ఎన్కౌంటర్లో శరీరంలో నుంచి తూటాలు దూసుకుపోవడం సాధారణ విషయమేనని తెలిపారు. ఎముకలు, పక్కటెముకలకు తగిలినపుడు తూటాల దిశ మారుతుందని, మెత్తని శరీరభాగాలకు తగిలినప్పుడు ఇలా బయటికి వస్తుంటాయని వివరించారు. ముగ్గుర్ని తూర్పు వైపు నుంచి.. ఎన్కౌంటర్లో నిందితులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులు ఏ రకానికి చెందినవి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసుల వద్ద 9 ఎంఎం పిస్టల్, ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిందితులను పోలీసులు ఎస్ఎల్ఆర్ తుపాకులతోనే కాల్చా రు. ఈ ఘటనలో చటాన్‌పల్లి బ్రిడ్జి నుంచి పారిపోతున్న నిందితులను లొంగిపొమ్మని హెచ్చరిస్తూ.. వెంబడించిన పోలీసులు రెండువైపులా చుట్టుముట్టారు. అయినా నిందితులు కాల్పులు ఆపకపోవడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఆరిఫ్, శివ, నవీన్ ముగ్గురిని పోలీసులు తూర్పు వైపు నుంచి కాల్చారు. అందుకే, వారి తలలు పడమర వైపు వాలి ఉన్నాయి. అంటే పోలీసుల తూటాలు వారికి ఎదురుగా వచ్చి తగిలినట్లు తెలుస్తోంది. ఇక చెన్నకేశవులుకు మాత్రం బుల్లెట్లు వెనక నుంచి వచ్చి తగిలినట్లుగా అతని శరీరం పడి ఉన్న తీరు చెబుతోంది. అందుకే, ఇతని ఒక్కడి తల మాత్రం తూర్పు వైపు వాలి ఉంది. గాయం ఆధారంగా చెప్పొచ్చు..! నిందితుల పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు ఏ తుపాకీతో కాల్చింది చెప్పగలరు. తూటా గాయం ఆధారంగా చేసుకుని, శరీరాన్ని తగిలిన చోట, వెలుపలికి వచ్చిన ప్రాంతంలో ఏమేరకు గాయం చేసింది అన్న విషయాలను ఆధారంగా చేసుకుంటారు. సాధారణంగా ఏ బుల్లెటయినా శరీరాన్ని తగి లిన చోట మామూలు వ్యాసార్థంలో.. వెలుపలికి వచ్చినపుడు అందుకు రెట్టింపు వ్యాసార్థం లో గాయాలను ఏర్పరుస్తాయి. అదే సమయం లో గాయంపై ఉన్న గన్‌పౌడర్ రెసిడ్యూ (జీపీఆర్) ఆధారంగా చెప్పగలరు. గాయం తగిలిన విధానాన్ని బట్టి, అది ఏ దిశ నుంచి దూసుకొచ్చింది.. ఎంత దూరం నుంచి వచ్చింది.. కచ్చితంగా చెప్పే పరిజ్ఞానం మన ఫోరెన్సిక్ నిపుణుల వద్ద ఉంది. వీరిని ఫోరెన్సిక్ బాలిస్టిక్ ప్రొఫెసర్లు అని పిలుస్తారు. ఈ ఎన్కౌంటర్లో వీరు ఇచ్చే నివేదిక కీలకం కానుంది. ఘటనాస్థలి వద్ద బందోబస్తు.. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఏసీపీ చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు 59 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా దిశను దహనం చేసిన చోటు, హంతకులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే పోలీసులు ఎన్కౌంటర్ ఘటనా స్థలానికి వెళ్లనీయకుండా జాతీయ రహదారి వద్దనే కట్టడి చేస్తున్నారు. ‘ఎన్కౌంటర్’పై సీన్ రీకన్స్ట్రక్షన్ షాద్‌నగర్ : దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై ఆదివారం ఉదయం చటాన్‌పల్లి వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఘటనా స్థలాలను ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు ఇప్పటికే పరిశీలించారు. మరోమారు ఈ బృందం ఘటనా స్థలానికి వచ్చి ఎన్కౌంటర్ గురించి అడిగితే చూపించడానికి పోలీసులు ఆదివారం సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. హంతకులు పోలీసులపై ఏవిధంగా తిరగబడ్డారు.. ఏవిధంగా రాళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు.. ఏవిధంగా పోలీసులు, హంతకులపై కాల్పులు జరిగాయన్న వాటిపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. దీనిని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షించారు. అయితే, ఎన్హెచ్ఆర్సీ బృందం మళ్లీ సంఘటనా స్థలానికి వస్తుందా.. లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. -
అక్కడ అసలేం జరిగింది?
సాక్షి, రాజేంద్రనగర్ : చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం దిశ కుటుంబ సభ్యులు, ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకోవడంతో పాటు వివరాలు సేకరించింది. ‘తప్పు చేసిన మా బిడ్డలను శిక్షించమనే చెప్పాం. మా బిడ్డలను అన్యాయంగా కాల్చి చంపారు..’ అంటూ ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు హత్యాచార ఘటన గురించి దిశ తండ్రితో పాటు సోదరిని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు అడిగి తెలుసున్నారు. ఆదివారం హిమాయత్‌సాగర్‌లోని రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో వీరందరి నుంచి ఎన్హెచ్ఆర్సీ బృందం స్టేట్మెంట్ రికార్డు చేసింది. సాయంత్రం 5.40 గంటల సమయం ప్రత్యేక వాహనంలో పోలీసులు దిశ తండ్రితో పాటు సోదరిని పోలీస్ అకాడమీకి తీసుకొచ్చారు. అంతకుముందు ఉదయం మూడు వాహనాల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులను తీసుకొచ్చి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఎన్కౌంటర్ గురించి ఏమీ అడగలేదు : దిశ కుటుంబీకులు దిశ హత్యాచారం ఘటన రోజు వివరాలను మాత్రమే ఎన్హెచ్ఆర్సీ బృందం అడిగి తెలుసుకుందని ఆమె తండ్రి, సోదరి వెల్లడించారు. విచారణ అనంతరం పోలీస్ అకాడమీ నుంచి బయటకు వచ్చిన వారిని మీడియా ప్రశ్నించగా.. కేవలం సంఘటన జరిగిన రోజు తమకు ఎలా తెలిసిందో వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌పై ఎలాంటి ప్రశ్నలు అడగలేదని స్పష్టం చేశారు. మాకు న్యాయం చేయండి.. మక్తల్ : ‘కోర్టు తీర్పు రాకముందే మా బిడ్డలను అన్యాయంగా ఎన్కౌంటర్ చేశారు. మాకు న్యాయం చేయండి’ అంటూ ఎన్కౌంటర్లో మృతి చెందిన నలుగురి కుటుంబీకులు ఎన్హెచ్ఆర్సీ బృందం ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా పోలీసు ప్రత్యేక బృందం మహ్మద్ పాషా తండ్రి ఆరిఫ్ హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కుర్మన్నలను ప్రత్యేక వాహనంలో బందోబస్తు మధ్య హైదరాబాద్‌లోని ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటలకు వారి ఇళ్ల వద్ద వదిలేశారు. అయితే నిందితుల తల్లిదండ్రులతో ఒకరి తర్వాత ఒకరితో ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు 2 గంటల పాటు మాట్లాడిన ట్లు తెలుస్తోంది. మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉండేది.. ఎందుకిలా ప్రవర్తించారు.. ఇంటి నుంచి ఎప్పుడెళ్లారు.. సంఘటనలో పోలీసులు వారిని ఎప్పుడు తీసుకెళ్లారు.. ఆ తర్వాతేం జరిగింది.. పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన మీ బిడ్డలపై మీరు ఏమనుకుంటున్నారు..?’ అని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. అదే చివరి చూపైంది.. ‘పోయిన శుక్రవారం ఉదయం 3.30 గంటలకు మా బిడ్డలను లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డితో వచ్చి పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారని మా బిడ్డలను అడిగితే ఓ అమ్మాయి బైక్ అడ్డు రావడంతో యాక్సిడెంట్లో చనిపోయిందని.. అందుకే తీసుకెళ్తున్నాం అని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఓ ఆడపిల్లను పెట్రోల్ పోసి అంటించి చంపింది మీ పిల్లలనే అని పక్కన వారు వచ్చి చెబితేనే తెలిసింది. ఆ తర్వాత రోజు పోలీసులు షాద్‌నగర్‌కు పిలిపించి సంతకాలు పెట్టించుకున్నారు. అంతే అదే చివరిగా మా పిల్లలను చూడడం.. మాట్లాడటం. ఆ తర్వాత టోల్గేట్ వద్ద వచ్చి విడిచిపెట్టిపోయారు. సరిగ్గా వారం తర్వాత శుక్రవారం రోజు ఉదయం 7 గంటలకు మా బిడ్డలను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలిసింది. తప్పు చేస్తే శిక్షించమనే చెప్పాం. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు’ అని మృతుల తల్లిదండ్రులు ఎన్హెచ్ఆర్సీ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. చెన్నకేశవులు భార్య గర్భిణిగా ఉందని, ఆమెకు న్యాయం చేయాలంటూ చెన్నకేశవులు తండ్రి కుర్మన్న వారిని వేడుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను ఎప్పుడిస్తారు సారూ? తమ పిల్లల మృతదేహాలను ఎప్పుడిస్తారంటూ ఎన్హెచ్ఆర్సీ సభ్యులను తల్లిదండ్రులు అడిగినట్లు తెలుస్తోంది. ‘సోమవారం హైకోర్టు తీర్పు ఉంది.. ఆ తర్వాత మేము మీకు సమాచారమిస్తాం.. మీ పిల్లల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. ఎప్పుడిస్తామనేది సోమవారం తెలుస్తుంది’.. అని సముదాయించినట్లు సమాచారం. ఆ పోలీసులను విచారించినఎన్హెచ్ఆర్సీ బృందం.. మరో రెండ్రోజులు ఎన్హెచ్ఆర్సీ బృంద సభ్యులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే ఘటనపై నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులను ఎన్హెచ్ఆర్సీ బృందం ఆదేశించిన నేపథ్యంలో వారు ఫోరెన్సిక్, రెవెన్యూ రిపోర్టులతో కలిపి ఓ నివేదికను తయారుచేస్తున్నారు. నవంబర్ 27 దిశ కిడ్నాప్, లైంగికదాడి, హత్య, దహనం నుంచి డిసెంబర్ 6న ఎన్కౌంటర్ వరకు జరిగిన అన్ని విషయాలపై పక్కాగా నివేదిక రూపొందిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఎన్హెచ్ఆర్సీ బృందానికి నివేదిక ఇచ్చే పనిలో తలమునకలయ్యారు. ఆదివారం ఎన్హెచ్ఆర్సీ బృందం ఎన్కౌంటర్లో గాయపడి గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను విచారించింది. ఇక నేడు లేదా రేపు మిగిలిన పోలీసులనూ విచారిస్తారని సమాచారం. గుంతల పూడ్చివేత.. ఎన్కౌంటర్ మృతుల అంత్యక్రియల కోసం జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో తవ్విన గుంతల్లో ఆదివారం టెంకాయలు వేసి పూడ్చేశారు. మృతదేహాలు వచ్చిన తర్వాత వాటిలో ఉన్న మట్టిని తొలగించి అంత్యక్రియలు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
కుటుంబ సభ్యులను విచారించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదివారం దిశ తల్లిదండ్రులను విచారించింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ముందు దిశ కుటుంబసభ్యులు హాజరయ్యారు. దిశ తండ్రి, సోదరి స్టేట్మెంట్లను ఎన్హెచ్ఆర్సీ బృందం రికార్డు చేసింది. ఘటన రోజు ఏం జరిగిందో దిశ కుటుంబ సభ్యుల వివరాలను ఎన్హెచ్ఆర్సీ బృందం తెలుసుకుంది. నిందితులు ఎన్కౌంటర్ అయ్యారనే విషయం మీడియాలో వచ్చేవరకు తమకు తెలియదని దిశ కుటుంబసభ్యులు తెలిపారు. దిశ సంఘటనపై న్యాయం చేస్తామని కుటుంబసభ్యులకు ఎన్హెచ్ఆర్సీ బృందం హామీ ఇచ్చింది. -
స్టేట్ పోలీస్ అకాడమీకి చేరుకున్న దిశ తల్లిదండ్రులు!
సాక్షి, హైదరాబాద్ : చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం.. దిశ తల్లిదండ్రులను పిలిపించింది. దిశ తల్లిదండ్రుల స్టేట్మెంట్ను ఎన్హెచ్ఆర్సీ రికార్డు చేయనుంది. ఈ నేపథ్యంలో దిశ తల్లిదండ్రులు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. బాధిత కుటుంబం తరఫున వాస్తవాలు చెప్పడానికి ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధుల దగ్గరకు వెళతామని దిశ తల్లిదండ్రులు ఇప్పటికే తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారణ రెండోరోజు కూడా కొనసాగుతోంది. నిన్న ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కమిషన్ ప్రతినిధులు మహబూబ్‌నగర్ నుంచి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితుల మృతదేహాలను పరిశీలించడంతో పాటు, వాళ్ల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేశారు. దిశ తల్లి ఆరోగ్యం సహకరించడం లేదని, ఎన్హెచ్ఆర్సీ తమను ఇబ్బంది పెట్టకూడదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ పోలీసులు ...దిశ నివాసానికి చేరుకొని.. వారిని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి తీసుకువెళ్లారు. అయితే, దిశ దినకర్మ రోజున విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్కౌంటర్ ఘటనలో గాయపడి, కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ వద్ద కూడా ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే స్టేట్మెంట్ నమోదు చేసింది. ఎన్కౌంటర్ నిజానిజాలను నిర్ధారించేందుకు వచ్చిన ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు తమ విచారణను రహస్యంగా నిర్వహించారు. ఎన్కౌంటర్, పోస్టుమార్టంపై తమ అనుమానాలను నివృత్తి చేసుకునే క్రమంలో వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. మీడియాతో మాట్లాడతారని భావించినా మాట్లాడలేదు. మూడు రోజుల విచారణ పూర్తయిన తర్వాతే వారు మీడియాతో మాట్లాడతారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. -
కేర్ ఆస్పత్రికి ఎన్హెచ్ఆర్సీ బృందం
సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్కౌంటర్లో గాయపడ్డ ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ స్టేట్మెంట్ను ఎన్హెచ్ఆర్సీ బృందం రికార్డు చేసింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను ఆ బృందం అడిగి తెలుసుకుంది. కాగా దాడిలో ఎస్ఐ వెంకటేశ్వర్లుకు కుడి నుదుటి భాగంలో గాయం కాగా, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్ కుడి భుజా నికి గాయమైంది. ఇరువురికీ స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనలతో హైటెక్‌సిటీలోని కేర్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ బృందం తొలిరోజు ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించింది. పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేసింది. అనంతరం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఎన్కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించింది. చదవండి: అసలు ఇదంతా ఎలా జరిగింది? మరోవైపు దిశ నిందితుల కుటుంబసభ్యులను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ కేసులో A-1,ఆరిఫ్ తండ్రి హుస్సేన్, A-2, జొల్లు శివ తండ్రి జొల్లు రాజప్ప, A-3 జొల్లు నవీన్ తల్లి లక్ష్మీ, A-4 చెన్నకేశవులు తండ్రి కూర్మప్పను నిన్న రాత్రి 10 గంటలకు ఇంటికి పంపించి ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు తీసుకువెళ్లారు. అయితే వారిని ఎక్కడకు తరలించారనే దానిపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇక హైకోర్టు ఆదేశాలతో ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం విభాగంలోనే ఉంచారు. భారీ భద్రత మధ్య పోస్ట్‌మార్టం విభాగంలోని ఫ్రీజర్‌లో వాటిని భద్రపరిచారు. సోమవారం రాత్రి 8గంటల వరకూ వాటిని అక్కడే ఉంచనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ -
చటాన్‌పల్లికి ఎన్హెచ్ఆర్సీ బృందం
సాక్షి, మహబూబ్‌నగర్: దిశ నిందితుల మృతదేహాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం శనివారం పరిశీలించింది. మధ్యాహ్నం 1:20 నిమిషాలకు మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్దకు వెళ్లి నాలుగు మృతదేహాలు ఉన్నట్టు బృంద సభ్యులు నిర్ధారించుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్లో పోస్ట్‌మార్టం రిపోర్టును నిశితంగా పరిశీలించారు. రిపోర్టులోని అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించారు. ఈ క్రమంలో వారి కోసం గంటరన్నర పాటు ఎన్హెచ్ఆర్సీ బృందం ఆస్పత్రిలోనే వేచి ఉన్నారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి మరోసారి మృతదేహాలను పరిశీలించిన సభ్యులు.. తిరిగివెళ్లే సమయంలో మృతుల కుటుంబాలతో మట్లాడారు. ఘటనపై వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఇక మూడున్నర గంటల పాటు ఆస్పత్రిలోనే గడిపిన ఎన్హెచ్ఆర్సీ బృందం.. దిశ ఘటన, నిందితుల ఎన్కౌంటర్ ఘటనాస్థలిని పరిశీలించేందుకు చటాన్‌పల్లికి చేరుకున్నారు. -
మహబూబ్‌నగర్ ఆస్పతిలో ఎన్హెచ్ఆర్సీ బృందం
సాక్షి, హైదరాబాద్ : దిశ ఎన్కౌంటర్ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. నలుగురు సభ్యుల ఎన్హెచ్ఆర్సీ బృందం శనివారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంది. ముందుగా ఈ బృందం ఎన్‌కౌంటర్‌కు గురైన నిందితుల మృతదేహాలను .. మృతుల తల్లిదండ్రులు, వారి తరఫున వైద్యుల సమక్షంలో పరిశీలించింది. మృతుల తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. అనంతరం చటాన్‌పల్లిలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనుంది. కాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్హెచ్ఆర్సీ స్పందించిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌పై తమకు సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేంతవరకూ మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించరాదంటూ జిల్లా పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను జిల్లా ఆస్పత్రి మార్చురీ రూమ్‌లో భద్రపరిచారు. చదవండి: ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ -
ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన సంజయ్
సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇటీవల తనపై పోలీసులు దాడికి దిగారని.. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఢిల్లీలో మీడియా మాట్లాడుతూ.. తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని సంజయ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల బ్రతుకులు కుక్కలకన్న హీనంగా తయారైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హత్యకు గురైన తహశీల్దార్ విజయరెడ్డి మృతిపై కేసీఆర్ కసాయి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, కొండగట్టు మరణాలపై స్పందించని కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో కుక్క చనిపోతే మాత్రం స్పందించారని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ, రైతుల మధ్య విద్వేషాలు పెంచి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ‘ఆర్టీసీ ప్రైవేటికరణపై కేసీఆర్‌కి ఎందుకంత ఆతృత. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కాదు కేసీఆర్ చేసిన హత్యలుగా భావిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామంటూ ఉద్యమసమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదు. కేసీఆర్ కి వ్యతిరేకంగా మలిదశ ఉద్యమాన్ని నిర్మిస్తాం. హుజూర్ నగర్ లో డబ్బులను ఏరులైపారించి టీఆర్ఎస్ గెలిచింది’ అని అన్నారు. -
పోలవరంపై విచారణ చేపట్టిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పునరావాస కేసులను పున:సమీక్షించాలని జాతీయ పర్యవేక్షణ కమిటీని (నేషనల్ మానిటరింగ్ కమిటీ) సోమవారం జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంలో పారదర్శకత లోపించిందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అభిప్రాయపడింది. పునరావాస నష్టపరిహారం ఇవ్వకుండానే.. ప్రజలను ఉన్నపళంగా గ్రామాల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ 2013లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (ఎన్హెచ్ఆర్సీ) పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఎన్హెచ్ఆర్సీ పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న ప్రజలకు పునరావాసం, నష్ట పరిహారంపై దృష్టి సారించాలని నేషనల్ మానిటరింగ్ కమిటీని ఆదేశించింది. అదేవిధంగా గతంలో పునరావాసంపై మూసివేసిన కేసులను పునఃసమీక్షించాలని సూచించింది. కాగా ఇటీవల ఢిల్లీ హైకోర్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. -
ఎన్‌హెచ్చార్సీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో మానవ హక్కులను అనుక్షణం పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మానవ హక్కుల పరిరక్షణ(సవరణ)బిల్లు –2019 బిల్లుకు సభ ఆమోదం లభించింది. ఈ సందర్భంగా హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. మానవ హక్కులను అనునిత్యం కాపాడేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామన్నారు. జాతీయ, రాష్ట్రాల మానవ హక్కుల సంఘాలకు మరిన్ని పరిపాలన, ఆర్థిక అధికారాలను కల్పించినట్లు తెలిపారు. ఈ బిల్లులో ప్రభుత్వం కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. ఎన్‌హెచ్చార్సీ తోపాటు రాష్ట్ర మానవ హక్కుల సంఘాల చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం ప్రస్తుతమున్న ఐదేళ్లకు బదులు ఇకపై మూడేళ్లకే పరిమితం కానుంది. ఎన్‌హెచ్చార్సీ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తినే నియమించాలనే నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఇకపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జినీ నియమించవచ్చని ప్రతిపాదించింది. జాతీయ మైనారిటీల కమిషన్ నుంచి ఎన్‌హెచ్చార్సీ చైర్‌పర్సన్‌ను నియమించాలన్న ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌కు మంత్రి స్పందిస్తూ.. ఓబీసీ జాబితాలో మైనారిటీలను చేర్చే నిబంధన ఈ బిల్లులో ఉందన్నారు. అధికార పార్టీ ఎంపీలను ఎన్‌హెచ్చార్సీలో ఎందుకు నియమించాలని అనుకుంటున్నారని ఒవైసీ ప్రశ్నించారు. ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఒక వైపు శాంతి కావాలంటూనే ఎన్‌హెచ్చార్సీ ఆదేశాలను సవాల్ చేసే పరిస్థితులున్నాయని, ఈ బిల్లుపై సభలో మరోసారి మరింత చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ కర్ణాటకలో చట్టసభ స్వతంత్రత ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కాంగ్రెస్ శుక్రవారం లోక్‌సభలో ఆందోళనకు దిగింది. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం, అక్కడి పరిణామాలపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్, డీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, న్యాయాన్ని కాపాడాలంటూ వారు నినాదాలు చేశారు. వారి డిమాండ్‌పై స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనపై ఎన్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం..3.5 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్లో ఫెయిల్ అయిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. -
హక్కులతోనే మెరుగైన జీవితం
న్యూఢిల్లీ: మానవ హక్కులు సవ్యంగా అమలుపరచడం ద్వారా ప్రజల జీవితాల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందని గుర్తుచేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) 25వ వ్యవస్థాపక దినోత్సవంలో శుక్రవారం మోదీ ప్రసంగించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్హెచ్ఆర్సీ ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మానవ హక్కుల పరిరక్షణకు స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ, చురుకైన మీడియా, క్రియాశీల పౌర సంఘాలు, ఎన్హెచ్ఆర్సీ లాంటి సంస్థలు ఉనికిలోకి వచ్చాయని అన్నారు. 17 లక్షల కేసులు..వంద కోట్ల పరిహారం: మానవ హక్కుల వాచ్‌డాగ్‌గా పేరొందిన జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఏర్పాటై శుక్రవారానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 17 లక్షలకు పైగా కేసులను పరిష్కరించిన కమిషన్...మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితులకు సుమారు రూ.100 కోట్లకు పైగా పరిహారం ఇప్పించింది. ఈ కమిషన్ ముందుకు వచ్చిన కేసుల్లో పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ హింస, ఛత్తీస్‌గఢ్‌లోని సల్వాజుడుం సంబంధిత ఘటనలు కొన్ని ముఖ్యమైనవి. 28న జపాన్‌కు మోదీ మోదీ ఈ నెల 28–29న జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ ఇండియా–జపాన్ వార్షిక సమావేశంలో పాల్గొని పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులు కూడా ఇరువురు అధినేతల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నిబంధనలకు విరుద్ధం: ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు మానవహక్కుల కార్యకర్తల అరెస్టులన్నీ నిబంధలనలకు విరుద్ధంగా, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ జరిగాయని కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. ‘మీడియాలో వార్తల ఆధారంగా చూస్తే.. ఈ ఐదుగురి గృహనిర్బంధం నిబంధలకు విరుద్ధంగా జరిగిందని కమిషన్ భావిస్తోంది. ఈ అరెస్టులను మానవ హక్కుల ఉల్లంఘనగానే చూస్తున్నాం’ అని ఎన్‌హెచ్చార్సీ సీనియర్ సభ్యుడొకరు తెలిపారు. నవలఖా ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈ అరెస్టుల విషయంలో కోర్టుకు పోలీసులు సరైన వివరణ ఇవ్వలేదనేది సుస్పష్టమైందన్నారు. ‘ఫరీదాబాద్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు సుధా భరద్వాజ్ ట్రాన్సిట్ రిమాండ్ పెండింగ్‌లో ఉంది. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని ఆమె కోర్టుకు వెల్లడించారు. ఎఫ్ఐఆర్లోనూ తన పేరు లేదని.. కేవలం తన సిద్ధాంతం కారణంగానే అరెస్టు చేసి హింసిస్తున్నారని చెప్పారు’ అని ఎన్‌హెచ్చార్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.జెనీవాలోని ఓ ఎన్జీవో నుంచి కూడా మహారాష్ట్ర పోలీసులు ఈ ఏడాది జూన్‌లో ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తల (సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్ ధావ్లే, షోమాసేన్, మహేష్ రౌత్) ను అరెస్టు చేసినట్లు ఫిర్యాదు అందిన విషయాన్ని కమిషన్ వెల్లడించింది. ఈ అంశంలోనూ మహారాష్ట్ర డీజీపీకి జూన్ 29న నోటీసులు పంపామని, దీనిపై సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. -
నేరం చేసానని ఒప్పుకోమని హింసిస్తున్నారు
న్యూఢిల్లీ : ‘2008, మాలేగావ్ పేలుళ్ల కేసు’లో ప్రధాన నిందుతుడుగా శిక్ష అనుభవిస్తున్న మాజీ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ గతంలో రాసిన ఒక ఉత్తరం ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్లో కలకలం రేపుతుంది. మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందుతుడిగా మహారాష్ట్ర ‘యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్’(ఏటీఎస్) కస్టడీలో ఉన్న సమయంలో ఏటీఎస్ అధికారులు తనను విపరీతంగా టార్చర్ చేస్తున్నారని 2013, డిసెంబర్లో ‘జాతీయ మానవ హక్కుల కమిషన్’కు ఓ 24 పేజీల లేఖ రాసాడు పురోహిత్. నావీ ముంబై జైల్లో ఏటీఎస్ కస్టడీలో ఉన్నప్పుడు వారు తనను బలవంతంగా నేరం ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. తాను ఏ నేరం చేయలేదని కానీ ఏటీఎస్ అధికారులు మాత్రం తనను కొట్టి, హింసించి తన చేత బలవంతంగా నేరం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు లేఖలో తెలిపాడు. కేవలం ఏటీఎస్ అధికారులు మాత్రమే కాక ఆర్మీ అధికారులు కూడా తనను హింసించారని, అంతేకాక తనచేత బలవంతంగా మరో ఆరుగురు అధికారుల పేర్లను కూడా చెప్పించారని పేర్కొన్నాడు. 2008, సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, మాలేగావ్‌లో జరిగిన ఈ పేలుళ్లలో ఏడుగురు మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అరెస్టయిన పురోహిత్‌కు గతేడాది సెప్టెంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పురోహిత్ రాజకీయ కుట్రల వల్లనే తాను తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపానని తెలిపాడు. పురోహిత్ రాసిన లేఖ గురించి పోలీసు అధికారులు ‘పురోహిత్ ఈ లేఖను 2013లో రాసాడు...అప్పుడే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయాన్ని దర్యాప్తు చేసింది. అంతేకాక పురోహిత్ లేఖలో పేర్కొన్న అధికారులు కూడా పురోహిత్ ఆరోపణలపై స్పందించార’ని పోలీసు అధికారులు తెలిపారు. -
తూత్తుకుడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ విచారణ
సాక్షి, చెన్నై: తమిళనాడు తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ వివాదంతో చెలరేగిన హింసలో 13 మంది మృతి చెందటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) విచారణ చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్ సభ్యులు మృతుల కుటుంబాలను కలుసుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణలో భాగంగా తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌తో సమావేశమయ్యారు. హింసకు దారితీసిన పరిస్థితులు, కాల్పులు జరపమని ఆదేశించిన అధికారులెవరు? హింస చెలరేగడంలో నిరసనకారుల, పర్యావరణ కార్యకర్తల పాత్ర ఏమిటనే కోణంలో కలెక్టర్ సందీప్ నండూరిని అడిగి వివరాలు సేకరించారు. పుపుల్ దత్త ప్రసాద్ నేతృత్వంలో కొనసాగిన ఈ విచారణలో కమిషన్ సభ్యులు రాజీవర్ సింగ్, నితిన్ కుమార్, అరుణ్ త్యాగి, లాల్ బకర్ పాల్గొన్నారు. రెండ్రోజుల విచారణ అనంతరం ప్రత్యేక నివేదిక రూపొందిస్తామని అధికారులు తెలిపారు. -
జయపురం, కొట్‌పాడ్‌లలో విస్తృతంగా దర్యాప్తు
జయపురం/కొరాపుట్: కొరాపుట్ జిల్లా కుందులి గ్యాంగ్‌రేప్ బాధితురాలి కేసులో నిజానిజాలు వెలికితీసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ పంపించిన దర్యాప్తు బృందం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ దర్యాప్తు చేస్తోంది. కొరాపుట్, కుందులి, బాధితురాలి గ్రామం ముషి గుడలను సందర్శించి ఆయా ప్రాంతాలలో అనేక మందిని, ముఖ్యంగా ఆమె బంధువర్గాన్ని ఆమెకు వైద్యసేవలందించిన డాక్టర్లను, పోలీసులు విచారణ చేసిన తరువాత జయపురం, కొట్‌పాడ్‌లలో పర్యటించింది. ఈ పర్యటనలో ఆమెను ఉంచిన ప్రాంతాలను, వైద్య చికిత్స చేసిన జయపురం ప్రభుత్వ సబ్‌డివిజన్ ఆస్పత్రిని సందర్శించి అనేక విషయాలను తెలుసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ టీమ్‌లో కొంతమంది జయపురం, కొట్‌పాడ్‌లలో పర్యటించి అనేక విషయాలపై దర్యాప్తు జరిపినట్లు సమాచారం. రవిసింగ్ నేతృత్వంలో టీమ్ మొదట కొట్‌పాడ్ వెళ్లి అక్కడ శిశు పరిరక్షణ కేంద్రాన్ని సందర్శించింది. ఆ కేంద్రంలో కుందులి బాధితురాలిని అధికారులు కొన్ని రోజులు ఉంచారు. ఆమె అక్కడ ఉన్న సమయంలో ఇతరులతో ఎలా ఉండేది, ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండేది. ఆమె అక్కడ ఉన్న వారితో ఏమైనా చెప్పిందా? ఎన్నాళ్లు కేంద్రంలో ఉంది? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పూర్తి వివరాలు సేకరించిన టీమ్ జయపురం వచ్చి బాధితురాలిని అధికారులు కొద్దిరోజులు ఉంచిన స్టేహోంను సందర్శించింది. అక్కడ ఉన్నవారిని బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకుంది. వైద్యాధికారి విచారణ ఆమె స్టేహోంలో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం ఎక్కడికి తీసుకు వెళ్లారని స్టే హోం నిర్వాహకులను అడిగి తెలుసుకుంది. ఆ సమయంలో బాధితురాలిని జయపురం సబ్‌డివిజన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలుసుకుని ఆస్పత్రిని సందర్శించింది. హాస్పిటల్లో బాధితురాలు ఉన్న సమయంలో ఆమెకు ఎవరు ట్రీట్మెంట్ చేశారు. ఆమె పరిస్థితి ఎలా ఉండేదని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో టీమ్ ప్రతినిధులు పలువురు ఆస్పత్రి ఉద్యోగులను విచారణ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జయపురం హాస్పిటల్లో ఉన్న సమయంలో బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయంపై సబ్‌డివిజన్ ప్రభుత్వ హాస్పిటల్ అధికారి డాక్టర్ దొధిబామణ త్రిపాఠిని ప్రశ్నించినట్లు తెలిసింది. అక్కడి నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్ టీమ్ భరిణిపుట్ గ్రామ పంచాయతీ బి.మాలిగుడలో బాధితురాలి బంధువుల ఇంటికి వెళ్లి వారికి తెలిసిన వివరాలు సేకరించారు. ఈ పర్యటనలో మానవ హక్కుల కమిషన్ బృందంతో పాటు కొరాపుట్ జాల్లా శిశు సురక్షా సమితి అధికారి, పోలీసులు ఉన్నారు. -
మంత్రి ఆదిపై ఫిర్యాదు ఎన్‌హెచ్చార్సీ స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిపై అందిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దళితులు శుభ్రంగా ఉండర ని, వాళ్లు చదువుకోరని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డిపై చర్యలు తీసు కోవాల్సిందిగా ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ సభ్యుడు బోరుగడ్డ అనిల్‌కు మార్ ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ కేసును విచా రణకు స్వీకరించింది. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడు తూ.. తాను చేసిన ఫిర్యాదును స్వీకరించి న కమిషన్ విచారణ జరిపి మంత్రి ఆదిపై చర్యలు తీసుకోనుందని చెప్పారు. -
వారికి లక్ష చొప్పున పరిహారమివ్వండి
- ‘సరోజినీ దేవి’ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ఎన్హెచ్ఆర్సీ - గతేడాది ఆపరేషన్ అనంతరం చూపు కోల్పోయిన ఆరుగురు బాధితులు సాక్షి, న్యూఢిల్లీ: సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో గతేడాది ఆపరేషన్లు వికటించి చూపు కోల్పోయిన ఆరుగురికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితులు కంటిచూపు కోల్పోవడానికి చుక్కల మందు తయారీదారుడే బాధ్యుడని, పరిహారం కూడా అతడే చెల్లించాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బాధితులకు చూపు పోయిందని స్పష్టంచేసింది. వారికి పరిహారం అందజేసినట్టుగా ఆరు వారాల్లోగా తమకు ఆధారాలు కూడా అందజేయాలని శుక్రవారం పేర్కొంది. గతేడాది జూలై 4న సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 13 మందికి ఆపరేషన్ చేసిన తర్వాత కాంపౌండ్ సోడియం ల్యాక్టేట్ ఐపీ 500 ఎం.ఎల్ చుక్కల మందు ఇచ్చారు. అయితే మందులోని క్లెబ్సిల్లా బ్యాక్టీరియా కారణంగా వారిలో పలువురి చూపు దెబ్బతినగా ఆరుగురు శాశ్వతంగా చూపు కోల్పోయారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి కమిషన్ ఇప్పటికే నోటీసులిచ్చింది. తాజాగా వారికి ప్రభుత్వమే రూ.లక్ష చొప్పున పరిహారమివ్వాలని ఆదేశించింది. -
‘నేరెళ్ల’పై ఎన్హెచ్ఆర్సీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని కోరిన నేతలు సాక్షి, న్యూఢిల్లీ: నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఆధ్వర్యంలో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు... ఎన్హెచ్ఆర్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తును ఢిల్లీలో మంగళవారం కలసి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల ఇసుక దందాలపై ప్రశ్నించినందుకు నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని చిత్రహింసలకు గురి చేశారన్నారు. దీనిపై విచారణ జరిపించడానికి ప్రత్యేకంగా కేంద్ర బృందాన్ని నేరెళ్లకు పంపి నిజానిజాలను నిర్ధారించాలని కోరారు. సమావేశం అనంతరం పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. తాము చేసిన ఫిర్యాదులపై కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే కేంద్ర బృందాన్ని పంపి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 14 ఏళ్లపాటు ఉద్యమం చేశానని చెబుతున్న కేసీఆర్‌పై అప్పట్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించివుంటే ఈ రోజు ఆయన ఎక్కడ ఉండే వారని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రభుత్వంపై, జిల్లా ఎస్పీపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరామన్నారు. ఇసుక దందాలపై ప్రశ్నించినందుకు మూడేళ్ల కాలం లో 42 మందిని అధికార పార్టీ నేతలు హత్య చేశారని ఎంపీ రేణుకాచౌదరి ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన ప్రభుత్వ పెద్దలు.. బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేయడం సిగ్గుచేట న్నారు. కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
‘నేరెళ్ల’పై ఎన్హెచ్ఆర్సీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ఢిల్లీ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్లకు చెందిన దళితులపై పోలీసుల దాడి వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. నేరెళ్ల ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదుచేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్ఎస్ కుంతియా, టీపీసీసీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు మంగళవారం ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ కార్యాలయంలో ఫిర్యాదు దాఖలుచేశారు. బాధితులను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించాల్సిందిగా కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. -
సేవల్లో లోపాలు ఉండకూడదు
నరసాపురం : పేదలకు అందించే విద్య, వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రత్యేక అధికారి పీజీ కామత్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని టేలర్ హైసూ్కల్, శారద టాకీస్ వద్ద ఉన్న మున్సిపల్ హైసూ్కల్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని వైద్యులకు సూచించారు. సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి ఎం.సూర్యనారాయణ, ఇన్చార్జ్ డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ ఆయన వెంట ఉన్నారు. -
సాయిబాబా ఆరోగ్యంపై జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు సరైన వైద్యం అందేలా జోక్యం చేసుకోవాలని ఆయన భార్య వసంత కుమారి ఆధ్వరంలో ప్రతినిధి బృందం జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించింది. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. 90 శాతం వైకల్యంతో ఉన్నా సాయిబాబా కాలకృత్యాలు తీర్చుకోలేకపోవడంతో పాటు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారని ప్రతినిధి బృందం తెలిపింది. గత పది వారాల నుంచి జైలు అధికారులు సాయిబాబాకు సరైన వైద్యం అందించడం లేదని వసంత కుమారి ఆరోపించారు. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాకు కోర్టు ఇంతకుముందు యావజ్జీవ శిక్ష విధించింది. -
కిడ్నీ బాధితులపై సమగ్ర నివేదిక ఇవ్వండి
-
కిడ్నీ బాధితులపై సమగ్ర నివేదిక ఇవ్వండి
రాష్ట్ర సర్కారుకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లో కిడ్నీ జబ్బుల తీవ్రత, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందకపోవడానికి గల కారణాలపై ఈ నెల 31వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘వేలాది మంది కిడ్నీ జబ్బులకు గురవుతున్నారు. వీళ్లకు సరైన చికిత్స అందడం లేదు. దీనికి కారణాలనూ చెప్పడం లేదు’ అనే అంశాలతో పత్రికల్లో వచ్చిన కథనాలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి ఈ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దాపురం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లో మూత్రపిండాల జబ్బులు తీవ్రంగా ఉన్నాయి. ఈ మండలాల్లో సుమారు 16 వేల మంది తీవ్రమైన కిడ్నీ జబ్బుల (క్రానిక్ కిడ్నీ డిసీజెస్)తో బాధపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి నివేదిక ఎలా ఇవ్వాలని సర్కారు పెద్దలు, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
‘దివాకర్’ ప్రమాదంపై 4 వారాల్లో నివేదికివ్వండి
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించిన ఎన్హెచ్ఆర్సీ అమలాపురం టౌన్: కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. బస్సు ప్రమాదం.. అందులో చోటుచేసుకున్న తప్పిదాలు, ట్రావెల్స్ యాజమాన్యాన్ని ప్రభుత్వం కాపాడుతోందంటూ పలు అభియోగాలతో తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన న్యాయవాది కుడు పూడి అశోక్ ఫిర్యాదు చేయగా ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. మంగళవారం అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషన్ పంపిన ఉత్త ర్వుల నకళ్లను విడుదలచేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ స్పందించి దివాకర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
మరో ఆత్మహత్య జరగకుండా చూడండి : కేతిరెడ్డి
న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిని జీర్ణించుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని తమిళనాడులోని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)ని కోరారు. చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో డిసెంబర్ 5న జయలలిత మృతి చెందిన వార్త విషయం తెలిసిందే. ఈ వార్త వినగానే తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు దిగ్భార్రాంతికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ షాకింగ్ వార్త వినగానే కొందరు గుండె పోటుతో, మరికొందరు ఆత్మహత్యలు చేసుకొని దాదాపు 400 మంది సామాన్య ప్రజలు మృతిచెందినట్టు ఎన్‌హెచ్చార్సీ దృష్టికి తీసుకువచ్చారు. మృతుల్లో రోజూవారి కూలీలతోపాటూ పేదలే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారి ఆకస్మిక మృతితో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయని వివరించారు. అమ్మ మరణవార్త విని మనోవేదనతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తమిళనాడు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుని, బాధిత కుటుంబాల్లో మరోకరు ఆత్మహత్య చేసుకోకుండా చూడాని కోరారు. -
16 మంది మహిళలపై పోలీసుల అకృత్యాలు!
-
16 మంది మహిళలపై పోలీసుల అకృత్యాలు!
న్యూఢిల్లీ: 16 మంది మహిళలపై అత్యాచారంతోపాటు లైంగిక, శారీరక దాడులు చేసినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంటూ శనివారం నోటీసులు జారీచేసింది. మరో 20 మంది బాధితుల వాంగ్మూలం కోసం తాము ఎదురుచూస్తున్నట్టు కమిషన్ స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్ పోలీసుల చేతిలో 16 మంది మహిళలు అత్యాచారానికి గురవ్వడంతోపాటు లైంగికంగా, శారీరకంగా దాడులు ఎదుర్కొన్నట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి ఎన్‌హెచ్చార్సీ గుర్తించింది. కాబట్టి బాధితులకు రూ. 37లక్షల పరిహారం ఎందుకు సిఫారసు చేయకూడదో తెలుపాలంటూ ఆ రాష్ట్ర సీఎస్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసులలో పేర్కొంది. ఈ పరిహారంలో రూ. 3 లక్షలు చొప్పున రేప్‌కు గురైన ఎనిమిది మంది బాధితులకు, రూ. 2 లక్షలు చొప్పున లైంగిక దాడులు ఎదుర్కొన్న ఆరుగురు బాధితులకు, రూ. 50వేల చొప్పున శారీరక దాడులు ఎదుర్కొన్న ఇద్దరు బాధితులకు ఇవ్వాలని కమిషన్ పేర్కొంది. భద్రతా దళాల చేతిలో బాధితుల మానవహక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరిగిందని, కాబట్టి ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కమిషన్ స్పష్టం చేసింది. -
తమిళనాడుకు మరో షాక్
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. కేంద్ర మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) నోటీసు జారీ చేసింది. ఒకే నెలలో 106 మంది రైతులు చనిపోయినట్టు చేసుకున్నట్టు వార్తలు రావడంతో స్పందించిన ఎన్హెచ్ఆర్సీ గురువారం తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చింది. అన్నదాతల మరణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టారో తెలపాలని కోరింది. కాగా, రైతు మరణాల అంశాన్ని ప్రతిపక్ష డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ ఇటీవల ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దృష్టికి తీసుకెళ్లారు. సరిగా పంటలు పండక, రుణభారంతో రైతులు చనిపోతున్నారని వివరించారు. కావేరి నది నుంచి డెల్టా ప్రాంతానికి సరిపడా నీరు రాకపోవడం కూడా రైతు మరణాలకు మరో కారణమన్నారు. అన్నదాతలను ఆదుకోవాలని సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. తమిళనాడును కరువు ప్రభావిత రాష్ట్రంగా ప్రకటించాలని రైతు సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. -
అమానుష ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లోని అమానవీయ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బెర్హంపూర్ లోని 430 పడకల మానసిక వ్యాధిగ్రస్థుల ఆస్పత్రిలో రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదును సుమోటో గా తీసుకున్న కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. అంజలి మెంటల్ హెల్త్ ఎన్జీవో సభ్యులు అగస్టు 15 న బెర్హంపూర్ లోని మెంటల్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ కట్టు బట్టలు కూడా లేకుండా ఉన్న రోగుల దయనీయ స్థితి వారి కంట పడింది. మురికిగా ఉన్న వారి పరుపులు, తీవ్ర దుర్వాసనతో కూడిన టాయిలెట్లను ఫోటోలు తీసి ఎన్ హెచ్ఆర్సీ కి పంపారు. దీనిపై స్పందించడానికి హాప్పిటల్ సూపరింటిండెంట్, వైద్య శాఖ అధికారులు నిరాకరించారు. -
'సరోజినీ'లో మళ్లీ సేవలు ప్రారంభం
హైదరాబాద్ : మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దాదాపు 15 రోజుల విరామం తర్వాత ఇన్‌పేషంట్ సేవలు శుక్రవారం మళ్లీ ప్రారంభమైనాయి. ఈ రోజు ఉదయం అవుట్ పేషంట్ విభాగానికి వచ్చిన రోగుల్లో 40 మందిని ఇన్‌పేషంట్లుగా ఆసుపత్రలో చేర్చుకున్నారు. వీరికి సోమవారం శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సదరు ఆసుపత్రిలో ఇటీవల క్యాటరాక్ట్ శాస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు బాధితులకు కంటిచూపు పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని... కేసు నమోదు చేసింది. అలాగే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు కూడా నోటీసులు జారీ చేసింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కంటిశుక్లాల తొలగింపు శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్‌గా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో పాటు రెండు వారాల్లోగా తుది నివేదిక అందజేయాలని తెలంగాణ సీఎస్ సహా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఆస్పత్రి సూపరింటెండెంట్లతో పాటు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా కంటిచూపు మందగించడంతో మెరుగైన చూపుకోసం గత నెల 30న ఆస్పత్రిలో 21 మంది కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. రింగర్స్ లాక్టేట్ (ఆర్ఎల్)సెలెన్వాటర్తో కళ్లను శుభ్రం చేయడం వల్ల 13 మందికి ఇన్ఫెక్షన్ బారినపడగా, వీరిలో ఏడుగురి కంటి చూపు దెబ్బతింది. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు, లోకాయుక్తా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. -
ముంపు గ్రామాల్లో ఎన్హెచ్ఆర్సీ బృందం
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో సోమవారం జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం పర్యటించింది. మండలంలోని చేగొండపల్లి, పల్లిపాక, రామయ్యపేట గ్రామాల్లోని నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి అమలు తీరును బృందం సభ్యులు పరిశీలించారు. నిర్వాసితులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. బృందంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్(లా) ఇంద్రజిత్ కుమార్ తదితరులు ఉన్నారు. -
తమిళనాడు సర్కారుకు నోటీసులు
చెన్నై: అన్నదాత ఆత్మహత్యపై తమిళనాడు ప్రభుత్వం, ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్ హెచ్ ఆర్సీ) సోమవారం నోటీసులు జారీ చేసింది. పోలీసులు, ప్రైవేటు ఫైనాన్షియల్ కంపెనీ వేధింపులకు గురిచేయడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న కేసులో నోటీసులిచ్చింది. రెండు వారాల్లోగా విరవరణ ఇవ్వాలని ఆదేశించింది. అరియళూరు జిల్లాలో శుక్రవారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రుణం చెల్లించనందుకు ఫైనాన్స్ కంపెనీ అతడి ట్రాక్టర్ సీజ్ చేసింది. దీంతో మనస్తాపం చెందిన రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొద్దిరోజుల క్రితం తంజావూరు జిల్లాలోనూ ఇలాంటి చర్య ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1.3 లక్ష రుణం తీసుకున్న రైతు అప్పు చెల్లించకపోవడంతో అతడిని పోలీసులు చితకబాదారు. -
నిర్ణయం మీరే తీసుకోండి
శ్రుతి, విద్యాసాగర్ పోస్టుమార్టం రిపోర్టులు ఎన్హెచ్ఆర్సీకి ఇమ్మనడంపై ప్రభుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గత ఏడాది సెప్టెంబర్‌లో వరంగల్ జిల్లా, గోవిందరావుపేట మండల పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి అలియాస్ మైత్రి, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సూర్యంలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఇవ్వాలా? వద్దా? అనేదానిపై తాము ఏ అభిప్రాయం వ్యక్తం చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మీరే తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల ఎన్‌కౌంటర్‌పై ఎయిమ్స్ నివేదిక రాకపోవడంతో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రుతి, విద్యాసాగర్రెడ్డిలది బూటకపు ఎన్కౌంటరని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. మృతుల పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని పరిశీలించి వాటిపై అభిప్రాయం తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్ డెరైక్టర్‌ను ధర్మాసనం ఆదేశించిందని, ఆ నివేదిక రానందున కొంత గడువు కావాలన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల పోస్టుమార్టం నివేదికలను ఎన్హెచ్ఆర్సీ కోరిందని, ఇవ్వమంటారా అని రామచంద్రరావు ధర్మాసనాన్ని అడిగారు. దీనిపై నిర్ణయాన్ని మీరే స్వయంగా తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. -
'ప్రకృతి పిలుపు'కు దూరంగా రైలు డ్రైవర్లు
న్యూఢిల్లీ: మూత్రవిసర్జన.. వార్త అయ్యేంత లేదా మాట్లాడుకునేంత గొప్ప విషయం కాకపోవచ్చు కానీ మనిషి సహా జంతుజాలమంతా తప్పనిసరిగా చేయాల్సిన పని. ప్రపంచఖ్యాతి పొందిన ఓ సంస్థలో మాత్రం ఉద్యోగులు ఒంటికీ, రెంటికీ పోయడానికి లేదా పోవడానికి వీల్లేదు. అర్జెంటుగా రారమ్మంటున్నా.. డ్యూటీలో ఉండే ఆ 12 గంటలూ ప్రకృతి పిలుపునకు స్పందించొద్దంటూ కఠిన నిబంధనలున్నాయి. అలా మూత్రాన్ని బిగబట్టడం అలవాటై, అది 'రాయబడని' మానవహక్కుల ఉల్లంఘన అని తెలుసుకున్న ఉద్యోగులు చివరకు జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. 'అయ్యా మా బాధను కాస్త పట్టించుకోండి' అని. ఒక లక్షా పదిహేనువేల కిలోమీటర్ల ట్రాక్ పై రోజుకు రెండున్నర కోట్ల మంది ప్రయాణికుల చేరవేత, లక్షల టన్నుల సరుకు రవాణా, విరామం లేకుండా తిరిగే 19 వేల రైళ్లు, 13 లక్షలకుపైగా ఉద్యోగులు 7,112 స్టేషన్లు.. చెప్పుకుంటూపోతే ఇండియన్ రైల్వేస్ ఘనత కొండవీటి చాంతాడు. అయితే ఆ సంస్థకు చోదకులుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న 69వేల మంది రైలు డ్రైవర్లు(లోకో పైలట్స్) దారుణమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. నిర్దేశిత 12 గంటల పనివేళలో నిమిషం సేపైనా విరామం లేకపోగా, మనిషికి అత్యవసరమైన మలమూత్రాల విసర్జనకుసైతం అనుమతిలేదు. 163 ఏళ్లుగా కొనసాగుతూవస్తోన్న ఈ వ్యవహారం ఎందరో రైలు డ్రైవర్లును అనారోగ్యానికి గురిచేయడమేకాక ప్రమాదాలకూ కారణమవుతున్నదని వాదిస్తున్నారు ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్స్ ఆర్గనైజేషన్(ఐఆర్ఎల్ఆర్ఓ)గా ఒక్కటైన రైలు డ్రైవర్లు. ఇప్పుడిప్పుడే పెరుగుతోన్న మహిళా లోకోపైలట్ల బాధలైతే ఇంకా ఘోరం. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఎన్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఏమిటీ సంగతి? అని ఎన్ హెచ్ఆర్సీ ప్రశ్నించగా దానికి రైల్వే అధికారులిచ్చిన సమాధానం ఇలా ఉంది.. 'మూత్రవిసర్జన లేదా పనివేళలో కాసేపు విరామం ఇస్తే ఆ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడుతుంది. మొత్తం రైల్వే వ్యవస్థకు నష్టం చేకూరుతుంది' రోడ్డు మార్గంలో వాహనాలు నడిపే డ్రైవర్ ప్రతి నాలుగైదు గంటలకు ఒకసారి తప్పనిసరిగా విరామం తీసుకోవాలని రవాణాశాఖలో ఆదేశాలున్నాయి. ఢిల్లీ మెట్రో రైల్ డ్రైవర్లకు ప్రతి మూడు గంటలకు ఒకసారి 40 నిమిషాల బ్రేక్ దొరుకుతుంది. ఇక విమానాల్లోనైతే కావాల్సినన్నిసార్లు టాయిలెట్ కు వెళ్లే అవకాశం ఉంటుంది పైలట్లకు. మరి లోకోపైలట్లకు మాత్రం ఎందుకీ శిక్ష! -
నిర్భయ కంటే పెద్ద ఘటన...
న్యూఢిల్లీ : బెజవాడ కాల్‌మనీ వ్యవహారం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాల్ మనీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ..ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీకి నోటీసులు జారీ చేసింది. అలాగే కాల్‌మనీ వ్యవహారంపై వాస్తవలు నిగ్గు తేల్చేందుకు ఓ బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ సిరియాక్ జోసెఫ్ తెలిపారు. కాల్ మనీ సంఘటన నిర్భయ కంటే పెద్ద ఘటనగా ఆయన అభివర్ణించారు. రఘువీరాతో పాటు కాంగ్రెస్ నేతలు సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, జైరాం రమేష్ తదితరులు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. భేటీ అనంతరం రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ కాల్ మనీ వ్యవహారానికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
నిర్భయ కంటే పెద్ద ఘటన...
-
'విద్యాకుసుమాలకు కులరంగులేంటి'
చెన్నై: తమిళనాడు విద్యాశాఖ అధికారులకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పాఠశాల విద్యార్థుల విషయంలో కుల వివక్షకు ఎలా దిగుతున్నారో తమకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని పాఠశాలల్లో పాఠశాల విద్యార్థులు భిన్న రంగుల్లో వస్త్రాలు ధరిస్తున్నారు. ఆయా రంగుల దుస్తుల ప్రకారం వారిది ఏ కులమో తెలుస్తుందట. ఈ విషయం ఆయా పత్రికల్లో కథనాలుగా వెలువడటంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ అంశాన్ని సీరియస్ గా భావించి సుమోటోగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ తమిళనాడులోని సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది. -
'వాడ్ని బయటకు వదలొద్దు'
న్యూఢిల్లీ: తమ కూతురిపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన బాల నేరస్థుడిని విడిచి పెట్టొద్దని నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర మానవ హక్కుల సంఘాన్ని(ఎన్ హెచ్ఆర్సీ) ఆశ్రయించారు. అతడి వల్ల సమాజానికి ముప్పు పొంచేవుందని పేర్కొన్నారు. డిసెంబర్ 15న అతడు జైలు నుంచి విడుదలకానున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్ హెచ్ఆర్సీలో నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. 'నిర్భయ కేసులో దోషిగా తేలిన బాల నేరస్థుడిని జైలు నుంచి విడుదల కాకుండా చూడాలని ఆమె తల్లిదండ్రులు పిటిషన్ ఇచ్చారు. అతడి వల్ల సమాజంలో సామాన్య ప్రజల ప్రాణాలకు, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. మళ్లీ మళ్లీ నేరాలు చేసే ప్రవృత్తి అతడిలో అధిక స్థాయిలో ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు' అని ఎన్ హెచ్ఆర్సీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎన్ హెచ్ఆర్సీ ఆదేశించింది. కాగా, ఇదే విషయంపై నిర్భయ తల్లిదండ్రులు అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞాపన పత్రం సమర్పించారు. -
తహశీల్దార్‌పై దాడి: ఏపీ సర్కార్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. ఎన్హెచ్ఆర్సీ ఈ కేసును సుమోటాగా తీసుకుంది. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. రెవెన్యూ సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వనజాక్షికి మద్దతుగా నిలిచి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అంతేగాక ఈ కేసులో రాజీపడాలని ప్రభుత్వ పెద్దలు వనజాక్షిపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. -
రాజమండ్రి ఘటనపై ఎన్హెచ్ఆర్సీలో పిటీషన్
న్యూఢిల్లీః రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కరాల నిర్వహణలో విఫలమయ్యారని సంస్థ అధ్యక్షుడు వీర రాఘవరెడ్డి ఈ పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ల ప్రత్యేక పూజల కారణంగా క్యూ లైన్లను 3 గంటలపాటు నిలిపివేశారని, దీంతో భక్తులు క్యూ లైన్లు వదిలేశాక ఒక్కసారిగా పుష్కర స్నానాలకు రావడంతో తొక్కిసలాట జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఘటనకు చంద్రబాబు, లోకేష్ సహా 16 మంది కారణంగా చూపుతూ పిటిషన్ దాఖలు చేశారు. -
చంద్రబాబుపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు
న్యూఢిల్లీ: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 27 మంది మరణించిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. వీరరాఘవ రెడ్డి అనే న్యాయవాది చేసిన ఈ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. పుష్కరాల తొక్కిసలాట ఘటనను నిలువరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వీరరాఘవ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. -
‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు నిలిపివేత
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. దీంతోపాటు బాధితులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని, అలాగే ఈనెల 9న స్వయంగా తమ ముందు హాజరుకావాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), డీజీపీలను ఆదేశిస్తూ ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులను సైతం నిలిపేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎన్హెచ్ఆర్సీ ఉత్తర్వులను వచ్చేనెల 3వ తేదీ వరకు నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. -
మళ్లీ అదే తప్పు!
- రాయచోటిలో ఎర్రకూలీల పట్టివేత ఘటనపై అనుమానాలు సాక్షి, ప్రతినిధి తిరుపతి : శేషాచలం అడవుల్లో ఎర్రకూలీల ఎన్కౌంటర్ వ్యవహారం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. శేషాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి *5 లక్షల పరిహారంతో పాటు, కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) శుక్రవారం ఆదేశించడం కలకలం రేపింది. ఈ ఘటనలో వైపల్యాలను కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి సమీపంలో శుక్రవారం ఏకంగా 72 మంది కూలీలను అరెస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తమిళనాడు నుంచి ఒక ప్రైవేట్ టూరిస్టు బస్సులో వచ్చిన ఎర్ర కూలీలు అటవీ ప్రాంతానికి వెళుతుండగా చిన్నమండెం వద్ద పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇంతవరకు భాగానే ఉన్నా అక్కడ 77 దుంగలను స్వాధీనం చేసుకోవడం పైనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కేసు బలంగా ఉండాలనే కారణంతో పాతదుంగలను తెచ్చి ఇక్కడ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. అడవుల్లోకి చెట్లను నరకడానికి వెళ్లిన వారు డంప్‌ను గురించి సమాచారం ఇచ్చారనడం ఎంతవరకు వాస్తవమనేది చర్చనీయమైంది. ఈ విషయంపై అక్కడ మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించగా పట్టుబడిన ఎర్ర కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు దుంగలు స్వాధీనం చేసుకున్నామని చెప్పడం గమనర్హం. దీనినిబట్టే జరిగిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్హెచ్ఆర్సీ తప్పుపట్టడంతో... శేషాచలం ఘటనను ఎన్హెచ్ఆర్సీ తప్పు పట్టడంతో ఎర్రకూలీల రాక ఇంకా పెద్దఎత్తున సాగుతుందని చెప్పే ప్రయత్నమే ఇది అని తెలుస్తోంది. వాస్తవంగా శేషాచలం ఘటన తరువాత అత్యధిక మంది ఎర్రకూలీలు తీవ్రంగా భయపడిపోయి ఈ ఛాయలకు రావడం లేదని సమాచారం. మరోవైపు వైఎస్ఆర్ జిల్లాలో స్మగ్లర్ల కోసం ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. ఈ తరుణంలో ఇంత పెద్ద ఎత్తున కూలీలు తరలి వెళ్ళారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివిధ కేసుల్లో పట్టుబడిన కూలీలనే మళ్లీ తాజాగా ఆరెస్టు చూపినట్టు జోరుగా చర్చసాగుతోంది. -
మొన్న ఉద్యోగం..నేడు ఫ్లాట్
గుజరాత్: మొన్న డైమండ్స్ ఎగుమతి చేసే ఒక కార్పొరేట్ సంస్థ ముస్లిం యువకుడికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తే... తాజాగా ఓ ముస్లిం యువతికి ఇల్లు ఇవ్వడానికి నిరాకరించిన ఉదంతం గుజరాత్లో సంచలన సృష్టించింది. దీనికి నిరసిస్తూ బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే కమ్యూనికేషన్ ప్రొఫెషన్లో ఉన్న 25 ఏళ్ల మిస్బా ఖాద్రి.. మరో ఇద్దరు మహిళా ఉద్యోగినులతో కలిసి ఉండేందుకు నిర్ణయించుకుంది. దీనికోసం వదాలలోని సాంఘ్వి హైట్స్‌లోని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం అపార్ట్మెంట్ అసోసియేషన్‌ను సంప్రదించింది. అంతా ఓకే అయ్యాక.... ఆ ఇంటికి మారడానికి ఒక రోజు ముందు ముస్లింలు తమ అపార్ట్మెంట్లో ఉండడానికి కుదరదంటూ హౌసింగ్ సొసైటీ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివ్వెరపోయిన ఖాద్రి వెంటనే రెంటల్ ఏజెంట్‌ను సంప్రదించింది. అయితే ఆ అపార్ట్మెంట్లో ఆమెపై ఎలాంటి వేధింపులు, గొడవలు జరిగినా తమకు (హౌసింగ్ సొసైటీ, బిల్డర్, ఏజెంట్) ఎలాంటి సంబంధం లేదని హామీ యిస్తూ నో అబ్జెక్షన్ లెటర్ రాసి యివ్వాలని, అలాగే ఆమె వ్యక్తిగత వివరాలతో కూడిన బయోడేటా కావాలని షరతులు విధించటం జరిగింది. అయితే మిగిలిన ఇద్దరు మహిళలు ఇచ్చిన భరోసాతో వారి షరతులకు ఒప్పుకున్న ఖాద్రి ఎట్టకేలకు ఇంట్లో చేరారు. అలా ఇంట్లో చేరి వారం రోజులు అయిందో లేదో మళ్ళీ వివాదం మొదటి కొచ్చింది. మిస్బా ఖాద్రి తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలనీ, బైటికి గెంటేస్తామనీ, లేదంటే పోలీసులకు పిలవాల్సి వస్తుందని రెంటల్ ఏజెంట్ బెదిరించాడు. ముస్లింలకు ఫ్లాట్ అద్దెకివ్వడానికి తమ కంపెనీ రూల్స్ ఒప్పుకోవంటూ తెగేసి చెప్పాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. కాగా ఫ్లాట్‌లో అద్దెకు చేరిన ముగ్గురిలో మిస్బా ఖాద్రి ఒక్కరే ముస్లిం. ఈ వివాదంతో ముగ్గురూ ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. గుజరాత్‌లోనే పుట్టి పెరిగిన తాను 2002 ఘర్షణల అనంతరం ముంబైకి వెళ్లిపోయినట్లు మిస్పా ఖాద్రి తెలిపింది. అయితే ఉద్యోగరీత్యా మళ్లీ గుజరాత్ రావాల్సి వచ్చిందని, అభివృద్దికి నమూనాగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో గుజరాత్లో కొనసాగుతున్న మతవివక్షపై ఆమె నిరసన తెలిపింది. గోద్రా అల్లర్లతో మత ఘర్షణలకు పేరు గాంచిన గుజరాత్ రాష్ట్రంలో మత వివక్ష కొనసాగుతున్న ఆనవాళ్లు కనిపించడంపై మిస్బా ఆందోళన వ్యక్తం చేసింది. -
శేషాచలం ఎన్కౌంటర్ నరమేధమే..!
కూలీల ‘ఫోన్ కాల్స్’ డేటానే సాక్ష్యం 20 మంది కూలీలను పట్టుకెళ్లి కాల్చి చంపిన పోలీసులు కాల్పుల్లో చనిపోయే కొన్ని గంటల ముందు వరకూ తమిళనాడు సరిహద్దుల్లో, తిరుపతి పరిసరాల్లో కూలీల సంచారం ఎన్హెచ్ఆర్సీకి వారి కాల్ డేటా రికార్డుల వివరాలు సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఇరవై మంది తమిళ కూలీలను కాల్చిచంపిన ‘ఎన్కౌంటర్లు’ ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటర్లేనని.. వారందరినీ అంతకుముందే పోలీసులు అదుపులోకి తీసుకుని, అడవుల్లోకి తీసుకెళ్లి దారుణంగా కాల్చిచంపారని చెప్పేందుకు తాజా సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 7వ తేదీ తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అటవీ సిబ్బంది కాల్పుల్లో చనిపోయిన ఎర్రచందనం కూలీల సెల్ఫోన్లకు సంబంధించిన ఫోన్ కాల్స్ వివరాలు.. మృతుల్లో పలువురు ఆ ముందు రోజు సాయంత్రం, రాత్రి వరకూ తమిళనాడు సరిహద్దుల్లో, తిరుపతి ప్రాంతంలోనే సంచరించినట్లు నిర్ధారిస్తున్నాయి. శేషాచలం ‘ఎన్కౌంటర్’లో మృతి చెందిన 20 మంది తమిళ కూలీల్లో ఎనిమిది మంది సెల్ఫోన్లు వినియోగించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసు అధికారులు.. ఆ 8 మంది సెల్‌ఫోన్ కాల్ డిటైల్స్ రికార్డ్ (సీడీఆర్) ఆధారంగా దర్యాప్తు చేసి, సాక్షులను విచారించి ఆ వివరాలను కేంద్ర మానవ హక్కుల సంఘానికి సమర్పించారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో ఏమన్నారు? శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికి, దుంగలు తీసుకెళ్లేందుకు తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో కూలీలు ఏప్రిల్ ఆరో తేదీ నాటికే అడవుల్లోకి వచ్చారని.. వారు భారీగా ఎర్రచందనం చెట్లు నరికి దుంగలు తీసుకెళ్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆరో తేదీ రాత్రే పోలీసులు, అటవీ సిబ్బందితో కూడిన రెండు బృందాలు కూంబింగ్ మొదలు పెట్టారు. ఏడో తేదీ తెల్లవారుజామున ఎర్రచందనం చెట్లు నరికి ఆ దుంగలను మోసుకెళ్తున్న వంద మందికి పైగా స్మగ్లర్లు ఈ బృందాలకు తారసపడ్డారు. వారిని లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించగా.. వారు ‘మారణాయుధాల’తో పోలీసులపై దాడి చేశారు. పోలీసులు ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరపగా.. రెండు చోట్ల 20 మంది స్మగ్లర్లు, కూలీలు చనిపోయారు. మృతుల బంధువులు ఏం చెప్పారు? కూలీలు అడవుల్లోకి వెళ్లకముందే.. పోలీసులు ఏప్రిల్ ఆరో తేదీన చిత్తూరు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని కూడా బస్సును అటకాయించి మరీ విచారణ పేరుతో పట్టుకెళ్లారు. వారందరినీ అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చిచంపి.. ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారు. మానవ హక్కుల సంఘాలు, తమిళ సంఘాలు, మృతుల బంధువులు ఇవే ఆరోపణలు చేస్తున్నారు. మృతుల సెల్ఫోన్లు ఏం చెప్తున్నాయి? పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన పెరుమాళ్ (37), పళణి (35), మగేంద్రన్ (25) ల సెల్‌ఫోన్ సీడీఆర్లను పరిశీలిస్తే.. వారు ముందు రోజు సాయంత్రం వరకూ ప్రయాణిస్తునే ఉన్నారు. సాయంత్రానికి తిరుపతి సమీపంలో ఉన్నారు. తెల్లవారుజామున ‘ఎన్కౌంటర్లు’ జరగటానికి ముందు.. అపరాత్రి 2.30 గంటల సమయంలో వారు ‘ఎన్కౌంటర్లు’ జరిగిన ప్రదేశంలోనే ఉన్నారు. అప్పుడు కూడా వీరిలో కొందరి సెల్ఫోన్ల నుంచి తమ ఇళ్ల పక్కనవారికి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు వెళ్లాయి. 2.30 గంటల సమయంలో వీరి సెల్ ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి. అంటే అర్థం ఏమిటి..? శేషాచలం అడవుల్లో వందలాది మంది స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారని తమకు సమాచారం అందిందని.. వెంటనే ఆరో తేదీ రాత్రి నుంచే అడవుల్లో కూంబింగ్ మొదలుపెట్టామని పోలీసులు ఎఫ్ఐఆర్లో చెప్పిన కథనం. ఆ క్రమంలో కూలీలు ఎదురుపడగా.. వారి దాడి నుంచి ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన కూలీల పక్కన ఒక్కొక్కరికి ఒక్కో దుంగ లెక్కన.. ఎర్రచందనం దుంగలూ పడివున్నాయి. అంటే.. పోలీసులు అడవుల్లోకి గాలింపు మొదలుపెట్టే సరికే కూలీలు అడవుల్లోకి వెళ్లి చెట్లు నరికి, వాటిని మోసుకుపోతూ ఉండాలి. అదే నిజమైతే..సెల్ఫోన్లు జేబుల్లో పెట్టుకుని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సంచరిస్తుండటం ఎలా సాధ్యం? అడవుల్లో చెట్లు నరికి, వాటిని శుభ్రంచేసి.. ఏడో తేదీ తెల్లవారుజాము ఐదారు గంటలకల్లా ఆ దుంగలను భుజాలపై మోసుకుంటూ వెళ్తున్న వారు.. అంతకు కొన్ని గంటల ముందే తిరుపతి పరిసరాల్లో సంచరించటం ఎలా సాధ్యం? రాత్రి 9 గంటల వరకూ తిరుపతి పరిసరాల్లో తిరుగుతున్న వారు.. ఎన్కౌంటర్లో చనిపోవటానికి కొన్ని గంటల ముందుగానే ఆ ఎన్కౌంటర్ల ప్రాంతానికి ఎర్రచందనం దుంగలు మోసుకుంటూ రావటం ఎలా సాధ్యం? అంటే.. ఈ కూలీలను ఏప్రిల్ ఆరో తేదీ సాయంత్రం చిత్తూరు - తమిళనాడు సరిహద్దుల్లోని వడమాలపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని.. వారందరినీ అదే రాత్రి శేషాచలం అడవుల్లోకి తీసుకెళ్లి.. తెల్లవారు జామున ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య కాల్చి చంపినట్లు వెల్లడవుతోందని తమిళనాడు పోలీసు అధికారులను ఉటంకిస్తూ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. అలాగే.. మృతుల నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని.. వాటి ఆధారంగా మరింత మంది కూలీలను పట్టుకోవడానికి ఏపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రయత్నించినట్లు తేలిందని ఎన్హెచ్ఆర్సీకి తమిళనాడు డీజీపీ అశోక్‌కుమార్ వివరించారు. ‘ఎన్కౌంటర్’ వివరాలేమిటి? ఏప్రిల్ 7వ తేదీ తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో.. శ్రీవారిమెట్టుకు సమీపాన చీకటీగలకోన, సచ్చినోడిబండ ప్రాంతాల వద్ద దాదాపు ఒకే సమయంలో రెండు ‘ఎన్కౌంటర్లు’ జరిగాయి. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది కూలీలు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఆ రాత్రి వరకూ తిరుపతి పరిసరాల్లోనే.. తమిళనాడులో తిరువణ్నామలై జిల్లా పెదవీడుకు చెందిన పెరుమాళ్.. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 11.14 గంటలకు తన సొంత ఊర్లోనే ఉన్నారు. మధ్యాహ్నం 2.37 గంటలకు వేలూరు జిల్లా ఆర్కాట్లో ఉన్నారు. రాత్రి 7.44 గంటల నుంచి 9.22 వరకూ పెరుమాళ్ వడమాలపేట నుంచి రేణిగుంట మీదుగా తిరుపతికి సమీపంలోని నందవరం గ్రామానికి చేరినట్లు తెలుస్తోంది. మళ్లీ 7వ తేదీ తెల్లవారు జాము 2.33 గంటలకు పెరుమాళ్ సెల్‌ఫోన్ నుంచి ఆయన పక్కిళ్లలోని వారికి ఎస్ఎంఎస్ పంపారు. తిరిగి 2.35కు ఒకసారి, 2.36కు మరోసారి పొరుగింటి వెంకటేష్‌కు రెండుసార్లు పెరుమాళ్ సెల్‌ఫోన్ నుంచి కాల్స్ వెళ్లాయి. అలాగే.. తిరువణ్నామలై జిల్లా కన్నమంగళంకు సమీపంలోని కాళసముత్రిరం గ్రామానికి చెందిన పళణి భార్య లోగనాయగి చెప్పిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 6న మధ్యాహ్నం పళణి ఇంటి నుంచి బయలుదేరారు. సాయంత్రం 6.24కి తిరుత్తణికి చేరుకున్నారు. రాత్రి 9.40 సమయంలో ఎన్కౌంటర్ ఘటనాస్థలికి 29 కిలోమీటర్ల దూరంలోని రేణిగుంటలో పళణి ఉన్నట్లు సీడీఆర్లో తేలింది. మళ్లీ ఏప్రిల్ 7న తెల్లవారుజాము 2.22 గంటలకు పళణి, పెరుమాళ్లు ఎన్కౌంటర్ స్థలంలో ఉన్నట్లు సీడీఆర్‌లు వెల్లడించాయి. తిరువణ్నామలై జిల్లా కన్నమంగళంకు సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన మగేంద్రన్ ఏప్రిల్ 6న మధ్యాహ్నం తన సొంతూరు నుంచి బయలుదేరారు. 2.18 గంటలకు ఆర్కాట్‌కు చేరుకున్నారు. 42 నిమిషాల తర్వాత తిరుత్తణికి బయలుదేరారు. సాయంత్రం 5.19కి తిరుత్తణికి చేరుకున్నారు. వాంగ్మూలాలతో కాల్‌డేటా సరిపోలుతోంది ఎన్కౌంటర్ ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన ముగ్గురు వ్యక్తులు ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం ఎదుట సాక్ష్యమిచ్చారు. ఇప్పుడు వెలుగులోకొచ్చిన మృతుల కాల్‌డేటా వారు చెప్పిన వివరాలతో సరిపోలుతోంది. ఈ కేసు దర్యాప్తులో కాల్‌డేటా కీలకం కానుంది. కూలీలను అదుపులోకి తీసుకున్నాక పోలీసులూ కూలీల ఫోన్లనుంచే వారి కుటుంబీకులకు కాల్స్ చేశారు. ఏపీలోకి ప్రవేశించగానే కూలీలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని స్పష్టమవుతోంది. ఈ అంశాలను ఏపీ హైకోర్టు ముందుకూ తీసుకువెళ్తాం. - హెన్రీ టొమాంగో, పీపుల్స్ వాచ్ సంస్థ ప్రతినిధి, మధురై -
'దుర్గారావును పోలీసులే కొట్టి చంపారు'
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ వ్యవహారం పోలీసుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. దుర్గారావు లాకప్ డెత్‌పై ఏలూరుకు చెందిన న్యాయవాది రాయలు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. టవల్‌తో దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడనే పోలీసుల వాదన అవాస్తవమని, అలా ఆత్మహత్యకు పాల్పడటం కూడా అసాధ్యమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గారావును పోలీసులే కొట్టి చంపారని, పోలీసులపై హత్యకేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని రాయలు కోరారు. పోలీసుల జీతాల నుంచి మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా చర్యలకు ఆదేశించాలని మానవ హక్కుల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నక్కా దుర్గారావు అనే విచారణ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. సోమవారం అతడు పోలీస్ స్టేషన్‌లోని బాత్రూంలో హ్యాంగర్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా దుర్గారావును పలు దొంగతనాల కేసులో పోలీసులు శుక్రవారమే అరెస్టు చేశారు. -
'ఎన్కౌంటర్ పై ఇప్పుడే నివేదిక ఇవ్వలేం'
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం కూలీలు ఎన్ కౌంటర్ అయిన ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం మంగళవారం పరిశీలించింది. ఎన్కౌంటర్ పై ఇప్పుడే నివేదిక ఇవ్వలేమని ఎన్హెచ్ఆర్సీ బృందం తెలిపింది. ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు దత్తు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పరిశీలించింది. అన్ని విభాగాల అధికారులను విచారణ చేస్తున్నామని, సమగ్ర నివేదికను కమిషన్‌కు సమర్పిస్తామని దత్తు తెలిపారు. నాలుగు రోజుల పాటు తిరుపతిలోనే ఉంటామని, ఉన్నతాధికారుల నుంచి అన్ని నివేదికలు తెప్పించుకుంటామని చెప్పారు. సచ్చినోడిబండ, చిగటీగలకోన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది. ఏప్రిల్ ఏడో తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. -
శేషాచలం ఎన్ కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎన్హెచ్ఆర్సీ
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శేషాచల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం పరిశీలిస్తోంది. ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు దత్తు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం మంగళవారం ఉదయం పరిశీలన చేపట్టింది. సచ్చినోడిబండ, చిగటీగలకోన ప్రాంతాల్లో ఈ బృందం పరిశీలన చేయనున్నట్టు సమాచారం. గత నెల ఏడో తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. -
ఎన్ కౌంటర్‌పై విచారణకు అంత నిర్లక్ష్యమా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయలేదని నిలదీసింది. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో పోలీసులకు ఉచ్చు బిగిస్తున్నట్లవుతోంది. గురువారం ఎన్ హెచ్ ఆర్సీ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ వద్ద పలు కేసులను విచారించింది. ముఖ్యంగా శేషాచలం ఎన్‌కౌంటర్‌తోపాటు వికారుద్దీన్, గత ఏడాది కిషన్‌బాగ్ పోలీసులపై కాల్పుల విచారణ ప్రధానంగా చేసింది. ఈ సందర్భంగా శేషాచలం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఏపీ సర్కార్ తరుపున అడిషనల్ డీజీ లీగల్ ఎఫైర్స్ వినయ్ రంజన్ నివేదిక సమర్పించారు. కాగా, ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి స్వయంగా వెళ్లి ఎన్ హెచ్ ఆర్సీ దర్యాప్తు చేయాలని నిర్ణయించుకొంది. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగించిన సెల్ నంబర్లనూ ఇవ్వాలని ఆదేశించింది. సమీపంలోని సెల్ టవర్ గుండా వెళ్లిన అన్ని కాంటాక్ట్ డిటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించింది. -
ఏపీ ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటివరకూ జ్యూడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలు ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. అలాగే పోలీసులు ఉపయోగించిన సెల్ నంబర్లు ఇవ్వాలని సూచించింది. అలాగే సమీపంలోని సెల్ టవర్ నుంచి వెళ్లిన అన్ని ఫోన్ కాల్స్ వివరాలను సమర్పించాలని పేర్కొంది. కాగా ఎన్‌కౌంటర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడిషనల్ డీజీ లీగల్ ఎఫైర్స్ వినయ్ రంజన్ ఈరోజు ఎన్హెచ్ఆర్సీ బృందానికి నివేదిక సమర్పించారు. కాగా శేషాచలం అడవుల్లో ఈనెల 7న జరిగిన ఎన్‌కౌంటర్‌పై పోలీసులపై ఉచ్చు బిగుస్తోంది. ఎన్కౌంటర్లో 20 మంది కూలీలను పోలీసులు కాల్చిచంపడం, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీం కోర్టు, రాష్ట్ర హై కోర్టు తీవ్రంగా పరిగణించడం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు కూలీలకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన రీపోస్టుమార్టం నివేదిక బుధవారం న్యాయస్థానం వద్దకు సీల్డు కవర్లో చేరడంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి విషయాలు వచ్చాయోనని పోలీసు బాసులు అంతర్మథనంలో ఉన్నారు. -
ఎన్‌కౌంటర్‌పై ఎన్హెచ్ఆర్సీ విచారణ
-
హైదరాబాద్‌కు ఎన్హెచ్ఆర్సీ బృందం
ఇరు రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లపై ఎన్హెచ్ఆర్సీ విచారణ హైదరాబాద్ : జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుంది. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ బాలకృష్ణన్‌తో పాటు సభ్యులు నగరానికి విచ్చేశారు. తెలంగాణలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌తోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై ఎన్హెచ్ఆర్సీ బహిరంగంగా విచారణ చేపట్టింది. అలాగే నందికొట్కూరు వేంపెంటలో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామస్తులు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దానిపై కూడా ఈ బృందం విచారణ చేపట్టనుంది. -
'చిత్తూరు ఎన్కౌంటర్ సాక్షులకు రక్షణ కల్పించండి'
-
'చిత్తూరు ఎన్కౌంటర్ సాక్షులకు రక్షణ కల్పించండి'
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్ సాక్షులకు, పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులకు రక్షణ కల్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఆర్పీసీ 176 ప్రకారం ఎన్‌కౌంటర్‌పై జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని పేర్కొంది. సోమవారం ఎన్హెచ్ఆర్సీ శేషాచలం ఎన్కౌంటర్ కేసును విచారించింది. ఈ నెల 23న హైదరాబాద్‌లో ఈ కేసు తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, అటవీ అధికారుల పేర్లను వెల్లడించాలని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఎన్కౌంటర్లో ఉపయోగించిన ఆయుధాలను సీజ్ చేయాలని, ఎఫ్ఐఆర్, డైరీ ఇతర వివరాల్ని భద్రపరచాలని ఆదేశించింది. 2010 పోస్ట్‌మార్టం నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం ప్రక్రియను వీడియో తీయాలని సూచించింది. శేషాచలం ఎన్కౌంటర్ ప్రత్యక్ష సాక్షులు శేఖర్, బాలచంద్ర మీడియా ముందుకు వచ్చారు. మూడో సాక్షి వాంగ్మూలాన్ని ఎన్హెచ్ఆర్సీ హైదరాబాద్‌లో తీసుకోనుంది. ఈ వివరాలను ఎన్హెచ్ఆర్సీ న్యాయవాది బృందా గ్రోవర్ వెల్లడించారు. -
'ఎన్ కౌంటర్ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు హాజరయ్యారు'
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవిలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించి సోమవారం ఎన్ హెచ్ఆర్సీ(జాతీయ మానవ హక్కుల సంఘం)ముందు ప్రత్యక్ష సాక్షులు హాజరైనట్లు చైర్మన్ బాలకృష్ణన్ తెలిపారు. వారిచ్చే వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాంమని ఆయన స్పష్టం చేశారు. శేషాచల ఎన్ కౌంటర్ పై ఇప్పటికే తమకు మూడు ఫిర్యాదులు అందాయన్నారు. సాక్షులకు ప్రాణాహాని ఉందన్న అంశానికి సంబంధించి వారి సమాధానం ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ణన్ తెలిపారు. -
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసుల జారీ
న్యూఢిల్లీ: అంధులైన ఇద్దరి విద్యార్థులపై జరిగిన లైంగిక దాడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ఎన్హెచ్ఆర్సీ తప్పు పట్టింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ కమిషనర్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఈ విషయమై మీడియాలో వచ్చిన కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటాగా స్వీకరించింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని సాంఘిక సంక్షేమ విభాగం సెక్రటరీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరింది. ఎన్హెచ్ఆర్సీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నవంబర్ 14(బాలల దినోత్సవం) 2013న పశ్చిమ ఢిల్లీలోని అమర్ కాలనీలో ఉన్న ఓ అంధుల సంస్థలో ఇద్దరు విద్యార్థులపై లైంగిక దాడి జరిగింది. ఆ ఇద్దరు విద్యార్థులు 3వ తరగతి చదువుకొంటూ ఆ సంస్థ వసతి గృహంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో వారిని ఉపాధ్యాయుడే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కానీ అతడు ఎవరో అంధులైన గుర్తించ లేకపోయారు. కానీ సహచర విద్యార్థుల సహాయంతో వైస్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని స్కూల్ అధికారులు గోప్యంగా ఉంచారు. పోలీసులు సంబంధిత టీచర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ ఎలాంటి ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదు. ఈ ఘటన సమాచారాన్ని మీడియా ద్వారా ఎన్హెచ్ఆర్సీ తెలుసుకొని పరిశీలించింది. ఇందులో వాస్తవాన్ని గ్రహించింది. బాలల మానవ హక్కులను ఉల్లంఘించిన తీవ్ర సమస్యగా ఎన్హెచ్ఆర్సీ పరిగణించింది. ఈ మేరకు తక్షణమే సమాధానం చెప్పాలని సంబంధిత అధికారులను కోరుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఎన్‌హెచ్‌సీ పేర్కొంది. -
బాలికపై లైంగిక దాడిపై మీ స్పందనేది?
న్యూఢిల్లీ: పదోతరగతి చదువుతున్న బాలికపై లైంగికదాడికి ఉసిగొల్పిన గ్రామపంచాయతీపై కేసు విషయమై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నా యూపీలోని ఘజియాబాద్ జిల్లా అధికారయంత్రాంగం(జీడీఏ) పట్టించుకోకపోవడాన్ని మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) తప్పు పట్టింది. ఈ మేరకు గురువారం ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను కమిషన్ సుమోటోగా స్వీకరించి ఈ నోటీసు జారీ చేసింది. ఘజియాబాద్ పరిధిలోని మురద్‌నగర్ గ్రామ పంచాయతీ ఓ కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి చేసి, అనంతరం ఆ కుటుంబానికి చెందిన పదోతరగతి చదువుతున్న బాలికపై 4 యువకులు లైంగికదాడికి పాల్పడేలా ఉసికొల్పింది ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. నిందితులను ఐదుసార్లు చెప్పులతో కొట్టి వదిలేయాలని పంచాయతీ కుటుంబ సభ్యులను సూచించింది. దీనికి ఆ కుటుంబ సభ్యులు అంగీకరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించింది. ఈ విషయమై మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిని ఎన్‌హెచ్‌సీ పరిశీలించింది. మీడియా కథనంలో వివిరాలులిలా..సెప్టెంబర్ 30వ తేదీన పాఠశాల నుంచి తిరిగి వస్తున్న పదోతరగతి చదువుతున్న బాలికను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ నలుగురు యువకులపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా రాజీ పడాలని పోలీసులు కూడా ఆ కుంబ సభ్యులను బెదిరించినట్లు పేర్కొంది. -
బాధిత కుటుంబానికి రూ.ఐదు లక్షల పరిహారం
న్యూఢిల్లీ: కానిస్టేబుల్ చేతిలో అత్యాచారానికి గురై న బాలికను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆదుకుంది. సంఘం ఆదేశాల మేరకు ఈమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షల పరిహారం చెల్లించింది. రిడ్జ్రోడ్డు ప్రాంతంలో ఈ 12 ఏళ్ల బాలికపై 2012, ఫిబ్రవరి 10న కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. తదనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉన్నతాధికారులు ఇతనిపై సస్పెన్షన్ వేటు విధించారు. మందిర్‌మార్గ్ స్టేషన్లో ఇతనిపై సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదయింది. కానిస్టేబుల్ అత్యాచారం చేయడాన్ని గమనించిన బాలిక బంధువు.. అక్కడే ఉన్న కొందరు కూలీల సాయంతో నింది తుణ్ని బంధించారని విచారణ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. మందిర్‌మార్గ్ స్టేషన్ పోలీసులు సమర్పించిన ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే ఇతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అందుకే ఇతణ్ని సస్పెం డ్ చేసినట్టు పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి బాలిక మానవ హక్కులను హరించాడని వ్యాఖ్యానించింది. జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు బాలిక పేరున రూ.ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై వచ్చే వడ్డీని ఆమె సంరక్షకుడికి అందజేయవచ్చని కమిషన్ ఆదేశాల్లో పేర్కొంది. బాధితురాలికి 18 ఏళ్ల నిండిన తరువాత నగదు ఆమెకే చెందుతుందని తెలియజేసింది. -
ఢిల్లీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: మధ్యాహ్న భోజనం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయమై నాలుగు వారాల్లో సమగ్ర నివేదికను అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) గురువారం నోటీసులు జారీ చేసింది. తూర్పు ఢిల్లీలోని పత్పర్గంజ్ ప్రాంతంలో ఉన్న సర్వోదయ కన్యావిద్యాలయలో చదువుతున్న 7 -14 మధ్య వయస్సు ఉన్న 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలని ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీచేసింది. అలాగే ఘటనపై తీసుకున్న చర్యలను గురించి నివేదిక అందజేయాలని డీసీపీ(తూర్పు)ను ఆదేశించింది. ఆ రోజు విద్యార్థినులకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక పడి ఉండటం అందరూ గమనించారు. పాఠశాలకు ఈ భోజనాన్ని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ దళిత్ ఉతన్ శిక్షా సమితి సరఫరా చేస్తోంది. దీనిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా మళ్లీ అనుమతి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. -
భారతిపై చర్యలు తీసుకోవాలని చెప్పలేదు
న్యూఢిల్లీ: రాష్ట్ర న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై చర్యలు తీసుకోవాలని తాము ఢిల్లీ పోలీసులకు నిర్దిష్టంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. దక్షిణ ఢిల్లీలోని ఖిడ్కీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో అర్థరాత్రి జరిగిన ఘటనపై అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రమే సూచించామని తెలిపింది. ఖిడ్కీ ఘటనకు సంబంధించి సోమ్‌నాథ్ భారతిపై చర్యలు తీసుకోవాలని తాము ఢిల్లీ పోలీసులను ఆదేశించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయని పేర్కొంది. అయితే తాము అటువంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. నాటి ఘటనపై తాము స్వయంగా విచారణ చేపట్టామని తెలిపింది. సంబంధిత అధికారుల నుంచి నివేదికల కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సామాజిక కార్యకర్త షెహజాద్ పూనావాలా నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దానిని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు పంపామని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. ఆ ఫిర్యాదుపై ఎనిమిది వారాల్లోగా సరైన చర్య తీసుకోవాలని మాత్రమే కోరామని వివరించింది. ఆ ఫిర్యాదుపై ఎటువంటి చర్య తీసుకోవాలో పోలీసులు నిర్ణయిస్తారని ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధి అన్నారు. ఎవరిపై, ఏ చర్య తీసుకోవాలో తాము మాత్రం సూచించలేదని స్పష్టం చేశారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలపై ఆప్ నాయకుడు సోమ్‌నాథ్ భారతి స్పందిస్తూ, ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు. తాను చట్టాలను గౌరవిస్తానని, ఎన్హెచ్ఆర్సీ ఏమి రాసినప్పటికీ, ఎఫ్ఐఆర్ను అధిగమించి ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారమే దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘వారు నా నియోజకవర్గానికి వెళ్లి అక్కడి ప్రజలను ప్రశ్నించవచ్చు’’ అన్నారు. ‘‘ఎన్హెచ్ఆర్సీ తన అధికారులను నా నియోజకవర్గానికి పంపి, ఆ రోజు జరిగింది సరైందో కాదో అక్కడి వారిని అడిగి తెలుసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించడం జరిగిందో లేదో తెలుసుకోవాలి. కనీసం నిజానిజాలను తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి. ఉగాండా మహిళలు సైతం నా వద్దకే భద్రత కోసం వస్తారు’’ అని చెప్పుకున్నారు. విదేశీయులు వ్యభిచారం, మాదక పదార్థాల రాకెట్లను నడుపుతున్నారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులో న్యాయశాఖ మంత్రిగా ఉన్న సోమ్‌నాథ్ భారతీ, తమ మద్దతుదారులతో కలిసి జనవరి 15న అర్థరాత్రి సమయంలో ఖిడ్కీ ఎక్స్టెన్షన్ చేరుకుని, విదేశీ మహిళల నివాసాలపై సోదాలు జరపాలని, వారిని అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. కానీ మంత్రి ఆదేశాలను పాటించడానికి పోలీసులు నిరాకరించారు. మంత్రి చర్య ఆ తరవాత వివాదానికి దారితీసింది. ఈ ఘటన అనంతరం తమను వేధించారని ఆరోపిస్తూ కొంతమంది ఆఫ్రికన్ మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలపై మాలవీయనగర్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎయిమ్స్‌లో తమపై వైద్య పరీక్షలు నిర్వహించిన తీరు అవమానకరంగా ఉందని ఓ మహిళ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మూత్రపరీక్ష కోసం శాంపిల్ ఇవ్వవలసిం దిగా మంత్రి, ఆయన వెంటనున్నవారు అందరి ఎదుట కోరారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన దర్యాప్తు సంఘం సోమ్‌నాథ్ భారతిని తప్పుపట్టింది. ఖిడ్కీ ఎక్స్టెన్షన్లో సోమ్‌నాథ్ భారతి పాత్రను ఢిల్లీ మహిళా కమిషన్ కూడా ప్రశ్నించింది. అయితే మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మాత్రం సోమ్‌నాథ్ భారతి చర్యను గట్టిగా సమర్థించారు. విదేశీ మహిళలను అరెస్టు చేయాలన్న మంత్రి ఆదేశాలను పాటించేందుకు నిరాకరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆయన ధర్నా జరిపి సంచలనం సృష్టించారు. -
జస్టిస్ బాలకృష్ణన్‌కు వ్యతిరేకంగా ఆధారాల్లేవు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌కు వ్యతిరేకంగా ఆధారాలేవీ లభించలేదని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఒక అఫిడవిట్‌ను హోంమంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఆరోపణల ఆధారంగా జస్టిస్ బాలకృష్ణన్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించలేమని స్పష్టం చేసింది. ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నపుడు ఆయన ఆస్తులు, బంధువుల ఆస్తులు అపరిమితంగా పెరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జస్టిస్ బాలకృష్ణన్‌ను ఎన్హెచ్ఆర్సీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ‘కామన్ కాజ్’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యానికి స్పందనగా కేంద్రం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల డెరైక్టరేట్లు జరిపిన దర్యాప్తులో ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలేవీ లభించలేదని తెలిపింది. అంతేకాక, జస్టిస్ బాలకృష్ణన్ పదవిలో ఉన్నపుడు దుష్ర్పవర్తన కలిగిలేరని, అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు తేలలేదని, ఏదేని కేసులకు సంబంధించి డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు దొరకలేదని వివరించింది. కాబట్టి కేవలం ఆరోపణల ఆధారంగా బాలకృష్ణన్‌ను ఎన్హెచ్ఆర్సీ పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదని పేర్కొంది.