
నిర్భయ కంటే పెద్ద ఘటన...
బెజవాడ కాల్మనీ వ్యవహారం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాల్ మనీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ : బెజవాడ కాల్మనీ వ్యవహారం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాల్ మనీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ..ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
అలాగే కాల్మనీ వ్యవహారంపై వాస్తవలు నిగ్గు తేల్చేందుకు ఓ బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ సిరియాక్ జోసెఫ్
తెలిపారు. కాల్ మనీ సంఘటన నిర్భయ కంటే పెద్ద ఘటనగా ఆయన అభివర్ణించారు. రఘువీరాతో పాటు కాంగ్రెస్ నేతలు సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, జైరాం రమేష్ తదితరులు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ను కలిసిన వారిలో ఉన్నారు. భేటీ అనంతరం రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ కాల్ మనీ వ్యవహారానికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.