Callmoney
-
'వారిని సమాజం నుండి వెలివేయాలి'
ఢిల్లీ: కాల్‌మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉన్నందునే అసెంబ్లీలో చర్చకు చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిలా ఉన్నాయన్నారు. కాల్ మనీపై చర్చ జరగకుండా టీడీపీ అంబేడ్కర్ ను అడ్డుపెట్టుకుంటుందని మకపాటి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబేడ్కర్ అంటే గౌరవం ఉందని, దళితుల అభ్యున్నతి కోసం పార్టీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కాల్‌మనీపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను సమాజం నుండి వెలివేయాలని మేకపాటి రాజమోహన్ రావు డిమాండ్ చేశారు. -
కడపలో వడ్డీ వ్యాపారి అరెస్ట్
-
నిర్భయ కంటే పెద్ద ఘటన...
న్యూఢిల్లీ : బెజవాడ కాల్‌మనీ వ్యవహారం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాల్ మనీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ..ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీకి నోటీసులు జారీ చేసింది. అలాగే కాల్‌మనీ వ్యవహారంపై వాస్తవలు నిగ్గు తేల్చేందుకు ఓ బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ సిరియాక్ జోసెఫ్ తెలిపారు. కాల్ మనీ సంఘటన నిర్భయ కంటే పెద్ద ఘటనగా ఆయన అభివర్ణించారు. రఘువీరాతో పాటు కాంగ్రెస్ నేతలు సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, జైరాం రమేష్ తదితరులు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. భేటీ అనంతరం రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ కాల్ మనీ వ్యవహారానికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
నిర్భయ కంటే పెద్ద ఘటన...
-
కాల్‌మనీపై నోరువిప్పిన చంద్రబాబు
-
కాల్‌మనీపై నోరువిప్పిన చంద్రబాబు
► విజయవాడలో కల్తీ ఎక్కువైంది ► నిన్న నెయ్యి, మొన్న మద్యం, ఇప్పుడు కాల్ మనీ ► పసిగట్టడంలో నిఘా వ్యవస్థలు విఫలం ► కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు విజయవాడ: బెజవాడలో బెంబెలిత్తించిన కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. విజయవాడలో సోమవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు కాల్‌మనీపై నోరువిప్పారు. అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో ఆయన స్పందించక తప్పలేదు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. విజయవాడలో కల్తీ ఎక్కువ అయ్యిందని అని అన్నారు. మొన్న కల్తీ నెయ్యి, నిన్న కల్తీ మద్యం.. ఇప్పుడు కాల్‌మనీ అంటూ ధ్వజమెత్తారు. కాల్‌మనీ వ్యవహారంలో నిఘా వ్యవస్థలు విఫలమయ్యాయని అన్నారు. ఈ దారుణాలను ముందుగా పసిగట్టడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. వీటిపై ముందే సమాచారం రావాల్సిందని చెప్పారు. ఈ వ్యవహారంలో చిక్కుకున్న బాధితులెవ్వరూ అప్పులు తిరిగి చెల్లించొద్దని తెలిపారు. మహిళలపై దారుణాలకు ఒడిగట్టిన వారిపై నిర్భయ కేసులు పెట్టాలని సూచించారు. రాజధానిపై నిఘా ఉంటుంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. కాల్‌మనీ లాంటి ఘటనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇమేజ్ దెబ్బతింటుందని చంద్రబాబు తెలిపారు.