నిబంధనలకు విరుద్ధం: ఎన్‌హెచ్‌ఆర్‌సీ | Human rights panel issues notice to Maharashtra government | Sakshi
Sakshi News home page

నిబంధనలకు విరుద్ధం: ఎన్‌హెచ్‌ఆర్‌సీ

Published Thu, Aug 30 2018 2:27 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

Human rights panel issues notice to Maharashtra government - Sakshi

ఢిల్లీలో నిరసన వ్యక్తంచేస్తున్న సామాజిక కార్యకర్తలు

సాక్షి, న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు మానవహక్కుల కార్యకర్తల అరెస్టులన్నీ నిబంధలనలకు విరుద్ధంగా, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ జరిగాయని కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది.

‘మీడియాలో వార్తల ఆధారంగా చూస్తే.. ఈ ఐదుగురి గృహనిర్బంధం నిబంధలకు విరుద్ధంగా జరిగిందని కమిషన్‌ భావిస్తోంది. ఈ అరెస్టులను మానవ హక్కుల ఉల్లంఘనగానే చూస్తున్నాం’ అని ఎన్‌హెచ్చార్సీ సీనియర్‌ సభ్యుడొకరు తెలిపారు. నవలఖా ట్రాన్సిట్‌ రిమాండ్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈ అరెస్టుల విషయంలో కోర్టుకు పోలీసులు సరైన వివరణ ఇవ్వలేదనేది సుస్పష్టమైందన్నారు. ‘ఫరీదాబాద్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు సుధా భరద్వాజ్‌ ట్రాన్సిట్‌ రిమాండ్‌ పెండింగ్‌లో ఉంది.

ఈ ఘటనతో తనకు సంబంధం లేదని ఆమె కోర్టుకు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లోనూ తన పేరు లేదని.. కేవలం తన సిద్ధాంతం కారణంగానే అరెస్టు చేసి హింసిస్తున్నారని చెప్పారు’ అని ఎన్‌హెచ్చార్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.జెనీవాలోని ఓ ఎన్జీవో నుంచి కూడా మహారాష్ట్ర పోలీసులు ఈ ఏడాది జూన్‌లో ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తల (సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్‌ ధావ్‌లే, షోమాసేన్, మహేష్‌ రౌత్‌) ను అరెస్టు చేసినట్లు ఫిర్యాదు అందిన విషయాన్ని కమిషన్‌ వెల్లడించింది. ఈ అంశంలోనూ మహారాష్ట్ర డీజీపీకి జూన్‌ 29న నోటీసులు పంపామని, దీనిపై సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement