కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని జాతీయ మానవ హక్కుల కమిషన్
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించిన ఎన్‌హెచ్‌ఆర్సీ
అమలాపురం టౌన్: కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) ఆదేశించింది. బస్సు ప్రమాదం.. అందులో చోటుచేసుకున్న తప్పిదాలు, ట్రావెల్స్ యాజమాన్యాన్ని ప్రభుత్వం కాపాడుతోందంటూ పలు అభియోగాలతో తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన న్యాయవాది కుడు పూడి అశోక్ ఫిర్యాదు చేయగా ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణకు స్వీకరించింది.
మంగళవారం అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషన్ పంపిన ఉత్త ర్వుల నకళ్లను విడుదలచేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ స్పందించి దివాకర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.