న్యూఢిల్లీ, సాక్షి: ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం మంగళవారం ఉదయం NHRC యాక్టింగ్ చైర్ పర్సన్ విజయభారతిని కలిసి ఫిర్యాదు లేఖ అందజేసింది.
ప్రస్తుతం.. ఏపీలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిని మానవ హక్కుల సంఘం దృష్టికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు తీసుకెళ్లారు.
రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారు. పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డినీ నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న డీజీపీ పట్టించుకోవడం లేదు. వెంటనే జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని విచారణ జరపాలి. మానవహక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఎంపీలు కోరారు.
.. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని, యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని, రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని విజయభారతికి తెలియజేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఆమె.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎంపీలకు హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్‌ను కలిసిన బృందంలో వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ , మేడ రఘునాథ్ రెడ్డి , డాక్టర్ తనూజా రాణి, బాబురావు ఉన్నారు.
సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం: వైవీ సుబ్బారెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, ప్రతి కార్యకర్తకు తాము అండగా నిలబడతామని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.‘ప్రతి కార్యకర్తకు మేము అండగా నిలబడతాం.57 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు.12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదు.
హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను అరెస్టు చేయకుండా ఐదు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు.మా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ అంశాలన్నింటిని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాం.మా కార్యకర్తలను హింసించి వారి నుంచి అనుకూల స్టేట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు.తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరాం’అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఏపీలో శాంతిభద్రతలు లేవు: ఎంపీ గొల్లబాబురావు
చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగ నడుపుతోంది
రెడ్ బుక్ లో ఉన్న వారిని హింసిస్తున్నారు
ఇది రాక్షస రాజ్యం, నియంత రాజ్యం
ఏపీలో శాంతిభద్రతలు లేవు
డీజీపీ హోమ్ మినిస్టర్ పనిచేయడం లేదు
ఏపీ హోమ్ మినిస్టర్ కక్ష కట్టినట్టు మాట్లాడుతున్నారు
ప్రజలలోకి వెళ్లి అరాచకాలను ఎండగడతాం
కార్యకర్తలు తిరగబడితే పరిస్థితి ఏంటి..? ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్
ఇప్పటిదాకా మా కార్యకర్తలు శాంతియుతంగా ఉన్నారు
ఇక మా కార్యకర్తలు తిరగబడితే పరిస్థితి ఎక్కడికెళ్తుందో తెలియదు
ఇప్పటివరకు డిఫెన్స్ ఆడాం , ఇక ఆఫెన్స్ మొదలు పెడతే ఎలా ఉంటుందో
తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘాన్ని కోరా
అక్రమ అరెస్టులను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లా
పీఎం, సీఎం జోక్యం చేసుకొని ఎరాచకాన్ని ఆపాలి
సూపర్‌సిక్స్ అమలు చేయలేకే దాడులు: ఎంపీ మేడ రఘునాథ్‌రెడ్డి
సూపర్ సిక్స్ అమలు చేయలేక దాడులకు పాల్పడుతున్నారు
ఏపీలో అరాచక పాలనను ఆపాలని ఎన్ హెచ్ ఆర్ సినీ కోరాం
మా హయాంలో రెండు లక్షల 75 వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలు అందించాం
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలి
ప్రతిపక్షాన్ని అణిచివేసే ప్రయత్నాలను మానుకోవాలి
కార్యకర్తలకు అండగా ఉంటాం: ఎంపీ తనూజారాణి
సోషల్ మీడియా కార్యకర్తలకు మేము అండగా నిలబడతాం
వారిపై జరుగుతున్న వేధింపులను మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లాం
Comments
Please login to add a commentAdd a comment