compalint
-
‘డీజీపీ పట్టించుకోవట్లేదు’.. NHRCలో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ, సాక్షి: ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీల బృందం మంగళవారం ఉదయం NHRC యాక్టింగ్ చైర్ పర్సన్ విజయభారతిని కలిసి ఫిర్యాదు లేఖ అందజేసింది.ప్రస్తుతం.. ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిని మానవ హక్కుల సంఘం దృష్టికి వైఎస్సార్సీపీ ఎంపీలు తీసుకెళ్లారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారు. పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డినీ నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న డీజీపీ పట్టించుకోవడం లేదు. వెంటనే జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని విచారణ జరపాలి. మానవహక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఎంపీలు కోరారు. .. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని, యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని, రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని విజయభారతికి తెలియజేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఆమె.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎంపీలకు హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్‌ను కలిసిన బృందంలో వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ , మేడ రఘునాథ్ రెడ్డి , డాక్టర్ తనూజా రాణి, బాబురావు ఉన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం: వైవీ సుబ్బారెడ్డివైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, ప్రతి కార్యకర్తకు తాము అండగా నిలబడతామని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.‘ప్రతి కార్యకర్తకు మేము అండగా నిలబడతాం.57 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు.12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదు.హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను అరెస్టు చేయకుండా ఐదు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు.మా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ అంశాలన్నింటిని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాం.మా కార్యకర్తలను హింసించి వారి నుంచి అనుకూల స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు.తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ఎన్హెచ్ఆర్సీని కోరాం’అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఏపీలో శాంతిభద్రతలు లేవు: ఎంపీ గొల్లబాబురావుచంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగ నడుపుతోందిరెడ్ బుక్ లో ఉన్న వారిని హింసిస్తున్నారుఇది రాక్షస రాజ్యం, నియంత రాజ్యం ఏపీలో శాంతిభద్రతలు లేవుడీజీపీ హోమ్ మినిస్టర్ పనిచేయడం లేదుఏపీ హోమ్ మినిస్టర్ కక్ష కట్టినట్టు మాట్లాడుతున్నారుప్రజలలోకి వెళ్లి అరాచకాలను ఎండగడతాంకార్యకర్తలు తిరగబడితే పరిస్థితి ఏంటి..? ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ఇప్పటిదాకా మా కార్యకర్తలు శాంతియుతంగా ఉన్నారుఇక మా కార్యకర్తలు తిరగబడితే పరిస్థితి ఎక్కడికెళ్తుందో తెలియదుఇప్పటివరకు డిఫెన్స్ ఆడాం , ఇక ఆఫెన్స్ మొదలు పెడతే ఎలా ఉంటుందోతక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘాన్ని కోరాఅక్రమ అరెస్టులను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లాపీఎం, సీఎం జోక్యం చేసుకొని ఎరాచకాన్ని ఆపాలిసూపర్సిక్స్ అమలు చేయలేకే దాడులు: ఎంపీ మేడ రఘునాథ్రెడ్డిసూపర్ సిక్స్ అమలు చేయలేక దాడులకు పాల్పడుతున్నారుఏపీలో అరాచక పాలనను ఆపాలని ఎన్ హెచ్ ఆర్ సినీ కోరాంమా హయాంలో రెండు లక్షల 75 వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలు అందించాంప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలిప్రతిపక్షాన్ని అణిచివేసే ప్రయత్నాలను మానుకోవాలికార్యకర్తలకు అండగా ఉంటాం: ఎంపీ తనూజారాణిసోషల్ మీడియా కార్యకర్తలకు మేము అండగా నిలబడతాంవారిపై జరుగుతున్న వేధింపులను మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లాం -
బెంగాల్ గవర్నర్‌పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాష్ట్ర గవర్నర్ సీఏ ఆనంద బోస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో గవర్నర్ బీజేపీకి కోసం ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఆరోపణలు చేసింది. ఆయన కోల్‌కతాలోని ఓ రామాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో గవర్నర్ తన ఛాతికి ‘బీజేపీ లోగో’ ధరించారని టీఎంసీ పేర్కొంది. ఇలా గవర్నర్ బీజేపీ లోగో ధరించటం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపింది.లోక్‌సభ ఎన్నికల కోసం గవర్నర్ బీజేపీ ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌కు రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనలు ఉండకూడదని టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం మానేయాలని గవర్నర్‌కు ఆదేశించాలని పోల్ ప్యానెల్‌కు విజ్ఞప్తి చేసింది. తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని గవర్నర్పరై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. -
పవన్ కల్యాణ్‌పై ఈసీకి ఫిర్యాదు
న్యూఢిల్లీ: జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఫిర్యాదు చేశారు. బకెట్ గుర్తు ఉన్న నవరంగ్ పార్టీని పోటీ చేయొద్దని పవన్ కల్యాణ్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని షేక్ జలీల్ ఈసీని కోరారు. ఈసీకి ఫిర్యాదు ఇచ్చిన అనంతరం షేక్ జలీల్ మీడియాతో మాట్లాడారు. ‘ఎంపీ బాలశౌరి, నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఏపీ ఎన్నికలలో బకెట్ గుర్తు ఉన్న నా పార్టీని పోటీ చేయవద్దని పవన్ కల్యాణ్ బెదిరిస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నాపై గన్ పెట్టి బెదిరించాడు. హత్యాప్రయత్నం చేశాడు. ఏపీలో ఈసీ నా పార్టీకి బకెట్ గుర్తు కేటాయించింది. ..జనసేన గాజు గ్లాసు గుర్తు, నా పార్టీ బకెట్ గుర్తు ఒకేలా ఉంటుంది. అందుకే నా పార్టీ పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారు. రూ. 5 కోట్లు ఇస్తానని పవన్ కల్యాణ్ చెప్పాడు. అయినా వారి ప్రలోభాలకు లొంగలేదు. మేము లక్ష్మినారాయణ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్‌గా పోటీ చేస్తున్నాం. పవన్ కల్యాన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి’అని షేక్ జలీల్ అన్నారు. -
మునుగోడు: రాజగోపాల్‌రెడ్డికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట దక్కింది. రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదులకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. సుమారు రూ.5.24 కోట్ల బదిలీ జరిగిందని టీఆర్ఎస్ పార్టీ, రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే టీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారమైనవని ఈసీ తేల్చింది. రాజగోపాల్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాల్లేవని ఈసీ వెల్లడించింది. అంతేకాదు.. ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. పలువురు వ్యక్తులు, సంస్థలకు నగదు బదిలీ చేశారన్నది టీఆర్ఎస్ ఆరోపణ. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డికి చెందిన సంస్థ నుంచి సుమారు రూ.5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. నగదు లావాదేవీలపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు సమాధానం ఇవ్వాలంటూ రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈసీ నోటీసులకు రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన ఎన్నికల కమిషన్.. రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలి..: బండి సంజయ్ -
వందకు అరలీటర్ తక్కువగా పెట్రోల్..
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): మండల కేంద్రంలోని ఓపెట్రోల్ బంక్‌లో సోమవారం కృష్ణ అనే యువకుడు పెట్రోల్‌ను బాటిల్లో పోయించుకున్నాడు. బాటిల్లో రూ.వందకు అరలీటర్‌కు తక్కువగానే రావడంతో, పెట్రోల్ పోసిన వ్యక్తిని నిలదీశాడు. తర్వాత ఆ పెట్రోల్‌ను వేరే బాటిల్లో పోసి, మరోసారి పోయగా సుమారుగా లీటర్ వరకు వచ్చింది. ఇప్పుడు ఎలా సరిగ్గా పోశారని, ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని ఆ యువకుడు నిలదీశాడు. అదే నేరుగా బండిలో పోసుకుంటే దూరం వెళ్లే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ విషయంపై పెట్రోల్ బంక్ యజమాని ప్రేంసాగర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మిషన్‌లోని పైపు లీకేజీ, టెక్నికల్ సమస్య వల్ల ఇబ్బంది ఏర్పడిందని, మరమ్మతు చేసే వరకు ఆ మిషన్‌ను పక్కన పెట్టి, మరో మిషన్‌తో పెట్రోల్ పోయిస్తున్నామని చెప్పారు. చదవండి: సికింద్రాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ స్కామ్ -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వెంకటకృష్ణలపై చర్యలు తీసుకోండి
నరసరావుపేట: తాము ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అపకీర్తిపాలు చేస్తూ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రేరేపిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఏబీఎన్ న్యూస్ చానల్ రిపోర్టర్ వెంకటకృష్ణలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ కౌన్సిలర్ నెలటూరి మురళి, ఎస్సీ నాయకుడు తలారి నాని రూరల్ పోలీసులను కోరారు. ఈ మేరకు సోమవారం రాత్రి వారిద్దరూ ఎస్ఐ టి.లక్ష్మినారాయణరెడ్డికి .ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి ఎంతో ప్రజారంజకంగా పాలన చేస్తున్నారన్నారు. ఆయన అన్ని మతాలు, కులాలు, ఆచారాలు, అభిప్రాయాలను గౌరవిస్తూ అందరికీ ప్రాధాన్యతనిస్తూ పాలన చేస్తున్నారన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ న్యూస్ చానల్లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా క్రిస్టియానిటీని అభివృద్ధి చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. గత జూన్ 27న ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్‌లో ఆర్కే కొత్త పలుకులు పేరుతో జీసెస్‌తో మాట్లాడానని సీఎం అన్నట్లు, తాను దైవదూతనని అధికారులతో చెప్పినట్లుగా ఎలాంటి ఆధారాలు లేకుండా రాశారన్నారు. మతాలను కించపరుస్తూ విద్వేషాలను రెచ్చగొట్టేలా చేస్తున్న రాధాకృష్ణ, వెంకటకృష్ణలపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. -
భోజనం డబ్బు మా నాన్న తినేస్తున్నాడు
ఒరిస్సాలో ఆరవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి తన ఊరి నుంచి పది కిలోమీటర్లు నడిచి కలెక్టర్‌ని కలిసింది– ‘నా మధ్యాహ్న భోజనం డబ్బు మా నాన్న తినేస్తున్నాడు’ అని. ముంబైలో లాక్డౌన్ వల్ల స్కూల్ మానేసిన ఒక పిల్లవాడు చెరగని చిరునవ్వుతో టీ అమ్ముతూ ‘ఇన్నాళ్లు ఇంటి కోసం అమ్మ కష్టపడింది. లాక్డౌన్ వల్ల ఆమెకు పని లేదు. నేను స్కూల్ మానేసి కష్టపడుతున్నాను. ఇంటి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా’ అని మొత్తం సోషల్ మీడియాలో స్పందన తెచ్చాడు. హక్కులను అడగలేకపోవడమూ బాధ్యతలను విస్మరించడమూ అలవాటైపోయిన పెద్దలకు ఈ పిల్లలు నేర్పే పాఠాలు అవసరమైనవి. ఒరిస్సాలోని కేంద్రపడ జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట ఒక 11 ఏళ్ల చిన్నారి నిలుచుని ఉందని లోపల కలెక్టర్ సామర్త్‌వర్మకు తెలిసింది. ఆ చిన్నారిని లోపలికి పిలిస్తే ఫిర్యాదు రాసిన కాగితాన్ని కలెక్టర్‌కు అందించింది. ఫిర్యాదు కన్నతండ్రి పైనే. ‘మా నాన్న నా మధ్యాహ్న భోజనం డబ్బులు తీసేసుకుంటున్నాడు’ అని ఆ చిన్నారి ఫిర్యాదు చేసింది. ‘నా డబ్బు నాకు ఇప్పించండి’ అని కోరింది. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఒరిస్సా ప్రభుత్వం ప్రతి స్కూలు విద్యార్థి అకౌంట్లో రోజుకు 8 రూపాయల లెక్కన నగదు వేస్తోంది. ప్రతి విద్యార్థికి రోజుకు 150 గ్రాముల బియ్యం స్కూల్లో అందజేస్తోంది. అకౌంట్ లేని విద్యార్థికి సంబంధించిన గార్డియన్ అకౌంట్లో డబ్బు జమ అవుతాయి. ఈ అమ్మాయి తల్లి 2019లో మరణించింది. తండ్రి ఇంకో పెళ్లి చేసుకొని కూతురిని గెంటేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు మేనమామ దగ్గర చదువుకుంటోంది. అయితే ఆ అమ్మాయికి అకౌంట్ ఉన్నా తండ్రి డబ్బు తన అకౌంట్లో పడే ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాదు స్కూల్‌కు వెళ్లి కూతురి వాటా బియ్యాన్ని కూడా తెచ్చుకుంటున్నాడు. కూతురు ఇది భరించలేకపోయింది. కలెక్టర్ దగ్గరకు వెళితేనే న్యాయం జరుగుతుందని తన ఊరి నుంచి కేంద్రపడకు పది కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ ఫిర్యాదు చేసింది. కలెక్టర్ వెంటనే స్పందించారు. ‘ఇక మీదట అమ్మాయి డబ్బు అమ్మాయి అకౌంట్లో వేయండి’ అని ఆదేశించారు. అంతే కాదు తండ్రి ఇప్పటి వరకూ ఎంత తీసుకున్నాడో అది కూడా ఆమె అకౌంట్లో వేసే ఏర్పాటు చేశారు. విద్యా శాఖాధికారి అమ్మాయి బియ్యం అమ్మాయికే ఇవ్వమని హెడ్మాస్టర్ను ఆదేశించారు. ఆరవ తరగతి అమ్మాయి. తన హక్కును సాధించింది. పౌరులకు కూడా ఎన్నో హక్కులు ఉంటాయి. ప్రభుత్వాలను డిమాండ్ చేసి వాటిని సాధించుకోవచ్చు. పోరాడితే అవి సాధ్యమవుతాయి కూడా. కాని ప్రభుత్వాలను అడగడం కొందరికి తెలియదు. కొందరికి చేతకాదు. కొందరికి నిర్లిప్తత. కొందరికి టైమ్ ఉండదు. కాని మార్పు ప్రయత్నిస్తేనే జరుగుతుంది. ఈ అమ్మాయి ప్రయత్నించి ఆ సంగతి నిరూపించింది. బాధలను కరిగించే టీ దక్షిణ ముంబైలోని నాగ్‌పడా ఇరుకు వీధుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఒకటిన్నర వరకు ఆ పిల్లవాడు కనిపిస్తాడు. ఒక సైకిల్ తొక్కుతూ, దాని వెంట వేడి టీ ఉన్న ఫ్లాస్క్‌ను కట్టుకుని.. టీ అమ్ముతూ... తోడు అతడు నవ్వే అద్భుతమైన నవ్వు ఉచితం. ‘మా నాన్న హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. అమ్మ బస్ అటెండర్‌గా పని మొదలుపెట్టింది. మా అమ్మకు నేను చదువుకోవడం ఇష్టం. ఎయిర్‌ఫోర్స్‌లో చేరి పైలట్ అవ్వరా అనేది. చెప్పొద్దూ... నాక్కూడా స్కూలుకెళ్లడం నచ్చేసింది. ఇంగ్లిష్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. మా అమ్మ కష్టం చూసి నేను కూడా కష్టపడి చదవడం మొదలుపెట్టాను. కాని లాక్డౌన్ వచ్చింది. బస్సులన్నీ ఆగిపోయాయి. అమ్మకు పని పోయింది. ఇంట్లో డబ్బులు అయిపోయాయి. నా హుండీలో చిల్లర కూడా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మార్చిలో నేను నా ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడాను. మళ్లీ వాళ్లను చూడలేదు. బడి సంగతి మర్చిపోయి ఒక కిరాణా కొట్లో రోజుకు వంద రూపాయలకు పని చేయడం మొదలుపెట్టాను. కాని అవి ఏం సరిపోతాయి. అప్పుడే ఒక అంకుల్ టీ అమ్ముతూ కనిపించాడు. ఆయన్ను చూసి నేను కూడా టీ అమ్మడం మొదలుపెట్టాను. ఒక చాట్‌భాండార్ అంకుల్ తన పక్కన మూల మీద కాసేపు ఆగే వీలు ఏర్పాటు చేశాడు. అక్కడ లేదంటే వీధుల్లో తిరుగుతూ అమ్ముతాను. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఒకటిన్నర వరకూ అమ్ముతాను. ఈ చుట్టుపక్కల నేను అందరికీ తెలిసిపోయాను తెలుసా? మా అమ్మ అంటుంది– నీది బాధల్ని కరిగించే టీరా అని. కాని ఆమె అంత సంతోషంగా లేదని అనిపిస్తోంది. దానికి కారణం నేను స్కూలుకు దూరం కావడమే. నాకేమో బాధ లేదు. అమ్మ మా కోసం బాధ్యతగా పని చేసినప్పుడు నేను కూడా చేయాలి కదా. ఇక స్కూల్ అంటారా? ఇప్పుడు కాకపోతే మళ్లెప్పుడైనా వెళతాను’ అంటాడు నవ్వుతూ. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’లో ఈ పిల్లవాడి కథనం వచ్చాక విశేషమైన స్పందన వచ్చింది. ఎందరో షేర్ చేశారు. సాయానికి ముందుకు వచ్చారు. పిల్లవాడి పాజిటివ్ ఆటిట్యూడ్‌ని మెచ్చుకున్నారు. ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కుటుంబానికి సంబంధించి ఆ బాధ్యతలను తప్పక నెరవేర్చాల్సి ఉంటుంది. కాని బాధ్యతలను విస్మరించేవారు, బాధ్యతల నుంచి పారిపోయేవారు, బాధ్యతను మరొకరి నెత్తిన వేసి తప్పించుకునేవారు సమాజంలో ఎందరో ఉంటారు. వారు ఈ పిల్లవాడి నుంచి ఏమైనా పాఠం నేర్చుకోవచ్చా? – సాక్షి ఫ్యామిలీ -
వేధిస్తున్నారన్నా పట్టించుకోకపోవడంతో...
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడా పరిధిలో పోలీసుల నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థిని ఉసురు తీసింది. తన పొరుగున ఉండే కొంతమంది వ్యక్తులు లైంగికంగా వేధిస్తూ, కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంతో మనస్తాపం చెందిన 11వ క్లాసు విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63 లో నివసించే పాఠశాల విద్యార్థిని తన ఇంటి పక్కనే ఉండే వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్ కెళ్లింది. అయితే పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆందోళన చెందిన ఆ విద్యార్థిని గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. తన పక్క ఫ్లాట్ లో నివసించే వ్యక్తులు తమ కోరిక తీర్చాలని వేధిస్తున్నారని, లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి రేప్ చేస్తామని బెదిరించారంటూ తన సోదరి రాసుకున్న సూసైడ్ నోట్ ఆమె బ్యాగ్ లో చూసినట్లు మృతురాలి సోదరుడు తెలిపాడు. దీంతో అదే రోజు పోలీసు స్టేషన్ కెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించకోలేదన్నాడు. ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్లే తన చెల్లెలు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాదు చేసి నాలుగు రోజులు గడిచినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థిని తండ్రి తెలిపారు. అందుకే తన బిడ్డ ఈ నిర్ణయం తీసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారి దినేష్ యాదవ్ స్పందించారు. ఈ వ్యవహారంలో స్థానిక పోలీసులను వివరణ కోరామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.