Fraud In Petrol Bunk In Adilabad - Sakshi
Sakshi News home page

Adilabad: వందకు అరలీటర్‌  తక్కువగా పెట్రోల్‌..

Published Tue, Oct 19 2021 8:46 AM | Last Updated on Tue, Oct 19 2021 9:17 AM

Fraud In Petrol Bunk In Adilabad - Sakshi

బాటిల్‌లో అరలీటర్‌ తక్కువగా వచ్చిన పెట్రోల్‌

సాక్షి, జన్నారం(ఆదిలాబాద్‌): మండల కేంద్రంలోని ఓపెట్రోల్‌ బంక్‌లో సోమవారం కృష్ణ అనే యువకుడు పెట్రోల్‌ను బాటిల్‌లో పోయించుకున్నాడు. బాటిల్‌లో రూ.వందకు అరలీటర్‌కు తక్కువగానే రావడంతో, పెట్రోల్‌ పోసిన వ్యక్తిని నిలదీశాడు. తర్వాత ఆ పెట్రోల్‌ను వేరే బాటిల్‌లో పోసి, మరోసారి పోయగా సుమారుగా లీటర్‌ వరకు వచ్చింది.

ఇప్పుడు ఎలా సరిగ్గా పోశారని, ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని ఆ యువకుడు నిలదీశాడు. అదే నేరుగా బండిలో పోసుకుంటే దూరం వెళ్లే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ విషయంపై పెట్రోల్‌ బంక్‌ యజమాని ప్రేంసాగర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మిషన్‌లోని పైపు లీకేజీ, టెక్నికల్‌ సమస్య వల్ల ఇబ్బంది ఏర్పడిందని, మరమ్మతు చేసే వరకు ఆ మిషన్‌ను పక్కన పెట్టి, మరో మిషన్‌తో పెట్రోల్‌ పోయిస్తున్నామని  చెప్పారు.  

చదవండి: సికింద్రాబాద్‌ కేంద్రంగా కాల్‌ సెంటర్‌ స్కామ్‌

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement