customer
-
ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్ ఇతనే..
ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదైనా కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ విడుదలైంది. దీంతో ముంబైలోని యాపిల్ స్టోర్‌కు కస్టమర్లు పోటెత్తారు. స్టోర్ తెరవక ముందు నుంచే బారులు తీరారు.ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు స్థానిక స్టోర్‌లో ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్‌గా మారాడు. ఇందు కోసం ముందు రోజే ఆయన ముంబైలోని బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు చేరుకున్నాడు. 21 గంటల పాటు లైన్లో వేచి ఉన్నాడు. ముందు రోజు రాత్రి ఉజ్వల్ అక్కడికి చేరుకోగానే పదుల సంఖ్యలో జనం క్యూలో అతనితో చేరారు. ఉదయానికి వందల మంది వచ్చేశారు. యాపిల్ స్టోర్ తలుపులు తెరుచుకోగానే ఉజ్వల్ మొదటి కస్టమర్‌గా లోపలికి అడుగుపెట్టాడు.యాపిల్ అభిమాని అయిన ఉజ్వల్ ఐఫోన్ తొలి కస్టమర్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారి ముందు వరుసలో ఉంటుంటాడు. గత సంవత్సరం ఐఫోన్ 15 విడుదలైనప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మొదటి వ్యక్తిగా 17 గంటలు వేచి ఉన్నాడు. యాపిల్ ఉత్పత్తుల పట్ల అతనికున్న క్రేజ్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తోంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. ఇలాంటి లింక్స్‌పై క్లిక్ చేయొద్దు
మోసపూరిత సందేశాలను పంపి అమాయక ప్రజలను దోచుకునేవారు ఎక్కువైపోతున్నారు. ఇటీవల ఎస్బీఐ కస్టమర్లను టార్గెట్ చేసుకుని కొందరు ఫ్రాడ్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. దీంతో కస్టమర్లను అప్రమత్తం చేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది.ఎస్బీఐ కస్టమర్లకు వస్తున్న సందేశాలు చట్టబద్దమైనవి కావు. బ్యాంక్ ఎప్పుడూ ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ ద్వారా లింక్స్ లేదా యాప్స్ పైల్స్ పంపదు. కాబట్టి వస్తున్న సందేశాలకు ఎవరూ స్పందించవద్దని వెల్లడించింది.జాగ్రత్తగా ఉండండి, ఎస్బీఐ రివార్డ్‌లను రీడీమ్ చేయడానికి APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయమని మీకు సందేశం కూడా వచ్చిందా జాగ్రత్త ?.. అటాంటి ఫైళ్లను క్లిక్ చేయవద్దు, డౌన్లోడ్ చేయవద్దని ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ట్వీట్ చేసింది.సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్లుప్రియమైన వాల్యూ కస్టమర్, మీ ఎస్బీఐ నెట్‌బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్ల (రూ.9980.00) గడువు ఈరోజు ముగుస్తుంది. ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్స్టాల్ ద్వారా రీడీమ్ చేసుకోండి. మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుందని మెసేజ్ చేస్తున్నారు. ఇది నిజమే అని చాలామంది మోసపోతున్నారు.ఇలాంటి సందేశాలకు మోసపోకుండా ఉండాలంటే?మెసేజ్ ఎవరు పంపించారు అనే విషయాన్ని ఖచ్చితంగా ధ్రువీకరించండి. నిజంగానే బ్యాంక్ నుంచి సందేశం వచ్చిందా? అని తెలుసుకోవాలి.తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేయడం వంటివి మానుకోవాలి.మీ బ్యాంక్ నుంచి అనుమానాస్పద సందేశాన్ని స్వీకరించినట్లయితే.. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి.బ్యాంకుకు సంబంధించిన అధికారిక యాప్స్ లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే లావాదేవీలను జరపండి.ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత, ఆర్థిక సంబంధిత లాగిన్ వివరాలను పంచుకోవద్దు.ఏవైనా అనుమానాస్పద సందేశాలు లేదా ఫిషింగ్ ప్రయత్నాల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయాలి.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/GhheIEkuXp— PIB Fact Check (@PIBFactCheck) July 31, 2024 -
‘ఉబర్’ రైడ్‌కు కోట్లలో బిల్లు..! షాక్ అయిన కస్టమర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్‌గా తాను వెళ్లే రూట్లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరమే అయినందున రూ.62 బిల్లు చూపించింది. మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్‌లో దిగి బిల్లు పే చేద్దామనుకునే సరికి దీపక్ అవాక్కయ్యాడు. ఏకంగా రూ.7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం దీపక్ వంతైంది. దీపక్‌కు ఇంత భారీ బిల్లు రావడానికి సంబంధించిన వీడియోను ఆయన స్నేహితుడు ఆశిష్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు. దీనిపై వీడియోలో స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రయాన్‌కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్‌కు కోట్లలో బిల్లు రావడంపై ఉబర్ స్పందించింది. ‘భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. మాకు కొంత సమయమిస్తే దీనిపై అప్డేట్ ఇస్తాం’అని ఉబర్ సందేశం పంపింది. ఇదీ చదవండి.. వీల్ చైర్లో వచ్చాడు.. విల్ పవర్ చూపాడు -
మరీ ఇంత మోసమా? ఐఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాక్..
ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువులు కొన్ని సందర్భాల్లో మారిపోతూ ఉంటాయి. ఒక వస్తువు బుక్ చేస్తే.. మరో వస్తువు డెలివరీ అయిన సందర్భాలు చాలానే వున్నాయి. ఇటీవల కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అమెజాన్‌లో ఒక ఐఫోన్ 15 ఆర్డర్ చేశారు. అయితే అతనికి డెలివరీ అయిన ఫోన్‌ను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే అతనికి వచ్చిన ఫోన్ నకిలీది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. వావ్ అమెజాన్ ఇన్.. ఒక నకిలీ ఐఫోన్ 15ని డెలివరీ చేసింది. బాక్స్‌లో కేబుల్ కూడా లేదు. మొత్తం డబ్బా, ఇలాంటి సమస్యను ఎవరైనా ఎదుర్కొన్నారా? అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ రెస్పాండ్ అవుతున్నారు. ఈ సంఘటనపైన అమెజాన్ స్పందించి ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి, ఆర్డర్ వివరాలను తెలియజేస్తే.. 6 నుంచి 12 గంటల్లో మీకు తప్పకుండా సహాయం చేస్తామని వెల్లడించింది. ఐఫోన్ కోసం వెచ్చించిన మొత్తాన్ని రీఫండ్ చేయమని బాధితుడు అమెజాన్‌ను కోరారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే? Waah @amazonIN delivered a Fake iPhone 15. Seller is Appario. Tagged with “Amazon choice” No cable in the box. Total Dabba. Has anyone faced similar issue? pic.twitter.com/QjUqR7dKSU — Gabbar (@GabbbarSingh) February 23, 2024 -
చెప్పిన మైలేజీ రాలేదు.. కంపెనీకి షాకిచ్చిన కస్టమర్
ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఓ కస్టమర్. తాను కొన్నకారుకు కంపెనీ చెప్పిన మైలేజీ రాలేదని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చాలా ఏళ్ల తర్వాత ఆ కస్టమర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కస్టమర్‌కు రూ. లక్ష చెల్లించాలని కంపెనీని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. వివరాలోకి వెళ్తే.. 2004లో రాజీవ్ శర్మ అనే కస్టమర్ లీటరుకు 16-18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్న ప్రకటనలతో ఆకర్షితుడై మారుతీ సుజుకీ కారును కొనుగోలు చేశారు. తీరా కొన్న తర్వాత ఆ కారు లీటరుకు 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజీ ఇస్తుండటంతో అసంతృప్తి చెందిన రాజీవ్ శర్మ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌ను ఆశ్రయించారు. రూ.4 లక్షల మొత్తాన్ని వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, బీమాతో సహా కంపెనీ నుంచి ఇప్పించాలని కోరారు. కస్టమర్ అభ్యర్థనను కొంతమేరకు పరగణనలోకి తీసుకున్న జిల్లా ఫోరమ్ రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై మారుతీ సుజుకీ రాష్ట్ర కమిషన్‌కి అప్పీల్‌కు వెళ్లింది. అలా కేసు ఎన్సీడీఆర్సీకి చేరింది. ఇరు పక్షాలు లిఖితపూర్వక వాదనలు సమర్పించాయి. శర్మ తన వాదనను ఆగస్టు 7, 2023న సమర్పించగా, మారుతి సుజుకి నవంబర్ 2, 2023న స్పందించింది. మారుతీ సుజుకి ప్రకటన మైలేజ్ క్లెయిమ్‌లు తప్పుదారి పట్టించేవిగా, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) మునుపటి తీర్పులను సమర్థించింది. కస్టమర్‌కు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు షాకిచ్చింది. తాజా రివ్యూలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక వడ్డరీట్లను యథాతథంగా ఉంచినప్పటికీ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను సైలెంట్‌గా పెంచేసింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) గరిష్టంగా 10 పాయింట్ల బేసిస్ పాయింట్ల వరకు పెంచింది బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతేకాదు బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు, ఇదే సమయంలో బెంచ్‌మార్క్ PLR 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ సవరించిన రేట్లు సెప్టెంబర్ 25 నుంచే అమల్లో ఉన్నాయి. (హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్) తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు ఓవర్ నైట్ రుణాలపై MCLR 10 bps 8.50 శాతం నుండి 8.60 శాతానికి పెరిగింది. నెల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెరిగి 8.55 శాతం నుండి 8.65 శాతానిచేరింది మూడు నెలల MCLR 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.85 శాతంగా ఉంటుంది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ను 9.05 శాతం నుంచి 9.10కి పెంచింది. ఇక ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.20 శాతంగానూ, రెండేళ్ల కాలానికి గాను 9.20గాన ఉంటుంది. అదే మూడేళ్ల వ్యవధి రుణాలపై వర్తించే ఎంసీఎల్ఆర్ 9.25 శాతంగా ఉంటుంది. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
ఆన్లైన్ షాపింగ్ వైపు .. కొత్త తరం చూపు
కొత్త తరం కస్టమర్లు (11–26 ఏళ్ల వయస్సువారు– జెన్ జీ) కొనుగోళ్ల కోసం భారీగా ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్యాషన్ ఇండియా వీపీ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెగ్మెంట్లలో కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తిగా ఉంటున్నట్లు ఆయన వివరించారు. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో ప్రివ్యూ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించి ఫ్యాషన్, బ్యూటీకి ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుండగా మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌గా ఉంటున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. ఈసారి ఏజీఐఎఫ్లో అమ్మకాలు కొత్త గరిష్ట స్థాయిని తాకగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. రాబోయే పండుగ సీజన్లో ఆన్లైన్ అమ్మకాలు 20 శాతం వరకు వృద్ధి చెంది రూ. 90,000 కోట్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది.. రెస్టారెంట్లన్నీ..
రెస్టారెంట్లన్నీ సాధారణంగా కస్టమర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటిని ఇస్తుంది. మహా అయితే ప్రత్యేకంగా ఉండేందుకు మరింత హంగులు ఆర్భాటాలతో కస్టమర్లని ఆకర్షించే యత్నం చేస్తాయి అంత వరకే. కానీ దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరం ఉన్న కస్టమర్ల సంగతిని గుర్తించవు అనలా లేక పరిగణించరు అని చెప్పాలో తెలియదు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవాళ్ల గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి వాళ్లు రెస్టారెంట్‌కి వచ్చి.. మెను చూసి ఆర్డర్ ఇవ్వాలంటే మరొకరి సాయం తీసుకోవాల్సిందే. లేదా వారు ఫ్రెండ్స్నో, బంధువులనో తోడు తెచ్చుకోవాల్సిందే. ఇంతవరకు ఎవ్వరికీ.. వారు కూడా మెనుని చూసి ఆర్డర్ చేసుకుంటే బావుంటుంది అనే ఆలోచనే రాలేదు. ఆ దిశగా అడుగులు వేయాలేదు . కానీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆ దిశగా అడుగులు వేసి ఆచరణలోకి తీసుకొచ్చి చూపింది. ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. ఇండోర్‌లోని గురుకృపా రెస్టారెంట్ దృష్టిలోపం ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. వారు కూడా స్వయంగా మెను చూసి ఆర్డర్ చేసుకుని తిసేలా చేసింది ఆ రెస్టారెంట్. మహేష్ దృష్టిహీన్ కళ్యాణ సంఘ నుంచి కొంతమంది దృష్టిలోపం ఉన్న పిల్లలను రెస్టారెంట్‌కి ఆహ్వానించారు. బ్రెయిలీ లిపిలో చెక్కబడిన మెనూ కార్డ్ సాయంతో ఆ పిల్లలంతా తమ ఆర్డర్లను స్వయంగా వారే తెప్పించుకుని తిన్నారు. ఈ కార్యక్రమాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంతమంది రెస్టారెంట్ ఆపరేటర్లు కలిసిన తర్వాత ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. యంగ్ ఇండియన్ గ్రూప్ చైర్పర్సన్ భావన గనేదివాల్ మాట్లాడుతూ..అన్ని రెస్టారెంట్లవారు ఇలా చేసేలా పురికొల్పేందుకు మహేష్ దృష్టిహీన్ కళ్యాణ్ సంఘ్ నుంచి దృష్టి లోపం ఉన్న పిల్లలను పిలిపించి ట్రయల్ వేశాం. అది నిజంగా సక్సెస్ అయ్యింది. వారికోసం ఈ బ్రెయిలీ లిపి మెను కార్డ్‌లను చండీగఢ్ నుంచి తెప్పించి. అలాంటి పది కార్డ్‌లను ఇతర రెస్టారెంట్లకు పంపుతాం. ఇక నుంచి రెస్టారెంట్లన్నీంటిలో ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ మెనూ కార్డ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్ని ఇతర ప్రాంతాల్లో కూడా చేయాలనుకుంటున్నాం. రెస్టారెంట్లలో ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు దృష్టిలోపం ఉన్న కస్టమర్లు ఇక ఇబ్బంది పడరు, పైగా ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. అని చెప్పుకొచ్చారు భావన గనేదివాల్. ఇక సదరు గురుకృపా రెస్టారెంట్ యజమాని సిమ్రాన్ భాటియా మాట్లాడుతూ.. యంగ్ ఇండియా గ్రూప్ మమ్మల్ని సంప్రదించి బ్రెయిలీ లిపిలో మెను కార్డ్‌లను తయారు చేయమని అడిగింది. ఇది మాకు కొత్తగా అనిపించినా.. నచ్చింది. ఇంతవరకు అలాంటి సౌకర్యం ఏ రెస్టారెంట్లలోనూ లేదు. పిల్లలంతా అలా బ్రెయిలీ లిపి మెను కార్డులను చూసి ఆర్డర్ చేసినప్పుడూ చాలా ఆనందంగా అనిపించిందన్నారు రెస్టారెంట్ యజమాని భాటియా. అలాగే దృష్టిలోపం పిల్లలు సైతం తాము మెను కార్డ్‌ని చదవి ఆర్డర్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు. ఇది తమకి ఎవ్వరిపై ఆధారపడటం లేదన్న ఫీలింగ్‌ని ఇచ్చిందన్నారు. అందరికీ ఇలాంటి సౌకర్యం అందాలని కోరుకుంటున్నారు. ఏదీఏమైన ఇలాంటి ఆలోచన రావడమే గ్రేట్ అనుకున్నదే తడువుగా ఆచరించి చూపడం ఇంకా గ్రేట్ కదూ!. (చదవండి: వాట్! ఈజిప్టు మమ్మీ నుంచి పరిమిళాలు వెదజల్లే "సెంట్"! షాకింగ్ విషయాలు వెల్లండించిన శాస్త్రవేత్తలు!) -
దోపిడీకి వచ్చి, అందరినీ చూసి.. ‘ఇదేందిది’ అంటూ తోక ముడిచిన దొంగ!
ఏదైనా దుకాణం లేదా స్టోర్‌లో లూటీ జరినప్పుడు అక్కడ అలజడి నెలకొంటుంది. లేదా ఆగంతకుడి చేతిలో ఆయుధం ఉంటే ఆ ప్రాంతంలో మౌనం నెలకొంటుంది. అయితే ఇటీవల అట్లాంటాలో దీనికి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఒక నెయిల్ సెలూన్లో లూటీ చేసేందుకు వచ్చిన ఆగంతకుని ఎటువంటి పరిస్థితి ఎదురయ్యిందంటే.. దానిని ఎవరూ ఊహించలేరు. ఈ లూటీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసిన జనం తెగ నవ్వుకుంటున్నారు. నెయిల్ సెలూన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నదాని ప్రకారం అక్కడి సిబ్బంది కస్టమర్లకు సర్వీస్ చేస్తున్నారు. ఇంతలో ఒక ఆగంతకుడు అరుచుకుంటూ నెయిల్ సెలూన్‌లోకి ప్రవేశించి.. ‘అందరూ కింద కూర్చుని, నోరుమూసుకుని మీ దగ్గరున్న సొమ్ము ఇవ్వండి’ అని డిమాండ్ చేశాడు. ఆ ఆగంతకుని చేతిలో ఒక బ్యాగు ఉంది. దానిలో ఆ ఆగంతకుడు చేతులు పెట్టి, దీనిలో ఒక తుపాకీ ఉంది. బయటకు తీసి ఎవరినైనా కాల్చేస్తానని బెదిరించాడు. అయితే ఆగంతకుని అరుపులకు, బెదిరింపులకు అక్కడున్న ఎవరూ కించిత్తు కూడా భయపడలేదు. వారంతా ఎంతో రిలాక్స్ అవుతూ, ఫోను చూసుకుంటూ కూర్చున్నారు. అక్కడున్నవారంతా ఈ విధంగా ప్రవర్తిస్తారని ఆ ఆగంతకుడు అస్సలు ఊహించలేదు. చివరికి సెలూన్ యజమాని కూడా ఏ మాత్రం స్పందించకపోవడాన్ని ఆ ఆగంతకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇంతలో ఒక మహిళ తన ఫోనును బయటకు తీయగా, ఆ ఆగంతకుడు దానిని లాక్కున్నాడు. అయితే ఆమె ఏమాత్రం రియాక్ట్ అవకుండా మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సెలూన్లో ఉన్న పరిస్థితులను చూసి ఆ ఆగంతకుడు ఉత్త చేతులతోనే బయటకు జారుకున్నాడు. ఆ సెలూన్ రెగ్యులర్ కస్టమర్ లీజా బోరె మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో సెలూన్ యజమాని కొద్దిగా భయపడ్డాడని, వినియోగదారులెవరూ స్పందించలేదని, దీంతో ఆ దొంగ పారిపోయాడని తెలిపారు. ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది? -
ఫుడ్ కోసం వెయిటింగ్.. కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్.. ఇంత లేజీగా ఉన్నావేంటి!
ఇంట్లో ఎన్ని వెరైటీ వంటకాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రెస్టారెంట్లలో పుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీ పుణమ్యా అని ఆన్లైన్ డెలివరీ యాప్‌లు రాకతో చేతిలో మొబైల్ ఉంటే చాలు నచ్చిన పుడ్ ఇంటి దగ్గరకే డోర్ డెలివరీ అవుతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఇందులో మరో కోణం కూడా దాగుంది. వివిధ కారణాలతో డెలివరీ ఏజెంట్లు కస్టమర్లు ఆర్డర్ పెట్టిన ఆహారాన్ని అందివ్వడంతో విఫలమవుతున్నారు. అలా జరిగినప్పుడు, వారు తరచుగా సాకులు చెబుతారు. మరో విషయం ఏమిటంటే.. కొన్ని సందర్భాల్లో డెలివరీ ఏజెంట్లు కస్టమర్ల ఆహారాన్ని స్వయంగా తింటున్నారు కూడా. తాజాగా ఈ తరహా ఘటనే సోషల్‌మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన పిల్లల కోసం ఆన్లైన్లో పుడ్ ఆర్డర్ పెట్టి ఎదురుచూస్తుంటాడు. డెలివరీ సమయం సమీపిస్తున్న ఆహారం రాకపోవడంతో డెలివరీ ఏజెంట్‌కి ఈ విషయమై మెసేజ్ చేస్తాడు. ఆ సంభాషణలో.. సారీ బ్రదర్ మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్‌ని నేనే తిన్నట్లు కస్టమర్‌కు మెసేజ్ చేస్తాడు. దీంతో రూల్స్ ఉల్లంఘించినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తారని ఏజెంట్‌కు కస్టమర్ మెసేజ్ చేశాడు. అందుకు ఏజెంట్ వెటకారంగా స్పందిస్తూ, "మీరు దానిని నిరూపించలేరు, మిత్రమా అంటూ బదులిచ్చాడు. డెలివరీ ఏజెంట్ తమ హౌసింగ్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించలేదని నిరూపించడానికి తమ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నట్లు పేర్కొంటాడు కస్టమర్. అయితే, ఏజెంట్ కస్టమర్‌ను ఫుడ్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావ్ ఇంత సోమరిగా ఉన్నావేంటి అని పిలవడంతో వీరి మధ్య సంభాషణ కాస్త సీరియస్‌గా మారింది. చివరిలో ఆ డెలివరీ ఏజెంట్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహారం అద్భుతంగా ఉందని, అతను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తిన్నానని నిర్ధారిస్తూ సంభాషణను ముగించాడు. ప్రస్తుతం ఈ చాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు డెలివరీ ఏజెంట్ చేసిన పనికి మండిపడుతున్నారు. చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు -
కస్టమర్ల ఫోన్ నంబర్లు తీసుకోవద్దు..రీటైల్ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: మొబైల్ నంబరు ఇవ్వని కస్టమర్లకు రిటైలర్లు సర్వీసులు, రిఫండ్లను నిరాకరిస్తున్న ఉదంతాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇటువంటి విధానాలను మానుకునేలా తమ తమ పరిధిలోని రిటైలర్లను కట్టడి చేయాలని పరిశ్రమల సమాఖ్యలకు సూచించింది. ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే సమయంలో కస్టమర్ల సమ్మతి లేకుండా వారి మొబైల్ నంబర్లు తీసుకోకుండా చూడాలని పేర్కొంది. సీఐఐ, ఫిక్కీ, అసోచాం, పీహెచ్‌డీసీసీఐ, రిటైలర్ల అసోసియేషన్ ఆర్ఏఐ, అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు లేఖ రాశారు. ఉత్పత్తి లేదా సర్వీసు కొనుగోలుకు వినియోగదారు తన మొబైల్ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయొద్దని సూచించారు. ‘మొబైల్ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయడం వల్ల పలు సందర్భాల్లో కస్టమర్లు తమ అభీష్టానికి విరుద్ధంగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాత నుంచి వారికి రిటైలర్లు అసంఖ్యాకంగా మార్కెటింగ్, ప్రమోషనల్ సందేశాలు పంపిస్తుండటం సమస్యాత్మకంగా ఉంటోంది‘ అని సింగ్ పేర్కొన్నారు. విక్రయ సమయంలో.. కస్టమరుకు ఇష్టం లేకపోయినా, మొబైల్ నంబరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం అనేది వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. మొబైల్ నంబరు ఇవ్వలేదన్న కారణంతో వినియోగదారుకు విక్రయించకపోవడం, రిటర్నులు .. ఎక్ఛేంజీలు .. రిఫండ్లను అనుమతించకపోవడం లేదా వినియోగదారు ఫిర్యాదులను పరిష్కరించకపోవడం అనేవి అనుచిత వ్యాపార విధానాల కిందికే వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమాఖ్యలు సహకరించి, రిటైలర్లకు తగు సూచనలను ఇవ్వాలని పేర్కొన్నారు. -
Swiggy: స్విగ్గీ నిర్వాకం.. వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. మండిపడ్డ కస్టమర్
స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ శాకాహారికి చేదు అనుభవం ఎదురైంది. పార్సిల్ ఓపెన్ చేసి తింటున్న ఆమెకు ఊహించని విధంగా బిర్యానీలో చికెన్ ముక్క కన్పించింది. దీంతో స్వచ్ఛమైన వెజిటేరియన్ అయిన ఆమె.. స్విగ్గీ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిర్యానీలో మాంసం ముక్క ఫొటో, ఆర్డర్ బిల్లు వంటి వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మండిపడింది. ఈ కస్టమర్ పేరు నటాషా భరద్వాజ్. తన విశ్వాసాలకు విఘాతం కల్గించేలా చేసిన స్విగ్గీపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాదన్నారు. నిజమైన శాకాహారులు స్విగ్గీలో ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అని ఇతర కస్టమర్లకు సూచించారు. If you’re a strict vegetarian (like me) think twice before ordering from @Swiggy ! I ordered biriyani rice with aloo which is clearly MARKED AS VEGETARIAN on the platform and I found a piece of meat (could be chicken, mutton or anything!) in the rice. Such grave errors are… pic.twitter.com/h7K57CPML4 — Natasha Bhardwaj (@bhardwajnat) April 11, 2023 ఈ విషయంపై స్విగ్గీ ఎగ్జిక్యూటివ్స్‌కు ఫిర్యాదు చేస్తే వారికి అసలు బాధగా లేదని నటాషా అసహనం వ్యక్తం చేశారు. అది నాన్ వెజ్ రెస్టారెంట్ అని, అయినా స్విగ్గీలో వెజ్ రెస్టారెంట్‌గా ఎందుకు మార్క్ చేసుకున్నారో తెలియడం లేదని వారు బదులిచ్చారని చెప్పారు. ఈ మహిళ ట్వీట్‌కు స్విగ్గీ కూడా బదులిచ్చింది. మా రెస్టారెంట్లలో ఇలాంటి మిక్స్‌ప్‌లు జరుతాయని ఊహించలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆర్డర్ ఐడీ చెప్పాలని సూచించింది. దీంతో మహిళ ఆర్డర్ ఐడీని కూడా స్విగ్గీకి షేర్ చేసింది. చదవండి: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు.. మరో 7,830 మందికి పాజిటివ్.. -
ఉబర్ డ్రైవర్ ఔదార్యం! అపరిచిత ప్రయాణికుడి కోసం..
మనకు తెలియని వ్యక్తి కనీసం రూ. 10 ఇవ్వాలన్న ఆలోచిస్తాం. అలాంటి ఎవరో తెలియని వ్యక్తికి ఏకంగా ఒక అవయవాన్నే దానం చేయడం అంటే వామ్మో అని పిస్తుంది కదా. ఔను ఇక్కడొక ఉబర్ డ్రైవర్ అలానే చేశాడు. ఆ వ్యక్తి డ్రైవర్‌కి తెలియదు. తను డ్రాప్ చేయాల్సిన కస్టమర్ మాత్రమే. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన బిల్ సుమీల్ అనే వ్యక్తి డయాలసిస్ సెంటర్‌కి వెళ్లాలని ఉబర్ బుక్ చేసుకున్నాడు. ఇంతలో తనని పికప్ చేసుకునేందుకు కారు వచ్చింది. బిల్ సుమీల్ ఆ కారులో ప్రయాణిస్తూ డ్రైవర్ టిమ్ లెట్స్తో మాటలు కలిపాడు. తన గురించి, తన అనారోగ్యం గురించి డ్రైవర్‌తో పంచుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణం ముగిసి గమ్యస్థానానికి చేరుకోగానే.. సదరు ఉబర్ డ్రైవర్ టిమ్ తన కిడ్నిని సుమీల్‌కి దానం చేసేందుకు రెడీ అయ్యాడు. విచిత్రంగా అతడి కిడ్నీ సుమీల్‌కి సూట్ అయ్యింది. బహుశా దేవుడు ఇందుకోసమే మిమ్మల్ని నా కారులో వచ్చేలా చేశాడని డ్రైవర్ టిమ్ సుమీల్‌కి చెప్పాడు కూడా. కిడ్నీ బదిలీ కోసం సుమీల్‌కి ఆపరేషన్ చేశారు. అది విజయవంతమయ్యింది. ఆ తర్వాత నుంచి ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. అయితే సుమీల్ డెలావేర్ యూనివర్సిటీ మూత్రపిండ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నాడు. ఉబర్ డ్రైవర్ టిమ్ లైట్స్ జర్మనీలో నివశిస్తున్నాడు. అయితే ఇద్దరూ టచ్‌లోనే ఉన్నారని తమ స్నేహాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అందుకు సంబంధించిన కథనాన్ని ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆ ఉబర్ డ్రైవర్ ఔదార్యానికి ఫిదా అవుతూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: విమానంలో అనౌన్సర్‌గా బీజేపీ ఎంపీ..షాక్‌లో ప్రయాణికులు) -
జొమాటో యాప్ ద్వారా బుకింగ్, డెలివరీ గంటైనా రాకపోవడంతో..
యశవంతపుర: జొమాటో యాప్ ద్వారా బుక్ చేసిన భోజనం సమయానికి రాకపోవడంతో ఓ వ్యక్తి కేసు వేయగా రూ. 3 వేల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరం జొమాటోను ఆదేశించింది. బెంగళూరు రాజాజీనగరలో 2022 ఏప్రిల్ 14న రాత్రి అభిషేక్ అనే వ్యక్తి యాప్ ద్వారా భోజనం ఆర్డర్ చేశాడు. గంట సేపైనా భోజనం అందలేదు. దీంతో ఆర్డర్ క్యాన్సిల్ చేయగా, డబ్బు కూడా వాపస్ రాలేదు. ఈ బాగోతంపై బాధితుడు శాంతినగరంలోని వినియోగదారుల ఫోరంలో రూ. లక్ష పరిహారం ఇప్పించాలని కేసు వేశాడు. విచారణ జరిపిన ఫోరం.. రూ. 3 వేల పరిహారాన్ని అర్జీదారుకు అందజేయాలని జొమాటోను ఆదేశించింది. చదవండి: వచ్చేస్తోంది, మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ విడుదల ఎప్పుడంటే? -
కస్టమర్ కంప్లైంట్.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం!
ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌కు వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. ఓ యూజర్ డబ్బులు చెల్లించినా మొబైల్ డెలివరీ చేయనందుకు రూ. 42,000 జరిమానా చెల్లించాలని బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఫ్లిప్‌కార్ట్‌కు జరిమానా విధించింది. అందులో కస్టమర్ పేమెంట్ చేసిన రూ. 12,499 లకు 12 శాతం వార్షిక వడ్డీ, రూ. 20,000 జరిమానా, చట్టపరమైన ఖర్చుల కోసం రూ. 10,000 చెల్లించాలని అధికార యంత్రాంగం తెలిపింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని రాజాజీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యూజర్ ఫ్లిప్‌కార్ట్‌పై ఫిర్యాదు చేశారు. ‘తాను జనవరి 15, 2022న మొబైల్‌ని బుక్ చేసుకున్నాను. వెబ్సైట్లో పేర్కొన్న విధంగా పూర్తి నగదుని చెల్లించి రోజులు గడుస్తున్నా కంపెనీ తనకు మొబైల్ డెలివరీ చేయలేదు. సర్వీసు విషయంలో ఫ్లిప్‌కార్ట్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఫిర్యాదులో ’పేర్కొంది. కస్టమర్ కేర్ సెంటర్‌కు ఎన్ని సార్లు కాల్ చేసినా ఫలితం లేకపోయేసరికి చివరికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపింది. చదవండి: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ! -
హోండా కార్లకు ఐడీబీఐ బ్యాంక్ రుణాలు
హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా ఐడీబీఐ బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హోండా కార్స్ కస్టమర్లకు సులభ రుణ పథకాలను ఐడీబీఐ బ్యాంక్ ఆఫర్ చేయనుంది. అందుబాటు ధరలకే, వేగంగా, సులభంగా రుణాలను కస్టమర్లు పొందొచ్చని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, నామమాత్రపు ప్రాసెసింగ్ చార్జీలపై రుణాలు అందిస్తున్నట్టు తెలిపాయి. చదవండి: రెండో సారి నెం.1గా నిలిచిన ప్రముఖ కంపెనీ -
కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగానికి చెక్.. ఇకపై అలాంటివి కుదరదు!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డేటా రక్షణ బిల్లుతో కస్టమర్ డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధమైన యూజర్ల లొకేషన్ ట్రాకింగ్ వివాదానికి సంబంధించిన కేసును టెక్ దిగ్గజం గూగుల్ సెటిల్ చేసుకున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లొకేషన్ ట్రాకింగ్ సిస్టం నుండి వైదొలిగినప్పటికీ యూజర్లను తప్పు దోవ పట్టించి, వారి లొకేషన్‌ను ట్రాక్ చేయడాన్ని కొనసాగించిందంటూ గూగుల్‌పై కేసు నమోదైంది. దీన్ని 392 మిలియన్ డాలర్లకు గూగుల్ సెటిల్ చేసుకుంది. ఇలా కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగం కాకుండా డేటా రక్షణ బిల్లు పటిష్టంగా ఉంటుందని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో లోక్‌సభలో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం మరింత బలమైన నిబంధనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
రూ.75,000 కోట్లకు చేరుకున్న సెక్యూరిటైజేషన్
ముంబై: సెక్యూరిటైజేషన్ పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 48 శాతం పెరిగి రూ.75,000 కోట్లకు చేరుకున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఇన్వెస్టర్లు (బ్యాంకులు/ఆర్థిక సంస్థలు) రిటైల్ రుణాల పట్ల నమ్మకం చూపించడం ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. సెక్యూరిటైజేషన్ అంటే ఒక రుణదాత ఒక రుణంపై భవిష్యత్తులో తనకు వసూలు కావాల్సిన మొత్తాలను కొంత తక్కువకు వేరే రుణదాతకు విక్రయించడం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కరోనా రెండో విడత వల్ల సెక్యూరిటైజేషన్ మార్కెట్ ప్రతికూలతలను చూసి నట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. అయతే, ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులకు కొంత వెనుకాడడం వల్ల కొన్ని డీల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి అర్ధభాగంలో పూర్తి కాలేదని వెల్లడించింది. మార్ట్గేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ రుణాలు అతిపెద్ద వాటా కలిగి ఉన్నాయి. మార్కెట్ పరిమాణంలో 40%గా ఉన్నాయి. దీని తర్వాత వాణిజ్య వాహన రుణాలు 30%, సూక్ష్మ రుణాల వాటా 13% చొప్పున ఉంది. మార్ట్గేజ్, బంగారం, సూక్ష్మరుణాల వాటా కలిపి 62 శాతంగా ఉంది. పాస్ త్రూ సర్టిఫికెట్ల (పీటీసీలు) వాటా ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 44 శాతం నుంచి 38 శాతానికి తగ్గింది. సెక్యూరిటైజేషన్ మార్కెట్లో సగం మేర రుణాలను ప్రైవేటు బ్యాంకులు సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు పావు వంతు కొనుగోలు చేశాయి. చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన -
సాంబార్ లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావనడంతో..
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీలోకి సాంబార్ అడిగినందుకు ఓ కస్టమర్‌పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడిచేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ రంగాభుజంగా సినిమా థియేటర్‌కు ఎదరుగా ఉన్న గోకుల్ టిఫిన్ సెంటర్‌కు సోమవారం ఉదయం ఉపేందర్‌రెడ్డి అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి టిఫిన్ చేసేందుకు వచ్చి ఇడ్లీ తీసుకున్నారు. అనంతరం ఇడ్లీలోకి సాంబార్ కావాలని హోటల్ సిబ్బందిని కోరగా వారు లేదంటూ సమాధానం చెప్పడంతో సాంబారు లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావంటూ ఉపేందర్‌రెడ్డి సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ విషయంలో ఉపేందర్‌రెడ్డి, హోటల్ సిబ్బందికి మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో హోటల్ పనిచేస్తున్న కాలీదాస్ అనే వ్యక్తి పూరిచేసే కర్రతో దాడిచేసి ఇద్దరిని గాయపరిచాడు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం ఉపేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్‌ట్యాక్స్ రద్దు -
ప్చ్..అధ్వాన్నంగా భారతీయ బ్యాంకుల్లో మొబైల్ యాప్స్ సేవలు!
భారత్‌కు చెందిన బ్యాంకులు కస్టమర్లకు మొబైల్ సర్వీసుల్ని అందించడంలో విఫలమవుతున్నాయి. కస్టమర్ల ఖర్చుల్ని, అప్పుల్ని అర్థం చేసుకోవడం, ఉపయోగకరమైన బడ్జెట్లను రూపొందించడం, ఆర్ధిక వృద్ధి సాధించేలా సలహాలు ఇవ్వడం, వారి ఆర్థిక స్థితుల్ని ట్రాక్ చేయడంలో బ్యాంకుల పనితీరు సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఫర్ రెస్టర్..మనీ మేనేజ్మెంట్ సామర్థ్యాలలో దేశీయ బ్యాంకులకు అత్యల్ప స్కోర్‌ను ఇచ్చింది. తాజా క్యూ3లో మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు అందించే ఏ బ్యాంక్‌కు కూడా 60శాతం మించి స్కోర్ ఇవ్వలేదు. అందుకు కారణం బ్యాంకులు కస్టమర్లకు అందించే సర్వీసులపై అసంతృప్తి వ్యక్తం చేయడమేనని తెలుస్తోంది. బ్యాంకుల్లో నావిగేషన్ బాగున్నప్పటికీ యాప్స్‌లో సెర్చ్ బార్లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ముఖ్యంగా వినియోగదారులు చేసిన ట్రాన్సాక్షన్లను గుర్తించేలా యాప్‌లో సులభమైన పద్దతులు లేవని ఫర్ రెస్టర్ తెలిపింది. దీంతో పాటు బ్యాంకులు గోప్యతా విధానాన్ని ప్రదర్శిస్తున్నాయి. వారి సమస్యల పరిష్కారం కోసం బ్యాంకులు పబ్లిష్ చేసే ఆర్టికల్స్ సామాన్యులకు అర్ధం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. "చాలా బ్యాంకులు యాప్స్‌ను బిల్డ్ చేయడంలో రాజీ పడడం లేదు. మంచి విషయమే. మొబైల్ బ్యాకింగ్ వ్యవస్థతో యూజర్లకు ఉపయోగం, సులభంగా ఉంటుంది. తద్వారా బ్యాంకుల్ని వినియోగించేందుకు మక్కువ చూపుతారని పేర్కొంది. -
నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్: ఓలాకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ సేవల సంస్థ ఓలాకు ఎదురు దెబ్బ తగిలింది. ఒక కస్టమర్ నుంచి ఎక్కువ చార్జీ వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన బాధితుడు జబేజ్ శామ్యూల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కోర్టు నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్ కారణంగా మొత్తం రూ. 95,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!) వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఓలా క్యాబ్స్ నుండి పరిహారం కోరుతూ ఫిర్యాదు దారు జబేజ్ శామ్యూల్ 2021, అక్టోబరు 19న నాలుగు గంటలకు ఓలా క్యాప్ బుక్ చేసుకున్నాడు. భార్య, మరొకరితో కలిసి క్యాబ్ ఎక్కినపుడు అంతా డర్టీగా కనిపించింది. ఏసీ ఆన్ చేయమన్నా, డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అంతేకాదు నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శామ్యూల్‌ని మధ్యలోనే దింపేశాడు. దీనిపై ఓలాను సంప్రదించినప్పటికీ ఫలితం కనబడలేదు. పైగా రూ. 861 ఫీజు చెల్లించాల్సిందిగా పదేపదే కోరడంతో విసిగిపోయిన కస్టమరు దాన్ని చెల్లించారు. (భారీ నష్టాలు: సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం) దీంతో హతాశుడైన శామ్యూల్ వినియోగదారుల చట్టం సెక్షన్ 35 కింద హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ - III ను ఆశ్రయించారు. దాదాపు రూ.5 లక్షల పరిహారం ఇప్పించాల్సిందిగా కోరారు. దీన్ని విచారించిన కోర్టు 5 లక్షల అంటే, చాలా పెద్ద మొత్తం అని అభిప్రాయపడినకోర్టు, ట్రిప్ చార్జీ, రూ. 861 వడ్డీతో (సంవత్సరానికి 12శాతం చొప్పున), అలాగే మానసిక వేదనకుగాను రూ. 88వేలు, ప్రొసీడింగ్స్ ఖర్చుల నిమిత్తం రూ. 7 వేలు కలిపి మొత్తం 95 వేల రూపాయలు చెల్లించాలని కమిషన్ ఓలా క్యాబ్‌ను ఆదేశించింది. -
అరే నాయన ఏంట్రా బాబు ఇది? తినాలా? వద్దా!
ఇటీవల కాలంలో కొన్ని హోటల్లో సదరు కస్టమర్లకు ఎదురైన చేదు అనుభవాలను చూస్తే బయట ఫుడ్ తినాలంటేనే భయపడేలా చేశాయి. మొన్నటికి మొన్న ఒక ఆమె కూతురు కోసం దోశ ఆర్డర్ చేస్తే...ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము కుబుసం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరొకసారి సాంబార్ బొద్దింకల అవయవాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అవన్నీ ఒకత్తెయితే ఇక్కడొక కస్టమర్ ఆర్డర్ చేసిన టిఫిన్ ప్లేట్లో బతుకున్న బల్లిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వివరాల్లోకెళ్తే...చండీగఢ్‌లో ప్రసిద్ధి చెందిన ఈలాంటే మాల్లోని సాగర్ రతన్ ఫుడ్ కోర్ట్‌లో గురిందర్ చీమా అనే కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది. చోలే భాతురే(పూరీ, శనగల కర్రీ) ఆర్డర్ చేశాడు. సదరు కస్టమర్ పూరీ తిందాం అనుకునేటప్పటికీ ప్లేట్లో బతికున్న బల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో సదరు కస్టమర్ ఫిర్యాదు మేరకు ఆరోగ్యశాఖాధికారులు రంగంలోకి దిగి ఆహార పదార్థాల నమునాను సేకరించి పరీక్షలకు పంపిచడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బీజేపీకి పార్టీకి చెందిన రవిరాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఫుడ్ కోర్ట్‌లో ఇది సర్వసాధారణం, బొద్దింకలు, చిన్న చిన్న సరీసృపాలు కూడా ఆహారాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాయంటూ వ్యగ్యంగా కామెంట్లు చేస్తూ...ట్వీట్ చేశారు. Had a very horrible experience on 14.6.22, at Sagar Ratan, food court, Elante Mall, Chandigarh. A live Lizard was found in semi-conscious state under the Bhatura. Complaint given to @DgpChdPolice they made sample seized by food health Dept. Chd. @KirronKherBJP@DoctorAjayita pic.twitter.com/ej4sLHrnH5 — Ravi Rai Rana #RWorld (@raviranabjp) June 15, 2022 (చదవండి: అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్‌లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్ కట్ చేస్తే...) -
టాటూ ట్రెండింగ్.. క్యూ కడుతున్న యువత !
సాక్షి,నిర్మల్‌చైన్‌గేట్: ప్రస్తుత కాలంలో టాటూ.. ట్రెండ్ గా మారింది. నాటి పచ్చబొట్టే.. నేడు టాటూ.. పేరేదైనా జీవితకాలం ఉండే జ్ఞాపకం. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరంపై టాటూ డిజైన్ వేయించుకుంటున్నారు. తమకు నచ్చిన వారి పేర్లతో పాటు వ్యక్తుల ఫొటోలను టాటూగా వేసుకుంటున్నారు. కొందరు స్టైల్ కోసం.. మరికొందరు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్, డిఫరెంట్ వెరైటీస్‌తో లవర్స్ ఫిదా అవుతున్నారు. గతంలో కేవలం కలర్ టాటూస్ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం డిఫరెంట్ కలర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో తమ మనసుకు నచ్చిన భావాలను ఒంటిపై వేయించుకొని మురిసిపోతున్నారు యువత. యూత్ ఫ్యాషన్‌గా.. టాటూ ఒక ఫ్యాషన్‌గా మారింది. ప్రతిఒక్కరూ తమకు నచ్చిన వారి పేరు లేదా ఫొటోతో పాటు తాము ఇష్టపడే నాయకులు, దేవతల ఫొటోలను టాటూగా వేసుకోవడం ట్రెండ్‌గా మారింది. మనసుకు నచ్చినట్టుగా.. గతంలో కేవలం గ్రీన్ టాటూ మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం డిజైనర్లు డిఫరెంట్ వెరైటీస్‌తో వేస్తున్నారు. వివిధ రకాలతో యూత్‌ను ఆకట్టుకుంటున్నారు. మల్టీకలర్స్‌తో లైఫ్ లాంగ్ గుర్తుండేలా వేసుకోవడం ప్రస్తుత రోజుల్లో క్రేజ్‌గా మారింది. వెలిసిన సెంటర్లు.. గతంలో కేవలం నగరాలకే పరిమితమైన టాటూ కల్చర్ ప్రస్తుతం చిన్నపట్టణాలను సైతం విస్తరించింది. గతంలో జాతర్లలో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పచ్చబొట్టు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం టాటూలు వేసేందుకు ప్రత్యేక సెంటర్లు వెలిశాయి. క్రేజ్ పెరిగింది.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడం కోసం నేటి యువత టాటూలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం యువతకు టాటులపై క్రేజ్ పెరిగింది. – సంతోష్ వర్మ, టాటూ కళాకారుడు ఫ్యాషన్‌గా ఉండడం ఇష్టం ఫ్యాషన్‌గా ఉండడం ఇష్టం. అందుకు తగ్గట్టుగానే నేను టాటూ వేయించుకున్నాను. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే టాటూ సెంటర్ అందుబాటులో ఉండడంతో యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. – దరందాస్ సాయి, నిర్మల్ -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం
-
స్టాకు పాతదే ధర కొత్తది.. లీటరు ప్యాకెట్లో 650 మి.లీ నూనే! రూ.500 తేడా?
సాక్షి,భైంసాటౌన్(నిర్మల్): ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సాకుతో కొన్ని వంటనూనెల ఉత్పత్తి సంస్థలు మన మార్కెట్లో ధరల మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతిలో మన దేశం ఉక్రెయిన్, రష్యాపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితుల నేపథ్యంలో దిగుబడిపై ప్రభావం పడింది. ఇదే అదనుగా కొన్ని నూనెల ఉత్పత్తి సంస్థలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రిటైలర్లు, డీలర్లకు స్టాక్ లేదని చెప్పి క్యాష్ చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలయితే నేరుగా పాత స్టాకుపై ఉన్న ధరను చెరిపేసి, కొత్త ధర ముద్రించి మార్కెట్లోకి పంపుతున్నాయి. ఫలితంగా వినియోగదారులపై ప్రభావం చూపుతోంది. షార్ట్ వెయిట్‌తో మోసం... చాలా వరకు పేద, మధ్య తరగతి ప్రజలు, నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎక్కువగా ద్వితీయ శ్రేణి వంటనూనెలనే వినియోగిస్తారు. తక్కువ ధరకే వస్తుండడం, ప్రముఖ బ్రాండ్లను పోలిన స్టిక్కర్లు ఉండడంతో నమ్మి మోసపోతుంటారు. ప్రముఖ బ్రాండ్ల నూనెలు ఖచ్చితమైన కొలతల్లో ఉంటాయి. ద్వితీయశ్రేణి నూనెలు మాత్రం 350 మి.లీ. నూనెను 500 మి.లీ పాకెట్లో, 650 మి.లీ.నూనెను లీటరు పాకెట్లో నింపి విక్రయిస్తారు. దీంతో తక్కువ ధర ఉందని చూసి, నిరక్షరాస్యులు మోసపోతున్నారు. రూ.200–500ల వరకు పెంచేస్తూ... జిల్లా మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారులు సన్‌ఫ్లవర్, పామాయిల్, ఇతర వంటనూనెలు ఎక్కువగా హైదరాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుంచి తీసుకొస్తుంటారు. భైంసా మార్కెట్లో శనివారం ఓ హోల్‌సేల్ వ్యాపారి హైదరాబాద్ నుంచి ఓ కంపెనీకి చెందిన 15కిలోల వంటనూనె క్యాన్లను తెప్పించాడు. అయి తే ఆ క్యాన్లపై పాత ధర చెరిపేసి, కొత్త ధర రూ. 2899గా ముద్రించి పంపించారు. ఇలా ఒక్కో క్యా న్పై సుమారు రూ.200–500 వరకు పెంచి సరఫరా చేస్తున్నారు. అయితే వినియోగదారులు మాత్రం తానే ధర పెంచి విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారని వ్యాపారి వాపోయాడు. దీంతో వ్యాపారం దెబ్బతినే పరిస్థితి ఉందని చెబుతున్నాడు ఇతడు. తనిఖీలు చేపడితే ప్రయోజనం... యుద్ధం సాకుతో వంటనూనెల ధరలు ఇష్టానుసారం పెంచి పలు కంపెనీలు వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఈమేరకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టి స్టాకు కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ధరలు అమాంతం పెంచేశారు.. యుద్ధం సాకుతో పాత స్టాకుపై ధరలు చెరిపేసి, పెంచిన ధరలతో వంటనూనెలు అమ్ముతున్నరు. ఇలా చేయడం సరికాదు. పాత స్టాకును పాత ధరకే విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – అనుసూరి శ్రీనివాస్, భైంసా తనిఖీలు చేపడుతాం.. పాత స్టాక్ వంటనూనెల ధరలు పెంచి విక్రయిస్తే ఫిర్యాదు చేయాలి. అయితే అది పాత స్టాకేనా.. కాదా అనేది వారి బిల్లులు చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. తనిఖీలు జరిపి ఎవరైనా పాత స్టాకును రేటు పెంచి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – చిస్తేశ్వర్రావు,వాణిజ్యపన్నుల శాఖ జిల్లా అధికారి