బీజింగ్ : ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలకు కస్టమర్లు ఇచ్చే రివ్యూల ఆధారంగా కూడా అమ్మకాలు జరుగుతుంటాయి. అందుకే ఉత్పత్తులు, వినియోగదారులకు సేవలు అందించే విషయంలో సంస్థలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అయినప్పటికీ ఏదో ఒక దగ్గర పొరపాటు దొర్లటం ఖాయం. ఇదిలా ఉంటే చైనాలో జరిగిన ఓ ఘటన ఆసక్తికరంగా ఉంది.
సెంగ్స్యూ పట్టణానికి చెందిన క్సియో డై అనే మహిళ 300 యువాన్‌ల విలువ చేసే దుస్తులను టావోబావో అనే ఆన్‌లైన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసింది. అయితే డెలివరీ ఆలస్యం కావటంతో(మూడు రోజులు) సదరు కంపెనీ సర్వీస్ పట్ల ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నెగటివ్ రివ్యూను ఫీడ్ బ్యాక్‌లో పేర్కొంది. మీ సర్వీసులు చాలా చెత్తగా ఉన్నాయి అంటూ అందులో పేర్కొంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మార్ట్ యాజమాని ఝాంగ్ వెతుక్కుంటూ వెళ్లి మరీ చితకబాదాడు.
ఇందుకోసం అతను 852 కిలో మీటర్లు ప్రయాణించి సెంగ్స్యూ పట్టణానికి చేరుకున్నాడు. చివరాఖరికి నడిరోడ్డుపై ఆమెపై దాడి చేశాడు. అతని గాడి పిడిగుద్దులకు ఆమె ముక్కు పగిలిపోగా.. చెయ్యి విరిగిపోయింది. పోలీసులు ఝాంగ్‌ను అరెస్ట్ చేయగా.. కోర్టు పది రోజుల జైలు శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment