Online shopping portal
-
స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి
న్యూఢిల్లీ: వినియోగదారులను నష్టపర్చేలా పలు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ’డార్క్ ప్యాటర్న్’ పద్ధతులు పాటిస్తుండటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే దిశగా స్వీయ నియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని సంస్థలను ఆదేశించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగీ, జొమాటో తదితర ఈ–కామర్స్ సంస్థలతో భేటీ అనంతరం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన తగు వ్యవస్థ ఏర్పాటు కాగలదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్లో వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా మోసం చేసే విధానాలను డార్క్ ప్యాటర్న్లుగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు యూజరు ఎంచుకోకపోయినా షాపింగ్ బాస్కెట్లో కొన్ని ఐటమ్‌లను జోడించేయడం, చెక్ అవుట్ చేసే సమయంలో ఉత్పత్తుల ధరలను మార్చేయడం, తక్షణం కొనుగోలు చేయకపోతే నష్టపోతామేమో అనే తప్పుడు భావన కలిగేలా తొందరపెట్టడంలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. మధ్యవర్తులు అమ్మకాలను పెంచుకునేందుకు లేదా అమ్ముకునేందుకు అమలు చేసే మోసపూరిత విధానాల గురించి ఈ–కామర్స్ సైట్లను వాడే వినియోగదారులకు, విక్రేతలకు పెద్దగా తెలియదని సింగ్ చెప్పారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ అవగాహన కల్పించి, స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇలాంటి పద్ధతులు కొనసాగితే ఈ విషయంలో నిబంధనలను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. -
నయా ట్రెండ్: కారు అలా కొనేస్తున్నారట!
సాక్షి,న్యూఢిల్లీ: కారు కొనే ముందు షోరూంకి వెళ్లి ప్రత్యక్షంగా చూస్తాం. వీలైతే వాహనాన్ని నడుపుతాం. ఇదంతా పాత పద్దతి. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. షోరూంకి వెళ్లకుండానే కారు ఎలా ఉందో 3డీలో చూస్తున్నారు. 2020లో ఇలా 3డీని ఆసరాగా చేసుకుని కార్లను 76 లక్షల మంది భారతీయులు వీక్షించారని ఎక్సెంట్రిక్ ఇంజన్ తెలిపింది. 2019తో పోలిస్తే సంఖ్య పరంగా 300 శాతం వృద్ధి నమోదైందని చెబుతోంది. కరోన మూలంగా ఆఫ్‌లైన్ మార్కెటింగ్, షోరూంలలో ప్రమోషన్ కార్యక్రమాలకు అడ్డుకట్ట పడింది. దీంతో కార్ల ఎంపికకై కస్టమర్లు సాంకేతికత, ఆవిష్కరణ దన్నుగా ఉన్న ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకుంటున్నారు. ఎక్సెంట్రిక్ ఇంజన్ వన్ 3డీ ప్లాట్‌ఫాం ద్వారా కార్లను 3డీ రూపంలో ఆన్లైన్లో వీక్షించవచ్చు. మారుతి సుజుకి, ఎంజీ, రెనో నిస్సాన్ మిత్సుబిషి తదితర సంస్థలు ఈ కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. (హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే) ఆరు నగరాల నుంచే.. ఆన్లైన్లో కార్ల ఫీచర్లను వీక్షిస్తున్నవారిలో 51 శాతం మంది ఢిల్లీ, ముంబై, పుణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఉంటున్నారని ఎక్సెంట్రిక్ ఇంజన్ వెల్లడించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచీ ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకుంటున్నారని వివరించింది. 2018–20 కాలంలో తృతీయ శ్రేణి నగరాల వాటా 9 శాతంగా ఉంది. సికింద్రాబాద్, ఉదయ్‌పూర్, ఇంఫాల్ వీటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఆన్లైన్ వీడియోలతో పోలిస్తే నాలుగింతలు ఎక్కువగా 3డీ విధానంలో వీక్షిస్తున్నారని ఎక్సెంట్రిక్ ఇంజన్ కో–ఫౌండర్ వరుణ్ షా తెలిపారు. కస్టమర్లను ఆకట్టుకోవాలంటే తయారీ కంపెనీలకు 3డీ విధానం తప్పనిసరి అయిందని అన్నారు. (ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు) చూసిన కారునే కొంటున్నారు.. కొనే ముందు 3డీలో చూస్తున్నారు తాము కొనబోయే కారును 70 శాతం మంది మొబైల్ ద్వారా, 25 శాతం మంది డెస్క్‌టాప్ ద్వారా వీక్షిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 మధ్య ఎక్కువగా బ్రౌజ్ చేస్తున్నారు. అత్యధికులు బుధవారం నాడు సర్చ్ చేస్తున్నారు. బ్లూ, వైట్ రంగులు ప్రధాన ఆకర్శణగా నిలిచాయి. 40 శాతం మంది ఈ రంగులను ఎంచుకున్నారు. గ్రే, బ్రౌన్, సిల్వర్ కలర్స్‌ను 35 శాతం, రెడ్, బ్లాక్, ఆరేంజ్ను 15 శాతం మంది ఇష్టపడ్డారు. ఆన్లైన్లో చూసిన కారునే కొన్నవారు 91 శాతం మంది ఉండడం గమనార్హం. విదేశాల్లో ఉన్న భారతీయులు తమ వారి కోసం ఆన్లైన్లో చూసి కొనుగోలు చేస్తున్నారు. 2020లో వీక్షకుల్లో 4.6 శాతం మంది ఎన్నారైలు ఉన్నారు. వీరిలో 31 శాతం ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్య 32, యూరప్ 10, యూకే 5, ఆస్ట్రేలియా 4, ఆఫ్రికా నుంచి 2 శాతం ఉన్నారు. చదవండి : దిగి వస్తున్న బంగారం ధరలు -
గూగుల్ షాపింగ్ పోర్టల్ వచ్చేసింది
భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్‌నకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో గూగుల్ కూడా ఆన్లైన్ షాపింగ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలో ‘గూగుల్ షాపింగ్’ పేరుతో కొత్త షాపింగ్ ప్లాట్‌ఫాంను గురువారం (డిసెంబరు 13) లాంచ్ చేసింది.. ఈ రోజు నుంచే గూగుల్ షాపింగ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని గూగుల్ ప్రకటించింది. ఇందులో దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు సహా వివిధ విభాగాలలో ఉత్పత్తులను వికయిస్తుంది. వివిధ కంపెనీల, బ్రాండ్ల ఉత్పత్తులను గూగుల్ షాపింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. వినియోగదారులు సరైన ఉత్పత్తులు, విక్రయించే రిటైలర్ల సమాచారాన్ని తెలుసుకోవడంలోసహాయపడేలా గూగుల్ షాపింగ్ పోర్టల్ల్ను డిజైన్ చేసినట్టు తెలిపింది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ భాషలోలో ధరలు, బెస్ట్‌డీల్స్ తదితర సమాచారాన్నితెలుసుకునే వీలు కల్పించామని పేర్కొంది. లక్షలాదిమంది ఆన్లైన్ వినియోగదారులకు ఉత్పత్తులను విక్రయించుకునేందుకు రీటైల్ వ్యాపారులకు ఇది గొప్ప అవకాశమని గూగుల్ షాపింగ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ సురోజిత్ చటర్జీ బ్లాగ్ పోస్ట్ లో రాశారు. అలాగే డెస్క్‌టాప్‌తోపాటు ఎంట్రీ లెవల్ మొబైల్స్‌లో కూడా పనిచేసేలా ఒక ప్రోగ్రెసివ్ వెబ్‌యాప్‌ను త్వరలోనే లాంచ్ చేస్తామన్నారు. కాగా దేశంలో 400 మిలియన్లమంది ఇంటర్నెట్ యూజర్లు ఉండగా వీరిలో కేవలం మూడవ వంతు వినియోగదారులు అసలు ఆన్లైన్ షాపింగ్ చేయడం లేదనిగూగుల్ పేర్కొంది. తమ గూగుల్ షాపింగ్ ద్వారా ఆన్లైన్ షాపింగ్‌కు ప్రోత్సాహం అందించడంతోపాటు చిన్నమధ్యతరహా వ్యాపారస్తులను ఆన్లైన్ బిజినెస్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
చెత్త రివ్యూ.. వెతుక్కుంటూ వెళ్లి మరీ...
బీజింగ్ : ఆన్లైన్ షాపింగ్ కంపెనీలకు కస్టమర్లు ఇచ్చే రివ్యూల ఆధారంగా కూడా అమ్మకాలు జరుగుతుంటాయి. అందుకే ఉత్పత్తులు, వినియోగదారులకు సేవలు అందించే విషయంలో సంస్థలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అయినప్పటికీ ఏదో ఒక దగ్గర పొరపాటు దొర్లటం ఖాయం. ఇదిలా ఉంటే చైనాలో జరిగిన ఓ ఘటన ఆసక్తికరంగా ఉంది. సెంగ్స్యూ పట్టణానికి చెందిన క్సియో డై అనే మహిళ 300 యువాన్ల విలువ చేసే దుస్తులను టావోబావో అనే ఆన్లైన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసింది. అయితే డెలివరీ ఆలస్యం కావటంతో(మూడు రోజులు) సదరు కంపెనీ సర్వీస్ పట్ల ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నెగటివ్ రివ్యూను ఫీడ్ బ్యాక్‌లో పేర్కొంది. మీ సర్వీసులు చాలా చెత్తగా ఉన్నాయి అంటూ అందులో పేర్కొంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మార్ట్ యాజమాని ఝాంగ్ వెతుక్కుంటూ వెళ్లి మరీ చితకబాదాడు. ఇందుకోసం అతను 852 కిలో మీటర్లు ప్రయాణించి సెంగ్స్యూ పట్టణానికి చేరుకున్నాడు. చివరాఖరికి నడిరోడ్డుపై ఆమెపై దాడి చేశాడు. అతని గాడి పిడిగుద్దులకు ఆమె ముక్కు పగిలిపోగా.. చెయ్యి విరిగిపోయింది. పోలీసులు ఝాంగ్‌ను అరెస్ట్ చేయగా.. కోర్టు పది రోజుల జైలు శిక్ష విధించింది. -
600మంది స్నాప్‌డీల్ ఉద్యోగులపై వేటు?
ప్రముఖ ఆన్లైన్ విక్రయ సంస్థ స్నాప్‌డీల్ మరో వివాదంలో ఇరుక్కుంది. దాదాపు 600మంది ఉద్యోగులపై వేటు వేసిందనే వార్త.. సోషల్ మీడియాలో భగ్గుమంది. మరో 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు గుప్పుమన్నాయి. పూర్ పెర్ ఫార్మెన్స్ కారణంగా స్నాప్‌డీల్ మరికొంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులను జారీ చేసిందన్న వార్తలు హల్చల్ చేశాయి. మరోవైపు కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు గుర్గావ్ లోని సంస్థ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది. ఎంతమంది ఉద్యోగులను తొలగించారనే దానిపై స్పష్టత రానప్పటికీ ...ఇటీవలి కంపెనీ నష్టాల ప్రభావం సిబ్బందిపై భారీగా పడనుందనే ఆందోళన చెలరేగింది. అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై స్నాప్ డీల్ స్పందించింది. పనితనంలో మెరుగుదల కోసం శిక్షణా కార్యక్రమాలను చేపట్టామని వెల్లడించింది. మరి కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారని పేర్కొంది. కాగా అప్పట్లో అమీర్ ఖాన్ వ్యాఖ్యల అనంతరం నెటిజన్లు ఆయన ప్రచారం చేస్తున్న స్నాప్ డీల్ బహిష్కరించాలనే ప్రచారం లేవనెత్తింది. దీంతో సంస్థ భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కొనసాగితే మరింత నష్టం తప్పదనే భావనతో అమీర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించిన సంగతి తెలిసిందే.