షాకింగ్‌ ఘటన: చిన్నారిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది | Wild Monkey Attack On Kid AT Southwest China Village | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ ఘటన: ఆడుకుంటున్న చిన్నారిపై దాడి.. ఈడ్చుకెళ్లింది

Published Sat, Apr 23 2022 6:32 PM | Last Updated on Sat, Apr 23 2022 6:32 PM

Wild Monkey Attack On Kid AT Southwest China Village - Sakshi

సరదాగా ఆడుకుంటున్న ఆ చిన్నారి మీద.. ఓ కోతి దాడికి పాల్పడింది. నెమ్మదిగా వెనక నుంచి వచ్చి ఆమె మీదకు దూకి కింద పడేసింది. ఆపై ఆ చిన్నారిని లాక్కుంటూ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. చిన్నారి ఏడ్పులు విన్న ఓ స్థానికుడు అది గమనించి.. దానిని తరిమి ఆ చిన్నారిని రక్షించాడు.

ఘటన సమయంలో ఆ చిన్నారి తల్లి లోపల పని చేసుకుంటుందట. సర్వేలెన్స్‌ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూస్తేగానీ ఆ షాకింగ్‌ ఘటనను స్థానికులు నమ్మలేదు. గాయపడ్డ చిన్నారిని వ్యాక్సిన్‌ ఇప్పించి చికిత్స అందించారు. చైనా నైరుతి ప్రాంతం చోంగ్‌క్వింగ్‌లో ఈ ఘటన జరిగింది. 

ఇదిలా ఉండగా.. ఆ కోతి అంతకు ముందు కొందరు గ్రామస్తుల మీద కూడా దాడి చేసిందట. పక్కనే ఉన్న గుట్టల్లోంచి ఆ కోతి గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటన కలకలంతో అప్రమత్తమైన అధికారులు.. దానిని పట్టుకుని వైల్డ్‌ లైఫ్‌​ విభాగానికి అందజేస్తామని చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement