toddler
-
బిడ్డ కోసం తండ్రి పాట్లు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): పసిబిడ్డ కోసం తండ్రి నానా కష్టాలు పడ్డాడు. ప్రసవం అయిన తర్వాత చికిత్స కోసం పిల్లల వార్డుకు తీసుకొని వెళ్లడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోసుకొని వార్డుకు తీసుకొని వెళ్లాడు. పసిబిడ్డను ఆయా తీసుకొని వెళ్లగా తండ్రి సిలిండర్ మోసుకొని వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కోటనందూరుకి చెందిన అల్లు శిరీష, విష్ణుమూర్తి దంపతులు. శిరీష ఈ నెల 9న కేజీహెచ్ గైనిక్ వార్డులో చేరారు. మంగళవారం ఉదయం 8.30 శిరీష పసికందుకు జన్మనిచ్చి0ది. పసికందు అనారోగ్యానికి గురవడంతో పిల్లల వార్డులో ఉన్న ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు సూచించారు. పసికందును గైనిక్ వార్డుకు తరలించడానికి కేజీహెచ్ సిబ్బంది ఎవరు ముందుకు రాలేదు. దీంతో తండ్రి విష్ణుమూర్తి అక్కడ ఉన్న ఆయాతో మాట్లాడి తాను సిలిండర్ మోస్తానని ముందుకు వచ్చాడు. దీంతో ఆయా పసిపాపను, తండ్రి సిలిండర్ మోసుకొని వెళ్లారు. గైనిక్ వార్డు నుంచి పిల్లల వార్డు వరకు నడిచి తీసుకొని వెళ్తున్న ఈ దృశ్యాన్ని కొంత మంది వీడియో తీశారు. దీనిని వైరల్ చేయడంతో ఈ విషయం బయట పడింది. గైనిక్ వార్డు వద్ద బ్యాటరీ కారు ఈ ఘటన వైరల్ కావడంతో సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆరా తీశారు. గైనిక్, పిల్లల వార్డు సిబ్బందిని పిలిచి విచారించారు. ఆ సమయంలో ఎవరు డ్యూటీలో ఉన్నారు.. ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అన్నదానిపై చర్చించారు. ఈ సమస్య లేకుండా గైనిక్, పిల్లల వార్డు వద్ద ఒక బ్యాటరీ కారు సిద్ధం చేస్తున్నట్లు శివానంద్ తెలిపారు. -
మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. పెషావర్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ (పెస్కో), వాటర్ అండ్ పవర్ డెవలప్మెంట్ అథారిటీ (వాప్డా) సంస్థల ఫిర్యాదు మేరకు ఈ చిన్నారిపై కేసు నమోదు చేశారు.తరువాత ఆ చిన్నారిని అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. ఈ ఉదంతానికి సంబంధించిన అఫిడవిట్‌ను పరిశీలించిన న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. కాగా ఆ చిన్నారి ఏమి చేసిందనే దానిపై పెస్కో, వాప్డా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. పాక్‌కు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలలో విద్యుత్ చౌర్యం కారణంగా జాతీయ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థల అధిక వసూళ్లపై పాక్‌లోని పంజాబ్ ఇంధన శాఖ ఏప్రిల్ 7న ఆందోళన చేపట్టింది.లాహోర్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ఫైసలాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ముల్తాన్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, గుజ్రాన్వాలా ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీలు ప్రభుత్వ శాఖల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నాయని విద్యుత్ శాఖ పేర్కొంది. -
వాట్ యాన్ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!
చిన్న పిల్లలకు హెయిర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. ఎవరో ఒకళ్లు వాళ్లని కదలకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవాల్సిందే. ఓ పక్క వాళ్ల ఏడుపులు, పెడబొబ్బలు..మరోవైపు ఎంతలా పట్టకున్నా కదలిపోతూనే ఉంటారు. దీంతో గాయాలు వారికి, హైరానా పడటం మన వంతు అవుతుంది. హెయిర్ కట్టింగ్ షాపులోనూ లేదా మన ఇంటి దగ్గరైన అంతే పరిస్థితి. అలాంటి సమయంలో ఈ అమ్మ తన చిన్నారికి హెయిర్ కట్టింగ్ చేసిన ట్రిక్ని ఫాలో అయ్యితే చాలు. ఆ తల్లి మాత్రం భలే మంచి టెక్నిక్ కనుక్కుంది. చూస్తే కచ్చితంగా వాట్ యాన్ ఐడియా! అని నోరెళ్లెబెట్టకుండా ఉండరు. వివరాల్లోకెళ్తే..ఆమె తన చిన్నారికి హెయిర్ కట్టింగ్ చేసేందుకు ఓ అట్ట ప్యాకింగ్ బాక్స్‌ని తీసుకుంది. ముందు ఆ బాక్స్‌లో తన చిన్నారి కదలకుండా కూర్చొనేలా వాటికి రెండు హోల్స్ పెట్టుకుంది. ఆ తర్వాత ఆ చిన్నారిని ప్యాకింగ్ బాక్స్‌లో ఆ రెండు హోల్స్‌లోకి రెండు కాళ్లు వచ్చేలా ఉంచి కూర్చొబెట్టింది. ఆ తర్వాత తల మాత్రం బయటకు ఉండేలా..చిన్నారి బాడీ, చేతులు కదలకుండా బాక్స్‌ని టేప్‌తో ప్లాస్టర్ వేసేసింది. ఆ తర్వాత ట్రిమ్మింగ్ మిషన్‌తో చక్కగా పిల్లాడికి హెయిర్ కట్ చేసేసింది. ఆ తల్లి ఆలోచనకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే కదా!. కాగా, అందుకు సంబంధించిన వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #HairCut ♥️🩷 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/dMgfFIORRm — Rupin Sharma IPS (@rupin1992) June 29, 2023 (చదవండి: టమాటా ధర పెరిగిందని టెన్షన్ వద్దు..ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!) -
ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువ అవుతోందని.. బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి
ప్రజలకు ఆరోగ్య స్పృహ గతంలో కంటే మరింత పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల అనంతరం ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తలు అధికమయ్యాయి. ఇక కొందరేమో పర్యావరణ హితంగా జీవనం ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా వీగన్లుగా మారిపోతున్నారు. అయితే, కెనాడాకు చెందిన టిఫానీ అనే ఫుడ్ బ్లాగర్ షేర్ చేసుకున్న ఓ విషయం మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. తన 18 నెలల కూతురుకు ఏకంగా ఆమె మిడతలను తినిపిస్తోంది. అదేంటి? చిన్న పిల్లకు మిడతలు ఆహారంగా ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకున్నారా? నిజంగా ఇది నిజం! ఖర్చుల భారం.. అందుకే.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. వారానికి 250 నుంచి 300 డాలర్లు (సుమారు రూ.25000) సరుకులకు ఖర్చవుతోందని, అందుకనే తన బిడ్డకు ప్రోటీన్ సప్లిమెంట్ కోసం వినూత్నంగా ఆలోచించానని వెల్లడించింది. మిడతల్లో (క్రికెట్స్) విలువైన ప్రోటీన్ ఉంటుందని, తన బేబీకి అవి తినిపించి వాటిని భర్తీ చేస్తున్నానని టిఫానీ వివరించింది. డబ్బులు ఆదా అవడంతో పాటు పాపకు అవసరమైన ప్రోటీన్ అందుతోందని ఆమె పేర్కొంది. కీటక శాస్త్రంపై తనకున్న అవగాహన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను కూడా సాలెపురుగు నుంచి తేలు వరకు పలు కీటకాలను గతంలో రుచి చూశానని పేర్కొంది. థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో పర్యటించినప్పుడు చీమలు, మిడతలను తిన్నానని చెప్పుకొచ్చింది టిఫానీ. అక్కడి ప్రజల జీవన విధానంలో కీటకాలను తినడం మామూలేనని వెల్లడించింది. (చదవండి: 69 క్యాన్ల సోడాలు హాంఫట్) ఇలాంటి ప్రయోగాలు అవసరమా? మిడతలతో తయారు చేసిన పఫ్‌లు, ప్రోటీన్ పౌడర్‌ను తన బిడ్డకు అందిస్తునన్నాని టిఫానీ చెప్పింది. బీఫ్, చికెన్, పంది మాంసంలో ఉండే ప్రోటీన్లకు బదులు మిడతలపై ఆధారపడటంతో వారానికి అయ్యే ఖర్చులో 100 డాలర్ల వరకు ఆదా అవుతోందని పేర్కొంది. అయితే, టిఫానీ చర్యను సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. చిన్న పిల్లపై ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని హితవు పలుకుతున్నారు. మరికొందరేమో కొత్త ఐడియా బాగానే ఉందిగానీ, చిన్నారికి ఇదో రకమైన శిక్ష కదా! అంటూ కామెంట్ చేశారు. ఏదైనా పాపకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే, తన కూతురు కొత్త రకమైన ఆహారాన్ని స్వీకరించడంలో ఎలాంటి బెరుకు, భయం కనబర్చదని టిఫానీ పేర్కొనడం గమనార్హం. అందువల్లే తమ ఆహారం కానిదైనప్పటికీ ఆమె తింటోందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు.. పీడియాట్రిక్ డైటీషియన్ వీనస్ కలామి ప్రకారం.. 6 నెలల వయసు తర్వాత పిల్లలకు ఆహారంలో పురుగులు, కీటకాలు భాగం చేస్తే తినే తిండి పట్ల పాజిటివ్ దృక్పథం అలవడుతుందని పేర్కొంది. (చదవండి: వింత ఘటన: విడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంది..ఫోటోషూట్ చేసి మరీ..) -
వైరల్ వీడియో బేబీ స్టెప్స్ నుంచి ఏకంగా డ్యాన్స్
-
అమ్మలాంటి ఆవు..బుజ్జోడి నవ్వులు
-
మిషన్ ఇంపాజిబుల్.. బుడ్డోడి ఫీట్ చూస్తే మతిపోవాల్సిందే!
-
Cute Video: బుడ్డిది మామూలుది కాదు.. ఆరునెలలకే స్టెప్పులు వేసేస్తోంది.
-
ఏనుగు ఘీంకారం! క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయేవే... ఆ పసిపాప ఏడవడంతో..
తిరువనంతపురం: కేరళలోని అన్నైకట్టి ప్రాంతంలో అడవిజంతువులకు తాగునీరు కరువవడంతో జనావాసాల్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనలను కట్టడిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో వన్యమృగాల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అన్నైకట్టిలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగుచూసింది. అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన భారీ ఏనుగు మంగళవారం ఉదయం 4 గంటలకు ఓ ఇంటి సమీపంలో ఘీంకరించింది. ఆ చప్పుడు విన్న బాలామణి అనే మహిళ ఏం జరిగిందో తెలుసుకుందామని తన తమ్ముడి కూతురిని కూడా వెంటేసుకుని పరుగున బయటకు వచ్చింది. ఒక్కసారిగా ఏనుగు వారివైపు తిరిగి.. ఆమెను కింద పడేసింది. బాలామణికి కొద్దిదూరంలోనే ఆ పసిపాప కూడా ఉంది. అది గనుక దాడిచేస్తే క్షణాల్లో ఆమె ప్రాణాలు గాల్లో కలిసేవే! అయితే, అదృష్టవశాత్తూ బాలామణి ప్రమాదం నుంచి బయటపడింది. భయానక ఘటనతో వణికిపోయిన ఆ పసిపాప బిగ్గరగా ఏడ్చింది. అది చూసిన ఆ ఏనుగు బాలామణికి హాని తలపెట్టకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అన్నైకట్టి కొండ ప్రాంతం. అయితే, అక్కడి వన్యప్రాణులకు తాగేందుకు సరిపడా నీరులేకపోవంతో అవి జనావాసాల్లోకి చొరబడి దాడులు చేయడం మామూలైపోయింది. ప్రభుత్వాలు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. షాక్ తిన్నా! తర్వాత ఏమైందో తెలియదు ‘భారీ శబ్దం వినిపిస్తే ఏమైందో చూద్దామని బయటికి వెళ్లాను. నాతోపాటు నా తమ్ముడి కూతురు కూడా ఉంది. ఏనుగును చూసి అక్కడ నుంచి పరుగెత్తుకెళ్దామనే లోపే అది తన తొండంతో నన్ను కిందకు తోసేసింది. ఒక్కసారిగా షాక్ తిన్నా! తర్వాత ఏమైందో స్పృహ లేదు. కాసేపటికి మా చిన్నదాని ఏడుపు విని మెలకువ వచ్చింది. ఆ దేవుడే మమ్మల్ని రక్షించాడు’ అని బాలామణి చెప్పుకొచ్చింది. -
బుడ్డోడి ధైర్యం సల్లగుండా.. భయం లేకుండా ఎలా కొండచిలువుతో ఆడుతున్నాడో చూడండి !
-
చిన్నారి చికిత్సకు రూ. 11 కోట్ల విరాళం.. కనీసం పేరు చెప్పకుండా!
కష్టాల్లో ఉంటే అయినవారే పట్టించుకోని రోజులివి.. నోరు తెరిచి సాయం కావాలని అడిగిన చూసి చూడనట్లు వదిలేసే కాలం ఇది. అలాంటిది ముక్కు ముఖం తెలియని చిన్నారిని ఓ వ్యక్తి దేవుడిలా ఆదుకున్నాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి కోట్లు విరాళంగా ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు. ఎస్ఎంఏ అనే వ్యాధి సోకిన 15 నెలల చిన్నారి చికిత్స కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.11 కోట్లు ఖాతాలో జమ చేశారు.అమెరికాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నా ఆయన కోట్లు దానం చేసి కనీసం తన పేరు, వివరాలు చెప్పకుండా బాలుడికి కొత్త జన్మను అందించాడు. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ కుమారుడు నిర్వాణ్(15 నెలలు). నిర్వాణ్ స్పైనల్ మస్క్లర్ అట్రోఫీ(వెన్నుముక కండరాల క్షీణత) అనే అరుదైన వ్యాధితో బాధపడతున్నాడు. ఎస్ఎంఏ చికిత్సకు దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే వన్ టైమ్ డ్రగ్ అయిన జోల్జెన్మ్సా ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదు. దీనిని మెడికల్ ప్రిస్క్రిప్షన్, పిల్లల తల్లిదండ్రుల లేఖతో అమెరికా నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. అంతేగాక ఎస్ఎమ్కే కేసులు, దీని డ్రగ్ డెవలప్మెంట్ పరిశోధనలు తక్కువగా ఉండటం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందులలో ఇది ఒకటి. దీంతో గత నెల జనవరిలో బాలుడి తల్లిదండ్రులు ఆర్థిక సాయం కోసం క్రౌడ్‌ఫండ్ అకౌంట్ తెరిచారు. ఫిబ్రవరి 19 వరకు వారికి రూ.5.42 కోట్లు విరాళంగా అందాయి. ఈ క్రమంలోనే క్రౌడ్ ఫండింగ్ ఖాతాలోకి ఎవరో వ్యక్తి తన పేరు చెప్పకుండా భారీ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. ఫిబ్రవరి 20వ తేదీన ఓ వ్యక్తి అకౌంట్ నుంచి 1.4 మిలియన్ డాలర్లు తమకు అందినట్లు బాధిత కుటుంబం ఫేస్బుక్లో వెల్లడించింది. ఇది భారత కరెన్సీ ప్రకారం అక్షరాల 11.50 కోట్లు. ఇంత మొత్తం విరాళంగా ఇచ్చి బాలుడికి కొత్త జీవితాన్ని అందించాడు. అయితే ఈ డబ్బులు ఎవరూ విరాళంగా ఇచ్చారో తమకు తెలియదని కుటుంబ నిర్వాణ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. అతనెవరో, తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదని తెలిపారు. తమ జీవితంలో ఇదొక అద్భుతమని వర్ణించారు. ఇప్పటి వరకు అజ్ఞాత దాతతో సహా 72,000 మంది వ్యక్తులు నిర్వాణ్‌కు విరాళాలు అందించారు. దీంతో సారంగ్ దంపతుల ఆర్థిక కష్టాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లైంది. చదవండి: కర్ణాటకలో అదృశ్యమైన బస్.. తెలంగాణలో లభ్యం, మధ్యలో ఏం జరిగింది! -
రెండేళ్ల బాలుడ్ని అమాంతం మింగేసిన నీటిగుర్రం.. చివరకు ఏమైందంటే?
ఉగాండాలో మిరాకిల్ జరిగింది. సరస్సు సమీపంలోని ఓ ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడ్ని నీటిగుర్రం(హిపోపాటమస్) అమాంతం మింగేసింది. అక్కడున్న ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ రాళ్లు విసిరేయడంతో వెంటనే బాలుడ్ని బయటకు ఉమ్మేసింది. దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అతను క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ బాలుడి పేరు పాల్. సరస్సుకు అతి సమీపంలో వీళ్ల ఇల్లు ఉంది. డిసెంబర్ 4న సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. సరస్సు నుంచి వచ్చిన నీటిగుర్రం బాలుడ్ని తలపై నుంచి అమాంతం మింగేసింది. సగానికిపైగా శరీరాన్ని నోట్లోకి తీసుకుంది. ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న క్రిస్పస్ బగోంజా అనే వ్యక్తి ఇది గమనించి నీటిగుర్రంపైకి రాళ్లు విసిరాడు. దీంతో అది బాలుడ్ని వదిలేసింది. అయితే హిపోపాటమస్ పళ్లు గుచ్చుకొని చిన్నారి చేతికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా వైద్యులు ముందు జాగ్రత్తగా రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం చికిత్స అందించారు. నీటిగుర్రాలు శాఖహారులు అయినప్పటికీ.. బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి. నీటిగుర్రాల దాడుల వల్ల ఆఫ్రికాలో ఏటా 500 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర జంతువు కారణంగా ఇన్ని మరణాలు నమోదు కావడం లేదు. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్ కూడా ఒకటి. దీని దంతాలు సింహం కంటే మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటాయి. చదవండి: 2,00,000 బలగాలతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్! -
షాకింగ్ ఘటన: చిన్నారిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది
సరదాగా ఆడుకుంటున్న ఆ చిన్నారి మీద.. ఓ కోతి దాడికి పాల్పడింది. నెమ్మదిగా వెనక నుంచి వచ్చి ఆమె మీదకు దూకి కింద పడేసింది. ఆపై ఆ చిన్నారిని లాక్కుంటూ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. చిన్నారి ఏడ్పులు విన్న ఓ స్థానికుడు అది గమనించి.. దానిని తరిమి ఆ చిన్నారిని రక్షించాడు. ఘటన సమయంలో ఆ చిన్నారి తల్లి లోపల పని చేసుకుంటుందట. సర్వేలెన్స్ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూస్తేగానీ ఆ షాకింగ్ ఘటనను స్థానికులు నమ్మలేదు. గాయపడ్డ చిన్నారిని వ్యాక్సిన్ ఇప్పించి చికిత్స అందించారు. చైనా నైరుతి ప్రాంతం చోంగ్క్వింగ్లో ఈ ఘటన జరిగింది. ఇదిలా ఉండగా.. ఆ కోతి అంతకు ముందు కొందరు గ్రామస్తుల మీద కూడా దాడి చేసిందట. పక్కనే ఉన్న గుట్టల్లోంచి ఆ కోతి గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటన కలకలంతో అప్రమత్తమైన అధికారులు.. దానిని పట్టుకుని వైల్డ్ లైఫ్ విభాగానికి అందజేస్తామని చెప్తున్నారు. -
‘పసిపిల్లలను పార్లమెంట్‌కు తీసుకురావద్దు’... బ్రిటన్‌లో దుమారం
లండన్: బ్రిటన్ పార్లమెంట్ లోకి పసిపిల్లలను తీసుకురావద్దని ఆంక్షలు విధించడం అక్కడ తీవ్రమైన నిరసనకు దారితీసింది. పార్లమెంట్ లోకి చిన్నారులను తీసుకురావద్దంటూ ఓమహిళా ఎంపీకి ఈ మెయిల్స్ పంపారు. ఈ క్రమంలో వివాదం రాజుకుంది. అయితే వీటిపై స్పందించిన ఓ ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ నియమాళికి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, పనిచేసే తల్లులకు పిల్లల సంరక్షణ చూసుకునేలా వేసులుబాటు కల్పించాలంటూ చర్చ చేపట్టారు. వివాదం రాజుకుంది ఇలా.. వెస్ట్‌మినిస్టర్ హాల్లో మంగళవారం తన మూడు నెలల కొడుకుతో కలిసి ఎంపీ స్టెల్లా క్రీసీ పార్లమెంట్ చర్చలో పాల్గొన్నారు. చర్చకు హాజరైన తర్వాత బిడ్డను పార్లమెంట్ కు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని ఎంపీకి పార్లమెంటు దిగువ సభ ప్రతినిధి చెప్పారు. మంగళవారం కాన్ఫరెన్స్‌లో బైనౌపే లేటర్ కన్స్యూమర్ క్రెడిట్ స్కీమ్‌ల గురించి చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్నఆమె పసికందును స్లింగ్లో ఛాతీకి కట్టుకుని హాజరయ్యారు. క్రీసీ చర్యలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్‌కు ఇలా పిల్లలను తీసుకురావడం సమస్య కాలేదని నిలదీసిన క్రీసీ... దీనిపై కామన్స్ అధికారుల నుంచి ఆమె వివరణ కోరింది. ఇదివరకు తన పిల్లలిద్దరినీ ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే హౌస్ ఆఫ్ కామన్స్లోకి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ట్విట్టర్లో షేర్ చేయడంతో నిరసన తనకు ఎదురైన అనుభవం గురించి క్రీసీ ట్విట్టర్లో షేర్ చేసింది. నేను ఛాంబర్లో మాట్లాడేటప్పుడు నా 3 నెలల... నిద్రపోతున్న బిడ్డను తీసుకుపోకూడదని (ఇప్పటికీ పార్లమెంట్ లో మాస్క్‌లు ధరించాలనే నియమం లేదని విమర్శించారు ) నాకు నోటిసులు పంపారు’’ అని ఆమె ట్విట్టర్లో తనకు పంపిన లెటర్ ను షేర్ చేశారు. తనకు పార్లమెంట్ ప్రసూతి కవరేజ్ లేదని... అది కలిగి ఉండటానికి ఉపాధి హక్కులు లేవని ఎంపీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వివరించారు. పెద్ద ఎత్తున నిరసనలు... క్రీసీ లెటర్ ఆన్లైన్లో పెద్ద ఎత్తున నిరసనకు దారితీసింది. ఈ విషయంపై అన్ని రంగాల్లోని మహిళలు నిరసనగళం వినిపించారు. తమ ఉద్యోగాలను సులభతరం చేయడానికి పార్లమెంట్ నిబంధనలను మార్చాలని పలువురు మహిళా చట్టసభ సభ్యులు కోరారు. ఎంపీలకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదని నిలదీశారు. పనిచేసే ప్రాంతానికి శిశువును తీసుకెళ్లాడనికి చాలా చోట్ల అనుమతించడం లేదని పలువురు మహిళలు వాపోయారు. తమ బిడ్డను వేరే వాళ్లకి అప్పగించి చూసుకోమని చెప్పడానికి ఆర్థిక స్థోమత లేదని ఆవేదన వెలిబుచ్చారు. సోషల్ మీడియా ఆగ్రహం అనంతరం... ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీసింది. నెటిజన్ల ఆగ్రహం అనంతరం... తాము ఈ విషయాన్ని సమీక్షిస్తున్నట్లు హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతినిధి చెప్పారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఎంపీలందరూ పార్లమెంటులో తమ విధులను నిర్వహించగలగడం చాలా ముఖ్యం. సభ్యులు ఎప్పుడైనా ఛాంబర్లో లేదా వెస్ట్మిన్స్టర్ హాల్లో ఉన్నప్పుడు తమ అవసరాల గురించి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, క్లర్క్‌లు, డోర్కీపర్లతో సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఈ విషయం గురించి స్టెల్లా క్రీసీతో మాట్లాడుతున్నట్లు వివరించారు. ఇదేం కొత్త కాదు... శిశువులను పార్లమెంటుకు తీసుకురావడం ఇదేం కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజాప్రతినిధులు తమ పిల్లలను చట్టసభలకు తీసుకువెళ్లారు. అన్నెలీస్ డాడ్స్ తన బిడ్డను 2016లో యూరోపియన్ పార్లమెంట్‌కు తీసుకెళ్లడం నుంచి న్యూజిలాండ్ పీఎం జసిండా ఆర్డెర్న్ 2018లో మూడు నెలల కుమార్తెను యూఎన్ జీఏకి తీసుకురావడం ద్వారా చరిత్ర సృష్టించడం వరకు... చాలా మంది మహిళా చట్టసభ సభ్యులు గతంలో ఇలా చేశారు. -
మీ పిల్లల్లో మాటలు ఆలస్యం అవుతున్నాయా? ఇలా చేశారంటే..
పిల్లల్లో సాధారణంగా 10 నెలలు లేదా ఏడాది నాటికి ముద్దుమాటలు (బాబ్లింగ్) మొదలై దాదాపు రెండేళ్ల వయసు నాటికి చాలావరకు కమ్యూనికేట్ చేస్తుంటారు. మూడేళ్లకు అన్ని మాటలూ వచ్చేస్తాయి. అయితే కొందరు చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వినడానికి దోహదపడే వినికిడి వ్యవస్థ, అలాగే మాట్లాడటానికి అవసరమైన వోకల్ కార్డ్స్, మాట్లాడేందుకు దోహదపడే గొంతులోని కండర నిర్మాణం... ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొందరిలో సహజంగానే మాటలు రావడం ఆలస్యమవుతుంటుంది. ఆ పిల్లల్లో వారి భాష ఓ స్థాయి పరిణతికి రావడంలో జరిగే ఆలస్యం (లాంగ్వేజ్ మెచ్యురేషన్ డిలే) కావడం దీనికి కారణం. ఇది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఈ సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువ. ఇలా మాటలు రావడం ఆలస్యమైన సందర్భాల్లో సాధారణంగా స్కూల్లో చేర్చే ఈడు నాటికి పిల్లలు తమంతట తామే మాట్లాడతారు. ఇక కొందరిలో మాటలు రావడంలో ఆలస్యం జరగడం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలను (డిజార్డర్స్‌ను) సూచించే ఒక లక్షణం. ఉదాహరణకు వినికిడి లోపాలు, మానసికమైన సమస్యలూ, ఆటిజం వంటి కండిషన్, భాషను అర్థం చేసుకోవడం, అభివ్యక్తీకరించడంలో సమస్యలు (ఎక్స్‌ప్రెసివ్ రిసెప్టివ్ లాంగ్వేజ్ డిజార్డర్)... మొదలైనవాటిల్లో ఏదో ఒకదానివల్ల మాటలు రావడం ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు అది ఎదుగుదల సమయంలో వచ్చే ఇతర ఆరోగ్య లోపాల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ డిజార్డర్ ఉన్న పిల్లలు భాషను ఒక కమ్యూనికేటివ్ సాధనంగా వాడటంలో విఫలమవుతారు. అయితే వారిలోని తెలివితేటలు, వినికిడి, ఉద్వేగభరితమైన ఫీలింగ్స్... తదితర విషయాల్లోనూ మామూలుగానే ఉంటారు. తమ సంజ్ఞలు, సైగల (గెష్చర్స్) ద్వారా కమ్యూనికేషన్ అంతా సాధారణంగానే నిర్వహిస్తుంటారుగానీ, మాటలు లేదా పదాలు పలకడం (వర్బల్ ఎక్స్ప్రెషన్స్) ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించడం మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది. మరికొందరిలో భాషను నేర్చుకునే శక్తి కొంతమేరకు తక్కువగానే ఉంటుంది. వాళ్లలో మరికొన్ని కాంప్లికేషన్లూ వచ్చే అవకాశమూ ఉంటుంది. ఏం చేయాలి? ఇలాంటి పిల్లల విషయంలో... వారు మాటలు నేర్చుకోవడం / మాట్లాడటం అనే ప్రక్రియ ఎందుకు ఆలస్యం అయ్యిందనే విషయంలో పూర్తి ఇవాల్యుయేషన్ అవసరం. ఇందుకోసం... ‘ఎర్లీ లాంగ్వేజ్ మైల్స్టోన్ స్కేల్ టెస్ట్’, ‘స్టాన్ఫోర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్’, ఆడియోమెట్రీ, బ్రెయిన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల వల్ల మాటలు రాకపోవడానికి కారణాలేమిటి, ఆ కారణాల తీవ్రత ఎంత, వాటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయన్న పలు విషయాలు తెలుస్తాయి. ఇలాంటి పిల్లలున్నవారు ఒకసారి మీ కుటుంబ పిల్లల డాక్టర్‌కూ లేదా స్పీచ్ థెరపిస్ట్కూ చూపించాలి. ఒకసారి సమస్యనూ, తీవ్రతనూ తెలుసుకుంటే... ఆ తర్వాత ‘స్పీచ్ పాథాలజిస్ట్’లు పిల్లలకు మాటలు వచ్చే శిక్షణను మొదలుపెడతారు. తల్లిదండ్రుల భూమిక ఇలాంటి పిల్లలకు మాటలు నేర్పే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్లకూ కొంత శిక్షణ అవసరమవుతుంది. తల్లిదండ్రులు పూర్తి సహనంతో ఉంటూ, భాష విషయంలో తామూ పిల్లల స్థాయికి చేరుకుని, వాళ్లకు మాటలు నేర్పాలి. తల్లిదండ్రులు నిత్యం ఆ పిల్లలను ఉత్సాహపరుస్తూ... వారికి భాషతో పాటు ఇతర నైపుణ్యాలూ నేర్పడానికి సంసిద్ధంగా ఉండాలి. - డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ చదవండి: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్..!! -
ఫోన్ నాది.. కాదు నాది ఇచ్చేయ్: వైరలవుతోన్న క్యూట్ వీడియో
కోతి చేష్టలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అవి చేసే తింగరి పనులు అదరిని నవ్విస్తుంటాయి. ఇంటి ఆవరణలో, పైన ఏ వస్తువులు కనిపించిన వాటిని చెల్లాచెదురుగా పడవేస్తాయి. ఇక వాటికి ఏమైనా దొరికితే వాటిని పట్టుకొని నానా హంగామా సృష్టిస్తాయి. ఇక కోతులు డబ్బులు, ఫోన్లను పట్టుకొని పారిపోయిన సంఘటనలు చాలానే చూశాం. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి వైరల్‌గా మారింది. చదవండి: హ్యాట్సాఫ్ మేడమ్!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్ ఈ వీడియోలో ఒక మంచంపై చిన్నారి మొబైల్‌తో ఆడుకుంటుంది. అక్కడికి వచ్చిన కోతి పాప పక్కనే కూర్చుంటుంది. వెంటనే చిన్నారి చేతిలోని ఫోన్‌కు లాక్కొని దాన్ని పరీక్షించి చూస్తుంది. కొద్దిసేపు కోతిని పరీక్షించిన చిన్నారి ఆ ఫోన్‌ను తిరిగి లాక్కుంటుంది. వెంటనే మళ్లీ పాప దగ్గరి నుంచి కోతి ఫోన్ లాక్కుంటుంది. ఇలా ఈ వీడియో చూస్తుంటే మొబైల్ నాదంటే నాది అని లాక్కుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా వైరలవుతూ నెజిజన్లను నవ్విస్తోంది. చదవండి: అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్ View this post on Instagram A post shared by Jagadeesh Madineni (@jagadeeshmadinenimadineni) -
కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా
పిల్లలకు బాల్యం నుంచే సమయస్ఫూర్తి.. పరిస్థితులను ఎదుర్కొని నిలబడే తెగువ, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను అలవాటు చేయాలి. ప్రతి చిన్న విషయానికి కుంగిపోవడం, బెంబేలెత్తడం చేస్తూంటే.. జీవితంలో ముందుకెళ్లడం కష్టమని బాల్యం నుంచే అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే పట్టుమని ఐదేళ్ల వయసు కూడా లేని ఓ చిన్నారి స్టేజీ మీద చూపిన అద్భుత సమసయస్ఫూర్తి, ఆత్మ విశ్వాసం.. నెటిజనలను ఫిదా చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందనే వివరాలు తెలియదు. ఇక వీడియోలో ఓ బాబు, పాప ఇద్దరు ర్యాంప్ వాక్ చేస్తుంటారు. తెల్ల దుస్తుల్లో ఎంతో క్యూట్‌గా ఉంటారు చిన్నారులు. అలా వాక్ చేస్తుండగా ఉన్నట్టుండి పాప చెప్పు ఉడిపోతుంది. దాన్ని సరిచేసుకుంటుండగా.. తల మీద ఉన్న కిరీటం కూడా జారిపోతుంది. ఈ సంఘటన చూసి అక్కడున్న పెద్దలంతా ఒక్కసారిగా నవ్వుతారు. కూడా ఉన్న పిల్లాడు నవ్వుతాడు. (చదవండి: మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్) ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. ఇంత జరిగినా ఆ చిన్నారి ఏ మాత్రం బెదరదు.. సిగ్గుపడదు. వెంటనే తన కిరీటాన్ని సరిచేసుకోవడమే కాక చెప్పు తొడుక్కుని ర్యాంప్ వాక్ పూర్తి చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: హైదరాబాద్ మెట్రో: ఇంత దారుణమా.. మనుషులమేనా?!) ఇది చూసిన నెటిజనులు.. ‘‘చిన్నారి స్థానంలో పెద్దవారు ఉన్నప్పటికి కూడా జరిగిన సంఘటనతో వారు చాలా సిగ్గుపడేవారు. భయపడుతూ.. అక్కడ నుంచి పరిగెత్తే వారు. కానీ ఈ చిన్నారి ఎంతో ఆత్మవిశ్వాసంతో.. ఏమాత్రం తడబడకుండా.. పరిస్థితిని చక్కదిద్దుకుని ముందుకు సాగింది. చాలా స్ట్రాంగ్‌గా నిలబడింది. భవిష్యత్తులో కూడా ఈ చిన్నారి ఇలానే పరిస్థితులకు తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే View this post on Instagram A post shared by Beautiful and Wholesome World (@_beautiful_._world) -
పది నెలల చిన్నారిపై ఆయా పైశాచికత్వం.. గుక్కపట్టి ఏడుస్తున్నా
కోల్‌కతా: ప్రస్తుతం భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే.. జీవితం సాఫిగా సాగిపోతుంది. పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, పిల్లల చదువు, వైద్యం వంటి ఖర్చులను దృష్టి పెట్టుకుని.. చాలా మంది ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో చిన్నారుల ఆలనాపాలన విషయం ఉద్యోగం చేసే దంపతులను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే పర్లేదు. కానీ బయట వ్యక్తుల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడే సమస్య ఎదురవుతుంది. ఈ ఆయాల్లో కొందరు చిన్నారులనే కనికరం కూడా లేకుండా పిల్లలను హింసిస్తారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్‌కు చెందిన దంపతులు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. వారికి పది నెలల పాప ఉంది. ఇద్దరు జాబ్ చేస్తుండటంతో చిన్నారి ఆలనపాలన చూడటానికి ఓ ఆయాను నియమించుకున్నారు. మొదట్లో బాగానే ఉంది. కానీ రాను రాను చిన్నారి ప్రవర్తనలో మార్పు రాసాగింది. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చాక చిన్నారి ఆయా దగ్గరకు వెళ్లడానికి నిరాకరించేది. ఆమెనే చూస్తేనే పాప బాగా ఏడ్చేది. (చదవండి: Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..) తల్లిదండ్రులకు ఆయా ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వారు ఇంట్లో సీసీటీవీ పెట్టారు. ఆఫీస్‌కు వెళ్లాక.. అక్కడ నుంచి మానిటర్ చేసేవారు. ఇక సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు వారిని భయభ్రాంతులకు గురి చేశాయి. ప్రాణం పోయినట్లు విలవిల్లాడారు. కారణం ఏంటంటే సదరు ఆయా ఏమాత్రం కనికరం లేకుండా పది నెలల చిన్నారిని.. దారుణంగా చితకబాదింది. పాప గుక్కపట్టి ఏడుస్తున్న ఆ రాక్షసి కనికరించలేదు. (చదవండి: Fact Check: డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఇలా ఉన్నాడేంటీ?) ఈ దృశ్యం చూసిన వెంటనే చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో పోలీసులుకు ఫిర్యాదు చేసి.. వారిని వెంటపెట్టకుని ఇంటికి వచ్చారు. ఆయాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్నారిని మెడినిపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: అర్పిత.. స్ఫూర్తి ప్రదాత -
‘ఒరేయ్ కన్నా.. ఏంట్రా ఈ పని!’
ఎంతటోడైనా సరే అమ్మ ముందుకు వచ్చేసరికి పసివాడే అవుతాడు. అలాంటిది అమ్మ ముందు వేషాలేస్తే ఊరుకుంటుందా?. సాధారణంగా అభిమానంతోనో లేదంటే నిరసన తోనో కొందరు ఆట జరిగేటప్పుడు మైదానాల్లోకి పరుగులు తీయడం చూస్తుంటాం. కానీ, ఇక్కడో బుడ్డోడు అల్లరిలో భాగంగా మైదానంలోకి పరుగులు తీశాడు. సీరియస్‌గా ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. రెండున్నరేళ్ల పిలగాడు తల్లి ఒడి నుంచి తప్పించుకుని గ్రౌండ్లోకి దూరబోయాడు. ఆటలో పడి పరధ్యానంలోకి వెళ్లిన ఆ తల్లి.. కాసేపటికే కొడుకు ఫెన్సింగ్ కింద నుంచి పాకుతూ గ్రౌండ్ వైపు పోతున్న సంగతి గుర్తించింది. We hope this mother and her young pitch invader are having a great day. 😂 pic.twitter.com/hKfwa6wyWI — Major League Soccer (@MLS) August 9, 2021 వెంటనే రియాక్ట్ అయ్యి ఒక దూకున బారికేడ్ దూకి కొడుకు వెంటే గ్రౌండ్లోకి దౌడు తీసింది. ఆ వెంటనే కొడుకును ఒడిసి పట్టి, సిబ్బంది సహకారం లేకుండానే గ్రౌండ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇంకేం గ్రౌండ్ మొత్తం ఒక్కసారి ఘొల్లుమని గోల చేసింది. A young pitch invader was quickly scooped up by their own personal security detail without incident. #FCCincy #mls pic.twitter.com/gK2bzgNdas — Sam Greene (@SGdoesit) August 8, 2021 కట్ చేస్తే.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. సిన్సిన్నాటి, ఓర్లాండో మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను మేజర్ లీగ్ సాకర్ ట్విటర్ పేజ్ ఆ సరదా వీడియోను పోస్ట్ చేసింది. ఆ పిలగాడి పేరు జేడెక్ కార్పెంటర్, ఆ తల్లి పేరు మోర్గాన్ టక్కర్. ఓహియోలో ఉంటారు ఆ తల్లీకొడుకులు. -
చిన్నారికి లాటరీ తెచ్చిన అదృష్టం.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఫ్రీ
సాక్షి, ముంబై: వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన జన్యుపరమైన రుగ్మతతో ఎస్ఎంఏ (స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ) తో బాధపడుతున్న చిన్నారికి అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. రానున్న రెండో పుట్టిన రోజు సందర్భంగా ఆ పసిబిడ్డకు పునర్జన్మ లభించింది. ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన 16 కోట్ల ఇంజెక్షన్ ఉచితంగా లభించడంతో చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదీ అమెరికా సంస్థనుంచి ఈ అవకాశాన్ని దక్కించుకున్న ఇండియాలో తొలి చిన్నారిగా నిలిచాడని పేర్కొన్నారు. వివరాలను పరిశీలిస్తే..మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శివరాజ్ దావరే ఎస్ఎంఏ బారిన పడ్డాడు. ప్రాథమిక నిర్ధారణ అనంతరం శివరాజన్ ప్రాణాలను కాపాడటానికి ‘జోల్గెన్స్మా’ (జీన్ రీప్లేస్మెంట్ థెరపీ) ఇంజెక్షన్ అవసరమని ముంబైలోని హిందూజా ఆసుపత్రికి న్యూరాలజిస్ట్ డాక్టర్ బ్రజేష్ ఉదాని తేల్చి చెప్పారు. ఈ అరుదైన వ్యాధి చికిత్సలో కీలకమైన, అతి ఖరీదైన ఇంజెక్షన్ ఎలా సాధించాలో తెలియక మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన శివరాజ్ తండ్రి విశాల్, తల్లి కిరణ్ తీవ్ర ఆవేదన చెందారు. ఈ క్రమంలో క్లినికల్ ట్రయల్స్ నిమిత్తం అమెరికాకు చెందిన సంస్థ లాటరీ ద్వారా ఈ ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇస్తుందని, అందుకు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ ఉదాని సూచించారు. ఉదాని సలహా మేరకు విశాల్ ఉచిత ఇంజక్షన్కోసం ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ డిసెంబర్ 25, 2020 న శివరాజ్ ఇంజెక్షన్ పొందడానికి లక్కీ డ్రాలో ఎంపికయ్యాడు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 19 న, శివరాజ్‌కు హిందూజా ఆసుపత్రిలో ఇంజక్షన్ ఇచ్చారు. వైద్యుల ప్రకారం ఎస్ఎంఏ అనేది జన్యుపరమైన వ్యాధి. ప్రతి 10వేల మందిలో ఒకరు ఈ వ్యాధితో పడుతున్నారు. ఈ జన్యు లోపం పిల్లల కదలికలను నిరోధిస్తుంది. కండరాలు పని తీరును, మెదడు కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది క్రమంగా పిల్లల మరణానికి దారితీస్తుంది. ప్రస్తుతం దీనికి అందుబాటులో ఉన్న చికిత్స ప్రపంచంలోనే అతి ఖరీదైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ మాత్రమే. అదీ రెండేళ్లలోపు ఈ చికిత్స అందించాలి. భారత్‌లో దొరకని ఆ ఇంజెక్షన్‌ను అమెరికా నుంచి మాత్రమే తెప్పించాలి. ఇందుకు సుమారు 16 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. -
పసికందు ఏం నేరం చేసిందని..?
నరసన్నపేట: ఆ లేలేత కళ్లతో తల్లిని చూసిందో లేదో..? ఆ చిట్టి చేతులతో తండ్రిని తాకిందో లేదో..? పుట్టాక చనుబాలైనా తాగిందో లేదో..? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి తుప్పల్లోకి చేరిందో పసిపాప. అప్పుడే పుట్టింది కదా.. అమ్మను విసిగించి ఉండదు. తొమ్మిది నెలలు గర్భంలోనే ఉంది కదా.. నాన్న మనసు కష్టపెట్టే ప్రసక్తే లేదు. అసలు తాను ఆడపిల్లనని కూడా తనకు తెలిసి ఉండదు. మరేం నేరం చేసిందని.. పాపకు ఇంత శిక్ష విధించారు ఆ తల్లిదండ్రులు...? నరసన్నపేట–జలుమూరు మండలాల బోర్డర్ కంబకాయ సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు పక్కన బుధవారం ఓ పసిపాప తుప్పల్లో స్థానికులకు దొరికింది. వివరాల్లోకి వెళితే.. కంబకాయ రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం స్థానికులు సూర్యనారాయణ, బసివాడకు చెందిన యూత్ స్టార్ సభ్యులు సాయిమణికంఠ, తేజ, కృష్ణలు రన్నింగ్ చేస్తుండగా రోడ్డు పక్క నుంచి ఓ పసి బిడ్డ ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలిస్తే అప్పుడే పుట్టిన ఆడ శిశువు రక్త కారుతూ కనిపించింది. వెంటనే వారు బిడ్డను బయటకు తీసి అదే రోడ్డుపై వెళ్తున్న మహిళల సాయంతో సపర్యలు చేశారు. వేకువజామున ఎవరో వదిలి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. శిశువుకు సపర్యలు చేశాక వెంటనే ఆటోలో నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. సకాలంలో స్పందించిన ఆస్పత్రి సిబ్బంది ఆ శిశువుకు సపర్యలు చేశారు. సమాచారం అందుకున్న నరసన్నపేట ఎస్ఐ వి.సత్యనారాయణ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు వచ్చి బిడ్డను పరిశీలించారు. ఊపిరి పీల్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతుండటంతో మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 సిబ్బంది బాలరాజు తెలిపారు. -
ఐదుగురికి లైఫ్ ఇచ్చిన చిన్నారి
గాంధీనగర్: దానం చేయడం అంటేనే మనకు ఉన్నదాంట్లో నుంచి ఇతరులకు పంచడం. ఇక అన్ని దానాల్లోకెల్లా అన్నదానం, విద్యా దానం గొప్పదని చెప్తారు. ఒకటి ఆకలి తీర్చితే.. మరొకటి మనతో పాటు మరి కొందరి ఆకలి తీర్చే మార్గం చూపిస్తుంది. అయితే వీటన్నిటికంటే గొప్పదానం మరొకటి ఉంది. కానీ దాని గురించి జనాలకు పెద్దగా అవగాహన లేదు. అదే అవయవ దానం. అవును మనం చనిపోతూ మరి కొందరిని బతికించడం. ఒక జీవిని మనం మరణం నుంచి తప్పిస్తున్నామంటే.. దైవంతో సమానం. కానీ ఎందుకో మన దగ్గర అవయవ దానం గురించి ఎక్కువగా అవగాహన లేదు.. ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవు. ఒక మనిషిని మరణం నుంచి తప్పించే అవయవ దానం అన్ని దానాల్లోకెల్ల గొప్పది. గుజరాత్‌కు చెందిన ఓ జంటకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే తమను విడిచిపోయిన కుమారుడి అవయవాలు దానం చేసి.. మరి కొందరి ప్రాణాలు నిలిపి.. వారిలో తమ బిడ్డను చూసుకుని కడుపుకోతను మర్చిపోతున్నారు. (చదవండి: 36 కిమీ..28 నిమిషాలు! ) వివరాలు.. గుజరాత్‌కు చెందిన జర్నలిస్ట్ సంజీవ్ ఓజా దంపతులకు యష్ ఓజా అనే రెండున్నరేళ్ల ముద్దులొలికే కుమారుడు ఉన్నాడు. ఆడుతూ పాడుతూ.. సంతోషంగా ఎదుగుతున్న యష్ దురదృష్టవశాత్తు ఓ రోజు రెండో అంతస్తులో ఉన్న తన ఇంటి నుంచి కింద పడ్డాడు. దాంతో మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయింది. చిన్నారి బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో యష్ గురించి తెలుసుకున్న డోనేట్ లైఫ్ అనే ఎన్జీఓ చిన్నారి తల్లిదండ్రులను కలుసుకుని.. వారి బిడ్డ అవయవాలు దానం చేసేలా వారిని ఒప్పించారు. భౌతికంగా తమకు దూరమైన బిడ్డ.. మరి కొందరికి ప్రాణం పోసి.. వారిలో జీవించి ఉంటాడని భావించిన తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు. (చదవండి: రహస్యంగా రూ.58 వేల కోట్ల్ల దానం!) ఈ క్రమంలో యష్ గుండెని రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి.. ఊపిరితిత్తులను ఉక్రెయిన్‌కు చెందిన మరో చిన్నారికి.. అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలకు కిడ్నీలను.. భావ్నాగర్కు చెందిన మరో రెండేళ్ల చిన్నారికి యష్ లివర్ని అమర్చరారు. మరి కొద్ది రోజుల్లో మరణాన్ని చూడాల్సిన ఈ ఐదుగురు యష్ వల్ల తమ ఆయువును పెంచుకున్నారు. ఇక బిడ్డను కోల్పోయిన యష్ తల్లిదండ్రులు వీరిలో తమ చిన్నారిని చూసుకుంటూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. -
ఈ క్యూట్ వీడియోకి నెటిజన్లు ఫిదా
అడవి నుంచి తప్పిపోయిన పిల్ల జింకతో ఓ చిన్నారి ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే ఈ క్యూట్ వీడియోకి నెటిజన్లు వేలకొద్ది లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమీప పరిసరాల్లోని అడవి నుంచి తప్పిపోయిన పిల్ల జింక జనావాసంలోకి వచ్చింది. బిక్కుబిక్కుమంటూ ఓ చెత్తడబ్బా వెనక దాకొన్న జింక అటుగా వెళ్తున్న చిన్నారిని చూసి బయటకు వచ్చింది. అయితే అకస్మాత్తుగా జింక కనిపించేసరికి మొదట భయపడ్డ ఆ చిన్నారి కాసేపటికి దాన్ని ప్రేమగా నిమురుతూ సరదాగా ఆడుకుంది. 15 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటికే 11,000మంది చూసి రీట్వీట్లు చేస్తున్నారు. Tiny human meets tiny deer 🤗❤️ pic.twitter.com/SnmtXVNZvR — The Feel Good Page ❤️ (@akkitwts) December 3, 2020 -
సైకిల్‌పై వచ్చి చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి
ఇటీవల ఓ కోతి సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి విచిత్ర సంఘటన మరొకటి చోటుచేసుకుంది. సైకిల్‌పై వచ్చిన ఓ కోతి రెండేళ్ల చిన్నారిని రోడ్డుపై లాక్కెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాళ్లోకి వెళితే.. కొంతమంది చిన్నారులు రోడ్డు పక్కన ఉన్న ఓ బెంచ్‌పై కూర్చొని ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో సైకిల్‌పై వేగంగా అక్కడికి వచ్చిన ఓ కోతి.. సైకిల్ కిందపడేసి చిన్న బాబును తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అతను అదుపు తప్పి కిందపడిపోయాడు. అయినా సరే కోతి వదిలిపెట్టలేదు.. మళ్లీ వెనక్కి వచ్చి మరీ చిన్నారి దుస్తులను పట్టుకొని కొంత దూరం రోడ్డుపై లాక్కెళ్లింది. ఇది గమనించిన స్థానిక వ్యక్తి వెంటనే అక్కడికి రావడంతో కోతి బాలుడిని వదిలేసి పారిపోయింది. (ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు.. ) కాగా దీనికి సంబంధించిన వీడియోను అమెరికన్ బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ సోమవారం ట్విటర్లో పోస్ట్ చేశాడు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే నాలుగు మిలియన్ల వ్యూవ్స్‌ను సొంతం చేసుకుంది. 16వేల మంది దీనిపై స్పందించారు. ఇక వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కోతి బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేసిందంటూ కామెంట్ చేస్తున్నారు. (అందుకోసం ఏడు గంటలు శ్రమించిన హృతిక్ ) -
దీపక్ కిడ్నాప్ మిస్టరీ వీడింది!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కిడ్నాపైన ఏడాదిన్నర బాలుడు దీపక్ ఆచూకి లభ్యమైంది. అర్ధరాత్రి బాలున్ని గుర్తి తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. చిలకలగూడ పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో దీపక్‌ను ముగ్గురు మహిళలు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. కొంతమంది మహిళలు ముఠాగా ఏర్పడి ఇద్దరు చిన్నారులతో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. మౌలాలికి చెందిన రాధిక, తులసీరామ్ దంపతులకు నలుగురు సంతానం.. వారు రాము(9), ధనిరాం(6), లక్ష్మణ్(4), దీపక్ (18 నెలలు). తులసీరామ్ ఓ కేసులో జైలులో ఉన్నాడు. డెలివరీ కోసం వచ్చిన బంధువును పరామర్శించేందుకు రాధిక ముగ్గురు పిల్లలతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలోని విజిటర్స్ షెడ్డులోనే ఆమె ఉంటోంది. గత నెల 5న ఉదయం నిద్రలేచి చూడగా దీపక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ ముఠా బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ముఠాలో ముగ్గురు మహిళలతోపాటు 12 ఏళ్ల బాలుడు, పదేళ్ల బాలిక ఉన్నట్లు సమాచారం.