భూమ్మీద నూకలుండటం అంటే ఇదే | Video captures moment 'hero' teenager saves baby falling from apartment in Turkey | Sakshi
Sakshi News home page

భూమ్మీద నూకలుండటం అంటే ఇదే

Published Thu, Jun 27 2019 1:54 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

రెండేళ్ల ఈ చిన్నారి ఆయుష్షు గట్టిది కాబట్టి.. రెండో అంతస్తు నుంచి కింద పడి కూడా క్షేమంగా బతికి బట్టకట్టగలిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. చిన్నారిని కాపాడిన యువకుడు ఓవర్‌నైట్‌లో హీరో అయ్యాడు. వివరాలు.. ఫ్యూజి జబాత్‌(17) అనే యువకుడు రోడ్డు వెంట నడుచుకుంటు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల చిన్నారి రెండో అంతస్తు నుంచి కింద పడటం జబాత్‌ కంట పడింది. వెంటనే అప్రమత్తమైన జబాత్‌.. పాప కింద పడే చోటు ఊహించి అక్కడకు వెళ్లి నిల్చున్నాడు.

ఫలితంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ చిన్నారిని కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. నెటిజన్లు జబాత్‌ సమయస్ఫూర్తిని, సాహసాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement