రైల్వేకోడూరు(వైఎస్సార్ జిల్లా): డెంగీ జ్వరంతో 8 నెలల బాలుడు మృతిచెందిన సంఘటన తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరంపోడు పంచాయతీ హరిజనవాడకు చెందిన చౌడవరం రెడ్డయ్య(8 నెలలు)కు మూడు రోజుల క్రితం డెంగీ సోకడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.