వరంగల్: వరంగల్ బస్టాండ్లో శిశివు మృతదేహం కలకలం సృష్టించింది. గోదావరిఖని డిపోకి చెందిన బస్సు ప్రయాణికులతో ఆదివారం వరంగల్ వచ్చింది. ఈ బస్సులో ఒక సంచిలో శిశివు మృతదేహాన్ని ప్రయాణికులు గుర్తించారు. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆ సంచిని బస్సులో వదిలి వెళ్లాడని ప్రయాణికులు చెబుతున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.