
– సహకరించిన సోదరుడు అరెస్ట్
సేలం: తెన్‌కాశి సమీపంలో మదునాదపేరి కుళం ప్రాంతంలో ముళ్ల పొదలో ఓ మహిళ కాల్చి చంపిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. ఘటనా స్థలంలో అనేక మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రత్యేక బృందం పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా విచారణ జరిపారు. అందులో.. ముందు రోజు రాత్రి 9.30 గంటలకు సందేహాస్పదంగా ఒక కారు వెళ్లినట్లు తెలిసింది. ఆ కారు నెంబర్ ఆధారంగా జరిపిన విచారణలో... ఆ కారు శివకాశికి చెందిన ఒకరికి సొంతమైనది అని తెలిసింది.
పోలీసుల విచారణలో శివకాశి భారతి నగర్‌కు చెందిన జాన్‌కిల్‌బర్ట్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను తన భార్యను కాల్చి చంపినట్టు తెలిసింది. వివరాలు.. జాన్‌కిల్‌బర్ట్ అదే ప్రాంతానికి చెందిన కమలి (30) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వేరు వేరు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రులను వ్యతిరేకించి జాన్‌కిల్‌బర్డ్ తన ప్రియురాలు కమలినినిపెళ్లి చేసుకున్నాడు.
వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఈ స్థితిలో భార్య, భర్త మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈనెల 10వ తేదీ జరిగిన గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన జాన్‌కిల్‌బర్డ్ తన భార్య కమలిపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. తర్వాత తన సోదరుడి సహకారంతో ఆమె మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని శంకరన్‌కోవిల్, తిరువెంగడం మార్గంగా తెన్‌కాశికి తీసుకువచ్చి 110 కిలో మీటర్ల దూరం కారులో కమలి మృతదేహాన్నీ తీసుకువచ్చి ఇలదూర్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ముల్ల పొదల్లో కాల్చినట్టు తెలిసింది. అనంతరం పోలీసులు జాన్‌కిల్‌బర్డ్‌తో పాటూ అతనికి సహకరించిన సోదరుడు తంగతిరుపతిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment