CC camera footage
-
భార్యను కాల్చి చంపిన భర్త
సేలం: తెన్కాశి సమీపంలో మదునాదపేరి కుళం ప్రాంతంలో ముళ్ల పొదలో ఓ మహిళ కాల్చి చంపిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. ఘటనా స్థలంలో అనేక మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రత్యేక బృందం పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా విచారణ జరిపారు. అందులో.. ముందు రోజు రాత్రి 9.30 గంటలకు సందేహాస్పదంగా ఒక కారు వెళ్లినట్లు తెలిసింది. ఆ కారు నెంబర్ ఆధారంగా జరిపిన విచారణలో... ఆ కారు శివకాశికి చెందిన ఒకరికి సొంతమైనది అని తెలిసింది. పోలీసుల విచారణలో శివకాశి భారతి నగర్‌కు చెందిన జాన్‌కిల్‌బర్ట్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను తన భార్యను కాల్చి చంపినట్టు తెలిసింది. వివరాలు.. జాన్‌కిల్‌బర్ట్ అదే ప్రాంతానికి చెందిన కమలి (30) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వేరు వేరు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రులను వ్యతిరేకించి జాన్‌కిల్‌బర్డ్ తన ప్రియురాలు కమలినినిపెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఈ స్థితిలో భార్య, భర్త మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈనెల 10వ తేదీ జరిగిన గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన జాన్‌కిల్‌బర్డ్ తన భార్య కమలిపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. తర్వాత తన సోదరుడి సహకారంతో ఆమె మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని శంకరన్‌కోవిల్, తిరువెంగడం మార్గంగా తెన్కాశికి తీసుకువచ్చి 110 కిలో మీటర్ల దూరం కారులో కమలి మృతదేహాన్నీ తీసుకువచ్చి ఇలదూర్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ముల్ల పొదల్లో కాల్చినట్టు తెలిసింది. అనంతరం పోలీసులు జాన్కిల్బర్డ్తో పాటూ అతనికి సహకరించిన సోదరుడు తంగతిరుపతిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం రిమాండ్‌కు తరలించారు. -
శరత్ అనే వ్యక్తితో కళావతి సన్నిహితంగా..!
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో 53 ఏళ్ల వివాహిత పూజారి కళావతి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం మ«ధ్యాహ్నం రెండున్నర గంటలకు తన స్వగ్రామం పొందూరు మండలం మొదలవలస నుంచి శ్రీకాకుళం నగరానికి తన వ్రస్తాలు తెచ్చుకుంటానని స్కూటీపై వచ్చిన ఆమె రోజు గడిచినా ఇంటికి వెళ్లకపోవడం.. ఆదివారం రాత్రి న్యూకాలనీ ఎక్సైజ్ కార్యా లయం సమీపంలోని ఓ బిల్డింగ్ పై ఫ్లోర్ బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది. రెండో పట్టణ పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన పూజారి వెంకటరావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని భార్య కళావతి. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఓ కుమార్తె ఉన్నారు. ఈమెకు నగరంలో సత్సంగంకు భజనలకు వెళ్లే అలవాటు ఉంది. శనివారం నగరానికి స్కూటీపై వచ్చిన ఆమె రాత్రయినా ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె సత్సంగానికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఉదయం అక్కడ ఉన్న గురువుకు ఫోన్ చేశాక రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించడంతో.. ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి చివరన, మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా చైతన్య కళాశాల వద్ద ఆమె స్కూటీ ఆపి పార్క్ చేయడం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెడ్డిమ్ ఎంటర్‌ప్రైజస్ బిల్డింగ్ ఒకటో ఫ్లోర్‌కు మెట్లెక్కుతూ ఉండటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె దిగడం రికార్డు కాలేదు. దీంతో రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తన సిబ్బందితో పాటు క్లూస్ టీమ్‌తో పై ఫ్లోర్ రూమ్‌లోకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న బాత్రూమ్లో కళావతి విగతజీవిగా పడి ఉంది. పరిసరాలన్నీ పరిశీలించగా బాత్రూమ్ పక్కన ఉన్న గదిలో బెడ్ ఉండటం, దానిపై రెండు తలగడల్లోని ఓ తలగడపై రక్తపు మరక ఉండటం, కళావతి ముక్కు నుంచి కూడా రక్తం కారి ఉండటాన్ని బట్టి హత్యగా భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె వచ్చిన బిల్డింగ్ ఓనర్ సూరిబాబు అనే వ్యక్తి. అందులో పై ఫ్లోర్లో అండలూరి శరత్‌కుమార్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ వ్యక్తితో గత కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడిన బాలుడి హత్య మిస్టరీ -
మీరు కెమెరా నిఘాలో ఉన్నారు!
సాక్షి, సిటీబ్యూరో: కమిషనర్‌ను కలిసేందుకు ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీకి వచ్చే వారు, పోయే వారు స్క్రీన్లపైనా కనబడేలా కొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.. పరిసరాల్లో దాదాపు 40 వరకు సీసీటీవీ కెమెరాలున్నాయి. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వస్తున్నారో దృశ్యాలు వాటిల్లో నిక్షిప్తమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాటిల్లో నమోదయ్యే దృశ్యాలు స్క్రీన్లపై అందరికీ కనిపించేలా కూడా మేయర్ ఎంట్రెన్స్, కమిషనర్ ఎంట్రెన్స్ వద్ద ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న స్క్రీన్‌పై నగరంలోని ఆయా ప్రాంతాల్లోని దృశ్యాల్ని కూడా వీక్షించే ఏర్పాట్లున్నాయి. వరదలు, గణే శ్ నిమజ్జనం వంటి సందర్బాల్లో మేయర్, అధికారులు నగర పరిస్థితుల్ని పరిశీలించేందుకు సదరు ఏర్పాట్లు చేయడం తెలిసిందే. -
‘డ్యాష్ క్యామ్’లకు డిమాండ్
తేలికపాటి, భారీ వాహనాలకు డ్యాష్ బోర్డుల వద్ద కెమెరాల ఫిక్సింగ్ 2016 ఫిబ్రవరి 21.... కుషాయిగూడలోని పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు...ఏపీ 29 బీటీ 6615 లారీ వల్ల జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లా చీకటిమామిడికి చెందిన భూపతి మధుసూదనరావు చనిపోయారు. అది ప్రమాదంకాదంటూ లారీ డ్రైవర్ నెత్తి నోరు బాదుకున్నారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేసిన పోలీసులు..మధుసూదనరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. ⇒ ఈ ఉదంతం చోటు చేసుకున్న చోట సీసీ కెమెరాలు లేకపోతే..! ‘ఆనవాయితీ’ ప్రకారం లారీ డ్రైవర్ కేసు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇలాంటి వాటితో పాటు డ్రైవర్లకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారంగా అందుబాటులోకి వచి్చనవే డ్యాష్ క్యామ్స్గా పిలిచే డ్యాష్ బోర్డు కెమెరాలు. నగరంలో వీటి వినియోగం ఇటీవల కాలంలో 30 శాతం పెరిగినట్లు కార్ డెకార్స్ వ్యాపారులు చెబుతున్నారు. ఉదంతాలతో పాటు మోసాలు ఎన్నో... కుషాయిగూడలో జరిగిన మధుసూదన్ రావు తరహా ఉదంతాలతో పాటు ప్రమాదాల పేరుతో కొందరు చేసే మోసాలు అనునిత్యం చోటు చేసుకుంటున్నాయి. తమ వారిని ఉద్దేశపూర్వకంగా వాహనాలకు ఎదురుగా, పక్కన నుంచి సమీపంలోకి పంపించే వాళ్లు ఉన్నారు. ఇలా వెళ్లిన వాళ్లను ఆ వాహనాలు తాకితే చాలు తక్షణం కింద పడిపోతారు. అక్కడే ఉండే వారి సంబం«దీకులు యాక్సిడెంట్ అంటూ హడావుడి చేస్తారు. మరికొన్ని ముఠాలైతే నిర్మానుష్య, రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను ఆపుతున్నారు. ఫలానా చోట యాక్సిడెంట్ చేసి, పట్టించుకోకుండా వచ్చేస్తున్నావంటూ డ్రైవర్లను మోసం చేస్తున్నారు. ఈ రెండు తరహాలకు చెందిన వారి ప్రధాన ఉద్దేశం..బెదిరించి డబ్బు గుంజడమే. హైఎండ్ వాహనాలకు ఇన్‌బుల్ట్‌గా... కీలక సందర్భాల్లో వినియోగించడంతో పాటు ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ఉద్దేశించినవే డ్యాష్ క్యామ్‌లు. ఇటీవల అనేక హైఎండ్ వాహనాల్లో నలు వైపులా దృశ్యాలను రికార్డు చేయడానికి ఉద్దేశించిన కెమెరాలు ఇన్బుల్ట్గానే వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఖరీదు చేసిన వాటితో పాటు పాత మోడల్స్‌కు చెందిన, సాధారణ వాహనాలను మాత్రం కేవలం వెనుక వైపు మాత్రమే కెమెరా ఉంటోంది. కొన్నింటిలో అసలు కెమెరానే ఉండట్లేదు. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని పరిగణలోకి తీసుకున్న అనేక కంపెనీలు ఈ డ్యాష్ క్యామ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు... ఏది పెద్ద వాహనమైతే దాని చోదకుడిదే తప్పు అన్నట్లు నమోదు చేసే ‘ఆనవాయితీ’ ఏళ్లుగా కొనసాగుతోంది. దీనికి ఈ డ్యాష్ క్యామ్స్ చెక్ చెబుతున్నాయి. డ్యాష్ క్యామ్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో... ఇటీవల కాలంలో వాహన చోదకులు వినియోగిస్తున్న డ్యాష్ క్యామ్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు ఆద్యంతం ఏమి జరిగిందో ఈ వీడియో రుజువులను అందిస్తుంది. తప్పు ఎవరిది అనేది నిర్ధారించడంలో, బీమా క్లెయిమ్‌లను పొందడానికి ఉపయోగపడుతుంది. వాహనాలను యజమానులకు అప్పగించినప్పుడు వారి ప్రవర్తన తదితరాలను ఎప్పటికప్పుడు యజమానికి తెలిసేలా చేస్తుంది. పార్కింగ్ మోడ్‌లోనూ పనిచేసే కెమెరాల వల్ల హిట్–అండ్–రన్ కేసుల్లో కీలక సాక్ష్యాలు లభిస్తాయి. కొత్త డ్రైవర్లు వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలోనూ వీటిలో నమోదైన ఫీడ్ కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని బీమా కంపెనీలు డాష్ క్యామ్‌లు ఉన్న వాహనాలకు ప్రీమియంల్లో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పార్కింగ్ మోడ్‌లో పని చేసేవీ వాడాలి ఈ డ్యాష్ క్యామ్ వాహనం డ్యాష్ బోర్డ్ లేదా విండ్ïÙల్డ్ పైన, రియర్ వ్యూ మిర్రర్ పక్కన/కింద ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నట్లు కోఠికి చెందిన కార్ డెకార్స్ నిపుణులు సయ్యద్ ముస్తాఖ్ చెప్తున్నారు. కొన్ని కేవలం ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. వీటి వల్ల వాహనం పార్క్ చేసి ఉన్నప్పుడు చోటు చేసుకునే ఉదంతాల్లో ఉపయోగం ఉండదు. ఈ నేపథ్యంలోనే బ్యాటరీ ఆధారంగా వాహనం పార్కింగ్ చేసి ఉన్నప్పుడూ పని చేసేవి బిగించుకోవాలని సూచిస్తున్నారు. నిర్ణీత స్టోరేజ్ కెపాసిటీ, మంచి క్యాలిటీ ఉన్న వీడియోను అందించే వాటికే మొగ్గు చూపాలని స్పష్టం చేస్తున్నారు. -
స్టేట్‌బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం.. అకౌంటెంట్ స్వప్న ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గార ఎస్బీఐలో ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. రూ.4కోట్ల 7లక్షల విలువైన 7కిలోల బంగారం కనబడకపోవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు చెబుతున్న ఒక మహిళా ఉద్యోగి ఇప్పటికే ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పుడీ వ్యవహారం బ్యాంకు వర్గాలను కుదిపేస్తోంది. బంగారు ఆభరణాలు గల్లంతుపై పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా అందడంతో ఇందులో ఎవరి ప్రమేయం ఏమిటో తేల్చే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ఫిర్యాదులో నలుగురిని స్పష్టంగా పేర్కొన్నారు. వీరితో పాటు బ్యాంకు అధికారులు, బయట వ్యక్తుల జోక్యంపైనా అనుమానాలుండటంతో పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి. ఈ బాగోతం ఎస్బీఐ బ్రాంచ్‌లో చోటు చేసుకున్నా జిల్లాలో అన్ని బ్యాంకులు అప్రమత్తమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివి ఇంకెక్కడైనా జరిగి ఉండొచ్చేమోనని బ్యాంకు వర్గాలు జాగ్రత్త పడుతున్నాయి. నమ్మకాన్ని వమ్ము చేసి.. బయట వ్యక్తుల వద్ద బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి సొమ్ము తీసుకోవడం శ్రేయస్కరం కాదని చాలా మంది బ్యాంకుల్లో తమ ఆభరణాలను కుదవ పెట్టి సొమ్ము తీసుకుంటారు. ఆ నమ్మకాన్ని గార ఎస్బీఐలో పనిచేసిన కొంతమంది ఉద్యోగులు వమ్ము చేశారు. సూత్రధారులు, పాత్రధారులెవరో విచారణలో తేలనున్నప్పటికీ రూ.4కోట్లకు పైగా విలువైన 7కిలోల బంగారాన్ని మాయం చేశారంటే చిన్న విషయం కాదు. ఇప్పుడా ఖాతాదారులంతా గగ్గోలు పెడుతున్నారు. పర్యవేక్షణ డొల్ల.. సాధారణంగా బ్యాంకులో గోల్డ్ లోన్ విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. దానికొక అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్న అకౌంటెంట్ ఉంటారు. క్లర్క్ లేదా అప్రైజర్ ఉంటారు. వీరిద్దరు ఖాతాదారుల నుంచి తాకట్టు బంగారాన్ని తీసుకుంటారు. వీరితో పాటు ఇద్దరు కస్టోడియన్లు ఉంటారు. వీరిద్దరి వద్ద స్ట్రాంగ్ రూమ్, సేఫ్ (లాకర్లు)కు సంబంధించిన వేర్వేరు తాళాలు ఉంటాయి. అకౌంటెంట్, క్లర్క్ తీసుకున్న బంగారాన్ని కస్టోడియన్లతో కలిపి సేఫ్‌లలో భద్రపరుస్తారు. ఆ ఇద్దరు కస్టోడియన్ల వద్ద ఉన్న వేర్వేరు తాళాలను ఉపయోగిస్తే తప్ప భద్రపరచడం గాని, తీయడం గానీ జరగదు. ఇంతటి పకడ్బందీ వ్యవహారం ఉండే బ్రాంచ్‌లలో దాదాపు 7కిలోల బంగారం పక్కదారి పట్టిందంటే ఇందులో చాలామంది ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి బ్రాంచ్‌లో ఏం జరిగినా సంబంధిత మేనేజర్ బాధ్యత ఉంటుంది. దానితో పాటు ఉన్నతాధికారుల పరిశీలన ఉంటుంది. ఎన్నో సేఫ్‌లలో ఉన్న బంగారం పెద్ద ఎత్తున మాయమవ్వడంతో బ్రాంచ్ పర్యవేక్షణ డొల్లతనం బయటపడింది. ఎలా బయటకు వచ్చింది.. గార బ్రాంచిలో బంగారం ఆభరణాలు కుదవ పెట్టిన ఖాతాల బ్యాగులు 2500 వరకు ఉన్నట్టు సమాచారం. అందులో 86 బ్యాగులలో ఉన్న బంగారు ఆభరణాలు మాయమమ్యాయి. ఓ ఖాతాదారు బ్యాంకుకు తనఖా పెట్టిన బంగారం విడిపించేందుకు వెళ్లగా బంగారం కనబడటం లేదని సమాధానం రావడంతో వ్యవహారం బయటికొచ్చింది. దాంతో అదే రోజు సాయంత్రం మరికొందరు ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరి విషయమై మేనేజరు సీహెచ్ రాధాకృష్ణ వద్ద అడుగగా రెండు రోజుల్లో చెబుతామని నచ్చ చెప్పి వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో ఆ బంగారు ఆభరణాల రుణాల విభాగం బాధ్యతలు చేపడుతున్న అకౌంటెంట్ స్వప్నప్రియను గట్టిగా ప్రశ్నించేసరికి 26బ్యాగులలో ఉన్న రూ. కోటి 75లక్షల బంగారు ఆభరణాలను తెచ్చి ఇచ్చారు. మిగతా 60బ్యాగుల బంగారు ఆభరణాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో బంగారు ఆభరణాలు గల్లంతు వ్యవహారం మిస్టరీగా మారిపోయింది. అంతవరకు వ్యవహారాన్ని గుట్టుగా ఉంచిన అధికారులు తప్పని పరిస్థితుల్లో గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడా కనిపించని 60బ్యాగుల్లో రూ.4కోట్ల 7లక్షల విలువైన 7కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవి ఎవరి చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి. కీలకమైన వ్యక్తి చనిపోవడంతో దీంట్లో ఉన్న పాత్రధారులెవరో తేలాల్సి ఉంది. ఇంతవరకు అంతర్గతంగా తేల్చుకుందామని భావించినా పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎస్బీఐ రీజినల్ మేనేజర్ గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురిపై ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ కోణంలో పోలీసు అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా, 86బ్యాగుల వ్యవహారం వెలుగు చూడటంతో ఆ బ్రాంచ్‌లో ఉన్న మిగతా తాకట్టు ఆభరణాల బ్యాగులలో ఏవైనా తేడాలున్నాయా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. గారలో జరిగిన ఘటనతో మిగతా ఎస్బీఐ బ్రాంచ్‌లలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇతర బ్యాంకులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. తమ బ్యాంకుల్లో ఉన్న బంగారు ఆభరణాల భద్రతపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. స్టేట్‌బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం గార: మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంకులో 7 కిలోల బంగారం మాయమైందని ఫిర్యాదు వచ్చిందని స్థానిక సీఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకులో తనఖా పెట్టిన బంగారంలో ఏడు కిలోలు కనిపించడం లేదని, కొందరు బ్యాంకు సిబ్బందిపై అనుమానం ఉందని గురువా రం బ్యాంకు రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదు చేశారని సీఐ పేర్కొన్నారు. బంగారం విలువ రూ. 4 కోట్ల 70 లక్షల పైనే ఉంటుందని తెలిపారు. అదేవిధంగా బ్యాంకు అకౌంటెంట్ ఉరిటి స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, బంగారం మాయంపై ఆమె పాత్రపై కూడా విచారణ చేస్తామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం ఉదయం నుంచి గార పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు విషయమై ఇన్చార్జి డీఎస్పీ విజయకుమార్, శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ ఎన్.సన్యాసినాయుడు, బ్యాంకు ఆర్ఎం రాజు, గార బ్రాంచి మేనేజర్ సీహెచ్ రాధాకృష్ణతో మాట్లాడారు. సీసీ ఫుటేజీలే కీలకం.. బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమయ్యే సమయంలో లాక్రూంలో ఉన్న సీసీ పుటేజీలే ఈ కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. ఇప్పటికే బ్యాంకు అధికారులు ఈ పుటేజీలు గమనించారని తెలుస్తోంది. బ్యాంకులో 2500 మంది బంగారం తనఖా పెట్టిన ఖాతాదారులుండగా, వీరిచ్చిన బంగారానికి ఒక్కో ఖాతాకు ఒక్కో బ్యాగు సిద్ధం చేస్తారు. ఈ బ్యాగుల్లో తొలుత 86 మాయమయ్యాయని అధికారులు గుర్తించగా, వీటిలో 26 బ్యాగులను అకౌంటెంట్ స్వప్నప్రియ మూడు రోజు ల కిందట బ్యాంకు అధికారులకు అందించినట్టు తెలిసింది. మిగిలిన 60 బ్యాగుల వివరాలు ఆధారంగా 7 కేజీల బంగారం ఆభరణాలు మాయమయ్యాయమని నిర్ధారించారు. నవంబర్ 24వ తేదీన బంగారం మాయమైందన్న ఆరోపణలు రాగా ఇప్పటివరకు అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఆర్ఎం రాజును ప్రశి్నస్తే సమాధానం దాట వేశారు. -
పనిలో పనిఘా.. ఛేదన వడిగా!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాను నిఘా నీడలోకి తెచ్చేందుకు జిల్లా పోలీసు శాఖ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. అందుకోసం జాతీయ రహదారులు మొదలు గ్రామీణ రోడ్ల వరకు, పట్టణాలు నుంచి పంచాయతీల దాకా ఎక్కడిక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నేరుగా స్థానిక పోలీస్స్టేషన్లు, జిల్లా కమాండ్ కంట్రోల్ రూంలకు అనుసంధానం చేశారు. దీంతో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ద్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాల సేకరణ, నిందితులను పట్టుకోవడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాలు తక్కువగా నమోదు అవుతున్నాయని, ఒక వేళ జరిగినా నిందితులను వెంటనే పట్టుకోవడానికి వీలవుతోందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది కాలంలో జిల్లాలో 22 కీలకమైన కేసులను పోలీసుల ఛేదించారు అంటే వీటి పనితీరును ఆర్ధం చేసుకోవచ్చు. జిల్లా ఏర్పాటు తర్వాత 1,530 కెమెరాలు... పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వై.రవిశంకర్‌రెడ్డి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. సున్నితమైన ప్రాంతమైన పల్నాడులో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి ముమ్మరంగా ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు, కమాండ్ సెంటర్ల ఏర్పాటు అయ్యేలా చూశారు. 17 నెలల కాలంలోనే జిల్లాలోని 522 కీలక ప్రాంతాల్లో కొత్తగా 1,530 కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. వీటికి అదనంగా ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, నివాస సముదాయాల్లో ఆయా యాజమాన్యాలు, స్వచ్చంధ సంస్థలతో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొనేలా అవగాహనకల్పించారు. దీంతో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు, వెంటనే నిందితులను గుర్తించడం సులభమవుతోంది. సీసీ కెమెరాల ఏర్పాటు బాధ్యతగా స్వీకరించాలి నేర పరిశోధన, నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకం. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 17 నెలల కాలంలో కొత్తగా 1,530 కెమెరాలను ఏర్పాటుచేశాం. నరసరావుపేట, సత్తెనపల్లి డివిజన్లలో పలు కీలకకేసులను సీసీ కెమెరాల ద్వారా ఛేదించాం. ప్రతి గ్రామంలో కనీసం కీలకవై ున ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు పోలీసుశాఖ కృషి చేస్తోంది. గతంలో దొంగతనాల పరిశోధన కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో చోరీలు తగ్గుముఖం పట్టాయి. దోషులను గుర్తించి, గంటల వ్యవధిలోనే పట్టుకోగలుగుతున్నాం. – వై రవిశంకర్‌రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ జిల్లా ఏర్పడినప్పటి నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య... నరసరావుపేట 195 516 సత్తెనపల్లి 211 798 గురజాల 116 216 జిల్లా మొత్తం 522 1,530 -
సిటీపై కమాండ్.. నేరగాళ్లపై కంట్రోల్!
హైదరాబాద్: ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం...స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం...వాహనచోదకులు గమ్యం చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం... విపత్కర పరిస్థితుల్లో సత్వర స్పందన... ఈ లక్ష్యాలతో ఏర్పాటైన అత్యాధునిక వ్యవస్థే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్). బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ లో ఇదీ ఓ అంతర్భాగమే. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సోమవారం ఆవిష్కరించిన ‘2306 సేఫ్ సిటీ ప్రాజెక్టు సీసీ కెమెరాలు’ ఈ కోణా ల్లో కీలకపాత్ర పోషించనున్నాయి. వీటిలో కొన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తాయి. ‘ప్లేటు’ మారితే పట్టేస్తుంది... నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నెంబర్లకు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ ఈ తరహా కేటుగాళ్లకు చెక్ చెబుతుంది. ఈ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ద్వారా ఆర్టీఏ సర్వర్‌తో అనుసంధానించి ఉంటుంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నెంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నెంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నెంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. వాహన ‘మార్గాలను’ చెప్పేస్తుంది... నగర వ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం సైతం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి రానుంది. 250 జంక్షన్లలో ఉండే సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహనాన్నీ నెంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. ఏదైనా నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనమో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎక్కడికి ప్రయాణించిందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ద్వారా కలుగుతుంది. సీసీసీలోని సిబ్బంది తేదీ, వాహనం నెంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చాలు.. ఆయా రోజుల్లో సదరు వాహనం ఎక్కడ నుంచి నగరంలోకి ప్రవేశించింది? ఏ సమయంలో ఎక్కడ ఉంది? ఏఏ మార్గాల్లో ప్రయాణించింది? ఎక్కడెక్కడ ఆగింది? తదితర అంశాలను తెలియజేస్తుంది. కిడ్నాప్, స్నాచింగ్ వంటి నేరాలు జరిగినప్పుడు ఈ వ్యవస్థ అందించే ఆధారాలు కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. జంక్షన్ల వారీగా వాహన కౌంటింగ్... ప్రతి చౌరస్తా నుంచి నిమిషనిమిషానికీ ముందుకు సాగే వాహనాలను లెక్కించే ప్రక్రియ సైతం ఐటీఎంఎస్లోని సాఫ్ట్‌వేర్స్‌లో ఉన్నాయి. ఓ నిమిషం కాలంలో సదరు జంక్షన్‌ను ఎన్ని వాహనాలను దాటాయి? వాటిలో ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాలతో పాటు భారీ వాహనాలు, బస్సులు ఎన్ని? అనే అంశాన్ని ప్రత్యేక పరికరాల ద్వారా సాఫ్ట్వేర్ లెక్కిస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీసీసీలో ఉండే సిబ్బందికి తెలియజేస్తుంది. ఫలితంగా ఆయా సమయాల్లో ఏఏ రూట్లు బిజీగా ఉన్నాయో తెలుసుకునే సిబ్బంది ఆ విషయాన్ని జంక్షన్లలో ఉండే ప్రత్యే క బోర్డుల ద్వారా వాహనచోదకులకు అందిస్తారు. వీఎంఎస్లతో నిరంతరం సందేశాలు... ఐటీఎంఎస్ ద్వారా ప్రతి జంక్షన్‌లోనూ ఏర్పాటయ్యే వీఎంఎస్‌లు(వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు) ట్రాఫిక్ స్థితిగతులపై నిరంతర సందేశాలు ఇవ్వనున్నారు. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనచోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతుల్ని ఎప్పికప్పుడు వీఎంఎస్‌ల్లో ప్రదర్శితమవుతాయి. ఉల్లంఘనులకు ‘ఈ’ చెక్... జంక్షన్లలో ఉన్న ఫ్రీ–లెఫ్ట్‌ను ఉల్లంఘిస్తూ ఆయా చోట్ల వాహనాలు ఆపినా... వన్‌వే నిబంధనను ఉల్లంఘించినా, వాహనాలు రాంగ్ రూట్లలో దూసుకువస్తున్నా... ప్రస్తుతం ఆయా చోట్ల ఉండే క్షేత్రస్థాయి పోలీసులే చర్యలు తీసుకోవాలి. ఐటీఎంఎస్ వ్యవస్థలో అన్ని జంక్షన్లతో పాటు రాంగ్‌రూట్, వన్‌వే ఉల్లంఘన అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. సర్వర్‌తో అనుసంధానించి ఉండే ఈ కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తారు. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్‌గా సంబంధింత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతుంది. దీంతో పాటు నో–పార్కింగ్, కమ్యూనిటీ పార్కింగ్, పెయిడ్ పార్కింగ్ ప్రాంతాలనూ జీయో ట్యాకింగ్, ఫెన్సింగ్ ద్వారా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఐసీసీసీ ఆధీనంలో ఏ కెమెరాలు ఎన్నంటే..? ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాక్స్, పీటీజెడ్, ఏఎన్పీఆర్ కెమెరాలు 10 వేలు నగర వ్యాప్తంగా వివిధ కీలక ప్రాంతాల్లోనివి 126 మూడు కమిషనరేట్లలోని 2828 జంక్షన్లలోనివి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసి 38 ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు నేను సైతం, కమ్యూనిటీ ప్రాజెక్టుల కింద ఏర్పాటైన 4,99,869 (అవసరమైనప్పుడు యాక్సస్ చేయవచ్చు) జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న గస్తీ వాహనాలకు ఏర్పాటు చేసినవి 1322 ట్రాఫిక్ నిర్వహణతో పాటు నేరగాళ్లకూ చెక్ దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ వ్యవస్థగా రికార్డు -
మల్లన్నా.. ఏదీ రక్షణ?
కొయురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సీసీ కెమరాలకు సంబంధించిన సిస్టం(ఎన్వీఆర్) ధ్వంసమైంది. దీంతో దేవాలయంలోని 32 కెమెరాలు పని చేయడం లేదు. గుడి పరిసరాలలో పనిచేసే సీసీ కెమెరాల సిస్టం యూనిట్‌ను ఏఈవో గదిలో అమర్చారు. ప్రస్తుతం దీనిని పగులకొట్టడంతో సీసీ కెమెరాలు పని చేయక నిత్యం స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు రక్షణ కరువైంది. ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లుందని టెక్నీషియన్ చెబుతున్నాడు. దీంతో ఆలయంలో సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారం క్రితం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గొడవ గురించి సీసీ ఫుటేజీ తీసుకుందామని మంగళవారం టెక్నీషియన్‌ను పిలిపించగా ఎన్వీఆర్ ధ్వంసమైన విషయం తెలిసింది. ఆలయ చైర్మన్ గీస భిక్షపతి వెంటనే విలేకరుల సమావేశం నిర్వహించి ఉద్యోగులే సీసీ కెమెరాల సిస్టం యూనిట్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. కొద్దిరోజులుగా ఈయనకు, ఏఈఓ అంజయ్య మధ్య విభేదాలు తలెత్తడంతో ఆలయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. -
మహిళా దొంగల హల్చల్.. పట్టపగలే బట్టల దుకాణంలో చోరీ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పట్టపగలు మహిళా దొంగలు హల్చల్ చేశారు. బట్టల దుకాణంలోకి కస్టమర్ల మాదిరిగా ప్రవేశించిన నలుగురు మహిళలు చీరల చోరీకి పాల్పడ్డారు. యాజమాని పవన్ కన్నుగప్పి 20 వేల రుపాయల విలువ చేసే చీరలు అపహరించారు. కిలేడీల చోరీ బాగోతం పీపీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు షాప్ నిర్వాహకులు. మరో ముగ్గురు పారిపోగా. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అయిదుగురు మహిళలు గుంటూరు నుంచి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. కొత్తగూడ లో శుక్రవారం అంగడి కావడంతో సందడిగా మారిన షాప్‌లో చోరీకి యత్నించిన మహిళా చోరులు.. నిఘా కళ్ళతో అడ్డంగా బుక్కయ్యారు. -
మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో లాకప్ డెత్ ఘటన కలకలం సృష్టించింది. తాళ్లగుర్జాల పోలీస్ స్టేషన్లో అంజి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన జరగ్గా.. స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో మృతుడి చనిపోయే ముందు క్షణాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో స్టేషన్ హాల్లో కూర్చున్న వ్యక్తి కొద్దిసేపు ఫోన్ చూస్తూ కనిపించాడు. ఏమైందో ఏమోగానీ కాసేపటికి ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అయితే పోలీసుల తీరుపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వల్లే అంజీ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే నిందితుడిది లాకప్ డెత్ కాదని పోలీసులు చెబుతున్నారు. అతనికి ఫిట్స్ రావడంతో చనిపోయాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వ్యక్తి మరణానికి గల అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. పోలీసులు కొట్టడం వల్లే మరణించాడా? లేక నిజంగానే అతనిది సహజ మరణమా తెలియాల్సి ఉంది. కాగా ఓ మహిళ ఇంటిపై దాడి చేసిన చేసులో అంజీని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
దానిమ్మ తోటకు... తుపాకీ, కారంపొడితో గస్తీ
కర్ణాటక: ధరలు భగ్గుమనడంతో మొన్నటివరకు రైతులు టమాట తోటలకు సీసీ కెమెరాలు, పహిల్వాన్లను పెట్టి గస్తీ కాయడం తెలిసిందే. ఇప్పుడు చిక్కబళ్లాపుర జిల్లా కేంద్రం పరిధిలోని నాయనహళ్లి అందార్లహళ్లి, చదలపుర, నంది తదితర గ్రామాలలో దానిమ్మ తోటలను రైతులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. దానిమ్మ పండ్లు మేలిరకం కేజీ ధర రూ.150 నుంచి 200 దాకా మార్కెట్లో ఉంది. తుపాకీ, కారంపొడితో గస్తీ తరచూ తోటల్లోకి దొంగలు చొరబడి పండ్లను ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు రాత్రి వేళలో కాపలా కాస్తున్నారు. నాయనహల్లి గ్రామంలో రైతు చందన్ రెండు ఎకరాలలో రూ. 5 లక్షల ఖర్చుపెట్టి దానిమ్మ పంట పండిస్తున్నాడు. వారం కిందట ఈయన తోటలో దొంగలు పడి సుమారు టన్ను బరువైన దానిమ్మ పండ్లను దొంగిలించుకొనిపోయారు. పక్కనే దేవరాజ్ తోటలోనూ ఇంతేమొత్తంలో దానిమ్మను ఎత్తుకెళ్లారు. చదలపురంలో మునిరాజు అనే రైతు తమ చుట్టాలను ఇంటికి పిలిపించుకొని రాత్రి వేళలో తుపాకీ, కారంపొడి పట్టుకొని గస్తీ కాస్తున్నారు. తుపాకీకి లైసెన్స్ ఉందని తెలిపారు. ఈయన ఆరు ఎకరాలలో దానిమ్మ సాగు చేస్తున్నారు. ఒకవేళ దొంగలు కానీ చేతికి చిక్కితే వారి పని అయిపోయినట్టే అంటున్నారు తోటల యజమానులు. -
మిస్టరీగా డాక్టర్ రాధ హత్య కేసు.. పనిచేయని సీసీ కెమెరాలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో సంచలనం కలిగించిన డాక్టర్ రాధ హత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో నేరస్తులను పట్టుకునేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందుకోసం జిల్లాలోని సమర్థులైన పలువురు సీఐ స్థాయి అధికారుల పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆమెను హత్య చేయటం వల్ల ఎవరికి ప్రయోజనం? ఆ అవసరం ఎవరికి ఉంటుంది? అంత పెద్ద పేరు గల ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయకపోవటానికి గల కారణాలు? నిజంగానే గుర్తు తెలియని దుండగులా? లేక సమీప బంధువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? అనే కోణాల్లో పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. పాత నేరస్తులపై నిఘా.. జిల్లాలో జరిగిన పలు హత్య కేసుల్లో హంతకులుగా ఉన్న పలువురు పాత నేరస్తులపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఆస్పత్రికి సంబంధించిన సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. అయితే జరిగిన హత్యకు సమీప బంధువులకు సంబంధం ఉండి ఉంటుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేసి, చాలా వరకు హత్యకేసుకు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు సమాచారం. అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు.. డాక్టర్ మాచర్ల రాధా (59) హత్యకేసులో పోలీసులను అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. రోగులతో నిత్యం రద్దీగా ఉంటే ఆస్పత్రి ఆవరణలో మూడు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయటం పోలీసులకు ప్రధాన అనుమానంగా మారింది. అలాగే రద్దీగా ఉంటే ఆస్పత్రి ముందు నుంచే నేరస్తులు మూడో ఫ్లోర్లో ఉన్న రాధా ఇంటిలోకి వెళ్లాలి. అలా కాని పక్షంలో సమీప బంధువులు మాత్రమే వేరే మార్గం గుండా పై ఫ్లోర్‌లోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ మార్గం గుండా హంతకులు ఏ విధంగా పై ఫ్లోర్‌లోకి వెళ్లి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మృతురాలి భర్త డాక్టర్ ఉమామహేశ్వరరావు సాయంత్రం 6.00 గంటలకు క్లినిక్‌లోకి వెళ్లగా రాత్రి 8.15 సమయంలో మృతురాలు రాధా హైదరాబాద్‌లోని తన కూతరుతో ఆఖరిగా సారిగా ఫోన్లో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో డాక్టర్ రాధా హత్య 8.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తుల ఆచూకీ కోసం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.అలాగే గురువారం డాగ్‌స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం. -
అద్దె ఇంట్లో సీసీ కెమెరా... యువతులు దుస్తులు మార్చుకున్న దృశ్యాల రికార్డింగ్
హైదరాబాద్: ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని...ఆ ఇంట్లో యువతులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను వారికి తెలియకుండా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా చూస్తుండటంతో పసిగట్టిన బాధిత యువతులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటగిరిలోని హైలం కాలనీలో సయ్యద్ సలీం అనే వ్యక్తి తన ఇంట్లో ఓ గదిని ఇద్దరు యువతులు, ఒక యువకుడికి అద్దెకిచ్చాడు. రెండున్నర నెలల క్రితం వీరు ఈ గదిలో అద్దెకు దిగారు. కాగా సదరు ఇంటి యజమాని అద్దెకిచ్చిన గదిలో మీటర్ బాక్స్ పేరుతో ఓ ప్లాస్టిక్ బాక్స్‌ను ఏర్పాటు చేసి అందులో సీసీ కెమెరా పెట్టాడు. మరో నాలుగు కెమెరాలు తన ఇంట్లో ఏర్పాటు చేసి..రెండు డీవీఆర్‌లను బిగించాడు. నాలుగు రోజుల క్రితం తమ ఇంట్లో ఏర్పాటు చేసిన బాక్సు నుంచి వైరు నేరుగా ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన యువతులు ఇదేమిటని ఆరా తీశారు. తీరా చూస్తే అది సీసీ కెమెరా అని తేలింది. దీంతో బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు సయ్యద్ సలీం సీసీ కెమెరా ఏర్పాటుచేసి యువతులు దుస్తులు మార్చుకుంటున్నప్పుడు వాటిని రికార్డు చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఆ సీసీ ఫుటేజీలను పోలీసులకు అందజేశాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 355(సి), 509, 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
తిరుమల ఆలయంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లిన భక్తుడు
-
మహిళ గొలుసును కొట్టేస్తూ కెమెరాకు చిక్కిన దొంగలు: వీడియో వైరల్
ఒక మహిళ గొలుసును బెక్ మీద నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కుని పరారయ్యారు. అందుకు సంబంధించిన సీఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటు చేసుకుంది. వీడియోలో..దుకాణం వద్ద ఉన్న ఒక మహిళ వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తున్నట్లు కనిపిస్తోంది. వారిని చూసి అప్రమత్తమైన మహిళ కేకలు వేస్తూ.. దుకాణం లోపలికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతలో ఆ వ్యక్తులు ఆ మహిళను తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కుని పరారయ్యారు. ఆ దుకాణంలోని వ్యక్తి ఆమెకు సాయం చేద్దామని ముందుకు వస్తాడు కానీ వారి వద్ద ఉన్న తుపాకీని చూసి భయంతో పారిపోతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ దుండగుల ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. Caught On Camera: Thieves Snatch Delhi Woman's Chain At Gunpoint pic.twitter.com/VEX5aGSBAJ — NDTV Videos (@ndtvvideos) April 15, 2023 (చదవండి: విమానం గాల్లో ఉండగా విండ్ షీల్డ్‌కు పగుళ్లు.. సౌదీ ఫ్లైట్ కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్..) -
సీసీ కెమెరా ఉంటేనే నిర్మాణ అనుమతులు! రాచకొండ పోలీసుల ఆలోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరులో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. సీసీ టీవీ (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరా ఏర్పాటు చేస్తేనే భవనాలు, వాణిజ్య సముదాయాలకు అనుమతుల జారీకి రంగం సిద్ధ మవుతోంది. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. వాటి ఏర్పాటును భవన నిర్మాణ అనుమ తులలో భాగం చేస్తే మేలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఆలోచనకు వచ్చారు. ఈ మేరకు నిబంధనలను అమల్లోకి తేవాలంటూ రాష్ట్ర పురపాలకశాఖకు లేఖ రాసినట్టు తెలిసింది. ఇవేగాకుండా పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కార్యాలయాల వద్ద కూడా సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కోరింది. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఉన్న ఈ విధానాన్ని అధ్యయనం చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. భారం తక్కువ.. భద్రత ఎక్కువ.. ఇప్పటివరకు గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవనాలు, కాలనీలలో నివాసితుల అసోసియేషన్లే సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ అంతటా ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని, ఆ తర్వాతే జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీలు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. భారీ ఖర్చుతో అపార్ట్మెంట్లు, భవనాలను నిర్మించే డెవలపర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం పెద్ద భారమేమీ కాదని.. ఇదే సమయంలో మరింత భద్రత కూడా అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కమాండ్ సెంటర్‌తో అనుసంధానంతో.. అంతర్రాష్ట్ర నిందితులు పలుచోట్ల తిష్ట వేసి చెయిన్ స్నాచింగ్‌లు, బ్యాంకులు, జ్యువెలరీ షాపుల లో దోపిడీలకు పాల్పడుతుండటం, అనుమానాస్పద హత్యలు, ఇతర నేరాలు చేస్తుండటం పెరిగిపోతోంది. ఈ క్రమంలో నేరాల నియంత్రణ, మరింత భద్రత కోసం సీసీ కెమెరాలన్నింటినీ ‘రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)’కు అనుసంధానించాలని పోలీసులు భావిస్తున్నారు. తద్వారా పాత నేరస్తుల కదలికలు, సున్నిత ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరాలకు పాల్పడినవారు ఎక్కడున్నారన్నదీ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకోగలుగుతారని చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, అనుమానాస్పదంగా అనిపించినా.. స్థానిక పోలీసులను, పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారని వివరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలంటే..? భవనాల ప్రహరీపై నలువైపులా, ప్రవేశ, నిష్క్రమణ ద్వారం, మెట్ల మార్గం, లిఫ్టు దగ్గర, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అపార్ట్మెంట్లోని ప్రతీ అంతస్తు సీసీ కెమెరాలో రికార్డయ్యేలా చూసు కోవాలి. సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన చోట్లను జీపీఎస్ లొకేషన్‌తో సహా స్థానిక పోలీసుస్టేషన్లో నమోదు చేయాలి. ఆ కెమెరాల ఫుటేజీ కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. కెమెరాల పనితీరు, నిర్వహణ బాధ్యత సంబంధిత భవన యజమానిదే. ప్రజల గోప్యతకు ఏ మాత్రం భంగం కలిగించకుండా పోలీసులు ఆయా సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తారు. -
‘పిప్పల్‌కోటి’ వద్ద మళ్లీ పులి
తాంసి: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి(కె), గొల్లఘాట్ గ్రామాల శివారు అటవీప్రాంతంలో కూలీలకు శనివారం అర్ధరాత్రి పులి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన వారంతా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి అడవి వైపు వెళ్లింది. పిప్పల్‌కోటి రిజర్వాయర్ నిర్మాణ పనుల కోసం కూలీలు అక్కడే ఉంటున్నారు. తమకు సమీపంలోనే పులి కనిపించడంతో పనులను నిలిపివేసిన కూలీలు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి ప్రేమ్‌సింగ్ బేస్‌క్యాంపు సిబ్బందితో వచ్చి పులి సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు. పాదముద్రలను చూసి, కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించగా పులి ఆ ప్రాంతాల్లోనే సంచరించినట్లు రికార్డయి ఉంది. ఐదు రోజుల క్రితం పిల్లలతో కలసి సంచరించిన పులి ప్రస్తుతం ఒక్కటే కనిపించడంతో పిల్లలను వదిలేసిందా.. లేక ఇది వేరే పులా అని నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు అటవీ సమీప గ్రామాల ప్రజలు, రిజర్వాయర్ నిర్మాణం వద్ద ఉన్న కూలీలు అప్రమత్తంగా ఉండాలని సెక్షన్ అధికారి ప్రేమ్‌సింగ్ సూచించారు. ఆయన వెంట యానిమల్ ట్రాకర్స్ కృష్ణ, సోనేరావు, బేస్‌క్యాంపు సిబ్బంది ఉన్నారు. -
సీసీ కెమెరాకు చిక్కిన పులి దృశ్యాలు
-
తిన్నింటికే కన్నం...రూ.40 లక్షలు స్వాహా
బంజారాహిల్స్: తన తండ్రికి సహాయంగా ఉండేందుకు నియమించిన అటెండర్ నమ్మక ద్రోహానికి పాల్పడి తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ రూ. 40 లక్షల మేర నగదు డ్రా చేసి మోసగించాడంటూ ఓ ఎన్ఆర్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బంజారాహిల్స్ రోడ్ నెం.14లో ఆర్ఆర్ఎస్ అర్ని(94) నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు విద్యుత్ అర్ని కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటుండగా కూతురు హాంకాంగ్‌లో ఉంటున్నది. 2019లో తల్లి చనిపోవడంతో తన తండ్రికి సహాయంగా ఉండేందుకు జనగామ సమీపంలోని చేల్పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్‌ను నెలకు రూ.30 వేల జీతంతో 2017లో అటెండర్‌గా నియమించారు. ఆ ఇంట్లో ఉదయ్‌కిరణ్‌తో పాటు గార్డెనర్, డ్రైవర్, కుక్, పనిమనిషితో సహా నలుగు రు పని చేస్తుంటారు. తన తండ్రికి సేవలు సరిగ్గా లభిస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు విద్యుత్ అర్ని, కూతురు కలిసి ఇంట్లో 12 కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచే పర్యవేక్షించేవారు. తన తండ్రికి సమయానికి ఆహారం, మాత్రలు ఇస్తున్నారో లేదో కెమెరాల ద్వారానే తెలుసుకునేవారు. తన తండ్రి ఫోన్, కంప్యూటర్, ఐప్యా డ్ తదితర పనులను కూడా ఉదయ్‌కుమార్ చేసేవారు. ఇదే అదనుగా బ్యాంకు లావాదేవీలు చూసే క్రమంలో ప్రతి నెల ఇంటి ఖర్చులు డ్రా చేసే నిమిత్తం మూడేళ్లలో రూ.40 లక్షల వరకు దొడ్డిదారిలో డ్రా చేసి తన జేబులో వేసుకున్నట్లుగా తేలిందన్నా రు. తాను ఇటీవల హైదరాబాద్‌కు వచ్చానని ఇంటి లెక్కలు ఆడిట్ చేయగా రూ.40 లక్షలు అక్రమాలు తేలాయని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉదయ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!) -
‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో వాహనాల వేగానికి కళ్లెం వేసేలా పక్కాగా ప్రణాళిక అమలు చేయడానికి సిటీ ట్రాఫిక్ వింగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ–చలాన్లు విధించడం మొదలెట్టడానికి ముందు కొన్ని రోజుల పాటు వాహనచోదకులకు అవగాహన పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రవాణా శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డివైడర్లు ఉన్న మార్గాల్లో కార్లు గరిష్టంగా గంటకు 60 కి.మీ., మిగిలిన వాహనాలు 50 కి.మీ., అవి లేని రూట్లలో వీటి వేగాన్ని గంటకు 50 కి.మీ., 40 కి.మీ.గా నిర్దేశించారు. కాలనీల్లో ఏ వాహనమైనా గంటకు 30 కి.మీ. వేగమే. ప్రస్తుతం రహదారులపై ఉన్న సూచికల బోర్డుల్లో పాత వేగ పరిమితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఇక పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించడానికి ప్రస్తుతం ఆరు స్పీడ్ లేజర్ గన్స్, 44 సీసీ కెమెరాలను అనుసంధానించిన సాఫ్ట్వేర్ ఉపకరిస్తున్నాయి. వీటిని మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి ఉండే సీసీ కెమెరాలు తమ ముందు ప్రయాణిస్తున్న వాహనం వేగాన్ని క్షణాల్లో గుర్తించగలుగుతాయి. పగలు, రాత్రి కూడా వేగాన్ని గుర్తించడానికి ఉపకరించే విధంగా సాఫ్ట్వేర్, కెమెరాలను అభివృద్ధి చేయనున్నారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలకు చలాన్లు జారీ చేసే ముందు పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. దీనికోసం సైనేజ్ బోర్డులు, సోషల్ మీడియా తదితరాలను వాడాలని నిర్ణయించారు. సుదీర్ఘ అధ్యయనం చేశాం నగరంలో వేగ పరిమితుల విధింపుపై సుదీర్ఘ అధ్యయనం చేశాం. చండీఘర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు సిటీల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేశాం. చండీఘర్ మోడల్‌ను హైదరాబాద్‌కు అనువుగా మార్పుచేర్పులు చేసి సిఫార్సు చేశాం. ఉత్తర్వుల్లో ఉన్న వేగ పరిమితులు అన్ని రహదారులకు వర్తిస్తాయి. తాజా ఉత్తర్వులు అమలులో వచ్చినా ఓఆర్ఆర్, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే మార్గాల్లో గతంలో సూచించిన వేగమే వర్తిస్తుంది. రింగ్ రోడ్ మీద లారీలు గంటకు 80 కి.మీ., కార్లు వంటివి గంటకు 100 కి.మీ., ఎక్స్‌ప్రెస్ వే మీద గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ (చదవండి: ప్రజాప్రయోజనాల కోసమే భూసేకరణ: హైకోర్టు ) -
జూబ్లీహిల్స్ కేసులో నిందితుడి అరెస్ట్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో నిర్లక్ష్యంగా కారు నడిపి రెండు నెలల పసికందు మరణానికి కారణమైన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండురోజులుగా పలు మలుపులు తీసుకున్న కేసును జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానికుల వాంగ్మూలం ఆధారంగా కొలిక్కి తీసుకొచ్చారు. గురువారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ స్నేహితుడు సయ్యద్ అఫ్నాన్(19) కారు నడిపిస్తున్నట్లు తేలడం తో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నంకు చెందిన సయ్యద్ అఫ్నాన్ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి మహ్మద్ మాజ్, ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ స్నే హితులు. సంఘటన జరిగిన వెంటనే నిందితుడితోపాటు మిగతా ఇద్దరూ అక్కడి నుం చి పారిపోవడంతో కారు నడిపిందెవరు అనే విషయంపై అనేక సందేహాలు తలెత్తాయి. ఘటనాస్థలంలో సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్షులు అందుబాటులో లేకపోవడం తో దారి పొడవునా సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. దీంతోపాటు సంఘట న జరిగిన వెంటనే కాస్త దూరంలో ఉన్న ఓ కారు డెకా ర్ స్టోర్‌లో ఉన్న సీసీ ఫుటేజీలో అస్పష్టంగా ముగ్గురు యువకులు పారిపోతున్న దృశ్యా లు గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కొంత మంది యువకులు కారు నడిపిస్తున్న అఫ్నాన్‌ను కొట్టిన ట్లు తెలిసింది. శుక్రవారంరాత్రి పోలీసులు అఫ్నాన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించ గా కారు తానే నడిపినట్లు ఒప్పుకున్నట్లు తె లిసింది. అతడిని సంఘటనా స్థలానికి తీసు కెళ్లి సాక్షులకు చూపించగా అతడే కారు నడిపినట్లు నిర్ధారణ అయింది. దీంతోపాటు సైబర్ టవర్స్ సమీపంలో కారు ఎక్కేటప్పు డు వచ్చిన సీసీ ఫుటేజీలు కూడా పరిశీలించి నిందితుడు అఫ్నాన్ అని గుర్తించారు. -
Panjagutta: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ..
హైదరాబాద్: పంజగుట్టలో చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు.. చిన్నారి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో నవంబరు 4న దీపావళిరోజు సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం.. ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు ఉండటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: పంజాగుట్టలో దారుణం.. పాపం.. పసిపాప! చదవండి: యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం.. -
పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు!
Puneeth Rajkumar Home Inside CCTV Video Goes Viral: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కన్నుమూసి 4 రోజులు గడుస్తున్నా దైవంలా ఆరాధించే తమ అప్పు ఇకలేరనే చేదు నిజాన్ని అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ సైతం జీర్ణించుకోలేకపోతోంది. కర్ణాటకలో ఏ వీధి, ఏ షాపు చూసినా పునీత్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎంతో ఆరోగ్యంగా ఉండే అప్పును గుండెపోటు ఎలా బలి తీసుకుందంటూ అభిమానులు రోదిస్తున్నారు. ఇదిలా ఉంటే పునీత్ మరణానంతరం ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: 50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు ఈ నేపథ్యంలో ఆయన మరణానికి ముందటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. శుక్రవారం ఒంట్లో నలతగా ఉందని భార్య అశ్వినితో కలిసి అప్పు ఆసుపత్రికి బయలుదేరిన వీడియో అంటూ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రోజు జిమ్ చేసిన తర్వాత గుండెల్లో అసౌకర్యంగా ఉందంటూ తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి బయలుదేరిన వీడియో ఇది. ఈ క్రమంలో తానే స్వయంగా కారు వరకు నడుచుకుంటూ వెళ్లారు పునీత్. ఈ వీడియోలో చాలా యాక్టివ్‌గా కనిపించిన అప్పు.. చివరి క్షణాలు ఇవే అంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియోలో అప్పుని చూస్తుంటే అందరి కళ్లు చెమ్మగిల్లితున్నాయి. గుండెలు బరువెక్కుతున్నాయి. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం డాక్టర్ దగ్గరకు కారు ఎక్కిన పునీత్ ఆ తర్వాత కొద్ది గంటల్లోనే జీవచ్ఛవంలా మారారని తలుచుకుంటుంటే కన్నీరు ఆగడం లేదు. కాగా ఆ రోజు వారి ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి ఈసీజీ తీసేవరకూ ఆయన యాక్టివ్గానే ఉన్నారట. అయితే ఈసీజీ రిపోర్ట్‌లో ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్ హాస్పిటల్‌కు తరలించాలని డాక్టర్ రమణారావు సూచించారు. అయితే తనకేమీ కాలేదని ఎలాంటి నొప్పి లేదని తన భార్యతో పునీత్ చెప్పారు. అనంతరం కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పునీత్ పడుకున్నారట. ఇక ఆ తర్వాత.. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు పరిస్థితి చేజారిపోయింది. చదవండి: పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున -
పెట్రోల్ బంకులో చొరబడి మందుబాబుల హల్చల్..
గుంటూరు: తెనాలిలో మందుబాబులు పట్టపగలు వీరంగం సృష్టించారు. మురిపాలంలో గల పెట్రోల్ బంకులో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డుపడిన కానిస్టేబుల్‌ను చితక్కొట్టారు. కాగా, ఈ దృశ్యాలన్నీ బంకులో ఉన్న సీసీ ఫుటెజీలో రికార్డు అయ్యాయి. దీంతో పెట్రోల్ బంకు నిర్వాహకులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను, బంకు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి పరిస్థితి విషమం
ముంబై: ముంబైలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదర్ ప్రాంతంలో.. బస్సు,ట్రక్‌ను ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులను స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడిన వారిలో.. రాజేంద్ర (53), కాశీరామ్ ధూరీ (57), తాహిర్ హుస్సెన్ (52), రూపాలి గైక్వాడ్ (36), సుల్తాన్ (50), శ్రావణి మోస్కీ (16), వైధేహి బామనీ (17), మాన్సూర్ ఆలీ (52) తదితరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తేజస్వినీ ట్రావెల్ కు చెందిన బస్సు మారోల్ నుంచి పైడోనీకి వెళ్తుండగా దాదార్ వద్ద ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం.. డ్రైవర్ కండక్టర్‌తో సహా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: పంజాబ్‌లో మారనున్న రాజకీయ సమీకరణాలు -
Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్
తిరుపతి: టెంపుల్ సిటీ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ అలజడి రేపింది. నిన్న (సోమవారం) అర్ధరాత్రి విద్యానగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర ప్రణీతారెడ్డి అపార్ట్మెంట్లో ఈ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ముఠా.. సెక్యురిటీ ఇంటికి బిగాలు ఏర్పాటు చేసి మొదటి ఫ్లోర్లో ఉంటున్న విజయలక్ష్మీ ఇంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత , వీరు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. మూడెళ్ల తర్వాత మరోసారి చెడ్డిగ్యాంగ్ అలజడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. అపార్ట్మెంట్లో ఉండే వారంతా.. తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ముఠాకు సంబంధించి తిరుపతి ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలన్నింటిని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ గ్యాంగ్‌కు ఇతర నేరస్థులతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు -
‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి..
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చిన ఒక మహిళ.. మరో మహిళ బ్యాగ్‌లో నుంచి రూ.65 వేల రూపాయాలను కాజేసింది. ఆ తర్వాత మహిళ, పిల్లలతో సహా అక్కడ నుంచి పరారయ్యింది. కాగా, బాధిత మహిళ తన బ్యాగ్‌లో డబ్బులు కన్పించపోవడంతో కంగారుగా వేతికింది. ఈ క్రమంలో బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా గుర్తుతెలియని మహిళ డబ్బును కాజేసిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధిత మహిళ బ్యాంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితురాలిపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
మోండాలో సెల్‌ఫోన్ దొంగల హల్చల్.. సీసీ కెమెరాలో రికార్డు
సాక్షి, బన్సీలాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. మార్కెట్‌కు వివిధ రకాల కొనుగోళ్ల కోసం వచ్చేవారి సెల్ఫోన్లను దొంగలు తస్కరిస్తున్నారు. కనురెప్పపాటులో ఫోన్లు మాయం అవుతున్నాయి. ఇటీవల వినాయకచవితి సందర్భంగా మార్కెట్‌కు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల రాకతో మార్కెట్ జన సంద్రంగా మారింది. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటే దొంగలు మరో వైపు తమ పని కానిచ్చేశారు. ► బోయిగూడ కట్టెలమండి ప్రాంత నివాసి పాకాల రమేష్ మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తుండగా దొంగ పూలు కొంటున్నట్టు నటిస్తూ రమేష్ షర్ట్ జేబులో ఉన్న విలువైన సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. అయితే ఈ తతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ► సదరు దొంగ వ్యూహాత్మకంగా వచ్చి సంచి అడ్డుగా పెట్టి సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. అదే రోజు మరో ఇద్దరి సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో మోండా మార్కెట్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ రైళ్లలో ఇట్టే మాయమవుతున్నారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు ►నిత్యం వేలాది మంది ప్రజల రాకపోకలు...వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటే మోండా మార్కెట్లో పోలీసు నిఘా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ దొంగలు అడ్డూఅదుపు లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ►మోండా మార్కెట్లో కనీసం పండగ వేళల్లో అయినా పోలీసు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తే జాగ్రత్తగా ఉంటారని పలువురు సాక్షితో వాపోయారు. ► మోండా మార్కెట్‌కు వచ్చిన అనేకమంది డబ్బు, సెల్ఫోన్లు పోగొట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ► ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘాతో దొంగతనాలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. గట్టి నిఘా : క్రైమ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మోండా మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో సివిల్‌డ్రెస్‌లో పోలీసు సిబ్బందిని ఉంచాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం మార్కెట్‌కు వచ్చేటప్పుడు ప్రజలు విలువైన వస్తువులను వెంట తీసుకురాకూడదు. చదవండి: షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు -
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు.. అయినా పని చేయని మూడో నేత్రం
సాక్షి, అంబర్‌పేట( హైదరాబాద్): అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీసుస్టేషన్ పరిధిలో ఎల్ అండ్ టీ కమ్యూనిటీ పోలీస్, నేను సైతం కార్యక్రమాల పేరిట సుమారు నాలుగు వేల వరకూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ఏర్పాటుకు పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్థానికులను ప్రోత్సహించి కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిలో దాదాపు 50 శాతం కెమెరాలు పని చేయడం లేదు. దీంతో ఏదైనా ఘటన జరిగితే ఆధారాలు లేకుండా పోతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదు. కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించిన పోలీసులు వాటి నిర్వహణను ప్రోత్సహించకపోవడం గమనార్హం. 50 శాతం కెమెరాలు పని చేయకపోవడంతో ఘటన జరిగినప్పుడు నేరాలను ఛేదించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలోని కెమెరాల నిర్వహణపై స్థానికులకు పోలీసులు అవగాహన కలిగించాలని పలువురు కోరుతున్నారు. సాక్ష్యాలు కనుమరుగు పోలీసుస్టేషన్ పరిధిలోని శివంరోడ్డు, సీపీఎల్ రోడ్, గోల్నాక, అంబర్‌పేటలోని ప్రధాన రోడ్లు, ప్రధాన ప్రాంతాలైన డీడీకాలనీ, తులసీరాంనగర్ కాలనీ, అనంతరాంనగర్ కాలనీతో పాటు నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. అంబర్‌పేటలోని ప్రధాన రోడ్డులో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన కెమెరాలు పని చేయని పరిస్థితి వచ్చింది. ఏదైనా సంఘటన జరగగానే పోలీసులు సులువుగా సీసీ టీవీ కెమెరాలను చూద్దామని వెళుతున్నారు. దీంతో అవి పని చేయలేదన్న విషయాన్ని అప్పుడు గానీ తెలుసుకోలేక పోతున్నారు. దీంతో పలు కేసులకు సాక్ష్యాలు లేకుండా పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. నిర్వహణ బాధ్యత స్థానికులదే ‘నేను సైతం, కమ్యూనిటీ పోలీసు’ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ ప్రజల బాధ్యతే. అవి పని చేయకపోతే వారే మరమ్మతులు చేసుకోవాలి. ప్రధాన రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల నిర్వాహణ ప్రత్యేక ఏజెన్సీ చూస్తున్నది. పోలీసుస్టేషన్ పరిధిలో పని చేయని కెమెరాలను గుర్తించి పని చేసేలా చొరవ తీసుకుంటాను. – సుధాకర్, అంబర్‌పేట ఇన్స్పెక్టర్ చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
గాంధీ ఆస్పత్రి ఘటన.. సంచలన విషయాలు వెలుగులోకి
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాంధీ ఆస్పత్రి ఘటన అంతా ఫేక్ అని పోలీసులు తెలిపారు. అత్యాచారం జరగకున్నా యువతి కట్టుకథలు అల్లినట్లు పోలీసులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఘటనలో ఇద్దరు మహిళలు చెప్పిన ఫిర్యాదులో వాస్తవం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరి అక్కా చెల్లెలకి కెమికల్ కలిపిన కల్లు తాగే అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న కొద్ది రోజులు కల్లు తాగకపోయే సరికి ఇద్దరూ చాలా స్ట్రెస్‌లో ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: గాంధీ హాస్పిటల్ సీసీ ఫుటేజీలో బయటపడ కీలక సాక్ష్యాలు ఈ క్రమంలో ఇద్దరిలో అక్క బయటికి వెళ్ళిపోయిందని, ఇద్దరూ ఎదుట వ్యక్తికి గుర్తు పట్టే స్థితిలో లేరన్నారు. అక్కని వెతుకు కుంటూ వెళ్ళిన చెల్లి బయట ఓ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతూ పరిచయం చేసుకుందని, ఇది జరిగిన రోజే సెక్యూరిటీ గార్డుతో పరస్పర అభిప్రాయంతో లైంగికంగా 7వ ఫ్లోర్లో కలిసినట్లు తెలిపారు. ఆ తరువాత మరొకసారి సెల్లార్లో మళ్లీ పరస్పర అభిప్రాయంతో లైంగికంగా ఇద్దరు కలిసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయం ఇంట్లొ తెలిస్తే బాగోదు అని అమ్మాయి ఇలా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన అక్క కూడా రెండూ రోజులు పాటు కాగితాలు ఏరుకునే వ్యక్తి తో ఉందని, అక్కడ ఏం జరిగింది అని వివరణ లేదని తెలిపారు. దీనిలో ల్యాబ్ టెక్నీషియన్ తప్పు ఏం లేనట్లు పోలీసులు తెలిపారు. కాగా గాంధీ ఆస్పత్రిలో అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార ఘటనపై సీపీ అంజనీ కుమార్ స్పందించారు. 500కి పైగాసీసీ కెమెరాలు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. 800 గంటల సీసీ ఫుటేజ్‌లు చూడటం జరిగిందని, టెక్నాలజీ ఆధారంగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు. క్రైమ్ విషయంలో మహిళల గురించి తప్పుగా మాట్లాడకూడదని, పార్లమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. క్రైమ్‌లో సీన్ రీ క్రియేషన్ చాలా ముఖ్యమని, ప్రతి వ్యక్తికి పర్సనల్ విషయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. లా ప్రకారం.. ఏసీపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ చేయాలి, ఈ కేసులో మిస్టరీ ఏం లేదన్నారు. కోర్టులో కేసు వివరాలు ఎలా సబ్మిట్ చేయాలి అని చూస్తున్నట్లు వెల్లడించారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో తనతోపాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్త్ జోన్ పోలీసులు 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళను నారాయణగూడలో ఉన్నట్లు గురువారం గుర్తించారు. అదృశ్యమైన మహిళ రెండు రోజులుగా ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, మహిళకు ఆశ్రయం ఇచ్చిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. చదవండి: తాలిబన్ల రాకకు ముందు అఫ్గన్ -
సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని.. విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తికి చెందిన బిరుదుల హన్మక్క (65) వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు కుమారుడుకాగా అదే గ్రామంలో మరోచోట నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి హన్మక్కను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేసి ఇంటి సమీపంలోని మురికికాలువలో పడేశారు. గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా రూరల్ సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై చిరంజీవి గ్రామానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. మృతురాలి కొడుకు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు విచారణ వేగవంతం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను పోలీసులు ఏర్పాటు చేశారు. -
యువ ఇంజనీర్ నిర్వాకం.. బర్త్‌డేను గ్రాండ్‌గా జరుపుకోవాలని..
న్యూఢిల్లీ: సాధారణంగా చాలా మంది తమ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకోవడానికి ఇష్టపడుతుంటారు. దీని కోసం అనేక ప్లాన్లు వేస్తుంటారనే విషయం తెలిసిందే. ఒక మంచి హోటల్లో బంధువులు, స్నేహితులను పిలిచి వారి మధ్య బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా జరుపుకొని తమ రిచ్‌నేస్‌ను చూయించుకోవాలనుకుంటారు. అయితే, ఇక్కడో యువ ఇంజనీర్ కూడా.. తన జన్మదినాన్ని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకోవాలనుకున్నాడు. అయితే, దీని కోసం ఆ ప్రబుధ్దుడు మాత్రం చోరీల బాటపట్టాడు. ఈ సంఘటన ఢిల్లీలోని మన్సరోవర్ పార్క్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ ప్రతిరోజు మన్సరోవర్ పార్క్‌కు వాకింగ్‌కు వెళ్తుండేది. ఈ క్రమంలో.. గడిచిన శుక్రవారం రోజు మహిళ వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని యువకుడు ఆమెను అనుసరించాడు. ఒక్కసారిగా ఆమెపై దాడిచేసి, బలవంతంగా చెవిరింగులను లాక్కొని అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. దీంతో, ఆమె షాక్‌కు గురయ్యింది. ఆ తర్వాత తేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆగంతకుడు ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పార్క్ పరిధిలోని 30 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆగంతకుడు ముఖానికి మాస్క్ ధరించి ఉండటం.. బైక్‌కు నంబర్ ప్లేట్ లేకపోవడం వలన నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. నిందితుడి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గస్తీని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో.. గత ఆదివారం రోజున పార్క్ పరిసరాల్లో ఒక యువకుడు నంబర్‌ప్లేట్‌లేని బైక్‌తో ఉండటాన్ని గస్తీ పోలీసులు గమనించారు. అతని కదలికలు అనుమానస్పదంగా ఉన్నాయి. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో అతగాడు.. తన పేరు గౌతమ్ అని.. షాహదారాలోని జ్యోతి నగర్లో ఉంటానని తెలిపాడు. కాగా, బీఎస్ఈఎస్లో జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా జరుపుకోవడం కోసమే చోరికి పాల్పడినట్లు అంగీకరించాడు. చోరి చేసిన బంగారాన్ని ఒక దుకాణంలో అమ్మేసినట్లు తెలిపాడు. దీంతో గౌతమ్‌పై పలు సెక్షన్ల కింది కేసుల నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. -
సీసీ కెమెరాలను పైకి తిప్పేసి.. దర్జాగా దోచుకుపోయాడు..
సాక్షి, సత్తుపల్లి: సీసీ కెమెరాలున్నా వాటిని పైకి తిప్పేసి..ఓ దొంగ దోచుకున్న తీరు సత్తుపల్లి పట్టణం బస్టాండ్ రింగ్ సెంటర్లోని చిన్నా సెల్ వరల్డ్ షాపులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో రూ.6.50 లక్షల విలువైన సెల్ఫోన్లను అపహరించాడు. ఆగంతకుడు అర్ధరాత్రి 1.23 గంటలకు మొదటి అంతస్తు లోపల నుంచి కిందకు దిగి ఒక వైపు తాళం వేసిన ఉన్న షట్టర్‌ను చాకచక్యంగా తెరిచి 1.26 గంటలకు లోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత షాపులోని సీసీ కెమెరాలను పైకి తిప్పేశాడు. సుమారు 40 నిమిషాలకుపైగా షాపులో ఉన్న ఆగంతకుడు షో కేసుల్లోని బ్రాండెడ్ సెల్ఫోన్లు మాత్రమే ఎంపిక చేసుకొని ఎత్తుకెళ్లాడు. అయితే, షట్టర్‌పైన ఉన్న సీసీ కెమెరాను గమనించకపోవటంతో ఆగంతకుడి కదలికలన్నీ రికార్డు అయ్యాయి. ఎత్తుగా, సన్నగా ఉండి తలకు టోపీ, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌస్ ధరించి ఉండడాన్ని పుటేజీలో పోలీసులు గుర్తించారు. అయితే వచ్చిందా ఒకరా, ఇద్దరా అనేది తేలడం లేదు. కాగా, చోరీ జరిగిన సెల్ పాయింట్‌ను కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేష్, సత్తుపల్లి పట్టణ సీఐ ఎ.రమాకాంత్ గురువారం ఉదయం పరిశీలించారు. అలాగే, ఖమ్మం నుంచి ప్రత్యేక క్లూస్‌టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించారు. యజమాని వేణుగోపాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సుమారు 6.50 లక్షల విలువైన సెల్ఫోన్లు చోరీకి గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. -
‘రాసలీలల’ కెమెరా తొలగింపు.. విచారణకు ఆదేశం
బ్రిటన్ మాజీ మంత్రి రాసలీలల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సీసీ కెమెరాను తొలగించిన ప్రభుత్వం.. అది అధికారిక కెమెరా కాదని ప్రకటించడం విశేషం. వ్యక్తిగత కార్యదర్శితో మాట్ హాంకాక్ ముద్దుల రసక్రీడ కొనసాగిస్తూ సీసీ కెమెరా కంటికి చిక్కడం.. ఆ ఫొటోలు టాబ్లాయిడ్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో ఆరోగ్య మంత్రి(కార్యదర్శి కూడా)గా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందుకు కారణమైన సీసీ కెమెరా అక్కడికి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు కొత్త ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ వెల్లడించారు. లండన్: బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి కార్యాలయంలో దొరికిన సీసీ టీవీ కెమెరా.. రెగ్యులర్ ఆఫీస్ కెమెరా కాదని కొత్త ఆరోగ్య మంత్రి(కార్యదర్శి) సాజిద్ జావిద్ వెల్లడించాడు. అంతేకాదు ఈ ఘటన తర్వాత మిగతా ఎంపీల ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించామని, ఇలాంటి కెమెరాలేవీ బయటపడలేదని తెలిపాడు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా మాట్ హాంకాక్ ఆఫీస్‌లో కెమెరాలు ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేశాడాయన. ఇక ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించిన ఆయన.. హాంకాక్ యవ్వారంపై మాట్లాడేందుకు మాత్రం నిరాకరించాడు. బోరిస్‌పై ప్రశ్నల వర్షం ఇక హాంకాక్ పట్ల ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రదర్శించిన ఉదాసీనతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గురువారం ఈ ఫొటోలు పేపర్ ద్వారా బయటికి రాగా.. శుక్రవారం ఘటనకు సంబంధించి హాంకాక్ క్షమాపణలు చెప్పాడు. అయితే అతనిపై వేటు వేయకుండా కేవలం ఆ సారీతో సరిపెట్టుకుని.. ‘మ్యాటర్ క్లోజ్డ్’ అని ప్రకటించాడు బోరిస్. ఇది మరింత విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హాంకాక్ బలవంతపు రాజీనామా, బోరిస్ అన్యమనస్కంగానే దానిని ఆమోదించడం జరిగిపోయాయి. అయితే ఈ విమర్శలపై ప్రధాని బోరిస్ తాజాగా స్పందించాడు. మహమ్మారి విజృంభణ టైంలో ఆరోగ్య మంత్రి మార్పును అంత త్వరగా చేయడం సబబు కాదనే ఉద్దేశంతో.. కాస్త ఆలస్యం జరిగినట్లు బోరిస్ వివరణ ఇచ్చాడు. ఈ వ్యవహారంలో మరిన్ని అనుమానాలు ఉన్నాయి. హాంకాక్ మెయిల్స్ పాలసీని బబ్రేక్ చేశాడని, నిధుల అవకతవకలకు పాల్పడ్డాడని, వ్యక్తిగత ఉద్దేశాలకు కార్యాలయాన్ని వాడుకున్నాడని.. ఇలా ఆరోపణలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో వీటిపై దర్యాప్తునకు ఆదేశించడంపై బోరిస్ మౌనం వహించడం ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలా బయటికొచ్చింది ఒక ఎంపీ ఆఫీస్‌లో నిషేధిత జోన్లో సీసీ కెమెరా బిగించడం ఒక ఎత్తు అయితే.. ఆ వీడియో ఫుటేజీ బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డాయి బ్రిటన్ నిఘా వర్గాలు. ఇక ఈ వీడియో/ఫొటోలో ఉన్న హాంకాక్ మాజీ కార్యదర్శి గినా కొలాడాంగెలో మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్‌లో పని చేసిన గినా.. చాలా ఏళ్లుగా మ్యాట్ హాంకాక్తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలున్నాయి. అంతేకాదు ఆ పరిచయాలతోనే ఆమె తన పనుల్ని చక్కబెట్టుకున్నట్లు, కుటుంబ సభ్యుల్ని ఉన్నత స్థానాల్లో నియమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ లాక్డౌన్ ఆంక్షలను వ్యతిరేకించిన ఓ డీహెచ్ఎస్సీ ఉద్యోగి.. బ్లాక్మెయిల్ ఉద్దేశంతో ఈ పని చేసి ఉండటానే అనుమానాలు ఉన్నాయి. దీంతో ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది కూడా. చదవండి: పాత ఎఫైర్‌ని పీఏగా.. ఆపై ఆఫీస్‌లోనే కసితీరా ముద్దులు -
హైదరాబాద్: గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం
-
గాల్లోకి లేచిన కారు.. సీసీ కెమెరాలో దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాద ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గౌలిదొడ్డిలో ఫార్చునర్ వాహనాన్ని మహీంద్రా కారు అతివేగంగా ఢీకొట్టింది. ఫార్చూనర్లో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మహేంద్ర కారులో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం సంభవించలేదు. చదవండి: విషాదం: ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే.. Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం -
బ్యాంకుకే కన్నమేశారు..
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్రాంచ్‌కు దొంగలు కన్నమేశారు. రోడ్డు పక్కనే భవనం.. ఎప్పుడూ వాహనాల రద్దీ అయినా పక్కా ప్రణాళికతో బ్యాంకులోకి చొరబడిన దుండగులు గ్యాస్‌కట్టర్‌తో లాకర్‌ను కట్ చేసి సుమారు రూ.3కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. సినిమా ఫక్కీలో సాగిన ఈ చోరీలో ఏ ఒక్క ఆధారం వదలకుండా పోలీసులకు సవాల్ విసిరారు. దొంగలు వదిలి వెళ్లి గ్యాస్ సిలిండర్ ఒక్కటే పోలీసులకు దొరికింది. బుధవారం అర్ధరాత్రి, గురువారం వేకువజాము మధ్య సమయంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బ్యాంకు భవనం వెనుక కిటికీ కార్డ్‌బోర్డు పగులగొట్టి.. ఇనుప గ్రిల్స్ తొలగించి దుండగులు లోనికి చొరబడ్డారు. సుమారు 60 కిలోల బరువు ఉండే గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నారు. గ్యాస్ కట్టర్ సహాయంతో నగదు, బంగారం ఉంచిన స్ట్రాంగ్ రూం డోర్ కట్‌చేశారు. లాకర్‌ను కూడా గ్యాస్ కట్టర్‌తో కట్‌చేసి ఆరు కిలోల బంగారు ఆభరణాలు, రూ.18.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు వెనక భాగంలో కన్నం వేసిన కిటికీ అక్కడే నిచ్చెన తయారీ.. దొంగలు బ్యాంకు వెనుకవైపు ఎత్తయిన ప్రహరీ దూకేందుకు అక్కడే ఉన్న తుమ్మచెట్ల కొమ్మలు నరికి నిచ్చెన తయారు చేసుకున్నారు. దాని సహాయంతో గోడ దూకిన దొంగలు గ్యాస్ సిలిండర్, ఇతర సామగ్రి గోడ దాటించారు. పని ముగించుకున్నాక నిచ్చెన, గ్యాస్ సిలిండర్ మాత్రం అక్కడే వదిలి వెళ్లారు. అలారం,సీసీ కెమెరాలు, కంప్యూటర్ ధ్వంసం.. అలారం మోగకుండా దొంగలు వైర్లు కత్తిరించారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. గతం రికార్డులు కూడా దొరకకుండా కంప్యూటర్ను పగులగొట్టారు. సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే డీవీఆర్ ఎత్తుకెళ్లారు. స్వీపర్ సమాచారంతో.. గురువారం ఉదయం బ్యాంకు శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్ మహిళ తాళం తీసి చూడగా లోపల సామగ్రి చిందరవందరగా పడిఉంది. బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ సింగ్వా సూచన మేరకు గ్రామంలోనే ఉండే బ్యాంకు ఉద్యోగి వెళ్లి పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, లాకర్ కట్‌చేసి ఉండడంతో చోరీ జరిగిందని నిర్ధారణకొచ్చారు. మంథని పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ బృందాలను రప్పించారు. ఇంత భారీ చోరీ జరిగినా దొంగలు ఒక్క ఆధారం కూడా అక్కడ వదిలి వెళ్లకపోవడంతో ప్రొఫెషనల్ దొంగలు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కిటికీతోపాటు లాకర్ రూం, లాకర్, ఇతర వస్తువులపై వేలిముద్రలు లభించకపోవడం గమనార్హం. చెరువు కట్ట వరకు వెళ్లిన డాగ్ స్క్వాడ్.. డాగ్ స్క్వాడ్ దొంగల వాసనను పసిగట్టలేకపోయాయి. బ్యాంకులో, బయట ఆవరణలో తిరిగిన డాగ్స్, వెనుక సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు కట్ట వరకు వెళ్లి ఆగిపోయాయి. దీని ఆధారంగా దొంగలు వారి వాహనాన్ని చెరువు కట్ట వద్ద వదిలి బ్యాంకు వరకు నడుచుకుంటూ వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన దొంగతనాల్లో ఇదే అతిపెద్దదని సీపీ సత్యనారాయణ ప్రకటించారు. ఐదు రోజుల క్రితమే పికెట్ ఎత్తివేత.. గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను ఫిబ్రవరి 17న కల్వచర్ల వద్ద గ్రామానికి చెందిన కుంట శ్రీను, చిరంజీవి దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామంలో సుమారు నెల రోజులుగా పోలీస్ పికెట్ కొనసాగుతుంది. ఈ కేసులో ఏడో నిందితుడు గ్రామానికి చెందిన వెల్ది వసంతరావును వారం క్రితమే అరెస్ట్ చేశారు. కేసు విచారణ కొలిక్కి రావడం, గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఐదు రోజుల క్రితం పికెట్ ఎత్తివేశారు. ఈ విషయాన్ని కూడా దొంగలు గమనించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు చాలెంజ్.. బ్యాంకు చోరీ ఘటనను పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు. సీపీ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి క్లూ దొరక్కపోయినా.. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దొంగలు 5 నుంచి 10 మంది వరకు ఉంటారని, వీరిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దొంగలు ముందస్తుగా రెక్కీ నిర్వహించే చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కానరాని కనీస భద్రత చర్యలు.. ఎస్బీఐ గుంజపడుగు బ్రాంచ్‌లో గ్రామంతోపాటు సమీప గ్రామాల రైతులు ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. వ్యవసాయ రుణాలతోపాటు బంగారం తాకట్టుపెట్టి రుణం పొందుతారు. చోరీకి గురైన బంగారంలో ఎక్కువ మొత్తం రైతులకు సబంధించిందే అని సమాచారం. కాగా, కొందరు రైతులు బుధవారం రుణాలు చెల్లించి బంగారం తీసుకున్నట్లు తెలిసింది. రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకులో ఉన్నా.. బ్యాంకు వద్ద కనీస భద్రత చర్యలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు కిటికీ వద్ద శాశ్వత గోడ కట్టించాల్సిన అధికారులు కార్డ్బోర్డ్ కొట్టి వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు అద్దాలు పగులగొట్టి చోరీకి యత్నించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయినా భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైరల్:ఎటీఎంనే ఎత్తుకుపోయారు!
చెన్నై: తమిళనాడులోని కొయంబత్తురులో దొంగలు బీభత్సం సృష్టించారు. ముఖానికి మాస్కులు ధరించి బ్యాంక్‌లో చొరబడిన దుండగులు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. ఉతుకులిలోని పీఎస్‌యు బ్యాంకులో ఆదివారం తెల్లవారుజామున ఈ చోరి జరిగింది. బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన ఏటీఎం లోపలికి చొరబడిన దొంగలు అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎంను ప్రత్యేక తాళ్ళతో చుట్టి, ఒక ప్రత్యేక వాహనం సహయంతో అక్కడి నుంచి కదిలించారు. అప్పటికే రోడ్డుపై సిద్ధంగా ఉన్న మరొక వాహనంలో ఎటీఎంను ఎక్కించుకొని రెప్పపాటులో అక్కడి నుంచి పారిపోయారు. కాగా, ఎటీఎం తీయడానికి ఉపయోగించిన పెద్దకారును విజయమంగళం సమీపంలో వదిలిపారిపొయారు. కాగా, ఈ చోరికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఉదయాన్నే దీన్ని గమనించిన స్థానికులు సంబంధింత బ్యాంకు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే.. అక్కడికి చేరుకున్న ఉతుకులి పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేశారు. ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో వేలిముద్రలను స్వీకరించారు. కాగా, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో కట్టేసి చిత్రహింసలు -
శంషాబాద్‌లో తిష్టవేసిన చిరుత
శంషాబాద్, పహాడీషరీఫ్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి ఎయిరో డ్రమ్స్ టవర్ సమీపంలో చిరుత కనిపించిందని విమానాశ్రయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయ రక్షణ సిబ్బంది పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. విమానాశ్రయంలోని అమెజాన్ గోదాం, మామిడిపల్లి రహదారి వైపు వెళ్లే ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతాలను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అటవీశాఖ అధికారు లు, పోలీసులు గాలించారు. ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో కనిపిస్తున్న జంతువును చిరు తగా నిర్ధారించలేమని శంషాబాద్ ఎఫ్ఆర్వో శ్యామ్‌కుమార్ స్పష్టం చేశారు. అది అడవి పిల్లిలా కనిపిస్తోందన్నారు. చిరుత పాదముద్రలు కూడా ఎక్కడా లభించలేదని తెలిపారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతుండగా.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లిలో కనిపించిన చిరుత రెండ్రోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో కనిపించిన చిరుతపులి తాజాగా జల్పల్లి పరిసరాల్లో కనిపించింది. సోమవారం అర్ధరాత్రి జల్పల్లి కార్గో రోడ్డుతో పాటు మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో చిరుత సంచరిస్తుండగా పోలీసులతో పాటు స్థానికులు గమనించారు. శంషాబాద్ నుంచి జల్పల్లి గరిగుట్ట అడవి ద్వారా చిరుత రోడ్డుపైకి వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రిపూట ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. -
‘సీసీ కెమెరాల ఏర్పాటులో మొదటి స్థానం’
సాక్షి, హైదరాబాద్ : తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాలు.. ఆమాన్‌గల్‌కుకి చెందిన వినోద్ కుమార్ బీటెక్ చదివి మధ్యలో ఆపేశాడు. కార్ డ్రైవర్‌గా పని చేస్తూ తన స్నేహితులు రాజేష్, షకీల్ తో కలిసి చోరీలు మొదలు పెట్టాడు. ఇతను గతంలో పీడీ యాక్ట్ మీద జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. 2017 జైల్ నుంచి బయటకు రాగానే మరోసారి చోరీలకు తెగబడ్డారు. దీంతో మరోసారి నిందుతుడిపై పీడీయాక్ట్ కేసు నమోదు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుల కోసం నాలుగు జిల్లాల పోలీసులు తీవ్రంగా గాలించారని, నిందితుల నుంచి 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చదవండి: కానిస్టేబుళ్లకు కమిషనర్ సెల్యూట్! అయిదు నెలల క్రితం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమీక్ష సమావేశంలో సీసీ కెమెరాలు ఎక్కువ శాతంలో ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. గత నెల రోజులుగా ప్రత్యేక డ్రైవ్ చేశానని వెల్లడించారు.సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంలో 7000 సీసీ కెమెరాలు నేను సైతం కార్యక్రమంలో ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు 7 లక్షల 36 వేల సీసీ కెమెరాలు మొత్తం హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. భారతదేశంలో హైదరాబాద్ సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మొదటి స్థానంలో ఉండగా ప్రపంచంలో 6వ స్థానంలో ఉందన్నారు. చదవండి : ఐడియా సూపర్.. కానీ బుక్కయ్యావ్‌గా! కాగా గత కొన్ని రోజుల్లో 36 క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు అయ్యాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఒకసారి క్రికెట్ బెట్టింగుకు పాల్పడి కేసులో ఇరుక్కుంటే ఇబ్బందులే కాకుండా భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు అన్ని రకాలుగా పిల్లలపై కన్నేసి ఉంచాలన్నారు. అదే విధంగా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం హైదరాబాద్‌లో కెమికల్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. -
ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారంతంలో పెద్ద ఎత్తున నగర వాసులు వస్తుండటంతో ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక అనుమతులు సైతం ఇచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాహనాలను నిషేధించిన అధికారులు.. కేవలం పర్యటకులను మాత్రమే అవకాశం కల్పించారు. అయినప్పటికీ వంతెనపై రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా వంతెనపైనే వాహనాలు ఆపి ఫోటోలు దిగుతున్నారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన పోలీసులు.. వంతెనపై పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్‌పై వాహనాలు ఆపితే.. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లు సందర్శకులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల పిల్లలతో వచ్చిన ఓ కుటుంబం వంతెనపై బైక్ ఆపి ఫోటోలకు ఫోజులిచ్చింది. సీసీ కెమెరాలను గమనించిన భర్త.. బైక్ నెంబర్ ప్లేట్ కనిపించకుండా భార్య మెడలోని చున్నీని తీసి దానిని కవర్ చేశాడు. ఇది కూడా అక్కడి కెమెరాలో రికార్డు అయ్యింది. వీరి ఘనకార్యం కాస్తా పోలీసుల కంటపడంతో అలర్ట్ అయ్యారు. ఇది గమనించి వారు బైక్ తీసుకుని అక్కడి నుంచి పరార్ అయ్యారు. అయినప్పటికీ జరిమానా నుంచి తప్పించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ పోలీసులు అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. బిగ్‌బాస్ (సీసీ కెమెరా) చూస్తున్నాడు, ఇలాంటి తెలివైన భార్య ఉండటం గ్రేట్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. -
స్వర్ణ ప్యాలెస్ ఘటనతో.. నిరంతరం నిఘా
మచిలీపట్నం: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనతో కోవిడ్ ఆసుపత్రులపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కోవిడ్ ఆసుపత్రులుగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, వారి భద్రతకు పెద్దపీట వేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆసుపత్రులపై పర్యవేక్షణ పెంచడంతో పాటు, నిఘాను పట్టిష్టం చేసేలా చర్యలకు ఉపక్రమించింది. కోవిడ్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఎంపిక చేసిన 13 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా దృష్టి సారించారు. ఇప్పటికే 11 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడలోని లిబర్టీ ఆసుపత్రి, మచిలీపట్నం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం నాటికి సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టారు. లిబర్టీ ఆసుపత్రిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి కోవిడ్ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ పెంచేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రుల్లోని కోవిడ్ కేంద్రం మొత్తం సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తున్నారు. ప్రధాన గేటు మొదలుకొని కేంద్రంలోని అన్ని గదులు, పరీక్షలు నిర్వహించే ప్రదేశం, వైద్య సేవలు అందించే వార్డులు, నమోదు కేంద్రం ఇలా అన్ని చోట్లా సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశాలు అందాయి. వీటిని కోవిడ్ విభాగం ఉన్నతాధికారులు తరచూ పర్యవేక్షణ చేయడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా సీసీ పుటేజీలను భద్రపరచాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు విముఖత చూపే ఆసుపత్రుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, కోవిడ్ నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో కరోనా తగ్గుముఖం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఐసీఎంఆర్ తాజా నివేదికల మేరకు 2,89,290 లక్షల మందికి జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించారు. 12,760 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 9,665 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఇంకా 2,863 మంది కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజా గణాంకాల మేరకు ఇతర జిల్లాలతో పోలిస్తే కృష్ణాలోనే తక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి. రికవరీ శాతం కూడా జిల్లాలో బాగానే ఉండటం అధికారులకు ఊరటనిస్తోంది. రానున్న రోజుల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా జిల్లాలో కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం రేయింబవళ్లు పనిచేస్తున్నారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులు: 13 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినవి: 11 కరోనా పరీక్షల సంఖ్య: 2,89,290 పాజిటివ్ కేసులు: 12,760 కోలుకున్న వారు: 9,665 చికిత్స పొందుతున్న వారు: 2,863 -
కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు
సాక్షి, అమరావతి: ఇప్పటికే 104 కాల్‌సెంటర్ ద్వారా కోవిడ్ బాధితులకు సత్వర సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. బాధితులకు అందుతున్న సేవలను నేరుగా పర్యవేక్షించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను అమర్చనుంది. ► రెండు రోజుల్లో ముందుగా 108 ఆస్పత్రుల్లో 2 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం దాదాపు రూ.3 కోట్లు ఖర్చు పెడుతోంది. ► ఆ తర్వాత మరో 35 ఆస్పత్రుల్లో కూడా సీసీ కెమెరాలు అమరుస్తారు. ► బాధితుల బంధువులు సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా వీటి ద్వారా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. తద్వారా ఎప్పటికప్పుడు చికిత్సపై వాకబు చేస్తారు. సీసీ కెమెరాల ద్వారా పక్కాగా పర్యవేక్షణ ► ఐసీయూ, నాన్ ఐసీయూ, జనరల్ వార్డులన్నింటిలో సీసీ కెమెరాలు. నేరుగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు పర్యవేక్షించడానికి వీలుగా వారికి సీసీ కెమెరా లింకులు. ► కోవిడ్ బాధితులకు సకాలంలో చికిత్స అందుతోందా? మందులు ఇస్తున్నారా? భోజనం పెడుతున్నారా? ఆక్సిజన్, వెంటిలేటర్ పడకల సౌలభ్యం వంటివన్నీ పర్యవేక్షించే వీలు. ► ఎక్కడైనా రోగులు అసౌకర్యంగా ఉన్నట్టు, ఇబ్బంది పడుతున్నట్టు అనుమానమొస్తే తక్షణమే ఆ ఆస్పత్రి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు. ► డ్యూటీలో ఉన్న వైద్యులే చికిత్సకు బాధ్యులు ► రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినా తక్షణమే చర్యలు ► ప్రతి ఆస్పత్రికి సంబంధించిన అధికారి మొబైల్ ఫోన్ నంబర్‌ను డిస్ప్లే బోర్డులో ఉంచుతారు. ► ఎవరైనా అధికారులు, వైద్యులు సకాలంలో స్పందించకపోతే 104కు కాల్ చేసి 2 నొక్కితే పూర్తి వివరాలు బాధితుడి సహాయకులు లేదా బంధువులకు అందిస్తారు. ► సీసీ కెమెరాలతో ఏ ఆస్పత్రిలో ఏం జరుగుతోందో నేరుగా తెలుసుకుని బాధితులకు సత్వర న్యాయం అందిస్తారు. -
లాక్‌డౌన్‌లోనూ చేతివాటం చూపించాడు!
ఘజియాబాద్: కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో నేరాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంతకుముందుతో పోలిస్తే చోరీలు, హత్యలు, ఇతర నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ అక్కడక్కడ చోరశిఖామణులు పంజా విసురుతూనే ఉన్నారు. ప్రపంచమంతా విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కొంతమంది చోరులు మాత్రం తమ చేతికి పనిచెబుతూనే ఉన్నారు. (ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం) తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోరీ చేస్తూ ఓ దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. స్థానిక గిరి మార్కెట్లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సరుకులు కొనేందుకు ఓ పెద్దాయన స్కూటర్ మీద దుకాణానికి వచ్చాడు. బండిని దుకాణం ఎదుటే పార్కింగ్ చేసి సరుకులు కొనడానికి వెళ్లాడు. ఆయన వెనుకే తాపీగా వచ్చిన చోరుడు అదును చూసి బండితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయింది. దీని ఆధారంగా దొంగను పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దొంగ తన పని తాను చేసినట్టుగానే సీసీ టీవీ కూడా చేసిందని ఈ వీడియో చూసినవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి: డీసీపీ -
ఎవరా నలుగురు..?
పసిడిపురి..పుత్తడిపురం ఈ రెండు పేర్లు వినగానే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. బంగారు వ్యాపారంలో రాష్ట్రంలోనే గాక దేశ వ్యాప్తంగా ప్రొద్దుటూరుకు మంచి పేరుంది. బంగారు వ్యాపారులే గాక ఇతర రంగాల్లో బాగా స్థిరపడిన వారు అనేక మంది సంపన్నులు ఇక్కడ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఇక్కడి నుంచే అప్పుగా డబ్బు తీసుకుంటాయి. విడుదలయ్యే ప్రతి చిత్రంలోనూ ప్రొద్దుటూరు ఫైనాన్సియర్ల పెట్టుబడులు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నేతలు సైతం రుణం ఇక్కడి వారి నుంచే తీసుకుంటుంటారు. అలాంటి పసిడిపురిపై ఇటీవల దొంగల కన్ను పడినట్లు కనిపిస్తోంది. వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : బంగారు వ్యాపారస్తులను టార్గెట్ చేసుకొని గతంలో ఈ పట్టణంలో పలు దొంగ తనాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు దుండగులు ఒక బంగారు వ్యాపారి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో పట్టపగలు వచ్చిన దుండగులు వీధిలోనూ, ఇంటి చుట్టూ సుమారు 15 నిమిషాల పాటు రెక్కీ నిర్వహించారు. ఈ వార్త పట్టణమంతా వ్యాపించడంతో బంగారు వ్యాపారులు, ఇతరులు ఆందోళన చెందుతున్నారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు షావలి స్కూల్ కాలనీలో ఒక బంగారు వ్యాపారి నివసిస్తున్నాడు. అతను దర్గాబజార్లో బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7న నలుగురు వ్యక్తులు కారులో అతను ఉన్న కాలనీకి వచ్చారు. వారి కారును కాలనీ ప్రధాన గేటు వద్ద నిలిపారు. ఒక వ్యక్తి అక్కడే నిలబడగా ఇద్దరు వ్యక్తులు కాలనీ లోపలికి వచ్చారు. ఒక వ్యక్తి ఇంటి వెనుక వైపు వెళ్లాడు. ఇద్దరు వ్యక్తులు వ్యాపారి కాంపౌండ్‌లోకి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కారు. ఆ ఇంటికి ప్రధాన తలుపునకు ముందు భాగాన గ్రిల్స్ అమర్చిన తలుపులు కూడా ఉన్నాయి. ఎంతసేపైనా తలుపు తీయకపోవడంతో యజమాని పేరు పెట్టి దుండగులు పిలిచారు. ఆయన భార్య ప్రధాన ద్వారం తెరచి చూడగా ఎప్పుడూ చూడని ఇద్దరు వ్యక్తులు బయట ఉన్నారు. ‘ఎవరు మీరు.. ఎందుకు వచ్చారు’ అని అడుగగా పలకలేదు వారు. ముందు తలుపు తీయమని దబాయించారు. అనుమానం వచ్చిన ఆమె గ్రిల్స్ తలుపులు తీయలేదు. సుమారు 10 నిమిషాల సేపు అక్కడే ఉన్న నలుగురు దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నలుగురు కాలనీ కాంపౌండ్‌లో ఉన్నంత సేపు ఫోన్లలో మాట్లాడుకుంటూ కనిపించారు. బంగారు వ్యాపారి ఎంతో కష్టపడి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పుటేజీలను సేకరించారు. అందులో దుండగులు సెల్ఫోన్లో మాట్లాడిన సన్నివేశాలు టైమింగ్‌తో సహా రికార్డు అయ్యాయి. సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా ఆ నలుగురు ఎవరు..? వారు ఎవరితో మాట్లాడారనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. వారిలో ఇద్దరు జాకెట్ వేసుకొని వచ్చారు. వేసవి కాలంలో జాకెట్ వేసుకొని రావడం చూస్తే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రింగ్ రోడ్డు గుండా వచ్చారు.. జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులోని రింగురోడ్డు గుండా నలుగురు దుండగులు పట్టణంలోకి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. పెన్నానగర్ నుంచి నేరుగా వ్యాపారి ఉంటున్న కాలనీ వద్దకు వచ్చారు. అతని ఇంటి వద్ద నుంచి వెళ్లి ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కొంత సేపు కారు పార్కింగ్ చేశారు. తర్వాత వన్‌టౌన్ స్టేషన్ మీదుగా వెళ్లిపోయారు. వారు మాట్లాడిన భాష.. యాస ఆధారంగా వారు ఉత్తరప్రదేశ్ లేదా బీహార్‌కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. నలుగురు ఎందుకొచ్చినట్లు.. వ్యాపారి ఉంటున్న కాలనీలో సంపన్నులు చాలా మంది ఉన్నారు. నేరుగా అతని ఇంటికే వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ చోరీ చేయడానికే వచ్చారను కుంటే.. అదే వీధిలో సుమారు 15 రోజుల నుంచి ఒక ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఉన్న ఇంటినే ఎందుకు టార్గెట్ చేశారనేది తెలియడం లేదు. పట్టపగలు భయపెట్టి దోచుకొని వెళ్లడానికా.. లేక కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నలుగురు దుండగులకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన రహదారిలో కాకుండా చిన్న పాటి ఇరుకు వీధి నుంచి నేరుగా వ్యాపారి ఇంటికి వచ్చిన విధానం చూస్తే స్థానికులు ఎవరైనా వారికి సహకరించి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయం బంగారు మార్కెట్లో తెలియడంతో వ్యాపారులు భయాందోనలు చెందుతున్నారు. పట్టణంలోని ప్రతి ప్రాంతంలోనూ సీసీ కెమెరాలను అమర్చారు. ఇంత పెద్ద ఎత్తున నిఘా వ్యవస్థ ఉన్నా దుండగులు ఎలా వచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. కారు నెంబర్ ప్లేట్‌ను పరిశీలించగా ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. ఫేక్ నెంబర్ వేసుకొని దుండగులు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై వ్యాపారి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇటీవల వైఎంఆర్ కాలనీలో రెండు భారీ చోరీలు జరిగాయి. ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేసే ఉద్యోగి ఇంట్లో, మరొకటి గనుల వ్యాపారి ఇంట్లో దొంగలు పడ్డారు. వీటిలో ఒక చోరీ ఘటనలో పురోగతి కనిపించగా ఇంకోటి ఇంత వరకు తేలలేదు. -
అచ్చం దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో..
సాక్షి, దొడ్డబళ్లాపురం : చికిత్స కోసమని వైద్యుని ఇంటి తలుపులు తట్టిన దుండగులు లోపల చొరబడి దోపిడీకి పాల్పడ్డ సంఘటన మాగడి తాలూకా కుదూరులో చోటుచేసుకుంది. దండుపాళ్యం ముఠాల తరహాలో దోపిడీ జరగడం గమనార్హం. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో అపరిచితులు డాక్టర్ సుభాష్ సింగ్ ఇంటి తలుపులు తట్టడంతో తీశారు. ఒక మహిళ చిన్న పాపను ఎత్తుకుని వచ్చి ఆయాసంగా ఉందని, మందులు కావాలని అడిగింది. మహిళను లోపలకు రమ్మనగానే ఆమె వెనుకనే 15 మంది ఇంట్లోకి చొరబడ్డారు. వచ్చీరాగానే వైద్యుడు సుభాష్ సింగ్, భార్య శశికళ సింగ్, కుమారులు లోకనాథ్‌సింగ్, పృథ్వీ సింగ్‌ల కళ్లల్లో కారం చల్లారు. తరువాత నలుగురినీ కాళ్లు చేతులు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కారు. ఇంట్లో ఉన్న రూ.50వేల నగదు, బంగారు వెండి ఆభరణాలతో పాటు, ల్యాప్‌ట్యాప్, ఇతర ఖరీదైన వస్తువులు, డిజిరో కారును దోచుకెళ్లారు. ప్రతిఘటించిన నలుగురినీ విచక్షణారహితంగా కొట్టారు. సీసీ కెమెరాలు, కుక్కలు ఉన్నా.. అనంతరం వైద్యుని కుమారులు అతి కష్టంమీద కట్లు తెంచుకుని బయటకు వచ్చి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. వైద్యుని ఇల్లు విశాలంగా ఉంది. చుట్టూ 14 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.15 పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయినా దుండగులు నిర్భయంగా వచ్చి దోపిడీ చేసుకుపోవడం ప్రశ్నార్థకంగా ఉంది. తమ చిత్రాలు దొరక్కుండా దుండగులు సీసీ టీవీల ఉపకరణాలను కూడా అపహరించారు. క్షతగాత్రులను నెలమంగల ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు.కుదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ పరీక్షల నిర్వహణ.. ప్రతి గదిలో కెమెరా
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలపై కెమెరా కన్ను నిఘా పెట్టనుంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తొలిసారిగా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగే తీరును సీసీ కెమెరాల ద్వారా ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్లను కేటాయించనున్నారు. మార్చి 4 నుంచి 23 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. నెల్లూరు (టౌన్): జిల్లాలో 208 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 56,789 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్‌లో 28,587 మంది, ఒకేషనల్‌కు సంబంధించి 1,572 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్‌లో 25,590 మంది, ఒకేషనల్‌కు సంబంధించి 1,040 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందుకు సంబంధించి పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిబంధనను కూడా అమలు చేయనున్నారు. నూతన ఒరవడికి శ్రీకారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఇబ్బందులు, ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో ఉంచారు. వీటిని డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. గతంలో మాదిరిగా హాల్ టికెట్లు కోసం కళాశాలల చుట్టూ విద్యార్థులు తిరగాల్సిన అవసరం ఇక ఉండదు. విద్యార్థి ఇచ్చిన ఫోన్ నంబర్‌కు పరీక్ష కేంద్ర పేరుతో పాటు గది నంబర్ వివరాలను మెసేజ్ రూపంలో పంపనున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఇంటర్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు నిఘా నీడలో జరగనున్నాయి. పరీక్షలు జరగనున్న అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించనున్నారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలో పరీక్షలు నిర్వహించే ప్రతి గదిలో సీసీ కెమెరాలను బిగించాలని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే సీసీ కెమెరాల లైవ్ ద్వారా అధికారులు వెంటనే గుర్తించేందుకు అవకాశం ఉంది. జంబ్లింగ్ ద్వారాఇన్విజిలేటర్ల నియామకం ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ ద్వారా నియమించనున్నారు. పరీక్ష జరగనున్న కళాశాలలో అదే కళాశాలకు చెందిన ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది ఎవరూ విధులు నిర్వర్తించే అవకాశం ఉండదు. పరీక్షకు ఇన్విజిలేటర్లు రోజు రోజుకు మారుతుంటారు. పరీక్షలకు 87 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 87 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించనున్నారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న అధ్యాపకులతో టాస్క్‌ఫోర్స్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వా డ్లు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే తొలి విడతలో జిల్లాకు చేరిన ఇంటర్ ప్రశ్నపత్రాలను నగరంలోని కేఏసీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చారు. రెండో విడతగా మరో రెండు రోజుల్లో ప్రశ్నపత్రాలు రానున్నాయి. వీటిని ఆయా పరీక్ష కేంద్రాల సమీపంలోని పోలీస్స్టేషన్లకు చేర్చనున్నారు. అక్కడి నుంచి ఏ రోజుకు ఆ రోజు పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాలను కేంద్రానికి తీసుకెళ్లనున్నారు. 26న వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 26న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ పరీక్షలపై అన్ని జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు, వృత్తి విద్యాశాఖాధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నా రు. అనంతరం ఆర్ఐఓ, డీవీఈఓలు పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం కానున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించేలా ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశాం. ఈ వారంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నాం. కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపడతాం. విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతులను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.– శ్రీనివాసరావు, ఆర్ఐఓ -
శివారు.. జనం బెంబేలు
కర్నూలు శివారు ప్రాంత ప్రజలు దొంగల భయంతో వణికిపోతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళితే తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్లవుతోంది. గార్గేయపురంలో శనివారం రాత్రి ఆరు ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించిన విషయం విదితమే. అది కూడా తాళాలు వేసిన ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసి..కట్టర్‌తో తాళాలను తెగ్గొట్టి డబ్బు, ఆభరణాలు తస్కరించారు. ఈ చోరీల నేపథ్యంలో శివారు ప్రాంత ప్రజల ఆందోళన రెట్టింపవుతోంది. కర్నూలు రూరల్ : కర్నూలు నగరం చుట్టుపక్కల సుమారు 20 గ్రామాలు, పది దాకా వెంచర్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రాత్రిపూట పోలీసుల గస్తీ నామమాత్రంగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో అసలే ఉండడం లేదు. రాత్రి వేళల్లో గ్రామానికి ఒక పోలీసును డ్యూటీ వేస్తున్నప్పటికీ వారు ఎక్కడా కన్పించడం లేదు. చాలా ప్రాంతాల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. ఈ పరిస్థితిని దొంగలు అనువుగా మలచుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న దొంగలు పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో శివారు ప్రాంతాలనే టార్గెట్ చేస్తున్నారు. బిహార్, చెడ్డీ, రాజస్థాన్ గ్యాంగ్‌లు చోరీలకు తెగబడుతున్నాయన్న ప్రచారంతో ప్రజలు వణికిపోతున్నారు. గార్గేయపురంలో జరిగిన చోరీలతో ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న దిగువపాడు, శివరామపురం, నందనపల్లి, మిలిటరీకాలనీ, కేతవరం తదితర గ్రామాల ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గ్రామాలు కర్నూలు–గుంటూరు మార్గంలో ఉండడంతో దొంగలు సులువుగా చోరీలకు తెగబడుతున్నారు. 10 మంది దాకా వాహనంలో వచ్చి, రోడ్డుపైనే ఆపి తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడుతున్నారు. గార్గేయపురంలో ఇదే తరహాలో చోరీలకు తెగించారు. గతంలో వెంకాయపల్లి, దిన్నెదేవరపాడు, బి.తాండ్రపాడు గ్రా మాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. వారం ముందే రెక్కీ? దొంగలు చోరీలకు పాల్పడడానికి వారం ముందే రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పగలు దుప్పట్లు, దుస్తులు అమ్మేవారి లాగా వస్తున్నారు. అనువైన ఇళ్లను గుర్తించి.. రాత్రిపూట చోరీలకు తెగబడుతున్నారు. ఇళ్లకు వేసిన తాళాలను కట్టర్ సహాయంతో ఏమాత్రమూ శబ్దం రాకుండా తెగ్గొడుతున్నారు. తర్వాత తమ వెంట తెచ్చుకున్న దుప్పటిని డోర్‌కు అడ్డంగా కట్టి..నగదు, నగలు మూటగట్టుకుంటున్నారు. దీనివల్ల ఆ ఇంట్లో ఏమి జరుగుతోందో బయటివారు గుర్తించలేని పరిస్థితి. గార్గేయపురంలో చోరీలకు పాల్పడిన దొంగలు కాసేపు సెంటర్లో కూర్చుని వెళ్లినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మోకాళ్ల వరకు బురఖా, కాళ్లకు చెడ్డీలు వేసుకుని వచ్చారని, తమ వెంట తెచ్చుకున్న వాహనాన్ని గ్రామమంతా తిప్పారని జనం చెబుతున్నారు. తాళం కట్ చేశారు మేము శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లాం. శనివారం రాత్రి చోరీ జరిగింది. తాళాన్ని కట్టర్ సహాయంతో కట్ చేశారు. ఒకవేళ ఆ సమయంలో మేము ఇంట్లో ఉంటే మా ప్రాణాలు కూడా తీసేవారేమో! – మల్లికార్జున, గార్గేయపురం చిన్న శబ్దం కూడా రాలేదు నేను పక్కనే ఉన్న మా అమ్మ వాళ్లింట్లో పడుకున్నా. మా ఇంట్లో దొంగలు పడి రూ.30వేల నగదు, మూడు తులాల బంగారు ఎత్తుకెళ్లారు. ఆ రాత్రి మా ఇంట్లో నుంచి చిన్న శబ్దం కూడా రాలేదు. తాళం, బీరువా పగులగొట్టినా శబ్దం రాకుండా దొంగతనం చేశారు. – కురువ మాధవి, గార్గేయపురం త్వరలోనే పట్టుకుంటాం గార్గేయపురంలో చోరీలపై విచారణ చేస్తున్నాం. దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. త్వరలోనే వారిని పట్టుకుంటాం.– ఓబులేసు, సీఐ, కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ -
వీఆర్వో అనుమతిస్తేనే తహసీల్దార్ దర్శనం
సాక్షి, కరీంనగర్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాలకు పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టారు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఉన్న కరీంనగర్‌రూరల్, అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలకు సోమవారం వివిధ సమస్యలపై బాధితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయా కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మానిటర్లో తహసీల్దార్లు కార్యాలయాల్లోకి వచ్చే వారిని, లోపల ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయాల లోపలికి వెళ్లేముందు దరఖాస్తుదారులను అటెండర్లు పూర్తి వివరాలు అడిగి లోపలికి పంపిస్తున్నారు. వీఆర్వోల అనుమతి లేకుండా నేరుగా తహసీల్దార్లను కలువకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. ఒకవైపు ప్రజావాణిలో భూసమస్యలపై జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ కొందరు బాధితులు మళ్లీ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను కలిసేందుకు వచ్చారు. అయితే ముందుగా సంబంధిత గ్రామాల వీఆర్వోలు బాధితుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. మరికొందరు బా«ధితులను వీఆర్వోలు స్వయంగా తహసీల్దార్ సుధాకర్ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించారు. దరఖాస్తు ఎవరి వద్ద ఉంది, సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను తహసీల్దార్ సుధాకర్ వీఆర్వోకు సూచించారు. అదేవిధంగా అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ముందుగా అటెండర్ దరఖాస్తుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని లోపలికి పంపిస్తున్నారు. సంబంధిత అధికారి దరఖాస్తుదారుల సమస్యను పరిశీలించి అవసరమైతే తహసీల్దార్ దగ్గరకు స్వయంగా తీసుకెళ్తున్నారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరా -
వర్షిత హంతకుడి సీసీ ఫుటేజీ చిత్రాలు విడుదల
కురబలకోట (చిత్తూరు జిల్లా):రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన చిన్నారి వర్షిత హత్య కేసు నిందితుడి సీసీ ఫుటేజీ చిత్రాలను సోమవారం డీఎస్పీ రవి మనోహరాచారి విడుదల చేశారు. ఇటీవల మదనపల్లె సమీపంలోని చేనేత నగర్ కల్యాణ మండపం వద్ద చిన్నారి వర్షిత దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సోమవారం కల్యాణ మండపంలో సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో నమోదైన చిత్రాలను పత్రికలకు విడుదల చేశారు. ఇలాంటి పోలికలున్న వారి ఆచూకీ లభిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. 9440796738, 9440617891, 9440900705, 8885588558 నంబర్లకు ఆచూకీ తెలపాల్సిందిగా కోరారు. -
నిను వీడని నీడను నేనే..
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీ, ముంబై, సూరత్‌లకు దీటుగా రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 5 లక్షలకు చేరుకున్న వీటి సంఖ్యను 10 లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు ముందుకెళ్తున్నారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటన్నింటినీ ఆయాకమిషనరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ (సీసీసీ)కు అనుసంధానిస్తున్నారు. ఇప్పుడీ వ్యవస్థకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సైతం జోడించడంపై అధికారులు దృష్టిసారించారు. ‘తేడా’ లేకుండా... 2014లో అమల్లోకి వచ్చిన ప్రజా భద్రత చట్టాన్ని కమిషనరేట్ల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని కచ్చితం చేశారు. పోలీసు స్టేషన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన కమిషనర్లు... ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వీటి ఆవశ్యకతనూ వివరిస్తూ ఎవరికివారు ముందుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఏర్పాటవుతున్న కమ్యూనిటీ కెమెరాలను ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగినవి వారు ఏర్పాటు చేసుకుంటే సీసీసీతో అనుంధానం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా యూనిఫామిటీ కోసమూ పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు విభాగమే ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్‌ను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో అన్నీ ఒకే రకమైన కెమెరాలు సమకూరుతున్నాయి. అన్నింటికీ అనుసంధానం... ఇప్పటికే జంట కమిషనరేట్లలో పోలీసు, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు చేసిన కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉన్నాయి. వీటి సంఖ్య పరిమితం కావడంతో అన్నిచోట్లా నిఘా సాధ్యం కావట్లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతా«ధికారులు వ్యాపార సముదాయాలు, వాణిజ్య కూడళ్లతో పాటు దుకాణాల్లోనూ ఏర్పాటు చేస్తున్న వాటినీ అనుసంధానిస్తున్నారు. దుకాణం లోపల భాగం మినహా బయటకు ఉన్న కెమెరాలు, కాలనీలు, పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న అన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా సీసీసీలతో అనుసంధానిస్తున్నారు. దీంతో పోలీసు విభాగానికి చెందిన కెమెరాలూ ప్రధానంగా ట్రాఫిక్ కోణంలో ఉన్నా... అనుసంధానించినవి నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తున్నాయి. రానున్న రెండేళ్లలో మూడు కమిషనరేట్లలో పోలీసు, కమ్యూనిటీ అన్నీ కలిపి 10 లక్షల సీసీ కెమెరాలు ఉండాలన్న లక్ష్యంతో కమిషనర్లు ముందుకెళ్తున్నారు. ఈ కలసాకారమైతే అలాంటి నిఘాతో కూడిన నగరంగా హైదరాబాద్ దేశంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించనుంది. ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు ప్రస్తుతం సిటీలో ఎలాంటి నేరం జరుగుతున్నా పోలీసులు ప్రధానంగా సీసీ కెమెరాలపైనే ఆధారపడుతున్నారు. అంతటి ప్రాధాన్యమున్న వీటి ఏర్పాటులో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతలను పోలీసుస్టేషన్ల వారీగా ఆయా ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. వ్యాపారులు, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న వీరు కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సిటీలోని కెమెరాల సంఖ్యను భారీగా పెంచాలని, అన్నింటికీ సీసీసీతో అనుసంధానించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సైబరాబాద్‌లో లక్షమార్కు... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ కెమెరాల బిగింపు లక్ష మార్కును దాటింది. మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ జోన్లలో మంగళవారం వరకు 1,00,419 నిఘానేత్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 13,846 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, 86,669 ‘నేను సైతం’ కెమెరాలు ఉన్నాయి. అయితే జోన్ల వారీగా తీసుకుంటే అత్యధికంగా మాదాపూర్ జోన్లో 48,914, బాలానగర్ జోన్లో 26,783, శంషాబాద్‌లో 24,572 సీసీటీవీ కెమెరాలు బిగించారు. అలాగే పోలీసు స్టేషన్ల వారీగా తీసుకుంటే గచ్చిబౌలి ఠాణా పరిధిలో అత్యధికంగా 7,530 సీసీటీవీ కెమెరాలు బిగిస్తే అత్పల్పంగా చౌదరిగూడ ఠాణాలో 185 నిఘానేత్రాలు అమర్చారు. అలాగే రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 95,000 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ విషయానికొస్తే దాదాపు మూడు లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలు అమర్చారు. -
ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్తున్నారా..
సాక్షి, నిజామాబాద్: దసరా సెలవులు వచ్చాయి.. ఇంటికి తాళం వేసి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు తస్మాత్ జాగ్రత్త అంటు పోలీసు శాఖ హెచ్చరిస్తుంది. ప్రతి ఏటా వేసవి సెలవులతో పాటు దసరా సెలవుల సమయాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇటీవల దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతన్నారు. అంతరాష్ట్ర ముఠా జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతుంది. ఇదీ పరిస్థితి జిల్లాలో గతంలో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తే 2017లో రాత్రిపూట 192, పగటిపూట 34, 2018లో రాత్రిపూట 206, పగలు 42, 2019లో రాత్రిపూట 120 , పగలు 14 దొంగతనాలు జరిగాయి. ఇలా దొంగతనాల సంఖ్య పెరుగుపోతుంది. జిల్లా కేంద్రంలో ముబారక్‌నగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై దొంగతనానికి ప్రయత్నించారు. ఏకకాలంలో వినాయక్‌నగర్, శ్రీనగర్ కాలనీలో బంగారు దుకాణాల్లో మహారాష్ట్ర కు చెందిన ముఠా దొంగతనాలకు పాల్పడింది. ఇటీవల సీతారాంనగర్‌కాలనీలో ఓ కారును ఎత్తుకెళ్లారు. ఇదే ప్రాంతంలో మరో మూడు ఇళ్లలో వారం రోజుల్లోనే చోరీలు జరిగాయి. తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేశారు. సీసీ కెమెరాలు ఎంతో మేలు ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగనాలు నివారించవచ్చు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో సీసీ కెమెరాలను గమనించి దొంగలు వెనకడుగు వేశారు. సీసీ కెమెరాలు ఉంటే చోరీ జరిగిన దొంగలను త్వరగా పట్టుకోవచ్చు. సెలవుల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయడం ద్వారా కూడా చోరీలను అదుపు చేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు. నగరంలో ఇదివరకే ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాల ద్వారా రాత్రి వేళలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇళ్లకు తాళం వేసి, ఊర్లకు వెళ్లే వారు పలు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హర్ ఏక్‌మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించండి విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్లకూడదు ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకొండి పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిది. కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి తాళం వేసి ఊరు వెళ్లే ముందు సమీప పోలీసుస్టేషన్లో సమాచారం అందించాలి జాగ్రత్తలు తీసుకోండి ఇంటికి తాళం వేసే వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విలువైన వస్తువులు ఇంటిలో పెట్టుకోవద్దు. అలాగే రాత్రి వేళలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కొనసాగుతుంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పదంగా ఉన్న వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం అందించాలి. – ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ -
దోపిడీ చేసిన వారే రాళ్లేస్తున్నారు
సాక్షి, అమరావతి: మొన్నటి వరకూ ఇసుక దందా ద్వారా దోచుకున్న వారే ఇప్పుడు ప్రభుత్వంపై రాళ్లేయాలని చూస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతిని అడ్డుకోవడాన్ని సహించలేని వారే విమర్శలు చేస్తున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విమర్శలకు అవకాశం లేని విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇసుకపై సచివాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా స్టాక్ యార్డులు పెంచాలని, వరద తగ్గిన వెంటనే రీచ్‌ల నుంచి వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు ఇసుక చేరవేసి ప్రజలకు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక మాఫియాకు ఏమాత్రం అవకాశం లేకుండా చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించాలన్నారు. సీసీ కెమెరాలు, జీపీఎస్ విధానం ఇందుకు బాగా ఉపకరిస్తాయని చెప్పారు. కొత్తవిధానం అమలు ప్రారంభించిన వెంటనే వరదలతో రీచ్‌లు మునగడంవల్ల ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయని, ఆ సమస్యలను త్వరితగతిన అధిగమించి ఇసుక విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ వరదలవల్ల వచ్చిన విరామ సమయాన్ని పరిస్థితులను సరిదిద్దుకోవడానికి సమర్థంగా వినియోగించుకోవాలని ఉద్బోధించారు. ఏ స్థాయిలో కూడా అవినీతికి ఏమాత్రం అవకాశం ఉండరాదన్నారు. ఎక్కడ ఎలాంటి లోపం ఉన్నా సరిదిద్దుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎవరు ఎక్కడ ఇసుక అక్రమ తరలింపు, తవ్వకాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని, మాఫియాపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇసుకకు కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. ఎప్పటినుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని కూడా ముందస్తుగా తెలియజేస్తే నిర్మాణదారులు తదనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని, మోసం జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలన్నారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు వరదల కారణంగా ఇసుక తవ్వడానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్పారు. మొత్తం 102 రీచ్‌లకుగాను 25 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నామని వివరించారు. తవ్వి నదుల పక్కన పోసిన ఇసుక వరదల కారణంగా కొట్టుకుపోయిందని తెలిపారు. లంక భూములు కూడా మునిగిపోయాయని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, మార్కెట్లో ప్రస్తుతం 23 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. రవాణా విషయంలో 90 శాతం వరకు ఇబ్బందులు అధిగమించామని తెలిపారు. -
సిటీ‘లైఫ్’.. ఇస్మార్ట్ ప్రూఫ్
సాక్షి, హైదరాబాద్: ఇస్మార్ట్ ప్రూఫ్‌లు.. నేరస్థులను ఇట్టే పట్టిస్తున్నాయి. మూడోకన్ను పడిందంటే మూడినట్టే. నేరాల ప్రివెన్షన్, డిటెక్షన్, కన్వెక్షన్‌లో సీసీ కెమెరాలతోపాటు ట్యాబ్స్, ల్యాప్టాప్స్, యాప్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసుశాఖకు మౌలిక వసతులతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం సమకూర్చింది. సాంకేతిక సహాయంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లోని సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగింది. ఫలితంగా వీటిల్లో శిక్షలు, ముఖ్యంగా జీవితఖైదు శిక్షలు పెరిగాయి. జీవితఖైదు పడుతున్న కేసుల్లో హత్య, పోక్సోయాక్ట్, మహిళలపై నేరాలతోపాటు ఇతరాలు ఉంటున్నాయి. జీవితఖైదు శిక్షలు ఈ ఏడాది జనవరి–ఆగస్టు మధ్య రాష్ట్రవ్యాప్తంగా పడిన జీవితఖైదుల్లో 35.8 శాతం ఈ మూడు కమిషనరేట్ల కేసులకు సంబంధించిన తీర్పులే. దీన్ని గుర్తించిన డీజీపీ కార్యాలయం ఇటీవల ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్రంలోని 21 యూనిట్లలో 67 మందికి జీవిత ఖైదుపడగా వారిలో హైదరాబాద్ పరిధిలో 10, సైబరాబాద్, రాచకొండల్లో ఏడుగురు చొప్పున ఉన్నారు. క్లూస్ టీమ్స్.. నేరం జరిగినప్పుడు ఘటనాస్థలాల నుంచి వీటిని ఎంత వేగంగా, పక్కాగా సేకరించ గలిగితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఒకప్పుడు మూడు కమిషనరేట్లలో కలిపి కేవలం మూడే క్లూస్‌టీమ్స్ ఉండేవి. ఫలితంగా వారిపై పనిభారంతో పాటు క్రైమ్ సీన్స్‌కు చేరుకోవడంలో కాలయాపన జరిగేది. జాప్యాన్ని నివారించడానికి పోలీసు శాఖ డివిజినల్ క్లూస్‌టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. జియో ట్యాగింగ్ ప్రతి పోలీసు అధికారి రోజువారీ నిర్వర్తిస్తున్న విధులను తెలుసుకోవడం కోసం ప్రత్యేక ఆన్లైన్ నివేదికలను పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకుంటున్నారు. నేరగాళ్ల నివాసాలు, ఆవాసాలను సాంకేతికంగా గుర్తించడానికి సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్ చేయడంతోపాటు ఈ–లీవ్ విధానం అమలు వంటివి ప్రతిస్థాయి అధికారి, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయి. సీసీ కెమెరాలు.. నేరాలను నిరోధించడం, కేసుల్ని కొలిక్కి తేవడం, దోషులను నిర్ధారించడం వంటి అంశాల్లో సీసీ కెమెరాలు బాగా ఉపకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్యవర్గాల సహాయంతో కమ్యూనిటీ సీసీ కెమెరాలు, ‘నేను సైతం’ప్రాజెక్టు కింద సాధారణ ప్రజలతో సీసీటీవీలను ఏర్పాటు చేయించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న సీసీ కెమెరాల సంఖ్య 3 లక్షలకు పైనే. రికార్డు అయిన ఫీడ్‌ను శాస్త్రీయంగా ఎలా సేకరించాలనే అంశంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. ఐఎస్ఎస్.. శిక్షల శాతం పెరగడంలో ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ (ఐఎస్ఎస్) పాత్ర ఎనలేనిది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కేంద్రంగా రెండేళ్లుగా పనిచేస్తున్న ఈ విభాగం దర్యాప్తు అధికారులకు ఆద్యంతం సహకరిస్తోంది. -
నిఘానే ‘లక్ష్యంగా..!
సాక్షి,సిటీబ్యూరో: ఏప్రిల్ 19 రాత్రి సమయంలో అల్వాల్‌లోని అక్సిజన్ అర్కెడ్ అపార్ట్మెంట్లోకి చొరబడిన దొంగతలు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.24 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ బిల్డింగ్‌లోని మెట్ల వద్ద, పార్కింగ్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిందితుల ఫొటోలు, వీడియోలు రికార్డయ్యాయి. కానీ వారి ముఖానికి మాస్క్‌లు ధరించడంతో గుర్తిం చడం కష్టమైంది. అయితే చోరీ చేసి తిరిగి వెళుతున్న దారిలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో వారి ముఖాలు చిక్కాయి. దీంతో వారిని రెండు వారాల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు స్వాధీ నం చేసుకొని నిందితులను జైలుకు పంపారు. ♦ ఆగస్టు 20న సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని బైరాంగూడలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ నుంచి ఓ చైన్‌స్నాచర్ బంగారు గొలుసు తెంచుకొని బైక్‌పై పరారయ్యాడు. అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కొత్తపేటలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేసే హర్యానా వాసి కుషరియా దతారామ్గా గుర్తించి ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లోనే కాదు వందల కేసుల్లో నిందితులను గుర్తించడమే కాకుండా వారికి జైలు శిక్షలు పడేలా న్యాయస్థానంలో సాంకేతిక సాక్ష్యంగా ఉపయోగపడుతున్న ఈ సీసీటీవీ కెమెరాలను అవశ్యకతను గుర్తించిన సైబరాబాద్, రాచకొండ పోలీసులు ‘లక్ష’ం వైపుగా సాగుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజ్గిరి, యాదాద్రి జోన్లో ఈ సీసీ కెమెరాల బిగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఓవైపు నేను సైతం ప్రాజెక్ట్, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌ల ద్వారా ఈ సీసీ కెమెరాల సంఖ్య దాదాపు ఇరు కమిషనరేట్ల అధికారులు లక్ష చేరువలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్‌లో 96 వేలు, రాచకొండలో 90,700 సీసీ కెమెరాలను బిగించారు. అయితే, నేను సైతం ప్రాజెక్టు ద్వారానే అధిక నిఘానేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో బడా ఐటీ కంపెనీలు ముందుకొచ్చి పోలీసుల నేను సైతం ప్రాజెక్టుకు విరాళాలు ఇస్తున్నారు. అంతేగాకుండా సీసీ కెమెరాల నిర్వహణకు కూడా కొన్ని కంపెనీలు ఆర్థిక సాయం ఇస్తూ నేర రహిత సమాజంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ‘చాయ్ పే చర్చ’ ద్వారా జాగృతి లక్షల్లో ఉద్యోగులు పనిచేసే ఐటీ కారిడార్‌లోనూ సీసీటీవీ కెమెరాలను మరింత పెంచేందుకు సైబరాబాద్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌సీఎస్‌సీలో సభ్యులుగా ఉన్న ఐటీ కంపెనీలను పోలీసు కమిషనర్ వీసీ సజ ్జనార్ ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం ద్వారా సీసీటీవీ అవశ్యకతను వివరిస్తున్నారు. కంపెనీలతో పాటు రహదారులపై ఏర్పాటు చేసే సీసీ టీవీ కెమెరాల ద్వారా ఎక్కడ ఏం జరిగినా తెలుస్తుందని చెబుతున్నారు. ఫలితంగా ప్ర స్తుతం ఐటీ కారిడార్‌లో ఉన్న 214 సీసీటీవీ కెమెరాల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు శంషాబాద్ జోన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాల ఉండేలా చొరవ చూపుతున్నారు. వచ్చిన విరాళాలతో సైబరాబాద్ ఐటీసెల్ విభాగాధిపతి పి.రవిప్రసాద్ ఆధ్వర్యంలో పాత సీసీటీవీ కెమెరాల నిర్వహణతో పాటు కొత్త సీసీటీవీ కెమెరాల ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ‘మహా’ కమిషనరేట్‌లో నిఘా విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్‌గా ఉన్న రాచకొండ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, యాదాద్రి లా అండ్ అర్డర్ జోన్లు ఉన్నాయి. పట్టణం, గ్రామీణ ప్రాంతాలు మిళితమైన ఈ ప్రాంతంలో నేరాలు నియంత్రించేందుకు సీసీటీవీల అవసరాన్ని తొలినాళ్లలోనే రాచకొండ సీపీ మహేష్ భగవత్ గుర్తించారు. ఆయా జోన్లలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, నేను సైతం సీసీటీవీ కెమెరాలను బిగింపును ఆయా జోన్ల డీసీపీలకు అప్పగించారు. ఈ సీసీటీవీ కెమెరాలు చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పాటు సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులను ఈజీగా పోలీసులకు పట్టిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్‌లో అత్యంత ప్రధానమైన యాదాద్రి ఆలయం ఉండటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు జరుగుతుండటంతో ఐటీసెల్ విభాగాధిపతి ఎం.శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షణలో జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు రెండు కమిషనరేట్ల పరిధిలోని నిమజ్జనాలు జరిగే చెరువుల వద్ద 305 సీసీ కెమెరాలు తాత్కాలికంగా బిగిస్తున్నారు. సైబరాబాద్‌లోని హస్మత్‌పేట చెరువుత, పత్తికుంట చెరువు, మల్లెచెరువు, ఐడీఎల్ చోఎరువు, ప్రగతినగర్ చెరువుల వద్ద 100 సీసీటీవీ కెమెరాలు, రాచకొండలోని సరూర్‌నగర్, ఎదులాబాద్, ఇమాంగూడ, కాప్రా, సఫిల్‌గూడ చెరువుల వద్ద 205 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు. ‘రాచకొండలో నిమజ్జనం జరిగే ప్రాంతాలతో పాటు 35 సున్నితమైన ప్రదేశాల్లో కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వివిధ జంక్షన్లలో ఉన్న సీసీటీవీ కెమెరాలను డీజీపీ కార్యాలయానికి, రాచకొండ సీపీ కార్యాలయానికి అనుసంధానిస్తున్నాం’ అని రాచకొండ ఐటీసెల్ విభాగాధిపతి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. నేరాల నియంత్రణ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఈ నిఘా నేత్రాలు సంచలనాత్మక కేసులు, దొంగతనాలు, చైన్‌స్నా చింగ్‌లు, హత్యలు దితర నేరాల్లో నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నాయి. హజీపూర్ ఘటనతో యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. – మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ సీసీటీవీలకు విరాళం ఇవ్వాలనుకుంటే... సైబరాబాద్: 949061744కు వాట్సాప్ చేయవచ్చు. లేదా itcell& cyb@tspolice.gov.in మెయిల్ చేయవచ్చు. రాచకొండ: 949061 7111కు వాట్సాప్ చేయవచ్చు. లేదా ఆయా పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలను సంప్రదించవచ్చు. -
తిరుపతిలో కిడ్నాప్ కలకలం
సాక్షి, తిరుపతి: చిన్నారి కిడ్నాప్ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. మూడేళ్ల చిన్నారిని శుక్రవారం రాత్రి కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు. తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్‌ను గుర్తించి.. ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. చిన్నారిని కిడ్నాపర్ చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వదిలివెళ్లాడు. స్థానికుల సహకారంతో పోలీసులు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
ఇసుకపై నిరంతర నిఘా!
సాక్షి, అమరావతి: నిరంతర నిఘా ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పూర్తిగా చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క టన్ను ఇసుక కూడా దారిమళ్లడానికి, దుర్వినియోగానికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు నిరంతర నిఘా కొనసాగించనున్నారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను నిరంతరం ట్రాకింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనుంది. కాగా, రాష్ట్రంలో అన్ని ఇసుక రేవులు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో అతి తక్కువ మొత్తానికి రూ.58,970.5కు కోట్ చేసిన ఆర్యాస్ స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్–1గా నిలిచింది. ‘రూ.59,689.66కు బిడ్ వేసిన యాపిల్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్–2గా, రూ.1,32,299కి కోట్ చేసిన బ్రిస్పతి అనే సంస్థ ఎల్–3గా నిలిచాయి. కెమెరా, స్తంభం, బ్యాటరీ, సోలార్ ప్యానల్, ఇన్స్టలేషన్ కలిపి సీసీ కెమెరా యూనిట్‌గా నిర్ణయించి 302 యూనిట్లకు టెండర్లు పిలవగా ఒక్కో యూనిట్‌కు రూ.58,970.5కు ఆర్యాస్ బిడ్ వేసింది. ఇదే తక్కువ మొత్తం కావడంతో ఈ సంస్థకే టెండరును ఖరారు చేశారు. అలాగే ఇసుక తవ్వకం (క్వారీల్లో ఇసుక తవ్వకం, కూలీలతో ట్రాక్టర్‌కు లోడింగ్, స్టాక్ యార్డుకు రవాణా, అన్ లోడింగ్, అక్కడ నుంచి వినియోగదారులకు రవాణా చేసేందుకు టిప్పర్‌కు లోడింగ్) కోసం తొమ్మిది షెడ్యూళ్లకు టెండర్లు పిలవగా 40 మంది బిడ్లు వేశారు. అంతకుముందు తొలి విడతలో 38 షెడ్యూళ్లకు టెండర్లు ఖరారు చేశారు. రవాణా టెండర్లు రద్దు స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులకు ఇసుక రవాణా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ జిల్లా యూనిట్‌గా పిలిచిన టెండర్లు రద్దు కానున్నాయి. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలన్నింటికీ స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులు కోరిన చోటకు ఇసుక రవాణా చేసే అవకాశం కల్పించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ టెండర్లు రద్దయినట్టే. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుకను తీసుకెళ్లే అవకాశం వాహన యజమానులందరికీ కల్పించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ అధికారులు వాహన యజమానుల అసోసియేషన్లతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఇసుక రవాణా ధరలను ఖరారు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. -
పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు
సాక్షి, మహబూబాబాద్: ఎక్కడ ఏ నేరం జరిగినా నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాల పుటేజీపై ఆధారపడిన పోలీసుల చేతికి ఇప్పుడు మరో ఆయుధం వచ్చింది. ఈ మేరకు సిబ్బంది శరీరాని(చొక్కా)కి అమర్చే కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం బేతోలు శివారులో మంగళవారం బాడీ వార్న్ కెమెరాలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఎక్కడైనా వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినా, వారి నుంచి సిబ్బంది డబ్బు తీసుకున్నా ఈ బాడీ కెమెరాల ద్వారా ఉన్నత అధికారులకు సమాచారం చేరుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌కు వీడియో చిత్రాలు అందించే ఈ ఆధునిక కెమెరాలను ఉపయోగపడుతాయని చెప్పారు. ఏమిటీ కెమెరా.. ఎలా పనిచేస్తుంది? ఇప్పటి వరకు సీసీ కెమెరాలు, పెన్ కెమెరాల పేర్లు మాత్రమే మనం విన్నాం. బాడీ వార్న్ కెమెరాలంటే విధి నిర్వహణలో ఉన్న పోలీసు తన ఒంటికి ఓ ఆధునిక కెమెరాలను పెట్టుకుని ఉంటాడు. బాడీ వార్న్ కెమెరాను ధరించిన పోలీసు నిల్చున్న ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది? ఏ వాహనదారుడు ఏ రూట్లో వెళ్లాలి? అందుకు విరుద్ధంగా ఎక్కడ వెళ్తున్నాడు? అక్రమ పార్కింగ్ ఎక్కడెక్కడ జరుగుతోంది? అన్న పూర్తి వివరాలను వీడియో చిత్రీకరించి, సెంట్రల్ సర్వర్‌కు పంపుతుంది. ఈ ఆడియో, వీడియోలను ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు స్టేషన్, ట్రాఫిక్ కంట్రోల్ రూంకు చేరడంతో సెంట్రల్ సర్వర్‌లో డేటా భద్రంగా ఉంటుంది. మెయిన్ సర్వర్‌లో ఈ డేటాను తొలగించడం ఎవరికి సాధ్యపడదు. అంతేకాకుండా సిబ్బంది ఎక్కడ, ఎలా పనిచేస్తున్నారన్నది కూడా ఉన్నతాధికారులు తెలుసుకోవచ్చు. కేవలం 140 గ్రాముల బరువుతో ఉన్న ఈ కెమెరా ఇంటర్నల్ 8 జీబీ, ఎక్స్టర్నల్ 32 జీబీతో మొత్తం 40 జీబీ సామర్థ్యంతో, ఎనిమిది గంటల బ్యాకప్ బ్యాటరీ, హెచ్డీ క్వాలిటీతో వీడియోను చిత్రీకరించడం బాడీ వార్న్ కెమెరాల ప్రత్యేకతలు. కాగా, బాడీ కెమెరాల ప్రారంభ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీలు రేల జనార్దన్‌రెడ్డి, శశిధర్, టౌన్ సీఐ సుంకరి రవికుమార్, డీసీఆర్బీ సీఐ రమేష్‌కుమార్, ఐటీకోర్ సీఐ బి.రాజయ్య, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు సీహెచ్.అరుణ్‌కుమార్, సిరిసిల్ల అశోక్‌కుమార్, టౌన్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలు లేని చోటనే చోరీలు
సాక్షి, పిట్లం(కామారెడ్డి) : మండల కేంద్రంలోని శాంతినగర్, రాజీవ్‌గాంధీ, బీజే కాలనీల్లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 4 గంటలకే ఇంటింటికీ వెళ్లి వాహనాలను పరిశీలించారు. దీంతోపాటు కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. మూడు కాలనీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని 150 మోటారు సైకిళ్ళు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను ఎస్పీ శ్వేత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి దుకాణదారుడు, ప్రజలు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. తద్వారా చోరీలు జరిగే ఆస్కారం ఉండదన్నారు. ఇటీవలి కాలంలో చోరీలు పెరిగాయని, వాటిలో అధికంగా సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో చోరీలు జరిగినట్లు ఎస్పీ వెల్లడించారు. కొద్ది రోజుల కింద పిట్లం బస్టాండ్ ఎదురుగా ఉన్న బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నామన్నారు. పోలీసులు ఎంత పటిష్టంగా కాపలా ఉన్నా చోరీలు జరుగుతుంటాయని, వీటిని నివారించాలంటే సీసీ కెమెరాలు మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. ఇక వాహనదారులు వాహనం నడిపే సమయంలో బండికి సంబంధించిన అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. దీంతో పాటుగానే ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడితే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. తరువాత స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్ల ధ్రువపత్రాలు పరిశీలించి సరిగ్గా పత్రాలు ఉన్నవాటిని యజమానులకు అప్పగించారు. వాహనాలకు సరైన పత్రాలు లేనివాటికి జరిమాన విధించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ డీఎస్పీ యాదగిరి, బిచ్కుంద సీఐ నవీన్ కుమార్, ఎస్ఐలు సుధాకర్, నవీన్ కుమార్, సాయన్న, అభిలాష్, అశోక్, సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయం ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలని ఎస్పీ శ్వేత తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఉదయం ఎస్పీ శ్వేత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రికార్డ్లను పరిశీలించి స్టేషన్ పరిసరాలను చూసి ఎస్ఐ నవీన్ కుమార్‌తోపాటు సిబ్బందిని అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మిగితా పోలీస్ స్టేషన్లు పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను, సీసీ కెమెరాలు పని తీరును అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ నవీన్ కుమార్, ఏఎస్ఐ మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంట్లోనూ నిఘానేత్రం
- ఒడిశా రాష్ట్రంలో రూ.13.50 లక్షల విలువైన పేపర్ రోల్స్‌తో బయలుదేరిన లారీ బెంగళూరుకు చేరకుండా దారి మళ్లించి 14 చెక్‌పోస్టులు దాటుకెళ్లిపోయినప్పటికీ పట్టుకున్న విజయనగరం వన్‌టౌన్ పోలీసులు అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ అవార్డు)ను అందుకున్నారు. అదేమంటే వారి నేర పరిశోధనలో చెక్‌పోస్టుల వద్ద ఉన్న క్లోజ్డ్ సర్క్యూట్ (సీసీ)కెమెరాలే కీలకంగా ఉపయోగపడ్డాయి. - కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన షేక్ అబ్దుల్ ఖదీర్(26) హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులకు కూడా అవార్డు లభించింది. మిస్టరీగా మారిన ఈ కేసులో కూడా వాట్సాప్ చాటింగ్ కొంత క్లూ ఇస్తే నేర స్థలంలో ఉన్న సీసీ కెమెరాలే నేరస్తులను గుర్తించేలా దోహదపడ్డాయి. సాక్షి, అమరావతి: ఇలా సీసీ కెమెరాల పుటేజ్ పోలీసులకు కీలకంగా మారింది. దీంతో అన్నిప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్, జన సంచారం ఉంటే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానించారు. రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలో 8,148 సీసీ కెమెరాలను నిర్వహిస్తున్నారు. దీనికితోడు రియల్ టైమ్ గవర్నెన్స్(ఆరీ్టజీఎస్) ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామ స్థాయిలోనూ అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 5,200 సీసీ కెమెరాలు ఉండగా మరో 14,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ఈ ఏడాది జూలైలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితోపాటు ప్రతీ ఇంటింటికి నిఘా నేత్రాన్ని విస్తరించేలా రాష్ట్ర పోలీసులు కొత్త ప్రతిపాదనలు చేశారు. తొలుత వీధుల్లో ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని ఇళ్లను కవర్ చేసేలా చూస్తారు. అటు తరువాత ప్రజలను చైతన్యం చేసి ప్రతీ ఇంటిలో వారే సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా దశలవారీ కార్యచరణ చేపట్టనున్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు సీసీ కెమెరాల కొరత.. రాష్ట్రంలో పోలీసు శాఖ వినూత్నంగా చేపట్టిన లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్) ఒక మేరకు ఫలితాలు ఇచ్చింది. దాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేసేందుకు పోలీసు శాఖకు సీసీ కెమెరాల కొరత ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ఇంటి యజమాని కొద్ది రోజులపాటు తన ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతానికి వెళితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలా చేస్తే పోలీసులు స్వయంగా వచ్చి ఆ ఇంట్లో 24 గంటలపాటు నిఘా ఉంచేలా సీసీ కెమెరాలతో కూడిన ఎల్‌హెచ్‌ఎంఎస్ యూనిట్ అమర్చుతారు. తాళం వేసిన ఆ ఇంట్లోకి ఆ తరువాత ఎవరైనా వస్తే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు అలారంతో కూడిన సంకేతాలు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏర్పాటు కోసం 8,12,450 విజ్ఞాపనలు రాగా 3,80,79 విజ్ఞప్తులను పోలీసులు పరిగణలోకి తీసుకున్నప్పటికీ తొలి ప్రయత్నంగా 24,473 ఇళ్లలో మాత్రమే వీటిని అమర్చారు. ఇది మంచి ఫలితాలు ఇచి్చంది. ప్రతి ఇంటికి సీసీ కెమెరా..డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసులు గతంలో నేర స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలకోసం వెదికేవారు. ఇప్పుడు నేరస్థలంలో మొదట సీసీ కెమెరా పుటేజీ కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధాన ప్రాంతాలు, జన సంచారం ఉండే చోట సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్లలో దొంగతనాలను అరికట్టేందుకు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను పోలీసు శాఖ వినియోగంలోకి తెచ్చింది. ప్రతీ ఇంటికి వారే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేల ప్రజలను చైతన్యం చేస్తాం. నేరస్తుడు సీసీ కెమెరా ఉన్న ఇంటికి వెళ్లాలంటే దొరికిపోతాం అనే భయపడే పరిస్థితి రావాలి. దీని వల్ల నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు కంటే నేరాలు జరగకుండా అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. -
శుభమస్తు షాపింగ్ మాల్లో భారీ చోరీ
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నగరంలో వీఆర్సీ సెంటర్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. దుండగుడు నాలుగో అంతస్తులోని యజమాని కార్యాలయంలో ఉన్న లాకర్‌ను పగులగొట్టి రూ.16 లక్షల నగదును అపహరించుకుని వెళ్లాడు. శుక్రవారం ఉదయం మాల్ తెరిచిన సిబ్బంది నాలుగో అంతస్తులో సీసీ కెమెరాలు పగులగొట్టి ఉండటం, యజమాని కార్యాలయంలో లాకర్ తెరచి ఉండడం, బాత్రూమ్లో ఎగ్జాస్ట్ ఫ్యానును తొలగించి కిందపడవేసి ఉండటాన్ని గమనించి యజమాని వాసుకు సమాచారమిచ్చారు. యజమాని చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ జే.శ్రీనివాసులరెడ్డి, ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా చోరీ జరిగిన తీరు, నిందితుడి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. దాని ఆధారంగా నిందితుడు అదే మాల్లో పనిచేసే మణిగా గుర్తించారు. గురువారం రాత్రి మాల్ మూసివేసే సమయానికి దుండగుడు లోపలికి ప్రవేశించి చోరీ చేసి బాత్రూమ్లో దాక్కున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బాత్రూమ్లో నుంచి బయటకు వచ్చి వెళ్లాడు. పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. చోరీ చేసిన సొత్తును స్వా«దీనం చేసుకున్నారు. -
కారు డోర్‌లాక్ పడి.. ఊపిరాడక
నిజామాబాద్ అర్బన్: కారులో కూర్చుని సరదాగా ఆడుకుందామని అనుకున్నారు ఆ చిన్నారులు., కానీ ఆ కారే తమ పాలిట మృత్యుపాశం అవుతుందని గ్రహించుకోలేకపోయారు. ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులో ఎక్కిన ఇద్దరు చిన్నారులు కార్ డోర్ లాక్ అయి.. ఊపిరాడక మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ముజాహిద్నగర్లో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన సయ్యద్ రియాజ్ (10) మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఇతనికి మహమ్మద్ బద్రుద్దీన్ (5) జత కలిశాడు. ఇద్దరు సమీపంలో ఉన్న పార్కులో కలసి కాసేపు ఆడుకున్నారు. ఈ క్రమంలో అక్కడే పార్క్ చేసి ఉన్న ఓ కారులోకి సరదా కోసం ఎక్కారు. అయితే వెంటనే కారు డోర్‌లాక్ కావడంతో ఇద్దరు అందులోనే ఉండిపోయారు. కాసేపటికి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు కారులోనే మృత్యువాత పడ్డారు. సాయంత్రం 6 గంటలు అవుతున్నా చిన్నారులు ఇద్దరూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలోని అన్ని చోట్లా వారికోసం వెతికారు. అయినా వారి జాడ దొరకలేదు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కారు యజమాని అబ్దుల్ రహమాన్, తన కారును తెరిచి చూడగా వెనుక సీట్లో ఇద్దరు బాలుర మృతదేహాలు కనిపించాయి. వెంటనే రియాజ్ తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆడుకునేందుకు వెళ్లిన తమ పిల్లలు విగత జీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఘటనాస్థలానికి చేరుకున్న ఒకటో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించగా బాలురు ఆడుకుంటూ కారులోకి వెళ్లినట్లు తేలింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చనిపోయిన ఇద్దరు పిల్లలు అక్కా చెల్లెళ్ల కొడుకులు. తన కలల రూపం కళ్ల ముందే మృత్యువాత పడటంతో ఆ రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. -
‘కళ్లు’గప్పలేరు!
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం జనవరి 30... బొటానికల్ గార్డెన్స్ సమీపంలో ప్లాస్టిక్ సంచుల్లో గుర్తు తెలి యని మహిళ శరీర భాగాలు దొరికాయి. అత్యంత కిరాతకంగా ఆ హత్య జరిగింది. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక కుండా హంతకులు జాగ్రత్త పడ్డారు. అయినా పది రోజుల్లోనే చిక్కారు. వీరిని పట్టించడంలో కీలక పాత్ర పోషించింది సీసీ కెమెరాలే. ఇలా.. రాజధానిలో ఏటా ఎన్నో కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ‘మూడో కన్ను’ కీలకపాత్ర పోషిస్తోంది. ‘ఒక్క కెమెరా 10 మంది పోలీసులతో సమానం’ అనే నినాదంతో పోలీసు విభాగం ముందుకు వెళ్తోంది. ఢిల్లీ, ముంబై, సూరత్‌కు దీటుగా నగరంలో ఇవి ఏర్పాటవుతున్నాయి. అవసరమైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు ప్రత్యేక అనలెటిక్స్ సైతం జోడించడానికి పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది. నగరంలో ఏర్పాటు చేసిన కెమెరాలు అన్నింటినీ కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు అనుసంధానం చేయడం ప్రారంభించారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. నగరంలో మొత్తం 10లక్షల కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకెళ్తోంది. -
ప్రేమ జంటలను ఉపేక్షించేది లేదు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: బహిరంగ నేరాలను పోలీసులు అడ్డుకుంటారు. మరి వివాహేతర సంబంధాల నేపథ్యంలో చాటుమాటు ఘాతుకాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రికార్డుల ఆధారంగా గడిచిన పదేళ్లలో తమిళనాడులోని 1,459 హత్యలు వివాహేతర సంబంధాల వల్లనే జరిగినట్లు స్పష్టమైంది. సేలం జిల్లాకు చెందిన ఒక గృహిణి కనిపించకుండాపోయిన తన 19 ఏళ్ల తన కుమార్తెను కోర్టులో ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ అడ్కొనర్వు పిటిషన్‌ను ఇటీవల దాఖలు చేసింది. పెళ్లయి, పిల్లలు కలిగిన తన మేనమామ లోకనాథన్తోనే ఆమె కుమార్తె వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే యువతిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. సినీ నటీమణులు కనిపించకుండా పోతే నే గాలింపు చేస్తారా, సాధారణ యువతులను పట్టించుకోరా అని న్యాయమూర్తులు పోలీసులకు ప్రశ్నించారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచా రణకు వచ్చింది. కోర్టు ఆదేశాలతో చెన్నై లా అండ్ ఆర్డర్ ఐజీ ఒక పిటిషన్ దాఖలు చేశారు. గత పదేళ్లలో చెన్నైలో వివాహేతర సంబంధాల వల్ల 1,459 హత్యలు జరిగాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పదేళ్లు అంటే 3,650 రోజులు. 3,650 రోజుల్లో 1,459 హత్యలు అంటే రెండురోజులకో హత్య జరిగిందన్నమాట. ఈ హత్యలన్నీ వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన వే కారణం గమనార్హం. యువత పెడదారి పట్టడానికి ఇంట ర్నెట్, సెల్ఫోన్లలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అశ్లీల వెబ్సైట్లే ప్రధాన కారణమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ ఖుద్దూస్ అవేదన వ్యక్తం చేశారు. ఐజీ కోర్టుకు సమర్పించిన వివరాలను పరిశీలించి కంగుతిన్న న్యాయమూర్తులు.. సమాజంలో పె చ్చుమీరిపోయిన వివాహేతర సంబంధాల సం స్కృతికి మూలకారణం అరచేతిలో (సెల్ఫోన్లు) అశ్లీల వెబ్సైట్లు అందుబాటులోకి రావడమేనని వ్యాఖ్యానించారు. కొన్ని సినిమాలు సైతం యువతను పెడదారి పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. రైల్వేస్టేష్టన్లలో ‘మూడో కన్ను’ ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకే రైల్వేస్టేషన్లకు చేరుకునే జంటలను ఉపేక్షించేది లేదని పోలీస్‌శాఖ హెచ్చరించింది. 136 రైల్వేస్టేషన్లలో ‘మూడో కన్ను’ ఏర్పాటుతో ప్రేమజంటలపై నిఘా పెడుతున్నామని పేర్కొంది. చెన్నై నగరం, శివార్లలోని పలు ప్రాంతాలను కలుపుతూ పయనించే లోకల్ రైళ్లలో రోజుకు 8 లక్షల మందికి పైగా ప్రయాణిస్తుంటారు. చెన్నై నగరంలోని మాంబళం, తాంబరం తదితర పలులోకల్ స్టేషన్లలో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆగుతాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం వేరే రైల్వే ట్రాక్ కూడా ఉంది. రైలు ప్రయాణికుల వసతి కోసం అనేక కుర్చీలను ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఈ కుర్చీల్లో ప్రయాణికుల కంటే ప్రేమ జంటలే ఆక్రమించుకుని ఉంటారు. గంటల తరబడి ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఇదే కోవలో చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో 2016లో స్వాతి అనే ఐటీ ఉద్యోగిని ఒక యువకుడు ముచ్చట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆగ్రహం చెందిన యువకుడు వేటకొడవలితో స్వాతిపై దాడిచేసి దారుణహత్య చేశాడు. అలాగే ఈరోడ్‌కు చెందిన తేన్మొళి అనే ప్రభుత్వ ఉద్యోగినిపై చెన్నై చెట్పట్ రైల్వేస్టేష్టన్‌లో పదిరోజుల క్రితం హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు ఈనెల 21వ తేదీన ప్రాణాలు విడిచాడు. చెన్నై లోకల్ రైల్వేస్టేషన్లలో ప్రేమజంటలు గంటల కొద్దీ బాతాఖాని కొట్టే దృశ్యాలను చూస్తున్న నగరవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకే రైల్వేస్టేషన్‌కు వచ్చే జంటలపై చర్యలు చేపడతామని పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రేమ జంటలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు నిఘాపెట్టి ఎక్కువ సేపు కూర్చుని ఉంటే రైల్లో ఎక్కించడమో లేక స్టేషన్ నుంచి వెళ్లగొట్టడమో చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన విద్యార్థులు, ఉద్యోగుల గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకుని కమిషనర్ కార్యాలయంలో అప్పగించాలని, సదరు విద్యాసంస్థలకు, కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలని కింది స్థాయి పోలీసులకు ఆదేశాలందాయి. స్వాతి హత్య జరిగిన నుంగంబాక్కం రైల్వేస్టేషన్ సహా 82 స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే చెన్నై చేట్‌పట్‌లో చోటుచేసుకున్న తాజా హత్యాయత్నం తరువాత ప్రేమజంటల కదలికలపై నిఘా పెట్టేందుకు మరో 136 రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. -
నిఘా ‘గుడ్డి’దేనా!
పటాన్‌చెరుటౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి ఆర్ఆర్ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పటాన్చెరు, అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం మొత్తం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. రికార్డు కాని డేటా.. మొత్తం హార్డ్‌డిస్క్ 931.51 జీబీ ఉండగా మొత్తం 931.51జీబీ ఫుల్ కావడంతో ఫ్రీ స్పేస్ లేదని డిస్ప్లేలో చూయిస్తుంది. ఈ విషయాని గమనించిన అధికారులు గత శుక్రవారం సీసీ కెమెరాల స్టోరేజీ పెంచాలనీ నిర్వాహకులకు సూచించారు. అయితే వారు స్టోరేజీ పెంచకుండా అలాగే వదిలి వేశారు. దీంతో డేటా రికార్డు కాకుండా సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్లుగా ఉంది. ఇదే హార్డ్‌డిస్క్ స్టోరేజీ విషయంపై అధికారుల వివరణ కోరగా ఇప్పటికే ఈ విషయాని నిర్వహకులకు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు వారు బాగుచేయలేదని చెబుతున్నారు. -
నిద్రపోతున్న నిఘా నేత్రం
నిజామాబాద్ నాగారం : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లో నిఘా నేత్రం నిద్రపోతోంది. పేరుకే సీసీ కెమెరాలు పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఏ రోజు కూడా అవి పనిచేసిన దాఖలాలు లేవు. మరోవైపు బస్టాండ్‌లో దొంగలు రాజ్యమేలుతున్నారు. బస్టాండ్‌లో పోలీస్ బూత్ ఉన్నా అక్కడ పోలీసులే కనిపించారు. ఈ బస్టాండ్ ద్వారా ప్రతిరోజు సుమారు 80 వేల నుంచి లక్ష వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. బస్టాండ్‌లో సుమారు 60 పైగా దుకాణాల సముదాయాలు ఉన్నాయి. బస్టాండ్‌లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కొన్ని నెలల క్రితం బస్టాండ్‌లో సుమారు ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు మాత్రమే ఇవి పనిచేశాయి. ఆ తర్వాత మానేశాయి. సీసీ కెమెరాలను మానిటరింగ్ చేసే కంప్యూటర్ సిస్టం సక్రమంగా పని చేయడం లేదు. బస్టాండ్‌లో ఒక పక్క చోరీలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడన్నట్లు వ్యవహరిస్తున్నారని వివర్శలు వస్తున్నాయి. బస్టాండ్‌లోనే కాకుండా ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలోనూ పర్సులు, డబ్బులు, బంగారం చైన్లను దొంగలు కొట్టేస్తున్నారు. రూ. వేలు విలువ చేసే స్మార్ట్ఫోన్లను సైతం మాయం చేస్తున్నారు.బాధిత ప్రయాణికులు లబోదిబో మంటూ బస్టాండ్‌లో õఉన్న పోలీస్‌బూత్ దగ్గరకు వెళ్తే అక్కడ ఎవరూ ఉండటం లేదు. దీంతో బస్‌స్టేషన్‌మాష్టార్ కార్యాలయంలోకి వెళ్తే తమకేమీ తెలియని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని ఉచిత సలహా ఇస్తున్నారు. రక్షణ లేకుండా పోయింది బస్టాండ్‌లో వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు ప్రయాణికుల భద్రత పట్ల కనీస చర్యలు తీసుకోవడం లేదు. బస్టాండ్‌లో చాలా మంది ప్రయాణికులు చోరీలకు గురవుతూనే ఉన్నారు. మా బంధువులు సైతం బస్టాండ్‌లో ఉండగానే చోరీకి గురయ్యారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. –భోజన్న, ప్రయాణికుడు సెల్‌ఫోన్, పర్సుపోయింది మా స్నేహితులతో కలిసి బస్సుఎక్కుతున్న సమయంలో పర్సు, విలువైన సెల్‌ఫోన్ చోరీకీ గురైంది. ఈ విషయంలో సంబంధిత స్టేషన్ మాష్టార్‌కు చెబితే వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని సలహా ఇచ్చారు. సీసీ కెమెరాలు పనిస్తే చాలా వరకు దొంగతనాలను అరికట్టవచ్చు. –కిషోర్, ప్రయాణికుడు -
హజీపూర్ ఘటనతో సీసీటీవీ ఆవశ్యకత..
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హజీపూర్ ఘటనతో సీసీ కెమెరాల ఆవశ్యకత మరోసారి తెరపైకి వచ్చింది. బొమ్మలరామారం నుంచి హజీపూర్కు వెళ్లాల్సిన విద్యార్థిని శ్రావణిని అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, దారుణం హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బొమ్మలరామారం బస్‌స్టాప్ వద్ద సీసీటీవీ కెమెరాలున్నా పనిచేయకపోవడంతోనే శ్రీనివాసరెడ్డి ఘాతుకాన్ని గుర్తించడంలో ఆలస్యం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని యాదాద్రి, భువనగిరి డివిజన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినా స్థానిక అధికారులు వాటిని నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి అటకెక్కాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ప్రతి మండలం, గ్రామ పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడమేగాక వాటిని ఆయా పోలీసు స్టేషన్లకు అనుసంధానించేందుకు సన్నాహాలు చేపట్టారు. ‘మహా’ కమిషనరేట్‌లో నిరంతర నిఘా... 5091.48 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్‌గా గుర్తింపు పొందిన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, యాదాద్రి లా అండ్ అర్డర్ జోన్లు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మిళితమైన ఈ కమిషనరేట్‌లో నేరాలను నియంత్రించేందుకు సీసీటీవీల అవసరాన్ని గుర్తించిన సీపీ అందుకు అనుగుణంగా ఆయా జోన్లలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, నేను సైతం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించే బాధ్యతను ఆయా జోన్ల డీసీపీలకు అప్పగించారు. తద్వారా చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పాటు సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులను పట్టుకోవడమేగాక, వారికి శిక్ష విధించడంలోనూ పోలీసులు సఫలీకృతులయ్యారు. యాదాద్రిపై ప్రత్యేక దృష్టి... యాదాద్రి ఆలయంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు జరుగుతుండటంతో సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే భువనగిరి, యాదాద్రి, చౌటుప్పల్ డివిజన్లలో 941, 812, 1942 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. మొత్తంగా యాదాద్రి జోన్లో 4773 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే హజీపూర్ ఘటనతో వీటిలో చాలావరకు సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెలుగులోకి రావడంతో సీపీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయా పోలీసుస్టేషన్ల అధికారులు సీసీటీవీ కెమెరాల మరమ్మతులు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో వాటిని ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో కలిగే లాభాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. అలాగే మల్కాజ్గిరి జోన్లో 38,208 ఎల్బీనగర్ జోన్లో 34,779 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే హజీపూర్ ఘటనతో ఒక్కసారిగా మేల్కొన్న పోలీసు అధికారులు ఇప్పటికే బిగించిన సీసీటీవీ కెమెరాల పనితీరుతో పాటు కొత్త సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించారు. మూడు జోన్లలో కలిపి 77,760 సీసీటీవీ కెమెరాలుండగా వీటి సంఖ్యను రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ ఒక్క సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఈ నిఘానేత్రాలు ఏర్పాటు చేయడం వల్ల సంచలనాత్మక కేసులు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, హత్యలు తదితర నేరాల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి. అయితే హజీపూర్ ఘటనతో యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఉన్న సీసీటీవీ కెమెరాల పనితీరుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం.–మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ -
ఒక కెమెరాను దొంగిలిస్తే. మరో కెమెరా పట్టించింది
అతడో ఆటో డ్రైవర్. తన ఆటోను తీసుకెళ్లి ఎంచక్కా ఓ సీసీ కెమెరా కింద ఆపాడు. అటూఇటూ చూసి ఎవరూ తనని చూడకపోవడంతో చకచకా ఆటోపైకి ఎక్కేశాడు. చటుక్కున సీసీ కెమెరా తీగలు కత్తిరించి దాన్ని పట్టుకుని ఉడాయించాడు. అనంతరం దాన్ని ముక్కలు చేసి పాత ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మేశాడు. ఇక బస్తీలో తాను చేసే చిల్లర పనులు ఏ కెమెరా రికార్డు చేయలేదులే అన్న ధైర్యంతో బస్తీకి వచ్చేశాడు. ఇంతలోనే పోలీసులు వచ్చి అతగాడిని పట్టుకొని పక్కనే ఉన్న మరో కెమెరాలో ఈయనగారు చేసిన చోరకళను చూపించి బిత్తరపోయేలా చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. వనపర్తికి చెందిన శాంతానాయక్(40) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్ నం.52లోని నందగిరిహిల్స్‌ను ఆనుకొని ఉన్న గురుబ్రహ్మనగర్‌లో గుడిసె వేసుకొని బతుకుతూ ఆటో నడుపుతున్నాడు. అతడు మద్యం సేవించడం, పేకాడటం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృశ్యాలు నందగిరిహిల్స్‌లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీల్లో కనిపించడంతో పలుమార్లు పోలీసులు హెచ్చరించారు. అయితే ఈ సీసీ కెమెరా తన కార్యకలాపాలకు అడ్డుగా ఉందనే కారణంగా ఏకంగా సీసీ కెమెరానే దొంగిలించి అమ్మేశాడు. అయితే అతడు ఈ కెమెరాను దొంగిలిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఇంకో కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ విషయం తెలియని శాంతానాయక్ తాను దొంగతనం చేయలేదని బుకాయించగా పోలీసులు ఆ ఫుటేజీలను కళ్ల ముందుంచారు. దీంతో తప్పు ఒప్పుకోక తప్పలేదు. సీసీ కెమెరా దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు కావడం నగరంలో ఇదే మొదటిసారి. –హైదరాబాద్ -
కిలాడీ బామ్మ
గుంటూరు, తెనాలిరూరల్: ఆ బామ్మ వయసు 71 ఏళ్లు. ఆలయంలో ఉంటే అందరూ హరే రామ హరే కృష్ణ అంటూ భజనలు చేస్తుందనుకుంటారు. జాగ్రత్త దొంగలుంటారు అని హెచ్చరిస్తుంటే ఎంతటి పెద్దరికమని ముచ్చట పడతారు. అలా అని ఆ బామ్మను దగ్గరకు రానిచ్చారో.. ఒంటి మీద నగలుపోయి ఘొల్లుమంటారు. వామ్మో బామ్మ.. అంటూ గగ్గోలు పెడతారు.. ఇలా ప్రజలను బురిడీ కొట్టించి నగలు కొట్టేస్తున్న కిలాడీ బామ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధ మహిళలే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఆమె నుంచి రూ. 2.10 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీన పరుచుకున్నారు. తెనాలి టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఆర్ఎస్ కిషోర్‌కుమార్ ఈ కిలాడి బామ్మగురించి వివరించారు. సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీకి చెందిన జవంగుల సరోజిని(71) తెనాలిలో నివసిస్తున్న తన కొడుకు వద్దకు వచ్చి పోతుండేది. మార్చిలో వచ్చిన ఆమెకు అదే నెల 13వ తేదీన పట్టణ నందులపేటలోని వినాయకుడి గుడి ధ్వజ స్తంభ ప్రతిష్ట జరుగుతుందని తెలిసింది. 13వ తేదీ ఉదయం గుడికి వెళ్లి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొంది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వీరిలో వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. రద్దీగా ఉండడంతో ‘చోరులతో జాగ్రత్తగా ఉండాల’ంటూ మహిళలతో మాటలు కలిపింది. చీర కొంగులు కప్పుకోవాలంటూ తానే స్వయంగా కప్పింది. ఈ క్రమంలో పట్టణ మోదుకూరి వారి వీధికి చెందిన కొత్తపల్లి అన్నపూర్ణ(65), నందులపేటకే చెందిన పొందూరి సుగుణకుమారి(63)ల మెడలలోని బంగారు నానుతాడులను అపహరించింది. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కెమెరాల్లో కనపడకుండా నేరాలు.. సరోజిని నేరాలకు పాల్పడిన తీరు గురించి తెలుసుక్ను పోలీసులు నివ్వెరపోయారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నా, వాటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ గొలుసులు అపహరించింది. బాధితులు ఫిర్యాదుతో ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులకు ఎవరూ ఫుటేజ్లలో కనబడలేదు. సీసీ కెమెరాలను గుర్తించి, వాటిలో పడకుండా జాగత్తపడింది. ఎటువంటి ఆధారం లేకుండా పోయిందనుకుని పోలీసుల దర్యాప్తు వేగం తగ్గించారు. అంతలోనే, ధ్వజ స్తంభ మహోత్సవాన్ని స్థానికులు సెల్ఫోన్లు, కెమెరాలతో వీడియో తీశారని తెలుసుకున్నారు. వాటిని తెప్పించి పరిశీలించి నిందితురాలిగా అనుమానం ఉన్న వృద్ధురాలి ఫోటో తీయించగలిగారు. ఈమెపైనే బాధితులూ అనుమానం వ్యక్తం చేశారు. ఇక నిందితురాలు ఈమేనని నిర్ధారించుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. తెనాలి రజకచెరువు వద్ద శనివారం ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకుందని, ఆమె వద్ద నుంచి మొత్తం 72 గ్రాముల రెండు బంగారు నానుతాడులను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. నిందితురాలు గతంలో విజయవాడలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్టు తెలిసింది. సమావేశంలో ఎస్ఐ గన్నవరపు అంజయ్య, సిబ్బంది ఉన్నారు. -
నిఘా కెమెరాలను వితరణ చేసిన జీవీ
పెరంబూరు: యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ గురువారం పొల్లాచ్చి ప్రాంతానికి 50 సీసీ కెమెరాలను వితరణ చేశారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈయన నటించిన కుప్పత్తురాజా గతవారం తెరపైకి వచ్చింది. ఈ శుక్రవారం జీవీ నటించిన వాచ్మెన్ తెరపైకి వచ్చింది. త్వరలో 100 శాతం లవ్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా విజయ్ దర్శకత్వం వహించిన వాచ్‌మన్ చిత్రాన్ని గురువారం నగరంలోని 300 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించారు. పూర్తి వినోదభరితంగా సాగే ఈ చిత్రాన్ని విద్యార్థులు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ చూశారని ఆ చిత్ర కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సాలిగ్రామంలోని బాలలోక్ పాఠశాలలోని విద్యార్థులను కలిసి వారితో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాచ్మెన్ చిత్ర ఆడియా ఆవిష్కరణ సమావేశంలో పొల్లాచ్చి గ్రామానికి 50 సీసీ కెమెరాలను అందిస్తానని ప్రకటించానని, ఆ విధంగా 50 సీసీ కెమెరాలను ఆ గ్రామానికి అందించినట్లు తెలిపారు. ఇటీవల పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార సంఘటన ఆవేదనను కలిగించిందన్నారు. మానసిక రోగులే అలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారని అన్నారు. విద్యార్థులు అవగాహనతో మెలగాలని, తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్త వహించాలని జీవీ పేర్కొన్నారు. అదే విధంగా విదేశాల్లో లైంగిక అవగాహన గురించిన పాఠ్యాంశాలను పాఠశాలల్లో ప్రవేశ పెడుతున్నారని, అలాంటి అవగాహనతో కూడిన పాఠ్యాంశాలు మన దేశంలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని జీవీ.ప్రకాశ్‌కుమార్ వ్యక్తం చేశారు. -
సీసీ కెమెరాల అపహరణ
సాక్షి, వీరఘట్టం: ఇప్పటికే అత్యంత సమస్యాత్మక పరీక్షా కేంద్రంగా గుర్తింపు పొందిన వీరఘట్టం పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి. బాలికోన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు.శనివారం ఈ విషయాన్ని గుర్తించిన ఇక్కడ పరీక్షల చీఫ్ అధికారి బి.సొంబర జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ పి.ఇందిరామణి, ఏఎస్ఐ రమణబాబులు వచ్చి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. వాస్తవానికి శుక్రవారం జరిగిన సోషల్ పేపర్–1కు సీసీ కెమెరాలు ఉన్నాయని, శనివారం ఉదయం పరీక్ష గదులు తెలిచి ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా నాలుగు గదుల్లో సీసీ కెమెరాలు కనబడలేదని వాటిని అమర్చిన వైర్లు కట్ చేసి ఉన్నాయని చీఫ్ అధికారి బి.సొంబర తెలిపారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జిల్లాలోని సమస్యాత్మక కేంద్రాల్లో వీరఘట్టం బాలురు, బాలికోన్నత పాఠశాల పదో తరగతి పరీక్షాలు కేంద్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు బాలికోన్నత పాఠశాల పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలు దొంగిలించడంపై జిల్లా విద్యాశాఖ మండిపడుతోంది. ఇక నుంచి ఇక్కడ పరీక్షలను పకడబ్బందీగా నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సాయిరాం స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో భవిష్యత్‌లో ఈ కేంద్రాలను ప్రభుత్వం ఎత్తివేయవచ్చునని అభిప్రాయ పడ్డారు. తల్లిదండ్రుల ఆందోళన వీరఘట్టం పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే విద్యార్థుల కంటే ఆకతాయి కుర్రాళ్లే ఎక్కువ మంది పరీక్షా కేంద్రం పరిసరాల్లో తిరుగుతున్నారని, వారిలో ఎవరో చేసిన పనేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు తమ విద్యార్థులు బలైపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. -
ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నం
సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకులో బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. బెల్లంపల్లి ఏసీపీ వి.బాలుజాదవ్ వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 2:05 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి టీషర్టు, ప్యాంటు ధరించి ముఖం కనబడకుండా వస్త్రం కట్టుకుని బ్యాంకు ప్రధాన ద్వారం వద్దకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న గడ్డపారతో తాళాన్ని పగులగొట్టి షెటర్‌ను పైకి లేపి లోనికి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన అగంతకుడు నేరుగా డబ్బు భద్రపర్చి ఉన్న లాకర్ల వద్దకు వెళ్లి పగులగొట్టేందుకు యత్నించాడు. గడ్డపారతో లాకర్‌ను తెరవడానికి శతవిధాల ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే ప్రధాన ద్వారం పక్కనే ఉన్న ఏటీఎం గది వద్దకు వచ్చాడు. ఏటీఎం గదిని ధ్వంసం చేసి లోనికి వెళ్లడానికి యత్నించే క్రమంలో సైరన్ మోగింది. ఆన్లైన్ సెక్యూరిటీ ఫోన్ ముంబై నుంచి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రాములు, ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీసు సిబ్బంది, ఆంధ్రా బ్యాంకు మేనేజర్ ప్రసాద్‌కు ఏకకాలంలో వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎస్‌హెచ్‌వో సిబ్బందితో హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆ లోపే అగంతకుడు పరారయ్యాడు. ఫింగర్ ప్రింట్స్ సేకరణ.. ఆన్లైన్ సెక్యూరిటీ ఫోన్ అలర్ట్ చేయడంతో ఎస్‌హెచ్‌వోతో పాటు బ్యాంకు మేనేజర్ ప్రసాద్ ఏకకాలంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు లోనికి వెళ్లి ఏం జరిగిందో పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు లాకర్లను తెరవడానికి గడ్డపారతో చేసిన తవ్వకాలు, ధ్వంసం చేసిన పరికరాలను పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించారు. తెల్లవారుజామున జాగిలాన్ని రప్పించి వ్యక్తి ఆచూకీ కోసం యత్నించారు. జాగిలం బ్యాంకు పక్కనే ఓ వీధి వరకు వెళ్లి వెనక్కివచ్చింది. అగంతకుడు ఆ వీధిలోంచి పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలన.. చోరీ జరిగిన తర్వాత పోలీసులు నేరుగా బ్యాంకులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అగంతకుడు ఎక్కడి నుంచి బ్యాంకులోకి ప్రవేశించాడు, డబ్బుకోసం యత్నించిన తీరును ఎస్‌హెచ్‌వోతో పాటు ఏసీపీ బాలుజాదవ్ సీసీ కెమెరాల్లో చూశారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. లావుగా ఉన్న ఆ వ్యక్తి ఒక్కడే బ్యాంకులోకి వచ్చినట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. కాని బయట ఇంకెవరైనా ఉన్నారా లేదా ఒక్కడే ఈ సాహసానికి ఒడిగట్టాడా అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో.. బ్యాంకుల వద్ద గతంలో రాత్రిపూట సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహించేవాడు. కాని కొన్నాళ్ల క్రితం నుంచి రాత్రిపూట సెక్యూరిటీ గార్డును తొలగించారు. దీంతో అగంతకుడు రాత్రిపూట చోరీకి యత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పట్టణంలో రాత్రిపూట పోలీసు గస్తీ ఉన్నా అగంతకుడు బ్యాంకు చోరీకి యత్నించి పోలీసులకు సవాల్ విసిరినంత పనిచేశాడు. బ్యాంకుల వద్ద పాయింట్ బుక్ పెడతాం.. బ్యాంకుల వద్ద భద్రత ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డు ఉంటే అగంతకుడు చోరీకి యత్నించేవాడు కాదన్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి సెక్యూరిటీ గార్డును నియమించేలా చూస్తామన్నారు. పెట్రోలింగ్ పోలీసులు రాత్రిపూట బ్యాంకును విధిగా తనిఖీ చేయడానికి పాయింట్ బుక్ పెడతామని వెల్లడించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. -
సీసీ కెమెరాకు చిక్కిన చిరుత
కడ్తాల్(కల్వకుర్తి): కొన్ని రోజులుగా రైతులను భయాందోళనకు గురిచేస్తున్న చిరుతపులి మళ్లీ సీసీ కెమెరాకు చిక్కింది. కొన్నిరోజులుగా యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల్లోని గానుగుమార్ల తండా, గోవిందాయిపల్లి, ముద్విన్, తాటిపర్తి, కుర్మిద్ద, కొత్తపల్లి, చరికొండ రిజర్వ్ ఫారెస్ట్ జోన్లో చిరుత సంచరిస్తూ పొలాల్లో కట్టేసిన లేగదూడలు, పశువులపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం తెల్లవారుజామున కడ్తాల్ మండలం గానుగుమార్ల తండాలో, చరికొండ గ్రామాల్లోని పశువుల పాకలపై దాడి చేసిన చిరుత రెండు చోట్ల లేగ దూడలను చంపేసింది. ఈ ఘటనపై రైతులు కందుకూరు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వివరాలు సేకరించారు. చిరుత అడుగుజాడలను గుర్తించిన అధికారులు గోవిందాయిపల్లి, చరికొండ, కొత్తపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఆరుచోట్ల బోనులతోపాటు సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం సెన్సార్ కెమెరాలను పరిశీలించిన అధికారులకు చరికొండ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు చిక్కాయి. శనివారం తెల్లవారుజామున దూడపై దాడిచేసిన దృశ్యాలు, దూడ కళేబరాన్ని గుట్టల్లోకి లాక్కెళ్లి తింటున్న దృశ్యాలు అందులో నమోదయ్యాయి. చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఆయా ప్రదేశాల్లో బోనులు ఏర్పాటు చేసినా వాటిలోకి వెళ్లకుండా చిరుత తప్పించుకొని తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కడ్తాల్, యాచారం, కందుకూరు మండలాల్లో సంచరిస్తున్న చిరుత ఒక్కటేనా..లేక అంతకంటే ఎక్కువ ఉన్నాయేమోనని అధికారులు, రైతుల్లో సందిగ్ధం నెలకొంది. ఆందోళన వద్దు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు. చిరుతను బంధించేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి నిపుణులను రప్పించాం. గోవిందాయిపల్లి, చరికొండ, కొత్తపల్లి తదితర గ్రామాల సమీపంలో 6 చోట్ల బోనులు ఏర్పాటు చేశాం. రెండు, మూడ్రోజుల్లో ప్రత్యేకంగా జూపార్కు నుంచి మరో రెండు పెద్దబోనులను తెప్పిస్తాం. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. – సత్యనారాయణ, ఫారెస్ట్ రేంజర్, కందుకూరు -
పక్కాగా ఈవీఎం ర్యాండమైజేషన్
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : ఈవీఎంల ర్యాండమైజేషన్ల ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నోడల్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మొదటి విడత ర్యాండమైజేషన్ ఈనెల 15 నుంచి 18వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించిన ఏర్పాట్లను 20 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 17వ తేదీన మొదటి విడత పీఓ, ఏపీఓ, ఓపీఓలకు శిక్షణ ఉంటుందన్నారు. మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఆ రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ, ఏప్రిల్ 11న పోలింగ్ ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయాలి.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నూతనంగా బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుం దని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో, మూడు లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్లు వేసే ఒక రోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతా ను తెరవాలన్నారు. పోలింగ్ సిబ్బంది 16న శిక్షణ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఈనెల 16న శిక్షణ ఉంటుందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో శిక్షణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం సిబ్బం దికి పీలేరులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో, మదనపల్లె వారికి బీటీ కళాశాల, పుంగనూరు వారికి గోకుల్ థియేటర్, చంద్రగిరి వారికి తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా ఆడిటోరియం, తిరుపతి వారికి శ్రీనివాస ఆడిటోరియం (ఎస్వీయూ)లో, శ్రీకాళహస్తి వారికి స్కిట్ కళాశాల, సత్యవేడు వారికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నగరి వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జీడీనెల్లూరు వారికి జిల్లాపరిషత్ హైస్కూల్, చిత్తూరు వారికి నాగయ్య కళాక్షేత్రం, పూతలపట్టు వారికి ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, పలమనేరు వారికి పీఆర్ కన్వెక్షన్ హాలు, కుప్పం వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఉంటుం దని తెలిపారు. ఈఆర్వో కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు జిల్లాలోని ఈఆర్వో కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈఆర్వో కార్యాలయాల్లో, 26 సరిహద్దు చెక్‌పోస్టులు, కలెక్టరేట్లో కలెక్టర్, జేసీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్, సీ విజిల్ యాప్ ఫిర్యాదుల పరిష్కార విభాగం, మీడియా సెంటర్, ఎంసీఎంసీ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న బుధవారం ఆకస్మికంగా తని ఖీలు నిర్వహించారు. అభ్యర్థుల ప్రచారాలను పరి శీలించేందుకు జెడ్పీ సిబ్బంది 20 మందిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో గంగాధరగౌడ్, నోడల్ అధికారులు లక్ష్మి, శ్రీనివాస్, పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు. -
అతివకు అండ..
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, షీటీమ్స్, సీసీకెమెరాలు వంటివాటితో మంచి ఫలితాలతోపాటు ప్రజల అభిమానాన్ని చూరగొన్న పోలీసు శాఖ అతివకు అండగా మరో కార్యక్రమం చేపట్టింది. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, మానవ అక్రమరవాణా వంటి కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐజీపీ స్వాతి లక్రా నేతృత్వంలో ‘వుమెన్ సేఫ్టీ వింగ్’ను ఏర్పాటు చేసింది. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా లక్డీకాపూల్‌లోని ఈ విభాగం కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.కవిత, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొంటారు. షీటీమ్స్ పోలీసులు, భరోసా కేంద్రాలు (మహిళలు, చిన్నారులకు న్యాయ, వైద్య సాయం అందించే కేంద్రాలు) ఈ విభాగం కింద ఉంటాయి. ఈ కార్యాలయంలో పనిచేసే వారిలో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు డీఎస్పీ, ఒక ఏఎస్పీ ర్యాంకు అధికారి, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. కార్యాలయంలోని అత్యాధునిక సదుపాయాలతో కూడిన సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్) సాయంతో ప్రతీ స్టేషన్ డేటాను అనుసంధానిస్తారు. ఫలితంగా వివిధ కేసుల స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చు. కేసుల పురోగతి, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. రోజూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగానికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయన్న విషయాలను డీఎస్ఆర్ (డెయిలీ సిట్యువేషన్ రిపోర్ట్) ద్వారా పర్యవేక్షిస్తారు. దీంతోపాటు ప్రతీనెలా కేసులపై సమీక్ష నిర్వహిస్తారు. తద్వారా కేసులను వీలైనంత త్వరగా విచారణ జరపడం, చార్జిషీట్ దాఖలు చేయడం సాధ్యమవుతాయి. ఫలితంగా బాధితులకు సత్వర సాయం అందే వీలుంటుంది. నేడు మహిళా ఉద్యోగులకు సెలవు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం (మార్చి 8) రాష్ట్రంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం సచివాలయంలో మహిళా ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. -
అమ్మ చావలేదు..చంపాడు..!
సాక్షి, రాజంపేట: పెనగలూరు మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన ఊటుకూరు సిద్ధమ్మ (85)ను హత్య చేసిన కేసులో తనయుడు ఊటుకూరు రామచంద్రారెడ్డి, మనవడు గిరిధర్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ మురళీధర్ తెలిపారు. బుధవారం రాత్రి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ నరసింహులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్దమ్మను ఆమె చివరి కొడుకు రామచంద్రారెడ్డి హత్య చేసి, తన కొడుకు గిరిధర్‌రెడ్డి సహాయంతో కువైట్‌కు వెళ్లిపోయేందుకు ఇన్నోవా వాహనంలో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడ వారిని విమానంలో ప్రయాణం చేయకుండా నిలుపుదల చేశారు. దీంతో వారిని అక్కడ అరెస్టు చేశారు. మృతురాలికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి భర్త 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. సిద్ధమ్మ వయోభారంతో పాటు అనారోగ్యంతో మంచంపైనే జీవనం సాగిస్తోంది. గత మూడు నెలలుగా రామచంద్రారెడ్డితోపాటు అన్నదమ్ములు అందరు ఒక్కొక్కరు ఒక నెల చొప్పున తల్లిని చూసుకునే విధంగా అంగీకారం చేసుకున్నారు. రామచంద్రారెడ్డి వద్ద సిద్ధమ్మ ఉండే సమయంలో ఆమెను ఎంత బాగా చూసుకున్నప్పటికి కొడుకు, కోడలు సరిగా చూసుకోలేదని కనిపించిన వారికి చెబుతూ వచ్చేది. దీంతో తల్లిపై తనయుడు కోపం పెంచుకున్నాడు. ఈనెల 4న రాత్రి సుమారు 12.50 గంటల ప్రాంతంలో సిద్ధమ్మ ముఖంపై గుడ్డతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి గొంతు నులిమి చంపేశాడు. తల్లి చనిపోయిన తర్వాత తన తల్లిది సహజ మరణం అని అన్నదమ్ములందరిని నమ్మించాడు. అందరితో కలిసి ఆమె కర్మకాండలను జరిపించాడు. నేర స్థలానికి ఎదురుగా ఉన్న యశోదమ్మ ఇంట్లో గల సీసీ కెమెరా పుటేజీలను చూస్తే, తన నేరం బయటపడుతుందని రామచంద్రారెడ్డి భయపడి బెంగళూరు ఎయిర్‌పోర్టు ద్వారా కువైట్‌కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ కంట్రోల్‌కు ఫ్యాక్స్ ద్వారా సమాచారం పంపి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు వివరించారు. సమావేశంలో పెనగలూరు ఎస్ఐ వెంకటరమణ , సిబ్బంది పాల్గొన్నారు. ఆ అమ్మకు రోజూ చిత్రహింసలే పెనగలూరు : కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన మాతృమూర్తి సిద్దమ్మ బతికి ఉన్నన్ని రోజులు కొడుకులు, కోడళ్ల చేతిలో చిత్రహింసలకు గురైనట్లు తెలుస్తోంది. ఆమెకు ఐదుగురు సంతానం కాగా ఒక్కో కుమారుడు ఒక్కో నెల చూసుకునేలా ఒప్పందం కుదిరింది. అయితే కొంతమంది కోడళ్ల వంతు వచ్చినప్పుడు వారుపెట్టే చిత్రహింసలు చూసి చుట్టు పక్కల వాళ్లు చలించిపోయేవారని తెలిసింది. ఒక కోడలు ఏకంగా కట్టె తీసుకుని ఆమెను కొట్టిన విషయం సీసీ పుటేజీల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కసారి వృద్ధురాలు ఏడుస్తున్నా కొట్టిన దాఖలాలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిందితుడు రామచంద్రారెడ్డి -
మరో కన్ను చూస్తోంది..
విజయనగరం, సాలూరు: నేరస్తుల గుట్టురట్టు చేయడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవి ఒకప్పుడు ధనికులు జీవించే ప్రాంతాలు, గృహాల్లో మాత్రమే పరిమితంగా కనిపించేవి. అయితే ఇటీవల కాలంల నేరాలు ఎక్కువ కావడంతో నేడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే సాలూరు మున్సిపాలిటీలో దాదాపు మూడేళ్ల కిందటే నేరాల అదుపునకు పట్టణ పోలీసులు సీసీ కెమెరాలను పలుచోట్ల ఏర్పాటు చేశారు. మొదట తహసీల్దార్ కార్యాలయం జంక్షన్లో 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనివల్ల 26వ నంబరు జాతీయ రహదారిపై ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలపైనే కాకుండా పట్టణంలో తిరిగే వాహనాలు, పాదచారులపై కూడా నిఘా పెట్టారు. పట్టణంలో నిలిపివేసిన లారీని కొంతమంది దొంగిలించి ఛత్తీస్‌గఢ్‌కు తరలించిన కేసును సీసీ కెమెరాల సహాయంతోనే పోలీసులు అతి తక్కువ కాలంలోనే ఛేదించారు. దీంతో పోలీసులు మరో అడుగు ముందుకేసి మరిన్ని సీసీ కెమెరాలు పట్టణంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డీలక్స్ సెంటర్, వేంకటేశ్వరకాలనీ, తదితర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతోనే మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. వీటిన్నింటినీ సర్కిల్ కార్యాలయానికి అనుసంధానం చేయడంతో అక్కడ నుంచే పోలీసులు ఆయా ప్రాంతాలను కంప్యూటర్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇటీవల సెల్ షాపులో జరిగిన చోరీ కేసులో కూడా సీసీ పుటేజీలు కీలకంగా మారాయి. మరో 68 సీసీ కెమేరాలు.. ప్రభుత్వం జాతీయ రహదారిపైనే కాకుండా ఇతర ప్రధాన రహదారులపై కూడా ప్రత్యేకంగా 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మేక్స్వెల్ సంస్థ సహకారంతో ఇక్కడ రికార్డయిన దృశ్యాలను నేరుగా అమరావతిలో మానటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. వీటిసాయంతో రోడ్డు ప్రమాదాలకు బాధ్యులైన వారితో పాటు అక్రమ రవాణాలను కట్టడి చేయగలుగుతున్నారు. దర్యాప్తు వేగవంతం.. సీసీ కెమెరాల సహాయంతో చోరులు, ప్రమాదాలు చేసిన వారిని తొందరగా గుర్తించే వీలుంటుంది. సీసీ పుటేజీ కారణంగా దర్యాప్తు వేగవంతం అవుతుంది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్‌లు, దోడీలకు పాల్పడేవారు సులువుగా దొరికిపోయే అవకాశం ఉంది. – ఇలియాజ్ మహమ్మద్, సీఐ, సాలూరు -
సీసీ కెమెరాకు చిక్కిన చిరుత
కడ్తాల్ (కల్వకుర్తి), యాచారం (ఇబ్రహీంపట్నం): ఏడాది కాలంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని 4 మండలాల ప్రజలు, అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి గురువారం రాత్రి కనిపించింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుత లేగదూడను తింటున్న దృశ్యాలు రికార్డయ్యాయి. యాచారం, మాడ్గుల, కడ్తాల్, ఆమనగల్లు మండలాల పరిధిలో చిరుత రాత్రి పూట పశువులు, గొర్రెలు, మేకలపై దాడి చేసి చంపేసింది. అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసినా చిక్కలేదు. అయితే, ఇన్నాళ్లు పశువులపై దాడులు చేస్తున్నది చిరుతనా లేక హైనా జంతువా అనేది తెలియలేదు. పాదముద్రలను బట్టి చిరుత పులేనని అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించి అప్రమత్తం చేశారు. బుధవారం రాత్రి కడ్తాల్ మండల పరిధిలోని గోవిందాయిపల్లిలో లేగదూడలపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు బిగించారు. గురువారం రాత్రి మరోమారు లేగదూడపై దాడి చేసి మాంసం తింటున్న చిరుత సీసీ కెమెరాల్లో కనిపించింది. సీసీ కెమెరాల్లో కనిపించిన చిరుతపులిని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నది చిరుత పులేనని నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం అటవీ శాఖ రేంజ్ అధికారి సత్యనారాయణ తన బృందంతో కలసి కడ్తాల్, యాచారం మండలాల అటవీ ప్రాంతంలో పర్యటించారు. చిరుత నిత్యం 25 కిలోమీటర్లు సంచరిస్తూ వ్యవసాయ బావుల వద్ద పశువులపై దాడులు చేసి చంపుతోందని గుర్తించారు. గురువారం రాత్రి సీసీ కెమెరాలో కనిపించిన చిరుత 8 ఏళ్ల వయసుఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. చిరుతపులి ఉన్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఆయా మండలాల అటవీ ప్రాంతంలో 3 బోన్లు, 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో చిరుతను పట్టుకుంటామని రేంజ్ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. చిరుతపులి ఉన్నట్టు తేలడంతో ఆయా మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ఇంటింటికీ సీసీ కెమెరాలు అవసరం
మన్సూరాబాద్: నల్లా మాదిరిగానే ప్రతి ఇంటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నేరాలను నియంత్రించవచ్చునని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. ఎల్బీనగర్ చంద్రపురికాలనీలో రూ. 8.5 లక్షల వ్యయంతో కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న 82 సీసీ కెమెరాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యత్మాక ప్రాంతాలు, మురికివాడల్లో స్వచ్ఛందసంస్థలు, కార్పొరేటర్ సంస్థల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరకు ప్రధాన రాహదారిపై ఇన్ఫోసిస్ సహకరంతో 182 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీని వల్ల నేరాలు తగ్గుతాయని, నేరస్తులను త్వరగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రారంభంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8వేల సీసీ కెమెరాలుండగా నేడు వాటి సంఖ్య 65వేలకు చేరుకుందని తెలిపారు. చంద్రపురికాలనీలో అక్రమపార్కింగ్‌ల సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులోని బస్‌టెర్మినల్‌ను వనస్థలిపురంలోని హరణి వనస్థలి జాతీయ పార్కు సమీపంలోకి మార్చేందుకు ఆర్టీసీ అధికారులతో చర్చిస్తామన్నారు., దీంతో ఎల్బీనగర్లో ట్రాఫిక్ సమస్య తీరుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రుద్రయాదగిరి, ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర్‌రావు, ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నాయకులు కొప్పుల నర్సింహారెడ్డి, జక్కిడి మల్లారెడ్డి, రఘువీర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 27 (బుధవారం) నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 16 వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. మొత్తం 9,42,719 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,550 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,277 పరీక్ష కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటుచేసింది. వీటిలో 1,277 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,277 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 24,508 మంది ఇన్విజిలేటర్లను నియమించింది. 1,277 పరీక్ష కేంద్రాల్లో 40 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 32 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బోర్డు నిర్ణయించింది. పరీక్షలు పూర్తయ్యే వరకు సిట్టింగ్ స్క్వాడ్స్ అక్కడే ఉంటాయి. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాల బండిల్స్ విప్పే చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాల నిఘా ఉంచనుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నిమిషం నిబంధన అమలుచేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కె.అశోక్ తెలిపారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8:45 గంటలకల్లా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని పేర్కొన్నారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఇందుకోసం సెంటర్ లొకేటర్ మొబైల్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అందులో పరీక్ష కేంద్రం ఫొటోతో పాటు గూగుల్ రూట్ మ్యాప్ ఉంటుందని వివరించారు. వెబ్సైట్లో హాల్‌టికెట్లు..: హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే కాలేజీలకు పంపించింది. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడంలేదన్న ఫిర్యాదుల నేఫథ్యంలో వెబ్సైట్లోనూ హాల్‌టికెట్లను ఉంచింది. bie.telangana.gov.in వెబ్సైట్ నుంచి విద్యార్థులు తమ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు వెళ్లవచ్చని, దానిపై ఎవరి సంతకం అవసరం లేదని అశోక్ తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేసే కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులూ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి - హాల్‌టికెట్ లేకుండా పరీక్షకు అనుమతించరు. హాల్టికెట్లలో పొరపాట్లు ఉంటే మాత్రం సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా జిల్లా ఇంటర్ విద్యా అధికారిని సంప్రదించాలి. - జవాబు పత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. బార్కోడ్, సబ్జెక్టు వివరాలను కూడా సరిచూసుకోవాలి. - మొబైల్స్, పేజర్లు, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, పేపర్లు పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఒకవేళ వాటిని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్తే మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేస్తారు. - కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్, ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. - పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తారు. - పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తితే హైదరాబాద్‌లోని హెల్ప్‌లైన్ కేంద్రానికి (040–24601010, 040–24732369) ఫోన్ చేయవచ్చు. -
ఒక్క కెమెరా పది మంది పోలీసులతో సమానం..
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని నిజాం మ్యూజియం నుంచి రూ.300 కోట్ల విలువైన అరుదైన పురాతన వస్తువుల చోరీ కేసు... ♦ సుల్తాన్‌బజార్‌లో ఉన్న ప్రసూతి ఆస్పత్రి నుంచి నవజాత శిశువు చేతన అపహరణకు సంబంధించిన ఉదంతం... ♦ మార్కెట్ పోలీసుస్టేషన్ పరిధిలో జ్యువెలరీ దుకాణాలకు బంగారు ఆభరణాలు సరఫరా చేసే వ్యక్తి నుంచి 2.3 కేజీల బంగారం ఎత్తుకుపోయిన కేసు... ఇవే కాదు... ఇలాంటి ఎన్నో కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలోనే పోలీసు విభాగం ‘ఒక్క కెమెరా పది మంది పోలీసులతో సమానం’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. ఢిల్లీ, ముంబై, సూరత్‌లకు దీటుగా రాజధానిలో ఉన్న కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3.26 లక్షల సీసీ కెమెరాలు ఉండగా... సిటీలో ఉన్న వాటి సంఖ్య 2.5 లక్షలు దాటింది. అవసరమైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు ప్రత్యేక అనలటిక్స్ సైతం జోడిస్తామని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. ప్రథమ స్థానంలో హైదరాబాద్...ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్నఎం.మహేందర్‌రెడ్డి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉండగా ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్లారు. వీటన్నింటినీ కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్‌కు (సీసీసీ) అనుసంధానం చేయడం ప్రారంభించారు. 2014 నుంచి ఆయన చేస్తున్న, చేసిన కృషి ఫలితంగానే సీసీ కెమెరాల ఏర్పాటులో సిటీ పోలీసు కమిషనరేట్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానాలకు రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3.26 లక్షలు సీసీ కెమెరాలు ఉండగా... ఒక్క హైదరాబాద్‌లోనే 2.68 లక్షల వరకు ఉన్నాయి. మూడు రకాలుగా ఏర్పాటు... ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని... ఎదురు చూడకుండా ఎవరికి వారుగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా పోలీసు విభాగం చర్యలు తీసుకుంటోంది. ఓ పక్క ప్రభుత్వం కేటాయించిన కెమెరాలు ప్రధాన రహదారులపై ఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు ఐదేళ్ల క్రితం అమలులోకి వచ్చిన ప్రజా భద్రత చట్టం నేపథ్యంలో వ్యాపారులతో ఆయా ప్రాంతాల్లో (కమ్యూనిటీ) సీసీ కెమెరాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండింటితో చాలా వరకు ప్రాంతాలన్నీ సీసీ కెమెరాల పరిధిలోకి వస్తున్నాయి. అయినప్పటికీ గల్లీలను సైతం వదలకూడదనే ఉద్దేశంతో ‘నేను సైతం’ అనే ప్రాజెక్టు అమలులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ప్రతి వీధిలోనూ కొన్ని సీసీ కెమెరాలను ప్రజల కోసం ఏర్పాటు చేసేలా వ్యక్తుల్లో స్ఫూర్తి నింపారు. ఏమాత్రం ‘తేడా’ రాకుండా చర్యలు... ఈ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి పోలీసుస్టేషన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వీటి ఆవశ్యకతనూ వివరిస్తూ ఎవరివారు ముందుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఏర్పాటవుతున్న కమ్యూనిటీ, నేనుసైతం కెమెరాలను ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగినని వారు ఏర్పాటు చేసుకుంటే సీసీసీతో అనుంధానం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా యూనిఫామిటీ కోసమూ పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు విభాగమే ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్‌ను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో అన్నీ ఒకే రకమైన కెమెరాలు సమకూరుతున్నాయి. అవి ఇవీ అన్నీ కలిపేస్తూ... ఇప్పటికే మూడు కమిషనరేట్లలో పోలీసు, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు చేసిన కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉన్నాయి. వీటి సంఖ్య పరిమితం కావడంతో అన్నిచోట్లా నిఘా సాధ్యం కావట్లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతా«ధికారులు ఓ వ్యాపార సముదాయం, వాణిజ్య కూడళ్ళతో పాటు దుకాణాల్లో ఏర్పాటు చేస్తున్న వాటినీ సీసీసీతో అనుసంధానిస్తున్నారు. దుకాణం లోపల భాగం మినహా బయటకు ఉన్న కెమెరాలు, కాలనీలు, పబ్లిక్‌ప్లేసుల్లో ఉన్న అన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా సీసీసీలతో అనుసంధానిస్తున్నారు. దీంతో పోలీసు విభాగానికి చెందిన కెమెరాలూ ప్రధానంగా ట్రాఫిక్ కోణంలో ఉన్నా... అనుసంధానించినవి నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తున్నాయి. అనునిత్యం దాదాపు 10 శాతం కెమెరాలు మరమ్మతులకు లోనవుతుంటాయి. వీటి నిర్వహణను సైతం పోలీసులు ఆయా కంపెనీలకు అప్పగిస్తున్నారు. భవిష్యత్తులో ప్రత్యేక అనలటిక్స్... ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే వివిధ కెమెరాలను అనునిత్యం మాన్యువల్‌గా పర్యవేక్షిస్తుండటం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ప్రస్తుతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్స్‌కు కనెక్ట్ చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ప్రత్యేక అనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్స్‌తో వీటిని అనుసంధానించనుంది. ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో ఎక్కువ సేపు కదలకుండా ఉన్న వ్యక్తులు, గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసిన బ్యాగులు, ఎక్కువ కాలం పార్క్ చేసిన వాహనాలను సీసీ కెమెరాలే గుర్తిస్తాయి. దీంతో పాటు నిషేధిత ప్రాంతాల్లోకి ఎవరైనా ఎంటర్ అయినా, నిర్మానుష్యంగా ఉండే చోట ఎవరైనా సంచరిస్తున్నా కెమెరాలే గుర్తించి కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో ఉండే సిబ్బందికి పాప్అప్, బీప్ ద్వారా సమాచారం ఇస్తాయి. ప్రజల స్పందన మరువలేం సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మా పిలుపునకు స్పందించి, ప్రజలు ఇస్తున్న సహకారం మరువలేనిది. కేవలం వ్యాపార, వాణిజ్య వర్గాలే కాకుండా కాలనీల ప్రజలు... జిల్లాల్లో మండలాలతో పాటు గ్రామాల్లో ఉండేవాళ్లూ ముందుకు వస్తున్నారు. ఎవరికి వారు తమ బాధ్యతగా భావించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రకాలైన ప్రజలకు ఉపకరించే, నేరగాళ్లను కట్టడికి ఉపయుక్తమయ్యే సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. నేరాల నిరోధించడం, కేసులు కొలిక్కి తీసుకురావడంతో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారింది. వీటిని ఏర్పాటు చేసుకోవడం ఓ సామాజిక బాధ్యత అనే అంశాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్ళడంలో పోలీసు విభాగం విజయవంతమైంది. – ఎం.మహేందర్‌రెడ్డి, డీజీపీ ఇదీ సిటీలో పరిస్థితి... ప్రభుత్వ కెమెరాలు: 10 వేలు కమ్యూనిటీవి: 8500 నేనుసైతం: 2,50,000 ♦ వీటి ఆధారంగా 2016లో 1200, 2017లో 3566, గత ఏడాది 3750 కేసులు కొలిక్కివచ్చాయి. ♦ సిటీలో అత్యధిక సీసీ కెమెరాలు బంజరాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్టల్లో ఉన్నాయి. ఇక్కడి దాదాపు ప్రతి 10 చదరపు కి.మీకి ఒకటి చొప్పున ఉంది. -
దొంగతో యుద్ధం.. సీసీ కెమెరాల గెలుపు
దొంగతనం చేయడానికి ఓ షాపును ఎంచుకున్నాడు ఓ దొంగ. నెమ్మదిగా షాపులో దూరడానికి ప్రయత్నించాడు. కొంత దూరంలో తన అడుగుల కోసమే ఎదురు చూస్తున్న ఓ సీసీకెమెరాని గమనించాడు. కదలలేని శత్రువే, కానీ దాని కంటికి చిక్కానో ఇక అంతే అని భావించి చేతికి దొరికిన ఓ పరికరంతో యుద్ధం ప్రకటించాడు ఆ దొంగ. దానికి చిక్కకుండా ఆ పరికరంతో మొహాన్ని దాచుకుంటూ ముందుకు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అయితే మధ్యలోకి రాగానే పక్కనే ఎవరో ఉన్నారని అనిపించి, టక్కున తిరిగి చూశాడు. అంతే అక్కడ మరో సీసీకెమెరాను చూసి దొంగ గుండె గుబేలుమంది. సీసీకెమెరాలతో జరిగిన పోరులో ఏం చేయలేని నిస్సహాయస్థితిలో అక్కడి నుంచి తోకముడుచుకుని పారిపోయాడు. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సీసీ కెమెరా చూసి తోక ముడిచిన దొంగ
-
తస్మాత్.. జాగ్రత్త!
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి సీసీ కెమెరాల సహాయంతో జరిమానాలు విధించేందుకు పోలీసులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగరంలో పలు కూడళ్లలో నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తూ అత్యాధునికి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ కెమెరాలు ఏర్పాటు తరువాత ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా క్షణాల్లో సీసీ కెమెరాల్లో నమోదై జరిమానా కట్టేందుకు ఈ చలానా అందుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం హైస్పీడ్ సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో నగరంలో పలు ప్రాంతాలకు 325 సీసీ కెమెరాలు మంజూరు చేసింది. తొలి విడతగా నగరంలో ప్రధాన కూడళ్లలో 95 కెమెరాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టింది పోలీస్‌శాఖ. ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల్లో కెమెరా అమర్చేందుకు అవసరమైన స్తంభాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క స్తంభానికి నాలుగు కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. ఈ నిఘా వ్యవస్థ వల్ల పాత నేరస్తులతో పాటు చోరీకి గురైన వాహనాలను గుర్తించవచ్చని, అలాగే నిబంధనలు అతిక్రమించిన వారితో పాటు, ఆ వాహన చోదకుని ఫొటో, వాహనం నంబర్ ప్లేట్ ఫొటో ఇలా నిఘా వ్యవస్థ ఏర్పాటుకు అర్బన్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇకపై వాహన చోదకులు జాగ్రత్తగా వ్యవహరించి వాహనాల అధిక స్పీడు, రాంగ్‌రూట్, లైన్ దాటడం వంటి తప్పిదాలు చేయకుండా వాహనాలు నడపాల్సి ఉంటుందని అడిషనల్ ఎస్పీ రమణ్‌కుమార్ తెలిపారు. -
కిర్లంపూడిలో భారీ పోలీసు బందోబస్తు
తూర్పుగోదావరి, కిర్లంపూడి (జగ్గంపేట): మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31వ తేదీన కత్తిపూడిలో నిర్వహించ తలపట్టిన ‘చలో కత్తిపూడి జేఏసి సమావేశం’ను దృష్టిలో ఉంచుకొని కిర్లంపూడిలో భారీ పోలీస్ బందోబస్తు చేస్తున్నారు. గతంలో జరిగిన తుని సంఘటనను దృష్టిలో ఉంచుకొని ముద్రగడ చేపట్టిన కత్తిపూడి సమావేశాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామానికి చేరుకుంటున్న పోలీసు బలగాలను చూస్తుంటే ఏ క్షణంలోనైనా ముద్రగడను గృహనిర్బంధం చేయవచ్చని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి పెద్దాపురం డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బంది కిర్లంపూడి చేరుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ సీహెచ్ రామారావు, జగ్గంపేట, తుని టౌన్ సీఐలు వై.రాంబాబు, వి.శ్రీనివాస్, స్థానిక ఎస్సై డి.నరేష్‌తో పాటు ఎస్సైలు పార్థసారథి, రామకృష్ణ, పోలీసులు కిర్లంపూడిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సోమవారం నాటికి భారీ సంఖ్యలో పోలీసులు కిర్లంపూడి చేరుకుంటారని సమాచారం. ముద్రగడ పద్మనాభం ఇంటి బయట ఉన్న గేటు వద్ద శనివారం సాయంత్రం నుంచి ఎస్సై స్థాయి అధికారితో పాటు 10మంది పోలీసు సిబ్బంది మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు. ముద్రగడ ఇంటి గేటు ఎదుట ఆర్అండ్బీ రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభానికి శనివారం సాయంత్రం మూడు సీసీ కెమెరాలను అమర్చారు. స్థానిక సత్యదేవా కల్యాణమండపంలో టెంట్లను వేశారు. మళ్లీ పోలీసు బలగాలు కిర్లంపూడి రావడంతో ఏక్షణాన ఏంజరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాపు నాయకుల అరెస్టు కొత్తపల్లి (పిఠాపురం): తమను వ్యతిరేకించే కాపునాయకులను ఎలాగైనా లొంగదీసుకోవాలని అధికారపార్టీ కుయుక్తులు పన్నుతోంది. అధికార దండంతో వారిని బెదిరిస్తోంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31వ తేదీన కత్తిపూడిలో నిర్వహించనున్న కాపు మహాసభను అడ్డుకునే చర్యల్లో భాగంగా గొల్లప్రోలు మండలంలోని పలువురు నాయకులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వారిని కొత్తపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అరెస్టు అయిన వారిలో మొగలి అయ్యారావు, ఎస్.సత్యనారాయణరాజు, డి.వెంకటేష్ ఉన్నారు. స్థానిక కాపునాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, మారిశెట్టి శ్రీను, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు జీలకర్ర సత్తిబాబు వారిని పోలీసు స్టేషన్లో కలసి సంఘీభావం తెలిపారు. అయ్యారావు మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు చేసినంత మాత్రాన ఈ సభ ఆగదన్నారు. పని ఉంది రమ్మని చెప్పిన పోలీసులు అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
అసలు కథ
‘యాంకర్ రమ్య భారతి ఇక లేరు.. ఆమె వాక్చాతుర్యం, నవ్వు శాశ్వతంగా మనల్ని వీడి పోయాయి.. గుండెపోటుతో నిద్రలోనే కన్ను మూసిన అందాల తార... బుల్లి తెరకు తీరని లోటు...’ సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త హోరెత్తిపోయింది.రమ్య భారతి చాలా ఫేమస్ యాంకర్. నవ్వుతూ సందర్భోచిత వ్యాఖ్యానంతో, పంచ్‌లతో, సునిశిత హాస్యంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఆమెకు అభిమానులెందరో ఉన్నారు. ఆమె ఇంటి ముందు జనం బారులు తీరారు. క్యాంపులో ఉన్న భర్త రాజశేఖర్‌కి ఫోన్ చేశారు. వెంటనే వచ్చాడు. వీరి మాటలు నమ్మక, ‘నా బంగారం నన్ను విడిచిపోదు...’ అంటూ ఆశగా డాక్టర్ని పిలిపించాడు. కాని అతని ఆశ నిరాశ చేస్తూ డాక్టర్ ఆమె మరణించిన విషయం ధ్రువపరచి వెళ్ళిపోయాడు. రాజశేఖర్ గుండెలవిసేలా ఏడుస్తున్నాడు. పని మనిషి ‘రాత్రి తొమ్మిది వరకు ఆమె బాగానే ఉంది’ అని చెప్పింది. బంధువులంతా వచ్చారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇది సహజ మరణం కాదని, హత్య అని అనుమానంగా ఉందని రమ్య భారతి తల్లి ఫిర్యాదు చేసిందంటూ వచ్చి, ఆమె భర్తను, పనిమనిషిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ‘రమ్యతో పాటే టీవీ చానల్లో పనిచేసే ప్రదీప్ తరచు ఇంటికి వస్తుండే వాడని, రాజశేఖర్ లేనప్పుడల్లా ఇద్దరూ కలిసి తిరుగుతుండే వాళ్లని, ముందురోజు కూడా రాజశేఖర్ టూర్లో ఉండటంతో అతను రాత్రి చాలా పొద్దు పోయేవరకు ఉన్నాడని’ భయపడుతూ చెప్పింది పనిమనిషి. తెల్లవారి పనిమనిషి వచ్చేసరికి గడియ తెరిచే ఉందని, లోపలికెళ్ళేసరికి రమ్య భారతి ఒక్కతే మంచంపై పడుకుని ఉందని, ఇంకా లేవలేదని లేపబోతే చల్లగా తగిలిందని, ఇంటి పక్క వారికి చెబితే వారు అయ్యగారికి ఫోన్ చేశారని చెప్పింది. సీఐ బెడ్రూమ్ని పరిశీలించాడు. నిజంగానే అక్కడ ఘర్షణ జరిగినట్లు , పగిలిన చేతి గాజు ముక్క, అడ్డం పడి ఉన్న ఫ్లవర్ వాజు, ఆమె వెంట్రుకలు లాంటివి, పెరటి వైపు కారు టైర్ల గుర్తులు, బెడ్ రూమ్‌లో ప్రదీప్ వేలిముద్రలు అనుమానాస్పదంగా కనిపించాయి. కాని కేవలం వాటి వల్ల నిర్ధారణకు రాలేం. పరారవుతున్న ప్రదీప్‌ని అదుపులోకి తీసుకుని వారిదైన శైలిలో ప్రశ్నించారు. అతను ‘నాకూ, ఆమెకూ సంబంధం ఉంది. ఆ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు ఆమెతో గడిపి వెళ్లిపోయాను. అంతకు మించి నాకే పాపం తెలీదు’ అన్నాడు.‘నంగనాచి... నా బిడ్డను నాశనం చేసి బుకాయిస్తున్నాడు, బంగారంలా చూసుకునే అల్లుడి నుంచి వల వేసి నా బిడ్డను లోబరుచుకున్నాడు. నాలుగు తగిలించండి... వాడే నిజం కక్కుతాడు... నా బిడ్డ దగ్గర నుంచి డబ్బంతా దోచుకున్నాడు..’ రమ్య భారతి తల్లి ఏడుస్తూ అరుస్తోంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి రాజశేఖర్‌కు సంకెళ్ళు వేశారు. అంతా నివ్వెర పోయారు. ‘సర్... నా భార్యను బంగారంలా చూసుకుంటాను.. అసలు నిన్నేం జరిగిందో నాకు తెలీదు.... తప్పు చేసిన వాడిని వదిలి, ఇప్పుడు వచ్చిన నన్ను ఇలా అనుమానించడం అమానుషం...’ గింజుకున్నాడు రాజశేఖర్.‘మిస్టర్... మాకు అన్ని ఆధారాలూ దొరికాయి.. నువ్వు నిన్న రాత్రి వెనక వైపు నుండి ఇంటికి వచ్చి ఆమెను చంపి మళ్ళీ వెళ్ళిపోయావు కదా.... నీ మీద అనుమానం రాకుండా ఉండటానికి అంతా ఫోన్ చేసి చెప్పాక అందరి ముందూ అప్పుడే వచ్చినట్లు బిల్డప్ ఇచ్చావు... ఇంకా బుకాయించకు. నిజాయతీగా ఒప్పేసుకుంటే శిక్ష తగ్గుతుంది..’ సీఐ హూంకరించాడు. షాక్ తిన్న రాజశేఖర్ ఇంకా బుకాయించడం వల్ల లాభం లేదనుకున్నాడు. ‘నిజమే... ఆమెను నా ప్రాణంలా చూసుకున్నా... కాని ఆమె మరొకరి వలలో పడింది. చూచాయగా వాళ్ళు వీళ్ళు ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చినా ఆమెను అనుమానించలేదు.. మీడియాలో ఇది మామూలే అనుకున్నా... ఎప్పుడు టూర్ కెళ్ళినా ఎప్పుడొస్తానో చెప్పేవాడిని. ఈసారి అలాగే రేపు వస్తానని చెప్పాను. కాని ముందు రోజే అంటే నిన్ననే అయిపోవడంతో రాత్రి ఇంటికి వచ్చాను. ఇంటి ముందు ఆగి ఉన్న కారు నాలో అనుమానాన్ని రేకెత్తించింది. ఇంటి వెనుక కారు ఆపి , వెనుక గేట్ గుండా బెడ్ రూమ్ కిటికీ దగ్గర కొచ్చాను. వాళ్ళిద్దరూ తప్పు చేస్తూ కనబడ్డారు. అసహ్యం వేసింది. ఎంత బాగా చూసుకున్నాను తనను, ఏడుపొచ్చింది. ఆ బాధలో ఆ చీకట్లో షాక్‌లో ఉండగానే ప్రదీప్ వెళ్ళిపోయాడు. నేను లోనికెళ్ళాను. కొంచెం కంగారు పడింది. మాటలతో అనవసరం అనిపించింది. రేపటి వరకు టూర్ కాబట్టి ఇప్పటి వరకు ప్రదీప్ ఉన్నాడు కాబట్టి , చంపితే ఎవరికీ అనుమానం రాదనుకున్నాను. అదే బెడ్ రూమ్‌లో దిండుతో ఆమె ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేశాను. తర్వాత పక్క సరి చేసి, చక్కగా నిద్రపోయినట్లు పడుకోబెట్టి , కింద పడిన గాజుపెంకులు అవి ఏరి , వెళ్ళిపోయాను. నా బెడ్రూమ్లో నా ఫింగర్ ప్రింట్స్, భర్తనే కాబట్టి అనుమానం రాదు, ప్రదీప్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా అనుమానించినా అటే అనుమానం వెళుతుంది అనుకున్నా. కాని మీరింత తొందరగా ఎలా కనిపెట్టారో నాకింకా అర్థం కావడం లేదు..’ అయోమయంగా అన్నాడు. ‘దోషి ఎదో ఒక చోట ఎప్పుడైనా చట్టానికి దొరికి పోతాడు. ఇంటి వెనక ఉన్న మీ కారు టైర్ గుర్తులు, వీధి మలుపు పై ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో రాత్రి మీ కారు ఈ వీధిలోకి రావడం వెళ్ళడం రికార్డ్ అయ్యింది. చనిపోయిన సమయం దానికి సరిగ్గా సరిపోయింది. ఇలాంటివెన్నో చూసిన అనుభవం... ఎప్పటికీ డబ్బులిచ్చి, ప్రేమ కురిపించే ఆమెను ప్రదీప్ చంపడానికి కారణం కూడా కనిపించలేదు. భర్త కనుక సహజంగానే మరొకరితో ఉన్న బంధం బాధిస్తుంది, ఆ కోణంలో దర్యాప్తు చేశాం..’ అంటూ ముగించాడు సీఐ. - నామని సుజనా దేవి -
సీసీ కెమెరాలు అమర్చేందుకు వచ్చి..
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి మెళియాపుట్టి రహదారి సమీపంలో బొంగపోలమ్మ మోడరన్ రైస్ మిల్లులో గురువారం విద్యుదాఘాతానికి గురై గుమ్మడి అశోక్(36) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, మృతుడి తమ్ముడు ప్రశాంత్ తెలిపిన వివరాలు ప్రకారం... ఈ రైస్ మిల్లులో కొద్దిరోజుల క్రితం ధాన్యం బస్తాలు దొంగతనం జరిగింది. మరోసారి దొంగతనం జరగకుండా ఉండేందుకై మిల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఒడిశా రాష్ట్రం కాశీనగర్ సమీపంలోని బొత్తవ గ్రామానికి చెందిన గుమ్మడి అశోక్, అతని సోదరుడు ప్రశాంత్‌లు మిల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికై వచ్చారు. దీనిలో భాగంగా గురువారం మిల్లు పైకి ఎక్కి సీసీ కెమెరా వైర్లు బిగిస్తుండగా పక్కనుంచి వెళుతున్న 33 కేవీ విద్యుత్ తీగ అశోక్‌కు తగలటంతో ఒక్కసారిగా తుల్లిపోయాడు. సమీపంలోని గోడపై పడటంతో తలకు తీవ్రగాయం కాగా తన శరీరం కాలిపోయింది. అశోక్‌ను బతికించేందుకు తమ్ముడు ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అప్పటికే తన సోదరుడు మృతిచెందాడు. వెంటనే స్పందించిన మిల్లు సిబ్బంది మిల్లుపైకి వెళ్లి మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చారు. మృతుడికి షాక్ తగలగానే సమీపంలోని గోడపై పడడంతో తలకు తీవ్ర గాయమై, అధిక రక్తశ్రావం జరిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి చలించిపోయి కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య గౌరి, రెండేళ్ల కుమారుడు సాత్విక్ ఉన్నారు. అశోక్ మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నిఘాపై నిర్లక్ష్యం
ఆత్మకూరు: జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో పంపనూరు ఒకటి. సర్పరూప సుబ్రమణ్యేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఆది, మంగళవారాల్లో భక్తులు పోటెత్తుతుంటారు. ఎంతోమంది భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని ఆలయం చుట్టూ 108 ప్రదక్షణలు చేస్తుంటారు. ఆదాయం రూ.లక్షల్లో ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దేవాదాయ శాఖకు సుబ్రమణ్యస్వామి ఆదాయంపై ఉన్న శ్రద్ధ.. ఆలయ అభివృద్ధిపై ఏమాత్రమూ ఉండటం లేదు. ఇక్కడ ఆలయ కమిటీ అనుబంధంగా అన్నదాన కమిటీ ఉన్నాయి. ప్రముఖ ఆలయంగా పేరొందినప్పటికీ ఇక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లూ లేవు. భక్తుల భద్రత, చోరీల నివారణ, అక్రమాలకు చెక్ పెట్టేందు కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గర్భగుడిలో ఏకంగా కుక్కలు, కోతులు సంచరిస్తున్నా పట్టించుకునే నాథులే లేరు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆది, మంగళ వారాల్లో మాత్రం ఓ కమిటీ సభ్యులు కనిపిస్తుంటారు. పనిచేయని సీసీ కెమెరాలు ఆలయం లోపల తక్కువ సామర్థ్యం కలిగిన తొమ్మిది సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో మూడు పనిచేయడం లేదు. మిగిలిన ఆరు పనిచేస్తున్నప్పటికీ అందులో రికార్డవుతున్న దృశ్యాలలో స్పష్టత ఉండటం లేదు. ఫలితంగా ఎటువంటి ఉపయోగమూ లేకుండా పోతోంది. గర్భగుడి వద్ద సీసీ కెమెరాలు ఊడి గోడలకు వేలాడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆలయ ప్రాంగణంలో వాహనాలు నిలిపే చోట, రోడ్డు నుంచి ఆలయం వరకు నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీని గురించి ఎవ్వరూ దృష్టి సారించడం లేదు. నిధులు వెనక్కేనా? ఆలయంలో తొమ్మిది సీసీ కెమెరాలు ఉన్నాయి. రెజల్యూషన్/ పిక్సెల్స్ తక్కువ సామర్థ్యం కావడంతో సీసీ ఫుటేజీల్లో ఏమాత్రం స్పష్టత కనిపించడం లేదు. వీటిని తొలగించి కొత్తగా 30 సీసీ కెమెరాల వరకు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ ఇటీవల రూ.7.50 లక్షల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ పనులు కోసం ఇటీవల ఓపెన్ టెండర్ కూడా పిలిచారు. అయితే ఆ టెండర్ రద్దు అయినట్లు ఈఓ సుధారాణి తెలిపారు. దాతల ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి, మంజూరైన దేవాదాయ నిధులను నొక్కేయాలనే ఆలోచనలో సిబ్బంది ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సకాలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించకపోతే మాత్రం నిధులు వెనక్కుపోయే అవకాశం ఉంది. నెలాఖరులోపు టెండర్లు ఆలయంలససీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎండోమెంట్ వారు రూ.7.50 లక్షలు మంజూరు చేశారు . వాటి కోసం ఇటీవల ఓపెన్ టెండర్లు పిలిచి రద్దు చేయించాం. కాని ఆ టెండర్లు రద్దు అయ్యాయి. ఈ నెల ఆఖరులోపు టెండర్లు పిలుస్తాం. – సుధారాణి, ఈఓ, పంపనూరు కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పాం సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయానికి ప్రతి ఆది, మంగళ వారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రద్దీని నియంత్రించడానికి ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను పంపుతున్నాం. కానీ దొంగతనాలు, మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని గుర్తించడానికి అనుగుణంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు చెప్పాం. – సాగర్, ఎస్ఐ, ఆత్మకూరు -
చండూరు: ఎట్టకేలకు మూడోకన్ను
సాక్షి, చండూరు : చండూరు మున్సిపాలిటీ కేంద్రం ఎట్టకేలకు మూడో కన్ను తెరిచింది. దొంగతనాలకు, అరాచకాలకు ఇక చెక్ పడనుంది. ప్రతి చిన్న సంఘటనను సైతం ఇట్టే గుర్తుపట్టే అవకాశం ఉంది. గతంలో సీసీ కెమెరాలు లేక పోవడంతో పట్టణంలో అనేక చోరీలు చోటు చేసుకున్నాయి. పోలీసుల చొరవతో సీసీ కెమెరాలను పట్టణంలో ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేశారు. దీంతో ఇక ముందు చోరీలు ఉండవని, ఒక వేళ జరిగినా ఇట్టే గుర్తించే అవకాశం ఉందని పోలీసులు చెపుతున్నారు. పట్టణంలో... బోడంగిపర్తి గ్రామానికి చెందిన మంచికంటి ట్రస్ట్ అందించిన 12 కెమెరాలను బిగించారు. పట్టణంలో ముఖ్య కూడలి సెంటర్లో నాలుగు, ఎస్బీఐ ఏరియాలో రెండు, మరో ఆరు కెమెరాలను జనం రద్దీగా ఉండే స్థలాలో బిగించారు. కెమెరాలతో పట్టణ ప్రజలు నిర్భయంగా ఉండే అవకాశం ఉంది. గతంలో ... చండూరు పట్టణంలో గతంలో అనేక చోరీలు చోటుచేసుకున్నాయి. ప్రతి శుక్రవారం సంత రోజు ఒక్కటి, రెండు గొలుసు చోరీలు జరుగుతునే ఉండేవి. అనేక మంది మహిళలు సంతకు రావడానికి జంకే వారు. కొంత మంది రాత్రి సమయాలలో బయట తిరుగుతూ అలజడులు సృష్టించే వారు. దీంతో ప్రజలు రాత్రి అయ్యిందో బయటకు రావడానికి జంకే వారు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటుతో ఆ భయం లేకుండా పోయింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.. పట్టణంలో మంచికంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇక చోరీలకు చెక్ పడనుంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. సీసీ కెమెరాలతో ఇబ్బందులు తప్పనున్నాయి. – సైదులు, ఎస్ఐ -
అత్యాచారం నిందితుడిపై కేసు నమోదు
విజయనగరం , శృంగవరపుకోట రూరల్: మండలంలోని బొడ్డవర–తాటిపూడి రహదారిలో గుర్తు తెలియని వ్యక్తి తొమ్మిదేళ్ల వయసు గల పాఠశాల బాలికను బలవంతంగా బైక్‌పై తీసుకుని వెళ్లి అత్యాచారం చేసిన సంఘటన జిల్లాలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా డీఎస్పీ డి. సూర్యశ్రావణ్‌కుమార్, సీఐ బి. వెంకటరావు, ఎస్సై ఎస్. అమ్మినాయుడు బుధవారం బొడ్డవర ప్రాథమికోన్నత పాఠశాలను..గుర్తు తెలి యని వ్యక్తి చిన్నారిని బైక్‌పై ఎక్కించుకున్న ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ, తాటిపూడి రహదారిలో గల ఒక జీడితోటలోకి బాలికను తీసుకుని వెళ్లి అత్యాచారం చేసి పరారైన నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. నింది తుడ్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. బాధితురాలు ప్రస్తుతం విజయనగరం ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బొడ్డవర, ఐతన్నపాలెం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సీసీ కెమెరా పుటేజీ పరిశీలన బొడ్డవర జంక్షన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో మంగళవారం సాయంత్రం రికార్డైన దృశ్యాలను డీఎస్పీ శ్రావణ్‌కుమార్, సీఐ వెంకటరావు, తదితరులు పరిశీలించారు. పాఠశాల విడిచిపెట్టిన అనంతరం ఇద్దరు బాలికలు, మరో బాలుడు భుజాలకు బ్యాగులు తగిలించుకుని రోడ్డు దాటుతున్న వైనంతో పాటు గుర్తు తెలియని వ్యక్తి ఒక బాలికను బైక్ ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు. నిందితుడు గంట్యాడ మండలానికి చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నికలపై అధికారుల డేగ కన్ను..
మద్దూరు (కొడంగల్) : ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు పెట్టే ఖర్చు పర్యవేక్షణకు అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లాంటి వాటిని నిరోధించేందుకు ఎనిమిది రకాల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. వీరు ప్రతీ అంశాన్ని నేరుగా పరిశీలకులు, ఎన్నికల అధికారికి సమాచారమిస్తారు. ఈ మేరకు ఆయా బృందాల వివరాలు, పనితీరుపై ప్రత్యేక కథనం. వ్యయ పరిశీలకులు వ్యయపరిశీలకులుగా ఐఏఎస్, ఐఆర్ఎస్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులను నియమించారు. ప్రతీ జిల్లాకు నియోజకవర్గాల సంఖ్యకనుగుణంగా పరిశీలకులను నియమించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు నులుగురు వ్యయ పరిశీలకులను నియమించారు. నిఘా బృందాలు ఈ బృందాలు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఉంటాయి. జిల్లాలో ఒక్కో నియోజవర్గానికి మూడు నుంచి నాలుగు చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో డీటీ స్థాయి అధికారితో పాటు ముగ్గురు ,లేదా నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. అకౌంటింగ్ టీం జిల్లాలో మొత్తం 12 బృందాలు ఉంటాయి. ఒక్కో బృందంలో ఒక అధికారి, ఒక సహాయకుడు ఉంటారు. వీరు వీడియో వ్యూయింగ్ బృందాలు పంపిన సామగ్రి లెక్కలు చూసి వాటికి ఎన్నికల నిబంధనల ప్రకారం ధరలు నిర్ణయిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్లు ప్రతీ నియోజకవర్గంలో మూడు, ఆపై సంఖ్యలో ఉంటాయి. ఒక్కో బృందానికి నాయకత్వం వహించే అధికారికి మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయి. ఇలా జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలకు 60మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పనిచేస్తుంటారు. బృందంలో ఒక వాహనం, ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుళ్ళు, ఒక ఏఎస్సై, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలపై సమాచారమొస్తే ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని రికార్డు చేస్తారు. వీడియో నిఘా బృందాలు పరిశీలకులకు సాయంగా ఉండేందుకు సహాయ వ్యయపరిశీలకులను నియోజకవర్గానికి ఒకరిని నియమించారు. ప్రతీ నియోజకవర్గానికి ఆదాయ పన్ను అధికారి (ఐటీఓ) హోదా లేదా ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న అధికారులు ఉంటారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల వ్యయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ అధికారి వద్ద ఒక్కో అభ్యర్థి పేరుతో ఒక్కో రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. షాడో రిజిస్టర్‌గా పిలిచే దీనిలో అభ్యర్థికి సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు పొందుపరుస్తారు. అభ్యర్థులు చూపే ఎన్నికల ఖర్చుతో షాడో రిజిస్టర్ ఖర్చులు పోల్చి చూసి తేడా ఉంటే సంజాయిషీ కోరతారు. అంతిమంగా అభ్యర్థుల ఖర్చుల్లో వీరు చెప్పిందే ఫైనల్‌గా ఉంటుంది. సహాయ వ్యయ పరిశీలకులు పరిశీలకులకు సాయంగా ఉండేందుకు సహాయ వ్యయపరిశీలకులను నియోజకవర్గానికి ఒకరిని నియమించారు. ప్రతీ నియోజకవర్గానికి ఆదాయ పన్ను అధికారి (ఐటీఓ) హోదా లేదా ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న అధికారులు ఉంటారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల వ్యయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ అధికారి వద్ద ఒక్కో అభ్యర్థి పేరుతో ఒక్కో రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. షాడో రిజిస్టర్‌గా పిలిచే దీనిలో అభ్యర్థికి సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు పొందుపరుస్తారు. అభ్యర్థులు చూపే ఎన్నికల ఖర్చుతో షాడో రిజిస్టర్ ఖర్చులు పోల్చి చూసి తేడా ఉంటే సంజాయిషీ కోరతారు. అంతిమంగా అభ్యర్థుల ఖర్చుల్లో వీరు చెప్పిందే ఫైనల్‌గా ఉంటుంది. వీడియో నిఘా బృందాలు వీడియో నిఘా బృందం నియోజకవర్గానికొకటి ఉంటుంది. ప్రతీ బృందలో ఒక అధికారి, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. వీరు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు ,ర్యాలీలు, ఇతర ప్రచార కార్యక్రమాలను చిత్రీకరిస్తారు. ఒకే సమయంలో ఎక్కువ కార్యక్రమాలు ఉంటే అదనపు వీడియో గ్రాఫర్‌ను నియమించుకునే అధికారం ఆ అధికారికి ఉంటుంది. -
కుట్రలో భాగంగానే కెమెరాలు ఆఫ్..
-
‘కళ్లు’గప్పి కడతేర్చే కుట్ర!
కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పి భవిష్యత్‌పై భరోసా ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది నవంబరులో ఇడుపులపాయ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు... సరిగ్గా అప్పుడే అమరావతి కేంద్రంగా ప్రతిపక్ష నేతను అడ్డు తొలగించుకునే నీచమైన ఎత్తుగడ పురుడు పోసుకుంది. టీడీపీ నేత, ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి ద్వారా విశాఖ విమానాశ్రయంలో కుట్ర కథ నడిపించారు. ప్రతిపక్ష నేత పాదయాత్ర ఈ ఏడాది ఆగస్టులో ఉత్తరాంధ్రలోకి ప్రవేశించగానే అంటే సరిగ్గా మూడు నెలల క్రితం కుట్ర అమలుకు ప్రభుత్వ పెద్దలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సరిగ్గా అప్పటి నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న విషయం తాజాగా వెలుగులోకి రావడం కుట్ర కోణాన్ని బహిర్గతం చేస్తోంది. (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు కలిగిన విశాఖపట్నం విమానాశ్రయంలో భద్రతా వ్యవస్థ మూడు నెలలుగా పడకేసింది. విమానాశ్రయంలో సీసీ కెమెరాల ఫుటేజీ మూడు నెలలుగా లేదని స్వయంగా విశాఖ పోలీసులే హైకోర్టుకు నివేదించడం గమనార్హం. కీలకమైన ఎయిర్‌పోర్టులో నెలల తరబడి సీసీ కెమెరాలు ఆఫ్‌లో ఉన్నాయని పోలీసులు చెప్పడం అందరినీ విస్మయపరుస్తోంది. దొంగతనాలు, ఇతర నేరాల కట్టడికి అపార్టుమెంట్లు, చిన్న వ్యాపార సంస్థల్లో కూడా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పోలీసులు తరచూ చెబుతుంటారు. అలాంటిది దేశ, విదేశ ప్రముఖులు, వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ముఖ్యమైన విమానాశ్రయంలో సీసీ కెమెరాలు కచ్చితంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే ధ్యాసే లేకపోవడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కావాలనే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని, కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలో భాగంగానే కెమెరాలు ఆఫ్.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర మూడు నెలల క్రితం ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఆయన ప్రతి వారం విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ చివరినాటికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగియాల్సి ఉంది. అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఉత్తరాంధ్రలో పాదయాత్ర షెడ్యూల్ ఉన్నందున ప్రతిపక్ష నేత విశాఖపట్నం విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. సరిగ్గా దీన్నే అవకాశంగా మలుచుకుని ఆయన్ను హత్య చేసేందుకు ఏడాది క్రితం కుట్ర పన్నారు. విశాఖ విమానాశ్రయం కేంద్ర స్థానంగా.. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ నిర్వాహకుడు, టీడీపీ నేత హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి ద్వారా ఈ కథ నడిపించారు. ఆయనతో విమానాశ్రయ భద్రతాధికారి వేణుగోపాల్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా వాడుకుని తమ పన్నాగాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఉపక్రమించారు. ఏడాది క్రితమే నిందితుడు శ్రీనివాసరావును రెస్టారెంట్ వెయిటర్ ముసుగులో విమానాశ్రయంలోకి ప్రవేశపెట్టారు. ఎయిర్‌పోర్టులో ప్రవేశించేందుకు అవసరమయ్యే ఎంట్రీ పాస్ లేకుండానే శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో మాటు వేశాడు. కుట్రలో భాగంగానే మూడు నెలల క్రితం విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు స్పష్టమవుతోంది. దీన్ని ఎవరు చేశారు...? ఎలా చేశారు? అనేది అంతుచిక్కకుండా జాగ్రత్త పడ్డారు. అందువల్లే సీసీ కెమెరాల ఫుటేజీలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి నియంత్రణలో ఉన్నాయి? అన్న హైకోర్టు ప్రశ్నలకు పోలీసులు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. కెమెరాలు పనిచేస్తే బండారం బట్టబయలు.. విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర ఆధారసహితంగా వెంటనే బట్టబయలయ్యేదని పోలీసువర్గాలే చెబుతున్నాయి. హత్యాయత్నం జరిగిన అక్టోబరు 25వతేదీన నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయంలో ప్రవేశించడం, అతడికి సహకరించిన మరికొందరి చర్యలు, వీఐపీ లాంజ్‌వద్ద నిందితుడి ప్రవర్తన, అదను చూసి కత్తిదూయడం, ఆ వెంటనే నిందితుడికి సహకరించినవారి స్పందన మొదలైన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యి కేసులో కీలక ఆధారాలు వెంటనే లభించేవి. వారిని విచారిస్తే ఈ కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల బండారం బహిర్గతమయ్యేది. ఈ పరిణామాలను ముందుగా ఊహించే మూడు నెలల ముందు నుంచే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని ఓ రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
కృష్ణాజిల్లా, ఎర్రబాలెం(మంగళగిరి): మండలంలోని ఎర్రబాలెంలో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని బండివారి వీధి సెంటర్లో ప్రధాన రహదారి వెంట ఉన్న ఇండి క్యాష్ ఏటీఎం నగదు చోరీ చేయడానికి దుండగులు విఫలయత్నం చేశారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి చొరబడి సీసీ కెమెరాలను పగులకొట్టారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఏటీఎంలో నగదు తీసుకునేందుకు వచ్చిన ఖాతాదారులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
‘నిఘా’.. పక్కా..
సాక్షి, నేలకొండపల్లి: విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు.. పిల్లల కదలికలను నిరంతరం తెలుసుకునేందుకు.. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని హాస్టల్లో జరిగిన బాలుడి హత్య ఉదంతంతో రాష్ట్ర యంత్రాంగం కదిలింది. సంక్షేమ వసతి గృహాల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని వసతి గృహాల్లో ఏర్పాటు చేయగా.. మిగిలిన వాటిలోఅమర్చే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలో మొత్తం 77 ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. అందులో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 50 కాగా.. 27 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వాటన్నింట్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సీసీ కెమెరాల ద్వారా విద్యార్థుల రోజువారీ దైనందిన పరిస్థితులను తెలుసుకోవడమే కాకుండా వారు అనుసరిస్తున్న పద్ధతులు, అధికారులను మానిటరింగ్ చేసే అవకాశం ఉండడంతో వార్డెన్లపై మరింత బాధ్యత పెరగనుంది. హాస్టల్‌కు ఆరు చొప్పున.. జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 50 ఉండగా.. ఇప్పటికే 28 వసతి గృహాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా బీసీ వసతి గృహాలు మెట్రిక్ 20, పోస్టు మెట్రిక్ 7 ఉండగా.. వాటిల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వసతి గృహానికి 6 చొప్పున అమరుస్తున్నారు. విద్యార్థులతోపాటు వార్డెన్లు, అధికారుల పనితీరును రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా అల్పాహారం, ట్యూషన్, రాత్రి భోజనం, చదువు, నడవడిక, ఆట, పాటలు, విద్యార్థుల మధ్య మనస్పర్థలను సీసీల ద్వారా ఉన్నతాధికారులు నేరుగా మానిటరింగ్ చేయనున్నారు. అలాగే వార్డెన్లు సకాలంలో హాజరువుతున్నారా.. లేదా.. విద్యార్థులతో ఎలా ఉంటున్నారు. వసతి గృహాల్లో ఉన్నారా.. లేదా.. అనే అంశాలను పరిశీలించనున్నారు. దీనికితోడు హాస్టళ్లలో జిల్లా అధికారులు తనిఖీలు చేస్తున్నారా.. లేదా.. అనే విషయాలను ఉన్నతాధికారులు నేరుగా సీసీ కెమెరాల ద్వారా తెలుసుకోనున్నారు. -
కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
హైదరాబాద్: కరుడుగట్టిన ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ తెలిపారు. సోమవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సైబరాబాద్ క్రైమ్ డీసీపీ జానకి షర్మిల, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ సురేందర్‌తో కలసి వివరాలు వెల్లడించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్లు చంద్రబాబు, సుధీర్, సత్యనారాయణ, టి.శ్రీనివాస్, ఏఎస్ఐ రవీందర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు సత్తయ్య, ప్రవీణ్ కుమార్, దశరథ్, రాంకుమార్లను కమిషనర్ ప్రశంసించారు. వివరాలు... అనంతపురం జిల్లాలోని గుల్జారీపేట్కు చెందిన పఠాన్ మహబూబ్‌ఖాన్ అలియాస్ పఠాన్ అలియాస్ పఠాన్ జహీర్‌ఖాన్(42) చాం ద్రాయణగుట్టలోని బాబానగర్‌లో నివాసముంటున్నాడు. రెండు దశాబ్దాలుగా చోరీలకు పాల్పడుతున్నాడు. నిందితుడి వద్ద నుంచి 87 తులాల బంగారు నగలు, రెండు కిలోల 160 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్, రాచకొండ, సూర్యాపేట, బెంగ ళూర్లలో 20 కేసులు, ఆంధ్రప్రదేశ్ 11, తెలంగాణ 22, కర్ణాటకలో 28 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 10 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2005లో ఎల్బీనగర్, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశా రు. ఆ తర్వాత ఆరేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. చోరీ చేసిన సొత్తును చార్మినార్, బెంగళూర్‌లోని శివాజీనగర్‌లో విక్రయించేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. విలాసవంతమైన జీవితం గడిపేవాడు. ఉదయం పూటే చోరీలు.... తాళం వేసి ఉన్న ఇళ్లపై పఠాన్ రెక్కీ నిర్వహిస్తాడు. ఉదయం 9 గంటల సమయంలో ఇంటికి చేరుకుంటాడు. వీ ఆకారంలో ఉండే రాడ్, స్క్రూ డ్రైవర్‌ను ఎవరికీ కనిపించకుండా తన వెంట తెచ్చుకుంటాడు. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి అందినకాడికి నగలు, నగదు చోరీ చేసి ఉడాయిస్తాడు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో క్లూస్ టీం సేకరించిన వేలిముద్రల ద్వారానే చోరీలకు పాల్పడింది పఠాన్‌గా నిర్ధారించారు. అతడు 9 సెల్ ఫోన్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో తాళం పగులగొట్టి 47 తులాల ఆభరణాలను పఠాన్ చోరీ చేశాడు. చోరీ కేసుల్లో పఠాన్ ముగ్గురు సోదరులు, ఇద్దరు బావ మరుదులు నిందితులుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎవరికి వారే చోరీలు చేస్తుంటారని, రక్త సంబంధీకులు, బంధువుల్లో ఎవరిని ఎవరూ నమ్మరు. ఎవరు, ఎక్కడ నివాసముంటున్నారనే విషయాన్ని కూడా చెప్పుకోరు. పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం వారి భార్యలు కోర్టులను ఆశ్రయిస్తారు. తాళం వేస్తే పీఎస్‌లో సమాచారమివ్వండి... ఇళ్లకు తాళం వేసి పండుగ సెలవుల్లో ఎవరైనా ఊళ్లకు వెళితే సంబంధిత పీఎస్‌లో సమాచారమివ్వాలని కమిషనర్ సజ్జనార్ తెలిపారు. విలువైన ఆభరణాలు ఇంట్లో పెట్టవద్దని, బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇళ్ల ముందు సీసీ కెమెరా అమర్చుకోవాలని సూచించారు. సైబరాబాద్ పరిధిలో గతంలో 5 వేల కెమెరాలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 50 వేలకు పెరిగిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సాంకేతిక సీసీ కెమెరాలపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. -
సీసీ కెమెరాలకు అనారోగ్యం..!
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలకు అనారోగ్యం పాలయ్యాయి. అధికారులు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేయడంలో చూపిన శ్రద్ధ వాటి వినియోగంపై లేకపోవడంతో నిధులు వృథాగా అయ్యా యి. పీహెచ్‌సీల్లో కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ద్వారా సిబ్బంది రాకపోకలు, పనితీరు, గైర్హాజరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు కొంత మెరుగైన వైద్యం అందించవచ్చనే ఐటీడీఏ ఆశయం నీరుగారుతోంది. ప్రభుత్వం నక్సల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2012–13లో ప్రభుత్వం ఐటీడీఏ అదీనంలోని గిరిజన ఇంజినీరింగ్ విభాగం ద్వారా గిరిజనులకు పీహెచ్‌సీల్లో అందుతున్న వైద్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీ లించడం, సిబ్బంది సమయపాలన పాటించేలా చేయడంతోపాటు వారి గైర్హాజరును నివారించడం ద్వారా గిరిజనులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఉమ్మడి జిల్లా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీలకు రూ.4.65 లక్షలు కేటాయించారు. ఇందులో ఒక్కో పీహెచ్‌సీకి రూ.15 వేలు వెచ్చించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ పీహెచ్‌సీకి ద్వారం గుండా రాకపోకలు సాగిస్తున్న వారిని వారిని గుర్తించే విధంగా ఏర్పాట్లు చేశారు. పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు సీసీ కెమెరాల రికార్డింగ్ సిస్టంను కంప్యూటర్లకు అనుసంధానం చేయలేదు. దీంతో దంతన్‌పల్లి మినహా మిగతా పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా దర్శనం ఇస్తున్నాయి. ఫలితంగా అధికారుల పట్టింపు లేమితో గిరిజనుల అభివృద్ధికి వెచ్చించిన రూ.4.65 లక్షలు వృథాగా మారాయి. ముందు చూపు లేమి..? పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో ముందు చూపు లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఐఏపీ నిధులు విడుదల కాగానే సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో చర్యలు తీసుకున్నారు. కానీ సీసీ కెమెరాలు ఏర్పాటుకు అనువైన పరిస్థితుల్లో ఆయా పీహెచ్‌సీల్లో ఉన్నాయా లేదా అని ఆలోచించనట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమయ్యే కంప్యూటర్లు పూర్తి స్థాయిలో ఉన్నవి లేనిది గుర్తించ లేకపోయారు. 31 పీహెచ్‌సీల్లో కంప్యూటర్లు ఉన్నా అందులో ఎన్ని ఉపయోగంలో ఉన్నాయనేదీ అధికారులకు పూర్తి స్థాయి సమాచారం లేదు. పలు పీహెచ్‌సీల్లో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలావరకు పూర్తి స్థాయిలో ఉపయోగంలో లేవని వైద్యాధికారులు అంటున్నారు. పీహెచ్‌సీల్లో వైద్యుల పని తీరు, సమయ పాలన, సిబ్బంది గైర్హాజరు తదితర అంశాలు ఐటీడీఏ పీవో గాని, ఉన్నత వైద్యాధికారులు వారి కార్యాలయాల నుంచి పరిశీలించాలన్నా ఆన్లైన్ సౌకర్యం కచ్చితంగా ఉండాలి. ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న చాలా పీహెచ్‌సీలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పీహెచ్సీలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు సిబ్బంది పనితీరును పరిశీలించడానికి అవకాశం లేకుండా పోతోంది. పూర్తి స్థాయిలో ఉపయోగపడని పనులకు అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించడంపై గిరిజనులు మండిపడుతున్నారు. అవే నిధులు గిరిజనుల ఆరోగ్యంపై ఖర్చు చేస్తే గిరిజనులకు మేలు జరిగేదని అంటున్నారు. పూర్తి స్థాయి చర్యలు తీసుకొని పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని కోరుతున్నారు. -
'షూ'ట్ కేసు
గజ దొంగలు పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు.ఈ దొంగ ఏకంగా కావేరీ నీళ్లు తాగించాడు.ఇతని చేతిలో విద్యను చూస్తే చోరత్వాన్ని ఒక కళగా ఎందుకు చెబుతారో అర్థమవుతుంది.తాళాలు పగలగొట్టడంలో ఉన్న లాఘవం కష్టపడి పని చేయడంలో లేదు.అందుకే దొరికిపోయాడు. జైల్లో కార్పొరేషన్ నీళ్లు తాగుతున్నాడు.దొంగతనానికి అలవాటు పడిన తోడేలు పదే పదే తిరిగి వస్తుంది.2017 ఫిబ్రవరి 19. మధ్యాహ్నం.హైదరాబాద్. బండిమెట్.‘సబ్‌మెరైన్ మీద తెలుగులో తీసిన ఫస్ట్ సినిమా అట. పదండి వెళ్దాం’ అని కుటుంబాన్ని మేట్నీకి బయల్దేరదీశాడు రత్నాకర్.మల్టీప్లెక్స్‌లో చూపించాలని కాస్త ఇంటి ఆడపిల్లలకు కాలక్షేపంగా ఉంటుందని నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న ప్రసాద్స్‌కు తీసుకువెళ్లాడు. భార్యా ఇద్దరు కూతుళ్లు సినిమాను ఎంజాయ్ చేశారు.సాయంత్రం ఏడు గంటలకు అందరూ తిరిగి వచ్చారు. గేటు తీసుకుని లోనికి అడుగుపెడుతుంటే గుండె ఝల్లుమంది.తాళం విరగ్గొట్టి ఉంది. తలుపులు ఓరగా వేసి ఉన్నాయి.అంతే. అందరూ ఒక్కసారిగా లోపలకు అడుగు పెట్టారు.‘చోరీ... చోరీ జరిగింది’ అని మెల్లగా గొణిగాడు రత్నాకర్ షాక్‌లో పెదాలు కదిలిస్తూ. ‘మొత్తం 55 తులాలు ఎస్.ఐ.గారు. పిల్లల పెళ్లిళ్ల కోసం నోరూ కడుపూ కట్టుకుని దాచాం. అన్నీ పోయాయి’ అని ఏడుస్తూ ఉంది రత్నాకర్ భార్య. పెళ్లికెదిగిన ఆడపిల్లలు ఈ హఠాత్ పరిణామంతో బిక్కచచ్చి ఉన్నారు. రత్నాకర్ సాయం ఆశిస్తున్నట్టుగా ఎస్.ఐ వైపు చూస్తున్నాడు. ‘కంగారు పడకండి. దొంగల్ని పట్టుకుంటాం’ అన్నాడు ఎస్.ఐ.పోలీసులు ఇలాగే చెప్తారు... వాళ్లు దొంగను పట్టి రికవరీ చేయకపోతే కుటుంబం చాలా కష్టాల్లో పడుతుంది అని అందరూ బెంబేలెత్తుతున్నారు.ఇరుగూ పొరుగూ కూడా పోగయ్యారు.విశాలంగా ఉన్న వీధి అది. మధ్యాహ్నం పూట కావడంతో పెద్దగా సంచారం లేదు. అందుకని దొంగ పని సులువయ్యింది. ఎవరి కంటా పడకుండా చోరీ చేసుకు వెళ్లాడు.‘మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా?’ అడిగాడు ఎస్.ఐ.లేదన్నట్టు తలాడించాడు రత్నాకర్.‘సిసి కెమెరాల ఫుటేజ్ మొత్తం తీయండి’ అన్నాడు పోలీసులతో. పోలీసులు సిసి కెమెరాల ఫుటేజ్ మీద దృష్టి పెట్టారు.రత్నాకర్ ఇంటి సమీపంలో ఉన్న సిసి కెమెరాల ఫీడ్ పరిశీలించారు. అనుమానితుడి కదలికలు రికార్డు అయ్యాయి. ఆ రోజు మధ్యాహ్నం 2.12 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి దయానంద్ ఇంట్లోకి ప్రవేశించినట్లు, 2.23 నిమిషాలకు బయటకు వచ్చినట్లు రికారై్డంది. ‘అంటే 11 నిమిషాలే అతడు లోపల ఉన్నాడా’ అన్నాడు ఎస్.ఐ.‘అవును సార్’ అన్నాడు కానిస్టేబుల్.‘కేవలం 11 నిమిషాల్లో గ్రిల్స్, తలుపులు, బీరువా పగులగొట్టి ఉడాయించాడంటే ఇతను ప్రొఫెషనల్’ అన్నాడు ఎస్.ఐ.ఘటనాస్థలిని మరోసారి పరిశీలించారు. గేటు దగ్గర బీడీముక్క కనిపించింది. దాని మీద ‘శివాజీ బీడీ’ అని లేబుల్ ఉంది.‘సార్.. ఈ బీడీలు కేవలం కర్ణాటకలోనే లభిస్తాయి. మన ప్రాంతంవి కావు’ అన్నాడు కానిస్టేబుల్.దీంతో నేరం చేసిన వ్యక్తి కర్నాటక వాడై ఉంటాడని అర్థమైంది. కాని ఈ ఒక్క క్లూతో దొంగను పట్టుకోవడం సాధ్యం కాదు. దొంగను వెతకాలి. అందుకని మరిన్ని సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలించే పనిలో పడ్డారు. వేట మొదలైంది.చోరీ జరిగిన బండిమెట్ దగ్గరి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న కెమెరాల ఫుటేజ్‌ను అంగుళం కూడా వదలకుండా జల్లెడ పట్టారు పోలీసులు.రత్నాకర్ ఇంట్లో అడుగుపెట్టిన మనిషి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లినట్టు గుర్తించారు. అతడిని గుర్తు పట్టడం ఒక విధంగా సులువైంది. ఆ సులువుకు కారణం అతడు వేసుకున్న బూట్లు. నల్లగా ఎత్తుగా బరువుగా ఉన్న ఆ బూట్ల వల్ల అతడు ఈడ్చినట్టుగా నడుస్తున్నాడు. మనిషి పొట్టివాడు కావడం వల్ల పొడవు కనిపించడానికి అతడా షూలను ఉపయోగిస్తుండొచ్చని పోలీసులు అనుకున్నారు. ట్యాంక్‌బండ్ వద్ద నిందితుడు ఓ ఆటోడ్రైవర్‌తో సంభాషించినట్లు రికార్డు అయ్యింది.‘ఆ ఆటోనంబర్ జూమ్ చేసి డ్రైవర్ని పట్టుకొని రండి’ అన్నాడు ఎస్.ఐ.అందుకు రెండు రోజులు పట్టింది. డ్రైవర్ పేరు యాదయ్య.‘ఇతను నీ ఆటో ఎక్కాడా?’ అనడిగాడు ఎస్.ఐ.‘లేదు సార్. శివాజీ బీడీ కహా మిలేగా అని అడిగాడు. ఆ బీడీలను నేను వినలేదు. తెలియదని చెప్పాను’‘తెలుగు మాట్లాడలేదా?’‘హిందీయే మాట్లాడాడు. కాని అది హైదరాబాదీ హిందీ కాదు’ అన్నాడు.వెంటనే పోలీసులు నిందితుడి ఫొటోను కర్ణాటక పోలీసులకు పంపారు. ఎలాంటి వివరాలు దొరకలేదు. ఐదేళ్ళ కాలంలో నగరంలో నమోదైన ఈ తరహా నేరాలు, అరెస్టు అయిన నిందితుల ఫొటోలతో పోల్చి చూసినా దర్యాప్తు ముందుకు కదల్లేదు. ‘ఈ దొంగ కావేరీ నీళ్లు తాగించేదాకా వదిలిపెట్టేట్టు లేడే’ అని ఒక కానిస్టేబుల్ విసుక్కున్నాడు. రత్నాకర్ గతంలో ఆ ప్రాంతంలో ఓ టైపు ఇన్స్టిట్యూట్ నిర్వహించాడు. అదే ప్రాంతానికి చెందిన రాజు అక్కడ టైపు రైటింగ్ నేర్చుకోవడంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. మార్కెట్ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న రాజు దగ్గరకు రోజూ వచ్చే రత్నాకర్ తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి మాట్లాడటంతో పాటు సీసీ కెమెరాల నుంచి సేకరించిన ఫొటోలు, చోరీ సమయంలో దొంగ ధరించిన బూట్ల గురించి చెప్పేవాడు. రాజు ఆ ఫొటోల సెట్ ఒకటి తన దగ్గర పెట్టుకున్నాడు. బూట్ల గురించి పదే పదే చర్చ వచ్చేది కాబట్టి ఆ బూట్లను కూడా గుర్తు పెట్టుకున్నాడు. ఓపక్క పోలీసుల దర్యాప్తు సాగుతుండగానే 2017 మే 3న నిందితుడు రాజుకే తారసపడ్డాడు.కోళ్లకు మరిగిన తోడేలు పదే పదే అక్కడికే వచ్చినట్టుగా దొంగతనాలకు అలవాటు పడ్డ దొంగ మళ్లీ సిటీకి వచ్చాడు. ఫిబ్రవరిలో చోరీ చేసి వెళ్లినవాడు మళ్లీ జూన్‌లో వచ్చాడు. నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేసి అనువైన ఇళ్ళను వెతుక్కుంటూ సికింద్రాబాద్ ప్రాంతానికి వచ్చాడు. క్లాక్‌టవర్ వద్ద ఉన్న రాజు ఇతణ్ణి చూశాడు.పొట్టిగా ఉన్న మనిషి... పొడుగ్గా కనిపించడానికి వేసుకున్న మందమైన బూట్లు.. అవే కదలికలు... ఫుటేజ్‌లో చూసిన పోలికలు..రాజు ఆలస్యం చేయలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.కానిస్టేబుల్ లక్ష్మణ్ మఫ్టీలో క్షణాల్లో అక్కడకు చేరుకున్నాడు.‘ఎక్కడా?’ అడిగాడు లక్ష్మణ్.రాజు చూపించాడు.‘సడన్‌గా పట్టుకుంటే వాడు పారిపోయే ప్రమాదం ఉంది. లేదా మన మీద అటాక్ చేయవచ్చు’ అన్నాడు కానిస్టేబుల్.క్షణాల్లో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.కానిస్టేబుల్ సీసీ కెమెరాల్లో నమోదైన ఫొటోని తీసుకొని దొంగ దగ్గరకు వెళ్లాడు.‘మిస్టర్. ఇతన్ని మీరెక్కడైనా చూశారా. ఇతను చనిపోయాడు. ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ డబ్బులు ఇవ్వాలి’ అన్నాడు.‘ఇది నేనే. నేను చనిపోవడం ఏంటి’ అన్నాడు దొంగ.‘ఒక్కసారి ఇన్సూరెన్స్ ఆఫీసుకు వస్తే క్లారిటీ వస్తుంది’ అని స్కూటర్ ఎక్కించుకున్నాడు.ఆ స్కూటర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు దారి తీసింది.దొంగను క్షణాల్లో పోలీసులు చుట్టుముట్టారు. గజదొంగ మహ్మద్ ఇక్బాల్ జిలానీది కర్ణాటకలోని హుబ్లీ. ఆ ప్రాంతంలో 35 నేరాలు చేసి, ఏడు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయి ఉండటంతో ఎనిమిదేళ్ళుగా పరారీలో ఉన్నాడు. 2000లో హుబ్లీ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మకాం మార్చి అక్కడా చోరీలు చేశాడు. అప్పుడప్పుడు హైదరాబాద్‌లోని నాంపల్లి దర్గాకు వచ్చి వెళ్ళే నేపథ్యంలో సిటీతో పరిచయం ఏర్పడింది. వృత్తిరీత్యా టైర్లకు పంక్చర్లు వేసే ఇతగాడు తన ప్యాంటు లోపల పంక్చర్ రాడ్ పెట్టుకుని సంచరించేవాడు. దాంతోనే నిమిషాల్లో ఎలాంటి తాళమైనా పగులకొట్టేవాడు. రాజు ఇచ్చిన సమాచారంతోనే ఇక్బాల్‌ను అరెస్టు చేసి మొత్తం 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రాజుతోపాటు పోలీసు సిబ్బందినీ సన్మానించిన పోలీసులు... ప్రతి పౌరుడూ రాజు మాదిరిగా బాధ్యతతో వ్యవహరిస్తే ‘సేఫ్ సిటీ’ ఎంతో దూరం ఉండదని వ్యాఖ్యానించారు. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో (హైదరాబాద్) -
వెతకబోయిన కత్తి చేతికి దొరికి..!
సాక్షి, సిటీబ్యూరో: ఇష్టం లేని వివాహం చేసుకోవడంతో పాటు తనను నిర్లక్ష్యం చేస్తోందనే కక్షతో కన్న కూతురి పైనే కత్తి కట్టిన మనోహరాచారి ఆమెపై దాడి చేసేందుకు ఉపయోగించిన కత్తిని చోరీ చేసి తీసుకువచ్చాడు. ఈ కేసుకు సంబంధించి కీలకాధారాలైన సీసీ కెమెరా ఫుటేజ్‌లను ఎస్సార్‌నగర్ పోలీసులు సేకరించారు. ఎర్రగడ్డ ప్రాంతంలో గత బుధవారం తన కుమార్తె మాధవిపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు మనోహరాచారిని తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. హత్యాయత్నానికి రెండు రోజుల ముందు నుంచి మనోహరాచారి ముభావంగా ఉండటంతో పాటు విపరీతంగా మద్యం తాగుతున్నాడు. గత బుధవారం ఉదయం మాధవికి ఫోన్ చేసి వస్త్రాలు ఖరీదు చేసుకోవడానికి ఎర్రగడ్డకు రావాలని సూచించాడు. అనంతరం అమీర్‌పేటలోని దుకాణం నుంచి నేరుగా బైక్‌పై ఎస్సార్‌నగర్ వెళ్ళిన మనోహరాచారి అక్కడ ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశాడు. అమీర్‌పేటలోని సత్యం థియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలానికి వెళ్లి మద్యం తాగాడు. మద్యం మత్తులోనే మధ్యాహ్నం 3.00 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరిన అతను మాధవిని చంపి తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అక్కడి నుంచి మైత్రీ వనం వైపు వస్తూ.. మైత్రీ వైన్స్ పక్కన ఉన్న ఓ కొబ్బరిబొండాల దుకాణం వద్ద ఉన్న కత్తిని తస్కరించారు. ఈ దృశ్యాలు కొబ్బరి బొండాల దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మాధవి, సందీప్‌లపై దాడి జరిగింది. -
బెల్ట్ బిగించింది
దూరంగా పారిపోయినానేరం పారిపోనివ్వదు.చేసిన పాపం ఊరికే ఉండనివ్వదు.కెలికే మనస్సు ఆరా తీయమంటుంది. ఆ పని కాస్తా పట్టుబడేలా చేస్తుంది.అనుమానానికి మించిన అపాయం లేదు. 2005, ఫిబ్రవరి 9.ఉదయం 8:30.పోలీసు జీపు సైరన్‌తో గుమికూడిన జనాల్లో కదలిక వచ్చింది.ఆ ఇంటి ముందున్న జనం రోడ్డు వైపు తలలు తిప్పారు.జీప్ వచ్చి ఆ ఇంటి ముందాగింది. వచ్చినంత వేగంగా జీపులో నుంచి దిగిన పోలీసులు అంతే వేగంగా ఆ ఇంట్లో అడుగుపెట్టారు. ఎదురుగా కనిపించిన దృశ్యానికి కడుపులో దేవినట్టుగా అయ్యింది వాళ్లకి.ఇంకా పూర్తిగా ఆరకుండా మడుగు కట్టిన రక్తంతో ఒకలాంటి దుర్వాసన వస్తోంది.ఏడెనిమిదేళ్లుంటాయి ఆ పిల్లవాడికి. మూడు పదులు దాటిన ఓ ఆడమనిషి. ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు. ఒళ్లంతా కత్తిగాట్లు ఉన్నాయి. ఆ ఇద్దరినీ అతి కిరాతకంగా చంపేశారు ఎవరో! ఆ గదిలో చుట్టూ చూశారు పోలీసులు. మూలన ఓ బట్టల మూట, పాతబడిన రెండు బెడ్షీట్లు. ఓ మూలన పాత స్టౌవ్, నాలుగైదు గిన్నెలు కనిపిస్తున్నాయి.‘సార్, ఇది మా ఇల్లే సార్. నెల క్రితం ఈ గదిని ఈమెకు అద్దెకు ఇచ్చాను’ అన్నాడు గుంపులో నుంచి వచ్చిన ఓ వ్యక్తి. ‘ఆమె పేరు రేఖ. పిల్లవాడి పేరు బబ్లూ. దగ్గరలో హాస్పిటల్ బిల్డింగ్ కడుతున్నారు. దాంట్లో పనిచేసేది. పిల్లవాడు కూడా ఆమెతో పాటు తిరుగుతూండేవాడు. తనకు ఎవరూ లేరని, భర్త చనిపోయాడని చెప్పింది. పోనీలే పాపం అని గది అద్దెకు ఇచ్చాను’ అన్నాడతను. ఆంబులెన్స్, క్లూస్ టీమ్ వచ్చింది. మార్కింగ్ చేసి, శవాలను ఆంబులెన్స్‌లో తరలించారు పోలీసులు. స్టేషన్లో ఎస్సై ఆలోచనలో ఉన్నాడు.వాళ్లిద్దరిని చంపి వెళ్లిన వ్యక్తి ఎవరో తెలియడం లేదు.ఆ ఏరియాలో సిసి కెమెరాలు లేవు ఏదైనా క్లూ దొరుకుతుందనుకుంటే. దిక్కులేని వారి హత్యల కింద ఈ కేసు మరుగున పడిపోతుందా?కానిస్టేబుల్ వచ్చి పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇచ్చాడు.మెడ, ఛాతీ భాగంలో లోతైన కత్తిపోట్ల వల్ల మరణించారని ఉంది అందులో. ‘ఆ చుట్టుపక్కల వారిని అడిగాం సార్. ఏ వివరాలు తెలియలేదు. గదిలో ఏ ఆధారాలు దొరకలేదు సార్’ అన్నాడు కానిస్టేబుల్.‘ఏ ఆధారం లేకుండా నేరస్తుడు ఈ పని చేశాడంటే అతడు నేరాలు చేయడంలో ఆరితేరిన వాడై ఉండాలి. ఆ నేరస్తుడు ఎవరో.. ఎలా కనిపెట్టడం..?’ ఆలోచనలో పడ్డాడు ఎస్సై. కానిస్టేబుల్‌ను తనతో పాటు రమ్మన్నట్టు సైగ చేసి వెళ్లి జీపులో కూర్చున్నాడు. ఇద్దరూ మళ్లీ ఆ గది వద్దకు వెళ్లారు. అక్కడ ఒక్కో వస్తువును పరిశీలన గా చూశారు. గోడకు ఒక చిన్న పాత సంచి ఉంది. అందులో పిల్లవాడి బట్టలు ఉన్నాయి. గది అంతా ఒకసారి కలియతిరిగి ‘వెళ్దాం పద’.. అన్నట్టు కానిస్టేబుల్ వైపు చూశాడు ఎస్సై.కానిస్టేబుల్ బయటకు నడిచాడు. బయటకు వెళ్లబోతున్న ఎస్సైని ఒక వస్తువు ఆకర్షించింది. అది బట్టల మధ్య ఉన్న స్కూల్ బెల్ట్. తెలుపు, నీలం రంగు చారలతో ఉంది. దగ్గరగా వెళ్లి ఆ బెల్ట్‌ని తీసుకొని చూశాడు. విద్యానికేతన్ స్కూల్ అని ప్రింట్ చేసి ఉంది. ఎస్సై కోసం తిరిగి లోపలికి వచ్చిన కానిస్టేబుల్ వైపు చూస్తూ..‘ఇది స్కూల్ బెల్ట్. ఈ కేసులో ఇదే క్లూ.ఇక్కడికి దగ్గరలో ఈ పేరుతో ఏ స్కూల్ ఉందో వెరిఫై చేయ్!’ అన్నాడు.ఇద్దరూ ఆ బెల్ట్ తీసుకొని గదికి తాళం వేసి బయటకు నడిచారు. ‘సార్! ఇది మా స్కూల్‌కి సంబంధించిన బెల్ట్’ చెప్పింది స్కూల్ ప్రిన్సిపాల్.‘ఈ ఫొటోలో ఉన్న పిల్లవాడు మీ దగ్గర చదువుకుంటున్నట్టు ఎలా తెలుసుకోవచ్చు. ఈ పిల్లవాడి పేరు బబ్లూ’ వివరాలు చెప్పాడుఎస్సై బబ్లూ డెడ్‌బాడీ ఫొటో చూపిస్తూ.‘ఫైవ్ మినిట్స్ సార్! వెరీఫై చేసి చెబుతా!’ అంది ప్రిన్సిపల్.‘సార్ ఆ పిల్లవాడు మా దగ్గరే చదువుతున్నాడు. సెకండ్ క్లాస్. నెల రోజులుగా స్కూల్‌కి రావడంలేదు’ చెబుతూ రిజిస్టర్ ఎస్సై ముందుంచింది ప్రిన్సిపాల్.ఆ రిజిస్టర్లో పిల్లవాడి ఫొటో, వివరాలతో పాటు తండ్రి అని ఉన్న బాక్స్ పక్కన ఓ ఫొటో అతికించి ఉంది. పేరు బిజ్జూ అని రాసుంది.తం్రyì ఫొటోతో పాటు, ఆ రిజిస్టర్లో అడ్రస్ ఉంది. కాని అది హత్య జరిగిన ఇల్లు ఉన్న అడ్రస్ కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న వేరే అడ్రస్. ఆ అడ్రస్ ఉన్న చోటును వెతుక్కుంటూ వెళ్లారు. పోచమ్మ గుడి పక్క సందు, చంపాపేట్.అక్కడ అందరికీ ఆ ఫొటో చూపించారు. ‘సార్! ఇతని పేరు బిజ్జూ. ఇళ్లకు పెయింట్లు వేస్తుంటాడు. కొడుకు, భార్యతో కలిసి ఈ కాలనీలోనే రెండేళ్లుగా ఉండేవాడు. అర్థరాత్రి తాగొచ్చి భార్య, కొడుకును కొడుతుండేవాడు.వాళ్లది బీహార్ అని, చుట్టాలు అక్కడే ఉన్నారని చెప్పేవాడు. కాని ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ లేదు’ అన్నారు అక్కడివాళ్లు.‘ఇతనికి సంబంధించిన వివరాలు ఇంకేమైనా తెలిస్తే మాకు వెంటనే చెప్పండి’ అన్నాడు ఎస్సై.ఆ తర్వాత బిజ్జూ ఫొటోని బీహార్ పోలీస్ట్ స్టేషన్‌కి ఫ్యాక్స్ చేశారు. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది. ‘సార్, మీరు నిన్న వచ్చారు కదా! ఆ బిజ్జూ ఫోన్ చేశాడు. వాళ్ల బంధువులకు ఎవరికో బాగోలేదట. అందుకే బిహార్‌లో ఉన్నారట. అతని భార్య, పిల్లవాడి గురించి అడిగితే బాగున్నారు అని చెప్పాడు సార్!’ అన్నాడు ఫోన్లో సమాచారం చెప్పిన వ్యక్తి. పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు.ఫోన్ నెంబర్ ఆధారంగా బిజ్జూను పట్టుకున్నారు పోలీసులు. నల్లగా పొట్టిగా సిగరెట్లు తాగి తాగి నల్లబడిన పెదాలతో గుంటలు పడిన కళ్లతో అస్థిమితంగా కనిపించాడు.హైదరాబాద్ తీసుకొచ్చాక విచారణ మొదలైంది.‘చెప్పు ఎందుకు చంపావు నీ భార్యా పిల్లలను’‘నేను చంపడం ఏమిటి?’ అన్నాడతను.ఎస్సై అతని ఎదురుగా కొన్ని కాగితాలు పెట్టాడు. వాటి మీద వేలిముద్రలు ఉన్నాయి. కాని అవి ఉత్తుత్తివి అని ఎస్సైకి తెలుసు.‘నీ వేలి ముద్రలు మేచ్ అయ్యాయి.చూడు.నువ్వు తప్పించుకోలేవు’ అన్నాడు.బిజ్జూ నోరు విప్పాడు. బిజ్జూ, రేఖలది బీహార్. రేఖ పెళ్లయి పదేళ్లయ్యింది. పిల్లవాడికి ఐదేళ్ల వయసులో భర్త ప్రమాదంలో చనిపోయాడు. పుట్టింట్లో కొడుకుతో పాటు ఉండేది రేఖ. అక్కడే కొన్నాళ్లకు బిజ్జూతో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌లో తెలిసినవారున్నారని, అక్కడ పనులు సులువుగా దొరుకుతాయని, అక్కడే బతకొచ్చని రేఖకు చెప్పాడు బిజ్జూ. ఆ మాటలను నమ్మిన రేఖ అమ్మనాన్నలను వదిలేసి కొడుకును తీసుకొని హైదరాబాద్ వచ్చింది. చంపాపేట్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. బిజ్జూ ఇళ్లకు పెయింటింగ్ వేసే పనులు చేస్తుండేవాడు. రేఖ ఇంటిపట్టునే ఉండేది. పిల్లవాడిని అదే కాలనీలో ఉండే స్కూల్లో చేర్చాడు బిజ్జూ. తండ్రి స్థానంలో తన పేరు, ఫొటో వివరాలు ఇచ్చాడు. పిల్లవాడు రోజూ స్కూల్కెళుతున్నాడు. బిజ్జూ పెయింటింగ్ పనులకు వెళుతున్నాడు.ఒకరోజు...‘అతనెవరు?’ అడిగాడు బిజ్జూ.‘ఎవరు?’ అడిగింది రేఖ.‘ఇందాక నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి’‘ఏదో అడ్రస్ అడిగితే చెప్పాను’‘అబద్ధం’‘అయ్యో.. అదే నిజం’‘మగావాళ్లు కనిపిస్తే చాలు నవ్వుతూ మాట్లాడతావు’‘అది కూడా తప్పేనా?’‘నన్ను తగులుకున్నది చాలదా. ఇంకా ఎంతమందిని తగలుకోవాలనుకుంటున్నావ్?’ఫట్‌మంటూ దెబ్బ పడింది.ఆరోజున పడ్డ అనుమానం పెనుభూతం అయ్యింది. మద్యానికి అలవాటైన బిజ్జూ పగలు కూడా తాగుతూ పనులు కెళ్లడం తగ్గించాడు. నిజానికి రేఖ మీద కాపలా కోసం ఇంట్లోనే ఉండిపోసాగాడు. కాని ఇల్లు గడవాలిగా. చుట్టుపక్కల తెలిసిన వారి ద్వారా భవన నిర్మాణ కూలీగా పనులకు వెళ్లడం మొదలుపెట్టింది రేఖ. దీంతో బిజ్జూకి ఇంకా అనుమానం పెరిగింది. పని మానేయమని లేకుంటే పిల్లవాడిని చంపేస్తానని బెదిరించేవాడు. ఓ రోజు రాత్రి అన్నంత పని చేయబోయాడు. కూరగాయలు కోసే కత్తితో పిల్లవాడి మీద దాడి చేయబోయాడు. అడ్డం పడ్డ రేఖ బిజ్జూని నెట్టేసి కొడుకును తీసుకొని బయటకు నడిచింది. ఆ రోజు రాత్రి ఇంటి బయటే ఉండిపోయింది. బిజ్జూతో ఉంటే తను, తన కొడుకు బతకడం కష్టమే అనిపించింది రేఖకు. తను పనిచేసే చోట ఒకామె సాయంతో గది చూసుకొని, బిజ్జూ తాగి పడుకున్న సమయంలో కొడుకును తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. బిజ్జూ రేఖ కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆమె పని చేసే చోటుకి వెళ్లాడు. అక్కడ పని మానేసిందని తెలిసింది. రేఖ మరో చోట కూలీ పని చూసుకుంటూ కొడుకును పోషించుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతోంది. నెల రోజుల తర్వాత ఓ రోజు రేఖ ఎక్కడ ఉందో కనిపెట్టిన బిజ్జూ ఆమెను వెంబడించాడు. రాత్రి వరకు ఆ చుట్టుపక్కలనే తిరిగాడు. చుట్టుపక్కల అంతటా సద్దుమణిగాక రేఖ ఇంట్లోకి జొరపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో తల్లీ, కొడుకులిద్దరినీ చంపేసి వెళ్లిపోయాడు. కొద్దిపాటి సామాను, పిల్లవాడి బట్టలు ఇంటి నుంచి వస్తూ వస్తూ తనతో పాటు తెచ్చుకుంది రేఖ. బిజ్జూకు తెలియకుండా ఎక్కడో ఓ మూలన కొడుకుతో హాయిగా బతికేయచ్చు అనుకుంది. తనను కాదని వెళ్లిపోయి మరెవరికో సొంతమవుతుందన్న అనుమానంతో రేఖపై ద్వేషాన్ని పెంచుకున్నాడు బిజ్జూ. ఆ అనుమానంతోనే రేఖ, ఆమె కొడుకు బబ్లూను చంపేశాడు. పోలీసులకు పట్టుబడకూడదని బీహార్ వెళ్లిపోయాడు. తన గురించి పోలీసులకు తెలిసుండే అవకాశమే లేదనుకున్నాడు బిజ్జూ.కాని హైదరాబాద్‌లో పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి మనసు ఆగక ప్రతి నేరస్తుడు చేసినట్టే వివరాల కోసం ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ అతడెక్కడున్నాడో తెలుసుకునే వీలు కల్పించింది. నమ్మకం కోల్పోయిన వ్యక్తి నరకం చూపిస్తాడు నరకం అనుభవిస్తాడు ప్రస్తుతం బిజ్జూ కటకటాల వెనుక ఉన్నాడు. – నిర్మలారెడ్డి -
సీసీ కెమెరాలే కీలకం
హెచ్‌ఈహెచ్ నిజాం మ్యూజియంలో జరిగిన చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నగర సీసీఎస్ పోలీసులు మరోసారి మ్యూజియంలో తనిఖీలు నిర్వహించారు. యాకుత్‌పురా: హెచ్‌ఈహెచ్ నిజాం మ్యూజియంలో జరిగిన చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నగర సీసీఎస్ పోలీసులు మరోసారి మ్యూజియంలో తనిఖీలు నిర్వహించారు. చోరీ జరిగిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలపై ఆరా తీస్తున్నారు. విలువైన వెలకట్టలేని వస్తువులు భద్రపరిచిన మ్యూజియానికి సరైన భద్రతా ఏర్పాట్లు లేనందునే చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మ్యూజియం పరిసరాల్లోని సీసీ కెమెరాలతో పాటు ప్రధాన కూడళ్లు, రహదారులపై ఉన్న సీసీ కెమెరాల పుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎటు వైపు వెళ్లారనే కోణంపై ఆరా తీస్తున్నారు. మ్యూజియంలో విలువైన వస్తువులు ఉన్నా కేవలం టిఫిన్ బాక్స్, టీ కప్పు, సాసర్లు మాత్రమే చోరీకి గురవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోట్ల విలువైన వస్తువులు ఉన్నప్పటికీ... కేవలం వాటిని మాత్రమే తీసుకెళ్లడంపై దర్యాప్తు చేపట్టారు. 15 ప్రత్యేక బృందాల ఏర్పాటు చోరీ ఘటనపై 15 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని మీర్‌చౌక్ ఏసీపీ ఆనంద్ తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మ్యూజియం చుట్టు పక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అదనపు కమిషనర్ (క్రైమ్స్) షికా గోయల్ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో నమోదైన నిందితుల చిత్రాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.–ఆనంద్, మీర్‌చౌక్ ఏసీపీ -
టిఫిన్ బాక్స్, కప్పు సాసర్లు మాత్రమే చోరీ
హైదరాబాద్, యాకుత్‌పురా: హెచ్‌ఈహెచ్ నిజాం మ్యూజియంలో జరిగిన చోరీ కేసులో నగరపోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులు మంగళవారం మ్యూజియాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. మ్యూజియంలోని మూడు గ్యాలరీల్లో ఉన్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖా¯Œన్కు సంబంధించిన ఆభరణాలు, బహుమతులు, వస్త్రాలను పరిశీలించారు. మ్యూజియం భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. వెంటిలేటర్ నుంచి నిందితులు లోపలికి చొరబడినట్లు గుర్తించారు. గ్యాలరీలోని విలువైన వస్తువులు ఉన్నప్పటికీ దొంగలు కేవలం వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, టీ కప్పు, సాసర్, స్ఫూన్లు మాత్రమే ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీ జరిగింది ఇలా.. మ్యూజియం ప్రహరీ పక్కనున్న పురాతన ఇనుప మెట్ల మీదుగా దొంగలు లోపలికి వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియం సమీపంలోని గంగానగర్ నాలా బస్తీ మీదుగా వచ్చిన దుండగులు మ్యూజియం భవనంపై నుంచి మూడో గ్యాలరీ వెంటిలేటర్‌ను తొలగించి తాడు సహాయంతో లోపలికి దిగినట్లు గోడలపై గుర్తులు ఉన్నాయి. గ్యాలరీలోని అల్మారా డ్రాను రాడ్‌తో తొలగించి అందులో ఉన్న డైమండ్, బంగారు టిఫిన్ బాక్స్, బంగారు టీ కప్పు, సాసర్, స్పూన్లను ఎత్తుకెళ్లారు. అదే డ్రాలో వెండి ప్లేట్, గ్లాస్‌తో పాటు ఇతర వస్తువులున్నప్పటికీ వాటిని ముట్టుకోకపోవడం గమనార్హం. సీసీ కెమెరాలో ఇద్దరి ఆనవాళ్లు పోలీసులు సేకరించిన సీసీ కెమెరాల ఫుటేజీల్లో మ్యూజియం వెనకవైపు ఉన్న బస్తీ నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితులిద్దరూ ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉన్నారు. ఓ వ్యక్తి ట్రావెలింగ్ బ్యాగ్ భుజానికి వేసుకొని బైక్ తీసుకెళుతుండగా, మరో యువకుడు వెనక వెళుతున్నట్లు గుర్తించారు. 15 బృందాలతో గాలింపు: షికా గోయల్. నిజాం మ్యూజియంలో చోరీ కేసును చేధించేందుకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు నగర అదనపు కమిషనర్ (సిట్ అండ్ క్రైమ్స్) షికా గోయల్ తెలిపారు. మంగళవారం ఆమె సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, ఇన్చార్జి డీసీపీ రమేశ్ రెడ్డితో కలిసి మ్యూజియాన్ని సందర్శించారు. చోరీ జరిగిన గ్యాలరీని పరిశీలించి మ్యూజియం సిబ్బందిని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. మ్యూజియంలోని 10 సీసీ కెమెరాలతో పాటు కాలనీల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. ఏడో నిజాంకు చెందిన బహుమతులను మూడు గ్యాలరీల్లో భద్రపరిచామన్నారు. ఇద్దరు వ్యక్తులు చోరీలో పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తించామన్నారు. మ్యూ జియం భద్రత పై ట్రస్టు నిర్వాహకులకు సూచనలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. భద్రతా వైఫల్యమే కారణం... మ్యూజియానికి ట్రస్టు నిర్వాహకులు సరైన భద్రత కల్పించనందునే చోరీ జరిగిందని నిజాం మునిమనువడు నజఫ్ అలీఖాన్ అన్నారు. మంగళవారం మ్యూజియాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మ్యూజియంలో ఏడో నిజాంకు వివిధ దేశాల అధినేతలు ఇచ్చిన విలువైన బహుమతులు ఉన్నాయన్నారు. ట్రస్టు నిర్వాహకులు మ్యూజియానికి బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నారు. మ్యూజియం నిర్వహణ సరిగా లేదని, మ్యూ జియంలోకి వెళ్లే చెక్క మె ట్లు శిథిలావస్థకు చేరు కున్నాయని ఆరోపించారు. – నిజాం మునిమనవడు నజఫ్ అలీ ఖాన్ పథకం ప్రకారమేనా.. చార్మినార్/యాకుత్‌పురా: నిజాం మ్యూజియంలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ దొంగలు వాటిని కనీసం ముట్టుకోకపోగా, కేవలం టిఫిన్ బాక్స్,టీ కప్పు, సాసర్, స్పూన్లను మాత్రమే ఎత్తుకెళ్లడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్‌ను బయటి మార్కెట్లో అమ్ముకోలేమని తెలిసినా దానినే తస్కరించడం పట్ల ఎప్పటి నుంచో చోరీకి స్కెచ్ వేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని వివిధ భవనాల నిర్మాణాల కోసం ఉపయోగించిన వెండి, బంగారంతో చేసిన గంపలు, తాపీలు, పలు పరికరాలు, బంగారంతో తయారు చేసిన సింహాసనం కూడా ఇక్కడే. అత్యంత ఖరీదైన బస్రా ముత్యం కూడా మ్యూజియలో కొలువుదీరినా దొంగలు దానివైపు కూడా చూడలేదు. ఎవరో ముందస్తుగా బేరం కుదుర్చుకున్నట్లుగా వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్‌ను మాత్రమే తస్కరించారు. పురానాహవేళీలో 2000 ఫిబ్రవరి 18న నిజాం మ్యూజియం ఏర్పాటయినప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి చోరీ జరగలేదు. విదేశీ పర్యాటకులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పెద్దసంఖ్యలో మ్యూజియాన్ని సందర్శిస్తున్నా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. -
మర్యాద రామన్నలే!
గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైళ్లలో జర్నీ చేసే వారిలో అధిక శాతం మర్యాద రామన్నలే. తొమ్మిది నెలల మెట్రో జర్నీలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నమోదైన కేసులు కేవలం 12కు మించకపోవడంతో ఈ విషయం విస్పష్టమవుతోంది. పకడ్బందీ చర్యలు చేపట్టడంతో మెట్రో ప్రయాణం సురక్షితంగా మారిందని అవగతమవుతోంది. సాక్షి, సిటీబ్యూరో :మహానగరవాసుల ట్రాఫిక్ అవస్థలను దూరం చేసేందుకు మెట్రో రైళ్లను గత ఏడాది నవంబరు 29 నుంచి గ్రేటర్‌వాసులకు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. అత్యాధునిక భద్రతా ఏర్పాట్ల మధ్యన మెట్రో స్టేషన్లు, రైళ్లను ఏర్పాటు చేశారు. సుమారు రూ.100 కోట్ల ఖర్చుతో ఒక్కో మెట్రో స్టేషన్‌ను.. రూ.30 కోట్ల ఖర్చుతో ఒక మెట్రో రైలు (మూడు బోగీలను)ను తీర్చిదిద్దారు. వీటిలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పకడ్బందీగా సీసీ టీవీల నిఘా ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడంతో మెట్రో జర్నీ సురక్షితమైన ప్రయాణాన్ని సిటీజన్లకు సాకారం చేస్తోంది.కాగా నగరంలో ప్రస్తునికి నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో ఇటీవలికాలంలో నిత్యం సుమారు లక్షమంది రాకపోకలు సాగిస్తుండడం విశేషం. కాగా రైళ్లలో ప్రయాణించేందుకు వచ్చేవారు సిగరెట్లు వెలిగించుకునేందుకు లైటర్లు, అగ్గిపెట్టెలను కూడా వెంట తీసుకొస్తే మెట్రోస్టేషన్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సెక్యూరిటీ చెక్ ఇలా.. ⇔ ప్రతీ స్టేషన్లో ఎక్స్‌రే బ్యాగేజ్ స్కానర్లున్నాయి ⇔ డీఎఫ్‌ఎండీడోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌లున్నాయి ⇔ పదికేజీల లగేజినిమాత్రమే మెట్రో జర్నీకి అనుమతిస్తున్నారు ⇔ బ్యాగు నిడివి 60 సెం.మీ పొడవు, 45 సెం.మీ వెడల్పు, 25 సెం.మీ ⇔ ఎత్తున్న బ్యాగులనే జర్నీకి వినియోగించాలని నిబంధనలున్నాయి ఉల్లంఘన కేసులు ఇవీ.. ⇔ ఓ గుర్తుతెలియని వ్యక్తి లైసెన్సు లేని గన్‌తో మెట్రో స్టేషన్లోకి ప్రవేశించడంతో బ్యాగేజీ తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు ⇔ మెట్రో రైలులో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఘటనపై ఓ కేసు నమోదైంది ⇔ మెట్రో స్టేషన్లలో భద్రతా సిబ్బంది, టిక్కెట్ జారీచేసే సిబ్బంది, స్మార్ట్‌కార్డు రీచార్జి చేసే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినందుకు మరో మూడు కేసులు నమోదయ్యాయి ⇔ అత్యవసరం కాకపోయినా అత్యవసరంగా మెట్రో రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బటన్ నొక్కిన వైనంపై మరో కేసు నమోదైంది ⇔ అవగాహన రాహిత్యంతో మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించి ట్రాక్‌పై అనుమతి లేకుండా ప్రవేశించిన ఆరుగురిని భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్నారు నిషేధాలివీ.. ⇔ స్టేషన్లు, బోగీలు, పరిసరాల్లో ఉమ్మి వేయడం, చూయింగ్‌గమ్ ఊయడం, సిగరెట్లు తాగడం, పాన్ నమలడం ⇔ మెట్రో రైలు పరిసరాల్లో ఆల్కహాల్ తాగవద్దు ⇔ రైలులోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయొద్దు ⇔ వస్తువులను స్టేషన్లు, బోగీల్లో మరచిపోకుండా జాగ్రత్తగా ఉండాలి ⇔ ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో నిషేధిత ప్రాంతాల్లో కూర్చోవద్దు ⇔ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు ⇔ పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషేధం ⇔ ప్రమాదకర వస్తువులు,అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్ పరిసరాలు, బోగీల్లోకి తీసుకురావద్దు ⇔ ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోవద్దు ⇔ ప్లాట్‌ఫాంపై రైలుకోసం వేచిఉండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి ముందుకు రావద్దు ⇔ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బలవంతంగా రైలు డోర్లు తెరవరాదు. డోర్లకు ఆనుకొని నిల్చోరాదు ⇔ చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో విడిచిపెట్టవద్దు ⇔ స్టేషన్, బోగీ పరిసరాలను పాడుచేసిన వారు శిక్షార్హులు.. ఇలా తదితర నిషేధాజ్ఞలు ఉన్నాయి. -
ఏడేళ్ల బాలుడి కిడ్నాప్
హైదరాబాద్: నగరంలో మరో బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. గాంధీ, నిలోఫర్ ఆసుపత్రుల నుంచి శిశువుల కిడ్నాప్ ఘటనలు మరువక ముందే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మరో ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల ముసుగులో ఇద్దరు మహిళలు ఓ ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి ఉడాయించారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా ఇద్దరు మహిళలు బాలుడిని తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఉపాధి కోసం నగరానికి... ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సంజు, దిలీప్ భార్యాభర్తలు. ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి బండ్లగూడలో ఉంటున్నారు. వీరికి కుమారుడు ఆయుష్ (7), కూతురు (10) సంతానం. కొంతకాలం క్రితం దిలీప్ అనారోగ్యంతో మృతి చెందాడు. స్వీపింగ్ పని చేసుకుంటూ సంజు తన పిల్లలను పోషించుకుంటోంది. కాన్పూర్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చిన సంజూకు అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు పరిచయమయ్యారు. టిఫిన్ కోసం వెళ్లొచ్చేసరికి... సోమవారం ఆ మహిళలకు తన పిల్లలను అప్పగించిన సంజు టిఫిన్ కోసం స్టేషన్ బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళలు బిస్కెట్లు కొనిస్తామంటూ బాలుడిని బయటకు తీసుకువెళ్లారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడం, ఆయుష్ కనిపిం చకపోవడంతో సంజు రైల్వే పోలీసులను ఆశ్రయించింది. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీ సులు ఆ కిలాడీ లేడీలే బాలుడిని కిడ్నాప్ చేసినట్టు నిర్ధారించుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు బాలుడిని విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
జేబు దొంగ పర్స్‌ను కొట్టేసి.. సీసీ కెమెరాలను చూసి
-
వైరల్: దొంగలించాడు.. చిలిపిగా తప్పించుకున్నాడు!
ముంబై: సీసీ కెమెరాలతో నేరాలు తగ్గించవచ్చని, అందరూ తమ వీధుల్లో, వ్యాపార సంబంధిత షాపుల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకోని సహకరించాలని హైదరాబాద్ పోలీసులు ఎన్నో రోజులుగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము సైతం అనే కార్యక్రమం ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నారు. గత నెలలో ఓ వృద్ధురాలు రూ.30లక్షలు పోగట్టుకుంటే సీసీ కెమెరాల సాయంతోనే కేసు చేధించారు. అయితే తాజా వీడియో చూస్తే సీసీ కెమెరాలు లేని వారు వెంటనే ఏర్పాటు చేసుకుంటారు. అవును ముంబై పోలీసులు ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియో సీసీ కెమెరాల అవసరం ఏంటో మరోసారి తెలియజేసింది. ఇప్పటి వరకు నేరస్థులు గుర్తించడానికి ఉపయోగపడిన కెమెరాలు.. నేరాలు చేయకుండా కూడా ఉపయోగపడుతాయని ఈ వీడియోతో స్పష్టమైంది. జన సమూహం ఉన్న షాపులో ఓ జేబు దొంగ పర్స్‌ను కొట్టేసి.. అక్కడి సీసీ కెమెరాలను చూసి భయంతో తిరిగిచ్చేసి చిలిపిగా తప్పించుకున్నాడు. సీసీ కెమెరాను చూసిన ఆ పిక్‌పాకెటర్ జంకుతూ దండం పెడుతూ మరీ ఆ పర్స్ ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. ఈ వీడియోనే ప్రజల్లో సీసీ కెమెరాల అవగాహన కోసం ముంబై పోలీసులు‘ వీడియో ఫన్నీగా ఉంది. కానీ నిజంగా అయితే పరిణామాలు కాస్త సీరియస్‌గా ఉంటాయి’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు సైతం జిఫ్ ఫైల్స్‌తో సమాధానమిస్తూ షేర్ చేస్తున్నారు. -
తప్పించుకోలేరు!
వనపర్తి క్రైం: దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, గొడవలు చోటుచేసుకున్నా ఆ పరికరాల సహాయంతో ఇట్టే పట్టేసుకోవచ్చు.. ఇప్పటికే ఎన్నో కేసుల్లో కీలక సమాచారం సేకరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో ఆర్థిక నేరాలు, దొంగతనాలు, ఇతర ఘటనలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. వనపర్తి జిల్లావ్యాప్తంగా కొత్తగా 190 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే వ్యాపారులు, ఇతర ప్రైవేట్ వ్యక్తులు సైతం సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు సూచనలు ఇస్తున్నారు. వందమందితో సమానం ఆర్థిక నేరాలు, దొంగతనాలపై జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రత్యేకంగా దృష్టిసారించడంతో ప్రజలకు భద్రతపై నమ్మకం ఏర్పడింది. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులకు సమానమని పోలీసులు భావిస్తున్నారు. అందుకే జి ల్లాకేంద్రంలోని ప్రధాన కేంద్రాల్లో వీటి ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీ సుకుంటున్నారు. ఇందులో భాగంగానే వనపర్తి జిల్లాలో 190 సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలో 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు సహకరించాలి.. సీసీ కెమెరాలతో నేరాలను చాలా వరకు కట్టడి చేయవచ్చు. నేరం చేస్తే వెంటనే దొరికిపోతారు. జిల్లాకేంద్రం అంతా సీసీ నిఘూ కిందకు తెçస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వ్యాపార కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రధాన కాలనీల్లో ఏర్పాటు చేసుకోవాలి. కేసుల పరిశోధనలో సీసీ కెమెరాలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పెబ్బేరు 50, కొత్తకోటలో 60, ఆత్మకూర్‌లో 20, గోపాల్‌పేటలో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.– వెంకటేశ్వర్లు, సీఐ, వనపర్తి నేరాలు తగ్గుముఖం.. çసీసీ కెమెరాల ఏర్పాటుతో జిల్లాలో కొంత వరకు దొంగతనాలు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. నేనుసైతం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతంలో వనపర్తి జిల్లాకేంద్రంలో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ టీవీలతో దొంగతనాలను అరికట్టడంతోపాటు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్ష్యాలుగా మారుతున్నాయి. విజువల్స్ ఆధారంగా ప్రమాదం ఎలా జరిగింది.. ఎప్పుడు జరిగిందనే అంశాలు తేలిగ్గా తెలిసిపోతున్నాయి. సీసీ కెమెరాలతో చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. వాహనాలు దొంగించినా వాటి నంబర్ల ఆధారంగా పోలీసులు పట్టుకుంటున్నారు. ఫలితంగా తప్పు చేస్తే దొరికిపోతామన్న భయం దొంగల్లో నెలకొంది. కిడ్నాప్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారు సైతం వెనక్కి తగ్గుతున్నారు. సీసీ టీవీలకు ఎస్పీ కార్యాలయంలో కమాండింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. పెరిగిన పెట్రోలింగ్ వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతిఒక్కరూ ఆరుబయట, మిద్దెలపైనే పడుకుంటారు. దీంతో ఇళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. దొంగతనాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్‌లో పిక్‌పాకెటింగ్ జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘూ ఉంచారు. పెట్రోలింగ్ ద్వారా ఇప్పటి వరకు దొంగ తనం చేసే ఆరుగురిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఒకవైపు కార్డెన్ సెర్చ్, పెంట్రోలింగ్ తనిఖీలు చేపట్టడంతో భద్రతపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. -
చిరిగిన టాప్ ఆధారంగా..
నాగోలు: తన భార్యకు వైద్యం చేయించేందుకు నగదుతో నగరానికి వచ్చిన వ్యక్తి బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రూ.3.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన రాంచంద్రయ్య రైతు. గత నెల 25న అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు వైద్యం చేయించేందుకు రూ. 3.20 లక్షల నగదును బ్యాగులో పెట్టుకుని సూర్యాపేటలో ఎర్టిగా కారు ఎక్కారు. ఎల్బీనగర్ రింగురోడ్డులో ప్రయాణికులు దిగుతుండగా కారు డ్రైవర్ హడావుడిలో డబ్బులు ఉన్న రాంచంద్రయ్య బ్యాగును కిందకు దించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత రాంచంద్రయ్య, అతని భార్య కారు దిగారు.నగదుతో ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో డ్రైవర్‌ను నిలదీయగా ఎల్బీనగర్ రింగురోడ్డులోనే దింపినట్లు చెప్పడంతో వెనక్కు వచ్చి చూడగా బ్యాగ్ కనిపించలేదు. అదే చౌరస్తాలో ఉన్న ఆటో డ్రైవర్ జంగయ్య ఎవరూ లేకపోవడంతో బ్యాగ్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టించిన సీసీ కెమెరాలు సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించిన పోలీసులు బ్యాగును తీసుకెళ్తున్నట్లు కనిపించినప్పటికీ ఆటో నెంబర్ కనిపించకపోవడంతో ఆటోపై ఉన్న గ్రీన్‌కలర్ స్టిక్కర్, చినిగిన రంద్రం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్ పరిధిలోని 45 సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి నిందతుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 3.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి డీసీపీ నగదు రివార్డు అందజేశారు. సమావేశంలో ఎల్బీనగర్ డీఐ పృథ్వీదర్‌రావు, ఎస్ఐలు అవినాష్‌బాబు, లక్ష్మీనారాయణ, సిబ్బంది శివరాజ్, ఏఎస్ఐ బోస్, ఎల్లయ్య, దేవానంద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
యాప్‌తో ఆటకట్టు
కర్నూలు: లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్) ద్వారా పోలీసులు జిల్లాలో తొలిసారిగా ఓ దొంగను గుర్తించి అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగర శివారులోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని శ్రీరామ కాలనీలో నివాసముంటున్న సీతారామయ్య రెండు వారాల క్రితం ఇంటికి తాళం వేసి అనంతపురం వెళ్లాడు. ఆయన కోరిక మేరకు ఇంట్లో ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాను ఏర్పాటు చేశారు. దొంగ ఇంట్లోకి దూరగానే కంట్రోల్ రూమ్‌లో బజర్ మోగింది. ఘటన స్థలాన్ని సమీపిస్తుండగానే పోలీసు వాహనం సైరన్ శబ్దాన్ని దొంగ గుర్తు పట్టి గోడదూకి పారిపోయాడు. ఈనెల 8న నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇంటి యజమాని సీతారామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 457, 380 రెడ్ విత్ 511, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బుధవారపేటకు చెందిన పాత నేరస్తుడు కాశెపోగు అశోక్‌ను నిందితుడిగా గుర్తించారు. మంగళవారం కృష్ణానగర్ జంక్షన్లో తిరుగుతుండగా బ్లూ కోల్ట్సŠ, క్యూఆర్టీ సిబ్బంది అరెస్ట్ చేశారు. కంట్రోల్ రూమ్ తనిఖీ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పై అంతస్తులో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఎస్పీ గోపీనాథ్ జట్టి మంగళవారం తనిఖీ చేశారు. కమాండ్ కంట్రోల్లో ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అదనంగా రెండు సీసీ కెమెరాల మానిటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎస్పీలు బాబుప్రసాద్, ఖాదర్ బాషా, సీఐలు డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, గుణశేఖర్, ఎస్ఐ తిమ్మారెడ్డి ఉన్నారు. -
సెల్‌ఫోన్ దుకాణంలో చోరీ
చౌటుప్పల్(మునుగోడు) : మండల కేంద్రంలోని చిన్నకొండూరు చౌరస్తాలో ఇటీవల ఏర్పాటు చేసిన ఎంఎం సెల్‌ఫోన్ దుకాణంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఈ దొంగతనం ఏ అర్ధరాత్రో జరుగలేదు. జన సంచారం బాగా ఉన్న పదిన్నర గంటలకే దొంగలు తమ పనిని మొదలు పెట్టారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణ యజమాని సొప్పరి శంకర్ వేరే ప్రాంతంలో ఉన్న షాపును ఇటీవలనే ఈ చౌరస్తాలోకి మార్చాడు. తను తీసుకున్న మడిగె మూడంతస్తులు ఉన్నప్పటికీ అందులో వేరే దుకాణాలు ఏర్పాటు చేసే విధంగా లేకపోవడంతో మడిగె మొత్తం వీరి ఆధీనంలోనే ఉంది. యజమానితోపాటు పని వాళ్లు సైతం ఒకేసారి బయలుదేరుతారు. అందులో భాగంగా గత రాత్రి విపరీతమైన చలి కారణంగా తొమ్మిదిన్నర ప్రాంతంలో దుకాణా న్ని మూసేసి వెళ్లిపోయారు. ఉదయం పది గంటల ప్రాంతంలో దుకాణం తెరిచిన తర్వాత దొంగతనం విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అం దించారు. దొంగలుపై అంతస్తు నుంచి వచ్చి డోరు ను పగులగొట్టి దుకాణంలోనికి ప్రవేశించారు. తమ వెంట తెచ్చుకున్న గ్లౌజులను చేతులకు వేసుకోవడంతో పాటు దుకాణంలో ఉన్న పాత కవర్లు, ద్విచక్ర వాహనం హెల్మెట్‌ను తలకు ధరించారు. మరో కవర్లును కాళ్లకు వేసుకున్నారు. చాలా విలువైన సామ్సంగ్, వీవో, రెడ్మీ కంపెనీలకు చెందిన 20 సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. పనిలో పనిగా అక్కడే ఉన్న 30 వేల విలువైన ల్యాప్‌టాప్, కౌంటర్లో ఉన్న 39వేల నగదును ఎత్తుకెళ్లారు. సెల్ఫోన్ల విలువ సుమారుగా 2.50లక్షల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. ఎక్కడ కూడా తమ వేలి ముద్రలు నమోదు కాకుండా పక్కాగా వ్యవహరించారంటే వారు ఆరితేరినవారుగా పలువురు అనుమానిస్తున్నారు. దొంగతనం దృశ్యాలన్నీ సీసీకెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలాన్ని రాచకొండ కమిషనరేట్ క్రైమ్ అడిషనల్ డీసీపీ సలీమా, స్థానిక ఏసీపీ రామోజు రమేష్, సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ నవీన్‌బాబులు సందర్శించారు. ప్రింగర్‌ప్రింట్‌లో కొంతమేరకు ప్రింట్లను సేకరించారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నవీన్‌బాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫోన్లోనే సీసీ కెమెరా లైవ్..
నగరంలో నేరాల నియంత్రణ, బాధితులను ఆదుకోవడం, సత్వరం స్పందించడం, సమన్వయం, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించడం వంటి చర్యల కోసం పోలీసు అధికారిక యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఆధునిక హంగులు జోడిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు తమ సెల్ఫోన్లోనే కోరుకున్న ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను లైవ్‌లో చూసే ఆస్కారం కల్పిస్తున్నారు. ‘సీసీ కెమెరా లైవ్’ పేరుతో అందుబాటులోకి వచ్చే ఈ సౌకర్యం ద్వారా ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు తన సెల్ఫోన్ల ద్వారానే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని తెలుసుకోవచ్చు. న్యూ ఇయర్ డే అయిన జనవరి 1 నుంచి ఈ ‘లైవ్’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సాక్షి, సిటీబ్యూరో: చిరాగ్ అలీ లైన్‌లోని ఓ చోట ఘర్షణ జరుగుతోందని అబిడ్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ ప్రాంతంలో పరిస్థితి స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రస్తుతం సిబ్బందిని పంపాల్సి ఉంటుంది. వారు అక్కడకు వెళ్ళి, పరిశీలించి, సమాచారం అందించేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అధికారులు తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఓ నిరసన కార్యక్రమం నేపథ్యంలో అధికారులు కొందరు సిబ్బందిని మోహరించారు. అయితే ధర్నాకు ఊహించిన సంఖ్య కంటే ఎక్కువ మందే వచ్చారు. ఈ విషయం క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది తెలిపే వరకు ఉన్నతాధికారులకు తెలియదు. దీంతో అదనపు సిబ్బంది మోహరింపునకు జాప్యం జరుగుతోంది. ఇలాంటి ఇబ్బందుల్ని తొలగించేందుకు నగర పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. పోలీసు అధికారిక యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఆధునిక హంగులు జోడిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఇవి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే..ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు తమ సెల్ఫోన్లోనే కోరుకున్న ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను లైవ్‌లో చూసే ఆస్కారం కలుగుతుంది. ‘సీసీ కెమెరా లైవ్’ పేరుతో అందుబాటులోకి వచ్చే దీంతో ఉన్నతా«ధికారులు సైతం ఎప్పటికప్పుడు తన సెల్ఫోన్ల ద్వారానే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని తెలుసుకోవచ్చు. సత్వర స్పందన, సమన్వయం, సమాచారమార్పిడి కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఈ తరహా హంగుల్ని చేరుస్తున్నారు. న్యూ ఇయర్ డే అయిన జనవరి 1 నుంచి ఈ లైవ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. క్రైమ్ మ్యాపింగ్‌లో హంగులు జోడిస్తూ... నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకే సమయంలో ఒకే తరహా నేరాలు జరుగవు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయన్నది తెలుసుకోవడం ద్వారానే వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధిష్టంగా తెలుసుకోవడానికి ‘క్రైమ్ మ్యాపింగ్’లో ‘థిమేటిక్ క్రైమ్ మ్యాప్’ విభాగం ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఠాణాలు, సెక్టార్లు, బీట్లు తెలిసేలా సరిహద్దుల్నీ పొందుపరిచారు. దీన్ని మరింత అప్డేట్ చేస్తూ.. ఆయా ఠాణా పరిధిలో ఉన్న సున్నిత ప్రాంతాలు, మతపరమైన కట్టడాలు, సమస్యాత్మక ప్రాంతాలను మార్కింగ్ చేశారు. మ్యాప్ మీదే ‘సీసీ కెమెరాలు’... సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను మ్యాప్ పైకి తీసుకువచ్చారు. కొన్ని రకాలైన నేరాలు జరిగినప్పుడు అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఆ క్రైమ్ సీన్‌కు సమీపంలో, దారితీసే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం కొంత సమయం పడుతోంది. అలాంటి జాప్యానికీ తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ఈ యాప్‌లోని ‘క్రైమ్ రాడార్’లోకి ప్రవేశిస్తే చాలు. ఈ నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయనేది చూపిస్తుంది. మ్యాప్ పైన కనిపించే కెమెరా మార్క్ వద్ద క్లిక్ చేస్తే.. అది ఎక్కడ ఉందనే చిరునామా సైతం పాప్అప్ రూపంలో ప్రత్యక్షమవుతుంది. తాజా దృశ్యాలూ కనిపించేలా... పోలీసుస్టేషన్ పరిధిలో చోట ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయనో, పెద్ద ప్రమాదం జరిగిందనో పోలీసుస్టేషన్‌కు సమాచారం వచ్చినప్పుడు ఉన్నతాధికారులు ఘటనాస్థలిలో పరిస్థితుల్ని ఎంత త్వరగా తెలుసుకోగలిగితే.. పరిస్థితుల్ని చక్కదిద్దే చర్యల్ని అంతం వేగంగా చేపట్టే అవకాశం ఉంటుంది. దీనికోసం కేవలం సిబ్బంది పైనే ఆధారపడకుండా ‘సీసీ కెమెరా లైవ్’ సదుపాయం యాప్‌లో కల్పించారు. క్రైమ్ రాడార్‌లో కనిపించిన కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే చాలు.. దాని ఫీడ్ లైవ్‌లో కనిపించనుంది. ఈ సౌకర్యం యాప్ ద్వారా సిబ్బంది, ఉన్నతాధికారుల సెల్ఫోన్లలోకూ అందుబాటులోకి వస్తోంది. అన్ని స్థాయిల్లో సిబ్బందికీ, అన్ని ప్రాంతాల్లో ఉన్న ఫీడ్‌ను లైవ్‌లో చూసే సౌకర్యం కల్పిస్తే... కొన్నిసార్లు ఇబ్బందులకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా సిబ్బంది, అధికారులు విధులు నిర్వర్తించే ప్రాంతాల ఆధారంగా వారి ఫోన్లలోకి లింకేజ్ ద్వారా అందుబాటులో ఉంచాల్సిన లైవ్ ఫీడ్లను నిర్ణయిస్తున్నారు. ఉన్నతాధికారులకు మాత్రం నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలతో లింకేజ్ ఇస్తారు. -
చోరీకి వచ్చి.. కెమెరా కంటికి చిక్కి..
బొమ్మనహళ్లి: అత్యంత ఖరీదైన సైకిల్‌ను చోరీ చేసేందుకు వచ్చిన దొంగను స్థానికులు సీసీ కెమెరా ద్వారా పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈఘటన బెంగళూరులోని సుబ్రహ్మణ్య నగరలో ఈనెల 3న చోటు చేసుకుంది. సుబ్రహ్మన్య నగర పోలీసుల కథనం మేరకు.. ఓ దొంగ ఈ నెల 3న సుబ్రహ్మణ్య నగరలో చోరీ కోసం రెక్కీ నిర్వహించాడు. వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఖరీదైన సైకిల్ అతని కంటపడింది. సాయంత్రం 5.55 గంటల సమయంలో కట్టర్ సహాయంతో తాళం తొలగించి సైకిల్‌ను చోరీ చేస్తుండగా యజమానులు సీసీ కెమెరాద్వారా గుర్తించి కేకలు వేస్తూ బయటకు వచ్చారు. భయాందోళనకు గురైన దుండగులు అక్కడే కారు కింద దాక్కున్నాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు తన పేరు కల్లెష్ అని ఒక సారి, మల్లెష్ అని మరోసారి చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అంతా క్షణాల్లో జరిగిపోయింది
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఆదివారం సాయంత్రం జరిగిన దిగ్భ్రాంతికర ఘటన స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ఊహించనివిధంగా ప్రాణాలు కోల్పోయింది. ఖార్గార్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతురాలు సుజాత పూరి(34)గా గుర్తించారు. నెరుల్‌లో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆమె స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా నియంత్రణ కోల్పోయి బండి ఒక్కసారిగా పక్కకు జారిపోవడంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. సుజాత వెనుకే వచ్చిన క్రేన్‌తో కూడిన వాహనం ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కికడ్కడే ప్రాణాలు వదిలారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు చలించిపోయారు. క్రేన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రోడ్డు సరిగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందనన్న వాదనలు విన్పిస్తున్నాయి. -
అంతా క్షణాల్లో జరిగిపోయింది
-
వైరల్ వీడియో: కళ్లు తిరిగి పట్టాలపై పడ్డాడు ఆపై...
సాక్షి : తన తోటి ప్రయాణికులు సమయ స్ఫూర్తితో వ్యవహరించటంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. ఆస్ట్రేలియాలోని విన్యార్డ్ రైల్వే స్టేషన్లో సోమవారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 2 గంటల సమయంలో రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ ప్రయాణికుడు ఉన్నట్లుండి కళ్లు తిరిగి పట్టాలపై పడిపోయాడు. వెనకాలే ఉన్న వృద్ధుడు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. సరిగ్గా పట్టాల మధ్యలో పడి అతను స్పృహ కోల్పోయాడు. ఇంతలో దూరం నుంచి రైలు కూత వినిపించింది. పక్కనే ఉన్న ప్రయాణికులంతా అతన్ని కాపాడాలంటూ అరిచారు. అది గమనించిన ఓ అధికారి రెండు చేతులెత్తి రైలును ఆపాల్సిందిగా సైగ చేశారు. రైలు ఆగిందో లేదో స్పష్టత లేదుగానీ.. ప్రయాణికుల్లో అరుగురు పట్టాల మీదకు దూకి అతన్ని కాపాడేశారు. తలకు చిన్నగాయంతో అతను బయటపడటం విశేషం. స్టేషన్‌లోని సీసీపుటేజీ వీడియోలో ఘటన అంతా నిక్షిప్తం కాగా, ఆ వీడియో బయటకు రావటంతో వైరల్ అవుతోంది. ప్రమాదకర పరిస్థితులను సైతం లెక్క చేయకుండా అతన్ని కాపాడిన ప్రయాణికులను పలువురు అభినందిస్తున్నారు. -
యాసిడ్ దాడిపై ముమ్మర దర్యాప్తు
♦ ఆందోళనకరంగా బాధిత వైద్యుడి ఆరోగ్యం ♦ సీసీ కెమెరాల ఫుటేజీలను ♦ పరిశీలించిన పోలీసులు అల్లిపురం(విశాఖ దక్షిణ) : నగరంలో ఓ వైద్యుడిపై మంగళవారం రాత్రి జరిగిన యాసిడ్ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా.. యాసిడ్ దాడిలో గాయపడ్డ పిల్లల వైద్యుడు బాలాజీ భూషణ్ పట్నాయక్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఆయన ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిసింది. కుడి కన్ను కూడా పాక్షికంగా దెబ్బతినడంతో బుధవారం ఉదయం మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఆయనను సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరిగి సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. బాధితుడి నాలుక, వీపు భాగం యాసిడ్ దాడిలో దెబ్బతిన్నట్టు సమాచారం. అతని ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిందితుల కోసం గాలింపు యాసిడ్ దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని వనరులు వినియోగించుకుంటున్నారు. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారే వరకు సంఘటన స్థలానికి సమీపంలోని ఎంవీవీ రామ్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరా ఫుటేజీలు, సెవెన్ హిల్స్ హాస్పటల్లో బాధితుడిని ఎవరెవరు కలిశారు, తదితర విషయాలను పరిశీలించారు. బుధవారం ఉదయం నుంచి హాస్పటల్ వద్ద దర్యాప్తు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేసినట్టు మహారాణిపేట సీఐ వెంకటనారాయణ తెలిపారు. ఫిర్యాదులో బాధితుడు ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని సీఐ పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కారు ఆపారని, కారు గ్లాసు కిందకి దించి ఏం కావాలని అడిగేలోపే తనపై యాసిడ్‌తో దాడి చేశారని బాధిత వైద్యుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దుండగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నామన్నారు. బాలాజీ భూషన్‌ది ఒడిషా రాష్ట్రం బరంపురం జిల్లా. ఈయనకు భార్య, పాపతో పాటు తల్లి, తమ్ముడు, చెల్లి ఉన్నారు. భార్య, పాపతో కలసి పందిమెట్టలోని జీజీఆర్ అపార్టుమెంట్లో నివసిస్తున్నాడు. వ్యక్తిగతంగా చాలా మంచివాడని, అతనిపై దాడి చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని అతని సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరంలో ఓ వైద్యుడిపై యాసిడ్ దాడి జరగడంపై పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే వృత్తిని సక్రమంగా నిర్వహించలేమని ఆవేదన చెందుతున్నారు. -
కోడి పందేల నిర్వాహకులపై 1,347 కేసులు
మీడియా సమావేశంలో డీజీపీ సాంబశివరావు వెల్లడి సాక్షి, అమరావతి: సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహించిన వారిపై రాష్ట్రవ్యాప్తంగా 1,347 కేసులు నమోదు చేసినట్టు డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో 337, తూర్పుగోదావరి జిల్లాలో 136, కృష్ణా జిల్లాలో 471, విజయవాడ సిటీలో 91, గుంటూరు అర్బన్‌లో 3, గుంటూరు రూరల్‌లో 309 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన గుడివాడ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విజయవాడలో దుండగులు ధ్వంసం చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని అదే స్థానంలో పెట్టిస్తామన్నారు. విగ్రహాన్ని ధ్వంసంచేసిన వారిని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చామని డీజీపీ చెప్పారు. కైకలూరు మండలం ఆటపాక, కలిదిండి మండలం తాళ్లాయి పాలెంలో కొందరు ఫ్లెక్సీలు చించి వివాదం సృష్టించే ప్రయత్నాలు చేశారని డీజీపీ అన్నారు. పథకం ప్రకారం కొన్ని అసాంఘిక శక్తులు కులాలు, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు నాయకుల విగ్రహాలు, సినిమా హీరోల ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్నట్టు గుర్తించామని డీజీపీ చెప్పారు. -
సోదరితో వెళుతున్న యువతికి ఊహించని ఘటన..
రసూల్‌పురా: నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును దుండగులు తెంచుకెళ్లారు. మంగళవారం కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పాతబోయిన్‌పల్లి అంజయ్యనగర్ నివాసి చంద్రకళ ఏడబ్ల్యూహెఓ కాలనీలోని ఓ ఇంట్లో పని చేస్తోంది. మంగళవారం ఉదయం 6.45 గంటల సమయంలో తన సోదరితో కలిసి గన్‌రాక్ ఫేజ్–2 నుంచి ఆ కాలనీకి నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి బైక్‌పై అతివేగం గా దూసుకొచ్చిన ఇద్దరు యువకులు సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఆందోళనకు గురైన మహిళలు ఇద్దరూ రోడ్డుపై నిలిచిపోగా.. వెంటనే బైక్‌పై ఉన్న ఓ యువకుడు చంద్రకళ మెడలోని పుస్తెలతాడును బలంగా లాగాడు. తాడులోని తులం విలువ గల ఒక వరుస మాత్రమే దొంగ చేతిలోకి వెళ్లగా.. మిగిలిన సగం తాడు సూత్రాలతో పాటు కిందపడింది. బాధితురాలి సమాచారం మేర కు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, సమీపంలోని సీసీ కెమెరాల్లోని ఫుటేజీని సేకరించారు. దొంగలు యూనికార్న్ బైక్‌పై వచ్చి స్నాచింగ్‌కు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల్లోని చిత్రాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్నాచింగ్ చేసి బైక్‌పై పారిపోతున్న దొంగలు (సీసీ కెమెరా దృశ్యాలు) -
బిడ్డా.. ఎక్కడ!
కళ్లన్నీ కన్నీళ్లు చేసుకుని కన్నవారి ఎదురుచూపులు ముందుకు సాగని పోలీసుల దర్యాప్తు సిబ్బంది నిర్లక్ష్యమే అపహరణకు కారణమని విమర్శలు కిలాడీ లేడీ కోసం ముమ్మరంగా దర్యాప్తు పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్లు పొత్తి కడుపులో బాధ మెలిపెడుతుంటే.. అంతులేని ఆవేదనను మునిపంటి కింద బిగబట్టి బిడ్డకు పురుడు పోసింది. పట్టుమని పది రోజులైనా కాకుండానే మురిపాలకు దూరమైన బిడ్డను తలుచుకుని ఆ తల్లిదండ్రుల గుండె నీరుగారింది. అడిగో బిడ్డ.. అంటూ కన్నపేగుకు ఆశలు కల్పించిన సీసీ కెమెరా ఫుటేజ్.. 24 గంటలు గడవకుండానే తప్పని తేలడంతో వారి ఆందోళన రెట్టింపైంది. కన్న బిడ్డ కోసం కళ్లన్నీ కన్నీళ్లు చేసుకుని.. కనిపించిన ప్రతి ఒక్కరినీ మా బిడ్డ ఎక్కడంటూ ఆ తల్లిదండ్రుల గుండె ఘోష ఆర్తిగా వేడుకుంటోంది. విజయవాడ (లబ్బీపేట) : చికిత్స కోసం వస్తే.. బిడ్డనే దూరం చేశారు.. ఇప్పుడు బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో.. అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గురువారం అపహరణకు గురైన తమ బిడ్డను పోలీసులు ఎప్పుడు తీసుకొస్తారో అని నిస్సహాయ స్థితిలో వారు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బస్టాండ్‌లో దొరికిన సీసీ కెమెరా విజువల్స్‌తో కీలక ఆధారాలు దొరికాయని, ఇక తమ బిడ్డ తమ చెంతకు చేరతాడని పెట్టుకున్న ఆశలు శుక్రవారం సాయంత్రానికి గల్లంతయ్యాయి. విజువల్స్ తప్పని తేలడంతో తమ బిడ్డ ఎప్పటికి తమ చెంతకు చేరతాడోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సిబ్బంది తీరును నిరసిస్తూ బంధువులతో కలిసి శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎలా ఎత్తుకెళ్లారనేదే ప్రశ్న... నవజాత శిశువులు చికిత్స పొందే స్పెషల్ న్యూ బోర్న్ బేబీ కేర్ యూనిట్లోకి సందర్శకులను ఎవరినీ అనుమతించరు. ఆ విభాగంలో చికిత్స పొందే చిన్నారులందరినీ, లోపల ఉన్న సిబ్బందే పర్యవేక్షించడం, మందులు వేయడం చేస్తుంటారు. అలాంటి విభాగంలోకి గుర్తుతెలియని మహిళ వెళ్లి శిశువును ఎలా అపహరించిందని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అక్కడ వార్మర్లో ఉన్న పసిబిడ్డను తీసుకు వస్తున్న సమయంలో లోపల ఉన్న సిబ్బంది గమనించ కపోవడం వారి నిర్లక్ష్యాన్ని చాటుతోందని చెబుతున్నారు. స్పెషల్ కేర్‌లోని శిశువులకే రక్షణ లేకుంటే, వార్డుల్లోని శిశువుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో వార్డులో ఉన్న శిశువును అపహరించుకుపోయారని, ఇప్పుడు ఏకంగా ఎస్‌ఎన్‌సీయూలో శిశువునే అపహరించడం ఆస్పత్రి భద్రత డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. సిబ్బంది పాత్రపై అనుమానాలు ఎస్‌ఎన్‌సీయూలో పనిచేసే వారంతా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వారిలో శాశ్వత ఉద్యోగులెవరూ లేరు. పసిబిడ్డ అపహరణకు సంబంధించి ఇప్పటికే ఎస్ఎన్సీయూ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యురిటీ గార్డు ముఖర్జీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇతర సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో తిరిగిన కిలాడీ లేడీ ఇంకా ఎవరితోనైనా సన్నిహితంగా మెలిగేదా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ విభాగం నుంచి సిబ్బంది సహకారం లేకుండా శిశువును అపహరించడం సాధ్యం కాదనే అంచనాకు వచ్చారు. మరోవైపు బాధితుల బంధువుల నుంచి సమాచారం ఏమైనా వస్తుందేమోనని ఏసీపీ కంచె శ్రీనివాసరావు వారిని శుక్రవారం విచారించారు. ఈ ఘటనలో నలుగురు వైద్యులు, 14 మంది ఆస్పత్రి సిబ్బంది వైఫల్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వారిపై వేటుపడే అవకాశమున్నట్లు సమాచారం. కలకలం రేపిన మృతదేహం.. పోలీసుల ఉరుకులు, పరుగులు ప్రభుత్వాస్పత్రి పక్కన ఉన్న రైవస్ కాల్వలో శుక్రవారం మధ్యాహ్నం మగశిశువు మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. అపహరణకు గురైన బిడ్డ బంధువులకూ చూపించారు. అయితే ఆ మృతదేహం ఆస్పత్రిలో ప్రసవం అనంతరం మృతి చెందిన మరో శిశువుదిగా గుర్తించారు. ముందుకు సాగని దర్యాప్తు పసిబిడ్డ ఆచూకీ కోసం పది బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా, దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బస్టాండ్‌లో దొరికిన సీసీ కెమెరా విజువల్స్‌ను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు చేపట్టగా, అవి సరికాదని తేలడంతో మరో కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఆస్పత్రి మెయిన్ గేటు ఎదురుగా ఉన్న మందుల దుకాణంలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ దానిలో విజువల్స్ క్లియర్‌గా లేవని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా శిశువును క్షేమంగా పట్టుకుని తీసుకొస్తామని చెబుతున్నా.. సరైన ఆధారాలు లేకపోవడంతో శిశువు ఆచూకీ ఎప్పటికి దొరుకుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. -
చివరికి ఇలా.. తేల్చేశారు!
⇒నీరుగారిన లావణ్య మృతి కేసు ⇒అది రోడ్డు ప్రమాదమేనని సీపీ స్పష్టీకరణ ⇒ఆయన చెప్పిన వివరాల్లోనే ఎన్నో కొత్త ప్రశ్నలు ⇒లాడ్జిలో సీసీ కెమెరా ఫుటేజ్ మాయం ⇒ఎలుకలు కొరికేశాయని నిర్వాహకుల సమాధానం ⇒ఆలయం వెలుపలి ఫుటేజ్ చూపనే లేదు ⇒రికార్డులకెక్కని క్షతగాత్రురాలి స్టేటమెంట్ ⇒లాడ్జి బాయ్ చెప్పిందే ప్రామాణికం ⇒సాధారణ ప్రమాదమే అయితే నిందితుల అరెస్టుకు వారమెందుకు? మందు కొట్టింది నిజం.. అదే మత్తులో ఫోనులో మాట్లాడుతూ కారు నడిపిందీ నిజం.. వెనుక నుంచి మాటిమాటికీ హారన్ కొడుతూ కారును ముందుకూ.. వెనక్కూ నడుపుతూ బైక్‌పై ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం కూడా నిజమే.. కానీ.. కావాలని బైకును గుద్ది హత్య చేశారనడం మాత్రం అవాస్తవమట!.. అది కేవలం మద్యం మత్తులో ఉండగా జరిగిన ప్రమాదమేనట!! సంచలనం సృష్టించిన లావణ్య మృతి కేసును పోలీస్ బాస్‌లు ఇలా తేల్చేశారు. ఆలయం వెలుపల వీడియో ఫుటేజ్‌లు చూడలేదు.. ప్రత్యక్ష సాక్షి, క్షతగాత్రురాలు చెప్పిన విషయాలకూ విలువివ్వలేదు.. లాడ్జి బాయ్ చెప్పినదాన్ని మాత్రం విశ్వసించారు. మొత్తానికి వేధింపులు, కారుతో కావాలని ఢీకొట్టడం.. అన్నవి ఉత్తుత్తి ఆరోపణలేనని తేల్చేశారు. దర్యాప్తులో తేలిన విషయాలంటూ పోలీసు అధికారులు చెప్పిన వివరాల్లోనే.. ఎన్నో కొత్త ప్రశ్నలు తొంగిచూశాయి. వాటికి మాత్రం సమాధానం లేదు. విశాఖపట్నం: డబ్బు, రాజకీయం, అధికారం.. మరోసారి కలిసిపోయాయి. నిర్భయ స్థాయి కేసును కేవలం ప్రమాదం కేసుగా మార్చేశాయి. ఈ నెల 22న వడ్లపూడికి చెందిన మాటూరి లావణ్య కారు ఢీకొట్టడంతో మరణించిన కేసును మద్యం మత్తులో అనుకోకుండా జరిగిన ప్రమాద కేసుగా పోలీసులు తేల్చారు. ఆమెను కొందరు పోకిరీలు వేధించి, వెంబడించి, ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు నెత్తీనోరూ కొట్టుకున్నా.. అబ్బే.. అలాంటిదేమీ జరగలేదని పోలీసులు తమ విచారణలో తేల్చేశారు. అనకాపల్లి నూకాంబిక ఆలయం లోపలి సీసీ కెమెరా దృశ్యాలను చూపించి.. ఆలయం వెలుపల ఎలాంటి వేధింపులు జరగలేదంటున్నారు. ఎస్ఆర్ రెసిడెన్సీ లాడ్జి రూమ్ బాయ్ మాటల ఆధారంగా నిందితులు ఆరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ హోటల్లోనే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చేశారు. సంఘటన రోడ్డు ప్రమాదమేనని అంటున్నప్పుడు, నిందితులెవరో తెలిసినప్పుడు అరెస్ట్ చేయడానికి వారం రోజులు ఎందుకు పట్టిందనే ప్రశ్నకు అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. ప్రత్యక్ష సాక్షి, ప్రమాదంలో గాయపడిన దివ్య చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయంటే జవాబు లేదు. ఇలా ఈ కేసులో అనేక ప్రశ్నలు, అనుమానాలను నివృత్తి చేయకుండానే మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదంగా పోలీసులు నిర్ధారించారు. దివ్య వాంగ్మూలం ఏమైంది? నూకాంబిక ఆలయం బయటే తమకు వేధింపులు మొదలయ్యాయని, తమను వెంబడించి వేధించారని, కావాలనే కారుతో ఢీకొట్టారని మృతురాలు లావణ్య ఆడపడుచు దివ్య ఆ రోజు మీడియాకు వెల్లడించింది. ప్రమాదంలో గాయపడిన ఆమె ప్రత్యక్ష సాక్షి కావడంతో ఆమె మాటలకు ప్రాధాన్యత ఉంది. కానీ ఇప్పుడు అవేవీ పోలీసు రికార్డుల్లో లేవు. తమ విచారణలో ఆమె అలా ఏమీ చెప్పలేదని పోలీసు అధికారులు అంటున్నారు. ఆమెను నయానో భయానో ప్రభావితం చేయడం వల్లే పోలీసులకు నిజాలు వెల్లడించేందుకు వెనకడుగు వేస్తుండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవాలయం వెలుపల ఫుటేజీ ఏదీ? నూకాంబిక ఆలయంలో మొత్తం 22 సీసీ కెమెరాలున్నాయి. ఆలయం లోపల 7 సీసీ కెమెరాలుండగా మిగతా వాటిని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే ఆలయం లోపలి కెమెరాల్లోని ఫుటేజీనే పోలీసులు బయటపెట్టారు. వాటి ప్రకారం.. లావణ్య మధ్యాహ్నం 2.59 గంటలకు ఆలయంలోకి ప్రవేశించింది. ఆమె క్యూ లైన్లో ఉన్నట్లు కామ్-6లో, ప్రసాదం తీసుకుంటున్నట్లు కాామ్-3లో, అమ్మవారిని దర్శించుకున్నట్లు కామ్-1లో రికార్డయ్యింది. ఆలయం అవుట్ గేటు నుంచి బయటకు వస్తున్నట్లు కామ్-4 చూపిస్తోంది. అప్పటికి సమయం 3.31 గంటలు. తర్వాత లావణ్య, మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై వడ్లపూడికి బయలుదేరారు. సాలపువానిపాలెం వద్ద హేమకుమార్ కారు ఢీకొట్టడంతో లావణ్య చనిపోయింది. ఈ దృశ్యాల్లో ఎక్కడా నిందితులు కనిపించలేదు. కానీ బాధితులు సంఘటన జరిగిన రోజు చెప్పిన దాని ప్రకారం లావణ్యను నిందితులు ఆలయం వెలుపల వేధించారు. దీన్ని నిర్థారించాలంటే ఆలయం వెలుపల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాల్సి ఉంది. కానీ వాటిలో ఎక్కడా లావణ్య కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా గత మూడేళ్లలో ఆలయ పరిసరాల్లో ఈవ్ టీజింగ్ కేసు నమోదు కాలేదని స్థానిక పోలీస్ స్టేషన్ రికార్డులు, రూరల్ ఎస్పీ వివరాలను ఉటంకిస్తూ ఆలయంలో ఎలాంటి వేధింపులు జరగలేదని నిర్ధారించామని సీపీ చెప్పారు. లాడ్జిలో ఫుటేజ్‌లను ఎలుకలు కొరికేశాయట! ఆరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిందితులు తమ స్నేహితులతో కలిసి అనకాపల్లి ఎస్ఆర్ రెసిడెన్సీ రూము నెం.315లో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. అక్కడి రూమ్ బాయ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని దీనికి ప్రామాణికంగా తీసుకున్నారు. కాగా బర్మా కాలనీకి చెందిన రాజు అనే వ్యక్తి పేరు మీద 315 రూమ్‌ను తీసుకున్నారని సమాచారం. కానీ పోలీసులు చెప్పిన ఎమిమిది మందిలో రాజు అనే పేరుతో ఎవరూ లేరు. లాడ్జిలో సీసీ కెమెరా ఫుటేజీని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే సీసీ కెమెరాల వైర్లను ఎలుకలు కొరికేశాయని, అందువల్ల అవి 15 రోజులుగా పని చేయడం లేదని నిర్వాహకులు చెప్పారట. అసలు సీసీ కెమెరాల వైర్లను ఎలుకలు నిజంగా కొరికేశాయా?.. ఎలుకల బెడద అంతలా ఉంటే రెసిడెన్సీని ఎలా నడుపుతున్నారు??.. 15 రోజుల నుంచి కెమెరాలు పనిచేయకపోతే ఎందుకు బాగు చేయించలేదు???.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయలేదు. అన్నింటికీ మించి బ్యాక్ ఇన్స్ట్రుమెంట్ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. దాన్ని స్వాధీనం చేసుకుని సాంకేతికంగా విశ్లేషించి ఉంటే మరిన్ని వివరాలు తెలిసేవి. కనీసం సీసీ కెమెరాలు ఎప్పటినుంచి పనిచేయడం లేదో తెలిసేది. మీడియాను ఆధారాలు అడుగుతున్న సీపీ ఇన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకుండానే దర్యాప్తు ముగించడం ఆందోళనకు గురి చేస్తోంది. అదీ కాక లావణ్య కేసులో నిందితులను పట్టుకోవడానికి వారం రోజుల సమయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయ జోక్యం ఉన్నట్లు, సెటిల్మెంట్ జరిగినట్లు ఆధారాలుంటే ఇవ్వమని మీడియాను సీపీ స్వయంగా అడగడం హాస్యాస్పదంగా ఉంది. ఆధారాలు సేకరించి నేరస్తులను పట్టుకోవాల్సిన ఉన్నతాధికారి ఈ విధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. -
సింగిల్ హ్యాండ్ స్నాచర్ !
తెలివి మీరుతున్న గొలుసు దొంగలు బైక్‌పై ఒంటరిగా సంచరిస్తూనే నేరాలు పోలీసులకు అనుమానం రాకూడదనే చిలకలగూడ ఉదంతమే తాజా ఉదాహరణ సిటీబ్యూరో/చిలకలగూడ: నగరంలో స్నాచింగ్స్ నిరోధించడానికి పోలీసులు వేస్తున్న ఎత్తులకు.. స్నాచర్లు పైఎత్తులు వేస్తూ ‘పని’ చేసుకుపోతున్నారు. చిలకలగూడ ఠాణా పరిధిలో బుధవారం జరిగిన గొలుసు దొంగతనమే దీనికి తాజా ఉదాహరణ. ఈ స్నాచింగ్‌కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు గురువారం విడుదల చేశారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో 1.38 నిమిషాల నిడివితో నేరం జరిగిన తీరు రికార్డు అయింది. ఒకటిన్నర నిమిషాల్లోనే స్నాచర్ వృద్ధురాలి మెడలోని సొత్తును తెంచుకెళ్లినట్టు ఇందులో స్పష్టంగా కని పిస్తోంది. ఈ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీ సులు వాహనం నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. దీనికోసం సిటీ ఐటీ సెల్ అధికారులు వీడియో ఎన్‌హ్యాన్స్‌మెంట్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు. ‘జంట’గా వెళ్తే ఆపుతూ... స్నాచర్లను కట్టడి చేసే చర్యల్లో భాగంగా నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. దీంతో రహదారులతో పాటు కొన్ని చోట్ల గస్తీలో ఉంటున్న పోలీ సు సిబ్బంది ‘పాత ఉదంతాల’ ఆధారంగా పని చేస్తున్నా రు. స్నాచింగ్ కేసుల్లో నిందితులు హైస్పీడ్ బైకులు వాడ టం, వాహనంపై ఇద్దరు ఉండటం, ఒకరు డ్రైవ్ చేస్తుంటే, మరొకరు గొలుసు లాగడం... వంటివి గుర్తించిన పోలీ సులు హైస్పీడ్ బైక్స్‌తో పాటు కొన్ని ఇతర బైక్స్ ఇద్దరు వెళ్తుంటే ఆపుతున్నారు. కేవలం ఇలాంటి వాహనచోదకుల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్న క్షేత్రస్థాయి పోలీసులు సాధారణ వాహనాలపై సింగిల్‌గా వెళ్లే వారిని పట్టించుకోవట్లేదు. స్నాచింగ్స్ ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లోనే జరుగుతుండటంతో ఆ వేళల పైనే ‘దృష్టిపెట్టారు’. ఈ ఎత్తుకు పై ఎత్తు వేసి... ఈ విషయాలను పసిగట్టిన ‘చిలకలగూడ స్నాచర్’ పోలీ సుల ఎత్తుకు పై ఎత్తు వేశాడు. ‘సహాయకుడి’తో పని లేకుండా సింగిల్‌గానే రంగంలోకి దిగాడు. హైస్పీడ్ కాని బైక్‌పై సంచరిస్తూ వృద్ధుల్ని టార్గెట్‌గా చేసుకుని పంజా విసిరాడు. వాహనంపై వెళ్తూ స్నాచింగ్ చేయకుండా... టార్గెట్‌ను ఎంచుకున్న తర్వాత వెనక్కు వెళ్లి, వాహనాన్ని కొద్దిదూరంలో ఆపి, వారిని వెంబడిస్తూ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. కేవలం ఒకటిన్నర నిమిషాల వ్యవధిలో పని పూర్తి చేసుకుపోయాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో కాకుండా... మిట్ట మధ్యాహ్నం పంజా విసిరాడు. వృద్ధురాలితో స్నాచర్ పెనుగులాడటం, వృద్ధుడు కింద పడిపోవ డం... ఇంత హడావుడి జరుగుతున్నా అక్కడ ఉన్న స్థానికులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
చిన్నారి పై అకృత్యం...
-
చిన్నారిపై అకృత్యం...
-
చిన్నారిపై అకృత్యం...
సీసీ కెమెరా ఫుటేజీతో బయటపడ్డ దారుణం అరగంటలోనే కేసు విచారణ, నిందితుడి అరెస్టు చార్మినార్: అతడి పేరు మహ్మద్ అక్రం ఖాన్... వయస్సు 46 ఏళ్లు... ఇతనికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కామపిశాచిగా మారాడు. భార్య దగ్గరికి రానివ్వడం లేదని అభం.. శుభం తెలియని ఎల్కేజీ చిన్నారి (4)తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. పాపంపండి అడ్డంగా దొరికి పోయాడు... శాలిబండ ఠాణా పరిధిలోని పూల్‌బాగ్ చున్నీకాబట్టి ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్రం ఖాన్ రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఇతని ఇంట్లో నాలుగు కుటుంబాలు అద్దెకుంటున్నాయి. తన ఇంట్లో అద్దెకుండే ఓ చిన్నారికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చాక్లెట్లు ఎర వేసి ‘పశువు’గా ప్రవర్తిస్తున్నాడు. ఎన్ని రోజులుగా ఇది జరుగుతుందోగాని... తనకు తెలియకుండానే తన ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ తతంగమంతా రికార్డు కావడంతో గరువారం విషయం బయటపడింది. సీసీ కెమెరాలు అమర్చిన భార్య... భర్త మహ్మద్ అక్రం ఖాన్‌పై అనుమానంతో భార్య ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ విషయం భర్తకు తెలియదు. అక్రంఖాన్ రోజూ ఇంట్లో వ్యాయామం చేస్తూ చిన్నారితో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. అయితే, సీసీ కెమెరాల్లోని పుటేజీలను పరిశీలించడం ఎలాగో భార్యకు తెలియకపోవడంతో బస్టాండ్ వద్ద గోడలపై ఉన్న నెంబర్ల ఆధారంగా ఓ సీసీ కెమెరా టెక్నీషియన్‌కు ఫోన్ చేసింది. వెంటనే ఉమర్ బాక్రీ అనే టెక్నీషియన్ రాగా.. అతని సహాయంతో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించింది. అందులోని దృశ్యాలు చూసి నిర్ఘాంతపోయిన ఆమె మౌనంగా ఉండిపోయింది. తెలిసిందిలా... కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా దక్షిణ మండలం పోలీసులు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ సీసీ టీవీ టెక్నీషియన్స్‌కు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా టెక్నీషియన్స్ అనుభవాలను తెలుసుకుంటుండగా... టెక్నీషియన్ ఉమర్ బాక్రీ ఇటీవల తాను మహ్మద్ అక్రంఖాన్ ఇంట్లో చూసిన చిన్నారిపై అకృత్యాలకు సంబంధించిన వీడియో ఫుటేజీ గురించి ప్రస్తావించాడు. అర గంటలోనే... గురువారం మధ్యాహ్నం టెక్నీషియన్ ఉమర్ బాక్రీ ద్వారా ఈ సమాచారం అందుకున్న వెంటనే దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ రంగంలోకి దిగారు. డీసీపీ పర్యవేక్షణలో శాలిబండ పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. నిమిషాల్లో నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు మహ్మద్ అక్రం ఖాన్ నేరం అంగీకరించడంతో ఐపీసీ 377, 363, 366 సెక్షన్ల కింద సుమోటోగా కేసు నమోదు చేసి ఫలక్‌నుమా ఏసీపీని విచారణాధికారిగా నియమించారు. కేసు విచారణ, నిందితుడి అరెస్టును డీసీపీ అరగంటలోనే పూర్తి చేయడం విశేషం. మొదట్లో బుకాయించిన నిందితుడు... విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితున్ని గురువారం దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ వద్దకు తీసుకురాగా... తాను ఎంతో మంచి వాడినని... ఐదుసార్లు నమాజ్ చేస్తానని... రియల్ ఎస్టేట్ దందా తప్పా... ఎటువంటి వ్యాపకాలు లేవన్నాడు. తాను చిన్నారి పట్ల వ్యవహరించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డయిన విషయం తెలి యని నిందితుడు మొదట్లో బుకాయించే ప్రయత్నం చేశాడు. సీసీ పుటేజీలను చూపించడంతో... గతంలో ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదని... ఇక ముందు కూడా చేయనని... ఈసారికి తనను వదిలేయాలంటూ ప్రాథేయపడ్డాడు. -
అదితి.. ఏమైంది!?
నాలుగు రోజులైనా దొరకని జాడ అదృశ్యంపై తండ్రి, బంధువుల అనుమానాలు సీసీ కెమెరాల పుటేజ్ సేకరించనున్న పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు పెదవాల్తేరు: ఆరేళ్ల అదితి గల్లంతు మిస్టరీగా మారింది. డ్రైనేజీలు, గెడ్డలు, సముద్రంలో జల్లెడ పడుతున్నా బాలిక ఆచూకీ శూన్యం. నాలుగు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నా పాప జాడ తెలియక పోవడంతో తండ్రితో పాటు బంధువలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో 10 బోట్లలో 50 మంది జాలార్లు, డ్రైనేజీల్లో వంద మంది జీవీఎంసీ ఏర్పాటు చేసిన సిబ్బంది. రుషికొండ నుంచి ఆర్కె బీచ్ వర కు నేవీ హెలికాఫ్టర్, ఇవి కాకకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మెరైన్ పోలీస్ సిబ్బంది అదితి ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఇంత మంది వెతుకుతున్నా ఎక్కడా జాడ కానరాకపోవడంతో తమ పాపను ఎవరైనా కిడ్నాప్ చేసుంటారేమోనని తండ్రి, బంధువులు సందేహం వెలిబుచ్చారు. ఇదే విషయమై ఆదివారం ఎంవీపీకాలనీ పోలీసులకు తమ అభిప్రాయం తెలిపారు. అదితి తండ్రి శ్రీనివాసరావు, మరో బంధువు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్ఐతో మాట్లాడారు. తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్ చేసుండొచ్చని, ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరారు. ప్రత్యక్ష సాక్షులు లేరు అదితి డ్రైనేజీలో పడిపోవడం ప్రత్యక్షంగా చూసిని సాక్షులు లేరు. ఘటన స్థలంలో స్థానికులను విచారణ చేయగా ఎవరూ చూడలేదని చెప్పడంతో పోలీసులు కూడా చిన్న అనుమానం వ్యక్తం చేశారు. అదితిని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన కారు డ్రైవర్ గుర్నాధంను కూడా విచారించారు. అయితే అదితితో పాటు ట్యూషన్ చదువుతున్న పన్నెండేళ్ల బాలిక ఇచ్చిన సమాచారం మేరకు అదితి డ్రైనేజీలో పడిపోయిందని పోలీసులు స్పష్టం చేసుకున్నారు. ఇదే విషయాన్ని బాలిక తండ్రికి తెలిపారు. పన్నెండేళ్ల పాపకు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు కదా.. కచ్చితంగా డ్రైనేజీలో పడితేనే ప్రత్యక్ష సాక్షి చెబుతుందని పోలీసులు బాధితులకు వివరించారు. ఘటన స్థలం ఎదురుగా సీసీ కెమెరాలు భానునగర్‌లో అదితి చదువుతున్న ట్యూషన్ సెంటర్ ఐఓసీ ఇనిస్టిట్యూట్ భవనం ఎదురుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్దిలపాలెం శాఖ ఉంది. ఈ శాఖ ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. గురువారం రాత్రి 7 గంటల సమయంలో అదితి అదృశ్యమైంది. ఆ సమయంలో విద్యుత్ కూడా లేదు. అయినప్పటికి ఏటీఎంలో ఇన్వెర్టర్ ఉన్నందున వీడియో రికార్డ్ అవుతుంది. ఈ సీసీ కెమెరాలు పుటీజ్లు సోమవారం సేకరించేందుకు ఎంవీపీకాలనీ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయివుంటే అదితి అదృశ్యం మిస్టరి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బ్యాగ్ జాడా లేదు అదితి అదృశ్యమైన సమయంలో ఆమె భుజానికి స్కూల్ బ్యాగ్ ఉంది. డ్రైనేజీలో బ్యాగ్‌తో సహా కొట్టుకుపోతే ఆ బ్యాగు కూడా లభ్యం కాకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం స్కూల్ బ్యాగ్ పొదల్లోనో, రాళ్ల సందుల్లోనో లభ్యమవ్వాలి కదా అని చెప్పుకుంటున్నారు. కొనసాగుతున్న గాలింపు ఆదివారం కూడా అదితి ఆచూకి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. గెడ్డలు, సముద్రంలో విసృ్తతంగా పరిశీలించారు. నేవీ సిబ్బంది సహకారంతో బోట్లపై సముద్రంలో గాలించారు. నేవీ హెలికాఫ్టర్ తీరప్రాంతం రుషికొండ నుంచి ఆర్కె బీచ్ వరకు చక్కర్లు కొట్టి అనువణువు గాలించింది. జీవీఎంసీ కమిషనర్ ప్రవీన్‌కుమార్ పర్యవేక్షణలో గాలింపు చర్యలు జరగుతున్నాయి. అనుమానాలు లేవు అదితి అదృశ్యంపై ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాలు లేవు. ఘటన వద్ద స్థానికులు, బాలికను తీసుకురావడానికి వెళ్లిన డ్రైవర్ కూడ డ్రైనేజీలో పడిపోవడం చూడలేదని చెప్పారు. అయితే కలిసి వచ్చిన పన్నెండేళ్ల పాప అదితి డ్రైనేజీలో పడిపోవడం కళ్లార చూసింది. ఇద్దరూ కలిసి ట్యూషన్ నుంచి బయటకు వస్తుండుగా మ్యాన్‌హోల్ తెరిచి ఉన్న డ్రైనేజీలో పడిపోయిందని ఆ పాప తెలిపింది. అదితి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. - విద్యాసాగర్, సీఐ ఎంవీపీకాలనీ. విశాఖపట్నం సిటీ: ఆరేళ్ల చిన్నారి అదితి జాడ కోసం ఆదివారం రాత్రి వరకూ గాలించినా ఫలితం లేకపోవడంతో సోమవారం రాత్రి వరకూ మరింత విస్తృతంగా గాలించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గాలింపు చర్యలు పూర్తయిన పిదప ఉన్నతాధికారులంతా ఈ నాలుగైదు రోజులుగా చేసిన కసరత్తుపై చర్చించి తదుపరి ఏ కోణంలో దర్యాప్తు చేపట్టాలో నిర్ణయించనున్నారు. ఈ సమావేశంలో వచ్చే అంశాల ఆధారంగా తదుపరి గాలింపు కొనసాగించాలా లేక ఇతర కోణాల్లో దర్యాప్తు మొదలెట్టాలా అనేది నిర్ణయిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 300 మందికిపైగా నిపుణులు ఈ ఆపరేషన్‌లో పాల్గొని అణువణువు గాలిస్తున్నారు. అయినా 72 గంటలు గడచినా అదితి ఆచూకీ కనబడలేదు. నావికాదళ ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు. అదితి జాడ ఎలా అయినా పసిగట్టాలని నేవీ హెలీకాఫ్టర్లు, ఛాపర్లు, మర పడవలు, బోట్లు, సాయంతో గాలింపు తీవ్రతరం చేశారు. జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అదితి కోసం బీచ్‌రోడ్డు అంతా తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం నాటికే ఆమె జాడ తెలుస్తుందని గట్టిగా నమ్మిన జీవీఎంసీ వర్గాలు ఆదివారం కూడా పాప జాడ లేకపోవడంతో మరింత లోతుగా వెదుకుతున్నారు. -
కోటి కొట్టేశారు!
పలు బ్యాంకుల నుంచి క్లోనింగ్ ద్వారా డబ్బు డ్రా చేసిన ముఠా ముంబై కేంద్రంగా సాగిన వ్యవహారం పోలీసులకు చిక్కిన సీసీ కెమెరా ఫుటేజ్‌లు బ్యాంక్ ఎదుట ఖాతాదారుల ఆందోళన హైదరాబాద్: సైబర్ నేరాలకు పాల్పడే ముంబాయికి చెందిన ముగ్గురు సభ్యుల ముఠా.. బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో ఉన్న డబ్బులపై పంజా విసిరింది. ముంబాయిని కేంద్రంగా చేసుకున్న ఈ ముఠా నాలుగు నెలల వ్యవధిలో కొన్ని జాతీయ బ్యాంకులకు చెందిన ఖాతాదారుల అకౌంట్ల నుంచి అక్రమంగా రూ.కోటి వరకు డ్రా చేసింది. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సిండికేట్ బ్యాంకులో ఉన్న 19 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.7 లక్షలు డ్రా చేశారని నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు ఫిర్యాదు అందడంతో నకిలీ ఏటీఎం(క్లోనింగ్) ద్వారా ఈ ముఠా నగదు డ్రా చేసిన విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం కేసును మారేడ్‌పల్లి పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం ఒకటి రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లో సిండికేట్ బ్యాంకు ఖాతాదారులే కాకుండా మరిన్ని బ్యాంకుల ఖాతాదారులు కూడా వీరి బారిన పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.7 లక్షలు డ్రా మారేడుపల్లికి చెందిన విల్సన్స్టాన్లీ పికెట్‌లోని సిండికేట్ బ్యాంక్‌లో ఖాతాదారుడు. ఈయన అకౌంట్లో నుంచి ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ప్రతి రోజు కొంత మొత్తం నగదు డ్రా అవుతూ వచ్చింది. ఇలా రూ. 3 లక్షలు డ్రా అయింది. వెస్ట్‌మారేడుపల్లికి చెందిన ఎంవీ. నర్సింగ్‌రావు కూడ ఇదే బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఈయన అకౌంట్లో నుంచి రూ. 70 వేలు డ్రా అయ్యాయి. రైల్వే ఉద్యోగి అర్జున్‌రావు అకౌంట్లో నుంచి ఈ నెల 2న అర్ధరాత్రి రూ. 25వేలు డ్రా అయ్యాయి. ఇలా దాదాపు 19 మంది పికెట్ సిండికేట్ బ్యాంక్ శాఖకు చెందిన ఖాతాదారుల ఖాతాల నుంచి రూ. 7 లక్షలు డ్రా అయ్యాయి. ఈ మేరకు బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిండికేట్ బ్యాంక్ ఎదుట ఆందోళన డ్రా విషయమై బాధితులు పలుమార్లు పికెట్ సిండికేట్ బ్యాంక్ ఛీప్ మేనేజర్‌ను కలువగా చూస్తాం.. చేస్తాం.. అంటూ సమాధానం రావడంతో బాధితులు ఆగ్రహానికి గురైయ్యారు. ఈ క్లోనింగ్‌కు పాల్పడింది ముంబైకి చెందిన ముఠా అని మీడియాలో వార్తలు వెలువడడంతో బాధితులు శనివారం వెస్ట్‌మారేడుపల్లిలోని పికెట్ వద్ద ఉన్న సిండికేట్ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మారేడుపల్లి ఎస్ఐ రవికుమార్ బ్యాంక్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. కాగా పోలీసుల దర్యాప్తులో ముంబై కేంద్రం నుంచి నిందితులు డబ్బులు డ్రా చేసినట్లు తేలింది. అక్కడి ఏటీఎం ఫుటేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలసి ఈ అక్రమానికి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. వీరు ఆయా బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు రూ.కోటి వరకు డ్రా చేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా ఈ విషయంలో బ్యాంకు అధికారుల స్పందన సరిగా లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు అపహరణపై పూర్తిస్థాయి విచారణ ముంబైకి చెందిన ఏటీఎంల ద్వారానే సిండికేట్ బ్యాంక్ నుంచి డూప్లికేట్ ఎటీఎం (క్లోనింగ్) ద్వారా నగదు డ్రా అయిందని బ్యాంక్ చీఫ్ మేనేజర్ శేషు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. అయితే బాధితుల జాబితా వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. జాగ్రత్తలు ఇలా... Mెడిట్/డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి.దుకాణ యజమానులు సైతం ఎవ రైనా కార్డు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు వారి సంతకాన్ని కార్డుపై ఉన్నదాంతో సరిచూడాలి.{పతి కార్డుకి వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ) నంబర్ ఉంటుంది. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుని, కార్డుపై చెరిపేయాలి.ఆన్లైన్ ద్వారా వ్యవహారాలు సాగించినట్లయితే.. మీరు వినియోగిస్తున్న సైట్ అడ్రస్.. హెచ్‌టీటీపీతోనే ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి. మరి కొన్ని వివరాలకు హైదరాబాద్ పోలీసు వెబ్సైట్ చూడండి. చైనా నుంచి పరికరాల దిగుమతి ఈ తరహా నేరాలు చేస్తున్న వ్యక్తులు హ్యాకింగ్, సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా పరిచయమై ముఠాగా ఏర్పడి క్రెడిట్, డెబిట్ కార్డుల డేటాను తస్కరించి, నకిలీ కార్డుల్ని తయారు చేస్తారు. ఏ ప్రాంతానికి చెందిన వారు అక్కడే డేటా చోరీ, క్లోన్డ్ కార్డుల వినియోగం చేస్తే దొరికిపోతామనే భయంతో మరో ప్రాంతానికి కార్డుల్ని పంపిస్తారు. దీనికోసం ఆన్లైన్ ద్వారా చైనా పరికరాలను తెప్పిస్తున్నారు. చేతిలో ఇమిడే స్కిమ్మర్లతో... అరచేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్లతో పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తదితర చోట్ల పనిచేసే వారి ద్వారా వినియోగదారుడి కార్డు డేటాను సేకరిస్తారు. అలాగే ఏటీఎం సెంటర్లలోనూ మినీ స్కిమ్మర్లు, కెమెరాలు ఏర్పాటు చేసి దాని ద్వారా డేటా, సీక్రెట్ నంబర్‌ను కనుక్కొంటారు. ఈ డేటా ఆధారంగా నకిలీ కార్డులను సృష్టించి వినియోగ దారుల డబ్బు కొల్లగొడతారు. -
భక్తుడిలా వచ్చి అమ్మవారి మంగళసూత్రం చోరీ
సీసీ కెమెరా ఫుటేజీలో దొంగ కదలికలు సైదాబాద్: భక్తుడిలా గుడిలోకి వచ్చిన దొంగ అమ్మవారి మెడలోని 8 తులాల బంగారు మంగళసూత్రం అపహరించుకెళ్లాడు. సైదాబాద్ ఠాణా పరిధిలోని జీవనజ్యోతి సంఘం ఆవరణలోని శ్రీజయదుర్గాదేవి గుడిలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... తలకు మంకీ క్యాప్ పెట్టుకొని, భుజానికి సంచి తగిలించుకొని ఉదయం 9.30కి బైక్‌పై ఓ యువకుడు అమ్మవారి ఆలయానికొచ్చి పూజలు చేశాడు. పూజారి అతనికి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు ఇచ్చాడు. ఈ క్రమంలో పూజారికి రూ. 100 ఇచ్చి టెంకాయ తీసుకురమ్మని బయటకు పంపాడు. తర్వాత గుడిలో అటు ఇటు తిరిగి ఎవరు లేరని నిర్థారించుకొని గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి మెడలోని మంగళ సూత్రాన్ని తెంచుకుని వాహనంపై జారుకున్నాడు. కొబ్బరికాయ తీసుకుని గుడిలోకి వచ్చిన పూజారికి అమ్మవారి మెడలో మంగళసూత్రం కనిపించలేదు. దీంతో ఆలయ కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా దొంగ అమ్మవారి మంగళసూత్రం తెంచుకొని వెళ్లినట్టు స్పష్టంగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గుడిలో చోరీ జరగడంతో పూజారి అమ్మవారి ఆలయంలో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. -
దొంగలను పట్టించిన సీసీ టీవీ
దొడ్డబళ్లాపురం : ఇక్కడి సినిమా రోడ్డులో ఉన్న వర్ధమాన్ జువెలర్స్ దుకాణంలో గత శుక్రవారం యజమాని కళ్లుగప్పి చాకచక్యంగా లోపల జొరబడి సుమారు ఒకటిన్నర కేజీ బంగారం చోరీ చేసిన ఖతర్నాక్ మహిళా దొంగలు నలుగురు ఆ దుకాణంలో చోరీకి ముందు సమీపంలోని పలు దుకాణాల్లో చోరీకి ప్రయత్నించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగు చూసాయి. పట్టణ పరిధిలోని కొంగాడియప్ప రోడ్డులో ఉన్న పలు నగల దుకాణాలకు కస్టమర్ల రూపంలో వచ్చిన మహిళా దొంగలు నలుగురూ దుకాణం నిర్వాహకుల కళ్లుగప్పి నగలు చోరీకి తీవ్రంగా ప్రయత్నించారు. కుదరకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వర్ధమాన్ జువెల్లర్స్‌లో చోరీ జరిగాక అనుమానం వచ్చిన దుకాణాల వారు తమ సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా మహిళలు చోరీకి ప్రయత్నించిన దృశ్యాలు వెలుగుచూసాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా దుకాణాల నుంచి ఫుటేజీలను తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫుటేజీలలో ఖతర్నాక్ దొంగల ముఖాలు మరింత స్పష్టంగా కనిపించడంతో దొంగలు పట్టుబడే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దొంగతనం చేయడంతో వారు చూపిన నేర్పరితనం, తెగింపు చూస్తే వారు గతంలో పలు చోరీలు చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
సీసీ కెమెరా ఫుటేజీలో ‘ఏటీఎం నిందితులు’
షాబాద్: ఏటీఎం కేంద్రంలో చోరీకి యత్నించిన దుండగుల చిత్రాలు సీసీ కెమెరాకు చిక్కాయి. సోమవారం రాత్రి షాబాద్ మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు యంత్రాన్ని ధ్వంసం చేసి చోరీకి యత్నించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం బ్యాంక్ ప్రతినిధి విజయ్‌కుమార్ ఏటీఎం సెంటర్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. చోరీకి యత్నించిన ఇద్దరు దొంగల చిత్రాలు అందులో కనిపించాయి. ఈవిషయమై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఆయన సీసీ టీవీ ఫుటే జీని పోలీసులకు అప్పగించారు. -
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి భద్రత
నగరమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం: సీఎం కేసీఆర్ ‘కేబీఆర్ కాల్పుల’ ఘటనలో నిందితుడి అరెస్టు హైదరాబాద్: హైదరాబాద్‌లో కేబీఆర్ పార్కు వద్ద జరిగిన కాల్పుల ఘటనలో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని కొద్ది గంటల్లోనే గుర్తించి, అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. నగరంలో కొద్దిపాటి సీసీ కెమెరాల సాయంతోనే పోలీసులు అనేక కేసులు ఛేదించారంటూ అభినందించారు. హైదరాబాద్‌లో మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నిఘా కెమెరాల్లో వచ్చే సమాచారాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా నగరంలో అంతర్జాతీయ స్థాయి ‘కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అరబిందో ఫార్మా సంస్థ వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనను వివరిస్తూ శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. శాంతిభద్రతలపై రాజీపడబోమన్నారు. అందులోని అంశాలివీ.. ‘‘కాల్పుల ఘటనలో ఒక ఆగంతకుడు ఏకే-47 రైఫిల్‌తో అరబిందో ఫార్మా కంపెనీ యజమాని కంభం నిత్యానందరెడ్డిని డబ్బు డిమాండ్ చేసినపుడు జరిగిన పెనుగులాటలో కాల్పులు జరిగాయి. బంజారాహిల్స్ పోలీసు లు ఐపీసీ 307, 364ఏ, 511 సెక్షన్ల కింద, ఆయుధ చట్టం-25, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ కేసును సవాలుగా తీసుకొని అతన్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. గుర్తించిన 24 గంటల్లోనే నిందితుడిని వెంటాడి కర్నూలులో అరెస్టు చేశారు. అతని పేరు పి.ఓబులేసు. కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామానికి చెందిన అతడు కర్నూలులోని రెండో బెటాలియన్‌లో 1998లో కానిస్టేబుల్‌గా నియమితుడయ్యాడు. 2002 నుంచి 2014 మార్చి 14 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశాడు. అందులో పనిచేస్తున్నపుడే ఏకే-47 రైఫిల్ చోరీ జరిగినట్లు తేలింది. కీలకమైన ఆధారం సీసీటీ వీ ఫుటేజ్ ద్వారా లభించింది. దానిద్వారానే నిందితుడిని గుర్తించారు. హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత చర్యల్లో భాగంగా నగరమంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చే సేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించి, మంజూరు చేశాం. రూ.150 కోట్లతో అంతర్జాతీయ స్థాయి పోలీసు వ్యవస్థ, అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించేందుకు త్వరలో పునాది వేస్తాం. కాల్పుల ఘటనలో నిందితుడికి శిక్ష పడేలా పక్కా చర్యలు చేపడుతున్నాం. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ కేసును రికార్డు సమయంలో ఛేదించిన పోలీసులను అభినందిస్తున్నాం’’ -
నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన
హైదరాబాద్ : సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మి యూసఫ్‌గూడలోని అయ్యంగార్ బేకరీకి వచ్చి వెళ్తుండగా దుండగలు ఆమె మెడలోని 8 తులాల బంగారు నగలను తెంచుకెళ్లిన విషయం తెలిసిందే. కారు వద్దకు ఆమె ఒంటరిగా వస్తున్నట్లు గమనించి దుండగులు స్నాచింగ్‌కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే శ్రీలక్ష్మిని ఎక్కడి నుంచి వెంబడించారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీలక్ష్మి నివాసం నుంచి యూసుఫ్‌గూడలోని బేకరీ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన శ్రీలక్ష్మికి ...ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని అందచేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. -
చోరీ వద్దన్నందుకు కడతేర్చారు..
= కాపలాదారుడిని హతమార్చింది స్నేహితులే == కీలక ఆధారాల్ని ఇచ్చిన సీసీ కెమెరా ఫుటేజ్ = ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి,సిటీబ్యూరో: పంజగుట్టలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీ కాపలాదారుడు రాజరెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. అతడు పనిచేస్తున్న కళాశాలలోనే స్నేహితులు చోరీ చేయడానికి ఉపక్రమించగా అడ్డుకున్నందుకే హతమార్చారని తేలింది. హత్యకు ఒడిగట్టిన ముగ్గురు నిందితుల్నీ మంగళవారం అరెస్టు చేశామని వెస్ట్‌జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ప్రకటించారు. అదనపు డీసీ పీ నాగరాజు, పంజగుట్ట ఏసీపీ వెంకటనర్సయ్యలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. ప్రైవేట్ కళాశాలలో కాపలాదారుడిగా పనిచేసిన రాజరెడ్డి, గతంలో ఇదే కాలేజీకి సెక్యూరి టీగార్డుగా పనిచేసిన అమీర్‌పేటలో నివసించే కర్నె కృష్ణ (ప్రింటింగ్ ప్రెస్‌కార్మికుడు), శ్రీనగర్‌కాలనీవాసి శ్రీనివాస్‌యాదవ్, పంజగుట్టకు చెందిన ఎం.యాదయ్యలు స్నేహితులు. వీరు ప్రతినిత్యం ఆ కళాశాల వద్దే కలుసుకునే వారు. అంతాకలిసి ఏదొక ప్రాంతంలో మద్యం సేవించేవారు. ఎవరి వద్ద నగదు ఉంటే ఆ రోజు కు వారు ఖర్చు పెట్టేవారు. ఈనెల 15న సాయంత్రం కూడా ఈ నలుగురూ కాలే జీ ఎదుటున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద కలుసుకొని..శ్రీనివాస్‌యాదవ్ మద్యం తాగేందుకు రూ.50 ఇవ్వాల్సింది గా రాజరెడ్డిని కోరాడు. అతడు నిరాకరిం చడంతో ఘర్షణకు దిగి బలవంతంగా లా క్కున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వా దం జరిగింది. రెచ్చిపోయిన శ్రీనివాస్ ‘నిన్ను చంపేస్తా’ అంటూ రాజరెడ్డిని హెచ్చరించాడు. రాజరెడ్డి కాలేజీలోకి వెళ్లిపోగా...మిగిలిన ముగ్గురూ కొంతసేపు గడిపారు. ఇక్కడే పథకం పన్నారు..: కర్నె కృష్ణ గతంలో రాజరెడ్డి పనిచేస్తున్న కాలేజీలోనే సెక్యూరిటీగార్డుగా పనిచేయడంతో రెం డో అంతస్తులోని గదిలో నగదు ఉంటుందని గుర్తుకొచ్చింది. దీంతో విషయాన్ని మిగిలిన ఇద్దరికి చెప్పాడు. రాజరెడ్డిని ఫూటుగా మద్యం తాగించి ఆ తర్వాత చోరీ చేయాలనుకున్నారు. ఇలా నలుగురు కలిసి రెండో అంతస్తులోని గదిలోకి వెళ్లి తాగడం మొదలుపెట్టారు. రాజరెడ్డి మాత్రం కేవలం కొద్ది పరిమాణంలోనే తాగి తనకు వద్దనడంతో కథ అడ్డం తిరిగింది. అతడు నిద్రపోతాడని చాలాసేపు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో తమ పథకాన్ని బయటపెట్టారు. తాను సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న కాలేజీలో చోరీ చేయొద్దని సూచించాడు. ఇది మింగుడుపడని శ్రీనివాస్ ఆగ్రహంతో రాజరెడ్డి మెడబిగించి అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేశాడు. మిగిలిన ఇద్దరు రైటింగ్‌ప్యాడ్‌తో రాజరెడ్డి తలపై మోదారు. రాజరెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న ముగ్గురూ గదిలో ఉన్న రూ.45,800 నగదు, ఇతర ఉపకరణాలు తీసుకొని ఉడాయించారు. హత్య నేపథ్యంలో రంగంలోకి దిగిన పంజగుట్ట సీఐ తిరుపతిరావు తన బృందంతో దర్యాప్తు ప్రారంభించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పైనవున్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను అధ్యయనం చేశారు. ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసు లు, చూసిన కాలేజీ యాజమాన్యం తొలుత కర్నె కృష్ణను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతను మిగిలిన ఇద్దరి పేర్లు బయటపెట్టగా..శ్రీనివాస్,యాదయ్యల్ని పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.