చెన్నై: తమిళనాడులోని కొయంబత్తురులో దొంగలు బీభత్సం సృష్టించారు. ముఖానికి మాస్కులు ధరించి బ్యాంక్‌లో చొరబడిన దుండగులు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. ఉతుకులిలోని పీఎస్‌యు బ్యాంకులో ఆదివారం తెల్లవారుజామున ఈ చోరి జరిగింది. బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన ఏటీఎం లోపలికి చొరబడిన దొంగలు అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎంను ప్రత్యేక తాళ్ళతో చుట్టి, ఒక ప్రత్యేక వాహనం సహయంతో అక్కడి నుంచి కదిలించారు. అప్పటికే రోడ్డుపై సిద్ధంగా ఉన్న మరొక వాహనంలో ఎటీఎంను ఎక్కించుకొని రెప్పపాటులో అక్కడి నుంచి పారిపోయారు. కాగా, ఎటీఎం తీయడానికి ఉపయోగించిన పెద్దకారును విజయమంగళం సమీపంలో వదిలిపారిపొయారు.
కాగా, ఈ చోరికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఉదయాన్నే దీన్ని గమనించిన స్థానికులు సంబంధింత బ్యాంకు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే.. అక్కడికి చేరుకున్న ఉతుకులి పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేశారు. ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో వేలిముద్రలను స్వీకరించారు. కాగా, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment