ప్రతీకాత్మక చిత్రం
మహబూబ్‌నగర్ క్రైం: ఓ పెళ్లింట్లో దొంగ తనం జరిగిన 12 రోజుల్లోనే వేలిముద్ర ల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి చోరీకి గురైన సొత్తు, వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బుధవారం మహబూబ్‌నగర్‌లో ఎస్పీ రెమా రాజేశ్వ రి వెల్లడించారు. మిడ్జిల్ మండలం బో యిన్‌పల్లిలో ఈనెల 18న అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బాధితుడు చంద్రారెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పలువురి వేలిముద్రలు సేకరించారు. దొంగతనానికి పాల్పడిం ది పాత నేరస్తులేనని గుర్తించారు. వీరిలో మహబూబాబాద్ జిల్లా నెల్లికూడురు మండలం రాజులకొత్తపల్లికి చెందిన అంగడి సురేష్, దాసరి మురళీకృష్ణ, మల్లయ్య, పీరయ్య ఉన్నారు.
కాగా, వీరి కోసం పోలీసు బృందాలు గాలించడానికి వెళ్లిన సమయంలో దొంగతనం చేసిన సొమ్మును మధ్యవర్తి ద్వారా విక్రయించడానికి యత్నిస్తుంటే మల్లయ్య తప్పా మిగతా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 61 తులాల బంగారం, రూ.2.98 లక్షలు, ఆటో, రెండు బైకులను స్వా«దీనం చేసుకున్నారు. కాగా నిందితులపై వరంగల్, రాచకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల పరిధిలో 40 చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment