మాస్క్‌తో బంగారం దుకాణంలో చోరీకి వచ్చిన టీకారామన్(ఫైల్)
సాక్షి, వేలూరు: వేలూరు –కాట్పాడి రోడ్డులోని జోస్ అలుక్కాస్ బంగారు దుకాణంలో ఈనెల 16వ తేదీన దుండగులు గోడకు రంధ్రం చేసి దుకాణంలోని 16 కిలోల బంగారు నగలు, అర్ధకిలో వజ్రాలు చోరీ చేశారు. చోరీ ఘటన పూర్తిగా సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో వీటిపై కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. అదేవిధంగా నలుగురు డీఎస్పీలతో కూడిన ఎనిమిది బృందాలు ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టారు. అదే విధంగా కాట్పాడి రోడ్డులో అక్కడక్కడ దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
చదవండి: (జూనియర్ ఆర్టిస్ట్ మానస మృతి.. అంత్యక్రియలకు డబ్బులు లేవు..)
ఆ సమయంలో చోరీ జరిగిన సమయంలో సంబంధం లేని ప్రాంతంలో ఓ ఆటో నిలిచి ఉండడాన్ని పోలీసులు కెమెరాల్లో గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో సంబంధం లేని ప్రాంతంలో ఆటో ఎందుకు నిలిచి ఉందని పోలీసులు ప్రశ్నించారు. చోరీ జరిగిన దుకాణం పక్కనే ఒక విశ్రాంతి గది ఉండటం, అందులో అనేక మంది కార్మికులు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడంతో కార్మికుల వద్ద విచారణ చేపట్టారు.
చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..)
అదే విధంగా 25 మంది కార్మికులు వేలి ముద్రలు, ఫొటోలు, ఆధార్ కార్డులను సేకరించి విచారణ చేపట్టగా అందులో వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని కుచ్చిపాళ్యంకు చెందిన టీకారామన్(28) నిందితుడిగా తెలిసింది. దీంతో ఇతన్ని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో ఉంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. చోరీ చేసిన 16 కిలోల బంగారం, వజ్రాలను ఎక్కడ దాచి పెట్టాడనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment