Puneeth Rajkumar Home Inside CCTV Video Goes Viral: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కన్నుమూసి 4 రోజులు గడుస్తున్నా దైవంలా ఆరాధించే తమ అప్పు ఇకలేరనే చేదు నిజాన్ని అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ సైతం జీర్ణించుకోలేకపోతోంది. కర్ణాటకలో ఏ వీధి, ఏ షాపు చూసినా పునీత్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎంతో ఆరోగ్యంగా ఉండే అప్పును గుండెపోటు ఎలా బలి తీసుకుందంటూ అభిమానులు రోదిస్తున్నారు. ఇదిలా ఉంటే పునీత్ మరణానంతరం ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చదవండి: 50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు
ఈ నేపథ్యంలో ఆయన మరణానికి ముందటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. శుక్రవారం ఒంట్లో నలతగా ఉందని భార్య అశ్వినితో కలిసి అప్పు ఆసుపత్రికి బయలుదేరిన వీడియో అంటూ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రోజు జిమ్ చేసిన తర్వాత గుండెల్లో అసౌకర్యంగా ఉందంటూ తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి బయలుదేరిన వీడియో ఇది. ఈ క్రమంలో తానే స్వయంగా కారు వరకు నడుచుకుంటూ వెళ్లారు పునీత్. ఈ వీడియోలో చాలా యాక్టివ్‌గా కనిపించిన అప్పు.. చివరి క్షణాలు ఇవే అంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియోలో అప్పుని చూస్తుంటే అందరి కళ్లు చెమ్మగిల్లితున్నాయి. గుండెలు బరువెక్కుతున్నాయి.
చదవండి: పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం
డాక్టర్ దగ్గరకు కారు ఎక్కిన పునీత్ ఆ తర్వాత కొద్ది గంటల్లోనే జీవచ్ఛవంలా మారారని తలుచుకుంటుంటే కన్నీరు ఆగడం లేదు. కాగా ఆ రోజు వారి ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి ఈసీజీ తీసేవరకూ ఆయన యాక్టివ్గానే ఉన్నారట. అయితే ఈసీజీ రిపోర్ట్‌లో ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్ హాస్పిటల్‌కు తరలించాలని డాక్టర్ రమణారావు సూచించారు. అయితే తనకేమీ కాలేదని ఎలాంటి నొప్పి లేదని తన భార్యతో పునీత్ చెప్పారు. అనంతరం కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పునీత్ పడుకున్నారట. ఇక ఆ తర్వాత.. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు పరిస్థితి చేజారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment