last moments
-
పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు!
Puneeth Rajkumar Home Inside CCTV Video Goes Viral: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కన్నుమూసి 4 రోజులు గడుస్తున్నా దైవంలా ఆరాధించే తమ అప్పు ఇకలేరనే చేదు నిజాన్ని అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ సైతం జీర్ణించుకోలేకపోతోంది. కర్ణాటకలో ఏ వీధి, ఏ షాపు చూసినా పునీత్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎంతో ఆరోగ్యంగా ఉండే అప్పును గుండెపోటు ఎలా బలి తీసుకుందంటూ అభిమానులు రోదిస్తున్నారు. ఇదిలా ఉంటే పునీత్ మరణానంతరం ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: 50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు ఈ నేపథ్యంలో ఆయన మరణానికి ముందటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. శుక్రవారం ఒంట్లో నలతగా ఉందని భార్య అశ్వినితో కలిసి అప్పు ఆసుపత్రికి బయలుదేరిన వీడియో అంటూ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రోజు జిమ్ చేసిన తర్వాత గుండెల్లో అసౌకర్యంగా ఉందంటూ తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి బయలుదేరిన వీడియో ఇది. ఈ క్రమంలో తానే స్వయంగా కారు వరకు నడుచుకుంటూ వెళ్లారు పునీత్. ఈ వీడియోలో చాలా యాక్టివ్‌గా కనిపించిన అప్పు.. చివరి క్షణాలు ఇవే అంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియోలో అప్పుని చూస్తుంటే అందరి కళ్లు చెమ్మగిల్లితున్నాయి. గుండెలు బరువెక్కుతున్నాయి. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం డాక్టర్ దగ్గరకు కారు ఎక్కిన పునీత్ ఆ తర్వాత కొద్ది గంటల్లోనే జీవచ్ఛవంలా మారారని తలుచుకుంటుంటే కన్నీరు ఆగడం లేదు. కాగా ఆ రోజు వారి ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి ఈసీజీ తీసేవరకూ ఆయన యాక్టివ్గానే ఉన్నారట. అయితే ఈసీజీ రిపోర్ట్‌లో ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్ హాస్పిటల్‌కు తరలించాలని డాక్టర్ రమణారావు సూచించారు. అయితే తనకేమీ కాలేదని ఎలాంటి నొప్పి లేదని తన భార్యతో పునీత్ చెప్పారు. అనంతరం కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పునీత్ పడుకున్నారట. ఇక ఆ తర్వాత.. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు పరిస్థితి చేజారిపోయింది. చదవండి: పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున -
మరణశయ్యపై ‘సూడాన్’.. అద్భుతం జరగాల్సిందే!
జుబూ : అది ఓ ఖడ్గ మృగం... దాన్ని చుట్టూ జడ్ ప్లస్ కేటగిరి స్థాయిలో భద్రత. 24 గంటలూ కమాండోలు దానికి కాపలా కాస్తుంటారు. ఇది సాధారణ రైనో కాదు. కానీ, ఈ భూమ్మీద మిగిలిన ఒక్కగానోక్క మగ తెల్ల ఖడ్గ మృగం అది. దాని పేరే సూడాన్. ప్రస్తుతం అది చివరి క్షణాలకు చేరుకోగా.. అధికారుల్లో కంగారు నెలకొంది. వేటగాళ్ల నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మూడేళ్ల నుంచి సూడాన్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ప్రపంచంలో అంతరించి పోతున్న జంతువులలో తెల్ల ఖడ్గ మృగాలు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా మిగిలినవి 3 మాత్రమే. అందులో సూడాన్ ఒకటి కాగా.. మిగిలిన రెండూ ఆడవి. సంతానోత్పత్తి కోసం ఈ మూడింటిని ఒకే చోట చేర్చారు. అయితే సూడాన్ అనారోగ్యంతో అధికారుల్లో కంగారు మొదలైంది. దానికి ఏమైనా అయ్యిందో ఇక తెల్ల ఖడ్గమృగాల వంశం అంతరించినట్లేనని భయపడుతున్నారు. గతేడాది డేటింగ్ యాప్‌లో విరాళాల సేకరణ ద్వారా దీని పేరు మారు మోగిపోయింది. సాధారణంగా వీటి జీవిత కాలం 50 సంవత్సరాలు. ఇప్పుడు దీని వయస్సు 46 ఏళ్లు. గతేడాది దాని కాలుకి ఇన్ఫెక్షన్ సోకింది. అది నయమవుతున్న సమయంలో మరో కాలికి సోకింది. చికిత్స అందిస్తున్న ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, ఏదైనా అద్భుతం జరిగి అది త్వరగా కోలుకోవాలని సంరక్షకులు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు అది చనిపోక ముందే సంతానోత్పత్తి చేసే సాధ్యాసాధ్యాలపై శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. -
మరణశయ్యపై ‘సూడాన్’.. అద్భుతం జరగాల్సిందే!
-
వారే బతికుంటే ఇప్పుడేం చేస్తూ ఉండేవారో!
హైదరాబాద్: అందరిలో ఉల్లాసం.. ప్రకృతిలో సీతాకోకచిలుకల్లా కేరింతలు.. రాళ్లు రప్పలూ.. చెట్టూ పుట్టా అన్నింటిని ముద్దాడే ఆశ.. తనివి తీరా స్పర్షించాలన్న కోరిక.. ప్రతి కొత్త చోటును కెమెరాతో తమ వద్దకు చేర్చుకునే ప్రయత్నం.. తొలుత నిర్మలంగా నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్న ఆ నది పారే మార్గంలో స్నేహితులంతా కలిసి కోలాహలంగా గంతులు వేస్తూ కెమెరాలతో వీలయినన్ని ఫొటోలతో బిజీగా ఉండగా..మొదట చినుకై ఆ తర్వాత వరదై మరికాసేపట్లో ఉప్పెనైనట్లుగా ఒక్కసారిగా గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. ముందు సెలయేరుగా మారి వారి పాదాలను ముద్దాడింది.. ఆ వెంటనే వేగం పెంచి మరో రూపాన్ని సంతరించుకుంది. దీంతో భయపడినవారంతా పారిపోయేందుకు ప్రయత్నించినా అందరినీ అమాంతం హత్తుకుని తనలో కలిపేసుకుంది. వారి కుటుంబాల్లో విషాధం నింపింది. ఘటన తీరు చూసిన అందరి కళ్లలో వరదల్లే నీరు నింపింది. ఇది సరిగ్గా ఏడాది కిందట హైదరాబాద్ శివార్లలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి నుంచి సరదాగా టూర్‌కు వెళ్లిన విద్యార్థుల విషణ్ణ వదనాల చరిత. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నది వద్ద సంభవించిన ప్రమాదంలో దాదాపు 24 మంది మరణించగా కొందరే ప్రాణాలతో బయటపడ్డారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే పండో డ్యామ్ తలుపులు తెరవడంతో ఆ వరద నీటికి వారంతా కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. కాస్త అప్రమత్తంగా ఉన్నా.. అనుభవజ్ఞులు పక్కన ఉన్న వారు బతికి బయటపడేవారేమో. నది ప్రవహించే మార్గంలోని రాళ్ల గుట్టలు ఎక్కి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తూ జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారే తప్ప వారి ప్రాణాలు పోతాయన్న విషయం గమనించలేదు. కాళ్ల కిందకు నీళ్లు వస్తుండగా ఒడ్డున ఉన్న స్థానికులు అప్రమత్తం చేసే ప్రయత్నం చేసి బయటకు రమ్మంటూ చేతులు ఊపినా.. వాళ్లు హాయ్ చెబుతున్నారని అనుకొని వీరు కూడా చేతులు ఊపారు తప్ప.. అపాయాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయారు. క్షణాల్లో వీరంతా రాళ్ల నుంచి నీళ్లలో పడి కొట్టుకుపోయారు. కనీసం నెల రోజులపాటు వీరి మృతదేహాల కోసం గాలింపులు జరిగాయి. ఈ ఘటనలో కళాశాల, అక్కడి డ్యామ్ అధికారుల నిర్లక్ష్యం వెరసి 24 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇకముందైనా కళాశాలలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోగలిగితే అటు తల్లిదండ్రులకు, వారి పిల్లలకు బంగారు భవితకు భరోసా ఇచ్చినట్లవుతుంది. ఏదేమైనా.. ఉజ్వల భవిష్యత్ ఉండి అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఆ 24 మంది విద్యార్థులు బతికుంటే ఇప్పుడేం చేస్తూ ఉండేవారో. -
చివరి క్షణాలు
ఆకలి... మనిషికి అతి పెద్ద శత్రువు. గుప్పెడు మెతుకులు లేక పేగులు మెలిపడుతుంటే... కలిగే బాధ కన్నీరుగా కనుల జారుతుంటే... బతుకు మీద ఆశ అడుగంటిపోతుంది. ఇలాంటి జన్మనిచ్చినందుకు భగవంతుడి మీద సైతం కోపం వస్తుంది. ఎనభైల్లో ఇథియోపియా ప్రజల పరిస్థితి అదే! 1983 నుంచి 85 వరకు ఇథియోపియాలో దారుణమైన కరవు కమ్ముకుంది. ఆకలి మంటలకు నాలుగు లక్షల మంది జీవితాలు ఆహుతైపోయాయి. ఎక్కడ చూసినా ఆకలి కేకలు. అభాగ్యుల ఆక్రందనలు. వీధుల నిండా శవాల గుట్టలు. వాటిని పీక్కు తినడానికి వచ్చిన రాబందుల రెక్కల చప్పుళ్లు. అంతా భయానకం... బీభత్సం... బాధాకరం... హృదయ విదారకం! పెద్దవాళ్లే ఆకలికి తాళలేక అలమటిస్తుంటే... ఇక పసివాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది! డొక్కలు ఎండిపోయి, చర్మాలు అతుక్కుపోయి, ఎముకల గూళ్లలా ఉన్న బిడ్డలను చూసి కన్నవాళ్ల మనసులు కుంగిపోయేవి. కళ్లముందే బిడ్డలు నిర్జీవంగా రాలిపోతుంటే నిస్సహాయంగా చూస్తూండి పోవడం తప్ప ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టేవారు. అలాంటి పరిస్థితుల్లో తన బిడ్డని కాపాడుకోవడానికి ఓ తండ్రి పడిన తపనకు సాక్ష్యమే ఈ చిత్రం. ఆ దారుణ కరవును తరిమి కొట్టలేకపోయినా... కొందరి ప్రాణాలనైనా నిలబెట్టాలన్న ఆశతో కొన్ని ఎన్జీవోలు ఆహా రంతో అక్కడకు చేరుకున్నారు. వారు జావను ఇవ్వగానే ఓ తండ్రి... చావుబతుకుల్లో ఉన్న తన బిడ్డకు గబగబా దాన్ని తాగించసాగాడు. ‘తాగు నాన్నా తాగు’ అంటూ కొడుకును బతికించుకోవాలని తపన పడ్డాడు. అప్పుడే ఫొటోగ్రాఫర్ జాన్ ఐజక్ ఈ ఫొటో తీశాడు. కానీ దురదృష్టం... తర్వాతి రోజు రాత్రే ఆ చిన్నారి కన్నుమూశాడు. అతడు పోయినా... అతడి చివరి క్షణాలను ఈ ఫొటో తనలో దాచుకుంది. నాటి దారుణ స్థితిని ప్రపంచానికి పదే పదే గుర్తు చేస్తూనే ఉంది! -
చిట్టచివరి నిమిషం వరకు ఆనందంగా..
ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు వరకు అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగానే ఉన్నారు. వెనక నుంచి నీటి రూపంలో వెంటాడుతూ వస్తున్న మృత్యువును ఎవరూ గుర్తించలేకపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నది వద్ద సంభవించిన ప్రమాదంలో దాదాపు 24 మంది మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి నుంచి సరదాగా వెళ్లిన విద్యార్థులు విషణ్ణ వదనాలతో రావాల్సి వచ్చింది. తొలుత పండో డ్యామ్‌కు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులు.. రాళ్ల మధ్య నుంచి వంపులు తిరుగుతూ వెళ్తున్న నీళ్లను చూసి పరవశించిపోయారు. అడుగు లోతు కూడా లేకపోవడంతో సరదాగా లోపలకు దిగారు. వెళ్లే ముందు కూడా ఎందుకైనా మంచిదని అక్కడున్న స్థానికులను ఓసారి అడిగారు. అదంత ప్రమాదకరమైన ప్రదేశం కాదని, అయితే కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండాలని వాళ్లు చెప్పడంతో అందరూ ఉత్సాహంగా లోపలకు వెళ్లారు. చాలాసేపు ఫొటోలు తీసుకున్నారు. వీడియోలు కూడా తీశారు. ఒకరిద్దరైతే వెంటనే వాట్స్ యాప్ లాంటివాటి ద్వారా షేర్ చేశారు. రాళ్ల గుట్టలు ఎక్కి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించారు. సరదాగా జోకులు వేసుకున్నారు, నవ్వుకున్నారు. క్షణాల్లోనే కాళ్ల కిందకు నీళ్లు వచ్చేశాయి. ఒడ్డున ఉన్న స్థానికులు వీళ్లను అప్రమత్తం చేసేందుకు బయటకు రమ్మంటూ చేతులు ఊపారు. కానీ, వాళ్లు హాయ్ చెబుతున్నారని అనుకోవడంతో వీళ్లు కూడా చేతులు ఊపారు తప్ప.. అపాయాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయారు. పిల్లలు నిలబడిన చిన్నపాటి రాళ్లు కొట్టుకుపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయారు. చాలామంది నీళ్లలో కొట్టుకుపోగా.. దాదాపు సగం మంది మాత్రం మిగిలినవారి సాయంతో బయటపడ్డారు. -
నటనే ఆయన ప్రాణం.. చివరకు వరకు నటనే
పదిహేడేళ్ల వయసులోనే ముఖానికి రంగు వేసుకుని తెరంగేట్రం చేసిన అక్కినేని నాగేశ్వరరావు.. చిట్టచివరి వరకు కూడా సినీ కళామతల్లికి సేవ చేస్తూనే ఉన్నారు. తనకు కేన్సర్ వచ్చిందని, దాన్ని కూడా జయిస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన ఘనత ఆయనొక్కరికే దక్కుతుంది. కేన్సర్ మహమ్మారి ఒకవైపు తన శరీరాన్ని కబళిస్తున్నా... నటనే తన ఊపిరి అంటూ చిట్ట చివర కూడా మూడుతరాల అక్కినేని నటులు కలిసి చేస్తున్న 'మనం' సినిమాలో నటించారు. దాంతో కలిపి మొత్తం 256 సినిమాల్లో ఆయన చేశారు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లోనూ ఏఎన్ఆర్ నటించారు. ఉత్తమ నటుడిగా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా ఏఎన్ఆర్కు 1968లో పద్మశ్రీ, 1989లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1991లో దాదాసాహెబ్ ఫాల్కే, 1998లో పద్మభూషణ్, 1996లో ఎన్టీఆర్ జాతీయ, 2011లో పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి. అలాగే, మేఘసందేశం, బంగారుకుటుంబం చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి, మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాసు కౌస్తుభ అవార్డులు కూడా ఆయనకు అందాయి. నవరాత్రి సినిమాలో 9 పాత్రలు చేసిన ఏకైక తెలుగు నటుడు నాగేశ్వరరావే. -
చివరి క్షణాల్లోనూ సంతోషంగానే: నాగార్జున
ఎప్పుడూ నిండుగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే అక్కినేని నాగేశ్వరరావు చిట్టచివరి క్షణాల్లో కూడా అందరితో సంతోషంగానే మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, అగ్రనటుడు నాగార్జున తెలిపారు. కేర్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతూ మరణించిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని ఉదయం 9.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలో ఉంచుతామని, ఆయనను కడసారి చూసేందుకు అభిమానులు తప్పక స్టూడియోకు రావాలని నాగార్జున కోరారు. కాగా నాగేశ్వరరావుకు ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని నిర్మాతగా ఉండగా, రెండో కుమారుడు నాగార్జున హీరో. సత్యవతి, నాగ సుశీల, సరోజ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మనవలు సుమంత్, సుశాంత్, నాగచైతన్య ఇప్పటికే సినిమాలలో ఉండగా, ఆఖరి మనవడు అఖిల్ అక్కినేని కూడా త్వరలోనే సినీరంగ ప్రవేశం చేస్తారని అంటున్నారు.