చివరి క్షణాల్లోనూ సంతోషంగానే: నాగార్జున | akkineni nageswararao spent last moments also cheerfully, says nagarjuna | Sakshi
Sakshi News home page

చివరి క్షణాల్లోనూ సంతోషంగానే: నాగార్జున

Published Wed, Jan 22 2014 6:11 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

చివరి క్షణాల్లోనూ సంతోషంగానే: నాగార్జున - Sakshi

చివరి క్షణాల్లోనూ సంతోషంగానే: నాగార్జున

ఎప్పుడూ నిండుగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే అక్కినేని నాగేశ్వరరావు చిట్టచివరి క్షణాల్లో కూడా అందరితో సంతోషంగానే మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, అగ్రనటుడు నాగార్జున తెలిపారు. కేర్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతూ మరణించిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని ఉదయం 9.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలో ఉంచుతామని, ఆయనను కడసారి చూసేందుకు అభిమానులు తప్పక స్టూడియోకు రావాలని నాగార్జున కోరారు.

కాగా నాగేశ్వరరావుకు ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని నిర్మాతగా ఉండగా, రెండో కుమారుడు నాగార్జున హీరో. సత్యవతి, నాగ సుశీల, సరోజ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మనవలు సుమంత్, సుశాంత్, నాగచైతన్య ఇప్పటికే సినిమాలలో ఉండగా, ఆఖరి మనవడు అఖిల్ అక్కినేని కూడా త్వరలోనే సినీరంగ ప్రవేశం చేస్తారని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement