అన్నపూర్ణ స్టాఫ్‌ని  ఫ్యామిలీలా భావిస్తాం: నాగార్జున | Akkineni Nagarjuna Comments On Annapurna Studios Staff After Completed 50 Years, More Details Inside | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ స్టాఫ్‌ని  ఫ్యామిలీలా భావిస్తాం: నాగార్జున

Jan 17 2025 1:25 AM | Updated on Jan 17 2025 3:51 PM

Akkineni Nagarjuna reflects on 50 years of Annapurna Studios

అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ల సందర్భంగా నాగార్జున 

‘‘రోడ్లు కూడా లేని రోజుల్లో నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) హైదరాబాద్‌ వచ్చి, ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోని ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు... అన్నపూర్ణ స్టూడియోస్‌ ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నూతన నటీనటులు, కొత్త డైరెక్టర్స్‌కు ఉపాధి కల్పించింది. ఎంతోమందికి ఏఎన్‌ఆర్‌గారు స్ఫూర్తి’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. 

అన్నపూర్ణ స్టూడియోస్‌ ఏర్పాటు చేసి 50 ఏళ్లయిన సందర్భంగా నాగార్జున ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్‌కి 50వ ఏడాది మొదలైంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని నాన్నగారు నమ్మేవారు. ఆయన సక్సెస్‌ వెనక మా అమ్మ అన్నపూర్ణగారు ఉన్నారనేది ఆయన నమ్మకం. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్‌ అని పేరు పెట్టారు.

 ఈ స్టూడియోకి వచ్చినప్పుడల్లా అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారనిపిస్తుంటుంది. అన్నపూర్ణ స్టాఫ్‌ని మేం ఫ్యామిలీలా భావిస్తాం. స్టూడియో ఇంత కళకళలాడుతోందంటే దానికి అన్నపూర్ణ ఫ్యామిలీనే కారణం. ఈ సందర్భంగా వారికి థ్యాంక్స్‌. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్‌ ఓపెన్‌ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మానాన్నలు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేసేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. బయట చాలా మందిని కలసినప్పుడు నాన్నగారి గురించి పాజిటివ్‌గా మాట్లాడతారు. ఆయన జీవితం పెద్ద స్ఫూర్తి అనడం హ్యాపీగా ఉంటుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement