anr
-
అన్నపూర్ణ స్టాఫ్‌ని ఫ్యామిలీలా భావిస్తాం: నాగార్జున
‘‘రోడ్లు కూడా లేని రోజుల్లో నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) హైదరాబాద్ వచ్చి, ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోని ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు... అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నూతన నటీనటులు, కొత్త డైరెక్టర్స్‌కు ఉపాధి కల్పించింది. ఎంతోమందికి ఏఎన్‌ఆర్‌గారు స్ఫూర్తి’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లయిన సందర్భంగా నాగార్జున ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడాది మొదలైంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని నాన్నగారు నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనక మా అమ్మ అన్నపూర్ణగారు ఉన్నారనేది ఆయన నమ్మకం. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. ఈ స్టూడియోకి వచ్చినప్పుడల్లా అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారనిపిస్తుంటుంది. అన్నపూర్ణ స్టాఫ్‌ని మేం ఫ్యామిలీలా భావిస్తాం. స్టూడియో ఇంత కళకళలాడుతోందంటే దానికి అన్నపూర్ణ ఫ్యామిలీనే కారణం. ఈ సందర్భంగా వారికి థ్యాంక్స్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మానాన్నలు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. బయట చాలా మందిని కలసినప్పుడు నాన్నగారి గురించి పాజిటివ్‌గా మాట్లాడతారు. ఆయన జీవితం పెద్ద స్ఫూర్తి అనడం హ్యాపీగా ఉంటుంది’’ అన్నారు. -
ట్రెండ్ సెట్ చేసిన ‘బుల్లోడు’..ఆల్‌టైమ్ రికార్డు
‘దసరా బుల్లోడు’ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కినేని–హీరోయిన్ వాణిశ్రీ. 1971 జనవరి 13న రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. వాస్తవానికి ఈ సినిమా కోసం హీరోయిన్గా తొలుత అనుకున్నది జయలలితను. ఈమెతో నిర్మాతల సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ‘దసరా బుల్లోడు’లో నటించడానికి జయలలిత గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అయితే అదే సమయంలో ఆమె ఎన్టీఆర్‌తో ‘శ్రీకృష్ణ విజయము’, ఎమ్జీఆర్తో మరో సినిమాలో నటిస్తున్నారు. దీంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చివరి నిమిషంలో ఏఎన్నార్ ‘దసరా బుల్లోడు’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం అందించారు. కేవలం వారం రోజుల ముందు ఈ విషయం తెలియడంతో అప్పటికప్పుడు వాణిశ్రీని హీరోయిన్గా అనుకున్నారట.ఏఎన్నార్ కంటే వాణిశ్రీకి డబుల్ రెమ్యునరేషన్ ఈ సినిమాకు అక్కినేని పారితోషికం పాతిక వేలైతే వాణిశ్రీకి యాభై వేలు చెల్లించాల్సి వచ్చిందట. అప్పటికి వాణిశ్రీకి పెద్ద హీరోయిన్గా గుర్తింపు కూడా లేదు. అయినా అంత మొత్తం చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అయితే... ‘దసరా బుల్లోడు’ హిట్‌తో వాణిశ్రీ కూడా స్టార్ హీరోయిన్గా మారి పోయారు. ఆ తర్వాత ‘ప్రేమ్‌నగర్’ లాంటి ఆల్‌టైమ్ బెస్ట్ రావడానికి దసరాబుల్లోడే పునాది వేసింది. దీంతో అక్కినేని–వాణిశ్రీలది హిట్ పెయిర్ అనే పేరొచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో 20కి పైగా సినిమాలొచ్చాయంటే‘దసరాబుల్లోడు’ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.12 రోజుల రీ షూట్హీరా లాల్ డ్యాన్స్ డైరక్షన్లో ‘పచ్చగడ్డి కోసేటి...’ సాంగ్ షూటింగ్‌తో షూటింగ్ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో పెద్ద పండగలా షూటింగ్ చేశారు. 12 రోజుల పాటు షూటింగయ్యాక మొదటి రోజు మినహా మిగతాది ఏదీ కెమేరాలో క్యాప్చర్ కాలేదని తెలిసి అంతా షాకయ్యారు. దీంతో చేసేది లేక మళ్లీ ఆ 12 రోజుల షూటింగ్ మొత్తాన్ని తిరిగి తీయాల్సి వచ్చింది. ఇక ‘దసరా బుల్లోడు’ పాటలు ఓ సంచలనమనే చెప్పాలి. అప్పట్లో రేడియోలో ఈ పాటలు మోగని రోజు లేదు. ఏ గడప దగ్గర నించున్నా ఈ సినిమాలో పాటలు వినపడాల్సిందే. కేవీ మహదేవన్ మ్యూజిక్ ఓ వైపు... ఆత్రేయ సాహిత్యం మరోవైపు జనాల్ని ఓ ఊపు ఊపేశాయి. ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా...’, ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ...’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా...’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ ఇలా అన్ని పాటలూ బంపర్ హిట్. అప్పట్లో ‘దసరా బుల్లోడు’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రిలీజైన తొలి 4 వారాలకే 25 లక్షల గ్రాస్ వసూలు చేయడం తెలుగు సినీ చరిత్రలో అప్పటి వరకూ కనీవినీ ఎరుగని రికార్డు.హీరోగా సూపర్ హిట్ కెరీర్‌ని చూసి, ఇప్పుడు విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ దూసుకెళుతున్న జగపతిబాబు తండ్రే ‘దసరా బుల్లోడు’ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అనే విషయం తెలిసిందే. జగపతిబాబు పేరుతోనే ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి సినిమాలు తీసేవారు. అప్పట్లో జగపతి పిక్చర్స్ అంటే టాలీవుడ్ నెంబర్ వన్. ‘దసరా బుల్లోడు’తోనే వీబీ రాజేంద్రప్రసాద్ దర్శకుడయ్యారు. ఈ సినిమా కథ కూడా ఆయనే తయారు చేసుకున్నారు. వాస్తవానికి జగపతి సంస్థకు విక్టరీ మధుసూదనరావు ఆస్థాన దర్శకుడు. అయితే ఆయన బిజీగా ఉండడం వల్ల దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగారట వీబీ. ఆయనకూ వీలు కాలేదు. చివరికి అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారట. కానీ స్టేజ్ ఆర్టిస్ట్‌గా, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా మంచి అనుభవమున్న వీబీనే డైరెక్ట్ చేయాల్సిందిగా ఏఎన్నార్ ప్రొత్సహించడంతో వీబీ దర్శకత్వం చేయక తప్పలేదు. అందుకే ఈ సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం. తర్వాత వివిధ కారణాలవల్ల అన్నీ కోల్పోయినప్పుడు తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షర రూపమిస్తూ రాసిన పుస్తకానికి ‘దసరా బుల్లోడు’ అనే టైటిలే పెట్టుకున్నారు వీబీ రాజేంద్రప్రసాద్. – దాచేపల్లి సురేష్‌కుమార్ -
Chiranjeevi:ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది
-
'ఏఎన్ఆర్ చివరి ఆడియో సందేశం'.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్!
తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఎన్ఆర్ మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని ప్రదర్శించారు.ఏఎన్ఆర్ ఆడియోలో మాట్లాడుతూ..' నా కోసం మీరు అంతా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారని తెలుసు. మా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు చెబుతూనే ఉన్నారు. మీ ప్రేమ, అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. త్వరలోనే నేను మీ ముందుకు వస్తానన్న నమ్మకం ఉంది. మీరు చూపిన ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక సెలవు' అంటూ చివరిసారిగా ఐసీయూ నుంచి సందేశమిచ్చారు. ఇవాళ శతజయంతి వేడుకల్లో నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియో సందేశాన్ని వినిపించారు. ఇది విన్న మెగాస్టార్ చిరంజీవి, నటి రమ్యకృష్ణ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. -
నాన్నగారి పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది: అక్కినేని నాగార్జున
‘‘నాన్నగారి (అక్కినేని నాగేశ్వరరావు) శత జయంతి రోజున ఆయన పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు పోస్ట్ మాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డిగారికి థ్యాంక్స్. శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాన్నగారి అభిమానులు రక్తదానం, అన్నదానం లాంటి మంచి కార్యక్రమాలు చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం మర్చిపోలేనిది’’ అని నాగార్జున అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఎన్ఎఫ్డీసీ, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా కలిసి ‘ఏఎన్ఆర్ 100– కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఏఎన్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో అక్కినేని ఐకానిక్ ఫిలిం ‘దేవదాసు’ స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఏఎన్నార్ ‘దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యాభర్తలు, ‘గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మనం’ సహా ఏఎన్ఆర్ ల్యాండ్‌మార్క్ మూవీస్‌ని దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ పైన పేర్కొన్న చిత్రాల ప్రింట్లను 4కేలో పునరుద్ధరించాయి. ‘దేవదాసు’ స్క్రీనింగ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే ఉంటాం. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. నార్త్‌లో అద్భుతమైన స్పందన వస్తోందని శివేంద్ర చెప్పడం ఆనందాన్నిచ్చింది. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేయడం సంతోషంగా ఉంది. నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ– ‘‘అక్కినేనిగారితో కలసి నటించే అవకాశం రావడంతో పాటు ఆయన బ్యానర్లో నిర్మించిన తొలి సినిమాలో నేను నటించడం నా అదృష్టం. హైదరాబాద్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది’’ అని పేర్కొన్నారు. నిర్మాత వెంకట్ అక్కినేని మాట్లాడుతూ– ‘‘నాన్నగారి శత జయంతి రోజున ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. బాపుగారు ఆ ఫొటో గీశారు. దాంట్లో నాన్నగారి లక్షణాలన్నీ కలగలిపి ఉంటాయి’’ అన్నారు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు, మా నాన్నగారు, నేను, నాగార్జున కలిసే ప్రయాణం చేశాం. నాగేశ్వరరావుగారు హైదరాబాద్‌కి అన్నపూర్ణ స్టూడియోను తలమానికంగా ఇచ్చి వెళ్లారు. ‘దేవదాసు, కాళిదాస్, విప్రనారాయణ’.. ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు ఇచ్చారు. తండ్రీ కొడుకులతో సినిమాలు చేసిన అదృష్టం నాకు దొరికింది’’ అని చె΄్పారు. నిర్మాత శివేంద్ర సింగ్ దుంగార్పూర్ మాట్లాడుతూ– ‘‘ఈ ఫెస్టివల్‌ని దేశంలోని 31 సిటీస్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదొక హిస్టారికల్ డే. ఈ మూడు రోజుల్లో అక్కినేనిగారి పది క్లాసిక్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూడబోతున్నారు’’ అన్నారు.ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు 1955లో లక్ష రూపాయలు విరాళం ఇచ్చి గుడివాడలో కళాశాల కట్టించారు. ఆయన దగ్గర పాతిక వేలే ఉంటే 75 వేలు అప్పు తీసుకొచ్చి మరీ లక్ష ఇచ్చారు. 70 ఏళ్ల క్రితమే ఆయన జన్మభూమి కాన్సెప్ట్ అనుకొని ఊర్లో స్కూల్ కట్టించారు. అనేక విద్యాలయాలకు విరాళాలు ఇచ్చారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. బుడమేరుపై వంతెన కట్టించిన ఘనత ఆయనది. కానీ, చేసిన సాయం గురించి ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు’’ అని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సంజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏఎన్ఆర్గారి శత జయంతిని భారత ప్రభుత్వం తరఫున సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఈ వేడుకలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అక్కినేని అభిమానుల్లో 600 వందల మందికి దుస్తులు బహూకరించారు. చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు‘‘ప్రతి రెండేళ్లకు ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాం. ఈ ఏడాది ఈ అవార్డుని చిరంజీవిగారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవిగారు ఎమోషనల్‌గా నన్ను హత్తుకుని.. ‘ఏఎన్ఆర్గారి శత జయంతి ఏడాదిలో నాకు అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. దీనికంటే పెద్ద అవార్డు లేదు’ అని అన్నారు. అక్టోబర్ 28న నిర్వహించే ఈ ఫంక్షన్లో అమితాబ్ బచ్చన్‌గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తాం’’ అని నాగార్జున తెలిపారు. -
ఏఎన్నార్‌తో నటించడం నా అదృష్టం: చిరంజీవి
లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20న ఏఎన్నార్ 100వ జయంతి సందర్భంగా ఫిలిం ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎన్నార్‌ను గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.అలనాటి గొప్ప నటులలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. ఆయన అద్భుతమైన నటన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గొప్ప స్థానం సంపాదించుకుంది. సినీపరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం. తనతో కలిసి నటించడం ఎన్నటికీ మర్చిపోలేను. ఆ అద్భుతమైన క్షణాలు నాకు మధురమైన జ్ఞాపకాలు అని రాసుకొచ్చారు. Remembering the legendary ANR,#AkkineniNageswaraRao garu, one of the greatest actors of all time on his 100th birth anniversary.An acting genius and A doyen of Cinema, ANR garu’s memorable performances remain etched in the hearts and minds of Telugu audiences. His… pic.twitter.com/nW0TCrz2Cf— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2024 చదవండి: ఇంగ్లీష్‌తో అక్కినేని అనుబంధం.. ఓ నిబద్ధతకు పాఠం -
అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!
అక్కినేని డ్యూయెట్స్ 50విజిల్ వేయండి.. పజిల్ విప్పండిఅక్కినేని నాగేశ్వరరావు మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య నటుడు. ముఖ్యంగా గృహిణులు ఏఎన్ఆర్ సినిమా కోసం ఎదురు చూసేవారు. దానికి తగ్గట్టే ఏఎన్ఆర్ సినిమాల కథాంశాలుండేవి. సావిత్రి, జమున ఆ తర్వాతి కాలంలో వాణిశ్రీ అక్కినేనికి సరిజోడుగా నటించి మెప్పు పొందారు. ఆయన సినిమాల్లో అందమైన యుగళ గీతాలుండేవి. అలాంటి 100 యుగళగీతాలను తలుచుకుందాం. అక్కినేని వల్ల మన జీవితంలో వచ్చిన ఆనందగీతాలను ఆస్వాదిద్దాం. ఈ తొలి పది పాటల్లో సైకిల్ మీద వెళుతూ బి.సరోజాదేవితో పాడే పాట ఏదో గుర్తుపట్టండి. అలాగే తర్వాతి రోజుల్లో కమెడియన్‌గా మారిన గిరిజతో ఎంతో మంచి డ్యూయెట్టు ఉంది. అది ఏది?1. ఓ దేవదా చదువు ఇదేనా (దేవదాసు)2. రాజశేఖరా నీపై మోజు తీర లేదురా (అనార్కలి)3. చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా (దొంగరాముడు)4. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము (మాయాబజార్)5. చెట్టులెక్కగలవా ఓ నరహరి (చెంచులక్ష్మి)6. ఆకాశ వీధిలో అందాల జాబిలి (మాంగల్యబలం)7. నేడు శ్రీవారికి మేమంటే పరాకా (ఇల్లరికం)8. వాడుక మరచెదవేల (పెళ్లికానుక)9. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి (వెలుగు నీడలు)10. మధురం మధురం ఈ సమయం (భార్యాభర్తలు)అక్కినేనికి కవి దాశరథి తన గ్రంథాన్ని అంకితమిచ్చారు. అందుకు కృతజ్ఞతగా అక్కినేని ఆయనకు పాటలు రాసే అవకాశం ఇచ్చాడు. దిగువ ఉన్న పది పాటల్లో దాశరథి రాసినవి ఉన్నాయి.. గుర్తు పట్టండి. అలాగే తెలుగు సినిమాల్లో తొలి వాన పాట కూడా ఉంది. బెంగళూరులో పాట ఏం రాయాలో తోచక కారులో తిరుగుతున్న ఆత్రేయకు అప్పుడే మొదలైన వాన ఆ పాటను రాయించి నేటికీ మనం తడిసేలా చేస్తోంది.11. పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక (ఇద్దరు మిత్రులు)12. నన్ను వదిలి నీవు పోలేవులే (మంచి మనసులు)13. ప్రేమయాత్రలకు బృందావనము (గుండమ్మ కథ)14. వినిపించని రాగాలే కనిపించని అందాలే (చదువుకున్న అమ్మాయిలు)15. చిటపట చినుకులు పడుతూ ఉంటే (ఆత్మబలం)16. నా పాట నీ నోట పలకాల సిలక (మూగమనసులు)17. నిలువుమా నిలువుమా నీలవేణి (అమరశిల్పి జక్కన)18. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా (డాక్టర్ చక్రవర్తి)19. కనులు కనులతో కలబడితే (సుమంగళి)20. పగడాల జాబిలి చూడు (మూగనోము)21. కన్నులు నీవే కావాలి (సుమంగళి)22. నువ్వంటే నాకెందుకో అంత ఇది (అంతస్తులు)23. అది ఒక ఇదిలే అతనికి తగులే (ప్రేమించి చూడు)24. సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా (మనుషులు మమతలు)25. ఒక పూలబాణం తగిలింది మదిలో (ఆత్మగౌరవం)26. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి (పూలరంగడు)27. విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు)28. విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియ (బందిపోటు దొంగలు)29. ఓ చామంతి ఏమిటే ఈ వింత (ఆత్మీయులు)30. కళ్లలో పెళ్లిపందిరి కనపడసాగే (ఆత్మీయులు)‘దసరా బుల్లోడు’తో అక్కినేని కలర్ పాటలు. స్టెప్పులు చూసే వీలు ప్రేక్షకులకు కలిగింది. ఘంటసాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఆయన స్థానంలో వి.రామకృష్ణను వినేందుకు కూడా సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పాటల్లో లక్ష్మితో మంచి డ్యూయెట్ ఉంది. చూడండి.31. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా (దసరా బుల్లోడు)32. నీ కోసం వెలసింది ప్రేమమందిరం (ప్రేమ్ నగర్)33. ఆకులు పోకలు ఇవ్వొద్దు (భార్యాబిడ్డలు)34. మనసులు మురిసే సమయమిది (ప్రేమలు పెళ్లిళ్లు)35. వయసే ఒక పూలతోట (విచిత్ర బంధం)36. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు)37. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా (బంగారు కలలు)38. జాబిల్లి చూసేను నిన్ను నన్ను (మహాకవి క్షేత్రయ్య)39. ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని భావాలో (మహాత్ముడు)40. మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు (సెక్రటరీ)1980ల తర్వాత పూర్తిగా అక్కినేని కొత్తతరం హీరోయిన్లతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గళంలో హుషారు పాటలతో కొనసాగారు. జయసుధ, జయప్రద, శ్రీదేవి, సుజాత వీరంతా ఎక్కువగా ఆయన పక్కన నటించారు. అక్కినేని హీరోగా రిటైర్ అయ్యే వరకు ఎన్నో హిట్లు ఉన్నా ఒక పది పాటలు చెప్పుకుందాం. ఈ లిస్ట్‌లోని చివరిపాటను మోహన్‌లాల్‌తో డ్యూయెట్గా అభినయించారు అక్కినేని. ఆ సినిమా సంగీత దర్శకుడు ఎవరు?41. నేల మీది జాబిలి నింగిలోన సిరిమల్లి (రాజా రమేష్)42. నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని (ప్రేమాభిషేకం)43. ఒక లైలా కోసం తిరిగాను దేశం (రాముడు కాదు కృష్ణుడు)44. మల్లెపూలు గొల్లుమన్నవి (అనుబంధం)45. మధురం జీవన సంగీతం (వసంత గీతం)46. చందమామ దిగి వచ్చే లోన (జస్టిస్ చక్రవర్తి)47. ఇది మేఘ సందేశమో (ఏడంతస్తుల మేడ)48. ఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచింది (అండమాన్ అమ్మాయి)49. తామరపువ్వంటి తమ్ముడు కావాలా (బంగారు కానుక)50. గోరువంక వాలగానే గోకులానికి (గాండీవం) – కూర్పు : కె -
మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని...
గొప్ప నటుడిగా, మంచి వ్యక్తిగా తనతో కలిసి నటించిన నటీనటులతోనూ, ప్రేక్షకులతోనూ ‘మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని...’ అనిపించుకున్నారు అక్కినేని. ‘‘అంతటి మహానటుడితో కలిసి నటించడం మా అదృష్టం’’ అంటున్నారు ప్రముఖ తారలు. ఈ నట సామ్రాట్ తమకు ఏ విధంగా ఆదర్శంగా నిలిచారో కొందరు నటీమణులు ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ విశేషాలు...నా మీద నాకు నమ్మకం వచ్చేలా చేశారు: షావుకారు జానకినాగేశ్వరరావుగారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా ‘అక్కా–చెల్లెళ్లు’ సినిమా గురించి చెప్పాలి. ఆ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్లో ‘పాండవులు పాండవులు తుమ్మెద...’ పాటకి డ్యాన్స్ చేయమని దర్శక–నిర్మాత అంటే, ‘పాట వద్దండీ... ఏదైనా డైలాగ్‌తో సీన్ ముగించవచ్చు కదా’ అంటూ వెనక్కి తగ్గాను. కానీ, ఆ చిత్రనిర్మాత రాజేంద్రప్రసాద్‌గారు, నాగేశ్వరరావుగారు పట్టుబట్టి చేయించారు. ‘డెఫినెట్‌గా హైలైట్ అవుతుంది... బాగుంటుందమ్మా చెయ్యి... ఆ తర్వాత చూడు’ అంటూ నాగేశ్వరరావుగారు ఎంతగానో ప్రోత్సహించారు. దాంతో చేశాను. ఆయన అన్నట్లే పాట హిట్ అయింది. ఆ తర్వాత ‘చూశావా... చెయ్యనన్నావు... ఎంత బాగా వచ్చిందో’ అన్నారు. మన మీద మనకు నమ్మకం లేని స్థితిలో అంతటి మహానటుడు ప్రోత్సహించి, చేయించడం అనేది నేను చేసుకున్న అదృష్టం అనిపించింది. మన ప్రతిభను గుర్తించి, ఎవరైనా ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. నా మీద నాకు నమ్మకం వచ్చేలా చేశారు. అప్పుడు స్టన్నయ్యా...ఇంకా నన్ను ఆయన అభినందించిన విషయాల్లో ముఖ్యమైనది ఒకటి చెబుతాను. నాగేశ్వరరావుగారిలానే నేనూ పెద్దగా చదువుకోలేదు. మా నాన్నగారి వృత్తిరీత్యా మేం ఎక్కువగా నార్త్‌లో ఉండేవాళ్లం. పదిహేనేళ్లకే పెళ్లయిపోయింది. ఆ తర్వాత మద్రాసులో ఉన్నాం. అనుకోకుండా సినిమాలకు అవకాశం వచ్చింది. నార్త్‌లో ఉన్నప్పటికీ మన తెలుగు భాష మీద ఉన్న ఇష్టంతో చాలా శ్రద్ధగా పట్టు సాధించాను. నేను తెలుగు మాట్లాడే తీరుని నాగేశ్వరరావుగారు బాగా మెచ్చుకునేవారు. ఆ ఉచ్చారణ, ఎక్కడ నొక్కాలి? ఎక్కడ తగ్గించాలి? వంటివి బాగుంటాయని ప్రశంసించేవారు. ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకు వాయిస్ ఇచ్చేదాన్ని. అప్పట్లో నాకు ఆల్ ఇండియో రేడియోలో ‘ఏ స్టార్’ స్టేటస్.ఇక కొందరు డైలాగ్స్ మింగేస్తున్నారని, సరిగ్గా పలకడంలేదని, నువ్వెందుకు వాళ్లకు తర్ఫీదు ఇవ్వకూడదని నాగేశ్వరరావుగారు అన్నప్పుడు నేను స్టన్నయ్యా. నా మీద ఆయన ఎంత భరోసా పెట్టుకున్నారో అప్పుడు అర్థమైంది. వహీదా రెహమాన్, కేఆర్ విజయలాంటి హీరోయిన్లకు వాయిస్ ఇచ్చాను. కానీ వారు కనిపించడంలేదు... జానకియే కనబడుతోందనే మాట రావడంతో ఎవర్నీ తక్కువ చేయడం ఇష్టంలేక వేరేవాళ్లకి వాయిస్ ఇవ్వడం మానేశాను. నాకు మంచి డైలాగ్స్ ఇచ్చిన రైటర్లకు, మంచి పాత్రలు ఇచ్చిన దర్శకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాను.ఆపరేషన్‌కి వెళుతూ గిఫ్ట్ ఇచ్చారు: లక్ష్మి మా అమ్మగారు (కుమారి రుక్మిణి) నాగేశ్వరరావుగారికి అమ్మగా, అత్తగా... ఇలా చాలా క్యారెక్టర్లు చేశారు. నా స్కూల్ సెలవులప్పుడు ఆ షూటింగ్స్ చూడ్డానికి అమ్మతో లొకేషన్‌కి వెళ్లేదాన్ని. సారథి స్టూడియోలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కి వెళ్లినప్పుడు నాగేశ్వరరావుగారిని చూశాను. ‘ఎంత పెద్ద యాక్టర్’ అంటూ అలా చూస్తుండిపోయాను. ‘ఏమ్మా... ఇవాళ స్కూల్ లేదా? ఫ్రీయా? వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ’ అంటూ చాలా ప్రేమగా మాట్లాడారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం) ఇప్పుడు తలుచుకున్నా ఆయనకు నేను హీరోయినా? అనిపిస్తుంది. అప్పట్లో నేను యాక్ట్ చేసిన ఏయన్నార్‌గారు, ఎంజీఆర్‌గారు, శివాజీ గణేశన్‌గారు... వీళ్లంతా వయసులో నాకన్నా చాలా పెద్దవాళ్లు. అంత పెద్దవాళ్లతో సినిమాలు చేయడం వల్ల చాలా నేర్చుకోగలిగాను. నాగేశ్వరరావుగారితో నా ఫస్ట్ సినిమా ‘సుపుత్రుడు’. కొడైకెనాల్లో షూటింగ్. మధురై నుంచి ఫ్లైట్‌లో వెళ్లాం. ఫ్లైట్‌లో కూర్చున్నాక ‘ఏమ్మా ఎలా ఉన్నావ్... ఇన్నాళ్లూ షూటింగ్‌కి వచ్చి నన్ను చూసేదానివి. ఇప్పుడు నువ్వే హీరోయిన్‌వా? ఇప్పటిదాకా ఏం బేబీ అన్నాను... ఇప్పట్నుంచి ఏం హీరోయిన్ అనాలి’ అని నవ్వారు. (కళ్లు లేకున్నాక్యాన్సర్ చూపుతారు)నన్ను ‘పెరుగన్నం’ అని పిలిచేవారుఫ్లైట్లో వెళుతున్నప్పుడు ‘నువ్వు చాలా ఇష్టపడి తినేవి ఏంటి’ అని అడిగితే ‘పెరుగన్నం సార్’ అన్నాను. అది కాదమ్మా... ‘జనరల్‌గా ఏం ఇష్టపడతావు’ అంటే ‘పెరుగన్నం’ అన్నాను. అప్పట్నుంచి నన్ను ఆయన ‘ఏయ్ పెరుగన్నం’ అని పిలిచేవారు. ఎక్కడ కనిపించినా ఇదే పిలుపు. అంతెందుకు ‘మిథునం’ ఫంక్షన్‌కి హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆ తర్వాత నాగేశ్వరరావుగారి అవార్డు ఫంక్షన్ ఉండటంతో వెళ్లాను. నేను, బాలు సార్, చంద్రమోహన్ అందరం వెళ్లాం. ‘నైట్ డిన్నర్ ఉంది... నీ పెరుగన్నం నీకు రెడీ... వస్తావా’ అంటే, బాలూగారూ ‘అవునండీ... మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా పెరుగన్నమే...’ అంటూ ‘పెరుగు లక్ష్మి’ అని పేరు పెట్టారాయన.మా అమ్మతో షూటింగ్‌కు వెళ్లిప్పటి (పన్నెండేళ్ల వయసు) నుంచి ఏఎన్నార్ గారిలో నేను గమనించిన ఒక విషయం ఏంటంటే... మనం కొన్ని విషయాలు మర్చిపోతుంటాం... కానీ ఆయన మాత్రం ఏదీ మర్చిపోరు. వాట్ ఎ మెమరీ అంటే... ఓ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లినప్పుడు నా స్కూల్ టైమ్‌లో నేను చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని, మాట్లాడితే ఆశ్చర్యపోయాను. ఇక సెన్సాఫ్ హ్యూమర్ అయితే సూపర్. నేను, వహీదా రెహమాన్‌గారు ఆయన కాంబినేషన్లో సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఇంటికి మమ్మల్ని డిన్న ర్కి పిలిచారు. అన్నపూర్ణమ్మ (ఏయన్నార్ సతీమణి), ఇంకా ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడిన విధానం చాలా బాగా అనిపించింది. నాగేశ్వరరావుగారి పిల్లలకు ఆయన క్లాస్ బిహేవియర్ వచ్చింది.నాగార్జునని చిన్నప్పుడు నేను సెట్లో చూసి, ‘ఏయ్ హీరో... నేనే నీ హీరోయిన్ని... డ్యూయెట్ పాడాలి’ అంటే సిగ్గు పడిపోయి పారిపోయేవాడు. ‘రేయ్ రారా... నీ హీరోయిన్ వచ్చింది’ అని నాగేశ్వరరావుగారు నవ్వేవారు. ఆయన నవ్వేటప్పుడు చక్కని పలువరుస, పెద్ద కళ్లు చూడముచ్చటగా ఉండేవి. ‘పల్లెటూరి బావ’లో యాక్ట్ చేసేటప్పుడు నా కూతురు (నటి ఐశ్వర్య) లొకేషన్‌కి వస్తే... ‘నాకు ఇంకో హీరోయిన్ రెడీ అయిపోయింది’ అని తనని ఎత్తుకున్నారు. నాతోనే ఆయన అంత చనువుగా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. కానీ ఓ షూటింగ్లో సుమిత్ర నాతో ‘అక్కా... ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన. ఇంత బాగా మాట్లాడతారనుకోలేదు’ అని నాతో అంది. అందరితోనూ ఆయన ఆ΄్యాయంగా మాట్లాడేవారు... సరదాగా ఉండేవారు. సెట్లో ఎవరూ టెన్షన్ పడని వాతావరణాన్ని క్రియేట్ చేసేవారు.‘నా హీరోయిన్’ అంటూ...అప్పట్లో మదరాసులో నాకు ‘కళా సాగర్’ అవార్డు ఇచ్చారు. ఆ ఫంక్షన్‌కి వచ్చిన నాగేశ్వరరావుగారు, శివాజీ గణేశన్‌గారు ‘నా హీరోయిన్’ అంటూ నా చేయి పట్టుకుని, స్టేజి మీదకు తీసుకెళ్లి, అవార్డు ఇచ్చిన సంఘటన నాకెప్పటికీ గుర్తే. ఒక ఆర్టిస్ట్‌గా నాకు ఇంతకన్నా ఏం కావాలి? అప్పట్లో మొబైల్ ఫోన్ లేదు... సెల్ఫీ తీసుకోవడానికి. ఇక నాగేశ్వరరావుగారి మనోధైర్యం గురించి చెప్పాలి. 1973లో అనుకుంటా ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి యూఎస్ వెళుతున్నారు. ‘పల్లెటూరి బావ’ సినిమా చేస్తున్నాం. ఆయన తల్లిగా సుకుమారిగారు నటిస్తున్నారు. ఆపరేషన్‌కి వెళ్లే ముందు ‘నేను మళ్లీ రావాలి.. ఐ విల్ కమ్‌బ్యాక్ పాజిటివ్లీ. కానీ ఏదైనా జరగకూడనిది జరిగితే... అందుకే నా గుర్తుగా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నా’ అని చాలా కూల్‌గా అన్నారు. మేం ‘అయ్యో... అలా అనకండి సార్’ అన్నాం. కానీ, గిఫ్ట్ ఇవ్వాల్సిందే అంటూ అమ్మాయిలకు వీఐపీ బ్రాండ్ మేకప్ వ్యానిటీ బాక్స్, అబ్బాయిలకు వీఐపీ బ్రీఫ్‌కేస్ ఇచ్చారు. నాకు రెడ్ కలర్ బాక్స్ ఇచ్చారు... ఇప్పటికీ ఆ గిఫ్ట్ నా దగ్గర భద్రంగా ఉంది.ఆయన రోజూ ఒక కప్పు మీగడ తినేవారు. ‘ఈ మీగడ తినీ తినీ నేను హాస్పిటల్‌కి వెళుతున్నాను. నువ్వు పెరుగన్నంలో మీగడ వేసుకుని తినకు. మళ్లీ నాలా హాస్పిటల్‌కి వెళ్లాలి’ అన్నారు. ఒకసారి నేను ఒక షూటింగ్‌కి వెళుతూ తాజ్ బంజారా నుంచి కారులో వెళుతుంటే, పంచెకట్టులో ఓ ఐదారుగురు కనిపించారు. ‘మన సార్లా ఉందే’ అని కారు ఆపాను. ఆయన, సుబ్బరామి రెడ్డిగారు, ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు. అప్పుడు టైమ్ ఉదయం ఆరు. నన్ను చూసి, ‘ఏం లక్ష్మి... ఎక్కడికి వెళుతున్నావు? షూటింగ్కా?’ అంటే... ‘సార్ మీ స్టూడియోకే వెళుతున్నాను’ అన్నాను. ‘వెరీ గుడ్... మై హీరోయిన్ లక్ష్మి’ అని తన ఫ్రెండ్స్‌కి పరిచయం చేశారు. వాకింగ్ స్టిక్ పట్టుకుని, ఆ పంచెకట్టులో ఆయన రూపాన్ని మర్చిపోలేను. ఆ ఆ΄్యాయంగా మాట్లాడటం అనే లెగసీ ఆయన కూతుళ్లకు, కొడుకులకు, ఆ తర్వాతి జెనరేషన్‌కి వచ్చింది.నాలోని భయాన్ని తీసేశారు: శారదనా ఫస్ట్ సినిమా (ఇద్దరు మిత్రులు) ఆయనతోనే. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘కన్యాశుల్కం’ సినిమాలో ఒక పాటకి డ్యాన్స్ చేశాను. అప్పుడు నాకు పదేళ్లు ఉంటాయేమో. నా పదహారేళ్లప్పుడు ‘ఇద్దరు మిత్రులు’లో నాగేశ్వరరావుగారి చెల్లెలిగా చేశాను. అందులో ఆయనవి రెండు పాత్రలు. ఒక పాత్రకు నేను చెల్లెల్ని. ‘ఈ సీన్ ఇలా చెయ్యి... ఇదయ్యాక అలా చెయ్యాలి’ అంటూ దగ్గర కూర్చుని చక్కగా నేర్పేవారు. ఆ వయసులో నాకు నటనంటే తెలియదు. ఇలాంటి పెద్దవాళ్లతో నటించడం అంటే చిన్న విషయం కాదు. నాకు ఆ అవకాశం రావడం నా అదృష్టం.మా ఫ్యామిలీలో పదమూడేళ్లకే పెళ్లి చేసి, పంపించేస్తారు. కానీ, మా అమ్మకు నన్ను ఆర్టిస్ట్‌ని చేయాలని ఉండేది. నాన్నని ఎంతో కన్విన్స్ చేసి, తీసుకొచ్చినప్పుడు నాకు దొరికిన అవకాశం ‘ఇద్దరు మిత్రులు’. ఆ సమయంలో ఎల్వీ ప్రసాద్‌గారి ఆఫీసులో నాకు నవరసాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అప్పుడు చెల్లెలి పాత్రకు ఆర్టిస్ట్ దొరక్క తర్జన భర్జన పడుతున్నారు. అది తెలిసి, ‘మా దగ్గర ఒక అమ్మాయి ఉంది’ అని ‘ఇద్దరు మిత్రులు’ యూనిట్‌కి ఫోన్ చేసి, ఆ పక్కన ఉన్న వారి ఆఫీసుకి పంపించారు. నాతో రెండు డైలాగ్స్ చెప్పించారు. ‘వండర్ఫుల్... నాగేశ్వరరావుగారి చెల్లెలిగా నువ్వే చేయబోతున్నావు’ అని డైరెక్టర్ (ఆదుర్తి సుబ్బారావు)గారు అన్నారు. సెట్లో నాగేశ్వరరావుగారిని చూసినప్పుడు పెద్ద నటుడు, వయసులోనూ పెద్దవారు కాబట్టి కాస్త భయపడ్డాను.కానీ మాలాంటి కొత్తవారిని ఆయన ప్రోత్సహించిన తీరు అద్భుతం. మాలోంచి భయాన్ని తీసేసేవారు. ‘శారదా.. ఈ సీన్ ఇలా చేయాలి’ అని చక్కగా నేర్పేవారు. తనది పెద్ద స్థాయి అని కాకుండా అందరితో కలిసిపోయేవారు. నటుడిగా ఆయన ఎంత గొ΄్పో.. వ్యక్తిగానూ అంతే గొప్ప. ఎదుటివాళ్లు బాగా యాక్ట్ చేస్తే కొందరు చూడలేరు. పైకొచ్చినా చూడలేరు. కానీ, నాగేశ్వరరావుగారికి అలాంటివి లేవు. ఆయనేమో ఆయన వర్క్ ఏమో అన్నట్లు ఉండేవారు. ఒక పాత్రను ఎలా అవగాహన చేసుకోవాలి? డైలాగ్స్ ఎలా పలకాలి వంటివి ఆయన్నుంచి నేర్చుకున్నాను. ఆయనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇంటికి వెళ్లాను. అదే ఆఖరిగా ఆయన్ను కలిసింది.డైలాగ్స్ చెప్పింది ఈ అమ్మాయేనా అన్నారు: రోజా రమణినాగేశ్వరరావుగారి ‘మూగ మనసులు’ సినిమాలోని ‘గోదారి గట్టుంది...’ పాటను ఆడిషన్‌కి వెళ్లినప్పుడు పాడటం వల్ల నేను ‘భక్త ప్రహ్లాద’ సినిమాకి సెలక్ట్ అయ్యాను. ఇక ఆయన కాంబినేషన్లో నటించే అవకాశం నాకు ‘మరపురాని మనిషి’ సినిమాలో వచ్చింది. అప్పుడు నాకు పదేళ్లు. ఆయన నాతో ‘అమ్మాయ్... నువ్వు తొందరగా ఎదిగిపో... నా పక్కన హీరోయిన్గా చెయ్యాలి. ఇలా చిన్నపిల్ల వేషం వేయకూడదు’ అని సరదాగా అన్నారు. ఆ తర్వాత ‘ఆలు మగలు’ సినిమాలో ఆయన కోడలిగా చేశాను. అప్పుడు కూడా ‘ఏంటమ్మాయ్... నువ్వు నా పక్కన హీరోయిన్గా చేస్తావనుకుంటే చిన్నపిల్ల, కోడలు వేషాలు వేస్తావ్’ అని చాలా జోవియల్‌గా అన్నారు. ఓ పదేళ్ల క్రితం అనుకుంటా... ఒకసారి గీతాంజలిగారు మా ఇంటికి వచ్చారు. ‘రోజా... ఇవాళ నాగేశ్వరావుగారి బర్త్‌డే.ఆయన ఇంటికి వెళుతున్నాను... నువ్వూ వస్తావా’ అన్నారు. ‘నేనెప్పుడూ అలా వెళ్లలేదు’ అన్నాను. ‘నాకోసం రావా ప్లీజ్. పెద్దాయన బెస్ల్సింగ్స్ తీసుకుందాం’ అన్నారావిడ. బ్లెస్సింగ్స్ అనగానే వెళ్లాలనిపించింది. ఇద్దరం వెళ్లాం. మేం వెళ్లినందుకు ఆయన ఎంత హ్యాపీగా ఫీలయ్యారంటే... ‘అదేంటీ... ఎప్పుడూ గీత మాత్రమే వస్తుంటుంది... నువ్వు వచ్చావ్’ అన్నారు. ‘నేనే తీసుకొచ్చా’ అన్నారు గీత. ‘ఓ... నువ్వు తీసుకొస్తే వచ్చిందా తను’ అన్నారాయన. వెంటనే నేను ‘మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను’ అన్నాను. ఆయన మాకు టిఫిన్ పెట్టారు. చాలాసేపు మాట్లాడారు. అదొక గ్రేట్ మెమరీగా నా మనసులో ఉండిపోయింది. ఆ తర్వాత ఒక ఫంక్షన్లో నా జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ ఇచ్చారాయన. ఆ స్టేజి మీద ‘భక్త ప్రహ్లాద’ సినిమా చూశాను. ఆ సినిమాలో ఈ అమ్మాయి వేదాలు, పాటలు, సంస్కృత డైలాగ్స్‌ని ఐదారేళ్లకే అంత బాగా ఎలా చెప్పగలిగింది? అసలు చెప్పింది ఈ అమ్మాయేనా? ఎవరైనా చెప్పారా? అని చాలామందిని అడిగాను. ఆ అమ్మాయే చెప్పిందన్నారు. దాంతో నేను మళ్లీ ఆ సినిమా చూశాను. లిప్ మూమెంట్ అంత కరెక్ట్‌గా ఎలా ఇచ్చిందా అని ఆశ్చర్యపోయాను’ అని నా గురించి చెప్పారు. మలయాళ సినిమా ‘చెంబరుత్తి’కి మద్రాసు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లు నాకు ఉత్తమ నటి అవార్డు ఇచ్చారు. ఆ అవార్డుని నాగేశ్వరరావుగారి చేతుల మీదగా అందుకోవడం అనేది నాకో మంచి మెమరీ.మా బాబు తరుణ్ కూడా ఆయన చేతుల మీదగా అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత నాగేశ్వరరావుగారి పేరు మీద ఉన్న అవార్డును నాకు ఇచ్చారు. అది స్వీకరించడం నా అదృష్టం. ఇక నాకు బాగా గుర్తుండిపోయినది ఒకసారి ఆయనతో కలిసి చేసిన ఫ్లైట్ జర్నీ. హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్నాం. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. ఆయనకు బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది. కానీ ఆయన ఒకే ఒక్క ఇడ్లీ, కొన్ని బొప్పాయి ముక్కలు తీసుకున్నారు. అంతే తీసుకుంటారా? అని అడిగితే, ‘అంతే అమ్మాయ్... బాగా ఆకలి అయితే ఇంకో ఇడ్లీ తింటాను’ అన్నారు. లిమిటెడ్ ఫుడ్, మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వాకింగ్ ఈ విషయాలన్నింటినీ చెప్పారు. ఆయన లైఫ్‌స్టైల్ బాగుంటుంది.నా ఎక్స్పెక్టేషన్ని దాటేశావు అన్నారు: మీనాఏయన్నార్గారి దగ్గర్నుంచి నేను నేర్చుకున్నది ‘పంక్చువాలిటీ’. ‘సీతారామయ్యగారి మనవరాలు’ సమయంలో ‘షూటింగ్ లొకేషన్లో ఎవరి కోసం అయినా నువ్వు వెయిట్ చేయొచ్చు. కానీ నీకోసం ఎవరూ వెయిట్ చేయకూడదు. అది ఫాలో అవ్వు’ అన్నారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ షూటింగ్ విషయంలో నేను అదే ఫాలో అవుతున్నాను. ఇక ఆ సినిమా చేసేటప్పుడు ‘నేను పెద్ద నటుణ్ణే. కానీ, ఇది నీ సినిమా. నువ్వే ఈ సినిమాకి బ్యాక్‌బోన్. క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకుని డైలాగ్స్ చెప్పాలి... ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి’ అని ఆయన అన్నారు. ఆ సినిమా ప్రివ్యూ చూశాక ‘న్యూ కమర్ కదా అనుకున్నాను. కానీ బాగా చేశావమ్మా... నా ఎక్స్పెక్టేషన్ని దాటేశావు. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది’ అని అన్నారు.ఎప్పుడు ఆలోచించినా ఏయన్నార్గారిలాంటి పెద్ద నటుడు, పైగా టైటిల్లో నా రోల్ కూడా ఉండటం అనేది చాలా పెద్ద విషయంగా అనిపిస్తుంటుంది. నిజానికి నేను ఆ సినిమా చేయాలా? వద్దా అనుకున్నాను. ఎందుకంటే చదువుకుంటున్న టైమ్‌లో ఆ చాన్స్ వచ్చింది. ఈ సినిమా క్లిక్ అయితే సినిమాల్లో కంటిన్యూ అవుదామని చేశాను. కట్ చేస్తే... నా లైఫ్ టర్నింగ్ మూవీ అయిపోయింది. ‘సీతారామయ్యగారి మనవరాలు’ ఫస్ట్ డే షూట్ అప్పుడు ఏయన్నార్‌గారి కాళ్లకు నమస్కారం చేసి, ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ సినిమా తర్వాత ఎక్కడ కనబడినా ‘నా మనవరాలు వచ్చింది... రా’ అని ఆయన అంటే... ‘తాతయ్యా... ఎలా ఉన్నారు’ అనేదాన్ని. నన్ను చూసి చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యేవారు. అంతటి లెజెండ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా లక్.-డి.జి.భవానిఇదీ చదవండి : అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి! -
ఏఎన్నార్ 100వ పుట్టినరోజు.. 10 క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్
దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర రావు (ఏఎన్ఆర్) 100వ పుట్టినరోజు సందర్భంగా పీవీఆర్ సంస్థ ఘన నివాళి ప్రకటించింది. అక్కినేని నాగేశ్వర రావు ఫిల్మ్ ఫెస్టివల్‌ను తేదీలని బయటపెట్టింది. సెప్టెంబరు 20-22 తేదీల మధ్య ఈ సినిమా వేడుక జరగనుంది. 31 నగరాల్లో ఏఎన్నార్ 10 క్లాసిక్ సినిమాల్ని రీ రిలీజ్ చేసి సెలబ్రేట్ చేసుకోనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ ఫెస్టివల్లో దేవదాసు, మాయాబజార్, భార్యా భర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడి గుండాలు, ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్, మనం తదితర సినిమాలని ప్రదర్శిస్తారు. ఇకపోతే ఏఎన్ఆర్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు వందల సినిమాలు చేశారు. చివరగా అక్కినేని కుటుంబమంతా కలిసి నటించిన 'మనం'లో ప్రధాన పాత్ర పోషించారు. ఒకప్పటి తరానికి బాగా దగ్గరైన ఏఎన్నార్ మూవీస్ మళ్లీ థియేటర్లలోకి రానుండటం విశేషం.(ఇదీ చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)#CelebratingANR100 with 10 classic films of the legend #AkkineniNageswaraRao Garu ✨Immerse yourself in the timeless classic of love and sacrifice, #Devadasu, and relive the finest moments of cinema ❤️Catch the iconic films of #ANR Garu on the big screen from September 20th… pic.twitter.com/7UXOuFRgOr— Annapurna Studios (@AnnapurnaStdios) September 15, 2024 -
ఆ ఇద్దరూ నాకు దైవసమానులు: చిరంజీవి
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు నాకు దైవసమానులు, వారితో కలిసి పని చేయడం అదృష్టం అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా విశాపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి చిరంజీవి, సీనియర్ హైకోర్టు న్యాయమూర్తి ఆకుల శేష సాయి, వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నో మంచి సలహాలిచ్చారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనకు చిరకాల మిత్రుడని, అందరినీ ఆకట్టుకునే తత్వం తనదని తెలిపారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఒక మంచి అవకాశమన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ సినీపరిశ్రమకు రెండు కళ్లువంటి వారని వీరిద్దరూ తనకు జీవితంలో ఎన్నో మంచి సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి మాట్లాడుతూ.. 'యండమూరి వీరేంద్రనాథ్ నవలల వల్ల యువతకు ఆలోచన, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఈ సాహిత్య సభకు పెద్ద ఎత్తున ప్రజలు రావడం సంతోషం. సాహిత్య కారులతో పులకించిన నేల ఉత్తరాంధ్ర.. తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్, ఏఎన్నార్' అని చెప్పుకొచ్చారు. నిజమైన వారసుడు చిరంజీవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 'లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యక్రమంలో చిరంజీవితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు నిజమైన వారసుడు చిరంజీవి. చిరంజీవి తెలుగు సినిమాకు ఎంతో పేరు ప్రఖ్యతలు తెచ్చారు. చిరంజీవి కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు' అని వ్యాఖ్యానించారు. చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి! -
నాగేశ్వరరావు గారి చివరి క్షణాలు నాకు బాగా గుర్తుంది
-
రామారావుతో చేయలేని పనులు నాగేశ్వర్ రావుతో చేసేదాన్ని
-
దూరంగా ఉన్నప్పుడు తిట్టుకునేవారు...ఎదురుపడితే నవ్వుతూ మాట్లాడుకునేవారు...
-
జమునని బాయ్‌కాట్ చేసిన ఎన్టీఆర్-ఏఎన్నార్.. అయినా లెక్కచేయని నటి
గడుసుతనం కలబోసిన సౌందర్యానికి పెట్టింది పేరు జమున. వెండితెర సత్యభామగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన జమున సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. పొగరు, భక్తి, విలనిజం ఇలా నవరసాలు పలకించగలిగే అరుదైన నటిగా పేరు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె కోసమే కొన్ని పాత్రలు పుట్టాయేమో అనేంతలా నటించి మెప్పించారు. ఆనాటి స్టార్ హీరోలందరితో జతకట్టిన జమున కెరీర్ సాఫీగా సాగుతున్న దశలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో విభేదాలు అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇకపై జమునతో నటించమని ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాయ్‌కాట్ కూడా విధించారు. దీంతో ఇక జమున కెరీర్ ముగిసిపోతుందేమో అనుకున్నారంతా. అయినా సరే చేయని తప్పుకు సారీ చెప్పేది లేదంటూ భీష్మించుకున్న తీరు ఆమె ఆత్మాభిమానానికి అద్దం పడుతుంది. అగ్రస్థాయి హీరోలు పక్కన పెట్టినా లెక్కచేయకుండా హరనాథ్, జగ్గయ్య వంటి హీరోలతో నటించి వరుస విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత గుండమ్మ కథ సినిమా కోసం అప్పటి నిర్మాత చక్రపాణి జోక్యం చేసుకొని స్టార్ హీరో,హీరోయిన్ల మధ్య విభేదాలు సరైనవి కావని కాంప్రమైజ్ చేయడంతో జమున గుండమ్మ కథలో నటించారు. ఎన్టీఆర్‌కు జోడీగా సావిత్రి, ఏఎన్నార్ సరసన జమున అలరించారు. సావిత్రి సౌమ్యంగా నటించిన తీరు, జమున కొంటెతనంతో పలికించిన సంభాషణలు ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ చిరస్మరణీయమే. -
తాగే బ్రాండయినా మార్చుకో లేదా తీరు మార్చుకో.. బాలయ్యకు వార్నింగ్
తెలుగు సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖించిన దిగ్గజాలలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. జనవరి 22న ఆయన వర్ధంతి కాగా అదేరోజు నందమూరి బాలకృష్ణ 'అక్కినేని తొక్కినేని' అంటూ ఏఎన్నార్‌ను కించపరిచేలా మాట్లాడటంతో అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వరుసగా సినిమాలు విజయం సాధించడంతో బాలకృష్ణకు గర్వం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నెల్లూరులో ఏఎన్నార్ అభిమానులు బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. నర్తకి సెంటర్లో బాలయ్య ఫ్లెక్సీని దగ్ధం చేశారు. వెంటనే బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాగే బ్రాండ్ అయినా మార్చుకో లేదా మాట తీరైనా మార్చుకో అని నినాదాలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. చదవండి: విజయ్ ఆంటోని ఆరోగ్యంపై క్లారిటీ ఎన్టీఆర్ వర్ధంతి నాడు నాగ్ అలా.. ఏఎన్నార్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. -
ట్రెండ్ సెట్టింగ్ బుల్లోడు
ఒక్కో తరంలో ఒక్కో సినిమా ఉంటుంది. ఒక్కో యాక్టర్ కెరీర్ లో ఒక్కో సినిమా ఉంటుంది. కమర్షియల్ సినిమాలే అయినా... కాసులు కురిపించడంతో పాటు, పాపులర్ కల్చర్ పైనా ప్రభావం చూపెడతాయి. పేరు దగ్గర నుంచి పాటలు, దుస్తుల దాకా అనేక విషయాల్లో ఆ తరాన్నీ, ఆ తరువాతి సినిమాలనూ ప్రభావితం చేస్తాయి. అనేక తరాల పాటు గుర్తుండిపోతాయి. అక్కినేని నటించిన ‘దసరా బుల్లోడు’కి అలాంటి ప్రత్యేకతే ఉంది. ఇప్పటికి సరిగ్గా 50 ఏళ్ళ క్రితం 1971 జనవరి 13న రిలీజైన ‘దసరా బుల్లోడు’ అప్పట్లో ఓ సంచలనం. ఇప్పటికీ ఓ తరానికి తీపి జ్ఞాపకం. అది 1970ల నాటి మాట. తెలుగు తెరపై అప్పుడప్పుడే కలర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కంటే ఖర్చు ఎక్కువయ్యే కలర్ సినిమాలంటే పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ మోజు పెరుగుతున్న కాలం. అలా కలర్ సినిమాల శకం ప్రారంభంలో వచ్చిన చిత్రం ఏయన్నార్ ‘దసరా బుల్లోడు’. ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్ తొలిసారిగా కలర్లో తీసిన సినిమా అది. ఆ సినిమాకు ముందు అక్కినేని ప్రస్థానం వేరు. ‘దసరా బుల్లోడు’ తరువాత ఆ ప్రభావంతో ఆయన తన పంథా మార్చి, చేసిన ప్రయాణం వేరు. అదీ ‘దసరా బుల్లోడు’ స్పెషాలిటీ! జయలలిత లాస్... వాణిశ్రీకి గెయిన్! ‘దసరా బుల్లోడు’ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది – అక్కినేని, ఆయనకు జంటగా నటించిన హీరోయిన్ వాణిశ్రీ. నిజానికి, ఈ చిత్రంలో వాణిశ్రీ కన్నా ముందు హీరోయిన్గా దర్శక, నిర్మాతలు ఎంచుకున్నది – తరువాతి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన జయలలితను! అయితే, అదే సమయంలో నిర్మాత ఎం.ఎస్. రెడ్డి నిర్మిస్తున్న ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ విజయము’లో, ఎమ్జీఆర్ హీరోగా చేస్తున్న చిత్రంలో జయలలిత నటిస్తున్నారు. ఏమైందో ఏమో ‘దసరా బుల్లోడు’ షూటింగ్ వారంలో ఉందనగా, జయలలితకు కుదరదంటూ ఆమె తల్లి లెటర్ పంపారు. దిక్కుతోచని వి.బి. అప్పటికే పేరు తెచ్చుకున్న వాణిశ్రీని అప్పటికప్పుడు హీరోయిన్గా అనుకున్నారు. ఎంత డబ్బయినా ఫరవాలేదని ఆమె డేట్లు ఎడ్జస్ట్ చేయించుకున్నారు. ఆ సినిమాకు ఏయన్నార్ పారితోషికం పాతిక వేలైతే, అర్జెంటుగా వాణిశ్రీ డేట్ల కోసం ఆమె బంధువుకు అడగకుండానే ఇచ్చింది యాభై వేలట! ఆ సంగతి వి.బి.నే స్వయంగా వెల్లడించారు. అలా ‘దసరా బుల్లోడు’ జోడీ అయ్యారు వాణిశ్రీ. అక్కడ నుంచి వాణిశ్రీ హవా మొదలైంది. ‘దసరా బుల్లోడు’ హిట్‌తో వాణిశ్రీకి స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ‘ప్రేమ్‌నగర్’ లాంటి కెరీర్ బెస్ట్‌లు రావడానికి ఈ సినిమా పునాది వేసింది. అక్కినేని, వాణిశ్రీలది హిట్ పెయిర్ అనే ధోరణి పాకింది. వారిద్దరితో 20+ సినిమాలొచ్చాయి. కష్టాలు దాటిన కలర్ ఫుల్ సినిమా నృత్య దర్శకుడు హీరాలాల్ సారథ్యంలో ‘పచ్చగడ్డి కోసేటి...’ పాట చిత్రీకరణతోనే పచ్చనిచేలలో తొలి రోజు షూటింగ్ ఆరంభమైంది. ప్రముఖ నటీనటులందరూ పాల్గొనగా, రోజుకు 200 మంది యూనిట్‌తో, ఓ తిరణాల లాగా 12 రోజులు ఈ కలర్ చిత్రం షూటింగ్ చేశారు. తీరా అంతా అయ్యాక, మొదటి రోజు మినహా మిగతాదేదీ కెమెరాలో చిత్రీకరణ జరగలేదని తెలిసింది. తరువాత మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ఆ రోజుల్లో కొత్తగా ఆరంభమైన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కె.ఎల్.ఎన్. ప్రసాద్ లక్ష్మీఫిలిమ్స్ అండగా నిలిచింది. ఇలా ఎన్నో అవరోధాలు దాటి, ‘దసరా బుల్లోడు’ రిలీజై, జనాదరణ పొందాడు. పంచె కట్టులో, పసందైన పాటలు, స్టెప్పులతో అక్కినేని అలరించారు. తొలి ప్రయత్నంతోనే డైరెక్టర్‌గా వి.బి. హిట్టయ్యారు. వరసగా తెలుగు, తమిళ, హిందీల్లో చిత్రాలను రూపొందించారు. అన్నా వదినల సొంత బిడ్డలా తిరిగే ఓ పల్లెటూరి దసరా బుల్లోడి (అక్కినేని)ని పట్నంలో చదువుకున్న తన కూతురి (చంద్రకళ)కిచ్చి ఆస్తి కాజేయాలని అనుకొంటాడు ఓ దుష్టుడు (నాగభూషణం). కానీ, ఊళ్ళోనే మరో అమ్మాయిని (వాణిశ్రీ)ని ప్రేమిస్తాడు హీరో. ఈ ముగ్గురి ప్రేమకథలో జరిగే ట్విస్టులు, ఒకరి కోసం మరొకరు చేసే త్యాగాలు, విధి ఆడే వింత నాటకాలు ఈ చిత్రకథ. ఎస్వీఆర్, సూర్యకాంతం, గుమ్మడి, అంజలీదేవి, పద్మనాభం – ఇలా భారీ తారాగణం ఉన్న సినిమా ఇది. కలర్ సినిమాల్లో... తెరపై రంగుల్లో అందంగా కనిపించడం కోసం ఆ రోజుల్లో నటీనటులు కాస్తంత మందంగానే మేకప్ దట్టించేవారు. పెదాలు, నోరు ఎర్రగా కనిపించడం కోసం... రంగు గట్టిగానే వేసుకొనేవారు. ‘దసరా బుల్లోడు’ చిత్రాన్ని ఇవాళ బుల్లితెరపై చూస్తున్నా, ఆ సంగతి అర్థమవుతుంటుంది. కథలోని డ్రామా, శృంగారం పాలు, హుషారైన పాటలు, మనసును కదిలించే సన్నివేశాలు కలిసి ఆ రోజుల్లో ఈ చిత్రం జనాన్ని ఓ ఊపు ఊపేసింది. సినిమా మొదట్లోనే దసరా సందర్భంగా హీరోతో పులి వేషం డ్యాన్స్, నెమలి డ్యాన్స్, కోలాటాల లాంటివి చేయడం గ్రామీణ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పాట ప్రయాణదిశ మార్చిన ఆ(బూ)త్రేయ! అలాగే, యాభై ఏళ్ళ క్రితం ‘దసరా బుల్లోడు’ పాటలు ఓ సంచలనం. రేడియోలో ఆ పాటలు మోగని రోజు లేదు. వినపడని ఇల్లు లేదు. కె.వి. మహదేవన్ సంగీతం ఒక ఎత్తయితే, ఆత్రేయ సాహిత్యం మరో కొత్త ఎత్తు. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ..’, అలాగే సంతోష, విషాద సందర్భాలు రెంటిలో వచ్చే ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా..’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ – ఇలా పాటలు సూపర్ హిట్. అన్నిటి కన్నా ముఖ్యంగా ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్...’ లాంటి పాపులర్ శృంగార సినీగీత సాహిత్యానికి ఈ సినిమాతోనే తెలుగు నేల స్వాగతం పలికింది. తెలుగు సినిమాకు ఆ రకంగా అది ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి సినీగీతం పూర్తి కమర్షియల్ దిశలోకి మలుపు తిరిగింది. బూతును కూడా పాటలో అందంగా చెప్పారంటూ సినీ గీత రచయిత ఆత్రేయను ‘‘బూత్రేయ’’ అనడం మొదలెట్టారు – గిట్టని జనం. ఎవరేమన్నా అప్పటి నుంచి మారిన కాలం, మారిపోయిన సామాన్యుల అభిరుచికి తగ్గట్టుగా ఆ సుడిగుండంలోనే ఇప్పటిదాకా మన సినీగీతాలు సుడులు తిరుగుతూ ఉండడం గమనార్హం. నాలుగు వారాలకు ఇండస్ట్రీ రికార్డ్! లేట్ రన్లో కూడా ‘దసరా బుల్లోడు’ మరో 3 కేంద్రాలలో (తుని, ప్రొద్దుటూరు, కరీంనగర్) వంద రోజులు ఆడడం విశేషం. అప్పట్లో వసూళ్ళలో ‘దసరా బుల్లోడు’ది ఓ ఇండస్ట్రీ రికార్డు. రిలీజైన తొలి 4 వారాలకే ఆ చిత్రం రూ. 25 లక్షల గ్రాస్ వసూళ్ళు సాధించడం తెలుగు సినీ పరిశ్రమలో అంతకు మునుపెన్నడూ కనివిని ఎరుగని విషయం. ‘దసరా బుల్లోడు’ తరువాత వచ్చిన ఏయన్నార్ ‘ప్రేమ్‌నగర్’ (1971) ఇంకా ఎక్కువ వసూళ్ళు తెచ్చుకొని, తొలి 50 రోజులకు రూ. 33 లక్షల గ్రాస్ కలెక్షన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘దసరా బుల్లోడు’ మూలకథ ఆధారంగా, కొన్ని మార్పులు చేర్పులతో తరువాత తమిళంలో శ్రీధర్ దర్శకత్వంలో ఎమ్జీఆర్ హీరోగా ‘ఉరిమై కురళ్’ (1974) వచ్చింది. హిట్టయింది. ఇక, వి.బి.నే స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో జితేంద్ర, రేఖ, షబానా ఆజ్మీలతో ‘రాస్తే ప్యార్ కే’ (1982) పేరిట ‘దసరా బుల్లోడు’ను హిందీలో రీమేక్ చేశారు. డైరెక్షన్‌కు అక్కినేని నో! ఇవాళ్టి ప్రముఖ నటుడు జగపతిబాబు తండ్రి, ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాతోనే దర్శకుడయ్యారు. అసలు ఈ కథ తయారు చేసిందీ ఆయనే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, బి.ఎస్సీ చదువుకొన్న ఆయన కృష్ణాజిల్లాలో తాను పుట్టి పెరిగిన పల్లెటూరు, మనుషుల మనస్తత్వాలు, ఇంట్లోని వ్యక్తులు, కళ్ళారా చూసిన వాస్తవ సంఘటనల ఆధారంగా స్వయంగా ఈ కథ సిద్ధం చేశారు. అయితే, ఈ సినిమాకు దర్శకత్వం వహిం చాల్సింది మాత్రం మొదట ఆయన కాదు – జగపతి సంస్థకు పర్మినెంట్ దర్శకుడైన ‘విక్టరీ’ మధుసూదనరావు! తీరా ఆయన బిజీ అన్నారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగారు. ఆదుర్తికీ అవలేదు. ఇంతలో వి.బి. రాజేంద్రప్రసాద్ ‘అక్కా చెల్లెలు’ చిత్రాన్ని నిర్మించారు. కానీ, ఆ తరువాతా ఆ దర్శకులంతా బిజీనే! ఇంతలో అక్కినేని సినిమా ఒకటి అనుకోకుండా క్యాన్సిలైంది. ఆ కాల్షీట్లు ఖాళీ అయి, అర్జెంటుగా సినిమా నిర్మించాల్సి వచ్చింది. ‘దసరా బుల్లోడు’ స్క్రిప్టు సిద్ధం చేసి, అక్కి నేనికి వినిపించిన వి.బి చివరకు అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారు. కానీ రంగస్థల నటుడు, నిర్మాతగా అనుభవజ్ఞుడైన వి.బి. రాజేంద్ర ప్రసాద్‌నే డైరెక్ట్ చేయాల్సిందని ప్రోత్సహించారు ఏయన్నార్. తామంతా వెన్నంటి ఉంటామన్నారు. ‘‘కాదూ... కూడదంటే, ఇక నీ సినిమాల్లో నటించను’’ అని బెదిరించారు కూడా! దాంతో, రాజేంద్రప్రసాద్ సాహసించి దర్శకుడు కాక తప్పలేదు. అక్కినేనికి తొలి గోల్డెన్ జూబ్లీ హిట్! కమర్షియల్‌గా ‘దసరా బుల్లోడు’ పెద్ద హిట్. ఆ రోజుల్లో ఈ సినిమా 35 ప్రింట్లతో రిలీజైంది. 29 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 22 సెంటర్లలో (హాలు షిఫ్ట్ అయిన కర్నూలుతో కలిపి) శతదినోత్సవం చేసుకుంది. చిత్ర యూనిట్ తరలి రాగా, ట్రాక్టర్లో అక్కినేనిని ఊరేగిస్తూ, గుడివాడ నీలా మహల్ థియేటర్లో 1971 ఏప్రిల్ 24న వంద రోజుల వేడుక ఘనంగా జరిపారు. ఆ మరునాడే హైదరాబాద్ శాంతి థియేటర్లోనూ శతదినోత్సవం చేశారు. ‘దసరా బుల్లోడు’ రిలీజైన పదిహేను వారాలకు అక్కినేనిదే ‘సుపుత్రుడు’ వచ్చింది. ఆ కొత్త సినిమా రిలీజ్ కోసం అనేక కేంద్రాలలో పాత ‘దసరా బుల్లోడు’ను పక్కకు తప్పించారు. అయినా, 4 కేంద్రాలలో (విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, షిఫ్టయిన గుంటూరుల్లో) 16వ వారం నుంచి కూడా ‘దసరా బుల్లోడు’ హవా కొనసాగింది. వాటిలో 200 రోజులు ఆడింది. తిరుపతిలో కొద్ది గ్యాప్ తరువాత 213వ రోజు నుంచి మరో 6 వారాలు సినిమా ఆడింది. ఇక, హైదరాబాద్‌లో షిప్టింగులు, గ్యాప్‌లతో ‘దసరా బుల్లోడు’ ఏకంగా 365 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. అలా అక్కినేని సినీకెరీర్ లో 50 వారాలు ఆడిన తొలి స్వర్ణోత్సవ (గోల్డెన్ జూబ్లీ) చిత్రంగా చరిత్ర కెక్కింది. తర్వాత మరో దశాబ్దికి ‘ప్రేమాభి షేకం’(1981)తో అక్కినేని మరో గోల్డెన్ జూబ్లీ హిట్ సాధించారు. అది దసరా బుల్లోడు కారు! ‘దసరా బుల్లోడు’ తెలుగులో అంత పేరు, వసూళ్ళు సాధించినా అతి మంచితనం వల్ల దర్శక, నిర్మాత రాజేంద్రప్రసాద్‌కు లాభాలు మిగల్లేదు. సాక్షాత్తూ ఆయనే ఆ తరువాతి కాలంలో ఆ సంగతి వెల్లడించారు. ‘దసరా బుల్లోడు’లో ప్రధానభాగం అమలాపురంలో, విజయవాడ చుట్టుపక్కల భట్లపెనుమర్రు తదితర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం షూటింగులో వాడిన ఎర్రటి ‘బీచ్ బగ్గీ’ అనే ఫారిన్ కారు అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్! దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తనకు విజయం అందించిన ‘దసరా బుల్లోడు’ అన్నా, ఆ చిన్న కారు అన్నా జగపతి పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్‌కు పంచప్రాణాలు. అదే కారును నాగార్జున హీరోగా తీసిన ‘కెప్టెన్ నాగార్జున’లో కూడా వాడారు. అయితే, 1990లలో ఒకానొక దశలో జీవితంలో అన్నీ కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డారు వి.బి. ఆ పరిస్థితుల్లో ఆ కారును అమ్మేయాల్సి వచ్చింది. అపురూప జ్ఞాపకమైన ఆ కారును అలా అమ్మే యాల్సి వచ్చినందుకు ఆయన చాలా బాధ పడ్డారు. విశేషం ఏమిటంటే, వి.బి. రాజేంద్రప్రసాద్ తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షరరూపమిస్తూ, ఆ పుస్తకానికి కూడా ‘దసరా బుల్లోడు’ అనే టైటిలే పెట్టడం! – రెంటాల జయదేవ -
ఎన్టీయార్ వర్సెస్ ఏయన్నార్!
ఎన్టీయార్... ఏయన్నార్... ఇద్దరు అగ్ర హీరోలు. సినీ పరిశ్రమకు ఇద్దరూ రెండు కళ్ళు. పలకరింపులున్నా, కలసి పనిచేస్తున్నా – బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ మాత్రం వదలని ఇద్దరు ప్రత్యర్థి మిత్రులు! సంక్రాంతి లాంటి తెలుగు వారి పెద్ద పండుగకు ఆ టాప్ స్టార్ల ఇద్దరి సినిమాలూ ఒకదానిపై మరొకటి పోటీకొస్తే? పైగా, ఆ పోటీపడ్డ సినిమాలు కూడా ఆ హీరోలు స్వయంగా నిర్మించిన సొంత సినిమాలైతే? తెలుగు సినీచరిత్రలో 60 ఏళ్ళ క్రితం ఒకే ఒక్కసారి ఆ ‘క్లాష్ ఆఫ్ ది టైటాన్స్’ జరిగింది. ఆ కథేమిటంటే... నిజానికి, అగ్రహీరోలు ఎన్టీయార్, ఏయన్నార్ల ఇద్దరి సినిమాలూ ఒకే రిలీజ్ టైమ్‌లో పోటీపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, సరిగ్గా అరవై ఏళ్ళ క్రితం 1961 నాటి ఆ సంక్రాంతి ప్రత్యేకత – ఆ అగ్రహీరోలు స్వయంగా నిర్మించిన వారి సొంత సినిమాలు ఒక దానితో మరొకటి ఢీ కొట్టడం! ఒకటి – ఎన్టీయార్ స్వయంగా నిర్మిస్తూ, నటిస్తూ, దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం ‘సీతారామ కల్యాణం’. రెండోది – ఏయన్నార్ తన సొంత సంస్థ అన్నపూర్ణా పిక్చర్స్‌లో నటించిన సాంఘిక చిత్రం ‘వెలుగు నీడలు’. అలా వారిద్దరి సొంత సినిమాలూ పోటీపడ్డ సందర్భం అదొక్కటే. విచిత్రంగా పోటీపడ్డ రెండు సినిమాలూ సూపర్ హిట్టే! రెండూ ఆణిముత్యాలే!! దేని ప్రత్యేకత దానిదే! మాతాపిత పాదపూజ... మెగాఫోన్‌తో ఫస్ట్ టైమ్... ‘సీతారామ కల్యాణం’తో ఎన్టీఆర్ తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తారు. నిజానికి, ఎన్టీఆర్‌ను రాముడిగా, ఎస్వీఆర్ను రావణుడిగా పెట్టి ఈ సినిమా తీయాలనీ, ఎన్టీఆర్‌కు గురుతుల్యుడైన కె.వి. రెడ్డి దర్శకత్వం చేయాలనీ మొదటి ప్లాన్. ఈ చిత్రకథ కోసం ఎన్టీఆర్ బంధువు, స్నేహితుడైన ధనేకుల బుచ్చి వెంకట కృష్ణ చౌదరి ‘వాల్మీకి రామాయణం’లో లేని అనేక జనశ్రుతి కథలనూ, పురాణ గాథలనూ సేకరించారు. గమ్మత్తైన ఆ అంశాల ఆధారంగా రావణబ్రహ్మ గురించి మరింత తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ పాత్ర తానే వేయాలని ముచ్చటపడ్డారు. అయితే, వెండితెర శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీనివాసుడిగా ఎన్టీఆర్‌ను మెచ్చిన జనం, ప్రతినాయకుడైన రావణ బ్రహ్మ పాత్రలో ఆయనను చూడలేరని కె.వి. రెడ్డి వాదన. సినీ జీవిత దర్శక గురువు కె.వి. రెడ్డి పక్కకు తప్పుకున్నా, ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు. దర్శకుడిగా ఎవరి పేరూ వేయకుండా, తానే తొలిసారిగా ఆ సినిమా డైరెక్ట్ చేసి, జనాన్ని మెప్పించారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నా రు. తల్లితండ్రులకు పాదపూజ చేసి, వారి పాదపద్మాలకు ఎన్టీఆర్ తన ఆ తొలి దర్శకత్వ ప్రయోగాన్ని సమర్పించారు. ‘సీతారామ కల్యాణం’ టైటిల్స్ చివర సినిమాలో ఆ పాదపూజ దృశ్యం కనిపిస్తుంది. ఎన్టీఆర్ సొంత చిత్రాల్లో తల్లితండ్రులకు పాదపూజ కనిపించేది ఆ ఒక్క చిత్రంలోనే! సావిత్రి ఆధిక్యానికి శుభారంభం! ‘వెలుగు నీడలు’కు అక్కినేని ఆస్థాన దర్శకుడైన ఆదుర్తి సుబ్బారావే దర్శకుడు. అప్పట్లో ఆదుర్తి వద్ద అసోసియేట్ డైరెక్టరైన కె. విశ్వనాథ్ ఈ చిత్ర రూపకల్పన, చిత్రీకరణల్లో కీలకభాగస్వామి. ‘వెలుగు నీడలు’కు ముందు దశాబ్దమంతా అక్కినేని – సావిత్రి వెండితెరపై హిట్ పెయిర్‌గా వెలిగారు. కానీ, ‘వెలుగు నీడలు’ నుంచి సావిత్రికి ఆధిక్యమిచ్చే కథలు, కథనాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి సావిత్రి పోషించే పాత్ర చుట్టూ సినిమాలు తిరగడం, కథలో అక్కినేనికి జోడీగా సైడ్ హీరోయిన్ ఉండడం కామన్ అయ్యింది. తరువాత ఓ దశాబ్ద కాలం పాటు ‘మంచి మనసులు’, ‘మూగ మనసులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘డాక్టర్ చక్రవర్తి’ – ఇలా అనేక సినిమాలు ఆ పద్ధతిలో వచ్చాయి. ఆ రకంగా తెలుగు తెరపై సావిత్రి ఆధిక్యాన్ని ప్రజానీకానికి ప్రదర్శించిన తొలి చిత్రం ‘వెలుగు నీడలు’. ఆ పాటలు... ఆల్ టైమ్ హిట్స్! ‘సీతారామ కల్యాణం’, ‘వెలుగు నీడలు’ – రెండూ మ్యూజికల్ హిట్లే. ‘సీతారామ కల్యాణం’లో సముద్రాల సీనియర్ రాయగా, గాలి పెంచల నరసింహారావు స్వరపరచిన ‘శ్రీసీతారాముల కల్యాణము చూతము రారండి..’ పాట ఆల్ టైమ్ హిట్. ఎన్టీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ కల్యాణ గీతం ఇవాళ్టికీ శ్రీరామనవమి పందిళ్ళలోనూ, గుళ్ళలోనూ, పెళ్ళిళ్ళలోనూ మారుమోగుతూ, తెలుగువారి జనజీవితాల్లో భాగంగా నిలిచింది. అలాగే, దేశ స్వాతంత్య్ర దినోత్సవం కానీ, గణతంత్ర దినోత్సవం కానీ వచ్చాయంటే – పెండ్యాల స్వరసారథ్యంలోని ‘వెలుగు నీడలు’లో శ్రీశ్రీ రాసిన దేశభక్తి గీతం ‘పాడవోయి భారతీయుడా...’ ఇప్పటికీ ఊరూవాడా వినపడుతుంది. అలాగే శ్రీశ్రీ రచించిన ఆలోచనాభరిత గీతం ‘కల కానిది..’ కూడా! ఆ మాటకొస్తే ఈ రెండు చిత్రాల్లో ‘వెలుగు నీడలు’ పెద్ద మ్యూజికల్ హిట్. అందులో శ్రీశ్రీయే రాసిన ‘ఓ రంగయో పూలరంగయో..’, ‘హాయి హాయిగా జాబిల్లి..’, కొసరాజు రాసిన ‘సరిగంచు చీరెగట్టి..’, కాలేజీ గీతం ‘భలే భలే మంచిరోజులులే..’ లాంటి పాటలన్నీ ఇప్పటికీ వినపడుతూనే ఉంటాయి. విప్లవాత్మక పాయింట్... సంప్రదాయ ట్రీట్మెంట్... వెలుగు నీడల వింత కలయిక జీవితం. ప్రతి ఒక్కరికీ సుఖదుఃఖాలు సహజమనీ, వాటిని ధైర్యంగా స్వీకరించాలనీ చెప్పే ‘వెలుగు నీడలు’ చిత్రానికి దుక్కిపాటి, ఆదుర్తి, కె. విశ్వనాథ్ కలసి కథ అల్లారు. దీనికి ఆత్రేయ రాసిన మాటలు హైలైట్. ‘‘కన్నీరు మానవుల్ని బతికించగలిగితే అది అమృతం కంటే కరువయ్యేది’’ లాంటి ఆత్రేయ మార్కు డైలాగులు ‘వెలుగు నీడలు’లో మనసును పట్టేస్తాయి. నిజానికి, ఆ చిత్రంలో దర్శక, రచయితలు తీసుకున్న విధవా పునర్వివాహం అనే పాయింట్ అరవై ఏళ్ళ క్రితం విప్లవాత్మకమైనది. కాలానికి నిలబడిపోయిన కల కానిది.. పాటలో వినిపించే ఆశావాదం ఆ పాయింట్‌నే కథానుగుణంగా, అంతర్లీనంగాప్రస్తావిస్తుంది. హీరో పాత్ర పెళ్ళికి ముందుకొచ్చినా, సావిత్రి నిరాకరిస్తుంది. భర్త (జగ్గయ్య)ను పోగొట్టుకున్న సావిత్రికి అక్కినేనితో పునర్వివాహం చేస్తే, అది ఆ కాలానికి ఓ రివల్యూషనరీ సినిమా అయ్యుండేది. కానీ, ఆనాటి సగటు ప్రేక్షకుల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకొని, సంప్రదాయ ధోరణిలోనే సినిమా కథను దర్శక,రచయితలు ముగించడం గమనార్హం. నైజామ్‌లో ఆలస్యంగా... ఎన్టీఆర్, ఏయన్నార్ల హవా నడుస్తున్న రోజులవి. డిస్టిబ్య్రూటర్లు – ఎగ్జిబిటర్లు విస్తరించిన దశ అది. ఆ సమయంలో సైతం ఈ రెండు చిత్రాలూ గమ్మత్తు గా ఒక్కో ఏరియాలో ఒక్కోసారి రిలీజయ్యా యి. మొదట ఆంధ్ర ప్రాంతంలో జనం ముందుకొచ్చిన ఈ చిత్రాలు, ఆ తరువాత వారం రోజులు ఆలస్యంగా నైజామ్ (తెలంగాణ) ఏరియాలో రిలీజయ్యాయి. ‘సీతారామ కల్యాణం’ ఆంధ్రాలో జనవరి 6న వస్తే, తెలంగాణలో జనవరి 14న రిలీజైంది. ఇక, ‘వెలుగు నీడలు’ ఆంధ్రాలో జనవరి 7న విడుదలైతే, తెలంగాణలో జనవరి 12న థియేటర్లలో పలకరించింది. ఆ రోజుల్లో ఎన్టీయార్ ‘సీతారామ కల్యాణం’ 28 ప్రింట్లతో రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు ప్రదర్శితమైంది. ఆ పైన 9 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ శ్రీలక్ష్మీ టాకీస్‌లో 156 రోజులు ఆడింది. జాతీయ అవార్డుల్లో రాష్ట్రపతి యోగ్యతా పత్రం (మెరిట్ సర్టిఫికెట్) అందుకున్న పౌరాణిక చిత్రంగా నిలిచింది. మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ బ్యాలెట్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికై, ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ఇక, అక్కినేని ‘వెలుగు నీడలు’ కేవలం 20 ప్రింట్లతో రిలీజైంది. దిగ్విజయంగా 12 కేంద్రాలలో 50 రోజులు, 6 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1961 ఏప్రిల్ 16న విజయవాడ అలంకార్ థియేటర్లో, ఆ మరునాడు రాజమండ్రిలో ‘వెలుగు నీడలు’ యూని ట్ సభ్యుల మధ్య శతదినోత్సవాలు జరిపారు. అప్పట్లో ఈ సినిమాలు రెండింటికీ ప్రత్యేకించి వెండితెర నవలలు రావడం విశేషం. ‘సీతారామ కల్యాణం’ చిత్రరచయిత సముద్రాల సీనియర్ కుమారుడైన సముద్రాల జూనియర్ ఆ సినిమాకు వెండితెర నవల రాశారు. ఇక, ‘వెలుగు నీడలు’ వెండితెర నవలకు ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ అక్షరరూపం ఇచ్చారు. సంక్రాంతికి అగ్రహీరోలిద్దరి పోటాపోటీలో వచ్చిన ఈ రెండు ఆణిముత్యాలు ఇవాళ్టికీ తెలుగు సినీ ప్రియులకు మరపురానివి! చరిత్ర మరువలేనివి!! – రెంటాల జయదేవ తెరపైకి ఫస్ట్ టైమ్... నాగార్జున నేటి ప్రముఖ హీరో నాగార్జున పది నెలల పసివా డుగా ఉన్నప్పుడే వెండితెరపై తొలిసారిగా ప్రత్యక్షమైన చిత్రం – ‘వెలుగు నీడలు’. ఆ సినిమాలోని ‘చల్లని వెన్నెల సోనలు..’ పాటలో అక్కినేని, సావిత్రి చేతుల్లో నెలల పిల్లాడైన నాగార్జున కనిపిస్తారు. నిజానికి, ఆ సినిమాలో ఆ పాట చిత్రీకర ణలో వేరే పిల్లాడు పాల్గొనాల్సింది. తీరా ఆ రోజు షూటింగ్ టైమ్‌కు ఆ పిల్లాడిని ప్రొడక్షన్ వాళ్ళు తీసుకురాలేదు. ఆలస్యమైపోతోంది. అదే సమయంలో అక్కినేని భార్య అన్నపూర్ణ, పసివాడైన నాగా ర్జునను తీసుకొని, షూటింగ్ స్పాట్‌కు ఊరకనే వచ్చారు. ఆమె చంకలోని పిల్లాణ్ణి చూసి, నిర్మాత దుక్కిపాటి వగైరా ఆ పాట సీనును నాగార్జునను పెట్టి, చిత్రీకరించేశారు. అలా యాదృచ్ఛికంగా నెలల వయసులోనే నాగార్జున ఫస్ట్ టైమ్ కెమెరాముందుకు వచ్చేశారు. కెమేరా మాంత్రికుడి తొలి ట్రిక్ ‘సీతారామ కల్యాణం’ ద్వారా కూడా ఓ ప్రముఖ సాంకేతిక నిపుణుడు పరిచయమయ్యాడు. ఆ సాంకేతిక మాంత్రికుడు– తాంత్రిక ఛాయాగ్రహణంలో దేశంలోనే దిట్టగా తరువాతి కాలంలో పేరు తెచ్చుకున్న రవికాంత్ నగాయిచ్. ఎన్టీఆర్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ ఎం.ఎ. రెహమాన్ రేసుల పిచ్చిలో పడి, ‘సీతారామ కల్యాణం’ ముహూర్తం టైముకు రాలేదు. అప్పటికే చాలాకాలంగా ఒక్క అవకాశం ఇవ్వాల్సిందంటూ ఎన్టీఆర్ చుట్టూ నగాయిచ్ తిరుగుతున్నారు. ఆ రోజు గేటు దగ్గర కనిపించిన రవికాంత్ నగాయిచ్ను కారులోఎక్కించుకొని తీసుకెళ్ళి, ముహూర్తం షాట్ చేసేశారు ఎన్టీఆర్. అలా మొదలైన వారిద్దరి బంధం ‘గులేబకావళి కథ’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘ఉమ్మడి కుటుంబం’, ‘వరకట్నం’ లాంటి అనేక సినిమాల వరకు అప్రతిహతంగా కొనసాగింది. ‘లవకుశ’, ‘వీరాభిమన్యు’, ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతాకల్యాణం’ లాంటి ప్రసిద్ధ పౌరాణిక చిత్రాలకూ నగాయిచే ట్రిక్ వర్క్ చేశారు. ఆ తరువాత నగాయిచ్ పలు హిందీ చిత్రాలకు దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. నాటకీయ స్వగతానికి నాంది! ‘సీతారామ కల్యాణా’నికి మాటలు, పాటలు రాసిన సముద్రాల సీనియర్ తన రచనతో తెరపై ఓ కొత్త ధోరణికి నాంది పలికారు. కథలోని కీలకమైన పాత్ర రంగస్థలం మీది ఏకపాత్రాభినయం ధోరణిలో ధీరగంభీర స్వరంతో తన స్వగతాన్ని తానే పైకి ఆవిష్కరించుకుంటూ, డైలాగులు పలికే ప్రక్రియను సినిమాల్లోకి జొప్పించారు. ‘సీతారామ కల్యాణం’లోని రావణ పాత్రలో ఎన్టీఆర్ ఆ స్వగతాభినయం చేశారు. అలా మొదలైన ఆ ధోరణి ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘సంపూర్ణ రామాయణం’ (ఎస్వీఆర్), ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘దానవీరశూర కర్ణ’ (ఎన్టీఆర్) మీదుగా సాంఘిక చిత్రాల వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ సినిమాల్లో ఆ నాటకీయ ఉపన్యాస ఫక్కీని అనుసరిస్తుండడం విశేషం. -
అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...
సాక్షి, హైదరాబాద్ : ‘తాను ఇవాళ వేదికపై ఉన్నానంటే అందుకు కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవిగారే. వారిద్దరూ నటించిన ‘సువర్ణసుందరి’ చిత్రం నా జీవితంలో చూసిన తొలి సినిమా. వందసార్లు అయినా ఆ సినిమా చూశాను. సినిమా అంటే ఏంటి అనే తెలియని వయసులో ఆ సినిమా చూశాక నాకు పిచ్చి పట్టేసింది’ అని ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ తెలిపారు. అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ స్టూడియోకు వస్తే నా సొంతింటికి వచ్చినట్టుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. మా చిన్నాన్న వేదాంతం రాఘవయ్య గారు. నా చిన్నప్పుడు ఆయన ఎప్పుడూ మాట్లాడుతుండేవారు. ఆ అబ్బాయ్ చాలా ఫోకస్డ్... చాలా స్మార్ట్, చాలా ఫన్నీ, ప్రేమ, క్వయిట్ కానీ ...కెమెరా ఆన్ అయితే అదరగొట్టేస్తారు. ఎవరూ...ఎవరూ అని అడిగితే ఇంకెవరూ నాగేశ్వరరావుగారు అని చెప్పారు. నేను చూసిన మొదటి సినిమా ‘సువర్ణ సుందరి’. ఇక్కడ నేను నిల్చున్నానంటే దానికి కారణం నాగేశ్వరరావుగారు, అంజలీదేవినే. ఆ సినిమా చూశాక పిచ్చి పట్టేసింది. ఎలాగేనా సినిమాల్లో నటించాలని అనుకున్నాను. చదవండి: రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు.. నటి అయ్యాక షూటింగ్‌కు వెళుతూ... రోజూ బంజారాహిల్స్ నుంచి వెళుతూ గుడిలోకి వెళ్లేదాన్ని. అక్కడ నుంచి అలా తిరిగితే నాగేశ్వరరావు గారి ఇల్లు. ఇంకోవైపు సుబ్బరామిరెడ్డిగారి ఇల్లు. రోడ్డు మీద వెళుతూనే నాగేశ్వరరావుగారికి మనసులోనే నమస్కరించేదాన్ని. పెద్ద స్టార్‌ను అయ్యేలా దీవించమని. ఒకరోజు భోజనానికి వాళ్ల ఇంటికి పిలిచారు. అమ్మ బాబోయ్ అని భయపడ్డాను. అమ్మాయ్ ఏం అనుకున్నావ్. నిన్ను చాలా గమనించేవాడిని తెలుసా? అని అన్నారు. నేను ఒక్కమాట మాట్లాడితే ఒట్టు. చూడమ్మాయ్.... నువ్వు ఏం తింటున్నావో అనేది కూడా ముఖ్యం. కానీ అన్నింటికి కంటే ముఖ్యం నువ్వు ఏం తింటావో అది మన మీద ప్రభావం చూపుతుందని. అది అప్పట్లో నాకు అర్థం కాలేదు కానీ తర్వాత తెలిసింది. నాగేశ్వరరావుగారితో పాటు అలాగే మా నాన్నగారు చదువు, నటన గురించి చెప్పిన రెండు మాటలు జీవితాంతం చీర పల్లులో మూటకట్టుకుని పెట్టుకున్నాను. అందరూ అడుగుతున్నారు ఇప్పటికీ ఇంత అందంగా ఎలా ఉన్నారు అని. అవి నాకు అమ్మా,నాన్నల నుంచి వారసత్వంగా వచ్చిన జీన్స్ అంతే. ఇందుకోసం నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. సినిమా కెరీర్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. నా జీవితంలో కూడా అలాంటివి జరిగాయి. అయినా తట్టుకుని నిలబడ్డాను. అప్పట్లో హాస్పటల్లో ఉన్న అమ్మ తన కోసం ఓ తెలుగు సినిమా చేయమంది. అమ్మ కోసం తెలుగు సినిమాలో నటిస్తా. తెలుగు బాగా నేర్చుకుని శ్రీదేవి అంత స్పష్టంగా మాట్లాడతాను’ అని తెలిపారు. -
ప్రేమ మీటర్
వెండి తెర ప్రేమను వెలిగించిన పాటలు మేము కొన్ని అనుకున్నాం... మీకు ఇంకేవేవో గుర్తుకురావచ్చు... హ్యాపీ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) డ్రామా లేని ప్రేమ పండిన దాఖలాలు లేవు. అడ్డంకులు, అవరోధాలు లేకుండా సాఫీగా ఉన్న ప్రేమ గొప్ప ప్రేమగా జ్ఞాపకాల్లో నిలువలేదు. ప్రేమ పొందేది కాదు. సాధించుకునేది. గెలుచుకునేది.నిలబెట్టుకునేది. అందులో పడ్డవాళ్లను చెడ్డవాళ్లని లోకం అనుకున్నా లెక్క చేయరు. పగవాళ్లని దూరం పెట్టినా పట్టించుకోరు. అబ్బాయి అమ్మాయి కోసం ఎదురు చూస్తుంది. అమ్మాయి కోసం అబ్బాయి కోట గోడల్ని అయినా లతలు పట్టుకొని పాకి సాహసంగా లోపలికి లంఘిస్తాడు. రాకుమారి స్వయంవరం ప్రకటించి వచ్చిన వందమందిలో ఒకరిని ఎంచుకుంటే ఏం చోద్యం ఉంది? అదే తోటలో పని చేసే ఒక కూలివాణ్ణి కోరుకుంటే అసలైన కథ ఉంది. ‘పాతాళ భైరవి’లో రాకుమారి అలా ఒక తోట రాముణ్ణి ప్రేమించి తెలుగునాట వెండి తెర మీద ప్రేమకు గట్టిగా తెర తీసింది. ‘నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది’ అని ఆమె చందురుణ్ణి చూసి పాడుతుంటే ఆ పదం విని తోటలో రాముడు ‘కలవరమాయే మదిలో నా మదిలో’ అని అరచేతిని ఛాతీకి రుద్దుకుంటాడు. ఆ కలవరం తీర్చుకోవడానికి అతడు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడడు. మాంత్రికుడి వలలో పడటానికి సందేహించడు. ‘ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు’ అని ప్రేక్షకులు జాలి పడేలా చేసుకోగలిగాడు. ఏమైనా ఈ ప్రేమ సుఖాంతమైంది. ఆ పాతాళభైరవి తల్లి వల్ల పది కాలాలు నిలిచింది. అయితే ప్రేమలో ఉన్నట్టుగా ప్రేమికులకు తెలియకపోవడం కూడా ఒక తియ్యటి విషయమే. ‘మిస్సమ్మ’లో టీచరమ్మ సావిత్రి, పంతులు ఎన్.టి.ఆర్ ఒకే ఇంట్లో భార్యభర్తలుగా దొంగనాటకం ఆడుతూ కాపురం పెడతారు. నిజానికి వారు దొంగ భార్యభర్తలే కాని నిజం ప్రేమికులు. ఆ సంగతి వారికి తెలియదు. అర్థం చేసుకోరు. ఒకరికొకరు చెప్పుకోరు. ప్రేమంతా లోపల ఉంటుంది. కయ్యాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఇది వింత ప్రేమ. అందుకే ‘రావోయి చందమామ... మా వింతగాథ వినుమా’ అని వారు పాడుకుంటే ఇలాంటి వింత ప్రేమలో పడటానికి ప్రేక్షకులు కూడా రెడీ అయ్యారు.అయితే ప్రేమ అంటేనే ప్రమాదం. ప్రేమ అంటేనే శోకం. ప్రేమ అంటేనే వేదన. ప్రేమ అంటే మరణం అని ‘దేవదాసు’ చెప్పింది. చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డ పారు జీవితంలో దక్కకపోతే ఏ దేవదాసైనా దేవదాసే అవుతాడు. అటువంటి సమయంలో ఆ ప్రేమికుడికి తాత్త్వికత వస్తుంది. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటాడు. ‘జగమే మాయ బతుకే మాయ’ అని భౌతిక జీవితాన్ని ఈసడిస్తాడు. ‘ఓ... దేవదా’ అని ఆమె పాడితే ‘ఓ.. పార్వతి’ అని ఇతడు పాడిన రోజులు మాత్రమే అతడికి వాస్తవం. అవి తప్పిపోయిన మిగలిన అన్ని రోజులూ మత్తే. అందులో చిత్తే. ఆఖరుకు మరణం మాత్రమే అతడి ప్రేమను మరిపించగలిగింది. ఆ ప్రేమను ఇప్పటికీ ప్రేక్షకులు ఇష్టంగా నిందగా ఇష్టపడుతూనే ఉన్నారు.అయితే ప్రేమ అంటే ఏమిటి? శరీరమా, మనసా, ఆ రెంటి మీద ఆధిపత్యమా? ఏమిటి ప్రేమంటే? దానికీ తెలుగు సినిమా జవాబు చెప్పింది.‘డాక్టర్ చక్రవర్తి’లో శ్రీశ్రీ కలం ఆ ప్రశ్నకు ఇలా బదులు పలికింది. ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరునించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ’... నిజమే కదా. ‘చీకటి మూసిన ఏకాంతంలో తోడుగా నిలవడమే కదా’ ప్రేమంటే. ఇప్పుడు ప్రేమకు యువతీ యువకులు సిద్ధంగా ఉన్నారు. పడటానికి ఉవ్విళ్లూరుతున్నారు. కాని వారికి రాయబారి కావాలి. ప్రేమ వ్యక్తం చేసే మార్గం కావాలి. ‘ప్రేమలేఖ’ ఆ కార్యాన్ని నెరవేర్చింది. ఎన్ని వేల, లక్షల ప్రేమ లేఖలు లోకాన ఒకరి నుంచి మరొకరికి అంది ఉంటాయో. ఇక్కడ చూడండి. టక్ చేసుకున్న హరనాథ్. రెండు జడలు వేసుకున్న జమున. వాళ్లకు తోడు నిలవడానికి గొంతు సవరించుకున్న పి.బి.శ్రీనివాస్, సుశీల. ‘అందాల ఓ చిలుకా... అందుకో నా లేఖ... నా మదిలోని కలలన్నీ... ఇక చేరాలి నీ దాకా’... ఇలా కాగితం మీద రాసుకున్న ప్రేమలేఖలు ఉంటాయి. రాయడం రాక, రాయలేక పూలతో చెట్లతో నివేదించుకున్న ప్రేమ లేఖలు కూడా ఉంటాయి. ‘మూగ మనసులు’ సినిమాలో ఆ పాట గుర్తుందా?... ‘ముద్దుబంతి పూవులో మూగకళ్ల ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలియులే’. ప్రేమలో పడ్డవాళ్లు ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అని కూడా ఈ పాట చెప్పింది. సఫలమైతే ఒకలాగా. విఫలమైతే ఒకలాగా. ఇది కొంచెం నయం. ఎదురుగా ఉన్న మనిషితో ఏదో వంక పెట్టి మనసులో మాట చెప్పొచ్చు. అసలు కళ్లెదుటే లేని మనిషైతే? ‘మల్లీశ్వరి’లో ఆ బావామరదళ్ల కష్టం వర్ణనాతీతం. అతడు ఎక్కడో ఉన్నాడు. ఆమె మరెక్కడో ఉంది. ఉత్తరాలు అందవు. మాటలు వినపడవు. ఇక సందేశం అందించాల్సిన భారం మేఘం తీసుకుంది. ‘ఏడ తానున్నాడో బావా జాడ తెలిసిన పోయి రావా అందాల ఓ మేఘమాల’ అని వారు పాడుకుంటే ఆ విరహానికి అది కూడా బరువెక్కి వర్షించింది. కాలం మారింది. బండ్లు పోయి మోటారు బండ్లు వచ్చాయి. పంచెలు పోయి ప్యాంట్లు వచ్చాయి. మొలతాళ్లు పోయి బెల్ట్‌లు వచ్చాయి. కాలేజీ చదువులు చదివే వారి సంఖ్య పెరిగింది. లవ్‌కు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే తేడా ఎందుకు అనగలిగే తెగింపు వచ్చింది. తెలుగైతే ఏమిటి తమిళం అయితే ఏమిటి అన్నారు. ఇటువైపు తెలుగింట్లో అమ్మాయి అటువైపు తమిళింట్లో అబ్బాయి ప్రేమించుకున్నారు.వాళ్ల ప్రేమకు రోడ్లు చాల్లేదు. బీచ్‌లు చాల్లేదు. గుడి మెట్లు చాల్లేదు. ఆఖరుకు స్ట్రక్ అయిన లిఫ్ట్‌లో కూడా ప్రేమించుకున్నారు ‘కలసి ఉంటే కలదు సుఖమూ కలిసి వచ్చిన అదృష్టమూ’ అని చిందులేశారు.‘మరోచరిత్ర’ ప్రేమ పాటల్లో కూడా చరిత్ర సృష్టించింది. అమ్మాయిలు అంతటితో ఆగలేదు. చాలా బారికేడ్లను బ్రేక్ చేశారు. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా’ అని ప్రియుడి సమక్షంలో పాడి పెద్దవాళ్ల గుండెలను బేజారెత్తించారు. ‘వయసు పిలిచింది’ సినిమాకు బదులు పలికినవాళ్లు బహుమంది. ప్రేమకు పెరిగిన ఈ గిరాకీని సీనియర్ హీరోలు గమనించారు. ప్రేమను ప్రేమించడంలో మేమేమీ తక్కువ తినలేదు అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ ‘నేనొక ప్రేమ పిపాసిని’ అని పాడి ఇప్పటికీ ఆ పాటను హిట్ చేస్తూనే ఉన్నారు. అక్కినేని ‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’ అంటూ షర్ట్ మీద జర్కిన్ వేసి స్టెప్స్‌తో మోతెక్కించారు. శోభన్‌బాబు ‘ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం’ అని నది ఒడ్డున సుజాతను రెండు చేతులతో పైకెత్తుకున్నారు. ఎన్.టి.ఆర్ ‘రెండక్షరాల ప్రేమ రెండు క్షణాల ప్రేమ’ అని నల్లడ్రస్సులో ఆవేశంగా పాడి చెట్టు కొమ్మను పట్టుకుని ఊపి పారేశారు. కాని నిజంగానే తరం మారింది.కాలేజీ వయసు కంటే ఇంకా తక్కువ వయసులోనే ప్రేమించేసుకునే పిల్లలు వచ్చారు. ‘ముద్దమందారం’ సినిమాలో ప్రదీప్–పూర్ణిమ కలిసి ఆ రోజులలోనే పారిపోయారు. పెళ్లి చేసుకున్నారు.‘అలివేణి ఆణిముత్యమా’... ఒకరి సమక్షంలో ఒకరు లాలిత్యంతో పాడుకున్నారు. ‘నాలుగు స్తంభాలాట’లో నరేశ్–పూర్ణిమ ‘చినుకులా రాలి నదులుగా పారి వరదలై పోయి కడలిలా పొంగు నీ ప్రేమ నా ప్రేమ’ అని పాడుకుంటే వయసుకు, శరీరానికీ ఆవల ఉన్న ఆరాధనను కొత్తతరం అందిపుచ్చుకుందన్న నమ్మకం కుదిరింది. నాగార్జున వెంకటేశ్ జనరేషన్ వచ్చింది. మృత్యువు ప్రేమను నిరోధించలేదని చెప్పింది. నాగార్జున ‘గీతాంజలి’ ఒక ఊటీ నీటి ఆవిరిలాంటి సినిమా. ‘నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము’ అని ఆ సినిమా చెప్పింది. హీరో చచ్చిపోతాడని తెలిసినా హీరోయిన్ చనిపోతుందని తెలిసినా ప్రేమ బతికే ఉంటుందన్న నమ్మకంతో ఈ సినిమా చూసి హాలు నుంచి బయటకు వస్తాడు ప్రేక్షకుడు.వెంకటేశ్ ‘ప్రేమ’ ఇళయరాజా సాయంతో ఒక మంచి ప్రేమ డ్యూయెట్‌ను ఇచ్చింది. ‘ఈనాడే ఏదో అయ్యింది. ఏనాడూ నాలో జరగనిది’... కాని చివరిలో హీరోయిన్ చనిపోతుంది. ఇంతమంచి ప్రేమను చంపేస్తారా అని ప్రేక్షకులకు కోపం వస్తే బతికించినట్టు చూపాల్సి వచ్చింది. అదీ ప్రేమ ఎఫెక్ట్.అయితే ప్రేమ దెబ్బ మెగాస్టార్ కూడా తినకతప్పలేదు. కాకపోతే ఆయన ‘పెంటమ్మ’తో ప్రేమలో పడాల్సి వచ్చింది.‘రుద్రవీణ’లో ఆయన తొలి చూపులోనే ప్రేమించిన అమ్మాయి శోభన తమాషాకు తన పేరు పెంటమ్మ అని చెబుతుంది. పేరేదైనా ప్రేమ ప్రేమే అని తన మనసు ఆమె పాదాల దగ్గర పెడతాడు. తన హృదయంలో ‘లలిత ప్రియ కమలం విరిసినది’ అని చెబుతాడు. కాని ఊరి మేలు కోసం ఆ ప్రేమనే త్యాగం చేస్తాడు. ఆ సమయంలోనే ప్రేమ సఫలం కావడానికి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి వచ్చిన యువకుడిగా రాజేంద్రప్రసాద్ ‘ముత్యమంత ముద్దు’లో కనిపిస్తారు. సీతతో ఆయన పాడిన ‘ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది’ పాట పెద్ద హిట్. సంగీతం కన్నడ దేశం నుంచి హంసలేఖ మోసుకొచ్చారు. ఈ సందర్భంలో ‘సాగర సంగమం’లో కమలహాసన్, జయప్రదల మధ్య చిగురించిన మూగప్రేమను చెప్పకుండా ఉండలేము. ఇద్దరూ మాట్లాడుకోకుండా ‘మౌనమేలనోయి ఈ మరపురాని రేయి’ అని పాడుకుంటూ ఉంటే ఆ నిశ్శబ్దప్రేమను ప్రేక్షకులు చెవి వొగ్గి విన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు కథలు అటూ ఇటూ నడిచాయి. జనం ప్రేమను మర్చిపోయారు అనుకుంటూ ఉండగా కరుణాకర్ వచ్చి ‘తొలి ప్రేమ’తో పెద్ద హిట్ కొట్టాడు. ప్రేమ సత్యమైనదే అయితే గెలిచే తీరుతుందని చెప్పాడు. ‘నీ మనసే... సే.. సే.. సే’... అని పవన్ కల్యాణ్ పాడిన పాట పెద్ద హిట్. ఆ తర్వాత దర్శకుడు తేజా వచ్చి ప్రేమే ‘చిత్రం’ అన్నాడు. అబ్బాయి అమ్మాయి ‘నువ్వు–నేను’గా ఉండాలన్నాడు. అలాంటి వాళ్లే జీవితంలో ‘జయం’ సాధిస్తారనన్నాడు. ఈ సినిమాలతో తెలుగునాట మళ్లీ ప్రేమ దుమారం వచ్చింది. ‘నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను’, ‘అందమైన మనసులో అంత అలజడెందుకో ఎందుకో ఎందుకో’ పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ మూడ్‌ను ‘మనసంతా నువ్వే’ పీక్కు తీసుకెళ్లింది. ‘చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా’ పాట అడ్రస్ సరిగా లేని కుర్రాళ్లని కూడా ప్రేమలో పడేలా చేసింది.తరుణ్ కూడా తన పాత్ర తాను పోషించాడు. ‘నువ్వంటే నాకిష్టం నాకన్నా నువ్విష్టం’ అని ఇష్టాన్ని స్పష్టం చేశాడు. అయితే ఫ్యాక్షన్ సినిమాలో కూడా చిరుగాలి వంటి ప్రేమ పూస్తుందని ‘ఒక్కడు’లో మహేష్‌బాబు డాబా మీద పాడి నిరూపించాడు. ‘చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి’ పాట ప్రేక్షకుల యదను గిల్లింది. ప్రభాస్ నేను తక్కువ తినలేదని నిండా ‘వర్షం’లో మునిగి ‘మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం...’ అంటూ త్రిషకు దగ్గరయ్యాడు.అల్లు అర్జున్ ఈ ప్రేమకు కొత్త డైమన్షన్ తెచ్చాడు. ఎస్ చెప్పొద్దు నో చెప్పొద్దు ‘ఫీల్ మై లవ్’ అన్నాడు. ఈ భావన కూడా బాగుందే అని ప్రేక్షకులు అనుకున్నారు. ఆ తర్వాత ‘కొత్త బంగారులోకం’ వచ్చింది. ‘నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా’ పాటను ఇచ్చింది. ‘ఏమాయ చేశావే’ వచ్చింది. ‘ఈ హృదయం...’ అని రెహమాన్ ట్యూన్‌ను తెచ్చింది. అంతవరకూ మౌనంగా ఉన్న ఇళయరాజా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా కోసం తిరిగి హార్మోనియం అందుకున్నారు. ‘ఇలా ఇలా ఇలా హాయి నీదే సుమా’ పాట ఎంతో హిట్ చేశారు. అప్పుడు దర్శకుడు హను రాఘవపూడి ‘అందాల రాక్షసి’ తీశాడు. లావణ్య త్రిపాఠి వెంట నవీన్‌చంద్ర పడి ‘వెన్నంటే ఉంటున్నా కడదాక వస్తున్నా’... అంటూ చేసే అల్లరిని మణిరత్నం స్టయిల్లో చూపించాడు. ప్రేమ యాత్ర కొనసాగింది. రామ్ ‘నేను శైలజా’ చేశాడు. ఎన్నాళ్లు గడిచినా ప్రేమ అనేది ‘క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్’ అని చెప్పాడు. శర్వానంద్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చేశాడు. ‘ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై’ పాట నిత్యా మీనన్ ప్రెజెన్స్‌లో రంగులు పులుముకుంది. ప్రేమకు తిరుగులేదు అనడానికి నిన్న మొన్నటి సినిమాలు నిన్న మొన్న వచ్చిన హీరోలు కూడా సాక్ష్యం పలికారు.‘అర్జున్ రెడ్డి’ పెద్ద హిట్. ‘ఆర్ ఎక్స్ హండ్రెడ్’ ఇంకా పెద్ద హిట్. ‘గీత గోవిందం’ సూపర్ డూపర్ హిట్. ‘ఊపిరాగుతున్నదే ఉన్నపాటున ఇలా’ ‘అర్జున్ రెడ్డి’లో, ‘పిల్లా రా నువ్వు కనపడవా’ పాట ‘ఆర్ ఎక్స్ 100’లో, ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాట ‘గీత గోవిందం’లో ఇటీవలి ఆకర్షణలుగా నిలిచాయి.ప్రేమ– పాట ఒక జోడి.ప్రేమ– ప్రేక్షకుడు కూడా ఒక జోడి.ప్రేమ– ప్రపంచం ఒక జోడి.ప్రపంచం ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది.ప్రేమ ఉన్నంత కాలం మంచి పాట కూడా ఉంటుంది.మంచి మంచి పాటలు అందించిన ఆయా గేయకర్తలకు, సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు, నిర్మాత దర్శకులకు, నటీ నటులకు వాలెంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు.తమిళనటుడు కార్తిక్ తెలుగులో రెండు అందమైన ప్రేమకథల్లో నటించాడు. ఒకటి సీతాకోక చిలుక, రెండు అభినందన. రెంటికీ ఇళయరాజానే సంగీతం. రెంటిలోని ప్రేమపాటలన్నీ చాలా హిట్ అయ్యాయి. ‘మాటే మంత్రమూ’, ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె’ పాటలు సీతాకోక చిలుకలో. ‘ఎదుటానీవే... యదలోనా నీవే’, ‘ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం’ పాటలు అభినందనలో ప్రేమికులను కట్టిపడేశాయి. కథనం: కె -
ఘంటసాల పాటల్లోని కొన్ని...
∙భలే మంచి రోజు పసందైన రోజు (జరిగిన కథ) ∙ముద్దబంతి పూవులో మూగకళ్ల ఊసులో (మూగమనసులు) ∙కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి గాథలలోనే బలి సేయకు (వెలుగు నీడలు) ∙ఆకాశవీధిలో అందాల జాబిలి (మాంగల్యబలం) ∙హాయి హాయిగా ఆమని సాగే (సువర్ణ సుందరి) ∙చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా (దొంగరాముడు) ∙నా హృదయంలో నిదురించే చెలీ (ఆరాధన) ∙శిలలపై శిల్పాలు చెక్కినారు (మంచి మనసులు) ∙తేటతేట తెలుగులా (ప్రేమ్‌నగర్) ∙పగడాల జాబిలి నీవు గగనాన దాగెను నేడు (మూగనోము) ∙పల్లెకు పోదాం పారును చూద్దాం చలోచలో (దేవదాసు) ∙పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి (మల్లీశ్వరి) ∙పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ (పెళ్లి చేసి చూడు) ∙రసికరాజ తగువారము గామా (జయభేరి) ∙కలవరమాయె మదిలో నా మదిలో (పాతాళ భైరవి) ∙ప్రేమ యాత్రలకు బృందావనము (గుండమ్మకథ) ∙చిటపట చినుకులు పడుతూ ఉంటే (ఆత్మబలం) ∙తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము (అంతస్తులు) ∙ఓహో బస్తీ దొరసాని (అభిమానం) ∙వాడిన పూలే వికసించెలే (మాంగల్య బలం) ∙బాబూ వినరా అన్నదమ్ముల కథ ఒకటి (పండంటి కాపురం) ∙ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకును జడను చుట్టి (కలసి ఉంటే కలదు సుఖం) ∙కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చాన (తోటికోడళ్లు) ∙చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు) ∙నా జన్మ భూమి ఎంత అందమైన దేశము (జై జవాన్) ∙తెలుగు వీర లేవరా (అల్లూరి సీతారామరాజు) ∙అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం (బావామరదళ్లు) ∙కొంటె చూపు చెప్తోంది కొంటె నవ్వు చెప్తోంది (జీవిత చక్రం) ∙ప్రతి రాత్రి వసంత రాత్రి (ఏకవీర) ∙ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే (మంచిమిత్రులు) ∙నీ సుఖమే నే కోరుతున్నా (మురళీకృష్ణ) ∙జన్మమెత్తితిరా అనుభవించితిరా (గుడి గంటలు) ∙ఈ జీవన తరంగాలలో (జీవన తరంగాలు) ∙కనుపాప కరవైన కనులెందుకు (చిరంజీవులు) ∙బొమ్మను చేసి ప్రాణం పోసి (దేవత) ∙ఏ నిమిషానికి ఏమి జరుగునో (లవకుశ) ∙దినకరా శుభకరా (వినాయకచవితి) ∙శేషశైలావాసా (శ్రీవెంకటేశ్వర మహాత్మ్యం) ∙నడిరేయి ఏజాములో (రంగుల రాట్నం) ∙నీ మధు మురళీ గాన లీలా (భక్త జయదేవ) ∙ఘనాఘన సుందరా (భక్త తుకారాం) ∙అమ్మా అని పిలచినా ఆలకించవేమమ్మా (పాండురంగ మహాత్మ్యం) ∙రామయ తండ్రీ ఓ రామయతండ్రీ (సంపూర్ణ రామాయణం) ∙శివశంకరీ శివానందలహరి (జగదేకవీరుని కథ) -
ఎన్టీఆర్ 60.. ఏఎన్నార్ 8..!
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యన్.టి.ఆర్. సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్రవేసిన నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ తారగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య 60 విభిన్న గెటప్‌లలో కనిపించనున్నారట. తాజా సమచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అక్కినేని వారసుడు సుమంత్ తాత నాగేశ్వరరావు పాత్రలో నటిస్తుండగా ఆయన కూడా ఈ సినిమాలో దాదాపు 8 డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాను 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్, ఏఎన్నార్లు కలిసి ఏం చేస్తున్నారో చూశారా?
టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుత్నున సినిమాల్లో ‘ఎన్టీఆర్’ చిత్రం ప్రత్యేకం. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించబోతోంది ‘ఎన్టీఆర్’ . నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ, నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మూవీలో ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తోన్న విషయం తెలిసిందే. నేడు ఏఎన్నార్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రివీల్చేశారు చిత్రబృందం. ఫస్ట్ లుక్‌తో పాటు మరికొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వదిలారు. ఎన్టీఆర్ (బాలకృష్ణ), ఏఎన్నార్ (సుమంత్) కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. -
‘ఎన్టీఆర్’ సెట్‌కు ‘ఏఎన్నార్’!
టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలక్రిష్ణ, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ లుక్‌ను రివీల్ చేయించిన క్రిష్ ‘ఎన్టీఆర్’ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక ఏఎన్నార్ పాత్రలో నటిస్తున్న సుమంత్ .. ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనబోతోన్నట్లు ట్వీట్ చేశారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ పాత్రలో నటించనున్న కళ్యాణ్ రామ్ కూడా షూటింగ్లో జాయిన్ కానున్నాడని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. -
కన్ఫమ్ : ఏఎన్నార్‌గా సుమంత్
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఇద్దరు యువ కథా నాయకులు ఎన్టీఆర్‌లో భాగమవుతున్నట్టుగా ప్రకటంచారు. ఇప్పటికే రానా.. ఎన్టీఆర్ కోసం పనిచేస్తున్నట్టుగా ప్రకటించగా తాజా సుమంత్ కూడా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్టుగా కన్ఫమ్ చేశాడు. రానా ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తాను కూడా ఎన్టీఆర్‌లో నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే తాత ఏఎన్నార్ పాత్రలో నటించేందుకు ఓకె చెప్పాడు సుమంత్. గతంలో ఈ పాత్రను నాగచైతన్య పోషిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే రూమర్స్ కు చెక్ పెడుతూ ఎన్టీఆర్ లో ఏఎన్నార్‌గా కనిపించబోయేది తానే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు సుమంత్. Excited and honored to be joining this team, portraying my grandfather #ANR in this prestigious venture🙏🏼 #NTR https://t.co/6T09vrnCHB — Sumanth (@iSumanth) 4 August 2018 -
‘ కాంతారావు’ బయోపిక్
కోదాడరూరల్ : సినీ నటుడు టీఎల్ కాంతారావు జీవితచరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. కాంతారావు బయోపిక్కు దర్శకుడు దాదాసాహెబ్‌పాల్కే, నంది అవార్డుల గ్రహీత డాక్టర్ పీసీ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో సమానంగా వెలుగొందిన గొప్పనటుడిపై బయోపిక్‌ను తీసేందుకు 50శాతం వివరాలు సేకరించానని మిగిలిన వివరాల కోసం ఆయన స్వగ్రామం వచ్చానని దర్శకుడు ఆదిత్య తెలిపారు. కాంతారావు జీవిత చరిత్ర తెలుసుకునేందుకు ఆదివారం దర్శకుడు ఆదిత్య కోదాడ మండలం గుడిబండ గ్రామానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయనవ విలేకరులతో మాట్లాడారు. కాంతారావు జీవితాన్ని రెండు కోణాల్లో చంద్రదివ్య ఫిలీం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ‘అనగనగా ఓ రాకుమారుడు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో కాంతారావు 1950 నుంచి 1971 వరకు గల స్వర్ణయుగం.. ఆ తర్వాత కష్టాకాలంపై రెండుగంటల నిడివి గల సినిమా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాత్రలతో పాటు బి.విఠాలాచార్య, హీరోయిన్లు కృష్ణకుమారి, రాజశ్రీ పాత్రలు ఉంటాయన్నారు. ఇప్పటికే కాంతారావు కుటుంబ సభ్యులతో, పెద్దకుమారుడు ప్రతాప్‌తో సినిమా కథపై చర్చించనని అ న్నారు. దీనిలో భాగంగానే స్వగ్రామంలో ఆయన గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం దర్శకుడు ఆదిత్య కాంతారావు ఇంటి వరండాలో కూర్చొని గ్రామస్తులు, ఆయన జీవితాన్ని చూసిన వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసుల సత్యనారాయణ పలు ఆసక్తికర విషయాలను దర్శకుడికి వివరించారు. ఈ చిత్ర నిర్మాణానికి గ్రామస్తులు, ఆయన అభిమానుల సహా కారం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానికులు తూమాటి వరప్రసాద్‌రెడ్డి, యరగాని లక్ష్మయ్య, బాలేబోయిన సిద్దయ్య, పోలోజు నర్శింహచారి, వెంకటాచారి, శ్రీనివాసుల ప్రసాద్‌రెడ్డి, కుక్కడుపు సైదులు గ్రామ ప్రజలు ఉన్నారు. ఆనందంలో గ్రామస్తులు.. తమ గ్రామం నుంచి సినీ రంగంలో ఆనాటి అగ్రనటులతో సమానంగా ఓ వెలుగు వెలిగిన మా కత్తి కాంతారావు జీవిత చరిత్ర సినిమా తీయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఆయన తీసిన ప్రతి సినిమాను చూసేవారిమని అన్నారు. గ్రామం నుంచి ఆయన వద్దకు సాయం కోరి వెళితే కాదనకుండా ఇచ్చేవారని తెలిపారు. సినిమా నిర్మాణానికి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. గొప్ప దర్శకుడి చేతిలోకే సినిమా.. కాంతారావు బయోపిక్‌ని సినిమా తీసే డైరెక్టర్ పీసీ ఆదిత్య 100 రోజుల్లో 100 షార్ట్‌ఫిల్మ్‌లు తీసి 2015లో దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు. దీనికిగానూ సింగపూర్ ఓపెన్ యూనివర్శిటీ డాక్టరేట్, లిమ్కాబుక్‌లో పేరు కూడా సంపాదించాడు. తెలుగు చిత్రసీమలో ఏఎన్ఆర్ తర్వాత ఆదిత్యకు ఆ తర్వాతే కళాతపస్వీ విశ్వనాథ్‌గారికి వచ్చింది. పిల్లలుకాదు పిడుగులు సినిమాకు 2004 ఉత్తమ బాలలచిత్ర కేటగిరికిలో నంది అవార్డు కూడా పొందారు. ‘సాక్షి’ కథనానికి మంచి స్పందన వచ్చింది.. ఈనెల 19న సాక్షి ఫ్యామిలీ పేజీలో వచ్చిన కాంతారావు బయోపిక్ వార్తాకు ఉమ్మడి రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి ఆయన అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిందని దర్శకుడు ఆదిత్య తెలిపారు. సాక్షిలో వచ్చిన వార్తాను చూసిన ఆయన అభిమానులు అనేకమంది ఫోన్ చేశారని సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నారని కావాల్సిన సహాయ సకారాలు అందజేస్తామని తెలిపారని అన్నారు. -
సీతారామయ్యగారింట్లో పెళ్లి!
తెలుగులో వచ్చిన సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామాల్లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయే ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ రోజుకీ ఈ సినిమా నుంచి పుట్టిన ఫార్ములాతోనే లెక్కలేనన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... సీతారామయ్యగారింట్లో పెళ్లి హడావుడి అప్పటికే మొదలైపోయింది. ఇంట్లో వాళ్లంతా ఏదో ఒక పనిలో పడిపోయి బిజీబిజీగా కనిపిస్తున్నారు. గేటుముందు ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది. ‘‘ఎంతైందీ?’’ అంటూ ట్యాక్సీకి డబ్బులిచ్చి లగేజీ సర్దుకుంటోంది ఆ అమ్మాయి. ఇంట్లో వాళ్లంతా ‘ఎవరా?’ అనుకుంటూ ఆ అమ్మాయినే చూస్తూన్నారు. ‘‘ఇది సీతారామయ్యగారి ఇల్లే కదండీ?’’ అడిగింది ఆ అమ్మాయి కాస్త బెరుకుగానే. ‘‘అవునమ్మా!’’ అంది ఆ ఇంటి ఆడపడుచు. ‘‘నేను సీతారామయ్యగారి మనవరాలిని. అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాసమూర్తిగారి అమ్మాయిని..’’ ఆ అమ్మాయి తనను తాను పరిచయం చేసుకుంది. ఆ ఇంటి ఆడపడుచుతో పాటే పక్కనే నిలబడి ఈ మాటలన్నీ విన్న ఒక పిల్లాడు ఇల్లంతా ఆ మాటను వినిపించాడు. ఆ ఇంట్లో ఇప్పుడు హడావుడి ఇంకాస్త ఎక్కువైంది. ‘‘అమ్మా, నాన్నా?’’ అడిగింది ఆడపడుచు. ‘‘రాలేదండీ! నాన్నకు తీరుబాటు కాలేదు. అమ్మ.. నాన్నతో ఉండకపోతే, వీలుకాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్లమని పంపారు.’’ సీతారామయ్య బయటికొచ్చి ఆ అమ్మాయిని చూశాడు. మనవరాలిని చూసిన సంతోషం అతనిలో కనిపిస్తున్నా, దాన్ని దాచేస్తూ గంభీరంగా చెప్పాడు – ‘‘వచ్చిన బంధువులకు ఇంట్లో సదుపాయాలు అవీ సరిగ్గా చూడండి. ఇది సీతారామయ్యగారింట్లో జరుగుతున్న పెళ్లి’’. సీతారామయ్య మనవరాలు రావడంతోనే ఇంట్లో అందరికీ నచ్చేసింది. ఇట్టే కలిసిపోయింది. ‘‘నాన్న నన్ను ‘నాన్నా నాన్నా’ అని పిలుస్తాడు నానమ్మా!’’ అని మనవరాలు చెప్తూ పోతుంటే సీతారామయ్యకు, ఆయన భార్యకు కళ్లలో నీళ్లు తిరిగాయి. కొడుకు గుర్తొచ్చాడు. ఎప్పుడు ఇల్లు వదిలేశాడతను? ఆ భార్యాభర్తలిద్దరూ ఇప్పటికీ కొడుకును తల్చుకోని రోజంటూ లేదు. మనవరాలు సీత పందొమ్మిదేళ్ల వయసు వచ్చిందాక ఎలా ఉందో కూడా వాళ్లు చూడలేదు. సీతను ఇలా ఇప్పుడు చూస్తూండడం వాళ్లకు సంతోషంగా ఉంది. సీతరామయ్యకు మాత్రం కొడుకు రాలేదనే కోపం, బాధ అలాగే ఉంది. అందుకే మనవరాలితో మాట్లాడటానికి కూడా ఇష్టంగా లేడు. కానీ ఆమె చేష్టలు, ఇంట్లో అందరితో ఇష్టంగా కలిసిపోవడం, ఏదో ఒకలా తనతో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తూ ఉండటం సీతారామయ్యకు తెలీకుండానే మనవరాలిని దగ్గర చేస్తున్నాయి. పెళ్లి రోజు రానే వచ్చేసింది. సీతారామయ్య ఇంట్లో పెళ్లి కాబట్టి ఊరంతా ఒకదగ్గర చేరినట్టుంది పెళ్లి మండపమంతా. సీతారామయ్య తన మనవరాలైన పెళ్లికూతురుకు పదివేలు కట్నం చదివించాడు. అలాగే సీత కూడా నాన్న తరపున కట్నం చదివించింది. పదివేల డాలర్లు. ‘‘మీరు పదివేలు చదివిస్తే, మీ వాడు పదివేల డాలర్లు చదివించాడు. అంటే మీకంటే పదిహేడు రెట్లు ఎక్కువ.’’ అన్నాడు పెళ్లిలో సీతరామయ్య పక్కనే కూర్చున్న ఓ పెద్దమనిషి. ‘‘ఎంతెక్కువైనా ఖర్చు విషయంలో ఇక్కడ రూపాయి ఎంతో అక్కడ డాలరూ అంతే. అదో గొప్పా!?’’ అంటూ కొట్టిపారేశాడు సీతారామయ్య. ఆ మాటలను వింటూ తాతయ్యనే చూస్తూ కూర్చున్న సీత చిన్నగా నవ్వింది. పెళ్లి అయిపోయింది. సీతంటే ఇప్పుడు ఇంట్లో అందరికీ ఇష్టం. సీతారామయ్య కూడా మనవరాలిని మూడు రోజులకు మించి దూరం పెట్టలేకపోయాడు. ఆయనే సీతను దగ్గరికి తీసుకొని ముద్దుపెట్టి ‘‘నువ్వు నా మనవరాలివి.’’ అన్నాడు. సీత ఆనందానికి అవధుల్లేవు. ఇల్లంతా తిరుగుతూ గట్టిగా అరిచి చెప్పింది – ‘‘తాతయ్య నాకు ముద్దు పెట్టాడు’’. రోజులు గడుస్తున్నాయి. పందొమ్మిదేళ్లు ఈ ప్రపంచాన్ని చూడని సీత ఇప్పుడిదే ప్రపంచంగా గడిపేస్తోంది. సీతరామయ్యకూ ఇదంతా ఓ కలలా ఉంది. సీత వచ్చాక ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉందో, అంత సంతోషంగా ఉన్న ఒకరోజు. అమెరికా నుంచి సీతారామయ్య కొడుకు శ్రీనివాసమూర్తి స్నేహితుడు వివేక్ సీతను చూడ్డానికి వచ్చాడు. సీతారామయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. సీతకు కబురెళ్లింది. పొలం చూసొస్తానని వెళ్లిన సీత పరిగెత్తుకుంటూ వచ్చింది. సీతారామయ్య, ఆయన భార్య, వివేక్ ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. సీత కంగారు పడిపోతోంది. ఎవ్వరూ ఏం మాట్లాడటం లేదు. గట్టిగా అరిచినట్టు అడిగింది – ‘‘ఎవ్వరూ ఏం మాట్లాడరే!’’. ‘‘నువ్వు ఆడిన నాటకానికి ఇంకా మేం నీతో మాట్లాడాలా?’’ సీతారామయ్య గట్టిగా అడిగాడు. ‘‘నాటకమా?’’ అమాయకంగా నటిస్తూ అడిగింది సీత. ‘‘ఆయన అన్నీ వివరంగా మాతో చెప్పారు.’’ అంది సీతారామయ్య భార్య, వివేక్‌ను చూపిస్తూ. సీతలో కంగారు ఇంకా పెరిగిపోయింది. ‘‘చెప్పేశారా?.. అంకుల్..?’’‘‘అదీ.. సీతా..’’ వివేక్ మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ‘‘బాబూ! మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి.’’ అన్నాడుసీతారామయ్య. వెంటనే సీతవైపు చూస్తూ.. ‘‘ముందు నాకు సమాధానం చెప్పవే సీతా! ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది?’’ అడిగాడు. ‘‘తాతయ్యా! అదీ..’’ సీత తడబడుతోంది. ‘‘హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే, నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడొస్తున్నాడు.’’తాతయ్య మాటలు వింటున్న సీత కంగారంతా ఎగిరిపోయింది. పొలం దగ్గర్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినప్పట్నుంచి ఉన్న కంగారు అది. వివేక్ ఎక్కడ నిజం చెప్పేశాడో అని. కానీ వివేక్ నిజం దాచేశాడు. సీతారామయ్యకు చెప్పిన చిన్న అబద్ధంతోనే ఆ నిజాన్ని దాచేశాడు. ఆ అబద్ధం అప్పటికి సీత కళ్లలో ఆనందాన్ని తెచ్చిపెట్టింది. కానీ నిజం.. నిజం ఏదో ఒకరోజు చెప్పాల్సి రావొచ్చు. కొడుకు ఎప్పటికీ రాడని తెలిస్తే, ఆ రోజు సీతారామయ్య ఏమవుతాడో!! -
తాత పాత్రలో మనవడు..!
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల్లో ఎవరు నటిస్తారన్న ప్రశ్న ఇండస్ట్రీ వర్గాలతో సినీ అభిమానుల్లోనూ వినిపిస్తోంది. ముందుగా ఎన్టీఆర్, ఏఎన్నార్లుగా జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యలను నటింపచేయాలని చిత్రయూనిట్ ప్రయత్నించారు. అయితే ఎన్టీఆర్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. మొదట్లో నాగచైతన్య కూడా నో చెప్పినా.. తాజాగా ఏఎన్నార్ పాత్రలో నటించేందుకు అంగీకిరంచారు. రెండు రోజుల పాటు డేట్స్ కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 14, 15 తేదిలో నాగచైతన్యకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా ఎస్వీఆర్ గా సీనియర్ నటుడు మోహన్ బాబు నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో సమంత, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దర్శకులు క్రిష్, తరున్ భాస్కర్లు నటిస్తున్నారు. -
వెండి వెన్నెల జాబిలి!
చిత్రం: సిరిసంపదలు రచన: ఆత్రేయ సంగీతం: మాస్టర్ వేణు గానం: ఘంటసాల, ఎస్. జానకి కొన్ని పాటలు బాగుంటాయి. కొన్ని పాటలు ఆనందింప చేస్తాయి. కొన్ని పాటలు కలకాలం మనసులో పదిలంగా దాగుంటాయి. అదిగో... అలా మనసులో దాగిందే... ఈ ‘వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’ పాట.ఇవాళ చాలా మంది (నాతో సహా) కవులు మామూలు సంభాషణల్లా రాస్తున్న పాటల శైలి పాత సినిమాల్లో కవులు వాడిందే! అందులో దిట్ట పింగళి. అదే శైలిని అందుకున్న మరో కలం ఆత్రేయది. ఆ పెన్నులోంచి ఒలికిందే ఈ ‘వెండి వెన్నెల’. ఈ పాటలో గమ్మత్తయిన సంగతి.. పల్లవిలా మొదలైన పాదాల కన్నా అనుపల్లవి పాపులర్ అవడం! పాట ఎక్కడో మధ్యలో ఎత్తుకున్నట్టుగా మొదలవుతుంది. తర్వాత బాణీని అనుసంధానించిన తీరు మాత్రం సంగీత దర్శకుని ప్రతిభకు కట్టిన పట్టం!‘ఈ పగలు రేయిగా.. పండు వెన్నెలగ మారినదేమి చెలీ? ఆ కారణమేమి చెలీ..?’ అని ప్రశ్నిస్తూ మళ్ళీ తనే దానికి జవాబుగా .. ‘వింత కాదు నా చెంతనున్నది... వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి..’ అని అసలైన కారణంతో పల్లవి తొడగడం కవి చమత్కారం! ప్రసాద్ (ఏఎన్నార్) ఎంత సరసుడో .. పద్మ (సావిత్రి) అంత గడుసరి. చూపు విసిరినా కనులు కలపదు. కలసి నడిచినా చేయి కలపదు. ఇచ్చినట్టే ఇచ్చి మనసు దాచుకొంటుంది. ఆ పెదాలు కూడా మునిపంట బిగించే ఉంచింది మరి. నవ్వితే మగాడు చొరవ తీసుకోడూ? ‘మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు? పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు...’ అని అతనూ పసిగట్టాడు. ఏఎన్నార్, సావిత్రి హావభావాల గురించి ప్రత్యేకంగా పట్టం కట్టాల్సిన అవసరం లేదు. ‘సిరి సంపదలు’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించిన ఈ పాట తెలియని వారుండరు. డాబా మీద ఎన్ని రేడియోలు రాత్రి పూట ఈ పాట వింటూ ఆ వెన్నెలలో తడిసి వుండవు? అమ్మాయిలకు ఇష్టమైనా ఆ విషయం చెప్పకుండా అబ్బాయిలతో పోయే నయగారాలు ఈ పాటలో కుర్రాడు ఎంతో అందంగా చెప్పాడు. అందుకు తగ్గ సావిత్రి సొగసు పాటని ఆహ్లాద పరిచింది. కన్నుల అల్లరి.. సిగ్గులతో మెరిసే బుగ్గల ఎరుపు.. ఆ మనసుని అలా పట్టిచ్చేస్తాయి.. ‘కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చి యేమార్చేవు? చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవు..’ అని గుట్టు విప్పుతున్నాడు. ఒక్కటేమిటి.. ఆమె ప్రతి కదలికలోని తడబాటుకు పసందైన మాటలు విసురుతూ కట్టి పడేస్తున్నాడు. ఈ పాటలో అన్నిటికీ మించి ఒక అద్భుతమైన కవి భావం అందలం ఎక్కించదగింది. ప్రియురాలి జడలో తెల్లగా మెరిసిపోయే మల్లెలను అద్దంగా పోలుస్తూ అవి ఆమె నవ్వుని అందులో చూపిస్తున్నాయని చెప్పడం నిరుపమానం! అపురూపం!! మరువలేని భావం! ‘నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను..’ అన్న భావ వ్యక్తీకరణ ఆత్రేయ రాసిన ఈ మొత్తం పాటలో శిరోధార్యం అనదగిన వాక్యం! ఆ అమ్మాయితో ‘అలుక చూపి అటు వైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వకు.. నీ నవ్వుని జడలో మల్లెలే అద్దంగా చూపుతున్నాయి..’ అనడం మరువలేని భావం!ఈ చిత్రంలోని ఈ పాట ఎంతో మందిని అలరించింది.. నన్ను కూడా..! – డా. వైజయంతి - డా. వనమాలి గీత రచయిత -
ఏఎన్నార్ పాత్రలో యంగ్ హీరో..?
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తోంది. అప్పటి సినీ దిగ్గజాల పాత్రల కోసం ఈ జనరేషన్ లోని నటులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారిని ఫైనల్ చేయగా దర్శకుల పాత్రలకు క్రిష్, తరుణ్ భాస్కర్ లను తీసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఓ యువ నటుడు చేరాడు. చాలా రోజులుగా సంచలన హీరో విజయ్ దేవరకొండ మహానటిలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా, ఏ పాత్రలో కనిపించనున్నాడో వెల్లడించలేదు. తాజాగా సమాచారం ప్రకారం విజయ్, అలానాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో నటించనున్నాడట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా ఎవరు కనిపించినున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అశ్వనిదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘బాబు’ లేని చిత్రం సాధ్యమా?
విశ్లేషణ మహాత్మాగాంధీ జీవితాన్ని చలనచిత్రంగా తీసినవారు ఆంగ్లేయులైనా చాలా వాస్తవికంగా, అర్థవంతంగా నిర్మించారనే చెప్పాలి. దానికి గాంధీపట్లనే కాదు. చలనచిత్ర నిర్మాణం పట్ల, చరిత్ర పట్ల ఉన్న నిబద్ధత కారణం. నేటి రాష్ట్ర రాజకీయ పెద్దల దృష్టితో కాకుండా, నాటి వాస్తవిక దృష్టితో, నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెలుసుకుని ప్రజలు గుణపాఠం తీసుకునే విధంగా, స్ఫూర్తిదాయకంగా చిత్రించడం ఆ చలనచిత్ర నిర్మాతల సంస్కారానికి గీటురాయి అవుతుంది. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో, తెలుగుజాతిలో నూతన భావోద్వేగాలను, జవసత్వాలను ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పినవాడు, ఆంధ్రుల వెండితెర ఆరాధ్య కథానాయకుడు కీ.శే. నందమూరి తారకరామారావు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత పాతికేళ్లపాటు రాష్ట్రంలో తిష్ట వేసిన కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, మహా ప్రభంజనంలో తెలుగు నేల నలుచెరగులా 9 నెలలపాటు అవిశ్రాంతంగా ప్రజానీకంలో తిరిగి నూతన తరహా రాజకీయ రూపురేఖలతో ఓడించి, రికార్డు సృష్టించిన ఘనత ఎన్టీఆర్ స్వంతం. ఆయన జీవిత చరిత్రను చలనచిత్రంగా రూపొందించాలన్న అభిప్రాయం తనకున్నట్లు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. కాగా, రామారావు జీవిత చరిత్రపై చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఆయన పాత్రను తానే ధరించగలనని ఎన్టీఆర్ కుమారుడు, సినీ కథానాయకుడు బాలకృష్ణ గతంలోనే ఒకసారి మనసులో మాట చెప్పారు. అయితే ఆ జీవిత చరిత్ర వాస్తవానికి ప్రతిబింబంగా ఉంటుందో లేదో అన్న భయసందేహాలను రామారావు ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి వెలిబుచ్చారు. అక్కినేని చెప్పిందే నిజమైందా? అయితే ఎన్టీఆర్ జీవితం అంటే ఆయన వ్యక్తిగత జీవితమే కాదనీ, ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగువారి చరిత్ర అనీ, దానిని సందేశాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా నిర్మించాలనీ వివాదాలకు, విషాదాలకు ప్రాధాన్యం ఇవ్వరాదనీ ఒక తెలుగు టీవీ చానల్ (సాక్షి కాదు) ఎందుకో భుజాలు తడుముకుంటున్నట్లు అర్జెంటుగా అరగంట కార్యక్రమం నిర్వహించింది. అరగంటలో ఒక్కసారైనా నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన కూడా లేదు. అన్నగారి అత్యంత ఉత్కంఠ భరిత రాజకీయ జీవితం గుర్తుకొచ్చినంత కాలం చంద్రబాబు కూడా గుర్తుంటారు మరి! 300 పైగా సినిమాలలో రాముడు, కృష్ణుడు, అర్జునుడు, బృహన్నల వంటి పాత్రలతో పాటు రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు వంటి వ్యతిరిక్త ఛాయలు గల పాత్రలలో సైతం నభూతో న భవిష్యతి అన్నట్లు నటించిన ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని వెండితెర జీవితానికే పరిమితం చేయడం అసాధ్యం. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేయబోయే ముందు నాగేశ్వరరావు గారిని కూడా తనతో పాటు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారట. దానికి ఏఎన్నార్ బదులిస్తూ, బ్రదర్ నిజానికి నేటి రాజకీయాలను నీకంటే నేనే బాగా అర్థం చేసుకున్నాను. నీ సహజ స్వభావం నేటి రాజకీయాలకు సరి పడదు. నువ్వు ఎవర్ని నమ్మినా గుడ్డిగా నమ్ముతావు. ముక్కుసూటిగా మాట్లాడటం తప్ప నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం నీవల్ల కాదు. నేను మాత్రం నీతో రాలేను అన్నారట. ఎన్టీఆర్ మరణానంతరం నా సోదరుడు రామారావు నటుడిగా కొనసాగినట్లయితే గొప్ప పాత్రలకు ప్రాణపత్రిష్ట చేసేవారు. ఆయన విషాదాంతం చాలా బాధించింది అని ఎఎన్నార్ ఒక సందర్భంలో అన్నారు. రామారావు నటుడుగా మకుటం లేని మహారాజు. రాజకీయ జీవితంలో తనదంటూ ప్రత్యేక ముద్రవేసి నిలబడిన మహానేత. రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ప్రతివారికి నిలవనీడని కోట్లాది పేదలకు అందించే సంక్షేమ పథకాలు ఆయనతోనే ఆరంభం. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు. ప్రజల వద్దకు పాలన తేవాలని సమితి స్థానంలో మండల పాలనా విధానం ఆయన పాలన రూపకల్పనే. అయితే.. ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఎంత ఉన్నతమై, స్ఫూర్తిదాయకమైనప్పటికీ, విషాదాంతమని చెప్పక తప్పదు. ఆయన రాజకీయ చరమాంకంలో తాను పెంచి పెద్ద చేసిన వారు తనను విస్మరించి ఒంటరిని చేశారన్న బాధతో, పదవీభ్రష్టుడై ఆ మానసిక వేదనతో హృద్రోగం తిరగబెట్టి ఎన్టీఆర్ కన్నుమూయడం పెద్ద విషాదం. ఎన్నో సినిమాలలో ఆయన హీరో. విలన్లను ఓడించిన కథానాయకుడు. తీరా తన రాజకీయ జీవితంలో అలానే వ్యవహరించగలిగారా? అలా కాపట్యంపై, విలన్లపై విజయం సాధించగలిగారా? రాజకీయాలకు సంబంధించి రామారావుకు ఏఎన్నార్ చేసిన హెచ్చరికే నిజమైందా? అంతటి ప్రజాభి మానం చూరగొన్న నేత రాజకీయ జీవితం ఎందుకిలా ముగిసింది? ఆ హీరోను అంతిమంగా ఓడించి, ఆయనకు ఆ పరిస్థితి దాపురించేందుకు కారణమైన విలనీ ఏమిటి? ఆ విలనీకి కారణమైన నాటి వాస్తవిక రాజకీయ పరిస్థితులు, ఆ సందర్భంగా వ్యక్తుల పాత్ర వీటిని గురించి నిష్పక్షపాతంగా నిజాయితీగా తెలుగు ప్రజలకు తెలియజేయడం కూడా రామారావు జీవితాన్ని చలనచిత్రగా నిర్మించదలిచిన వారు విస్మరించరాని బాధ్యత. నేటి నేతలు ఆధునిక మనువులే..! రామారావు జీవితంలో విలన్ లక్ష్మీపార్వతి అని ఆ దుష్టశక్తి వల్లనే రామారావు జీవితం విషాదాంతం అయిందని కొందరు నేటికీ ప్రచారం చేస్తుండటం మనం చూస్తున్నాం. మనుస్మృతి ఆధారిత సామాజిక అణచివేతలో, వర్ణవివక్షతతోపాటు స్త్రీలను హీనంగా చూడటం కూడా ఆ భావజాలంలో అంతర్భాగమే. నేటికీ కొందరు పెద్దలు.. కోడలు పండంటి కొడుకును కంటాను అంటే వద్దనే అత్త ఎవరు అన్న సామెతను చెబుతారు కానీ చక్కని చుక్క, చదువుల సరస్వతి లాంటి మనవరాలిని కంటానంటే అత్త వద్దంటుందా అన్న మాట వారి నోట రాదెందుకు? లక్ష్మీపార్వతి కేవలం ఇంట్లో దీపం పెట్టి భర్తకు వండిపెడుతూ అతిథి అభ్యాగతులను ఆదరించే ఇల్లాలుగా వంట ఇంటికే పరిమితమై ఉంటే ఆ ‘పెద్ద’లకు అభ్యంతరం ఉండేది కాదేమో! శ్రీమతి బసవతారకం మరణానంతరం ఎన్టీఆర్‌ను పలకరిద్దామని నాటి సినీ నటి భానుమతి ఆయన ఇంటికెళ్లారట. ‘ఆ లంకంత కొంపలో, తనను ఆప్యాయంగా, పలకరించి ప్రేమను పంచేవారు లేక ఒంటరిగా బావురుమన్నట్లున్న రామారావును చూసి చాలా బాధ అనిపించింది. సింహంలా నలుగురిని శాసించే రామారావు ఎక్కడ? ఇలా ఆలనాపాలనా లేకుండా దైన్యంగా ఉన్న ఈ రామారావు ఎక్కడ? ఆయన ఎన్టీఆర్‌ని వివాహం చేసుకున్నారని విన్నతర్వాత అనిపించింది. లక్ష్మీపార్వతి రాక రామారావులో మునుపటి ఉత్సాహ, ఉద్వేగాలను పునరుజ్జీవింప చేస్తుంది’ అని అన్నారట. ఒక మానవ హృదయం స్పందించిన తీరు అది. పైగా లక్ష్మీపార్వతి చట్టరీత్యా తన మొదటి వివాహాన్ని రద్దు చేసుకున్నారు. రామారావు అప్పటికే కళత్రవిహీనుడు. నిజానికి వారి వివాహానికి, సహజీవనానికి ఏ లీగల్ అభ్యంతరాలు ఉండవు. అందునా రామారావు తమ అనుబంధాన్ని చాటుమాటు వ్యవహారంగా సాగించలేదు. దాదాపు లక్షమంది ప్రజలు పాల్గొన్న బహిరంగ సభలో ప్రజల సాక్షిగా లక్ష్మీపార్వతిని వేదికపైకి ఆహ్వానించి, తాను ఆమెను వివాహమాడుతున్నానని తన సహజ రాజసాన్ని ప్రదర్శించారు. ఆయనను అడ్డం పెట్టుకుని, తెరవెనుక చక్రం తిప్పాలనుకున్న పెద్దలకు ఆయన పేరుతో తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోదలిచిన వారికి రామారావు జీవితంలో లక్ష్మీపార్వతి పాత్ర పెరుగుతుండటం నచ్చకపోవడం సహజం. అందుకే ఆమె స్థానంలో ఒక వారసుడిని ప్రవేశపెట్టదలుచుకున్నారు. కానీ అందుకు తగిన మెటీరియల్ ఆయన వారసునిలో కనిపించలేదు. అప్పుడు చంద్రబాబు వారి దృష్టికి వచ్చాడు. చంద్రబాబు సరసన చేరి ఎన్టీఆర్ సంతానాన్ని కూడా ఆయనకు దూరం చేసి చంద్రబాబు ద్వారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొన్ని శక్తులు కుటిల యత్నాలు చేశాయి. తన ఆశీస్సులతో, అండదండలతో శాసనసభ్యులైన తన తెలుగు తమ్ముళ్లను కలుసుకుందామని, లక్ష్మీపార్వతి లేకుండా వారికి వాస్తవాలు తెలిస్తే వారు తిరిగి తనకు తోడుగా ఉంటారని ఆశించిన ఎన్టీఆర్‌కు గతంలో ఏ ముఖ్యమంత్రికీ జరగనంత అవమానం ఎదురైంది. ఆదరించాల్సిన రామారావుపై చెప్పులు విసిరి ఘోరంగా పరాభవించారు. కృతజ్ఞతను మర్చిన వారే వెన్నుపోటు పొడిచారా? ఆ తర్వాత అప్రజాస్వామిక రీతిలో నాటి గవర్నర్ కృష్ణకాంత్, అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు వంటి రాజ్యాంగ పెద్దల అక్రమమైన సహకారంతో ఎన్టీఆర్‌ని పదవీభ్రష్టుడిని చేశారు. ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీని, దాని ఎన్నికల చిహ్నం సైకిల్ని కూడా హైజాక్ చేశారు. కృతజ్ఞత అనేది మనిషికి ఉండాల్సిన సద్లక్షణాల్లో అత్యుత్తమమైనది. ఓటుకు అయిదువేలు అయినా ఇవ్వగలనని నిర్లజ్జగా నంద్యాల ఎన్నికల సందర్భంగా చెప్పగల ముఖ్యమంత్రి, గత ఎన్నికల్లో గెలిచేందుకు 12 కోట్లు ఖర్చుచేశానని మీడియా ముందు ప్రకటించిన సభాపతులు కొంతకాలం ప్రజలను ఎత్తులతో, జిత్తులతో ఆడుకోవచ్చు. కానీ సాధారణమానవులెవ్వరూ నాడు రామారావుకు జరిగిన అన్యాయం తెలుసుకున్నా, గుర్తుకొచ్చినా ఆ కృతఘ్నతను క్షమించలేరు. అప్పటికే రామారావుకు గుండె జబ్బు ఉంది. అంతటి పరాభవాన్ని ఆయన భరించలేకపోయారు. కానీ తాను అంతగా నమ్మిన, సోదరతుల్యుల చేతిలో అవమానానికి గురైన బాధ ఆయన హృదయంపై ప్రభావం చూపింది. ఆయన మరణానికి ఇదీ ఓ ప్రధాన కారణం. ఆనాడు ఏఎన్నార్ చెప్పినట్లుగా రామారావు అపాత్రదానం, గుడ్డినమ్మకం, నిష్కర్షగా వ్యవహరించే తత్వం చివరకు ఎంతటి విషాదానికైనా దారి తీయొచ్చని ప్రపంచానికి గుణపాఠం చెప్పింది కూడా. ఎన్టీఆర్ జీవిత చలనచిత్రంలో కమ్యూనిస్టుపార్టీల ప్రస్తావన రాకతప్పదు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కరరావును అడ్డంపెట్టుకుని కేంద్రప్రభుత్వం కూల్చివేసిన సందర్భంగా టీడీపీకంటే ముందే స్పందించి ప్రజాస్వామ్య పరిరక్షణ సభను నిర్వహించి టీడీపీకి, ఎన్టీఆర్‌కి దన్నుగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీలు తర్వాత 1995లో రామారావును పదవీభ్రష్ణుడిని చేసి వెన్నుపోటు రాజకీయ సందర్భంగా చంద్రబాబు కొమ్ము కాశాయి. అలా ఎందుకు చేయవలసి వచ్చిందో నేటికీ కమ్యూనిస్టుల నుంచి సమాధానం లేదు. నేడు ఏపీలో కమ్యూనిస్టు పార్టీలను కించపర్చడంలో చంద్రబాబు, ఆయన కుమారుడిదే అగ్రస్థానం. గాంధీ జీవితాన్ని చలనచిత్రంగా తీసినవారు ఆంగ్లేయులైనా చాలా వాస్తవికంగా, అర్థవంతంగా నిర్మించారనే చెప్పాలి. దానికి గాంధీపట్లనే కాదు. చలనచిత్ర నిర్మాణం పట్ల, చరిత్ర పట్ల ఉన్న నిబద్ధత కారణం. నేటి రాష్ట్ర రాజకీయ పెద్దల దృష్టితో కాకుండా, నాటి వాస్తవిక దృష్టితో, రామారావు జీవిత చరిత్రను తెలుసుకుని ప్రజలు గుణపాఠం తీసుకునే విధంగా, స్ఫూర్తిదాయకంగా చిత్రించడం ఆ చలనచిత్ర నిర్మాతల సంస్కారానికి గీటురాయి అవుతుంది. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు ‘ మొబైల్ : 98480 69720 -
తెరవెనుక ఆయనే దసరా బుల్లోడు!
‘‘తెరపై దసరా బుల్లోడు ఏయన్నార్ అయితే... తెరవెనుక దసరా బుల్లోడు వీబీ రాజేంద్రప్రసాద్‌గారు. ఆయనతో నాది మూడున్నర దశాబ్దాల అనుబంధం. ఆయన గురించి కుటుంబ సభ్యుల కంటే నాకే ఎక్కువ తెలుసు. 2004లో తొలిసారి విడుదల చేసిన ‘దసరాబుల్లోడు’ పుస్తకానికి కొనసాగింపుగా ఈ పుస్తకాన్ని అందిస్తున్నా’’ అన్నారు సీనియర్ జర్నలిస్ట్ భగీరథ. దర్శక–నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ జీవిత కథ ఆధారంగా వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగీరథ రాసిన ‘దసరాబుల్లోడు’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘చిత్రసీమకు విశిష్ట సేవలు అందించిన రాజేంద్రప్రసాద్ చివరి దశలో చేసిన కృషి వల్లే ఫిలింనగర్ దైవసన్నిధానంలో 18 దేవాలయాలున్నాయి. దర్శక, నిర్మాతలకు ఈ పుస్తకం ఆదర్శనీయ గ్రం«థంగా నిలవాలి’’ అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అతిథిగా హాజరయ్యారు. వీబీ రాజేంద్రప్రసాద్ తనయుడు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - అక్కినేని నాగేశ్వరరావు
-
పల్లెకు పోయి.. పారుని చూసి...
నట జీవితాన్ని వారసత్వంగా ఇచ్చిన దిగ్గజాల జ్ఞాపకాలను తమతో పాటే ఉంచుకోవాలని అనుకుంటు న్నారు వారసులు. ఆ లెజెండరీ నటుల సినిమా సీక్వెల్స్‌లో నటించడం, వాళ్లు నటించిన అలనాటి క్లాసిక్ సాంగ్స్‌ని రీమిక్స్ చేయడం ఇవన్నీ... అలాంటి ఆలోచనల్లో భాగమే. ఇప్పుడు అక్కినేని కుటుంబ కథానాయకుడు సుశాంత్ కూడా తాత ఏయన్నార్ పాటలో ఆడిపాడాడు. ‘దేవదాసు’ సినిమాలోని ‘పల్లెకు పోదాం... పారును చూద్దాం ఛలో ఛలో..’ అనే ఎవర్ గ్రీన్ సాంగ్‌కి స్టెప్పులేశారు సుశాంత్. ఆయన హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల నిర్మిస్తున్న ‘ఆటాడుకుందాం రా’ కోసమే ఈ పాటను రీమిక్స్ చేశారు. ‘‘తాతగారి ‘దేవదాసు’ సినిమా పాట రీమిక్స్‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ పాట చిత్రీకరిస్తున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను’’ అని సుశాంత్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
198 చిత్రాల్లో నటించా..
భీమవరం : స్వచ్ఛంగా గలగలపారే గోదావరి, మైమరిపించే ప్రకృతి అందాలను సొంతం చేసుకున్న గోదావరి తీరాన్ని తానెప్పటికీ మరిచిపోలేనని సినీ నటి జమున అన్నారు. భీమవరం మావుళ్లమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పాలకొల్లు, నరసాపురం పరిసరాల్లో చిత్రీకరించిన మూగమనసులు చిత్రం తెలుగు, హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచి తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందన్నారు. 198 చిత్రాల్లో నటించా.. తాను ఇప్పటివరకు 198 చిత్రాల్లో నటించానని జమున తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు ఉన్నాయన్నారు. ఎన్టీ రామారావుతో 30 చిత్రాల్లో నటించగా ఏఎన్ఆర్, రాజకుమార్ వంటి హీరోలతో నటించిన చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయని చెప్పారు. సత్యభామగా పేరొచ్చింది సాంఘిక సినిమాల్లో ‘మూగమనసులు’, పౌరాణిక చిత్రాల్లో ‘సత్యభామ’ మంచిపేరు తెచ్చిపెట్టాయని జమున అన్నారు. వ్యక్తిగతంగా ‘పండంటి కాపురం’ చిత్రంలోని రాణిమాలినిదేవి పాత్ర సృంతప్తి నిచ్చిందన్నారు. 25 ఏళ్లు హీరోయిన్గా.. చిత్రసీమలో 25 ఏళ్లపాటు కథానాయికిగా నటించడం పుర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని జమున తెలిపారు. ప్రస్తుత నటులు అయిదారు సినిమాలకు పరిమితం కాగా తాను అన్నేళ్లపాటు నటిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పేద కళాకారులకు చేయూత సినీ, నాటక రంగంలో పేద కళాకారులకు సేవా చేయాలనే సంకల్పంతో జమున పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేశానని చెప్పారు. ద్రాక్షరామసమీపంలో వృద్ధాశ్రమం ఏర్పాటుచేస్తానన్నారు. దీనికి 1,000 గజాల స్థలం కేటాయించామని వృద్ధులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. సినీ రంగం వ్యాపార మయం ప్రస్తుతం సినీ పరిశ్రమ వ్యాపార రంగంగా మారిందని జమున ఆవేదన వ్యక్తం చేశారు. యువతను పెడదోవ పట్టించేలా ఎక్కువగా సినిమాలు వస్తున్నాయని, అశ్లీలత ఎక్కువవుతోందన్నారు. టీవీల వల్ల సినీ పరిశ్రమ దెబ్బతింటుందనే వాదన సరైంది కాదని చెప్పారు. మంచి సినిమాలను థియేటర్లలలో చూడటానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. సన్మానం పూర్వజన్మ సుకృతం సినీ నటిగా తాను పలు సన్మానాలు అందుకున్నా భీమవరం మావుళ్లమ్మ వారి సన్నిధిలో సత్కారం అందుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని సినీ నటి జమున అన్నారు. ఆదివారం రాత్రి మావుళ్లమ్మ ఆలయం వద్ద కొటికలపూడి గోవిందరావు కళావేదికపై నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జమునను ఘనంగా సన్మానించారు. గోదావరి ప్రాంత ప్రజలకు ఉదార స్వభావం మెండుగా ఉంటుందని, ఇన్నేళ్లుగా తనపై చూపుతున్న ఆదరాభిమానాలే ఇందుకు నిదర్శనమన్నారు. లక్షలాది రూపాయలతో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడంతో పాటు కళాకారులను సత్కరించడం అభినందనీయమన్నారు. -
నాన్నా.. వి మిస్ యు..
ఏడుదశాబ్ధాల నట జీవితం.. ఎన్నో పాత్రలు.. మరెన్నో అవార్డులు.. తెలుగు సినీచరిత్రతోపాటూ తానూ సమాంతరంగా ఎదిగి ఒదిగిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 92వ జయంతి నేడు. ఈ సందర్భంగా నటుడు నాగార్జున తండ్రిని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. 'నాన్నా..విష్ యు హ్యాపీ బర్త్ డే. ఎక్కడున్నా సరే నీ ఆశీస్సులు ఎల్లవేళలా మా వెంటే ఉంటాయని తెలుసు. నిజంగా ఈ రోజు మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. ' అంటూ భావోద్వేగాన్ని పంచుకున్నారు నాగార్జున. 250కి పైగా సినిమాల్లో నటించి, మెప్పించిన ఏఎన్నార్ గత ఏడాది జనవరిలో కన్నుమూయడం తెలిసిందే. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసిన ఆయన.. భారతీయ సినీరంగం ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డునూ పొందారు. #ANRLivesON wishing you NANA happy birthday where ever you are/we know your blessings will be with us always.we will miss you this evening. — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 20, 2015 -
నాన్న నేను నవ్వు
నాన్నగారు మరో అందమైన ప్రపంచానికి వెళ్లిన తర్వాత నాగ్కిది రెండవ పుట్టిన రోజు. పిల్లలు తల్లిదండ్రుల నీడ దాటి వెళుతున్న మోడ్రన్ టైమ్స్ ఇవి. నాగ్ మాత్రం ఇంకా నాన్నతో... నవ్వుల తోటలో నడుస్తున్నాడు. నాన్నను తలచుకుంటున్నాడు. నాన్న నవ్వుతో పరిమళిస్తున్నాడు. మనసు అందమైనది అయితే ప్రపంచం అందంగా కనబడుతుందని అనడానికి నాగ్ ఒక ఉదాహరణ. అందుకేమో నాగ్ అందం వయసుతో పెరుగుతోంది. మీ వయసు ఎంత అని అడిగితే... ‘నాకింకా ఇరవై ఒకటే’ అని నవ్వేశాడు.ఏఎన్నార్ మనందరికీ పంచిన పూలతో బొకే తయారుచేసి ‘నాగింకా 21’ అని బర్త్‌డే విషెస్ చెబుతున్నాం. మిమ్మల్ని చూస్తోంటే వయసు పెరుగుతోందా.. తరుగుతోందా అనిపిస్తోంది. శారీరక వయసుని పక్కనపెడితే మీ మనసు వయసు తెలుసుకోవాలని ఉంది? మనసు వయసా (నవ్వుతూ). 21ఏళ్లు ఉంటాయేమో. ఐ ఫీల్ యంగ్ ఆల్ ది టైమ్. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఎవరితో ఉన్నా నేను యంగ్‌గా ఉన్నట్లే అనిపిస్తుంటుంది. నా ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. అలా యంగ్‌గా ఉండటం వెనక సీక్రెట్ ఏంటి? ఆలోచనలు యంగ్‌గా ఉండడమే. మీరు కనుక మనసులో ‘నాకు ఏజ్ అయిపోయింది’ అనుకుంటే మీరెంత యంగ్ అయినా ఓల్డ్లానే ఫీలవుతారు. అదే, 70, 80 ఏళ్ల వయసులోనూ ‘నేను టీనేజ్’ అనుకుంటే.. ఆలోచనలు అలానే ఉంటాయి. మీ మనసు యంగ్‌గా ఉండటంతో పాటు.. మీ ఫిట్నెస్ మీ వయసుని తెలియనివ్వదు. అసలేం చేస్తారు? లైఫ్ స్టయిల్ బాగుంటే అన్నీ బాగుంటాయి. మనం లోపలికి ఏం తీసుకుంటామో అదే బయటికి ప్రతిబింబిస్తుంది. అందుకే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అది కూడా మన శరీరానికి ఏది సరిపడుతుందో తెలుసుకోవడం ముఖ్యం. మంచి ఆహారంతో పాటు వర్కవుట్స్ కూడా ఫిట్‌గా ఉండటానికి కారణమవుతాయి. ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క లావయినట్లు అవుతారా? నా వల్ల కాదండి బాబూ. అలాంటి పాత్రలు వస్తే నిర్మొహమాటంగా నిరాకరించేస్తా. ఎందుకని... మీకు ఇలా స్లిమ్‌గా ఉండటమే ఇష్టమా? స్లిమ్ గురించి కాదు. అంత లావయ్యి, మళ్లీ సన్నబడటం అంటే ఆరోగ్యంతో ఆడుకున్నట్లే. శరరీంలో ఉండే అవయవాలకు అంత శ్రేయస్కరం కాదు. అవయవాల మీద ప్రభావం అంటే.. ఎలా? మన శరీరం ఒక లైఫ్ స్టయిల్‌కి అలవాటు పడిపోతుంది. అందుకు భిన్నంగా వెళ్లినప్పుడు ఇబ్బంది రావడం ఖాయం. ఉదాహరణకు లావు పెరగడం కోసం అప్పటివరకూ తిననివి కొన్ని తింటాం. అది శరీరానికి కొత్త కాబట్టి, ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత సన్నబడటం కోసం తిండి తగ్గిస్తాం. అవయవాలు మళ్లీ దానికి అలవాటుపడాలి. దాంతో ఇబ్బందిపడతాయి. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన శరీర తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా? హండ్రెడ్ పర్సంట్ అర్థం చేసుకోవాలి. టీనేజ్‌లో, అంతకుముందూ మనకు ఫిట్నెస్ గురించి పెద్దగా అవగాహన ఏర్పడే అవకాశం లేదు. తర్వాత తర్వాత దాని మీద ఆసక్తి ఏర్పడుతుంది. అప్పట్నుంచీ మన శరీర తత్వాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెడతాం. నేను హీరోని కాబట్టి, నార్మల్ పర్సన్ కన్నా కొంచెం ఎక్కువ అవగాహనే ఉంటుంది. ఫిట్నెస్కి సంబంధించిన బుక్స్ చదువుతాను. డాక్టర్స్‌ని అడుగుతాను. ఇంటర్నెట్ ద్వారా కూడా సమాచారం తెలుసుకుంటాను. శారీరకంగా హెల్తీగా కనిపిస్తున్నప్పటికీ మానసికంగా డల్‌గా ఉన్నారనిపిస్తోంది.. బహుశా మీ నాన్నగారు (ఏయన్నార్) లేరనే ఇంపాక్ట్ మీ మీద బాగా ఉన్నట్లనిపిస్తోంది? నాన్నగారు లేని ఇంపాక్ట్ హండ్రెడ్ పర్సంట్ ఉంది. ‘ఐ మిస్ హిమ్ ఎ లాట్’. అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్లినప్పుడు బాగా గుర్తొస్తారు. ముఖ్యంగా ‘మనం’ హౌస్ సెట్ చూస్తే చాలా గుర్తొస్తారు. నాన్నగారి చివరి సినిమా చేసిన సెట్ కాబట్టి, ‘మనం’ హౌస్ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. నాన్నగార్ని తల్చుకున్నప్పుడు ముఖ్యంగా నాకు గుర్తొచ్చేది ఆయన నవ్వు. అందుకని నాకు తెలియకుండా నాకే ఓ చిన్న స్మయిల్ వచ్చేస్తుంది. అలా నవ్వుతూ బతకాలనిపిస్తుంటుంది. ఫాదర్‌గా మీరు బెటరా? మీ నాన్నగారా? నాన్నగారిలాంటి మంచి ఫాదర్ దొరకరు. ఆయన నాకు తండ్రి కావడం లక్కీ. నా పిల్లలు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు (నవ్వుతూ). ఒకవేళ నటుడిగా నాన్నగారు బెటరా? మీరు బెటరా? అని అడిగితే ఏం చెబుతాను ‘నాన్నగారే’ అని చెబుతాను కదా. పెంపకం విషయంలో కూడా అంతే. పిల్లల్ని పెంచే విషయంలో మీ నాన్నగార్ని అనుసరిస్తారా? అఫ్కోర్స్ నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారో అలాగే నా పిల్లలను నేను పెంచుతుంటాను. ఇంటర్ఫియరెన్స్ ఉండదు కానీ, గెడైన్స్ ఉంటుంది. ఇప్పుడు అఖిల్ కూడా హీరోగా చేస్తున్నాడు కాబట్టి, మీరెలాంటి గెడైన్స్ ఇస్తున్నారు? కథ విన్నాను. బాగా నచ్చింది. వీవీ వినాయక్ మంచి దర్శకుడు. రైట్ ట్రాక్‌లో ఆర్టిస్టులను ప్రేక్షకులకు దగ్గర చేయగలుగుతాడు. ఈ సినిమా చేయాలని అఖిల్ అనుకున్నాడు. ఆ ఫ్రీడమ్ ఇచ్చాను. గెడైన్స్ ఇస్తాను. విదేశాల్లో షూటింగ్ జరిగినప్పుడు మీరు వెళ్లారు కదా.. అప్పుడు అఖిల్ నటన చూసి ఏమనిపించింది? చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. కెమెరా ముందు చాలా ఈజ్‌తో కనిపించాడు. ఏ ఆర్టిస్ట్‌కి అయినా అది ముఖ్యం. ఆర్టిస్ట్ అంటే డ్యాన్సులు, ఫైట్స్ చేయడం మాత్రమే కాదు. అన్నీ చేయాలి. పర్ఫెక్ట్గా యాక్ట్ చేయాలంటే కెమెరా ఫియర్ ఉండకూడదు. చిన్నప్పట్నుంచీ అఖిల్ తనేం చేయాలనుకుంటే అది పర్ఫెక్ట్గా చేస్తాడు. ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు క్రికెట్ నేర్చుకుంటానన్నాడు. పర్ఫెక్ట్గా ఆ పని చేశాడు. ఇప్పుడు ఆర్టిస్ట్‌గా కూడా పర్ఫెక్షనిస్ట్ అనిపించుకుంటాడు. సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం అనేది ఎప్పట్నుంచో వస్తోంది. మీకా ఉద్దేశం లేదా? రాజకీయాల మీద నాకు ఆసక్తి లేదు. అంత టైమ్ కూడా లేదు. రాజకీయాలు అవసరం. పాలిటిక్స్‌లో వస్తున్న మార్పులను ఫాలో అవుతుంటాను. అఖిల్‌ని అన్నపూర్ణ ద్వారా కాకుండా వేరే బేనర్ ద్వారా పరిచయం చేయడానికి కారణం? బేనర్ గురించి ఆలోచించలేదు. ఎప్పట్నుంచో కథలు వెతికే పని మీద ఉన్నాం. విక్రమ్‌కుమార్ కొన్ని కథలు చెప్పాడు. ‘మనం’ చూశాక అఖిల్‌తో సినిమా చేస్తానని వినాయక్ ముందుకొచ్చాడు. కథ బాగుంది. నితిన్, అఖిల్ బాగా క్లోజ్. బ్రదర్స్‌లా ఉంటారు. నితిన్ వచ్చి సినిమా తీస్తానని అంటే ఓకే అన్నాను. చెప్పాలంటే నా ప్రొడక్షన్ కన్నా బాగా చేస్తున్నారు. అఖిల్‌కి బాలీవుడ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్‌గా తెలుగుకన్నా ముందే హిందీలో అవకాశాలు వచ్చాయి. కానీ, తొందరపడొద్దని చెప్పాను. అలాగే, ఇక్కడ ఒక హిట్ సినిమా చేసి, ఆ చిత్రం హిందీ రీమేక్‌లో నటించమన్నాను. అప్పట్లో నేను ‘శివ’ అలానే చేశాను. ఇక్కడ హిట్టయిన తర్వాత హిందీలో చేశాం. ఇప్పటికీ నన్ను హిందీలో శివ అనే పిలుస్తారు. {పయోగాత్మక చిత్రాలు ఇష్టమేనా? ప్రయోగం అంటే ఏంటో నాకర్థం కాదు. నేను చేసిన ‘రాజన్న’, ‘గగనం’ ఎక్స్పరిమెంట్సా? ఏమో చెప్పలేను. ‘మనం’ కూడా ఎక్స్పరిమెంట్ అని అనను. ఇప్పుడో ఫ్రెంచ్ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాను. అందులో కంప్లీట్ ప్యారలైజ్డ్ పర్సన్‌ని. దాన్ని ఎక్స్పరిమెంట్ అంటారా? తెలియదు. అందరూ చూసే సినిమాలు చేయాలనుకుంటాను. ‘బాహుబలి’తో తెలుగు సినిమా కూడా వందల కోట్ల క్లబ్లో చేరింది. దానివల్ల మన సినిమా మార్కెట్ పెరిగింది కదా? అది ఓకే కానీ, అన్ని సినిమాలూ ‘బాహుబలి’ అవ్వవు. రాజమౌళి డ్రీమ్ చాలా పెద్దది. నిర్మాతలు అంత ఖర్చు పెట్టి తీయడం, ప్రభాస్ మూడేళ్లు వేరే సినిమాలు చేయకపోవడం, రానా తదితరులు కూడా చాలా కష్టపడటం.. దానికి తగ్గ ప్రతిఫలాన్ని ప్రేక్షకులు ఇచ్చారు. రాజమౌళితో సినిమా చేయాలని ఉందన్నారు.. ఎప్పుడు చేస్తున్నారు? నాతో చేయాలని ఆయనకుండాలి కదా (నవ్వుతూ). ‘బాహుబలి’ రెండో పార్ట్ అవ్వాలి. ఆ తర్వాత రాజమౌళి ‘మహాభారతం’ అంటున్నారు. ఏమో చూడాలి. నాకు పౌరాణిక చిత్రాలంటే ఇష్టమే. ఫైనల్లీ... పుట్టినరోజు నాడు ఎలా గడుపుతారు.. ఏదైనా మర్చిపోలేని పుట్టినరోజు ఉందా? ఫ్యామిలీతోనే ఉంటాను. పర్టిక్యులర్‌గా ఆ రోజే గుడికి వెళ్లాలనుకోను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెబుతారు. బర్త్‌డే నాడు నాకు ఇష్టమైన వాళ్లతో స్పెండ్ చేయాలనుకుంటాను. నా ఏ పుట్టినరోజు నాడూ ఏదీ ప్రత్యేకంగా జరగలేదు. అందుకని మెమొరబుల్ బర్త్ డే లేదు. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు. మంచి నిర్ణయం ఎప్పుడనిపిస్తే అప్పుడు ఆచరణలో పెట్టేస్తా. - డి.జి. భవాని ప్రస్తుతం చేస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ గురించి చెబుతారా? ఇందులో తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రలు చేస్తున్నాను. తండ్రి పాత్ర ఆత్మ రూపంలో కనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత రమ్యకృష్ణతో కలిసి నటిస్తున్నాను. నేనెక్కువ సినిమాలు చేసింది రమ్యతోనే. తండ్రి పాత్ర సరసన రమ్యకృష్ణ, కొడుకు సరసన లావణ్య నటిస్తున్నారు. ఆత్మ రూపంలో కనిపిస్తారా.. దెయ్యాలంటే నమ్మకం ఉందా? ఇప్పటివరకూ నాకెలాంటి అనుభవం కలగలేదు. అందుకని నమ్మకం గురించి చెప్పలేను. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పగలను. తెలుగు సినిమాల్లో ఈ ఫార్ములా మాత్రం వర్కవుట్ అవుతుంది. దర్శకుడు అనిల్ కల్యాణ్ ఈ చిత్రాన్ని చాలా కాన్ఫిడెంట్‌గా తీస్తున్నాడు. -
అక్కినేని పేరిట పురస్కారం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నట దిగ్గజం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట కర్ణాటకలోని నటులకు ఇక ఏటా అవార్డును ఇవ్వనున్నట్లు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఏ. రాధాకృష్ణ రాజు, ఏకే. జయచంద్రా రెడ్డి తెలిపారు. ఇక్కడి వయ్యాలికావల్‌లోని సమితి ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన అక్కినేని 91వ జయంతి సభలో వారు ప్రసంగించారు. ఆయన వస్త్రధారణ పదహారణాల తెలుగుదనానికి సంకేతమని కొనియాడారు. వృత్తిని దైవంగా భావించిన ఆయన అన్ని కాలాల వారికి ఆదర్శప్రాయుడని అన్నారు. తాను చదువుకోకపోయినా, ఇతరులు, ముఖ్యంగా పేదలు చదువుకోవాలనే సదుద్దేశంతో గుడివాడలో కళాశాలను స్థాపించారని గుర్తు చేశారు. తద్వారా ఎంతో మందికి విద్యా దానం చేశారని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అందరికీ చాటి చెప్పిన నట శిఖరం అక్కినేని అని పేర్కొన్నారు. ఆయన నటించిన అనేక చిత్రాలను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేశారని తెలిపారు. దేవదాసు, కాళిదాసు పాత్రల్లో ఆయన నటన నభూతో నభవిష్యతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి సీవీ. శ్రీనివాసయ్య, పూర్వ ప్రధాన కార్యదర్శి కే. గంగరాజు ప్రభృతులు పాల్గొన్నారు. -
అమ్మకు కూరలు కూడా తరిగిపెట్టేవారు
సెప్టెంబరు 20... తెలుగువారికి ప్రత్యేకమైన రోజు... ఆంధ్రుల అందాల రాముడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు... ఆ రోజు ఉదయాన్నే ఆయన ఇంటి ముందర రంగవల్లులు - తన కోసం వచ్చే అభిమానులకు స్వాగతం పలికేవి. వారి కోసమే ప్రత్యేకంగా బెల్లంతో తయారైన పరమాన్నం, పెసరట్టు, జిలేబీల ఘుమఘుమలు... ఆప్యాయంగా పలకరించేవి. ఈ సంవత్సరం అక్కినేని పరోక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు అంత ఘనంగానూ జరుగుతున్నాయి... ఈ సందర్భంగా అక్కినేని కుమార్తె నాగసుశీల తన తండ్రి జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు... నాన్నగారి లేని మొదటి పుట్టినరోజు... ఎలా అనిపిస్తోంది? నాగసుశీల: (కళ్లనీళ్లు పెట్టుకుని) నాన్నగారు లేరనే భావన చాలా ఇబ్బందిగా ఉంది. రోజూ ఫ్యాన్స్ ఫోన్ చేసి తామంతా బాధపడుతున్నామని చెబుతుంటే, మేమే వాళ్లని సముదాయించవలసి వస్తోంది. (అంటూ అంతలోనే సర్దుకుని) మీరు పలకరించేసరికి ఒక్కసారి ఎమోషనల్ అయ్యాను. అంతే! నాన్నగారితో పెనవేసుకున్న అనుబంధం... నాన్న మా దగ్గరకు వచ్చినా, మేం అక్కడకు వెళ్లినా, పొద్దున్నే అందరికీ టీ కాఫీలు ఆయనే అందించేవారు. పిల్లలకు వండి పెట్టడమంటే ఆయనకు చాలా ఇష్టం. నా 22వ ఏట పెళ్లయ్యి, అమెరికా వెళ్లాను. నన్ను చూడటం కోసం అమ్మనాన్నలు ప్రతి సంవత్సరం వచ్చి, నెలరోజులు నా దగ్గరే ఉండేవారు. నాకు అప్పటికి ఇంకా వంట చేతకాదు. అందువల్ల తెలుగు వంటల పుస్తకం చూసి, ప్రయోగాలు చేస్తుంటే, నా పాట్లు చూసి, స్వయంగా దగ్గరుండి నేర్పించేవారు. నాన్నగారి కోసం ప్రత్యేకంగా ఏమేం తయారు చేసేవారు? నాన్న కోసం ప్రత్యేకంగా ఆపిల్ క్రంబుల్స్ తయారుచేసేదాన్ని. అయితే అందులో కొన్ని మార్పులు చేసేదాన్ని. బటర్ బదులుగా నూనె, నట్స్ బదులుగా ఓట్లు, పంచదార బదులు బెల్లం వేసి నాన్నకి ఆరోగ్యకరంగా తయారు చేసి ఇచ్చేదాన్ని. నాన్న చాలా ఇష్టంగా తినేవారు. ఇంకా క్యారట్ కేక్ కూడా తయారు చేసేదాన్ని. కోడిగుడ్డు పచ్చసొన నాన్న తినరు. అందువల్ల కేవలం తెల్ల సొన మాత్రం వేసి చేసేదాన్ని. నట్స్ బదులు ముసిలీ వేసేదాన్ని. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేయడం వల్ల, నేను ఎలా చేసినా మాట్లాడకుండా తినేసేవారు. మోటార్ హోమ్‌లో ఎంజాయ్ చేశారని విన్నాం... అవును. నాన్న అమెరికా వచ్చినప్పుడు ఒకసారి ఎనిమిది వేల కిలోమీటర్లు మోటార్ హోమ్‌లో తిరిగాం. అందులోనే అవెన్, స్టవ్ అన్నీ ఉంటాయి. ఆ ప్రయాణంలో నాన్న రకరకాల రుచులు తయారుచేసి పెట్టేవారు. అక్కినేనిగారికి ఆరోగ్యం మీద శ్రద్ధ కదా! బ్రేక్ ఫాస్ట్‌లో ఏవేవి తినేవారు? నిజమే! నాన్నకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. ఉదయం బొప్పాయి ముక్కలు, మజ్జిగ మాత్రమే తీసుకునేవారు. ఎప్పుడైనా ఉప్మా చేసినా, అది గోధుమరవ్వతోనే చేయాలి. భోజనంలో కూడా దంపుడు బియ్యంతో వండిన అన్నం వంటి ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే ఇష్టపడేవారు. చిన్నప్పటి నుంచి నాన్న మా నాయనమ్మకి సహాయం చేసేవారట. అందువల్ల నాన్నకి వంట పని, ఇంటి పని అన్నీ తెలుసు. అందుకే అమ్మకి ఎన్నో సందర్భాలలో సహాయం చేసేవారు. అమ్మకి కూరలు సైతం తరిగిపెట్టేవారు. ఇంకా... వంటలో కొత్తకొత్త ప్రయోగాలు చేయడమంటే నాన్నకు భలే ఇష్టం. ఒకసారి ఇంట్లో ఉన్న గడ్డి కోయించి, దానితో పచ్చడి చేయించి, అన్నంలో మా అందరికీ వడ్డించారు. మేమందరం చాలా ఇష్టంగా తిన్నాం. అంతా అయ్యాక అది గడ్డితో తయారైన వంటకం అని చెప్పారు. ఒక్కసారిగా అందరం నవ్వుకున్నాం. ఆయనకు ఏయే వంటకాలంటే ఇష్టం? పల్లెటూరి వంటకాలు, ముఖ్యంగా ఆంధ్ర వంటలంటే నాన్నకు ప్రత్యేకమైన అభిమానం. బీరకాయ - సెనగపప్పు కూర, దోసకాయ - మెత్తళ్ల కూర ఇష్టంగా తినేవారు. వంట నచ్చకపోతే వెంటనే మూతి ముడుచుకునేవారు. బాగుంటే మెచ్చుకునేవారు. బెల్లంతో తయారైన జున్ను. గవ్వలు, పూతరేకుల వంటి స్వీట్స్ బాగా ఇష్టపడతారు. పండూరి మామిడికాయలు, హిమాయత్ మామిడిపండ్లు తినేవారు. కొత్త ఆవకాయ కలపగానే, వేడి వేడి అన్నంతో కలిపి తినేవారు. వంద కిలోల ఆవకాయ పెట్టించి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలన్నది ఒక లిస్ట్ తయారుచేసి, ఆ ప్రకారం అందరికీ పంపేవారు. నాన్నకి పండగల కంటె పుట్టినరోజులు సెలబ్రేట్ చేయడమంటే చాలా ఇష్టం. ఆ రోజున బెల్లం పాయసం తప్పనిసరిగా చేయించేవారు. అక్కినేనిగారికి కారం బాగా ఇష్టమని విన్నాం... నాగసుశీల: నాన్నకి ఏ వంటకం చేసినా అందులో ఇగురు కారం (గొడ్డు కారం) వేస్తే ఇష్టం. అందుకని ఆయన కోసం ప్రత్యేకంగా ఇగురు కారం వేసేవాళ్లం. ఇంకా బెల్లం వేసిన ఉలవచారు, గుమ్మడికాయ, పచ్చిపులుసు, అప్పటికప్పుడు తయారుచేసే గోంగూర పచ్చడి ఉన్నాయంటే, ఆయనకు పండగే పండుగ. నాన్‌వెజ్‌లో బాగా ఇష్టంగా యేవేవి తినేవారు? నాగసుశీల: నాన్ వెజ్ అంటే పెద్ద ఇష్టం లేదు. ఎప్పుడైనా ఫిష్ తినేవారు. దోసకాయ మెత్తళ్ల కూర, నూటికో కోటికో చిన్న నాటు కోడి ముక్క తినేవారు. సంక్రాంతికి స్టూడియో స్టాఫ్ అందరూ కలుస్తారట! ఆ వివరాలు... నాగసుశీల: ప్రతి సంక్రాంతికి స్టూడియోలో స్టాఫ్ సుమారు 200 మంది వస్తారు. వాళ్ల కోసం ప్రత్యేకంగా వంటలు చేయించి, మేమే అందరికీ వడ్డించేవాళ్లం. మొన్న సంక్రాంతికి నాన్నని వీల్ చెయిర్లో తీసుకువచ్చాం. వారంతా ఎంత సంబరంగా, నాన్నతో ఫొటో తీయించుకున్నారు. నాన్నగారి పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా ఏవైనా వంటకాలు తయారు చేయించేవారా? నాగసుశీల: నాన్న తన పుట్టినరోజు నాడు, తన అభిమానుల కోసం ప్రత్యేకంగా బె ల్లం పరమాన్నం, పెసరట్టు, బెల్లం జిలేబీ చేయించేవారు. అందుకే ఈ సంవత్సరం కూడా అవే వంటకాలు చేయిస్తున్నాం. నాన్నగారి గురించి నాలుగు మాటలు... మేం కళ్లనీళ్లు పెట్టుకోవడం నాన్నకు ఇష్టం లేదు. ఆయన పరిపూర్ణ జీవితం గడిపారు. చూడవలసిన విజయాలన్నీ కళ్లారా చూశారు. అందుకే ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరంలాగే నాన్న పుట్టినరోజునాడు కుటుంబ సభ్యులం అందరం నాన్న ఇంటిదగ్గర కలుస్తున్నాం. నాన్న జ్ఞాపకంగా ఆయన చేతికున్న ఉంగరాన్ని నేను నా చేతికి పెట్టుకున్నాను. అది చూసినప్పుడల్లా నాన్న నాతోనే ఉన్నారనీ, నన్ను వేలు పట్టుకుని నడిపిస్తున్నారనీ అనిపిస్తుంది - సంభాషణ: డా. వైజయంతి అమ్మపోయిన తర్వాత నాన్నే అమ్మ కూడా అయ్యారు. మా అందరికీ ఏదో ఒకటి పెట్టడమంటే నాన్నకు చాలా ఇష్టం. అందుకే నాన్న దగ్గరకు వెళ్లినప్పుడల్లా ఇంట్లో కాసిన జామకాయలు, మామిడికాయలు కోయించి ఇచ్చేవారు. దెందులూరు తెల్ల వంకాయ కూరలో పాలు పోసి వండితే నాన్న ఒక్క ముక్క కూడా వదలకుండా తినేసేవారు. నాన్న మరణించడానికి ముందు కూడా ఆ వంకాయలు తెచ్చారు. అయితే వాటితో కూర ఇంకా చేయకముందే నాన్న మరణించడంతో, తెచ్చిన వంకాయలు ఫ్రిజ్‌లో అలానే ఉండిపోయాయి. మా వంటావిడ యాదమ్మ వాటితో కూర చేసి, ‘ఇది నాన్నగారి కూర’ అంటూ మా అందరికీ తలో ముక్క వచ్చేలా ఎంతో ఆప్యాయంగా వడ్డించింది. ఆ రోజున మిస్ అయినవారి కోసం కొంత కూర పక్కన ఉంచి, మరుసటి రోజు వారికి పెట్టింది. అది మాకు నాన్న మిగిల్చిన తీపి జ్ఞాపకంగా అనుకుంటాం. దెందులూరు వంకాయ కూర కావలసినవి: నూనె - 2 టేబుల్ స్పూన్లు; తెల్ల వంకాయలు - అర కేజీ; సెనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు, జీలకర్ర - టీ స్పూను చొప్పున; ఎండు మిర్చి - 5; కరివేపాకు - 2 రెమ్మలు; పచ్చి మిర్చి + అల్లం ముద్ద - 3 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; పసుపు - చిటికెడు; పాలు - 3 టేబుల్ స్పూన్లు తయారీ: వంకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు కట్ చేయాలి బాణలిలో నూనె కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాలి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరసగా వేసి వేయించాలి వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి కొద్దిగా ఉడుకు పట్టాక పాలు పోయాలి కూర బాగా ఉడికిన తర్వాత అల్లం + పచ్చి మిర్చి ముద్ద వేసి కలపాలి. క్యారట్ కేక్ కావలసినవి: కోడిగుడ్లు - 4; వెజిటబుల్ ఆయిల్ - ఒకటిన్నర కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ - 2 టీ స్పూన్లు; మైదా - 2 కప్పులు; బేకింగ్ సోడా - 2 టీ స్పూన్లు; బేకింగ్ పౌడర్ - 2 టీ స్పూన్లు; ఉప్పు - అర టీ స్పూను; దాల్చినచెక్క పొడి - 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము - 3 కప్పులు; వాల్నట్ తురుము - కప్పు; నూనె - అర కప్పు; క్రీమ్ చీజ్ - అర కప్పు; కన్ఫెక్షనరీ సుగర్ - 4 కప్పులు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ - టీ స్పూను; వాల్నట్ తురుము - కప్పు తయారీ: అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి పెద్ద పాత్రలో కోడిగుడ్లు (తెల్ల సొన మాత్రమే), నూనె, బెల్లం తురుము, 2 టీ స్పూన్ల వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసి గిలకొట్టాక, మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి క్యారట్ తురుము, వాల్నట్ పొడి జత చేసి మరోమారు కలిపి నూనె రాసి ఉంచుకున్న బేకింగ్ పాన్‌లో ఈ మిశ్రమాన్ని వేసి అవెన్‌లో సుమారు 50 నిమిషాలు బేక్ చేసి బయటకు తీసి పది నిమిషాలు చల్లారనివ్వాలి ఒక పాత్రలో నూనె, బెల్లం తురుము, టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసి నురుగులా వచ్చేలా గిలక్కొట్టాలి వాల్నట్ తురుము జత చేసి డీప్ ఫ్రిజ్‌లో ఉంచి తీసేసి, క్యారట్ కేక్ మీద వేసి చల్లగా అందించాలి. బీరకాయ - సెనగపప్పు కూర కావలసినవి: బీరకాయలు - అర కేజీ; నూనె - 3 టేబుల్ స్పూన్లు; సెనగపప్పు - అర కప్పు; ఎండు మిర్చి - 8; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; వెల్లుల్లి రేకలు - 4; ఉప్పు, పసుపు - తగినంత తయారీ: బీరకాయలను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి, ముక్కలు కట్ చేయాలి సెనగపప్పును గంట సేపు నానబెట్టాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి, ఎండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి కరివేపాకు వేసి వేగాక, బీరకాయ ముక్కలు, సెనగపప్పు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత ఉంచాలి మెత్తగా ఉడికాక దించేయాలి. దోసకాయ-మెత్తళ్ల కూర కావలసినవి దోసకాయ ముక్కలు - కప్పు; కడిగి శుభ్రం చేసిన పచ్చి మెత్తళ్లు - 3 కప్పులు (ఇష్టాన్ని అనుసరించి కొలతలు మార్చుకోవచ్చు); కరివేపాకు - 2 రెమ్మలు; ఉల్లి తరుగు - కప్పు; పచ్చి మిర్చి - 6; ధనియాల పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత; కారం - రెండు టీ స్పూన్లు; నూనె - తగినంత; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను తయారీ: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి పసుపు, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు, కడిగి శుభ్రం చేసుకున్న మెత్తళ్లు వేసి బాగా కలిపి ఉప్పు, కారం వేసి, తగినన్ని నీళ్లు పోసి మూత ఉంచాలి బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. -
అమెరికాలో అక్కినేని స్టాంప్
అమెరికా: స్వర్గీయ ప్రముఖ తెలుగు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్ఆర్)కు అమెరికాలో అరుదైన ఘనత దక్కింది. అమెరికాలో అక్కినేని పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయడానికి యునైటెడ్ స్టేటెడ్ పోస్టల్ సర్వీస్ (యూఎస్పీఎస్) ఆమోద ముద్ర వేసినట్లు అమెరికాలోని అక్కినేని ఫౌండేషన్ తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్పీఎస్ ధృవీకరించినట్లు ఎఎఫ్ఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర తెలిపారు. ఒక భారతీయ నటుడికి అమెరికాలో ఈ తరహా ఘనత దక్కడం ఇదే ప్రథమమని అన్నారు. దీనికి సంబంధించి యూఎస్పీఎస్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే అక్కినేని పోస్టల్ స్టాంప్ అమెరికాలో విడుదల చేయనుండటంతో చాలా గర్వంగా ఉందన్నారు. ఇందుకు గాను అక్కినేని జయంతి రోజు (సెప్టెంబర్ 20)న డల్లాస్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తోటకూర ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందుకు గాను అక్కినేని సుదీర్ఘ సినీ ప్రయాణానికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను ఆ సంస్థకు అందజేశామన్నారు. -
దేవదాసు అయ్యేదెవరు?
-
అక్కినేని- నాటా- వంశీ అవార్డ్స్ ఏర్పాటు
సాక్షి,సిటీబ్యూరో: పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేర అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ వంశీ ఇంటర్నేషనల్, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి సహకారంతో ‘అక్కినేని- నాటా- వంశీ అవార్డ్స్‌ను ఏర్పాటు చేసినట్లు వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు శనివారం తెలిపారు. డల్లాస్‌లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా అవార్డులను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున తన నివాసంలో సంబంధిత బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ అవార్డ్స్‌ను జూలై 4,5,6 తేదీల్లో అమెరికాలోని అట్లాంటాలో జరిగే రెండవ నాటా మహాసభలో ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాదేవి, శైలజా తదితరులు పాల్గొన్నారు. అక్కినేని- నాటా- వంశీ -2014 అవార్డ్స్ గ్రహీతలు వీరే.. అమెరికాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న డాక్టర్ ప్రేమ్‌రెడ్డి(లాస్ఏంజిల్స్), డాక్టర్ మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి( డెన్వర్), డాక్టర్ పి.మల్లారెడ్డి(న్యూజెర్సీ), గుమ్మడి ధర్మారెడ్డి (లాస్ఏంజిల్స్), ఏవీఎన్ రెడ్డి(హ్యూస్టన్), డాక్టర్ పొలిచెర్ల హర్నాథ్(డెట్రాయిట్), ఇందుర్తి బాలరెడ్డి(అట్లాంటా), డోక్క ఫణి( అట్లాంటా), ఆకునూరి శారదా (హూస్టన్), గుడ్ల మాధురి (ఫారిడా). -
ఆ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యా: కమల్
అక్కినేని కుటుంబంలో ఉన్న నటులంతా కలిసి చేసిన 'మనం' సినిమా.. తనను తీవ్ర భావోద్వేగానికి గురిచేసిందని ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ అన్నారు. ఒక ప్రైవేటు స్క్రీనింగ్‌లో ఆయన ఈ సినిమా చూశారు. ఈ సినిమా దివంగత అక్కినేని నాగేశ్వరరావుకు మంచి నివాళి అవుతుందని చెబుతూ, సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు అభిమానినని, ఈ సినిమా మళ్లీ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసిందని కమల్ తెలిపారు. వెండితెరమీద ఏఎన్నార్‌ను చూడగానే ఒక్కసారిగా ఉద్వేగం ఆపుకోలేకపోయినట్లు చెప్పారు. ఆయనకు ఈ రకంగా నివాళులు అర్పించిన అక్కినేని కుటుంబానికి హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపారు. -
ఆ అనుబంధం గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది
‘‘ఇది చాలా గొప్ప సినిమా. చూస్తున్నంతసేపూ ఏయన్నార్‌గారితో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది’’ అని బుధవారం ఓ ప్రకటనలో కమల్‌హాసన్ పేర్కొన్నారు. ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య నటించిన ‘మనం’ చిత్రాన్ని కమల్‌హాసన్ ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘నేను శివాజీ గణేశన్‌గారి అభిమానిని. ఏయన్నార్ అంటే కూడా విపరీతమైన ఇష్టం. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన మీద ఉన్న అభిమానం రెట్టింపు అయ్యింది. ఈ సినిమాలో వినోద ప్రధానంగా సాగే సన్నివేశాలకు అందరూ నవ్వుతుంటే, ఏయన్నార్‌గారితో నాకున్న అనుబంధం గుర్తొచ్చి ఏడుపొచ్చింది. ఆయన భౌతికంగా మాత్రమే దూరమయ్యారు. నాగార్జున, నాగచైతన్య... ఇలా వారి కుటుంబ సభ్యుల గుండెల్లో జీవించి ఉన్నట్లుగా, నా తలపులలోనూ ఆయన జీవించే ఉన్నారు. ‘మనం’లాంటి గొప్ప సినిమా తీసినందుకు ఏయన్నార్ అభిమానిగా ఆయన కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు’’ అన్నారు. -
‘మనం’లో అతిథిగా అమితాబ్
ఇది స్పెషల్ న్యూస్... తెలుగు తెరకు సమ్‌థింగ్ స్పెషల్ న్యూస్. ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటించారు. అది కూడా ‘మనం’ సినిమా కావడం విశేషం. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరాఖరి సినిమా ఇది. ఏయన్నార్ తన తనయుడు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన ఏకైక చిత్రం ‘మనం’పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. దానికి తోడు అమితాబ్ కూడా అతిథి పాత్ర చేశారన్న వార్త తెలియడంతో ఆ అంచనాలు రెట్టింపు అవుతాయన్నది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ‘మనం’లో అమితాబ్ నటించిన విషయాన్ని యూనిట్ వర్గాలు రహస్యంగా ఉంచాయి కానీ, అమితాబ్ తన బ్లాగ్ ద్వారా అధికారికంగా ప్రకటించేశారు. ‘‘లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుగారి తనయుడు, నా ఆప్తమిత్రుడు నాగార్జున తన తండ్రితో కలిసి నటించిన సినిమాలో నేను అతిథి పాత్ర చేశాను’’ అని అమితాబ్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. అమితాబ్‌తో నాగార్జునకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి ఆ మధ్య ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఇటీవలకాలంలో అమితాబ్ తన సినిమాల ప్రమోషన్ నిమిత్తం తరచుగా హైదరాబాద్ వస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాను నటించిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ ప్రచారం నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు సినిమాలపై తనకున్న మక్కువను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘తెలుగు సినిమాలు చాలా బాగుంటాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ఓ తెలుగు సినిమాలో నటిస్తా’’ అని చెప్పారు. ఎట్టకేలకు అమితాబ్ కోరిక ‘మనం’తో నెరవేరింది. ముంబయ్‌లోని ఫిల్మిస్తాన్ స్టూడియోలో ఆయన వెర్షన్‌ని చిత్రీకరించారు. -
వంద పడితే లక్ష వచ్చినట్టే!
జ్ఞాపకం నువ్వు నాగేశ్వరరావు ఫేవరెట్టువా, ఎన్టీ రామారావు ఫేవరెట్టువా? కొత్తగా ఆ వూరికి బదిలీ అయి వచ్చిన ఉద్యోగుల పిల్లలు కావచ్చు; సమీప గ్రామాల్లో హైస్కూలు చదువు పూర్తి చేసుకొని కాలేజీలో చేరిన వారు కావచ్చు.. తొలి పరిచయం కాగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇదే. ‘‘నాకు ఇంట్రెస్ట్ లేదండీ..’’ అంటేనో, ‘‘నాకు ఇద్దరూ సమానమే’’ అంటేనో వాడు కచ్చితంగా అబద్ధమాడుతున్నాడనో, ఏమన్నా గొడవవుతుందని లౌక్యంగా తప్పించుకుంటున్నాడనో భావించే రోజులు. ఇవాళ్టికి 30 సంవత్సరాల క్రితం వరకూ పాతికేళ్ల పాటు తెలుగునాట విద్యార్థి లోకం పరిస్థితి ఇదీ.. కాస్త చదువుకున్న కుర్రాళ్లు నాగేశ్రావు, రామారావు అని; అసలు చదువుకోనివాళ్లు నాగ్గాడు, ఎన్టీవోడు అనీ; కాలేజీ చదువుకొచ్చాకా ఏయన్నార్, ఎన్టీఆర్ అనీ మాట్లాడేవారు వాళ్ల వాళ్ల అభిమానులు. సినిమాహాల్లో తెరమీద టైటిల్స్‌లో వాళ్ల పేరు పడిన దగ్గరా, పాటలొచ్చినప్పుడూ, ఫైటింగ్ చేస్తున్నప్పుడూ గొంతు చించుకుని జేజేలు, ఈలలు, చప్పట్లు, అరుపులు.. మాటలు, పాటలు కూడా వినపడనంతగా..! ఇద్దరు మిత్రులు.. నాగేశ్వర్రావు డబల్ ఫోజు. రాముడు భీముడు... ఎన్టీ రామారావు డబల్ ఫోజు. (రెండేళ్లు ఆలస్యం) బుద్ధిమంతుడు.. నాగేశ్వరరావు డబల్ ఫోజు. భలే తమ్ముడు.. ఎన్టీ రామారావు డబల్ ఫోజు (కొద్ది రోజుల తేడా). గోవుల గోపన్న.. నాగేశ్వరరావు డబల్ ఫోజు. తిక్క శంకరయ్య.. ఎన్టీ రామారావు డబల్ ఫోజు (రోజులే తేడా). సోలో చిత్రాలు సరే సరి.. ఇలా ద్విపాత్రాభినయ చిత్రాలు కూడా ఆయా నిర్మాతలు పోటీ పడి నిర్మించారు. ఏ సినిమా ఎక్కువ రోజులాడిందీ.. అనే దానిపై ఆ హీరో, హీరోయిన్లు, నిర్మాత, దర్శకుల కంటే ఎక్కువ ఆసక్తి... ఒరే.. ఎన్టీ రామారావు ఫేవరెట్లు నలుగురు చావదొబ్బుతున్నార్రా... నువ్వు అర్జంటుగా రారా బాబు అంటే వెళ్లాను. మనోడు...‘ఏమంటి రేమంటిరీ.. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే.. కాకూడదు.. (దాన వీరశూరకర్ణ) ఆ డైలాగు చెప్పమను మీ వాణ్ణి.. ఎన్టీఆర్ అభిమాని సవాల్. అంత పెద్ద పాఠం దేనికి....‘ల్లతా....’ (ప్రేమనగర్) అనమను.. అని నేను ఏఎన్నార్ తరపున ప్రతి సవాల్. వీరిద్దరి కొత్త సినిమా కాపీ విడుదల... ‘ఈ దిగువ కేంద్రాలలో..’ అన్న పేజీని దాచిపెట్టి ఏదైనా కొత్త సినిమా వచ్చే ముందు రోజు థియేటర్ల లిస్టు పేపర్లో చూసుకుంటూ, ఏ వూళ్లో మావోడి సినిమా ఎన్ని రోజులాడిందో లెక్కలేసే వాళ్లం. ‘వంద’ పడ్డం కోసం కళ్లు కాయలు కాసేలా చూసేవాళ్లం. ‘వంద’ పడిందంటే చాలు మాకు లాటరీలో లక్ష వచ్చినట్టో, ఫస్ట్‌క్లాస్‌లో పరీక్ష పాసయినట్టో కాలరెగరేసే వాళ్లం. కాలేజీ బయట కేంటీన్లలో సిగరెట్లు లాగించేస్తూ వాదులాడుకుంటుంటే మూడు పదులు దాటిన పెద్ద వాళ్లు ‘సుభాషితాలు’ చెప్పేవారు. మాక్కూడా ‘ముప్పై’లు దాటాక జ్ఞానోదయమయింది. ఇద్దరూ సినిమా పరిశ్రమకు రెండు కళ్లు అనీ, పోటీకి పర్యాయ పదాలనీ, వారికి వారే సాటి అనీ తెలిసొచ్చింది. ఇంత పోటాపోటీ వీరిద్దరి అభిమానులకే పరిమితం. ముందు తరంలోని నాగయ్య, సీహెచ్ నారాయణరావుల విషయంలో లేదని చెప్పేవారు. తర్వాత కృష్ణ, శోభన్‌బాబుల విషయంలో కూడా ఇంతగా లేదు. - లక్ష్మణ్ ఆపరేషన్ సక్సెస్ - ఇంద్రుడు ‘సేఫ్’ 1974లో ఏయన్నార్‌కి అమెరికాలో గుండె ఆపరేషన్ అని తెలిసింది. అభిమానుల్లో కంగారు. ఇష్టదైవాలకు మొక్కుకున్నాం. మొత్తానికి ఆయన క్షేమంగా తిరిగొచ్చారు. ఒకవేళ నాగేశ్వర్రావు మరణిస్తే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి దేవలోక సుందరీ మణులు తనను వదిలేసి నాగేశ్వర్రావు వెంట పడతారనీ, తన పదవికే మప్పు వస్తుందని భయపడి దేవేంద్రుడు బ్రహ్మ దేవుడితో ఏయన్నార్‌ని గండం గట్టెక్కించమని ప్రార్థించాడనీ, పూర్ణాయువు ప్రసాదించమని వేడుకున్నాడనీ, అందుకే ఆయన క్షేమంగా సంపూర్ణారోగ్యవంతుడై వచ్చాడనీ ఓ కథ అల్లుకుని మురిసిపోయాం. ఇద్దరిలో ఎవరు లేకపోయినా నటనలో ఇక పోటీ అన్నమాటకే అర్థం ఉండదంటూ ఎన్టీఆర్ అభిమానులు కూడా మాతో తొలిసారి ఏకీభవించారు. -
మన ఇద్దరు!
మహానటులు ఎమ్జీయార్, కరుణానిధిల ప్రగాఢ స్నేహం గురించి, దరిమిలా ఏర్పడిన రాజకీయ వైషమ్యం గురించి మణిరత్నం ‘ఇరువర్’ (ఇద్దరు) తీశారు. తెలుగునాట అలాంటి జంట ఒకదాన్ని తీసుకుని రసవత్తరమైన కథగా, సినిమాగా మలచాలంటే ఏయన్నార్ - ఎన్టీయార్ల పేర్లే తడతాయి. తమిళ జంట వంటి కథ కాదిది. దీనిలో స్నేహం ఉంది, స్పర్థ ఉంది, పోటాపోటీ గ్రూపులు నడిపే సామర్థ్యం ఉంది, మళ్లీ ఇద్దరూ కలిసి కొత్త తరాన్ని అదుపు చేసే ప్రయత్నమూ ఉంది, వేడి చల్లారాక చేతులు కలిపి మళ్లీ నటించడమూ ఉంది. కొన్ని విషయాల్లో పోలిక ఉంది, మరికొన్ని విషయాల్లో వైరుధ్యమూ ఉంది. వినడానికి ఇప్పుడు అతిశయోక్తిగా అనిపిస్తుందేమో కానీ, ఒకప్పుడు ఏఎన్నార్, ఎన్టీయార్ పోలికలున్న రికార్డింగ్ డ్యాన్సు ఆర్టిస్టులు బజార్లోకి వచ్చినా జనం గుమిగూడి ఆరాధనగా చూసేవారు. పెళ్లిచూపుల్లో సైతం అవతలివారు ‘నాగ్గాడి’ ఫ్యానో, ‘ఎమ్టీవోడి’ ఫ్యానో తేల్చుకున్నాకే సంభాషణ ముందుకు సాగేది. ఏయన్నార్, ఎన్టీయార్ తెలుగు సినిమా రంగపు తొలి దశలోనే హీరోలయ్యారు. 1950ల నుండి 80ల వరకు మూడు దశాబ్దాలు ఏలారు. 1940-49 మధ్య ఏడాదికి సరాసరి 8 సినిమాలు వస్తే, 1950లో 16 వచ్చాయి. 1950-59 మధ్య ఏడాదికి సగటున 23 వచ్చాయి. ఆ దశకంలోనే స్వాతంత్య్రానంతర భారతదేశం రెక్కలు విప్పుకోసాగింది. విద్యుత్ సౌకర్యం గ్రామాలకు విస్తరించి, థియేటర్లు రాసాగాయి. 1980 వచ్చేసరికి ఏడాదికి 118 సినిమాలు వచ్చాయి. అంటే వారానికి రెండు కంటే ఎక్కువ సినిమాలన్నమాట. ఏయన్నార్, ఎన్టీయార్ కెరియర్లు ఈ బూమ్ పీరియడ్‌తో పెనవేసుకున్నాయి. వాళ్లకు ముందున్న హీరోలు నారాయణరావు, నాగయ్య, రాఘురామయ్య వంటివారు. వాళ్లకున్న స్టార్ స్టేటస్‌ను మించి వీళ్లకు వచ్చింది. 1950ల తర్వాత పౌరాణిక, జానపద సినిమాలు తగ్గి సాంఘిక సినిమాలు రాసాగాయి. ప్రజలు తమ సమస్యలను వాటిలో చూసుకుని హీరోలతో మమేకమవసాగారు. వీళ్లల్లో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా, ఇంకోరితో పోలిక ఆటోమ్యాటిక్‌గా వచ్చేసేది. ‘‘రహస్యం’లో ఎన్టీయార్ వేసి ఉంటే హిట్టయ్యేది’... వంటివి నటన గురించైతే, ‘నాగేశ్వరరావు లౌక్యుడు, ఎన్టీయార్లా బోళా మనిషి కాడు’ అనే వ్యాఖ్యలు స్వభావం గురించి! నాగేశ్వరరావు అంటే చటుక్కున గుర్తుకువచ్చేది భగ్న ప్రేమికుడు. ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేసి ఆమె జీవితంలోంచి తొలగిపోయే మంచివాడు. అందుకే ఆయన ఆ ఇమేజీలో మిడిల్ క్లాస్ ప్రేక్షకుల హృదయంలో నిలిచిపోయాడు. ముఖ్యంగా స్త్రీలు ఈ పాత్రను ఆరాధించి, ఈ అపర దేవదాసును వాళ్ల మనసులో ప్రతిష్టాపించుకున్నారు. ఎన్టీ రామారావు కూడా విషాద నాయక పాత్రలు వేసినా నాగేశ్వరరావంత కన్విన్సింగ్‌గా వేయలేదు. ఉత్తరాదిన దిలీప్‌కుమార్, దక్షిణాదిన నాగేశ్వరరావు. మన మజ్నూ ఆయనే. సలీమూ ఆయనే. దాంతో ఆ ముద్ర ఎంత గాఢంగా పడిపోయిందంటే ఎన్టీయార్‌లో ఉన్న నట వైవిధ్యం ఏయన్నార్లో లేదని అనాలోచితంగా అనేసేటంతగా! కానీ ఆలోచిస్తే తొలి జానపదాల్లో అక్కినేనే హీరో! బాలరాజు, కీలుగుఱ్ఱం, మాయలమారి, స్వప్నసుందరి, సువర్ణసుందరి, స్త్రీ సాహసం, రత్నమాల, ముగ్గురు మరాఠీలు... సాంఘికాల్లో బాగా పాతుకున్నాక కూడా రహస్యం, వసంతసేనలలో వేశారు. చరిత్రాత్మక పాత్రల గురించి చెప్పుకుంటే, పల్నాటి యుద్ధం, అమర శిల్పి జక్కన, చాణక్య చంద్రగుప్త, రామదాసు... పౌరాణిక పాత్రలంటే - చెంచులక్ష్మి, మాయాబజారు, కృష్ణార్జున యుద్ధం. నవలా నాయకుడూ ఆయనే - చక్ర భ్రమణం, సెక్రటరీ, విజేత, ప్రేమనగర్... శరత్ పాత్రలు అత్యధికంగా ధరించిన తెలుగు నటుడూ ఆయనే - దేవదాసు, తోడికోడళ్లు, బాటసారి! భక్తుడి పాత్రల్లో అయితే నాగేశ్వరరావు తర్వాతే ఎవరైనా. విప్రనారాయణ, భక్త తుకారాం, కుంభార్, బుద్ధిమంతుడు... ఇలా. త్యాగమూర్తి పాత్రల్లో అక్కినేనికి పేరు వచ్చినా కామెడీ అదరగొట్టేశాడు. మిస్సమ్మ, పెళ్లిసందడి, బుద్ధిమంతుడు, చక్రపాణి, పెళ్లినాటి ప్రమాణాలు, గుండమ్మకథ, ప్రేమించి చూడు, గృహలక్ష్మి, బ్రహ్మచారి, అందాలరాముడు... ఇలా అనేకం గుర్తుకువస్తాయి. కొంటెతనం, చిలిపితనం ఆయనలో భలే పలుకుతుంది. నాగేశ్వరరావు గురించి ఏం తెలిసినా తెలియకపోయినా ఓ విషయం మాత్రం అందరికీ తెలుసు. ఆయన డబ్బున్నవాడు కాడు, చదువుకున్నవాడు కాడు, పల్లెటూరివాడు. అలాంటివాడు ఇంత పైకి ఎలా వచ్చాడు? ఎవరైనా పైకి రావాలంటే తనను తాను సమీక్షించుకోవాలి. నాగేశ్వరరావు ఆ పనిని నిరంతరం చేసుకున్నారు. కెరియర్ పట్ల ప్లానింగ్, పాత్ర పోషణలో సంయమనం ఆయనలో అడుగడుగునా కనబడతాయి. సీనియర్ల వద్ద నేర్చుకుంటూనే, తనకు ప్రత్యర్థిగా ఎదిగిన ఎన్టీయార్‌తో ఎలా తలపడాలి, తలపడి ఎలా నిలదొక్కుకోవాలి అన్నది బాగా అధ్యయనం చేసి, అమలు చేశారు. సినీరంగ ప్రవేశం చేసే నాటికి ఎన్టీయార్‌కు 26 యేళ్లు. ఏయన్నార్ కంటే ఏడాదిన్నర పెద్దయినా (1944 సీతారామ జననం నుండి లెక్కవేస్తే) ఐదేళ్లు వెనుకగా సినీరంగంలో ప్రవేశించారు. అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన నాగేశ్వరరావుని ఉలిక్కిపడేలా చేసిన రామారావు అర్హతలేమిటి? మంచి రూపం, మంచి శరీర సౌష్టవం, మంచి వాచికం, మంచి చదువు... అన్నీ మంచిలే! ఎన్నో లోపాలు అధిగమిస్తూ నాగేశ్వరరావు తన ప్రస్థానం సాగించారు. రామారావుకి ఆ బాధలు లేవు. హీ వాజ్ ఏ బోర్న్ హీరో! వస్తూవస్తూనే ఆయన హీరో అయిపోయారు. ఎన్టీయార్‌ని కలవడానికి వస్తూండగా దూరం నుండి చూసి బీఏ సుబ్బారావు, ‘‘ఇతను నా సినిమా హీరో అయితే ఎంత బాగుణ్ను’’ అనుకున్నారు. ఈయన దగ్గరకు వచ్చిన ఎన్టీయార్, ‘నేను ఫలానా’ అనగానే ‘అయితే నువ్వే నా హీరోవి’ అన్నారు. మేకప్ టెస్ట్ లేదు, వాయిస్ టెస్ట్ లేదు, వెయ్యి నూట పదహార్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసేసుకున్నారు. పాత్రలో జీవించడం అనే పదబంధం ఎన్టీయార్ విషయంలో అతికినట్టుగా మరెవరి విషయంలోనూ నప్పదు. ఏయన్నార్ ఎప్పుడూ అంటారు - ‘మనం పాత్రలో పూర్తిగా లీనం కాకూడదు. లీనమైనట్టు - నటించాలంతే! లేకపోతే తూకం తప్పుతాం. మనం వేరేగా ఉండి మన పాత్ర గమనాన్ని గమనించాలి’ అని. కానీ ఎన్టీయార్ పద్ధతి అది కాదు. ‘పల్లెటూరి పిల్ల’లో కోడెదూడతో పోట్లాడే దృశ్యంలో ఒడుపు తెలియక కుడిచేతి మణికట్టు విరగకొట్టుకున్నారు. ఈ లక్షణమే ఏయన్నార్‌ను, ఎన్టీయార్‌ను విడదీసి చూపుతుంది. ఎన్టీయార్ పౌరాణిక పాత్రల్లో చూపిన సంయమనం మామూలప్పుడు చూపలేదు. హీ వాజ్ ఆల్వేస్ ప్లేయింగ్ టూ ది గ్యాలరీ. ఇలాంటి వాళ్లని స్వాష్‌బక్లింగ్ హీరోస్ అంటారు. హీరోయిన్ను గాఢంగా హత్తుకోవడం, కత్తిని ముద్దు పెట్టుకోవడం, మారువేషం వేస్తూ వేస్తూ మధ్యలో మీసం పీకి ‘నేనేరా’ అన్నట్టు ప్రేక్షకులకేసి చూసి కన్నుకొట్టడం, విలన్‌ను చావగొట్టి చెవులు మూసి హాల్లో ఈలలు వేయించడం - ఇవన్నీ ఇలాంటి హీరోల లక్షణాలు. ఇవి చూస్తూ ప్రేక్షకుడు మైమరచిపోతాడు. వీటిలో హీరో మొరటుగా ఉంటాడు. హావభావాలు ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తాడు. చదువురానివాడికి కూడా అర్థమయ్యే రీతిలో హిస్ట్రియానిక్స్ ప్రదర్శిస్తాడు. అందువల్ల మధ్యతరగతివాళ్లు ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఇలాంటి హీరోను ఆమోదించరు. నేల తరగతి వనితలు మాత్రం ఆరాధిస్తారు. ఎందుకంటే ఇతను ఎప్పుడూ మంచివాడిగానే ఉంటాడు. మోటు సరసాలాడతాడు. త్యాగాలు చేసి పారిపోకుండా కోరినదాన్ని పోరాడి దక్కించుకుంటాడు. తమిళంలో ఎమ్జీయార్ ఇటువంటి పాత్రలే వేశారు. ఆయనను గొప్ప నటుడిగా విమర్శకులు అంగీకరించకపోవచ్చు. కానీ పాటకజనం అతన్ని నెత్తిమీద పెట్టుకున్నారు. ‘బాలరాజు’తో స్టార్డమ్ వచ్చి కీలుగుర్రం, రక్ష రేఖ, శ్రీలక్ష్మమ్మ కథ, స్వప్నసుందరిలతో స్థిరపడినా, జానపదాలనే నమ్ముకోకుండా సాంఘికాల్లో కూడా వేస్తేనే భవిష్యత్తు ఉంటుందని నాగేశ్వరరావు ముందుగానే గ్రహించారు. అదీ ఆయన ఘనత. అప్పటికే ఎన్టీయార్ రంగప్రవేశం చేశారు. ఆయన విగ్రహం, వాచికం చూడబోతే అలాంటి పాత్రలకు సరిగ్గా సూటవుతాడనిపిస్తోంది. తను దేనికి బాగా సూటవుతాడా అని ఆలోచిస్తే సాంఘికాల దారి పట్టడమే మంచిదనిపించి ఉంటుంది. సాంఘికాలకు పనికిరాడు అన్న టాక్ వచ్చినా ఆ పాత్రలకు తగ్గట్టుగా మేకప్, దుస్తులు వేయించుకుని స్టిల్స్ తీయించుకుని నిర్మాతలకు చూపారు. సగం పారితోషికానికే ‘సంసారం’లో వేశారు. ఆ సినిమా హిట్ అయింది. ‘దేవదాసు’ తర్వాత సాంఘికాలంటే ఏయన్నారే తగును అనే పేరు వచ్చేసింది. రామారావును పౌరాణికాలు, జానపదాల్లో బాగా గుర్తుపెట్టుకున్నా ఆయన వేసిన వాటిల్లో సాంఘికాలే ఎక్కువ. వాటిలో పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ, వద్దంటే డబ్బు, తిక్క శంకరయ్య వంటి కామెడీలు, చిరంజీవులు, ఇంటికి దీపం ఇల్లాలే, రక్తసంబంధం, ఆత్మబంధువు వంటి ట్రాజెడీలు ఉన్నాయి. ఎన్టీయార్‌ని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేనట్టు చేసినవి పౌరాణికాలే! ఆయన పౌరాణిక పాత్రల నిర్వహణ గురించి ‘న భూతో... ఇప్పట్లో న భవిష్యతి’ అని చెప్పగలం. నాగేశ్వరరావు వేసిన పాత్రలు ఆ తరువాత శోభన్‌బాబు వేశారు, తర్వాత నాగార్జున వేశారు, జగపతిబాబు వేశారు. ఏదో ఒక స్థాయిలో, ఎంతో కొంత దూరంలో ఆయన స్థానానికి చేరువగా వచ్చారు. కానీ ఎన్టీయార్ పౌరాణిక పాత్రల దగ్గరికి వచ్చేసరికి ఆయనలా ఒప్పించినవారు అరుదు. అరుదు అని ఎందుకనాలంటే కాంతారావూ కృష్ణుడు వేషం వేశారు, హరనాథూ వేశారు. బాగానే చేశారు. ‘సంపూర్ణ రామాయణం’లో శోభన్‌బాబూ వేసి నప్పించారు. రావణుడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా ఎస్వీ రంగారావు గొప్పగా రాణించారు. అయితే ఎన్టీ రామారావు ఒక్కరే అన్ని రకాల పౌరాణిక పాత్రల్లోనూ నప్పారు. అది తెలిసిన ఏయన్నార్ పౌరాణికాల్లో భారీ పర్సనాలిటీ అవసరం లేని, గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పనక్కరలేని పాత్రలే ఎంచుకున్నారు. దుర్యోధనుడు లాంటివి వేసి హైరాన పడలేదు, పెట్టలేదు. ‘మాయాబజారు’లో అభిమన్యుడిది ఆహార్యం మార్పు తప్ప సాంఘిక సినిమాల్లో రొమాంటిక్ టైపు రోలే! కొంటెగా మాట్లాడే ‘భూకైలాస్’లో నారదుడి పాత్ర, రసికత్వమే ప్రధానంగా - చెంచులక్ష్మి, కృష్ణ మాయ, శ్రీకృష్ణార్జున యుద్ధం... ఇలాంటివే వేశారు. రామారావు ఎన్ని పాత్రలు వేసినా అన్నీ రాజసం ఉన్నవే. నాగేశ్వరరావు బ్రాహ్మణ పాత్రలు, కవి పాత్రలు వేసి చక్కగా ఒప్పించారు. రామారావు వేయలేదు, వేసినా నప్పేది కాదేమో! ‘శ్రీనాథుడు’ బ్రాహ్మణుడే కానీ రాజసం జాస్తి. కవి పాత్రలన్నీ ఏయన్నార్ వేసినవే - జయదేవ, కాళిదాసు, క్షేత్రయ్య, తెనాలి రామకృష్ణ. ఏయన్నార్, ఎన్టీయార్ తమకు నప్పిన పాత్రలను ఎలా ఎంచుకునేవారో ఒక్క ఉదాహరణ. ‘తెనాలి రామకృష్ణ’లో వారిద్దరూ పాత్రలు తారుమారు చేసుకుని ఉంటే సినిమా ఆడి ఉండేది కాదు. ఈ ఎరిక ఏయన్నార్‌కు బాగా ఉంది. ‘చాణక్య-చంద్రగుప్త’ తీస్తూ ఎన్టీయార్ ‘బ్రదర్! నువ్వు చంద్రగుప్తుడు, నేను చాణుక్యుడు వేద్దామా?’ అని అడిగితే నాగేశ్వరరావు - చాలా కాలిక్యులేటెడ్ కదా - ‘వద్దులే, ఇలాగే కానీ’ అన్నారట. వినోదా వారి ‘కన్యాశుల్కం’లో గిరీశం పాత్ర ఇస్తే నాగేశ్వరరావు వద్దనేశారు విలనిక్ షేడ్ ఉందని. ఎన్టీయార్ వేసేశారు. అలాగే ‘చింతామణి’లో వేశ్యకు విటుడిగా బిల్వమంగళుడి పాత్ర. ఏయన్నార్ వద్దన్నారు, ఎన్టీయార్ సరేనన్నారు. ఆయనకు అన్ని రకాల పాత్రలు వేయాలన్న తపన ఎక్కువ. ‘రాజు పేద’లో తాగుబోతు పాత్ర, ‘భీష్మ’లో ముసలి పాత్ర, ‘కలిసి వుంటే కలదు సుఖం’లో అవిటివాడి పాత్ర, ‘నర్తనశాల’లో ఆడంగి పాత్ర... నాగేశ్వరరావుకు పాత్రల ఎంపికపై కచ్చితమైన లెక్కలున్నాయి. 1971లో ‘దసరాబుల్లోడు’ రిలీజైంది. నాగేశ్వరరావు హఠాత్తుగా కుర్రవేషాలేస్తూ స్టెప్పులు మొదలెట్టారు. అది ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. ఎన్టీయార్ విషయంలో ఈ పీరియడ్ నటుడిగా ఆయన స్థాయి తగ్గించింది. 1972 నాటికి ఆయన ‘బడిపంతులు’లో అద్భుతంగా నటించారు. 49 యేళ్లకే శరీరం భారీగా పెరిగిపోయింది. నాగేశ్వరరావులా ఆయన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేదు. అప్పుడు కనుక ఆయన రిటైరై ఎప్పుడో అప్పుడొకటీ ఇప్పుడొకటీ వేస్తూ ఉంటే హుందాగా ఉండి ఉండేది. కానీ అప్పుడాయన విన్నింగ్ స్ట్రీక్‌లో ఉన్నాడు. జంజీర్, దీవార్, యాదోంకీ బారాత్ వంటి అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హిందీ సినిమాల తెలుగు వెర్షన్లలో వేయడం మొదలెట్టాడు. వల్గారిటీ చేరింది. స్టెప్స్ వేయడం మొదలైంది. నాగేశ్వరరావు వేస్తే భరించగలిగాం కానీ ఈయన వేస్తే బాబోయ్ అనిపించింది. పెద్ద పొట్ట, దాన్ని దాచుకోవడానికి కోటు, కింద బెల్‌బాటమ్ పాంట్. ఈ ధోరణిలో సాగుతూండగానే అడవిరాముడు సూపర్ డూపర్ హిట్. అక్కణ్నుంచి యమగోల, వేటగాడు, డ్రైవర్ రాముడు, ఆటగాడు, సూపర్‌మ్యాన్ - చిత్రం ఏమిటంటే, ఇవన్నీ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈయన తీసిన పౌరాణికాలన్నీ పరాజయం పాలయ్యాయి. రామారావు యువతరానికి చేరువైంది ఈ సినిమాల ద్వారానే. వాళ్లే ఆయనకు రాజకీయాల్లో ఓట్ బ్యాంక్ అయ్యారు. చివరికి వచ్చేసరికి బొబ్బిలిపులి, కొండవీటి సింహం - ఇవన్నీ అప్పటి మూడ్‌లో హిట్ కావచ్చు కానీ నటుడిగా ఆయన స్థాయిని దిగజార్చాయని వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం. ఎన్టీయార్ దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఉన్నత స్థానంలో ఉండగానే తప్పుకుని తన ఆధిక్యతను చాటుకున్నారు. ఏయన్నార్ నటజీవితం చాలా ఏళ్లు సాగింది. అయితే మూసపాత్రలు రాకుండా చూసుకున్నారు. అదీ కెరియర్ ప్లానింగంటే! గ్లామర్ తగ్గాక ఆయన అత్యున్నతమైన నటన కనబరిచినది సీతారామయ్యగారి మనవరాలు (1992)లో. 50 ఏళ్లలో, 231 సినిమాల ద్వారా నేర్చుకున్నది ‘అన్లెర్న్’ చేసుకుని ఫ్రెష్‌గా వేశారాయన. ఎన్టీయార్‌లాగే ఏయన్నార్ కూడా నిర్మాతగా మారారు, స్టూడియో కట్టారు. కానీ దర్శకుడిగా మారలేదు. ఎన్టీయార్‌కి ముందు నుండీ అభ్యుదయ భావాలున్నాయి. సాంఘిక ప్రయోజనం ఉన్న సినిమాలు తీయాలి అనుకుని, సినిమా రంగానికి వచ్చిన 3, 4 యేళ్లలోనే ‘పిచ్చిపుల్లయ్య’, ‘తోడు దొంగలు (దానిలో 60 ఏళ్ల పాత్ర) వంటి మంచి సినిమాలు తీశారు. అదే నాగేశ్వరరావైతే నిర్మాతగా తొలి చిత్రం జానపద సినిమా! రంగానికి వచ్చిన పాతికేళ్లకు ‘సుడిగుండాలు’, ‘మరోప్రపంచం’ తీశారు. ఎన్టీయార్ తీసిన తొలి రెండు సినిమాలు దెబ్బతిన్నాయి. చాలా నిరాశకు లోనై, కత్తి పడితే తప్ప తన సంస్థ నిలదొక్కుకోదని గ్రహించాడు. ‘జయసింహ’తో ఎన్ఏటీ సంస్థ నిలబడి అనేక మంచి సినిమాలు తీసింది కానీ అన్నీ కమర్షియల్సే! ఆర్ట్ సినిమాల జోలికి పోలేదు. ఎన్టీయార్, ఏయన్నార్ ఇరువురి వారసులూ సినీరంగంలో వెలుగుతున్నారు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ సంచలనం సృష్టించారు. ఏయన్నార్ సినీరంగాన్ని వదలలేదు. మద్రాసు నుండి హైదరాబాద్‌కు చిత్రపరిశ్రమను తరలించడంలో హీరోయిజం ప్రదర్శించినది నాగేశ్వరరావే. ఆ విషయంలో ఈయన క్యాంపుకు, ఎన్టీయార్ మద్రాసు క్యాంపుకు ఎలాంటి గొడవలుండేవో, మధ్యలో ఆర్టిస్టులు ఎలా నలిగేవారో గుమ్మడి ఆత్మకథ చదివితే తెలుస్తుంది. వ్యక్తిగతంగా ఈ ఇద్దరు నటులు బహిరంగంగా దూషించుకున్నది లేదు. కుటుంబాల పరంగా సత్సంబంధాలు పాటించారు. తెలుగుజాతికి సంబంధించినంతవరకూ వీరిద్దరూ మ్యాటినీ ఐడాల్స్ మాత్రమే కాదు, సోషల్స్ ఐకాన్స్ కూడా! చాలామంది నాటక కళాకారులు రంగస్థలంపైకి తాగి వచ్చి ప్రదర్శన రసాభాస చేసేవారు. జీవిత చరమాంకంలో డబ్బు లేక అల్లాడేవారు. వేదికపై వాళ్ల నటనను మెచ్చేవారు కూడా విడిగా వారితో కలవడానికి ఇచ్చగించేవారు కారు. సినిమా రంగం నాటక రంగానికి కొనసాగింపు కాబట్టి సినిమావాళ్లు కూడా ఇలాగే ఉంటారని జనం అనుకునేవారు. అందుకే దగ్గరి బంధువులు కూడా సినిమా నటులకు పిల్లనిచ్చేవారు కారు. క్రమేపీ ఈ ఇమేజీ మారడానికి కారణం ఏయన్నార్, ఎన్టీయార్లే. వాళ్లు తమ వ్యక్తిగత జీవితాలపై మచ్చ రాకుండా చూసుకోగలిగారు. ఎన్టీయార్ సినిమా రంగానికి వచ్చేటప్పటికే వివాహితుడు. వచ్చాక కూడా భార్యను విడిచి పెట్టలేదు. సాధారణ గృహస్తులాగే పిల్లల్ని కనడం, వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెళ్లిళ్లు పేరంటాలు చేయించడం అవీ జరిపారు. ఏయన్నార్‌కు సినిమాలకు వచ్చాకనే పెళ్లయింది. సినిమాల్లో గ్లామర్ బాయ్‌గా ఉన్నా, ఇంటి దగ్గర మామూలు ఇంటాయనలాగానే ఉన్నారు. పిల్లల చదువుల గురించి హైదరాబాద్‌కి తరలి రావడం, తెలిసిన కుటుంబాల నుంచి అల్లుళ్లను తెచ్చుకోవడం, మీ ఇంటి పక్క పెద్దమనిషి ఎలా చేస్తాడో అలాగే చేశారు. భార్య పేర స్టూడియో కట్టారు. ఆవిడ చివరి ఐదేళ్లూ మంచాన పడితే జాగ్రత్తగా చూసుకున్నారు. ఏఎన్నార్, ఎన్టీయార్ ఇద్దరూ సాంస్కృతిక సభలకు, కాలేజీలకు, బంధువుల ఇళ్లల్లో ఫంక్షన్లకు వచ్చినప్పుడు మామూలు తెలుగు పెద్దమనిషి తరహాలో పంచెకట్టుతోనే వచ్చారు. రంగు రంగు డ్రెస్సులన్నీ ఉద్యోగ ధర్మంగా వేసుకున్నవే తప్ప విడిగా మేము హుందాగా ఉండేవాళ్లమేనని చాటిచెప్పారు. వారికి భాషపై గల పట్టు కూడా ప్రత్యేకించి ప్రస్తావించాలి. వారి తెలుగు ఉచ్ఛారణ శుద్ధంగా ఉండటం వలన, చక్కటి పదసంపద ఉండటం వలన వారు మనల్ని ప్రభావితం చేయగలిగారు. మన పాలిట వీళ్లు గ్లామరస్ టీచర్స్. ప్రేక్షకులకే కాదు. తర్వాత సినీరంగానికి వచ్చిన నటీనటులకు కూడా. - ఎమ్బీయస్ ప్రసాద్ ఏయన్నార్, ఎన్టీయార్ తమకు నప్పిన పాత్రలను ఎలా ఎంచుకునేవారో ఒక్క ఉదాహరణ. ‘చాణక్య-చంద్రగుప్త’ తీస్తూ ఎన్టీయార్ ‘బ్రదర్! నువ్వు చంద్రగుప్తుడు, నేను చాణుక్యుడు వేద్దామా?’ అని అడిగితే నాగేశ్వరరావు - చాలా కాలిక్యులేటెడ్ కదా - ‘వద్దులే, ఇలాగే కానీ’ అన్నారట. ఎన్టీయార్ దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఉన్నత స్థానంలో ఉండగానే తప్పుకున్నారు. ఏయన్నార్ నటజీవితం చాలా ఏళ్లు సాగింది. తెలుగుజాతికి సంబంధించినంతవరకూ వీరిద్దరూ మ్యాటినీ ఐడాల్స్ మాత్రమే కాదు, సోషల్స్ ఐకాన్స్ కూడా!ఫంక్షన్లకు వచ్చినప్పుడు మామూలు తెలుగు పెద్దమనిషి తరహాలో పంచెకట్టుతోనే వచ్చారు. రంగు రంగు డ్రెస్సులన్నీ ఉద్యోగ ధర్మంగావేసుకున్నవే తప్ప విడిగా మేము హుందాగా ఉండేవాళ్లమేనని చాటిచెప్పారు. -
నాయికల నాయకుడు
మననం అక్కినేని తొలి దశలో నటించిన చిత్రాలతో ‘రొమాంటిక్ హీరో’ ఇమేజ్ ఏర్పడింది. ప్రేమ, విరహం, విషాదం... అంటే ఆయన ఓ ‘రోల్ మోడల్’ అయ్యారు. తన సినీ జీవితంలో అక్కినేని సరసన 76 మంది కథానాయికలు నటించడం ఓ రికార్డు! తొలి రోజుల్లో శాంతకుమారి, లక్ష్మీ రాజ్యం, ఎస్.వరలక్ష్మి, భానుమతి, అంజలీదేవి, సావిత్రి; ఆ తర్వాత షావుకారు జానకి, జమున, కృష్ణకుమారి, బి.సరోజాదేవి, రాజసులోచన, కాంచన, పద్మిని వంటివారు అక్కినేని సరసన నటించారు. ‘మాయలోకం’లో ఆయన కంటే వయసులో పెద్దవారైన శాంతకుమారి, ఎమ్.వి.రాజమ్మల సరసన హీరోగా నటించారు ఏఎన్నార్. శాంతకుమారితో ప్రేమ సన్నివేశాలలో నటిస్తున్నప్పుడు కంగారుపడేవారట. అప్పుడు శాంతకుమారి అలాంటి సన్నివేశాలలో ప్రేమను పండించాలంటే... డైలాగులు ఎలా చెప్పాలో, శృంగారాన్ని ఎలా అభినయించాలో చెప్పి ఉన్న భయాన్ని పోగొట్టారు. భరణీ వారి తొలి చిత్రం ‘రత్నమాల’లో భానుమతి సరసన మొదటిసారిగా నటించారు అక్కినేని. ఆ చిత్రానికి దర్శకుడు భానుమతి భర్త రామకృష్ణ. భానుమతితో అక్కినేనికి చనువు ఏర్పడాలని - వాళ్లిద్దర్నీ కలిసి పరుగెత్తమని చెప్పి 16 మి.మీ. కెమెరాతో ఆ దృశ్యాలను తీసి చూపించేవారు. భానుమతిని ‘మేడమ్’ అని, రామకృష్ణను ‘గురువుగారూ’ అని పిలిచేవారు అక్కినేని. ‘చింతామణి’ తీయాలని సంకల్పించి, బిల్వమంగళుడి పాత్రను ధరించమని వాళ్లు కోరినప్పుడు అక్కినేని తిరస్కరించారు. ‘‘నేను చేయకపోవడం అలా ఉంచండి. చింతామణి మేడమ్‌గారు వేయదగ్గ పాత్ర కాదు. ఆ సినిమాను ‘డ్రాప్’ చేసుకోండి’’ అని కూడా సూచించారు సంస్థ పట్ల అభమానం కొద్దీ! ఆ తర్వాత భరణీ అధినేతలు ఎన్టీయార్‌తో ‘చింతామణి’ తీశారు. ఆ చిత్రం అపజయాన్ని చవిచూసింది. అక్కినేని హీరోయిన్లలో ప్రధానమైన నటీమణి అంజలీదేవి. ఒక బిడ్డ తల్లిగా చిత్రరంగ ప్రవేశం చేసి, ‘గొల్లభామ (1947)’ తో గ్లామర్ నటిగా సంచలనాన్ని సృష్టించారు. అంతవరకూ ‘వ్యాంప్’ పాత్రలు ధరించి, ‘శ్రీలక్ష్మమ్మ కథ’లో అక్కినేని సరసన సాధ్వి పాత్రలో మెప్పించారు. ఈ జంట ఆ రోజుల్లోనే ‘పరదేశి’లో వయసు మళ్లిన దంపతుల పాత్రల్లో కనిపించడం విశేషం. ‘ఇలవేలుపు’ చిత్రంలో మొదట ప్రేమికులై, ఆ తర్వాత నాయిక (అంజలీదేవి)ను, హీరో తల్లిగా చూడవలసి రావడం అప్పట్లో ‘యాంటీ సెంటిమెంట్’ అన్నారు. కానీ అక్కినేని, అంజలీదేవి ఆ చిత్రంలో అద్భుతంగా రాణించారు. అక్కినేని నట జీవితంలో మరో ప్రధానమైన నటీమణి సావిత్రి. ‘మూగమనసులు’లోని ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ పాటను గోదావరి నదిపై పడవలో చిత్రీకరిస్తున్నప్పుడు, సావిత్రి పట్టుతప్పి నదిలో పడిపోయారు. పడవను పట్టుకుని వేలాడుతున్న ఆమెను సమయస్ఫూర్తితో అక్కినేని చేయి పట్టుకుని పైకి లాగుతూ ఉంటే, ఈతగాళ్లు వచ్చి ఆ ఇద్దరినీ కాపాడటం జరిగింది. సావిత్రి ఎంతోమందికి చెప్పారు ఏయన్నార్ రక్షించిన సంగతి! ‘సావిత్రి మనిషిగా గొప్పదా? నటిగా గొప్పదా? అనేది తేల్చుకోవడం కష్టం’ అంటారు అక్కినేని. ఆ తర్వాత వచ్చిన మరోతరం నటీమణులలో లక్ష్మి, శారద, జయలలిత, వాణిశ్రీ, భారతి - అనంతరం లత, జయచిత్ర, సుజాత, మంజుల, జయసుధ, జయప్రద వంటివారు అక్కినేని సరసన ఆకర్షణీయమైన పాత్రలు పోషించారు. ప్రేక్షకులకు ‘రాంగ్ మెసేజ్’ వెళ్లకూడదనేది అక్కినేని వాదం. యద్దనపూడి సులోచనారాణి నవల ‘విజేత’ ఆధారంగా ‘విచిత్ర బంధం’ తీస్తున్నప్పుడు, హీరో కథానాయిక (వాణిశ్రీ)ను ‘రేప్’ చేసే ఘట్టాన్ని ఎంతగానో వ్యతిరేకించారు. నిర్మాత దుక్కిపాటి, దర్శకుడు ఆదుర్తి - ఆయనను అతికష్టం మీద ఒప్పించారు. చిత్రీకరణ అయిన తర్వాత ‘‘ఓస్! రేప్ అంటే ఇదేనా? ఏమో అనుకుని భయపడ్డాను’’ అని వాణిశ్రీ నవ్వారు. ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా చిత్రీకరించారు ఆదుర్తి. ప్రేమ సన్నివేశాలైనా, ఏ తరహా దృశ్యాలైనా ఆలోచింపజేసేలా, ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలనేది అక్కినేని ధోరణి. అందుకనే ఏదీ ‘మోతాదు’కు మించకుండా ఉండాలని కోరుకుంటూ, ఆ మేరకు దర్శక నిర్మాతలు శ్రద్ధ వహించేలా చూసేవారు. ఆ మధ్య అక్కినేని నాయికలందరూ ఒకే వేదికపై చేరి, ఆయనను సత్కరించడం విశేషానందాన్ని కలిగించిన ఘట్టం! - బి.కె.ఈశ్వర్ -
అసలు నేను ఎన్టీఆర్ పార్టీ!
చిన్నప్పుడు, నాకు ఊహ తెలిసేసరికి రెండే రెండు పార్టీలు ఉండేవి. మీరు, కాంగ్రెస్ - కమ్యూనిస్టు పార్టీ అనుకుంటే, కాలే పప్పులో కాలేసినట్లే. ఎన్.టి.ఆర్. పార్టీ - ఎ.ఎన్.ఆర్. పార్టీలు అవి. నేను లాగుల్లో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్. పార్టీ. మా అమ్మమ్మ వాళ్లూళ్లో, డేరా టాకీస్‌లో నేలలో కూచుని సిన్మా చూస్తూ, ఎన్.టి.ఆర్. కత్తి తిప్పుతుంటే - గుర్రం తోలుతుంటే ఆయనతో పాటు నేను కూడా ఎక్కడికో వెళ్లిపోయేవాణ్ని. ఆ తర్వాత లాగుల్లోంచి ప్యాంటుల్లోకి ఎదిగినప్పుడు, నూనూగు మీసాలొచ్చినప్పుడు, అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించేసి, ఎ.ఎన్.ఆర్. పార్టీలోకి జంప్ అయిపోయాను. కారణం ఏం లేదు. పిల్ల వేషాల నుంచి ‘పిల్ల’ కోసం రొమాంటిక్ వేషాలేసే స్టేజ్‌కి, మనసు, శరీరం ప్రమోట్ అయిపోవడమే! కత్తి తిప్పుతూ, ఒక్క కాలు మీద గెంతుతూ (అది కూడా టైట్ ప్యాంట్స్‌లో) - ‘‘వగల రాణివి నీవే’’ అని పాడితే, ఆడపిల్లలు ఇంప్రెస్ అవ్వరని, స్టైల్‌గా సిల్క్ షర్ట్‌లో, పియానో ముందు కూచుని, ‘‘నా హృదయంలో నిదురించే చెలీ’’ అని అరమోడ్పు కన్నులతో పాడితే, అతివలందరూ అతి చేరువవుతారనీ - ఓ లవ్ గురు చెప్పడం వల్ల ఎ.ఎన్.ఆర్. పార్టీలో చేరిపోయా. అక్కడి నుంచీ ఎ.ఎన్.ఆర్. నన్ను వదిలిపెట్తే ఒట్టు. అసలు నన్నడిగితే, 60, 70ల్లో లవ్‌లో పడ్డ ప్రతి కుర్రాడూ తెలుగునాట ఎ.ఎన్.ఆర్. వల్లే ఇన్స్పైర్ అయి ఉంటాడని నా గట్టి నమ్మకం. నా నడకా, మాటా, నవ్వూ, చూపూ అన్నీ ఎ.ఎన్.ఆర్.లాగా ఫీల్ అయ్యేవాణ్ణి. ఒక్క రొమాన్సే కాదు, నా కెరీర్ కూడా ఎ.ఎన్.ఆర్. ప్రభావితమే. ఎన్టీఆర్ ఫ్యాన్‌గా ఉన్నప్పుడు, నేను పెద్దయినాక, గుర్రాల ట్రైనర్‌ని అవుదామనుకున్నాను. అలాంటిది, ‘ఆరాధన’, ‘డాక్టర్ చక్రవర్తి’ సిన్మాలు చూసి, అర్జెంట్‌గా డాక్టరైపోదామని డిసైడ్ అయ్యాను. ఈ రకంగా, ఎ.ఎన్.ఆర్. తన పరిచయానికి ముందే నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. 1995లో నా కుమార్తె కావ్య యాక్ట్ చేయగా, గుణ్ణం గంగరాజు డెరైక్ట్ చేసిన ‘లిటిల్ సోల్జర్స్’ వచ్చింది. ఆ చిత్రాన్ని సమర్పించిన అక్కినేని వెంకట్ ద్వారా నాకు మొదటిగా ఎ.ఎన్.ఆర్.గారితో పరిచయం అయింది. నేను రాణిగారిని వదిలేసి ఇంగ్లండ్ నుంచి వెనక్కి వచ్చి, హైదరాబాదులో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారింది. అన్నపూర్ణమ్మగారి మోకాలు ఆపరేషన్లలో నేను కూడా భాగస్వామినవడం వల్ల, మా స్నేహం అనుబంధంగా మారింది. ఇప్పుడు, అక్కినేని కుటుంబం సభ్యులందరితో నా రిలేషన్ ‘గురవారెడ్డిగారు’ నుంచి ‘గురివి’కి ఎదిగింది - ఒదిగింది. వ్యక్తిగతంగా నేను ఇన్స్పైరైన విషయాలు చెప్తాను. నాగేశ్వర్రావ్గారి డిసిప్లెయిన్ చూస్తే, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఉదయం 6 గంటలకి ఎండైనా, వానైనా వాకింగ్ చేయాల్సిందే (అదీ, అప్పుడే ఇస్త్రీ చేసినట్టు అగుపడే తెల్లని డ్రెస్‌లో). అలానే, ఎవరు డిన్నర్‌కి పిల్చినా, టంచన్‌గా వస్తారు. రాత్రి 9 గంటలకి ఇంటికి వెళ్లిపోవాల్సిందే. ఎ.ఎన్.ఆర్. గారి సమయపాలనా నిబద్ధత తెలుసుకున్న హోస్ట్‌లు అందరూ ఆయన ఒక్కరి కోసమన్నా ఆ టైమ్‌కి భోజనం ఏర్పాటు చేసి ‘అమ్మయ్య’ అనుకుంటుంటారు. రెండో విషయం - అంత పెద్ద సెలెబ్రిటీ ఫ్యామిలీలో తన పెద్దరికాన్ని ఆయన హ్యాండిల్ చేసే వైనం. అది అద్భుతం. అందరం ఊహించుకునేది - ‘పెదరాయుడు’ టైప్‌లో కుటుంబాన్నంతా వేలి మీద ఆడిస్తూ, చండశాసనుడిలా పాలిస్తూ ఉంటారని. కానీ నిజం ఏమిటంటే, మనవళ్లతో సహా అందరితో స్నేహితుడిలా ఉంటారు. అడిగితేనే సలహాలిస్తారు. ఫ్యామిలీ అంతా ఆయనకిచ్చే గౌరవం అపురూపం. సరే! వ్యక్తిత్వం, అలవాట్లు, క్రమశిక్షణ మనం ఎలాగోలా కష్టపడో, ఇష్టపడో ఏర్పరుచుకుంటాం. అంటే ఒక రకంగా ఇవన్నీ మనసుకు సంబంధించిన నియంత్రణలు. అదే రకంగా శరీరాన్ని లోనున్న ఫిజియాలజీని మనం నియంత్రించడం కష్టమైన విషయం. కానీ అదేం చిత్రమో - నాగేశ్వర్రావ్గారి బాడీ కూడా ఆయన చెప్పుచేతల్లో ఉండేది. ఇరవై ఏళ్ల కింద అమెరికాలో - ‘‘ఈయన గుండెని రిపేర్ చేయడం మావల్ల కాదు’’ అని ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు పంపేశారు. చివరి వరకు ఆయన హార్ట్ పర్ఫెక్ట్. ఆ డాక్టర్లందరూ ముక్కున వేలేసుకుని, నోట్లో కాలేసుకుని, ఎ.ఎన్.ఆర్.గారి మీద డాక్యుమెంటరీ చేస్తున్నారు - ‘లాంగెస్ట్ సర్వైవ్డ్ పేషెంట్ ఫ్రమ్ దెయిర్ ఇన్స్టిట్యూట్’ అని. ఆయన నిల్చోవడం - నడవడం ఎప్పుడన్నా చూశారా? ఓ అంగుళం కూడా వంగరు. నిటారుగా మేరు నగం లాగ. ఆయనలో సగం వయసున్నవాళ్లు కూడా వంగి, వంగిపోయి మెడ నొప్పో, నడుం నొప్పో అంటూ మూలుగుతుంటారు. అక్కినేనిగారితో పరిచయం నా అదృష్టం. నాకు ఇష్టమైన పాటల్లో మొదటిది - ‘వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా..’ ‘ఆరాధన’లో పాట. నాకిష్టమైన సిన్మాల్లో మొదటిది ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఈ రెండు సిన్మాల్లో హీరో నాగేశ్వర్రావ్గారే! నాకు కుర్ర వయసులో ఆయనే ఇన్స్పిరేషన్. నా వృద్ధాప్యంలోనూ ఆయనే. ఆ వయసులో, ఆయనలా నడవగల్గినా, నడుచుకోగలిగినా మహదానందం. (ఈ రచయిత రాష్ట్రంలోని ప్రముఖ డాక్టర్లలో ఒకరు) -
అక్కినేనికి జగన్ నివాళి
-
మహానటులిద్దరూ జనవరిలోనే...
చలన చిత్ర పరిశ్రమకు మహానటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్లలాంటివారు. దక్షిణాది సినిమా పరిశ్రమ బలపడటానికి, చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలి రావడానికి ఈ ఇద్దరు మహానటుల సేవలు వెలకట్టలేనివి. నాలుగు దశాబ్దాల కెరీర్ లో వారి మధ్య పోటీ బయటకు కనిపించినా.. అంతేకంటే ఎక్కవ స్థాయిలో వారి మధ్య మైత్రీ బంధం ఉండేదని సహనటులు మాటల సందర్భంలో వెల్లడిస్తుంటారు. వారి మధ్య ఉన్న ధృడమైన స్నేహం బయటకు కూడా అలానే కనిపించేంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో అఖిలాంధ్ర సినీ ప్రేక్షకులను ఆలరించారు. సినీ హీరోల మధ్య ఉండే సహజంగా కనిపించే విబేధాలు, అహంకారపూరిత ధోరణి ఏమాత్రం కనిపించకుండా.. దశాబ్దాల పాటు మల్టీ స్టారర్ చిత్రాల్లో కనిపించి కొత్త భాష్యం చెప్పారు. వారిద్దరి మధ్య పోటీ ఓ రకంగా చిత్ర పరిశ్రమ అభివృద్దికి కారణమైందే కాని.. రెండు వర్గాలుగా విడగొట్టడానికి ఇసుమంతైనా అవకాశం కల్పించలేదు. కొన్నిసార్లు వారిమధ్య విబేధాలు తలెత్తినా... వ్యక్తిగతంగానే వాటిని చూశారు కాని.. పరిశ్రమలో గ్రూపిజానికి అవకాశమివ్వకుండా ఇద్దరు నటులు భావితరాల నటులకు ఆదర్శంగా నిలిచారు. మహానటుల ప్రతిభ, అంకుఠిత దీక్ష, తపన కేవలం తెలుగు చలన చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. ఆ కాలంలో తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్, కన్నడంలో రాజ్ కుమార్, మలయాళంలో ప్రేమ్ నజీర్ లతో కలిసి దక్షిణాది చిత్ర పరిశ్రమ బలపడటానికి ఎనలేని కృషి చేశారు. ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఓ కుటీర పరిశ్రమ స్థాయి నుంచి భారీ పరిశ్రమ స్థాయిని కల్పించి ఎన్ టీఆర్, ఎఎన్ఆర్ లకే క్రెడిట్ దక్కుతుందనే చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇద్దరు మహానటులు వేసిన బీజమే ప్రస్తుతం ఉత్తరాది పరిశ్రమకు ధీటుగా పెంచేందుకు టాలీవుడ్ స్టామినాను పెంచేందుకు దోహదపడింది. వారు అందించిన సేవలు, చేసిన కృషి ఫలితంగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇతర పరిశ్రమలకు ధీటుగా ఎదిగింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సమానంగా ప్రస్తుత హీరోలు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఓ స్టార్ డమ్ ను కల్పించింది ఎన్ టీఆర్, ఏఎన్నార్ లని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. నాలుగు దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమాంతరం హోదాను అనుభవించిన మహానటులిద్దరూ కూడా జనవరిలోనే కన్నుమూయడం విషాదం.. యాదృచ్ఛికం. ఎన్ టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మృతి చెందారు. అంతేకాకుండా ఎన్ టీఆర్ జనవరి 18 తేదీన, ఏఎన్నార్ జనవరి 22 తేదీన తెల్లవారుజామునే తుది శ్వాస విడవడం యాదృచ్ఛికమే అయినా, వారి మధ్య స్నేహ, ఆత్మీయ బంధాలను అది ప్రతిబింబించిందని చెప్పుకోక తప్పదు. -రాజబాబు అనుముల -
'అక్కినేని లేరనేది నమ్మలేని నిజం'
హైదరాబాద్ : అక్కినేని లేరనేది నమ్మలేని నిజమని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్ అధినేత , దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన బుధవారం ఉదయం ఏఎన్నార్ భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అక్కినేనితో తన అనుబంధం విడదీయలేనిదన్నారు. ఆయనతో కలిసి తాను 14 సినిమాలు చేసానన్నారు. తామిద్దరం ఒక కంచం ....ఒకే మంచం అనేలా ఉండేవారిమని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నాటికి...నేటికీ అక్కినేని అందరికి ఆదర్శమని ఆయన అన్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మహా వృక్షం రాలిపోయిందన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రపరిశ్రమకు రెండు పిల్లర్లుగా ఉండేవారని అన్నారు. అక్కినేనితో తాను తీసిన 'ప్రేమ్ నగర్' చిత్రం తన జీవితంలో ఓ శక్తిలా మారిందన్నారు. ఆ సినిమాతో అప్పటివరకూ తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను తట్టుకున్నట్లు చెప్పారు. అక్కినేని కుటుంబంతో బంధుత్వం ఉండని... ఆయన మరణం బాధాకరమని రామానాయుడు అన్నారు. నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ అక్కినేని లేరనే వార్త జీర్ణించుకోలేనిదన్నారు. ఆయనతో కలిసి రెండు సినిమాలు చేసినట్లు తెలిపారు. -
'ఆ బాధ జీవితాంతం మిగిలిపోతుంది'
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావును చివరిసారిగా చూడలేకపోయానన్న బాధ తనకు జీవితాంతం మిగిలిపోతుందని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు. వారం రోజుల క్రితం ఆయనను చూసేందుకు వెళదామనుకున్నానని, అయితే అక్కినేని నీరసంగా ఉండటంతో వాయిదా పడిందన్నారు. ఆ తర్వాత తాను అనుకోకుండా రాజమండ్రి వెళ్లాల్సి ఉండటంతో అక్కినేనిని కలుసుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎన్నార్‌తో ఆత్మీయ అనుబంధం ఉందని, ఆయన మరణంతో తాను కుటుంబ పెద్దను పోగొట్టుకున్నంత బాధగా ఉందని మురళీ మోహన్ అన్నారు. అక్కినేని వందేళ్లు బతకాలని తాను అన్నప్పుడల్లా.... ఎన్నేళ్లు బ్రతికామన్నది కాదని... ఎంత ఆరోగ్యంగా బతికామన్నదే ముఖ్యమనేవారని... ఆ స్మృతులను మురళీమోహన్ ఈ సందర్భంగా తలుచుకున్నారు. తనకు క్యాన్సర్ సోకిందని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పిన గుండె ధైర్యం ఉన్న మనిషి అని.... అనంతరం ఆపరేషన్ చేయించుకున్నారని, మరో రెండు మూడేళ్లు ఆరోగ్యంగా ఉంటారనుకున్నానని... ఇంతలోనే ఆయనకు మరణం ముంచుకు వచ్చిందని అన్నారు. -
అక్కినేని మరణంపై జగన్ దిగ్ర్భాంతి
హైదరాబాద్ : నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరణం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అక్కినేని కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏఎన్నార్ మృతికి ప్రముఖులు సంతాపం తెలియచేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, డీకే అరుణ, తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రముఖులు.... అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. -
నాలో కేన్సర్ కణాలు ప్రవేశించాయి: అక్కినేని
హైదరాబాద్ : తన శరీరంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించినట్లు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ప్రకటించారు. అయితే భయపడాల్సిన పని లేదని, క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందే ప్రమాదం లేనందున వచ్చిన ముప్పేమి లేదన్నారు.ఆయన అన్నపూర్ణ స్టూడియోలో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడుతూ ప్రస్తుతం తనకు 90 ఏళ్లని అభిమానుల అండతో కనీసం మరో ఆరేళ్లు ఖచ్చితంగా బతుకుతానని అన్నారు. అభిమానుల ఆశీర్వాదం ఉంటే సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అక్కినేని అన్నారు. క్యాన్సర్ అంత పెద్ద జబ్బేమి కాదని ఆయన చెప్పారు. గతంలో రెండు సార్లు ప్రమాదకరమైన జబ్బులను జయించిన తాను.... ఈసారి క్యాన్సర్‌ను కూడా జయించి సెంచరీ కొట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. మనోదైర్యం, గుండె నిబ్బరంతో ఎంతటి అనారోగ్యాన్ని అయినా జయించవచ్చన్నారు. ఈ విషయాన్ని అందరికీ చాటిచెప్పేందుకు తన అనారోగ్యం గురించి బయటపెట్టినట్లు ఆయన చెప్పారు. అన్ని జబ్బులకు మనోదైర్యమే అసలు మందన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటానని అక్కినేని తెలిపారు. తన తల్లి కూడా 96ఏళ్లు జీవించినట్లు ఆయన చెప్పారు. తన 74ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నానని అక్కినేని పేర్కొన్నారు. -
దేవదాసుకు షష్ఠిపూర్తి