దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర రావు (ఏఎన్ఆర్) 100వ పుట్టినరోజు సందర్భంగా పీవీఆర్ సంస్థ ఘన నివాళి ప్రకటించింది. అక్కినేని నాగేశ్వర రావు ఫిల్మ్ ఫెస్టివల్‌ను తేదీలని బయటపెట్టింది. సెప్టెంబరు 20-22 తేదీల మధ్య ఈ సినిమా వేడుక జరగనుంది. 31 నగరాల్లో ఏఎన్నార్ 10 క్లాసిక్ సినిమాల్ని రీ రిలీజ్ చేసి సెలబ్రేట్ చేసుకోనున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)
అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ ఫెస్టివల్‌లో దేవదాసు, మాయాబజార్, భార్యా భర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడి గుండాలు, ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్, మనం తదితర సినిమాలని ప్రదర్శిస్తారు. ఇకపోతే ఏఎన్ఆర్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు వందల సినిమాలు చేశారు. చివరగా అక్కినేని కుటుంబమంతా కలిసి నటించిన 'మనం'లో ప్రధాన పాత్ర పోషించారు. ఒకప్పటి తరానికి బాగా దగ్గరైన ఏఎన్నార్ మూవీస్ మళ్లీ థియేటర్లలోకి రానుండటం విశేషం.
(ఇదీ చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)
#CelebratingANR100 with 10 classic films of the legend #AkkineniNageswaraRao Garu ✨
Immerse yourself in the timeless classic of love and sacrifice, #Devadasu, and relive the finest moments of cinema ❤️
Catch the iconic films of #ANR Garu on the big screen from September 20th… pic.twitter.com/7UXOuFRgOr— Annapurna Studios (@AnnapurnaStdios) September 15, 2024
Comments
Please login to add a commentAdd a comment